12, జూన్ 2017, సోమవారం

సమస్య – 2383 (రాధికాప్రియుండు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాధికాప్రియుండు రావణుండు"
(లేదా...)
"రావణుఁడే కదా వలచి రాధిక మెచ్చు ప్రియుండు సూడఁగన్"

57 కామెంట్‌లు:

  1. ప్రేమ జూపి మదిని ప్రియముగా దరిజేరి
    సంత సంబు తోడ జగతి మరచి
    ప్రొద్దు తిరుగు డంట బుద్ధి నిలుప లేని
    రాధికా ప్రియుండు రావ ణుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పద్యం బాగుంది. కాని పూరణ యొక్క భావం అవగతం కాలేదు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారి సవరణతో:



      నీల మేఘ వర్ణునే వైరిగ దలచి
      నీల జలధి పురము నేలు కొనుచు
      నీల కంఠుడైన నిటలాక్షు భక్తుండు
      రాధికాప్రియుండు రావణుండు


      రాధిక : నీలము రంగు

      శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. లంకను దహనంబు లాఘవంబుగ జేసి
    ధరణి పుత్రి గాంచి ధైర్య మొసగి
    నిలచిన హనుమకును, నిర్దయడా యప
    రాధికా ప్రియుండు రావణుండు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      'అపరాధికి+ఆ ప్రియుండు' అన్న విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. 1)
    నాటి రాముఁడె కద నేటి శ్రీకృష్ణుఁ డా
    రాధికాప్రియుండు; రావణుండు
    ధర్మ మెఱిఁగియుఁ బర తరుణినిఁ గాంక్షించి
    రాము చేత విడిచెఁ బ్రాణములను.
    2)
    కొంటె పిల్లవాఁడు కోరి వ్రాసె నిటుల
    "రాధికాప్రియుండు రావణుండు"
    కాంచి యయ్యవారు కసరినాఁ డిట్టుల
    "రాధికాప్రియుండురా మురారి"

    3)
    పిలుచుఁ గృష్ణుఁ డెటులఁ బ్రియురాలు నెల్లప్డు?
    తరుణి మదిని నిలుచుఁ దా నెవండు?
    రాము చేతఁ జచ్చు రాక్షసేశుఁ డెవండు?
    రాధికా; ప్రియుండు; రావణుండు.
    4)
    మయుని తనయ యామె మండోదరీ దేవి
    రాక్షస కులమునకు రాణి యయ్యె,
    లంకలోన నున్న లలిత సౌందర్య సా
    రాధికా ప్రియుండు రావణుండు.
    5)
    క్రూరుఁ డతఁడు రాజుగారి బావమఱది
    త్రాగి వాగుచుండుఁ దలయు తోక
    లేక, యా శకారుఁ డాకతాయి యనెను
    "రాధికాప్రియుండు రావణుండు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన ఐదు పూరణలందించారు. అభినందనలు!

      తొలగించండి
    2. 6)
      రమ్య సుగుణశీలి రామచంద్రుఁడొ వాఁడు
      రాధికా! ప్రియుండు రావణుండు
      వోలె ఖలుఁడు దుష్టబుద్ధి గల్గినవాఁడొ
      తెలిసి వలచినపుడె కలుగు మేలు!

      తొలగించండి
    3. 7)
      ఇంటిగోడకు గల వెన్నియో పటములు
      రాధికాప్రియుండు, రావణుండు
      సీత నపహరించు చిత్రమ్ము, గీతను
      బోధ సేయు కృష్ణు పుణ్యమూర్తి.

      తొలగించండి
    4. గురువుగారు ..ఈరోజు బ్లాగులో మధుర పద్యజలధారలు కురిపించారు...ప్రణామములు...

      తొలగించండి
  5. వెర్రి వెంగ ళప్ప వేరొకనికితెల్పె
    రాధికా ప్రియుడు రావణుండు ,
    తరచి చూడ సీత తనయుoడు రాముడు
    శివుని వలన పుట్టె సిరికి యనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      వెర్రివాని వాగుడుగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. నిన్నమీరు ఇచ్చిన సమష్య కు పూరణము. okka sari chuchi సరి దిద్దగలరు
    వాఙ్మనకాంతుని సతి, సు
    వాఙ్మయము సుకవుల కిచ్చె వాక్కున, నేడీ
    దిఙ్మండలమున గనబడు
    వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. 'వాఙ్మనఃకాంతుడు' సరియైన ప్రయోగం.

      తొలగించండి
  7. రాఘవుండు ధర్మ రక్ష కుండు నిరప
    రాధికా ప్రియుండు, రావణుండు
    దుష్ట రాక్షసుండు, తోడ బుట్టినచెల్లి
    కోర్కె తీర్చి తనదు కొంప గూల్చె



    నల్ల నయ్య కుగల నామమొక్కటి దెల్పు ,
    పర్ణ శాల లోన పడతి బట్టి
    తన పురమునకెవడు తరలించె దయలేక,
    రాధికా ప్రియుండు , రావణుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'నిరపరాధిక' అన్న ప్రయోగం లేదు.

      తొలగించండి
  8. *భర్తక్షేమ మెపుడు భావించి మదిలోన*
    *నియతిదోడ నిలిచె నీతి చెప్పి*
    *మానధన్వి శీల మండోదరి నిరప*
    *రాధికాప్రియుండు రావణుండు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిరపరాధి కాప్రియుండు' అని టైప్ చేస్తే సందేహానికి తావుండదు. పదాల మధ్య వ్యవధానాన్ని పాటించండి.

      తొలగించండి
  9. భావమునందు బాహ్యమున భర్తయెదైవము సాధ్వికెన్నగా
    కోవిదుడైన క్రూరుడని ఘోషలొనర్చిన లోకమంతయున్
    తావిడదేదురూహలకు తానుగ డెందమునందు మాయికా
    రావణుఁడే కదా వలచి, రాధిక! మెచ్చు ప్రియుండు సూడఁగన్.

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    జీవుల శాస్త్రమున్నెరుగ జేకురు చెట్లకు నైన బ్రాణముల్
    తీవెల విష్ణు క్రాంత గని తెల్పుమటన్నది"రాధ" క్రావడిన్
    భావుకుడైన శిష్యుడొక భాతిని నల్లెను పద్య పాదమున్
    "రావణుడే కదా వలచి రాధిక(న్) మెచ్చు ప్రియుండు ‌సూడగన్"(అరసున్న కు బదులుగా"న్" key board లో దొరుకలేదు)
    (మొక్క,విష్ణుక్రాంత॥రాధ(శ.ర.)
    రాధ॥విష్ణువు యొక్ఠ కాంత॥సీతామాత)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని రాధిక తర్వాత అరసున్నా కాని నకారం కాని వేయరాదు.

      తొలగించండి
  11. [6/12, 5:55 AM] DrNVNChary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    పావని మైథిలి న్నెవడు పాపపు చింతన తోడ లంక గొం
    పోవగ రాముడా తనిని పోరున మార్కొని చంపెనో గదా
    నీవిక నాకు సొంతమన నెవ్వతి కృష్ణుని నేమి చేసెనో?
    రావణుడే కదా?వలచి రాధిక మెచ్చు ప్రియుండు సూడడగన్!!
    [6/12, 7:01 AM] DrNVNChary: డా.ఎని.వి.ఎన్.చారి 9866610429
    కలియుగమున నామములు కడు చిత్రంబు
    పెళ్ళి చూపు లందు పేర్లు వినుచు
    నతిథు లంత గూడి హాస్య మాడి రిటుల
    రాధికా ప్రియుండు రావణుండు

    రిప్లయితొలగించండి
  12. *గానలోల* ! *నీలకంఠపదార్చితా* !
    కావుమనుచు " మ్రొక్కి *కనులు దెఱవ*
    నెదుట నిల్చి
    యడిగి *రేమికావలెనని*
    రాధికాప్రియుండు , రావణుండు !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పావన రామగాధయును భాగవతమ్మును జేర్చి గూర్చితిన్
      చేవగ నొక్క పొత్తముగ , చిత్రము కొన్ని పుటల్ విశీర్ణమై
      పోవ , పఠించితిన్ మరచిపోయి కథామృతమిట్లు బాపురే !
      రావణుడే కదా వలచి రాధను మెచ్చె ప్రియుండు సూడగన్ !!

      తొలగించండి
    2. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. అలఘు హర్షయుతులు చెలికత్తె లిర్వురు
    స్వీయ సఖుల పేర్లు చెప్పునపుడు
    వారిలోన నొకతె వనజాక్షి యిట్లనె
    రాధికా! ప్రియుండు రావణుండు.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి

  14. మదిని మెదులు గాద వదలక నెన్నేళ్ళు
    ఎంటియారు నటనలిందులోన
    రామచంద్రమూర్తి, రారాజు పాత్రలు
    రాధికాప్రియుండు,రావణుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి వారూ,
      అద్భుతమైన పూరణ. అభినందనలు.
      "వదలక యెన్నేళ్ళు" అనండి.

      తొలగించండి
  15. నాడు ముగిసి నట్టి నాటక సప్తాహ
    ఫలితములు వెలువడె, తెలిసి నటులె
    మొదటి రెండు స్థానముల పొంది నారట
    రాధికాప్రియుండు, రావణుండు

    రిప్లయితొలగించండి
  16. నిన్నటిఉత్పలమాల పూరణ:

    పాఙ్మయ మైన భావనల వ్రాతలె యేమత గ్రంథమందునన్
    రుగ్మత లెట్లు బుట్టెనొ ప్రలోభ ప్రబోధక చిత్తవృత్తులన్
    చిఙ్ముఖ పృష్ట భాగమున చిత్రము లాడిన యట్లు వారిదౌ
    వాఙ్మయమందు నున్నయది వ్యర్థము సుమ్ము పఠింపఁ గీడగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని 'పాఙ్మయ... చిఙ్ముఖ'...?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు

      పాజ్ఞ్మయ =నిర్మలమయమైన

      చిజ్ఙ్ముఖ = రంధ్రములు గల పరదా ముందరి

      తొలగించండి
    3. 'పాక్(నిర్మలం, పవిత్రం)+మయ...' ఇక్కడ 'పాక్' అన్నది పారసీక పదం. దానిని మయతో సంధి చేయరాదు.

      తొలగించండి
  17. వైరమైననేమి వదలక శ్రీరామ
    నామ జపము జేసె నసురవరుడు
    రాముడగుచు నేను రాజిల్లు వేళ నో
    రాధికా! ప్రియుండు రావణుండు

    రిప్లయితొలగించండి
  18. కృష్ణుఁ దా వలచెను విష్ణువే యంచును
    విష్ణు వయ్యె నపుడు కృష్ణ వర్ణ
    రాముడని యెఱుంగు రమణి రాధా సతి
    రాధికాప్రియుండు రావణుండు

    [రాధికా + అప్రియుండు = రాధికాప్రియుండు]


    పావన బంధ మయ్యది వివాహము నాడక యున్న నేమి సం
    భావిత మెల్ల వారలకుఁ బార్థుని సారధి వాసుదేవుడే
    దేవుఁడు సాత్వతీయుని వధించె వడిన్, శిశుపాలుఁ డన్న యా
    రావణుఁడే కదా, వలచి రాధిక మెచ్చు ప్రియుండు సూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  19. సేవలతోడ తాను శశిశేఖరు మెప్పును బొందెఁ బ్రీతితో
    రావణుఁడే కదా, వలచి రాధిక మెచ్చు ప్రియుండు సూడఁగన్
    దేవకి గర్భమందునను తేజముతోడ జనించె భూమిపై
    కావగ దీనమానవుల కావర దైత్యులనుండి కృష్ణుడై

    రిప్లయితొలగించండి
  20. ద్వాపరయుగమందు వన్నెకెక్కెను సుమ్ము
    రాధికాప్రియుండు, రావణుండు
    జానకిజెరబట్టి హీనమతినితాను
    లంకచరితమార్చె రయముగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  21. నల్లదేవర హరి నవనీత చోరుడు
    రాధికా ప్రియుండు, రావణుండు
    మధురభాషిణియగు మండోదరీపతి
    లంకపాలకునిగ రహిని గాంచె!!!

    రిప్లయితొలగించండి
  22. గురువుగారి పద్యముల ప్రేరణతో...

    రాధికా ప్రియుండు, రావణుండు, హనుమ
    లక్ష్మణుండు, సీత రాఘవుండు
    చంద్రధరుడు, సతిని చాక్పీసు తోనద్భు
    తముగ గీచె నచట తౌలికుండు!!!

    రిప్లయితొలగించండి
  23. జీవము పోసి పాత్రలకు జేయన ప్రేక్షక మోదమందగన్
    దీవెనలంది రంగమున దేలుచు నిన్నటి నాటకమ్ములో
    రావణుఁడే కదా! వలచి రాధిక మెచ్చు ప్రియుండు సూడఁగన్
    దైవమె భూమికిన్ దిగు విధమ్మునటించెను నేడు కృష్ణుడై!

    రిప్లయితొలగించండి

  24. లంకనేలువాడు లావణ్యలోలుడు
    నలువ వంశ వరుడు నల్లకలువ
    మయుని యల్లుడతడు మాయావి గాక సు
    రాధికా ప్రియుండు రావణుండు

    సుర+అధిక ప్రియుండు = సురాధికా ప్రియుండు= మద్యపానము నందధికా సక్తిగలవాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ ప్రశంసింపదగినదే. 'అధిక+అప్రియుడు = అధికాప్రియుడు' అవుతుంది.

      తొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ద్వాపరమ్మునందు వ్రజమోహనుండయ్యె
    రాధికా ప్రియుండు; రావణుండు
    ధరణిజ ప్రియుడైన దాశరధి సతిని
    సడపి నతని చేత చావు నొందె

    క్రొవ్విడి వెంకట రాజారావు:

    ద్వాపరమ్మునందు వ్రజమోహనుండయ్యె
    రాధికా ప్రియుండు; రావణుండు
    ధరణిజ ప్రియుడైన దాశరధి సతిని
    సడపి నతని చేత చావు నొందె


    క్రొవ్విడి వెంకట రాజారావు:

    ద్వాపరమ్మునందు వ్రజమోహనుండయ్యె
    రాధికా ప్రియుండు; రావణుండు
    ధరణిజ ప్రియుడైన దాశరధి సతిని
    సడపి నతని చేత చావు నొందె






    రిప్లయితొలగించండి
  26. నావల కాదయా విరుపునాశ్రయ మొందక పూరణమ్మిడన్,...
    చావును కోరినన్ ఘనుడు జానకి చోరుడు మూర్ఖవర్యుడా
    రావణుఁడే కదా;...వలచి రాధిక మెచ్చు ప్రియుండు సూడఁగన్
    గోవుల కాచుచున్ మురిసి కోకలు దోచిన కృష్ణుడే కదా!

    రిప్లయితొలగించండి