10, జూన్ 2017, శనివారం

సమస్య – 2381 (తాటకఁ గని రాఘవుండు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తాటకఁ గని రాఘవుండు తన్మయ మొందెన్"
(లేదా...)
"తాటకఁ జూచి రాఘవుఁడు తన్మయ మొందెను మౌని మెచ్చఁగన్"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

58 కామెంట్‌లు:

 1. చేటునుగూర్చె రావణుడు సీతనుగైకొని దొంగచాటుగా
  తాటక రావణున్ గలసి తప్పకచెప్పును నన్ను గూర్చి,తో.
  డ్నాటుగ వచ్చెనీ సుదతి పాటుగ సాయమొనర్పనంచు,నా.
  తాటకఁజూచి రాఘవుడు తన్మయమొందెను మౌనిమెచ్చగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   కొంత అన్వయ దోషం కనిపిస్తున్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. తోడ్పాటు... టైపాటు వల్ల తోడ్నాటు అయింది.

   తొలగించండి
 2. "ఘాటైన శాపవశమున
  తాటక బహురూపసి తన తత్వము మార్చెన్"...
  మాట విని ముక్తి నిడుటకు
  తాటకఁ గని రాఘవుండు తన్మయ మొందెన్

  రిప్లయితొలగించండి
 3. బోటులఁ జంపు టెట్లని తపోధను నెప్పుడు రాముఁ డేసె దు
  ర్గాటవిలోనఁ బ్రశ్న? వసుధాత్మజఁ గాంచిన వెవ్వఁ డేమయెన్?
  వాటముగాను దాశరథి భర్గుని చాపము నెట్లు ద్రుంచెనో?
  తాటకఁ జూచి; రాఘవుఁడు తన్మయ మొందెను; మౌని మెచ్చఁగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ క్రమాలంకార సహిత పూరణ మనోహరము. “వసుధాత్మజఁ గాంచిన దెవ్వఁ డేమయెన్” అని మీ యుద్దేశ్యమనుకుంటాను. వెవ్వఁ డని పడినది.

   “అయెన్” ప్రయోగము పరిశీలనార్హము. అయ్యెన్ / ఆయెన్ లు సాధువు లనుకుంటాను.

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   ధన్యవాదాలు.
   నిజమే. 'అయెన్' ప్రయోగం సాధువు కాదు. గతంలో ఒకసారి మన బ్లాగులో నేమాని వారి మార్గదర్శకంలో కొంత చర్చ జరిగింది కూడా!

   తొలగించండి
 4. వాటముగ వేసెభాణము
  తాటకఁగని రాఘవుండు, తన్మయమొందెన్
  కాటుక కన్నుల జానకి
  మీటగ తన హృదయవీణ మిథిలానగరిన్!!!

  రిప్లయితొలగించండి
 5. డా ఎన్.వి.ఎన్.చారి 9866610429
  ధాటిగ బాణముల్ విడిచె ధక్షత తోడ వ ధించ నెంచుచున్
  తాటక జూచి ;రాఘవుడు తన్మయ మొందెను, మౌని మెచ్చగన్
  వ్రేటిడి రాక్షసాదులను వేగమె యాగపు రక్ష చేసి తా
  ధీటుగ విల్లునే విఱిచి ధీరుడు సీతను పెండ్లి యాడగా

  రిప్లయితొలగించండి
 6. నాటెను భాణము రయమున
  తాటకఁగని రాఘవుండు, తన్మయమొందెన్
  ధాటిగ శివువిలు విఱచిన
  పోటరి శ్రీరాముఁ గాంచి భూజ, కొలువులో

  రిప్లయితొలగించండి
 7. చేటొనరించఁగ క్రతువుకు
  సూటిగ బాణమ్ము వేయ సోలుచు తనకున్
  పాటిగ మ్రొక్కుచు దనరెడు
  తాటకఁ గని రాఘవుండు తన్మయ మొందెన్

  రిప్లయితొలగించండి
 8. దీటైన యస్త్రవిద్యా
  పాటవమును మునికి జూపు భాగ్యము దక్కెన్
  నేటికని వని సుబాహుని ,
  తాటకఁ , గని రాఘవుండు తన్మయమందెన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 9. మీటగ హృదయవిపంచిని
  చాటుగ నిలబడి ధరణిజ సరసములాటన్
  తేటగ పిలిచెను నను బం
  తాటక? గని రాఘవుండు తన్మయమొందెన్

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా
  హాటక ముఖి పాటవపుం
  ధాటికి సరి బొబ్బరింత ధనువున గురి, మో
  మాటము నారిని జంపగ,
  తాటక గని రాఘవుండు తన్మయుడయ్యెన్

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా
  పాటుకు నింతులోర్చు బహు పాటవమున్నను స్త్రీ వధాళి వే
  ర్పాటగు యుద్ధనీతికిని బాహు బలంబొక వింతయౌ గగు
  ర్పాటును దోప సందియముపాయ విహీనుని జేయ నప్పుడా
  తాటక జూచి రాఘవుడు తన్మయమందెను ,మౌని మెచ్చగన్!6

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. సూటిగ నాడుది పాపియె
   పాటియగును చంపుమనుచు పలుకగ మునియున్
   కాటికి నంపగ నామెను
   తాటక గని రాఘవుండు తన్మయ మొందెన్

   తొలగించండి
  3. మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. తాటక రాక్షసాధముల తాటను దీసిసుమందహాసమున్
  వేటనుపూర్తిజేసి,శివు విల్లును ద్రుంచుచు నారిమీటగా
  ధాటిగ మోగెనో విజయధ్వానము జుంటకటాకటాక జుం
  తా,టక, జూచి రాఘవుడు తన్మయమొందెనుమౌని మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 14. వేటుగ చంపెను వనమున
  తాటకి గని రాఘవుండు. తన్మయ మొందెన్
  వాటిక లోని మునిజనులు
  నేటికి పీడలు తొలంగె నిజముగ యనుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "నిజముగ ననుచున్" అనండి.

   తొలగించండి
 15. మేటి రఘురాముడనుచును
  చాటెడు నవకాశమునిడు చానను గూల్చన్
  వేటిడు వేళను నొకపరి
  తాటకి గని రాఘవుండు తన్మయమొందెన్

  రిప్లయితొలగించండి
 16. పాటవమున ననుజుని తో
  మేటి ముని వరు వెనుక పుడమి విభుండు సనన్
  హాటక పత్రయుగ విలసి
  తాటకఁ గని రాఘవుండు తన్మయ మొందెన్

  [విలసిత+ఆటక = విలసితాటక; ఆటకము = పిచ్చుక]


  బోటినిఁ జంపఁ దా వెరసెఁ బూర్ణ శశాంక నిభాననుండు ముం
  బాటుల నిచ్చు నిప్పడతి పాపము లేదన నుత్సహించె ఘో
  రాటవి జీవరాశి,సుమహాసుర కాంతను వేగ చంప న
  త్తాటకఁ జూచి రాఘవుఁడు, తన్మయ మొందెను మౌని మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా (ముఖ్యంగా మొదటిది విలక్షణమైన విరుపుతో) అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 17. దాటుచు కొండలన్ నదులు తాపసి వెంట చరించి విద్యలన్
  ధాటిగ నేర్చి , నైపుణి ప్రదర్శనఁజేయుటకై సుబాహునిన్
  తాటకఁ జూచి రాఘవుఁడు తన్మయ మందెను , మౌని మెచ్చఁగన్
  వాటినిఁజూపనెంచె , భగవంతుడునైనను శిష్యుడే కదా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 18. చేటొనరించు రక్కసులఁ జీలుచ యాగపు రక్షణార్థమై
  వాటిక జేరి లక్ష్యమున వైచిన బాణము నేలఁగూల్చగన్
  నాటిన రామబాణమున జ్ఞానము మేల్కొని సోలి మ్రొక్కెడున్
  తాటకఁ జూచి రాఘవుఁడు తన్మయ మొందెను మౌని మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి

 19. వేటున గూల్చెను నభమున
  తాటకిగని రాఘవుండు; తన్మయమొందెన్
  సాటెరుగని శౌర్యమునకు
  పోటెత్తిన సంబరమున భూసుర తతులే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సాటి+ఎరుగని' అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ "సాటి గనని శౌర్యమునకు" అనండి.

   తొలగించండి
 20. చేటొన గూర్చగ తనదగు
  పాటవమును జూప వచ్చి బాసె ముకుచెవుల్
  బూటక రూపసి వంచకి
  తాటకఁ గని రాఘవుండు తన్మయ మొందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. కాని తాటకను శూర్పణఖగా భావించి పూరించారు.

   తొలగించండి
 21. సూటిగఁ ద్రుంచకౌశికుడు సూచనఁ జేసెను కాంచియెవ్వరిన్?
  ధాటిగ జన్నరక్షణ కృతమ్మున, నెంచగ మౌనులేమయెన్?
  కూటమునందుఁ ద్రుంచె హరి గోపతి విల్లునె వండుమెచ్చగన్?
  తాటకఁ జూచి రాఘవుఁడు తన్మయ మొందెను; మౌని మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారూ,
   క్రమాలంకారంలో పూరించడం బాగుంది. అభినందనలు.
   'అయెన్' అన్న క్రియాపదం దోషమని ఈరోజే కామేశ్వర రావు గారు గుర్తు చేశారు.

   తొలగించండి
 22. క్రొవ్విడి వెంకట రాజారావు:
  గురువుగారూ! నమస్కారములు. నేనున్నూ వేరే పనులలో ఉన్నందువలన గత నాలుగు రోజులుగా సమస్యాపూరణలు పంపకుంటిని. ఇప్పుడు పంపుతున్నాను. దయతో పరిశీలించ గలరు.
  07-06-2017: దత్తపది:
  తే.గీ. కౌరవులను పోకారుచు పోరుజేయు
  పాండవుల వా చిరంతన ప్రతిన లన్ని
  సెల్లుచుండె యీ రణమందు చెప్పగాను
  ద్రౌపది వధూటి! విజయివి ధన్యశీల!
  08-06-2017:
  ఎన్నికల వేళ జనతను నిలువరించి
  చేయ బల్కిన వన్నియు సిధ్ధ బఱచి
  చతురుడౌచు కొలువుసేయు హితుడగు యవి
  నీతి రహితుడె జనులకు నేత యగును
  09-06-2017:
  స్పష్టమగు వాక్కు కొఱయై
  కష్టముగా పదము లనుచు కళవళ పడు నా
  భ్రష్టుడు పృచ్ఛకుడగు వడి
  అష్టవధానికి సమస్యలతి కష్టదముల్
  10-06-2017:
  నాటెను భీకర శరములు
  తాటక గని రాఘవుండు; తన్మయ మొందెన్
  కాటిక నందలి తపసులు
  వాటుగ దప మాచరించ వచ్చుగ ననుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి

 23. బాటను విస్మితుడయ్యెను
  తాటకగని రాఘవుండు,తన్మయమొందెన్
  దాటుచు నదముల సొబగును
  మేటియటంచును తలచుచు మేధిని యందున్.

  రిప్లయితొలగించండి
 24. *గురజాడ ఫౌౌంండేషన్ USAవారి రాష్ట్రమరియు జాతీయ విశిష్టసాహితీసేవా పురస్కార గ్రహీత సహస్ర కవిరత్న సహస్ర కవిభూషణ*

  *శ్రీమతి జి సంందిత బెంగుళూరు*

  *10, జూన్ 2017, శనివారం*

  *సమస్యా పూరణము*  ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

  *"తాటకఁ గని రాఘవుండు తన్మయ మొందెన్"*

  (లేదా...)

  *"తాటకఁ జూచి రాఘవుఁడు తన్మయ మొందెను మౌని మెచ్చఁగన్"*

  *పాటవమందఁకౌశికుడుభద్రబలాతిలాతిబలాదివిద్యలన్*
  *దీటుగనేర్పియట్లు గురుదేవునిస్థానమునందునిల్చుటన్*
  *చేటులబాన్పియాగురునిశిష్యుఋణంబదిదీరఁజంపి యా*
  *"తాటకఁ జూచి రాఘవుఁడు తన్మయ మొందెను మౌని మెచ్చఁగన్"*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  🙏🌹🙏

  రిప్లయితొలగించండి
 25. దీటుగ కూల్చెను రాముడు
  తాటకను తపస్వియాన తల దాల్చి గదా
  బూటకపు మాట లేటికి?
  "తాటకఁ గని రాఘవుండు తన్మయ మొందెన్"*

  రిప్లయితొలగించండి

 26. పిన్నక నాగేశ్వరరావు.

  నాటెను హృదిలో శరములు

  తాటక గని రాఘవుండు; తన్మయ
  మొందెన్
  వాటిక యందలి మునులు

  న్నాటంకము తొలగిపోవ యజ్ఞమ్ము
  లకున్.
  *****************************

  రిప్లయితొలగించండి
 27. సూటిగగని బాణమ్మున
  వేటును మునిసత్తముండు వేయుమనంగా
  ధాటిగ గొట్టగ చచ్చిన
  తాటకఁ గని, రాఘవుండు తన్మయ మొందెన్.

  రిప్లయితొలగించండి
 28. దీటుగ రామగాథనటు దీవెన లీయగ యెడ్డియూర్పయే
  నాటక మాడుచుండగను నంజనగూడున తోటలోనహా
  నీటుగ దున్మితిన్ననుచు నివ్వెర వోవుచు నేలగూలినా
  తాటకఁ జూచి రాఘవుఁడు తన్మయ మొందెను మౌని మెచ్చఁగన్!

  రిప్లయితొలగించండి