కామేశ్వర రావు గారూ, పారిశ్రామికవేత్తలకు వ్యవసాయ భూములిచ్చి ఆశ్రయం కోల్పోయిన రైతుల గురించిన మొదటి పూరణ, శతాబ్దాలుగా అన్యమతాలకు ఆశ్రయమిచ్చి స్వాతంత్ర్యాన్నీ, సంస్కృతినీ కోల్పోయిన భారతీయుల గురించిన రెండవ పూరణ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. ఈమధ్యకాలంలో మీ పూరణలలో ఇవి సర్వోత్తమాలని ఘంటాపథంగా చెప్పగలను.
ఏ శ్రేయస్సును కోరక...
రిప్లయితొలగించండిఆశ్రీమతి పుత్రువీడె నా గౌతముడు
న్నాశ్రిత కంతః పురవా
సాశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణతో శుభారంభం చేశారు. అభినందనలు!
🙏🙏🙏
తొలగించండిధైర్యే సాహసే లక్ష్మీ!
సార్! సమాసాలను కూడా వాడుచున్నాను :)
(వరదనుండి శిష్యులను కాపాడి,తానొంటరియైన గురువు)
రిప్లయితొలగించండిఆశ్రమ వాసుల నందరి
నేశ్రమ లేకుండ పడవనింపుగఁజేర్చెన్
సుశ్రీలన్ గురువొక్కడె
ఆశ్రయమునొసంగి తా నిరాశ్రయుడయ్యెన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిశ్రా నామకు డొకపరి
రిప్లయితొలగించండియశ్రువులను గార్చువాని యాంతర్యమునన్
మిశ్రిత కపటము గాంచక
యాశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన్.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిసశ్రమలన్ సత్యమునకు
ప్రశ్రయమై గాధి సుతుని బాకీకై త
త్శ్రీశ్రిత హరిశ్చ నృపతియె
ఆశ్రయము నొసంగి తా నిరాశ్రయు డయ్యెన్
డా.పిట్టా
రిప్లయితొలగించండిసశ్రమ "బాలితా"ఖిల జనాళి సురక్షణ కర్త హర్షుడే
ప్రశ్రయహీనతన్ జెలగ "పంచమ వర్ష సుదాన" బ్రక్రియన్
విశ్రమ మివ్వ సంపదల వీకగ బంచడె దీనతన్ గనన్
ఆశ్రయ మిచ్చి తా నిట నిరాశ్రయుడయ్యె నదేమి చిత్రమో!
శ్రీ హర్షుడు 5సం॥ల కొకసారి సర్వస్వ దానము చేసెడి వాడు..(భారత దేశ చరిత్ర ఆధారము)
(పాలిత..పాలించబడువారు, పాలక..పాలించు వారు అనే అర్థంలో )
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'హరిశ్చ' ప్రయోగమే సందేహం!
యేశ్రమకైనన్నోర్చుచు
రిప్లయితొలగించండిఆ శ్రీపతి యడిగినట్టిఅడుగులు మూడున్
ఆశ్రితవత్సలునికిడి బలి
యాశ్రయమునొసంగి తానిరాశ్రయుడయ్యెన్
మూడవ పాదం
తొలగించండిఆశ్రిత వత్సలుకిడిబలి
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం
తొలగించండిఆశ్రిత వత్సలుకిడిబలి
ఆశ్రిత వత్సలుండ విపు డాదుకొనందగు నన్ను నయ్యరో
రిప్లయితొలగించండిమిశ్ర! గురూత్తమా! యనుచు మిక్కిలి దీనత జేరియున్న యా
మిశ్రిత దంభు స్వాంతమున మీరిన కుత్సిత మెంచకుండగా
నాశ్రయమిచ్చి తానిట నిరాశ్రయుడయ్యె నదేమి చిత్రమో.
హ.వేం.స.నా.మూర్తి
మూర్తి గారూ,
తొలగించండిమీ వృత్త పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిఆర్యా2వ పూరణలో "పాలితాఖిల విశాల సురక్షణ"గా చదువ ప్రార్థితుడను.
డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించండివిశ్రాంతిని గొన నొక్కడు
నాశ్రమమున గల గుడార మందున నుండన్
ఆశ్రిత గుర్రము దూరగ
ఆశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన్
👏👏👏
తొలగించండిArab and Camel story...
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. చారి గారు నమస్సులు. “ఆశ్రితగుఱ్ఱము” సమాసము సాధువు కాదు. “ఆశ్రితకరభము” అనిన ఒంటె యన్న అర్థము తో బాటు సమాస దోషము తొలగునని భావిస్తాను.
తొలగించండిఆశ్రయమిచ్చెద ! వామన!
రిప్లయితొలగించండియే శ్రియములనైన నిడుదు తృప్తిన్ ! మా యా
గశ్రమ ఫలించె నని బలి
యాశ్రయమునొసంగి తా నిరాశ్రయుడయ్యెన్ !!
శ్రీ శ్రుతివాక్యగోచరుడు శ్రీపతి వామనరూపధారి తా
నాశ్రమమందు జేసెడి మహాక్రతుభూమిని కోరగా బలిన్
సాశ్రుముఖుండునై యొసగె సాంజలికమ్ము పదత్రయమ్ము , వ
ట్వాశ్రయమిచ్చి తానిట నిరాశ్రయుడయ్యెనదేమి చిత్రమో!!
మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఆశ్రవమున నున్నయతని
రిప్లయితొలగించండికా శ్రీలన్ సుత నొసంగ, నావిట్పతియే
ఆ శ్రేష్ఠుని యింట దరుమ
నాశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన్.
శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విరించి గారి పూరణ....
రిప్లయితొలగించండిమిశ్రా ములాయ మానం
దాశ్రువులను రాల్చుచు తన తనయుండనుచున్
విశ్రాంతి గోరి చక్కని
యాశ్రయము నొసంగి తానిరాశ్రయుడయ్యెన్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విశ్రాంతి విడిచి సినిమ ప రిశ్రమలోనహరహమ్ము రిక్థముగొని తా నాశ్రితులకు ధృతి నాగయ యాశ్రయము నొసంగి తానిరాశ్రయుడయ్యెన్ రిక్థము:ధనము Asnreddy
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిచిత్తూరు నాగయ్య గారిని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిశ్రా యనునొక సాధువు
రిప్లయితొలగించండివి శ్రాంతికి వచ్చినట్టి విద్యార్థులకు
న్నేశ్రమ లేకుండగ దను
నా శ్రయ మునొసంగి తా నిరాశ్రయు డ య్యెన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ శ్రమజీవి కృషీవలు
రిప్లయితొలగించండిడశ్రమమున లబ్ధమగు ధనాశ బృహత్పా
రిశ్రామిక వేత్తలకు
న్నాశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన్
ఆశ్రిత వత్సలత్వమున నార్యులు భారత చక్రవర్తులే
మిశ్రమ దృష్టి వచ్చిరిట మ్లేచ్ఛులు వర్తక భావ మెంచుచున్
విశ్రమ మెల్ల చూఱగొని వింతగ నేలిరి భారతమ్మునే
యాశ్రయమిచ్చి తానిట నిరాశ్రయుడయ్యె నదేమి చిత్రమో!!!
కామేశ్వర రావు గారూ,
తొలగించండిపారిశ్రామికవేత్తలకు వ్యవసాయ భూములిచ్చి ఆశ్రయం కోల్పోయిన రైతుల గురించిన మొదటి పూరణ, శతాబ్దాలుగా అన్యమతాలకు ఆశ్రయమిచ్చి స్వాతంత్ర్యాన్నీ, సంస్కృతినీ కోల్పోయిన భారతీయుల గురించిన రెండవ పూరణ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. ఈమధ్యకాలంలో మీ పూరణలలో ఇవి సర్వోత్తమాలని ఘంటాపథంగా చెప్పగలను.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. ధన్యోస్మి.
తొలగించండినా శ్రమ నేమని జెప్పెద!
రిప్లయితొలగించండినా శ్రీమతి తల్లి గారు నాగృహ మందున్
విశ్రామము జేయ; పొగకు:
"ఆశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన్"
...పొగ = గిరీశం బ్రాండ్ చుట్ట
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆశ్రయ మందగోరి రమ యాదు కొనంగను వేడగా రఘు
రిప్లయితొలగించండిన్నా శ్రయ మిచ్చి తానిట నిరాశ్రయు డయ్యె నదేమి చిత్రమో
యాశ్రమ వాసు లెవ్వరును నాదర మీయక వెళ్లగొట్టగా
నాశ్రయ మన్నదే యికను నారయ లేకను సాగిపోయెనే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆశ్రితవత్సలు డగువా
రిప్లయితొలగించండిడాశ్రయ మిడె నుగ్రవాది యని గనక నిశి
న్నాశ్రితుడు పిదప తరుమగ
నాశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆశ్రి విలువ గల గీమును
రిప్లయితొలగించండిఆశ్రవుడని తలచి మామ అల్లుని కీయన్,
ఆశ్రవము నొసగె మామకు,
ఆశ్రయము నొసగి తానిరాశ్రయుడయ్యెన్
నాగమణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిశ్రమలాభమునెంచియు
రిప్లయితొలగించండినాశ్రితునకు రాష్ట్ర మొసఁగ నడియాశౌచు
న్నాశ్రితు డొక్కఁడె గెలువఁగ
నాశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన్
( కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా ఆశ్రయం,
రాహుల్ కు ప్రధాని పదవి దక్కక నిరాశ్రయం)
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆశ్రీపతి లీల దెలిసి
రిప్లయితొలగించండియేశ్రమనొందక నడిగిన దిచ్చ్చెను బలియే
శుశ్రూషలిడి వటువుకు
న్నాశ్రయము నొసంగి తానిరాశ్రయుడయ్యెన్
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆశ్రితుడగుశిష్యుడు తా
రిప్లయితొలగించండిశుశ్రూష లొనర్చి గురుని సొత్తుహరించెన్
విశ్రుతమౌ కథ నెరుగరె
ఆశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన్
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఆశ్రయమె లేని యనదకు
నాశ్రమము నొసంగి తా నిరాశ్రయు డయ్యెన్;
యాశ్రితు డెదిగిన పిమ్మట
నాశ్రమము సృజించినిచ్చె నతనికి పేర్మిన్
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిశ్రమ లాభమెంచియు సమీపపు టెన్నిక మేలుఁగూర్చగ
రిప్లయితొలగించండిన్నాశ్రిత పక్షపాతమున నాశల దీర్చఁగ రాష్ట్రమీయగ
న్నాశ్రితు డొక్కఁడే గెలిచి హస్తము వీడఁగ ముఖ్యమంత్రి గా
నాశ్రయమిచ్చి తానిట నిరాశ్రయుడయ్యె నదేమి చిత్రమో!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విరించి గారి పూరణ....
రిప్లయితొలగించండివిశ్రుతుడైన దాత గను విశ్వజనీయుని చెంత జేరె సా
హస్రుడు విష్ణుమూర్తి యిల నర్థిగ వామన రూప మందున
న్నా శ్రిత వత్సలుండు బలి యాతని బ్రేమగ నాదరించుచు
న్నా శ్రయ మిచ్చి తా నిట నిరాశ్రయు డయ్యె నదేమి చిత్రమో
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ-స (శకార ప్రాస) లాక్షణికులు చెప్పినా సాధ్యమైనంతవరకు పాటించక పోవడమే ఉత్తమం.
గురువు గారికి నమస్కారము రెండవ పాదములో హస్రుడు అన్న దాంట్లో ప్రాస ఆమోద యోగ్యమేనా
రిప్లయితొలగించండినాకు సలహా ఇవ్వగలరు.
శకార ప్రాస (శ-స) లాక్షణికులు చెప్పారు. కాని ప్రయోగించక పోవడమే మంచిది.
తొలగించండి9493846984 డా.బల్లూరి ఉమాదేవి .
రిప్లయితొలగించండిఏ శ్రమయునురా నీయక
నాశ్రయమొసగుచు సతతము నర్థుల కెల్లన్
నాశ్రీలెల్లయు తరగన్
నాశ్రయమొసంగి తాను నిరాశ్రయుడయ్యెన్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.