2, జూన్ 2017, శుక్రవారం

సమస్య - 2376 (బిడ్డ లిద్దఱు పుట్టిరి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"బిడ్డ లిద్దఱు పుట్టిరి పేడి వలన" 
(లేదా...) 
"బిడ్డలు పుట్టి రిద్దరట పేడికిఁ జూచి జనమ్ము మెచ్చగా"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

86 కామెంట్‌లు:

  1. చదువు సంధ్యల నొప్పారి చదువ పేడి
    వైద్య శాస్త్రము స్థాపించి వైద్య శాల
    చేయ శస్త్ర చికిత్సనో చెలువ కంత
    బిడ్డలిద్దఱు పుట్టిరి పేడి వలన.

    రిప్లయితొలగించండి
  2. నేటి వింతలు తెలుపగ సాటి ఎవరు
    నింగి నంటిన తారలు తొంగి చూడ
    మంత్ర మయమైన జగతిని మాయ గాక
    బిడ్డ లిద్దఱు పుట్టిరి పేడి వలన

    నమస్కారములు
    గురువులు + సోదరులు శ్రీ శంకరయ్య గారికి ,ఆదరాభి మానములను పంచిన సోదర సోదరీ మణులకు ధన్య వాదములు . మీ అందరి కోసము యమునితో పోరాడి [రెండురోజులు వెంటిలేటరు మీదుండి] మళ్ళీ వచ్చెసాను . కాకపోతె ఎక్కువసేపు సిస్టం ముందు కూర్చో లెకపొతున్నాను రాయాలన్న తపన mee akka

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్క గారికి నమస్కారములు నీను శంకరాభరణములో కొత్తగా అడుగు పెట్ట్టాను. బ్లాగు లొ ఈ మధ్యనే చూచాను. సర్వదా మీ ఆరోగ్యము భగవంతుడు కాపాడుగాక. మీ యొక్క ఆశీస్సులతో శంకరాభరణము మూడు సమస్యలు ఆరు పూరణములు తో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ సర్వదా మీ సలహాలు స్వీకరించుతూ పూసపాటి నాగమణి/కృష్ణ సుర్యకుమార్

      తొలగించండి
    2. అక్కయ్యా!
      ఈరోజు నిజంగానే మాకు శుభోదయం అయింది. మళ్ళీ మిమ్మల్ని బ్లాగులో చూచి చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నాను.
      కొద్దిరోజుల క్రితం చింతా రామకృష్ణారావు గారు మీకు శస్త్ర చికిత్స జరిగిన విషయాన్నీ, మీ క్షేమ సమాచారాన్ని తెలియజేశారు. వెంటనే బ్లాగులో 'శుభవార్త' అన్ని శీర్షికతో బ్లాగులో ప్రత్యేకంగా పోస్ట్ చేశాను. మిత్రులందరూ స్పందించి మీకు స్వస్థత చేకూరాలని తమ ఆకాంక్షను తెలియజేశారు.
      కాకతాళీయమో ఏమో... గతంలో అమెరికా వచ్చి మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించిన మా మిత్రుడు ఓంకార్ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ప్రొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడాడు. మీ ప్రస్తావన వచ్చింది. నేను మీ ఆరోగ్య పరిస్థితిని తెలియజేశాను. అప్పుడే మీ గురించి ఆలోచించాను. మిమ్మల్ని ఇమెయిల్ ద్వారా సంప్రదించాలంటే మీరు అసలు కంప్యూటర్ చూస్తున్నారో లేదో తెలియదు. మీ ఫోన్ నెం. పోయింది (నేను పోగొట్టుకున్న ఫోన్‍లో ఉండేది).
      అన్యమనస్కంగానే కంప్యూటర్ ఆన్ చేశాను. బ్లాగులో మీ పూరణ ప్రత్యక్షం కావడం సంభ్రమాన్నీ, ఆనందాన్నీ కలిగించింది.
      భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించుగాక!

      తొలగించండి
    3. ఆధునిక కాలపు వింత పోకడల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. మీరు కోలుకొని మళ్లీ బ్లాగ్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
      ఆయురారోగ్య ప్రాప్తిరస్తు.

      తొలగించండి
    5. +12014671558
      తాటికొండ అర్చన - న్యూజెర్సీ (మా మిత్రుడు ఓంకారు కుమార్తె)

      తొలగించండి
    6. అక్కయ్య గార్కి నమస్కారములు. మిమ్మల్ని చిరకాలానికి చూచి సంతోషముతో ఉప్పొంగి పోయాము. మీ పూరణ లో సరి క్రొత్త మెఱుఁగులు కన్పిస్తున్నాయి. మీరు సంపూర్ణారోగ్యముతో సుఖశాంతులతో నుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

      తొలగించండి
    7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    8. కలము బట్టిన యచిరమౌ కాల మందె
      హృద్యకైతల శారద హృదిని గెల్చి
      ఆదరము నొంది చెలగిన అక్కగార్కి
      కాలు నెదిరించు టన్నది కాదు వింత.

      తొలగించండి
    9. రాజేశ్వరి అక్కయ్యా..చాలా రోజులకి మీ పద్యం, మీరు బ్లాగులో కనిపించినందుకు ఎంతో సంతోషం కలిగింది..మీ ఆరోగ్యం పూర్తిగా చక్కబడి ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను...

      తొలగించండి
  3. నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారికి శతాధిక నమస్సులు. పదికాలాల పాటు చల్లగా ఉండి సరస్వతీ పూజ చేస్తూ ఉండలని ఆ మహేశుని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. "అనాదిత్వా న్నిర్గుణత్వా త్పరమాత్మాయ మవ్యయః"


    అంగ మనెడిది లేనిదె అంతరాత్మ
    మనసులోనివె మాయలు మమత లన్ని
    పుణ్య పాపములనబడు బుద్ధు లివియె
    బిడ్డ లిద్దఱు పుట్టిరి పేడి వలన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎప్పుడెప్పుడు 'బ్లాగు'లో నే సమస్య
      వచ్చునో యని కనులలో వత్తులేసి
      చూచి వెంటనే స్పందించు సుగుణఖనికి
      శ్రీ ప్రభాకర శాస్త్రికిఁ జేతు నతులు.

      తొలగించండి
    2. శాస్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. "న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం - న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా - చిదానందరూపః శివోఽహం శివోఽహమ్"

      తొలగించండి
    4. జీవిత సారాన్ని యెంత చక్కగా చెప్పారు! శాస్త్రి గారికి వందన శతములు.

      సర్వే క్షయాన్తాః నిచయాః పతనాన్తా సముచ్ఛ్రయాః.
      సంయోగా విప్రయోగాన్తా మరణాన్తం చ జీవితమ్৷৷

      తొలగించండి
  5. అంధులకు చూపు,కుంటికి నకట పరుగు,
    పామరులకును జ్ఞానప్రభావిభూతి,
    దైవకృపవల్ల కలుగు నత్యధ్భుతముగ-
    బిడ్డలిద్దరు పుట్టిరి పేడివలన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      "మూకం కరోతి వాచాలం...' శ్లోకాన్ని గుర్తుకు తెచ్చిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. గ్రుడ్డిగ పుత్రతుల్యులను కూడుట తప్పని ఫల్గుణుండు తా
    మెడ్డగ తన్వియూర్వశి తమిస్రము పట్టక శాపమిచ్చినన్
    దొడ్డగు ధన్వి కృష్ణునికి తోడుగ పోయెడు సవ్యసాచికిన్
    బిడ్డలు పుట్టి రిద్దరట పేడికిఁ జూచి జనమ్ము మెచ్చగా
    (మెడ్డుట = త్రోసివేయుట, తమిస్రము = కోపము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేమాని వారూ,
      బృహన్నల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. వనము లోన వాల్మీకి అవనిజను గని
    ఆదరించగా యాతని ఆశ్రమమున
    శుభ లగ్నాన సీతకు శోభనిడుచు
    బిడ్డ లిరువురు పుట్టిరి ,పేడి వలన
    విరటుతనయ నాట్యంబును వేగిరముగ
    నేర్చి గురువుపుత్రునితోడ నెయ్య మొందె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      విరుపుతో రామాయణ, భారతాంశాలను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. పద్యం మధ్యలో అచ్చులు రాకుండా అవసరమైన యడాగమ, నుగాగమాలను ప్రయోగించండి.
      "వనములోన వాల్మీకి యవనిజను గని
      యాదరించగా నాతని యాశ్రమమున
      శుభముహుర్తాన సీతకు..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవ సవరించుకుంటాను

      తొలగించండి
  8. రాజేశ్వరి అక్కయ్యగారూ నమస్కారములు.ఆరోగ్యము కుదుటబడి త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను.ప్రస్తుతం అమెరికాలో డల్లాస్ లో వుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  9. కార్య కారణ యుక్తులు కనగ లేము
    చేయ, చేయక, వేరుగ చేయు నటుల
    దేము లీలలవి యనగ తేజరిల్లి
    బిడ్డ లిరువురు పుట్టిరి పేడి వలన

    భగవంతుడికి కర్తు మకర్తు మన్యధా కర్తుం అనే సామర్ధ్యాలు ఉన్నాయి.కాబట్టి భగవల్లీలకి కార్య కారణ సంబంధం కనుగొనలేము.ఈభావంతో పూరణ చేశాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దేము'...? "దేవ లీలలవి..." అనవచ్చు కదా!

      తొలగించండి
    2. ధన్యవాదాలు. దేమునికి సంబంధించిన అనే భావంలో దేము లీలలు అని వాడాను.మీరు సూచించినట్లుగానే దేవలీలలు అని మార్చుతాను

      తొలగించండి
    3. ధన్యవాదాలు. దేమునికి సంబంధించిన అనే భావంలో దేము లీలలు అని వాడాను.మీరు సూచించినట్లుగానే దేవలీలలు అని మార్చుతాను

      తొలగించండి
  10. డా.పిట్టా
    పెళ్ళి యాంధ్ర తెలంగాణ, పేడి,దార
    కాపురము నెహ్రు మాటల ప్రాపు గనగ
    ఉత్తరాన మరాఠియు నుర్దు క్రింద
    బిడ్డలిద్దరు పుట్టిరి పేడి వలన
    కలిసి యున్నారు తెలగాన గాన ప్రగతి!

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    పేడి తపమాచరించగా పేర్మి శాస్త్ర
    కృత్రిమ సంతాన సాఫల్య కీలకమును
    తెచ్చి దార కిచ్చియు వాని తెగులు బాయు
    ననెను భక్తున కాహరి నయము గలుగ
    బిడ్డ లిద్దరు పుట్టిరి పేడి వలన!

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    గడ్డము వేయి నోట్లుగనె గానవు పెళ్సున (బిడ్డలు) తల్లిదండ్రినిన్
    బిడ్డలు నైదు వందలవి భేషు యనన్ననది యేమి చిత్రమో
    అడ్డము దిర్గెనే కవల లయ్యవి నాయెను యొక్కనోటుగాన్
    దొడ్డ ధనార్జనల్ జెలగ దోచరె మోది వరమ్ము చేతనే
    బడ్డలుపుట్టిరిద్దరట పేడికి జూచి జనమ్ము మెచ్చగా
    పాత్రలు:1తల్లిదం..ఆర్థిక వ్యవస్థ
    (అడ్డాలనాడే బిడ్డలు,గడ్డాల నాడు బిడ్డలా. సామెత)
    2 పేడి..ధనార్జనాపరుడు
    3.ఆర్థి.వ్య. ను కాదని ఎదిగినవి.వేయినోట్లు
    4 పేడి బిడ్డలు..2౦౦౦లనోట్లు(కవలలుగా)
    5పేడి భార్య. కరెన్సీ
    6 మోదీ వర ప్రసాదకుడైన దేవుడు
    (2వేల నకిలీ నోట్లనొత్తించడం అక్రమార్జనను నిల్వ చేయడం ముందు ఎదుర్కోవలసిన ప్రమాదమేమో)


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. "కృత్రిమంబగు సంతు గలుగల కీలకమును" అందామా?

      తొలగించండి
    2. డా.పిట్టా
      ధన్యవాదాలు
      కృత్రిమంబగు సేవకౌ కీలకమును.గణ రీత్యా చెల్లుతున్నది.త్రి వల్ల కృ గురువైనది.కృతజ్ఞతలు

      తొలగించండి
  13. పెండ్లి యైనట్టి మూడేండ్లు వీడకుండ
    బిడ్డ లిద్దఱు పుట్టిరి, పేడి వలన
    పుత్రు లేనాటి కెవరికి బుట్ట రార్య !
    వాని జన్మము వ్యర్ధము, బరువు భువికి

    రిప్లయితొలగించండి
  14. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
    మత్య యంత్రమున్ ఛేదించి మనువు నాడె

    స్వర్గమందునూర్వశిచేత శప్తు డయ్యు

    ద్రౌపదికిి మరి యాసుభద్రకుసులువుగ

    బిడ్డలిద్దరు పుట్టిరి పేడివలన.

    రిప్లయితొలగించండి
  15. యముని నోడించి వచ్చిన యక్క !నీకు
    సకల శుభములు గలిగించు శంకరుండు
    పూర్తి యారోగ్య మాయువు భువిని నిచ్చి
    కంటి కినిరెప్ప యట్లయి కాచు గాత !

    రిప్లయితొలగించండి


  16. జానకీదేవి యు ముని యాశ్రముము లోన

    ఎంత మందికి జన్మము నిచ్చె దెలుపు

    నుత్తరయు నాట్య మెటు నేర్చె నుర్వి యందు

    బిడ్డలిద్దరు పుట్టిరి,పేడి వలన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. పేడి వింత చిత్రమొకటి వేయ నందు
    మంధరకు 'పగ' , 'ప్రతివిధి' మదిన రగులు
    బిడ్డలిద్దరు పుట్టిరి పేడివలన
    రామునడవికి పంపిన ప్రముఖులగుచు

    రిప్లయితొలగించండి
  18. నా కుమార్తె శారదకు మొన్నటి దినమున
    బిడ్డ లిద్దఱు పుట్టిరి; పేడి వలన
    దీవెనల నంద శుభ మంచుఁ దెల్లవారె
    వచ్చి చేరెను తాను చపట్లు చరిచి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును గురువు గారు ఈ ఆచారము తెలంగాణలో ఉంది నేను సంగారెడ్డి లొ ఉన్నప్పుడు ఇట్టి అనుభవమే నాకూ ఎదురైనది

      తొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.

    ముద్ర వేయగ పతికి నపుంసకునిగ

    సంతుకై విచారించుచు సతియునుండ

    నాధునిక చికిత్స జరిపిన తరువాత

    బిడ్డలిద్దరు కలిగిరి పేడి వలన.

    *****************************

    రిప్లయితొలగించండి
  20. దొడ్డమనస్సుతోడ రఘు దూరపు బంధువు పేడిరూపునిన్
    బిడ్డగ దామదిన్దలచి పెద్దమనంబున జేయవైద్యమున్
    బిడ్డలుపుట్టిరిద్దరట పేడికి జూచి జనమ్ము మెచ్చగా
    లడ్డులుబంచిపెట్టిరట లైకులుగొట్టిన వారికప్పుడున్

    రిప్లయితొలగించండి
  21. ఊర్వశీ శాపమున పాండవోత్తముండు
    పేడి యైనను వరమయ్యెఁ బాడి గాను
    ద్రౌపదీ సుభద్రలకు భద్రమ్ము గాను
    బిడ్డ లిద్దఱు పుట్టిరి పేడి వలన


    అడ్డము లేక గర్వమున నచ్చపుఁ గండల విఱ్ఱ వీఁగినన్
    బిడ్డలు గల్గ లేదు విధి వింతగ నాడుట గాక యే మగున్
    గడ్డము మీసముల్ లవము గానని వానికి నంతఁ బెండ్లియై
    బిడ్డలు పుట్టి రిద్దరట పేడికిఁ జూచి జనమ్ము మెచ్చగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  22. రామకథలోన మునిచెంత రామసతికి
    బిడ్డలిద్దఱు పుట్టిరి; పేడివలన
    భీష్ముడు విడిచె చాపము బేషరతుగ
    భారతాంకమున, వినరె ప్రాజ్ఞులార!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమంత రావు గారూ,
      విరుపుతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  23. పూసపాటి నాగమణి గారి పద్యము.......

    రాజేశ్వరి అక్కగారు అస్పత్రి నుంచి డిశ్చార్జి అయి శంకరభరణములోకి అడుగు పెట్టిన శుభ సందర్భములో

    హాస్పి టలునుంచి వేంచేసె యక్క గారు,
    ఇచ్చి నారుట యొకలిస్టు ఇంటి కొచ్చు
    తరుణమున మందు మాత్రలు మర్చి పోక
    వారములు పదునాలుగు వాడ మనుచు
    అక్కా:
    వలదు మాత్రలు మందులు, కలత అసలు
    వలదు సోదరీ, మనకంది వారు యిచట
    నాడి వైద్యులు, కవిజన నాడి పట్టి
    జబ్బు ఏమిటో తేల్చును జంకులేక,
    మత్తు మందుల నిపుణులు మాన్య పోచి
    రాజు వారు, పద్యములన్ని రమ్య గతిన
    సాగి మదికి నిదురనిచ్చు సరస గతిన,
    బలము టానిక్కు మిస్సన్న పద్య శైలి,
    పద్య తేనియల్ టానిక్కు బలము నిచ్చు ,
    శాస్త్రి గారి పద్యములన్ని శ్వాస నీయ
    ఏల వెంటిలేటరు మీకు ఎంచి చూడ.
    ఫణి కుమారుని పద్యాలు పాల వోలె
    స్వస్త తనిడును సతతము శక్తి నిచ్చి,
    గుండు వారి పూరణములు గుడ్లు వోలె
    పుష్టినిచ్చి మేల్జేయును పొట్ట కెపుడు ,
    ఎన్నియో పద్య ఫలములు ఇష్టపడుచు
    బ్లాగులోన ఎదురు చూచె , బాధ తీర్చు
    కావ్య ధన్వంతురుల యండ కలుగు చుండ
    వేరు వైద్యశాల లొలదు, వేగి రముగ
    శంకరాభరణము యిచ్చు సంతసమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎక్కడిది అక్కగారికి యింక కలత
      పూస గ్రుచ్చిన రీతిగా పూసపాటి
      నాగమణి పద్యముల నల్లి నయముగాను
      వైద్య విచికిత్స దీర్చగ హృద్యముగను.

      తొలగించండి
    2. నాగమణి గారూ,
      ధన్యవాదాలు.
      కొన్ని వ్యాకరణ దోషాలున్నవి. కాని వాటిని ఇప్పుడు ప్రస్తావించను.

      తొలగించండి
  24. రక్తి లేని కాపురమున ప్రకృతి చేత
    బిడ్డ లిద్దఱు పుట్టిరి, పేడి! వలన
    గు యనుబంధమే ననుచు సాగుట నిక వల
    దంచు కోపంబున విడిచె దార పతిని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వలన।గు ననుబంధమే యనుచు..." అనండి.

      తొలగించండి
  25. మడ్డి మొగమ్ము వాడె తన మాటల చేతల నెల్ల వారికి
    న్నడ్డము వచ్చు చుండి పరి హాసము నొందునె పెండ్లి నేరడే
    చెడ్డ చికాకు నా కికను చెప్పకు నమ్మను చాలుచాలులే
    బిడ్డలు పుట్టి రిద్దరట పేడికిఁ జూచి జనమ్ము మెచ్చగా.

    రిప్లయితొలగించండి
  26. వనము నందున సీతకు ప్రసవ మవగ
    బిడ్డ లిద్దఱు పుట్టిరి ; పేడి వలన
    నస్త్ర సన్యాసమును భీష్ము డాచరించ
    పాండవులు రాజ్య మేలిరి భరత భువిని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవగ' అన్నది సాధువు కాదు. "ప్రసవమైన" అనండి.

      తొలగించండి
  27. అండగానున్న వాల్మీకి యాశ్రమమున
    పరమ పావని శ్రీరాము పత్నికిలను
    బిడ్డలిద్దరు పుట్టిరి, పేడివలన
    శాంతనవుడుసంగరమున సమసిపోయె!!!

    రిప్లయితొలగించండి
  28. పేదదైనను గుణమున పెన్నిధియని
    డిజిటలెరిగిన వాడు పెండిలిని యాడ
    బిడ్డ లిద్దఱు పుట్టిరి ''పే'' ''డి'' వలన
    గుణము గణనము లేకమై గణుతి కెక్క

    రిప్లయితొలగించండి
  29. తపన లెగయంగ నర్జునుఁ దాకనెంచ
    నూర్వశి సరస సల్లాప మొప్పకున్న
    మగఁటిమికరువౌనె? మునుపు మదవతులకు
    బిడ్డలిద్దరు పుట్టిరి పేడివలన

    రిప్లయితొలగించండి
  30. బిచ్చమెత్తుచు నుండగా పేడి , ధూమ
    శకటమున నిండుగర్భిణి యొకతె నొప్పు
    లందగ గమనించి సహాయమంద జేయ
    బిడ్డలిద్దరు కలిగిరి పేడి వలన !!

    వైద్యపరిభాష *పే* యన *పైకమంత*
    *గొనుట* , *డి* యనగ *డెలివరీ కొరకు* వ్రాయ ,
    పడతి పైకము చెల్లించి ప్రసవమంద
    బిడ్డలిద్దరు కలిగిరి *పేడి*వలన !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  31. అడ్డమైన విచిత్రముల్, చెడ్డ పనులు

    జరుగు చుండగ నిత్యమ్ము ధరణి యందు;

    బాలికల్గర్భ వతులైన కాలమందు

    బిడ్డ లిద్దరు పుట్టిరి పేడివలన.

    విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.కడప.జిల్లా 7396564549

    రిప్లయితొలగించండి
  32. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    రాణి వాసాన యున్నట్టి రాకు మారి
    తనదు ప్రియురాలు గావున తనను చేర
    నట్టి రూపున కూడగా నామె నతడు
    బిడ్డలిద్దరు కలిగిరి పేడి వలన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వాసాన నున్నట్టి" అనండి.

      తొలగించండి
  33. దొడ్డగు వానలందునను దూరపు మార్కెటు వెళ్ళజాలకే
    వడ్డన నేమిచేతునని భామిని కుందుచు దొడ్డిజేరగా
    బిడ్డలు నీరుబోయుచును పెంచిన ముద్దువి మొక్కలందునన్
    గడ్డలు భూమిలోపలను గట్టివి బంగళ దుంపలయ్యరో
    బిడ్డలు పుట్టి రిద్దరట పేడికిఁ జూచి జనమ్ము మెచ్చగా

    రిప్లయితొలగించండి