14, జూన్ 2017, బుధవారం

న్యస్తాక్షరి - 43 (శ్రీ-సి-నా-రె)

అంశము- సి. నారాయణ రెడ్డి.
ఛందస్సు- ఆటవెలది
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "శ్రీ - సి - నా - రె" ఉండాలి.

68 కామెంట్‌లు:

  1. శ్రీక రముగ రచన జేసిగగన మంత
    సినిమ సీమ నేలి సిద్ధు డయ్యె
    నాక మందు జేరి నవకవ నములల్లి
    రెయి బవలు సలుపు రెచ్చి పోయి

    రిప్లయితొలగించండి
  2. *శ్రీ*లు చిందు రూపు,చిక్కని కైతలు,
    *సి*తమహోన్నతంపు జీవితంబు,
    *నా*కలోకమేగెనా తెల్గు కవనంబు.
    *రె*మ్మ వేయు కవిత రీతులచట.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ సరస్వతి నిను చేరదీయ నొడిని
    సిద్ధి పొంది తీవు బుద్ధులబ్బి
    నారు పోయ నామె నాటు కొనెను మొక్క !
    రెమ్మ రెమ్మకు విర జిమ్మె కవిత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర ప్రసాద్ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  4. శ్రీదుడతడు తెలుగు చిత్ర కవులలోన ,
    సిరులు కురియు నతని చిత్ర గీతి,
    నాక మునకు వెడలె నయనములు అలసి
    రెప్ప మూత బడగ రివ్వు మనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నయనములు+అలసి' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. అక్కడ "నయనయుగ్మ మలసి" అనండి.

      తొలగించండి
  5. [6/14, 5:25 AM] ‪+91 75698 22984‬: *14, జూన్ 2017, బుధవారం*

    *న్యస్తాక్షరి*

    *అంశము- సి. నారాయణ రెడ్డి*

    *ఛందస్సు- ఆటవెలది*

    *నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "శ్రీ - సి - నా - రె" ఉండాలి*
    [6/14, 5:28 AM] DrNVNChary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    శ్రీ సరస్వతులతొ సిద్ధుడాయెనతడు
    సినిమా నుదిటిన తనరు బొట్టు
    నాడు నేడు రేపు "నవ"సాహితికిని దా
    రెటనడుగ సినారె రేడె సుమ్మి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సరస్వతులతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "శ్రీ సరస్వతులను" అనండి (తృతీయార్థంలో ద్వితీయ). రెండవ పాదంలో గణదోషం. "సినిమ నుదుటిపైన" అనండి.

      తొలగించండి
  6. శ్రీ హృదయమునందు స్థిర నివాసమునుండ
    సింగిరెడ్డి కుల ప్రసిద్ధుఁడగుచు
    నాడు, నేడు, రేపు నలుగురు మెచ్చెడు
    రెప్ప లేని కైత కప్పడాయె!

    రిప్లయితొలగించండి
  7. 💦శ్రీ సి నా రె గారికి బాష్పాంజలి..

    శ్రీ పదార్చనమ్ము చిత్రగీతాది సం..
    సిక్త జలజ పంక్తి చేసి చేసి
    నారుపోసి పెంచి నవ కవన వనమ్ము
    రెంట గెలిచి నిలిచె రిక్క వోలె !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  8. సీ.
    (శ్రీ)మంతమై యొప్పు జీవనంబున నిత్య
    హర్షంబులను బంచి యనుపమముగ
    (సి)రులు గూర్చుచు నుండి శ్రేయంబు లందించు
    సాహితీ స్రష్టయై సంతతంబు
    (నా)నావిధంబులౌ నవ్యమార్గము లందు
    కృతులతో సత్కీర్తి కేతనంబు
    (రె)పరెప లాడించె నుపమింప లేనట్టు
    లఖిలాంధ్ర జనముల కగ్రగు డన
    ఆ.వె.
    (శ్రీ)యుతుండు జ్ఞాన శిఖరాన వెలుగొందు
    (సిం)గిరెడ్డి వంశ శేఖరు డయి
    (నా)కమందు నున్న నారాయణాఖ్యుడౌ
    (రె)డ్డి కంజలింతు సడ్డతోడ.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.

      తొలగించండి
  9. డా.పిట్టా
    శ్రీ, విభవ,రాజకీయ సుశ్రేయమలర
    సిద్ధుడై కవీశ్వరవర శ్రేణి మెరసె
    నాద బిందు,కళా పూర్ణ నవకవితను
    రేయి బవలు తెలుగు వెలుగు రేడితండె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది.మూడు మరియు నాలుగు పాదములలను సవరించగలరు.

      తొలగించండి
    2. మీ పద్యం బాగుంది.మూడు మరియు నాలుగు పాదములలను సవరించగలరు.

      తొలగించండి
    3. డా. పిట్టా వారూ,
      మీ పద్యం బాగుంది. కాని ఆటవెలది వ్రాయమంతే తేటగీతి వ్రాశారు.

      తొలగించండి

  10. శ్రీకరంబు తెనుగు సీమయందుననీవు
    సిన్నపెద్ద చేత జేలుగెలిచి
    నాణ్యమైన కవిత నాజూకు పాటలు
    రెచ్చిపోగ నరులు మెచ్చసురలు!

    రిప్లయితొలగించండి
  11. శ్రీ సినారె పాట చెలగ తేనెల యూట
    సిరుల చద్ది మూట చేని పంట
    నాగరికుల ఇంట నవకంపు పూవంట
    రెప్ప చాటు కలల రిక్క జంట
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  12. శ్రీపతి తనయు ప్రియపత్ని చిరునగవున
    సింగిరెడ్డి నారాయణ చెంతఁజేరి
    నాల్కపై నిల్చి నిత్యము పల్కుచుండ
    రెచ్చిపోవుచు లిఖియించె ప్రీతితోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడ్డి గారూ,
      పద్యం బాగుంది. కాని ఆటవెలది వ్రాయమంటే తేటగీతి వ్రాశారు.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. నాఆటవెలది పద్యం
      శ్రీపతిసుతునిసతి చిరునగవులతోడ
      సింగిరెడ్డి వారి చెంతచేరి
      నాల్కపైన నిలచి నాట్యమాడుచునుండ
      రెచ్చిపోయి వ్రాసె ప్రీతితోడ

      తొలగించండి
    4. డాపిట్టా
      ఆర్యులారా,
      3.నాదకళ, బాట,గేయాల నవకవితను
      4రేబవల్తెల్గు వెల్గుల రేడతండు!......గా సవరించుకున్నాడు.కృతజ్ఞతలు.ఇదే ఆదరణనాకాంక్షిస్తున్నాడు.

      తొలగించండి
  13. శ్రీమదాంధ్ర వాఙ్మ యామర ధామ భా
    సిత కవి వర నివహ నుతుఁడు తృప్తి
    నా బుధుండు రెడ్డి యమరు డయ్యెను గన
    రె విజయమ్ము వడయ దివినిఁ గూడ

    రిప్లయితొలగించండి
  14. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*


    *14, జూన్ 2017, బుధవారం*

    *న్యస్తాక్షరి*

    *అంశము- సి. నారాయణ రెడ్డి*

    *ఛందస్సు- ఆటవెలది*

    *నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "శ్రీ - సి - నా - రె" ఉండాలి*

    *శ్రీపదాబ్జభృంగరూపు డయ్యె సి నా రె*
    *సిక్త ధీమరంద శిరసుడయ్యె*
    *నాభిజావిరించి జ్ఞానభాండుండయ్యె*
    *రెడ్డివంశసాగరేంద్రుడయ్యె*






    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  15. పద్యము:
    "శ్రీ'కరమగు తెనుగు సీమలో బుట్టి,భా
    "సి"ల్లితీవు,చిత్రసీమ కవిగ
    "నా"ణ్య "జ్ఞానపీఠ" గణ్య పట్టము నంది
    "రె"యివెలుగువు కయిల రిక్కలందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నాణ్య జ్ఞాన' అన్నపుడు ణ్య గురువై గణదోషం.

      తొలగించండి
  16. శ్రీయు వాక్సతి నిరత మాశీశ్శులిడ, ప్ర
    సిద్ధులై నిల్చి రాంధ్రలో " సింగిశెట్టి ";
    నా "సుభాషితమాల" తా నరసి, మురిసి
    రెన్నొ సూక్తులు రచనలో నున్న వనిరి

    శ్రీనివాసుడు గీతను చెప్ప,క్రీడి
    సిద్ధమయెకద పోరుకు సింగ మటుల;
    నాదు "గీత సూక్తుల" కభినందనమును
    రెప్పపాటున పంపించిరేను మురియ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. కాని ఆటవెలదికి బదులు తేటగీతులు వ్రాశారు.

      తొలగించండి
  17. శ్రీ కరముగ తాను చిఱుత ప్రాయమునందె
    ....కవితలెన్నియొ వ్రాయు ఘనుడితండు
    సి రిని వాణిని గొల్చి చిత్రరంగమునందు
    ......వేల పాటలనల్లు విజ్ఞుడితడు
    నా రాయణాఖ్యుండు నయముగా నిలజ్ఞాన
    .....పీఠమునెక్కిన మేటి యితడు
    రెప్పగా తానుండి గొప్పగా తెలుగును
    .......వెలిగింప జేసిన విబుధుడితడు


    శ్రీ సినారె! కవికి చేమోడ్పు లర్పింతు
    సింగి రెడ్డి వంశ శిక్షకునకు
    నా డికముగ నదివొ నారాయణునిగన
    రె! యమరుడయెనుగ భురిక్కునందు!!!


    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శ్రీకరునిగా కవనమందు చిమ్మిరేగి
    సితకరంబగు భావాల శిల్పి యౌచు
    నాకమును మించు ప్రాజ్ఞతో వీక నొంది
    రెచ్చిన సి నా రె కై జోత లిచ్చు చుంటి



    రిప్లయితొలగించండి
  19. శ్రీశాల(సిరిసిల్ల) తాలూక సిరులొల్కు హనుమాజి
    పేటయూరినతేనె తేటయేమొ,
    సిరివల్లభునిపైన శివపార్వతుల పైన
    హరికథల్ వినివినిపెరిగెనేమొ,
    నాటిసారస్వత తోటపూసినపూల పరిమళమ్ములునొంటబట్టెనేమొ,
    రెక్కలేచుక్కలైరేరాజుముక్కయై
    అవనిపైదిగిన విహంగమేమొ,

    శ్రీలుపొంగు కవన చిత్రాలు శిల్పాలు
    సింగిరెడ్డి పెక్కు చెక్కినాడు,
    నాణ్యమైన నారు నాటువేసినవాడు
    రెడ్డి తెలుగు జాతి దొడ్డ బిడ్డ....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీతాంబర్ గారూ,
      మీ దొడ్డ కవిత అత్యద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  20. శ్రీని గొలిచి కావ్య జీవమై వెలుగొందె
    సిగను తురిమె కవిత సొగసులద్ది
    నాడు నేడు రేపు వాడిపోవని పూ సి
    రి గద, విశ్వగీతి రీతు లలర!

    శ్రీ=సరస్వతి

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువుగారు! ఇప్పుడే చూసాను. పొరపాటైంది. పద్యాన్ని గమనించలేదు. ఇప్పుడు ఆటవెలదిలో వ్రాసి పంపుతున్నాను. దయతో పరిశీలించగలరు.

    శ్రీబుధుండతండు చెలరేగె కవనాన
    సితకరమగు భావ శిల్పమెంచి
    నాకమొందు నెఱిని నలుపున నడయాడి
    రెచ్చినాసినారె నచ్ఛు డౌను

    రిప్లయితొలగించండి
  22. శ్రీసినారె మాట సింగరించిన పాట
    సిత్రసీమ కంఠ జిలుగురవ్వ
    నాడునేడునదియె నాల్కపై నడయాడు
    రెమ్మపైనివూగు గుమ్మపికము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      బాగుంది మీ పూరణ. కాని 'సింగరించు, కంఠ జిలుగు'?

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారము!
      సింగారించిన పాట
      చిత్రసీమ కంఠములో వెలుగులు వెదజల్లే రవ్వల హారమని భావన!
      భావము ప్రస్ఫుటము కాలేదనుకుంటాను!

      తొలగించండి
    3. 'సింగరించు' అన్న శబ్దం లేదు. 'కంఠ జిలుగు' దుష్టసమాసం.

      తొలగించండి
  23. శ్రీల హేల కురిపె చిత్రజగత్తులో
    సింగిరెడ్డి జలధి శీతకరుడు
    నాకమందు జూప నవ్యసాహిత్యమున్
    రెప్పపాటు లేని రీతి జేరె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మొదటి పూరణను తొలగించారు. నా దృష్టికి రాని లోపమేమైనా ఉన్నదా?

      తొలగించండి
    2. గురువుగారూ లోపంలేదుకానీ భావాన్ని కొంచెంమెరుగుపరచేను.అంతే.

      తొలగించండి
  24. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
    శ్రీ యొసంగినట్టి చిత్తము తోడ వా
    సియగు పాటలన్ని సీమలోన
    నాల్గు దిక్కులందు వెల్గుచుండగని వా
    రెవ యనని జనులిల నెవరు గలరు.

    శ్రీయనుగ్రహమున చేసెప్రయోగాలు
    సినిమపాటలెన్నొ శీఘ్రముగను
    నాడె వ్రాసితీవు నగుచు నారాయణ
    రెడ్డి,చదివి రెల్ల సడ్డ తోడ.
    (సడ్డ=ఆసక్తి,కాంక్ష)

    రిప్లయితొలగించండి

  25. పిన్నక నాగేశ్వరరావు.

    శ్రీలు కురియు తెలుగు సీమలో
    జనియించె
    సినిమ గీతములను చెలగి వ్రాసె

    నాణ్యమగు రచనల నందజేసి మనకు

    రెప్పపాటు లోనె రిక్క యయ్యె.

    *****************************

    రిప్లయితొలగించండి
  26. *14, జూన్ 2017, బుధవారం*

    *న్యస్తాక్షరి*

    *అంశము- సి. నారాయణ రెడ్డి*

    *ఛందస్సు- ఆటవెలది*

    *నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "శ్రీ - సి - నా - రె" ఉండాలి*

    నా పూరణ:-
    🍀🍀🍀🍀🍀🍀🍀🍀
    ఆ.వె
    *శ్రీ*,సరస్వతి,ఉమ చిత్తాన వసముండి
    *సి*రిగనొసిగె మనకు నరునిగతని
    *నా*ట్యమాడె ఒడలు నారాయణుని గని
    *రె*క్కలొచ్చి యెగిరె క్రియలు మరిచి !!!
    _________________________________
    ఆ.వె
    *_శ్రీ*సినారె_ కవిత సేద్యములు చదివి
    *సి*రిగ మారి నరులు సురులగైరి
    *నా*టుకున్ననహపు ఆటలు సాగక
    *రె*ప్పమూసెనదియె గొప్పలేక

    (సి.నారె కవితలు చదువుటవలన ఫలితం)

    🍀🍀🍀🍀🍀🍀🍀🍀
    🌺🌺చెరుకూరి తరుణ్🌺🌺

    రిప్లయితొలగించండి
  27. శ్రీ కరంబుగ తెలుగు కవి రచయితగ
    సింగి రెడ్డి వంశ చంద్ర మణిగ
    నాదరణముజ్ఞాన పీఠమునుఅందె
    రెప్పపాటులోఅరెగనుభువిలొ

    రిప్లయితొలగించండి