8, జూన్ 2017, గురువారం

సమస్య – 2379 (నీతిరహితుఁడె జనులకు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నీతిరహితుఁడె  జనులకు నేత యగును"
(లేదా...)
"నీతివిహీనుఁడే జనుల నేతగ గౌరవమందు నెల్లెడన్"
ఈ సమస్యను పంపిన గొరిగె వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు.

63 కామెంట్‌లు:

  1. శ్రీ కంది శంకరయ్య గారు పురస్కారము అందుకొన్న సందర్భములో వారు శంకరభరణము బ్లాగు నిర్వహిస్తూ నందుకు ధన్యవాదములు తెలుపుతూ ప్రతి పాదములో మొదటి అక్షరములు కలిపి చదువుకో ప్రార్ధన (నెయ్యము, అన్య , పాదములో రెండవ అక్షరము )
    శ్రీనివాసుని కరుణతో సిరులు పొంది,
    కంస వైరుని శరణుతో ఘనత నొంది,
    దినకరుండు నిత్యమూ దీప్తి నిడగ,
    శంకరసుతుడు సతతము సంతు నిడగ,
    కమల నయనుండు ఘనముగా కాంక్ష దీర్చ,
    రక్ష నిడుచుకాపాడంగ రాముడెపుడు,
    నెయ్యము కలిగి కీర్తించ నేటి కవులు,
    గాలి పుత్రుడు కావ్య సౌ గంధమీయ,
    రిక్క లనుతాక బ్లాగుకు రెక్క లొచ్చి ,
    కినుక చూపక చేరును కీర్తి యెపుడు,
    ధరణి లోన కవులు మిమ్ము తలచు చుండ.
    అన్య భాషా కవులు గూడ యాదరించ.
    వాక్కు తల్లి నర్తించ మీ వాక్కు పైన,
    దయకలిగి యువకవులకు దారి చూపి,
    మురిపెముగ మీరు శంకరాభరణ మును, య
    లుపును బడయక ఎపుడు నడుపగ వలయు

    రిప్లయితొలగించండి
  2. నవ్వు చుందురు లేకున్న నల్ల ధనము
    కండ బలముతో కబ్జాలు కందకముల
    నైన చేయంగ వలయను, మాన భంగ
    ములను సుతులచే చేయిచ వలయు, జనుల
    సొమ్ము తోడ నొంద వలయు షోకులన్ని,
    విత్తనంబులు ఎరువులు విఫణి లోన
    కల్తి చేసి అమ్మవలయు కర్షకులకు,
    హత్య లెన్నియో చేయుచు నిత్య ము భయ
    భ్రాoతులు గొలిపి జనమును బాధ పెట్ట
    వలయు , ఇవియె లక్షణములు , విలువ లేక
    రాజ కీయము లీనాడు రచ్చ నొంద
    నీతిరహితుఁడె జనులకు నేత యగును

    రిప్లయితొలగించండి
  3. ఆర్య నిన్నటి పూరణము ఒక్కసారి వీక్షించగలరు


    కారుకొన్న ఘన మేఘమ్ముల రీతిగ కౌరవ సైన్యము కదలు చుండె,
    నీవా చిరుతవైతి, నీవేల నన్ను నీ తేరు సారధ్యము కోర వలెను,
    అర్ధ వధూటీ విహారము సల్పగ వెడలుము, యుద్ధము న్వీడి పొమ్ము,
    వీర విహారమ్ము శూరుల కేజెల్లు, నీకేల శరములు, నీవు విజయు
    నెటుల మార్కొను వాడవు, నేల పైన
    జీవితంబు ముగిసె నీకు. సిగ్గు పడుము
    యంచు సెల్లుడు కర్ణుని యదర గొట్టె
    సమర రంగము నందు విశ్రమము లేక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
      "సిగ్గుపడు మ।టంచు..." అనండి.

      తొలగించండి
  4. సత్య ధర్మశీలధనము చాల యున్న
    ధన కుల మత బలము లేని ధన్యులకును
    లేదు స్థానము పార్టీల లేశ మైన
    నీతిరహితుఁడె జనులకు నేత యగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుభ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. ధర్మ శాస్త్రములందున మర్మమెరిగి
    శాంతి భద్రత నెలకొల్పి సమతగోరి
    క్షమతతో గెలిచి ప్రజల మమత... కుటిల
    నీతిరహితుఁడె జనులకు నేత యగును

    రిప్లయితొలగించండి
  6. నీతిని పాతిపెట్టుచు వినీతుడ నంచును పంచు వారుణిన్
    గోతుల ద్రోయుచున్ జనుల ఘోరము లెన్నియొ జేయుచున్ సదా
    తాతల మంచు గొప్పలు నిదాన విధానము జెప్పువాడెగా
    నీతివిహీనుఁడే జనుల నేతగ గౌరవమందు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  7. గతము జూడగ ధర్మనిరతిని శీల
    సంపదల నొప్పు చుండుచు సత్య మరసి
    జన హితంబు గూర్చుపనులు సలిపెడి యవి
    నీతి రహితుఁడె జనులకు నేత యగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుభ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. జాతికి పట్టు చీడవలె సర్వము దోచినవారునేతలౌ
    పూతమెఱుంగులన్ గనగ మోసముఁజేసెడువారు నేతలౌ
    యీ తరమందు పెక్కుజనులిట్టులె మానవజాతినుండగన్
    నీతివిహీనుడే జపుల నేతగ గౌరవమందు నెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  9. మంచివర్తనమును చూపి సంచరించు
    వాడు నక్రమార్జనకిష్టపడని వాడు
    పరుల సొమ్మును తాకంగ భయపడు నవి
    నీతి రహితుడె జనులకు నేతయగును.

    రిప్లయితొలగించండి
  10. భావి కాలంబు నెంచుచు బలికెను గద
    బ్రహ్మ మీరీతి స్వామియై ప్రజలలోన
    ధర్మ మణగారి పోవును తథ్య మటులె
    నీతిరహితుఁడె జనులకు నేత యగును.

    జాతికి జ్ఞానబోధనము చక్కగ జేసెను భావి నెంచి యీ
    రీతిగ బ్రహ్మ మిచ్చటను శ్రీలు గడించుట లక్ష్యమౌ గనన్
    పాతకముల్ సమస్తములు వ్యాప్తిని జెందును తథ్య మెంచగా
    నీతివిహీనుఁడే జనుల నేతగ గౌరవమందు నెల్లెడన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  11. డా.పిట్టా
    ఇదియె కలిమాయ, లంచాలకిరవు జగతి
    తనదు కూటమి బెంచుకోతగును సుమ్మి
    చెరల విడిపించ నేరముల్ జేయు జనుల
    వివిధ క్రొత్త ప్రణాళికా విడుపు దినగ
    నీతి రహితుడె జనులకు నేత యగును!

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    పూత మనస్కుడొక్కడుగ పుణ్యము జేసిన లెక్క లేదు ని
    ర్ధూత వికల్ప రాశి సవిరూఢిని బ్రాపును దేవులాడు; త
    ద్భ్రాతల బ్రోవగా వలయు తప్పదు కూటమి గూర్చగన్ సుమీ!
    నీతి విహీనుడే జనుల నేతగ గౌరవ మందు నెల్లెడన్
    (వికల్పము..అవాంతర కల్పము;అవాంతరము..లోనిది;కల్పము..న్యాయము;నిర్ధూతము విడువ బడినది॥విడిచిపెట్టిన న్యాయము..అన్యాయము॥నీతి బాహ్యత॥)

    రిప్లయితొలగించండి
  13. మాయమాటలతోడను నాయక తతి
    కొలదికాలము మోసము సలుపవచ్చు
    తుదకు మనుజుల మనసుల దోచిన యవి
    నీతి రహితుఁడె జనులకు నేత యగును

    రిప్లయితొలగించండి
  14. ప్రజలమేలుకాంక్షించెడి పాలనమున
    శాంతి సుఖములులభియించుస్వాంత నమున
    పరహితార్దుల నెపుడుకాపాడు నదియె
    నీతిర, హితుడు జనులకు నేత యగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      విలక్షణమైన విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  15. కలియుగమ్మున కలహాలె కాపురమ్ము
    సత్యధర్మముల కచట స్ధానమేది?
    స్వంత లాభమెగను పరచింత లేదు
    నీతిరహితుడె జనులకు నేతయగును

    రిప్లయితొలగించండి
  16. ఇదోరకం ప్రజలు...

    పరులు పాలించగా దూరి పలుకుదు రవి
    నీతి రహితుఁడె జనులకు నేత యగున
    టనుచు! తాము మెచ్చిన వాడు దనుజుడైన
    మేత నెంతైన మేసిన నేత గాదె?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..యగు నటంచు..." అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
      ఇదోరకం ప్రజలు...

      పరులు పాలించగా దూరి పలుకుదు రవి
      నీతి రహితుఁడె జనులకు నేత యగున
      టంచు! తాము మెచ్చిన వార లసురులైన
      మేత నెంతైన మేసిన నేత గారె?

      తొలగించండి
  17. మేతలు లేక మీరెటుల మేడలు మిద్దెలఁ గట్టినారనన్?
    వాతలఁ బెట్టనెంచి తగఁ బల్క విలేఖరి నాయకాగ్రనున్
    వ్రాతలఁ వ్రాయ నిట్లనియె "పైకము నోటుకు మాని నంత దు
    ర్నీతి విహీనుఁడే జనుల నేతగ గౌరవమందు నెల్లెడన్"

    రిప్లయితొలగించండి
  18. పాతకమ్ములు జేయక, ప్రీతితోడ
    పరుల కుపయుక్త మైనట్టి బనులు జేసి
    దేశ యున్నతి గాంక్షించు ధీరుడు, యవి
    నీతి రహితుడె జనులకు నేతయగును!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మైనట్టి పనులు...' అనండి. 'దేశ+ఉన్నతి = దేశోన్నతి' అవుతుంది. యడాగమం రాదు. "దేశ ప్రగతిని గాంక్షించు ధీరుడు నవి।నీతి..." ఆనండి.

      తొలగించండి
  19. ప్రజల సంక్షేమమే నిత్య ప్రార్థనముగ
    బంధుప్రేమయు స్వార్థము పగతురనుచు
    కరుణతో పాలనము సేయగలిగిన నవి
    నీతి రహితుడే జనులకు నేతయగును

    రిప్లయితొలగించండి
  20. పెద్ద మనసేల నిద్ధరఁ బేరు తోడఁ
    దాత ముత్తాతల తన వద్ద ధనమున్నఁ
    జాలి నంతగ నిక్కలి కాల మందు
    నీతి రహితుఁడె జనులకు నేత యగును


    కోతులు వీర లందరని కుత్సిత మానస మాన వౌఘ సం
    వీత మటంచు నెంచకయె పేరిమిఁ జూపి ధనార్జనాబ్ధి సం
    పాతము గాక దుఃఖములఁ బారక తాఁ గుటిలంపు రాజ దు
    ర్నీతివిహీనుఁడే జనుల నేతగ గౌరవమందు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  21. జాతివివక్షతోడుతను సంఘము నిత్యము సాగుచుండగా
    ఖ్యాతిని గొన్న నాయకునిఁ గాంచగలేమిక దేశమందునన్
    గోతులుతీయు దుర్జనుడె కోట్లప్రజాధన మున్ హరించి యా
    నీతివిహీనుఁడే జనుల నేతగ గౌరవమందు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  22. ఆర్యులకు నమస్కారము
    మొదటి పాదములో మొదటి అక్షరము రెండవ పాదములో రెండవ అక్షరము మూడవ పాదములో మూడవ అక్షరము అలా వరుసగా కలిపి చదువుకో ప్రార్ధన (ఆఖరి పాదములో ఆఖరి అక్షరము) ఇది నా తొలి ప్రయత్నము మీ ఆశీస్సులు నిడుచూ దోషములున్న విడువ వలెను

    అభినందనల సుమమాల శంకరయ్య గార్కి



    అజితుడిడిన అకరణి నాదరించి
    నాభిజన్ముడు పంపె శ్రీనాధునిటకు ,
    ధాత్రి నందు జననమొంది ధన్యుడాయె
    కంది సుందరా కారుడు కలిమి కలిగి .
    ఆదికవి నన్నయ్య చూచి యాశ పడెను
    భూమికి మరల వచ్చి ఈ పోషణమ్ము
    చేయు తలపుతో సుకవుల చెంత చేరి,
    తిరిగి తెలుగు సీమన పుట్ట తిక్క నయ్య
    మనసు గోరంగ ఆ రమా మగని యెపుడు
    పూజలను చేసె, మన నేల పురుడు పోయ
    సంతసము పడుదు ననుచు శంకరుణ్ణి
    సుమములు నిడుచు కాళిదాసు కవి పదము
    పైన తలమోడ్చి విలపించె, మధుర మైన
    తెలుగు నేలలో కవులెల్ల దీప్తి నియ్య
    సతతము సమశ్యల నిడుచు సబబుగా క
    వులకు ముదము నీయ శుభము కలుగు వార్కి





    రిప్లయితొలగించండి
  23. పాత కాలపు నాయకుల్ భాగ్యమనగ
    దేశ భక్తిని జూపిరి వాసిగాను
    దేశ భుక్తికె నేడిట తీరు నెమకు
    నీతిరహితుఁడె జనులకు నేత యగును

    నిన్నటి సమస్యకు నా పూరణ

    సెల్లుడే జేయ సారధ్య సేవ ననిని
    కారు చీకట్లు క్రమ్మగ కర్ణు డనియె
    నీవు సారధి వా !చిక్కి చేవ లేక
    ప్రాణ మిడుటీవిధిని నాకు బ్రహ్మ వ్రాసె

    రిప్లయితొలగించండి
  24. ప్రముఖ కవి, ప్రసిద్ధ అష్టావధాని ఇందారపు కిషన్ రావు గారు పరమపదించారన్న విషాద వార్త ఇప్పుడే తెలిసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చుగాక!

    రిప్లయితొలగించండి
  25. ప్రముఖ కవి, ప్రసిద్ధ అష్టావధాని, మద్గురువులు శ్రీ ఇందారపు కిషన్ రావు గారి ఆత్మకు శాంతిచేకూరుగాక! వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

    పద్య సాహిత్య పాండిత్య పటిమచేత
    సకల సాహిత్య విద్యార్థి సంతతులకు
    జ్ఞానమూర్తులుగా భువిన్ స్థానమిడియు
    స్వర్గధామమ్ముఁ జేరి విశ్రాంతిఁగొనిన
    ఘన కిషన్ రాయ కవిరాజ వినతులివియె!

    రిప్లయితొలగించండి

  26. పిన్నక నాగేశ్వరరావు.

    జనుల క్షేమమునరయుచు సంతతమ్ము

    పరుల ధనమక్ర మార్జన వలదటంచు

    నెదను నిస్వార్థ భావమ్ము నెంచెడు నవి

    నీతి రహితుడె జనులకు నేత యగును.

    *****************************

    రిప్లయితొలగించండి
  27. పన్నులు నెగవేయు నతి సంపన్నులుండ
    లంచములు మరగు జనులు లక్షలుండ
    కాని మార్గముల జనుల కాంక్ష పెరుగ
    నీతి రహితుడె జనులకు నేత యగును

    రిప్లయితొలగించండి
  28. ప్రజల సుఖశాంతులనుఁ గాచి, వ్యథలఁ దీర్చి,
    యెల్ల వేళలఁ దోడయి, హితము నిడియు,
    సన్నిహితుఁడయి, రక్ష నొసఁగుట రాజ
    నీతిర! హితుఁడె జనులకు నేత యగును!

    రిప్లయితొలగించండి
  29. నేతలందరి నేతవిధాత యొకడె
    జాతి,మతముల కతీతుడు నీతిరహితు
    డె,జనులకు నేత యగును,స్వజన,మితర
    మనెడి భేద భావము లేని మాన్యుడవగ

    రిప్లయితొలగించండి
  30. నీతిహీనుడు జనులకు నేతయగును
    నమ్ముమనునది *కాంగ్రెస్సు*నాటి మాట !
    మన *నరేంద్రమోడీ*కి యమాత్యులెల్ల
    నీతిమంతులు భారతజాతి మణులు !!
    విభీషణుడు.... రావణునితో

    *నాతి చరామి* యంచు సుజనమ్ముల ముందు ప్రతిజ్ఞ జేసి , ప్ర..
    ఖ్యాత *పులస్త్యవంశకలశాంబుధిఁజంద్రునిగా* జనించి , స్త్రీ
    జాతియె నిందజేయునటు *జానకి దెచ్చుట* యుక్తమౌనె ? దు..
    ర్నీతివిహీనుఁడే జనుల నేతగ గౌరవమందు నెల్లెడన్ !!

    రిప్లయితొలగించండి
  31. దారిఁ జేరఁ గోరి యారడిఁ బారరె
    వీరు వారు నైనఁ గోరి రారు
    మీర లేరు వారి వారి నుదిటి గీత
    వారి వారి దారి యేరి కెఱుక!

    రిప్లయితొలగించండి
  32. నీతి నియమములు గలిగి ఏర్పరచిన
    నేతలు విజయ ములను నేపొందగలరు
    నీతిరహితుఁడె జనులకు నేత యగును
    నీతి గల నాయకుడు ప్రజానేతయౌను

    రిప్లయితొలగించండి

  33. పుడమి యందున యక్రమ ముగ ధనమును
    వాంఛ చేయు నికృష్టులెవ్వారలనగ
    ప్రజల హితమును కోరెడి వాడె సతము
    నీతిరహితుడె,జనులకు నేత యగును.

    పాపపు పనులొనర్చక పట్టుబట్టి
    ప్రజల కుపకరించు పనులన్ వాసిగాను
    నాలసింపక చేయువాడవని కుటిల
    నీతి రహితుడె జనులకు నేతయగును .

    రిప్లయితొలగించండి
  34. కోతికి ముందునన్ కలిపి కొండొక యక్షరమున్ మహాశయా!
    నాతిగ మార్చెడిన్ కిటుకు నాకిక బోరును కొట్టుచుండగా
    ప్రీతిగ ప్రశ్నగా మలచి వీడెద మిమ్ముల నిట్లు నేనెపో:👇
    నీతివిహీనుఁడే జనుల నేతగ గౌరవమందు నెల్లెడన్????

    రిప్లయితొలగించండి