5, జూన్ 2017, సోమవారం

సమస్య - 2377 (పాండురాజు పెండ్లాడె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పాండురాజు పెండ్లాడె సుభద్ర నపుడు"
(లేదా...) 
"పాండు ధరాధినాథుఁడు సుభద్రను బెండిలియాడెఁ గాంక్షమై"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

48 కామెంట్‌లు:

  1. కుంతి దేవిని మాద్రిని సొంత ముగను
    పాండురాజు పెండ్లాడె; సుభద్ర నపుడు
    కొన్ని నాండ్లకు పెండ్లాడె కుంతి సుతుడు
    మధ్యముండు పాండవులందు; మంచి విరుపు ;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      'మంచి విరుపు' అని మీరే చెప్పుకున్నారు. చక్కని పూరణతో శుభారంభం చేశారు. అభినందనలు.
      'కుంతీదేవి' అనాలి కదా! అక్కడ "కుంతి, మాద్రి యను సతుల సొంతముగను" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  2. అర్జునుడుకల్గె కుంతికి, అతని తండ్రి
    పాండురాజు, పెండ్లాడె సుభద్ర నపుడు
    తీర్ధ యాత్ర సమయమున తీగ బోడి
    యా ఉలూచిసహితముగ అర్జునుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      శాస్త్రి గారి విరుపు ఒక రకంగా ఉంటే మీ విరుపు మరో రకంగా ఉండి అలరించింది. చక్కని పూరణ. అభినందనలు.
      పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి. "కుంతికి నతని... యా యులూచి సహితముగ నర్జునుండు" ఇలా అవసరమైన నుగాగమ, యడాగమాలు చేర్చండి.

      తొలగించండి
  3. మాద్రినికలియ శాపాన మరణ మందె
    పాండురాజు; పెండ్లాడె సుభద్ర నపుడు
    భద్రమవ్వ బాంధవ్యము ఫల్గునుండు
    బావ కృష్ణుని యందున భావి గనుచు.

    రిప్లయితొలగించండి
  4. నకుల సహదేవులకు తల్లి,నళిననేత్రి,
    భాగ్యదాయిని,మాద్రి,సుభద్ర,సుదతి,
    మనసుఁదీరగ,వలపు,మైమఱపు,కలుగ
    పాండురాజు పెండ్లాడె సుభద్రనపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      'సుభద్ర' శబ్దానికి ఉన్న అన్యార్థాన్ని ఉపయోగించుకుంటూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    2. విరుపు లేకుండా బాగున్నది... ఎందుకో నాకు విరుపు నచ్చదు...తొందరపాటులనో, తప్పక పోతేనో తప్ప...

      నమస్సులు
      🙏🙏🙏

      తొలగించండి
  5. విజయుని విలాస పర్వము వేడకనిడ
    మౌని వేషాన మెప్పించ మరదలి నట
    దివిని వసియించు దైవమై దీవెనలిడ
    పాండురాజు, పెండ్లాడె సుభద్ర నపుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      పాండురాజు దీవెనలతో అర్జునుడు సుభద్రను పెళ్ళాడాడన్న మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. మొదటి పాదంలో టైపో సవరణ :

      విజయుని విలాస పర్వము వేడుకనిడ
      మౌని వేషాన మెప్పించ మరదలి నట
      దివిని వసియించు దైవమై దీవెనలిడ
      పాండురాజు, పెండ్లాడె సుభద్ర నపుడు

      తొలగించండి
    3. మొదటి పాదంలో టైపో సవరణ :

      విజయుని విలాస పర్వము వేడుకనిడ
      మౌని వేషాన మెప్పించ మరదలి నట
      దివిని వసియించు దైవమై దీవెనలిడ
      పాండురాజు, పెండ్లాడె సుభద్ర నపుడు

      తొలగించండి
  6. కొండొక మౌని శాపమునఁ గూడ సతిన్ గతియించె నెవ్వఁ? డా
    ఖండలసూతి కూటయతిగాఁ జనుదెంచి వరించె నెవ్వతెన్?
    ఖండనఁ జేసె శంకరుని కార్ముకమున్ రఘురాముఁ డెందుకై?
    పాండుధరాధినాథుఁడు; సుభద్రను; పెండిలి యాడెఁ గాంక్షమై.

    రిప్లయితొలగించండి
  7. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి
    జనకు డెవ్వరు ధర్మరాజాదులకును
    నెవరు కుంతి మాద్రిలనిల నేమి జేసె
    కపట యతిగ చనికిరీటి గనె నెవరిని
    పాండురాజు పెండ్లాడె సుభద్ర నపుడు.

    రాజ్యవిస్తరణకు జని రమణి మాద్రి
    నెవ్వడు వివాహ మాడెను హితమున నన
    పాండు రాజు:పెండ్లాడె సుభద్ర నపుడు
    కవ్వడి చని గాంచుచు నట కపట యతిగ.

    రిప్లయితొలగించండి
  8. ఊరి కేగిన మిత్రుండు చేరి పిదప
    సఖున కీరీతి దెలిపెను సంగతులను
    ముదము మీరగ చెలికాడ! మొన్న యచట
    పాండు! రాజు పెండ్లాడె సుభద్ర నపుడు.

    దండిగ మద్య మచ్చటను త్రాగిన వాడొకరుండు తూలుచున్
    రండిదె మిత్రు లిచ్చటకు రండని బిల్చుచు ప్రేలుచుండె నా
    ఖండల నందనుం డతడు కాడె యుధిష్ఠిరు డాలకించు డా
    పాండు ధరాధినాథుఁడు సుభద్రను బెండిలియాడెఁ గాంక్షమై.

    హ.వేం.స.నా. మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      (సాధారణంగా మీరు ఒకే భావంతో రెండు పూరణలు చేస్తూ ఉంటారు. ఈరోజు రెండూ వైవిధ్యంగా ఉన్నాయి)

      తొలగించండి
  9. డా.ఎన్.వి.ఎన్.చారి.9866610429
    మండెడు కాంక్షతో సతిని మాద్రిని కూడగ కూలె నక్కటా
    పాండుధరాధినాథుడు;సుభద్రను పెండిలియాడె గాంక్షమై
    పాండవ మధ్యముండు తన బావయు కృష్ణుడు మెచ్చునట్లుగా
    దండుగ యయ్యె కౌరవుల దౌష్ట్యము లన్నియ ధర్మ చింతనల్

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    పాండవబీడు1 నెన్నుకొని బంగరు పంటలు దీయు వేడ్క నా
    పాండిమ2 లెక్కజేయకను పాండువు3 పంటను సాగుజేయనౌ
    పాండితి సాగు భూమికగు వైనము,భూస్థితి నెంచి తోడుకై
    పాండుధరాధినాథుడు4 సుభద్రను బెండిలియాడె కాంక్షమై
    "పొండట నేర్చుకొండ"నుచుభూమి సువిజ్ఞుల బంపె కేసియార్!
    1.బహుకాలమునుండి దున్ననిబీటి నేల,2.తెలుపు,3.ఖర్జూరము,4.బీడుభూమి పట్టాదారు ,హక్కు భోక్త.

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    పాండు రోగము దీర్ఘము భవిత యెట్లు
    గడుచునని దీనయౌనొక కన్యనెంచి
    "భద్రతను జూచుకొనెడి సుభద్ర వీవ"
    అనగ తన తాళి బలిమిని యౌననగను
    పాండు"రాజు" పెండ్లాడె సుభద్ర నపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. నిండగ ప్రేమభావనలు నేర్పుగ విప్రహితమ్ము కోరిభూ
      మండలయాత్రజేతునని మాయలమాటలుజెప్పిధర్మరా
      జండనువీడినర్జునుడు,యంబరవీధినదీవనల్నిడన్
      పాంండుధరాధినాధుడు,సుభద్రను బెండిలియాడె కాంక్షమై

      తొలగించండి
    3. నిండగ ప్రేమభావనలు నేర్పుగ విప్రహితమ్ము కోరిభూ
      మండలయాత్రజేతునని మాయలమాటలుజెప్పిధర్మరా
      జండనువీడినర్జునుడు,యంబరవీధినదీవనల్నిడన్
      పాంండుధరాధినాధుడు,సుభద్రను బెండిలియాడె కాంక్షమై

      తొలగించండి
  12. డా.ఎన్.వి.ఎన్.చారి.9866610429
    మండెడు కాంక్షతో సతిని మాద్రిని కూడగ కూలె నక్కటా
    పాండుధరాధినాథుడు;సుభద్రను పెండిలియాడె గాంక్షమై
    పాండవ మధ్యముండు తన బావయు కృష్ణుడు మెచ్చునట్లుగా
    దండుగ యయ్యె కౌరవుల దౌష్ట్యము లన్నియ ధర్మ చింతనల్

    రిప్లయితొలగించండి
  13. డా.ఎన్.వి.ఎన్.చారి.9866610429
    మండెడు కాంక్షతో సతిని మాద్రిని కూడగ కూలె నక్కటా
    పాండుధరాధినాథుడు;సుభద్రను పెండిలియాడె గాంక్షమై
    పాండవ మధ్యముండు తన బావయు కృష్ణుడు మెచ్చునట్లుగా
    దండుగ యయ్యె కౌరవుల దౌష్ట్యము లన్నియ ధర్మ చింతనల్

    రిప్లయితొలగించండి
  14. శల్యునకు బావ యెవ్వరు జగతి యందు
    కుంతిసుతుడెటులేగిె తా కువలయాన
    నెవరి నేమిచేసె నిపుడు నెరుక పరచు
    పాండురాజు,పెండ్లాడె సుభద్ర నపుడు.

    భండనమందునన్ రిపుల భంజన మున్ యొన రించుచుండి తా
    నిండు మనంబుతోడనట నింతిని గాంచుచు పెండ్లి యాడె నా
    పాండుధరాధినాథుడు;సుభద్రను పెండ్లియాడెకాంక్షమై
    పాండుతనూజుడా ద్వారక పట్టణమందు జోగి యై.

    రిప్లయితొలగించండి
  15. కుంతిదేవిని మాద్రిని గూర్మితోడ
    పాండు రాజుపెండ్లాడె సుభద్రనపుడు
    పాండునందనుడైనట్టి ఫల్గుణుండు
    పరిణయంబాడె వలపున భద్రముగను

    రిప్లయితొలగించండి
  16. దండన గైకొనెన్ నరుడు తప్పుకు, చేయఁగ తీర్థయాత్రలున్
    దండ నులూచి వైచె తన దారగ, నట్టులె పాండ్యరాట్సుతన్
    గుండెల జేర్చె మెచ్చి , దివిఁ గూర్చొని దానిడ దీవెనాదులన్
    పాండు ధరాధినాథుఁడు, సుభద్రను బెండిలియాడెఁ గాంక్షమై

    రిప్లయితొలగించండి
  17. పార్థుఁడు కిరీటి విజయుఁడు ఫల్గునుండు
    జిష్ణుఁ డర్జునుఁడు ఘనుఁడు శ్వేతవాహ
    నుండు సవ్యసాచి ధనంజయుండు పాండు
    సుతుఁడు భీభత్సుఁడు నరుఁడు శూర వరుఁడు
    యాదవేంద్రు కృష్ణుని చెల్లియ ముదమున న
    పాండు రాజు పెండ్లాడె సుభద్ర నపుడు

    [అపాండురాజు = నల్లని రాజు]


    మెండగు యాద వాన్వయ సుమీన నికాయ శశాంక రేఖ వే
    దండ సమాన యాన ఘన తర్పిత విప్ర జనౌఘ తాల్మి భూ
    భాండ నిభాంగనా పృథ నపార వివేక వతిం బతివ్రతం
    బాండు ధరాధినాథుఁడు సుభద్రను బెండిలియాడెఁ గాంక్షమై

    [సుభద్ర = శుభకరమయినది]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అపాండవము వలె అపాండువు కూడా సాధువని తలుస్తాను. సందేహ నివృత్తి చేయ గోర్తాను.

      తొలగించండి
  18. పాండుధరాధినాధుడుసుభద్రనుపెండిలియాడెకాంక్షమై
    పాండుధరాధినాధుడన పావనమూర్తియ యట్టివాడుసూ
    పెండిలియాడునేజెపుమబీరపుపల్కులుబల్కనోపునే
    పాండుధరాధినాధునకిల భార్యలుకుంతియు మాద్రియేకదా

    రిప్లయితొలగించండి
  19. కుంతిభోజుని పుత్రిక కూర్మివిభుడు
    పాండు రాజు, పెండ్లాడె సుభద్ర నపుడు
    యోగిరూపములోనున్న భోగి ప్రీతి
    నల్లనయ్య యనుజునకు నచ్చ జెప్ప

    రిప్లయితొలగించండి
  20. మాద్రి మద్రపతి కూతు,సుభద్ర,రుచిర
    సుందరీమణి,శల్యుని సొగసుచెల్లె,
    పాండురాజు పెండ్లాడె సుభద్ర,నపుడు,
    బంధు జనములు, ప్రజ లెల్ల స్వాగతింప

    రిప్లయితొలగించండి
  21. విరించి గారి పూరణ...

    నెలత యంబాలికకు వ్యాసుని కృప చేత 
    కలిగినట్టి కుమారుడు ఘన చరితుడు 
    పాండు రాజు . పెండ్లాడే సుభద్ర నపుడు 
    పృథ కనిష్ట సుతుండగు విజయుడేను

    రిప్లయితొలగించండి
  22. కుంతియుండగ మాద్రిని కోరి మురిసి
    పాండురాజు పెండ్లాడె; సుభద్ర నపుడు
    క్రీడి వరియించె ద్రౌపది తొడ మెలగ
    రాజులకు పెక్కురుండిరి రాణులపుడు

    రిప్లయితొలగించండి
  23. సవరించిన పద్యము
    భండనమందునన్ రిపుల భంజన మున్ యొన రించుచుండి తా
    నిండు మనంబుతోడనట నింతిని గాంచుచు పెండ్లి యాడె నా
    పాండుధరాధినాథుడు;సుభద్రను పెండ్లియాడెకాంక్షమై
    పాండుతనూజుడా నరుడు ద్వారక పట్టణమందు జోగి యై.

    రిప్లయితొలగించండి
  24. తనయుడు, ముని వేషికి దీ
    వెనలిడె నా *పాండురాజు, పెండ్లాడె సుభ
    ద్ర నపుడు* మోహించిన య
    ర్జునుడే వైభవముగనిల సుఖముగ నుండెన్

    రిప్లయితొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కుంతి మాద్రిల నిద్దరి కూరిమెంచి
    పాండురాజు పెండ్లాడె; సుభద్ర నపుడు
    తాపసిగ నస్త్రముల నొంది తనరు వేళ
    నర్జునుండు కృష్ణు నాశీస్సున మను వాడె

    రిప్లయితొలగించండి
  26. కుంతి భోజుని బుత్రిక కుంతిని గద
    పాండు రాజు బెండ్లాడె, సుభద్ర నపుడు
    సాధు రూపములో నున్న సవ్యసాచి
    పరిణయంబాడె వెన్నుని నెరవు వలన!!!

    రిప్లయితొలగించండి
  27. పాండురాజు పెండ్లాడె;...సుభద్ర నపుడు
    కనియెనో లేదొ నామెను కన్న తల్లి;
    జాతకము లేదు నాకడ జన్మ తిథియు;
    శాస్త్రములు దెలియవు గాని "శాస్త్రి" నేను 👨‍🎓

    రిప్లయితొలగించండి