ఇచ్చేదే సమస్య. సమస్య ‘సమస్య’గానే ఉండాలి. పృచ్ఛకుడు అడిగిన ' సమస్య ' యొక్క భావం చాలా అసంగతంగా, అసంబద్ధంగా, అసందర్భంగా, ఒక్కొక్కసారి అశ్లీలంగా కూడా వుంటుంది. కవి తన ప్రతిభతో దానిని సభ్యతాయుతంగా, అసంభవాన్ని సంభవంగా నిరూపిస్తూ పూరించాలి.
మన దేవుళ్ళపైన అసంగతమైన సమస్యలు ఇప్పటికి ఎన్నో అవధానాలలో పృచ్ఛకులు అడిగారు. కవులు తమ నైపుణ్యంతో వాటిని పూరించి మెప్పించారు.
నేను చూచిన ఒక అవధానంలో పృచ్ఛకుడు ఇచ్చిన సమస్య ...
‘రాముని వంచించి సీత రావణు వలచెన్’
"సీతవంటి లోకోత్తర పతివ్రతను గురించి ఇలా చెప్పడం భావ్యమా? సంస్కారమా?" అని ఆ సభలో ఎవరూ ప్రశ్నించలేదు. కవికూడా యుక్తియుక్తంగా సమస్యను పూరించి అందరి మెప్పు పొందాడు. కొన్ని కొన్ని సమస్యాపాదాలను చూడగానే మనస్సు నొచ్చుకొనవచ్చు. మరికొన్ని సమస్యలను వినగానే అసభ్యంగా ఉండి రోత కలిగించవచ్చు. సమస్యలోని అసంగతాన్ని తొలగించడమే కదా కవుల పని. స్వస్తి!"
మీరు సూచించిన "అశ్లీల పూరణలను" నేను ఇంతవరకు శంకరాభరణ వేదికలో చూడ లేదు. ఒక వేళ అటువంటివి ప్రచురించ బడిననూ, శ్రీయుతులు శంకరయ్య గారికి వాటిని వెంటనే తొలగించే హక్కు, సుళువు ఉన్నవి. ప్రతి "సమస్య" ఎవరో ఒకరి మనసునో, మతమునో, రాజకీయ పక్షపాతమునో కొద్దిగనో గొప్పగనో చివుక్కు మనిపించే అవకాశం ఉన్నది (ఉదాహరణకు నిన్నటి పాకిస్తాన్ సమస్య...ఈ "సమస్య" అందముగనే యున్నది... పూరణలు వేర్వేరుగ నున్నవి).
ఈ ప్రశ్న శంకరాభరణం మొదలైనప్పటి నుంచీ నడుచుచున్నది.
ఈ విషయములో నేను శంకరయ్య గారితో ఏకీభవించుచున్నాను. "సొగసైన" సమస్యలు రోజు రోజూ సృష్టించుట అంత తేలిక పని కాదని నా మనవి.
డా.పిట్టా ఆర్యా, ధన్యవాదాలు రంకు, బొంకు ల గూర్చి"శుకసప్తతి కథలు"అనే పుస్తకంలో వెలయాలుగా మారకుండా రోజుకొక కథను ఆమె వెళ్ళబోయే ముందు శుకము చెప్పుతుంది.ఆమె తన ప్రయత్నాన్ని ఆపినట్లు నీతిని అందించే కథలవి.రంకు పెడదారిగా సూచించబడాలని,ఈ సమస్య .రంకుకు బొంకులాడినా లాభం లేదుకాని బొంకుతో రంకును కప్పి పుచ్చ లేమనియే చెప్పడం.
డా.పిట్టా ఆర్యా, ధన్యవాదాలు రంకు, బొంకు ల గూర్చి"శుకసప్తతి కథలు"అనే పుస్తకంలో వెలయాలుగా మారకుండా రోజుకొక కథను ఆమె వెళ్ళబోయే ముందు శుకము చెప్పుతుంది.ఆమె తన ప్రయత్నాన్ని ఆపినట్లు నీతిని అందించే కథలవి.రంకు పెడదారిగా సూచించబడాలని,ఈ సమస్య .రంకుకు బొంకులాడినా లాభం లేదుకాని బొంకుతో రంకును కప్పి పుచ్చ లేమనియే చెప్పడం.
అంక మందు నుండు శంక జంకులు లేక రొక్క మున్న వాని పక్క యింక బొంక నేర్చు నమ్మ పూబోడి నిరుపేద వంక లేనిదమ్మ రంకులాడి
జింకలఁ జూచి నంతటనె చిత్తము నందు ముదంబు పొంగు నీ పంకజ నేత్రకుం గరము పన్నుగ చూచుచు నాడు భామయే శంక పడంగ నేల బహు సద్గుణ రాశియె యీమె సూడ నే వంకలు లేనిదమ్మ పలు భంగుల రంకులు నేర్చు లేమయే
తిండి తిప్పకరువు తిరిపెమ్ము దొరుకదు
రిప్లయితొలగించండియింటినిండ జనము యీదుటెట్లు?
అండలేని బతుకు యరిటాకు చందమే
వంకలేనిదమ్మ రంకులాడి!!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తిండి తిప్పలు' అనాలి కదా! 'దొరుకదు+ఇంటి, జనము+ఈదుటెట్లు + అండ, బతుకు + అరిటాకు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. మీ పద్యానికి నా సవరణ....
తిండి కేమొ కరువు తిరిపెమ్ము దొరుక దీ
యింటినిండ జనులె యీదుటెట్టు
లండలేని బతుకె యరిటాకు చందమే
వంకలేనిదమ్మ రంకులాడి!!
🙏🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిస్త్రీలను కించపరచే యిటువంటి సమస్యలను యివ్వ వద్దని నా మనవి! మన్నింతురుగాక!🙏🙏🙏🙏🙏🙏
రిప్లయితొలగించండిసీతా దేవి గారు:
తొలగించండిదీనిని చిత్తగించండి:
"కంది శంకరయ్యడిసెంబర్ 10, 2011 1:01 PM
రాజారావు గారికి, చంద్రశేఖర్ గారికి, కవిమిత్రులకు మనవి ....
ఇచ్చేదే సమస్య. సమస్య ‘సమస్య’గానే ఉండాలి.
పృచ్ఛకుడు అడిగిన ' సమస్య ' యొక్క భావం చాలా అసంగతంగా, అసంబద్ధంగా, అసందర్భంగా, ఒక్కొక్కసారి అశ్లీలంగా కూడా వుంటుంది. కవి తన ప్రతిభతో దానిని సభ్యతాయుతంగా, అసంభవాన్ని సంభవంగా నిరూపిస్తూ పూరించాలి.
మన దేవుళ్ళపైన అసంగతమైన సమస్యలు ఇప్పటికి ఎన్నో అవధానాలలో పృచ్ఛకులు అడిగారు. కవులు తమ నైపుణ్యంతో వాటిని పూరించి మెప్పించారు.
నేను చూచిన ఒక అవధానంలో పృచ్ఛకుడు ఇచ్చిన సమస్య ...
‘రాముని వంచించి సీత రావణు వలచెన్’
"సీతవంటి లోకోత్తర పతివ్రతను గురించి ఇలా చెప్పడం భావ్యమా? సంస్కారమా?" అని ఆ సభలో ఎవరూ ప్రశ్నించలేదు. కవికూడా యుక్తియుక్తంగా సమస్యను పూరించి అందరి మెప్పు పొందాడు. కొన్ని కొన్ని సమస్యాపాదాలను చూడగానే మనస్సు నొచ్చుకొనవచ్చు. మరికొన్ని సమస్యలను వినగానే అసభ్యంగా ఉండి రోత కలిగించవచ్చు.
సమస్యలోని అసంగతాన్ని తొలగించడమే కదా కవుల పని. స్వస్తి!"
...మీ పూరణ చాలా బాగున్నది...
తొలగించండి🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిధన్యవాదాలు! ఎప్పటి నా సమాధానం? నాకే గుర్తు లేదు. మీ ఓపికకు నా నమస్సులు.
సార్! నేను శంకరాభరణం లో డాక్టరేట్ చేయుచున్నాను 😊😊😊😊
తొలగించండి__/\__
తొలగించండిడా. సీతాదేవి గారితో నేనేకీభవిస్తున్నాను. అశ్లీలగోచరమును సౌశీల్యముగా మార్చువారి నుద్దేశించి యిచ్చినా కొందరు మరికొంత యశ్లీలతను జోడించి వ్రాయ నవకాశమును, మనకట్టి పూరణలను వీక్షించు దుస్తితిని కల్పించ కుండుట కైనా యిట్టి సమస్యలను విసర్జించితే మంచిదని నా యభిప్రాయము.
తొలగించండి🙏🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిపూజ్యులు కామేశ్వర రావు గారు:
తొలగించండిమీరు సూచించిన "అశ్లీల పూరణలను" నేను ఇంతవరకు శంకరాభరణ వేదికలో చూడ లేదు. ఒక వేళ అటువంటివి ప్రచురించ బడిననూ, శ్రీయుతులు శంకరయ్య గారికి వాటిని వెంటనే తొలగించే హక్కు, సుళువు ఉన్నవి. ప్రతి "సమస్య" ఎవరో ఒకరి మనసునో, మతమునో, రాజకీయ పక్షపాతమునో కొద్దిగనో గొప్పగనో చివుక్కు మనిపించే అవకాశం ఉన్నది (ఉదాహరణకు నిన్నటి పాకిస్తాన్ సమస్య...ఈ "సమస్య" అందముగనే యున్నది... పూరణలు వేర్వేరుగ నున్నవి).
ఈ ప్రశ్న శంకరాభరణం మొదలైనప్పటి నుంచీ నడుచుచున్నది.
ఈ విషయములో నేను శంకరయ్య గారితో ఏకీభవించుచున్నాను. "సొగసైన" సమస్యలు రోజు రోజూ సృష్టించుట అంత తేలిక పని కాదని నా మనవి.
స్వస్తి...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి"మయి చానన్యయోగేన భక్తిర వ్యభిచారిణీ"
రిప్లయితొలగించండిచపల చిత్త మెపుడచంచల మగునొకొ
ధ్యాన బలము చేత జ్ఞాన మొందు
పాప పుణ్యములను పార ద్రోలు మనసె
వంక లేనిదమ్మ రంకులాడి
నిస్సందేహంగా ఉత్తమమైనపూరణ.
తొలగించండిధన్యవాదములు మిస్సన్న గారు!
తొలగించండిక్రుళ్ళుతున్న యుగము గురజాడ వారిది
రిప్లయితొలగించండిబ్రాహ్మణత్వ మాయె బ్రహ్మహత్య;
మధురమైన మనసు మధురవాణిది సొత్తు
వంక లేనిదమ్మ రంకులాడి
* క్రుళ్ళుచున్న
తొలగించండిమీ మొదటి పూరణ అద్భుతం!!💐💐💐
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశంసార్హంగా ఉన్నవి. అభినందనలు.
పంకమందునున్న పద్మము వెగటౌనె?
రిప్లయితొలగించండిసంకటంబుఁదీర్చు సామి తగడె?
వంకలెన్నువారు వంద్యులు కారు-యే
వంక లేనిదమ్మ రంకులాడి
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కారు+ఏ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'వంద్యు లగుదుర? యే...' అనండి.
ధన్యవాదాలు
తొలగించండిజలగ వంటి జనుల సంతసంబు కొఱకు
రిప్లయితొలగించండితనదు ప్రాణ ములను పణము పెట్టి
విలువ లేని బ్రతుకు వెలయాలిగా నెంచు
వంక లేని దమ్మ రంకు లాడి
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చక్కదనము మెండు, చల్లని మనముతో
రిప్లయితొలగించండివంక లేనిదమ్మ,, రంకు లాడి
కాదు, రమ్యచరిత కాంతితాను కుటుంబ
శ్రేయమరసి మనకు శ్రీల నిచ్చు
శ్రీరామ్ గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిబొంక నేర్వనట్టి బోటికి తగవవి
రంకు చేష్టలనుచు రహిని దెల్పి
శంక దీర్చ కులట సాగును రతికని
వంక లేనిదమ్మ రంకులాడి!
డా.పిట్టా
రిప్లయితొలగించండి"'బొంకుల నారి' మాటలను పొంకముగా బొనరించునే చెవిన్
రంకుల నూను,సత్యమునురాజను యేసతియైన"నన్న యా
శంకయె యింటనున్ కలహ సాకుల కారడిగాగ, నిండుగా
వంకలు లేనిదమ్మ పలు భంగుల రంకులు నేర్చు లేమయే!
డా.పిట్టా
రిప్లయితొలగించండిబొంక నేర్వనట్టి బోటికి తగవవి
రంకు చేష్టలనుచు రహిని దెల్పి
శంక దీర్చ కులట సాగును రతికని
వంక లేనిదమ్మ రంకులాడి!
డా.పిట్టా
రిప్లయితొలగించండి'బొంకుల నారి'కి ప్రమాణము:
అల్లుని మంచితనంబును॥గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్॥భొల్లున దంచిన బియ్యము॥తెల్లని కాకులును లేవు తెలియర సుమతీ, ఇది అనుమానమే.జాగ్రత పాటించే క్రమంలో కేవలం బొంకులాడే స్త్రీనే నమ్మి మోసపోతారుకదా అనే ధ్వనియేగాని మహిళలను కించ పరచడం ఉద్దేశ్యము కాదని తల్లులు, సోదరీ మణులు భావించవలెనని మనవి.
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టా
తొలగించండిఆర్యా, ధన్యవాదాలు
రంకు, బొంకు ల గూర్చి"శుకసప్తతి కథలు"అనే పుస్తకంలో వెలయాలుగా మారకుండా రోజుకొక కథను ఆమె వెళ్ళబోయే ముందు శుకము చెప్పుతుంది.ఆమె తన ప్రయత్నాన్ని ఆపినట్లు నీతిని అందించే కథలవి.రంకు పెడదారిగా సూచించబడాలని,ఈ సమస్య .రంకుకు బొంకులాడినా లాభం లేదుకాని బొంకుతో రంకును కప్పి పుచ్చ లేమనియే చెప్పడం.
డా.పిట్టా
తొలగించండిఆర్యా, ధన్యవాదాలు
రంకు, బొంకు ల గూర్చి"శుకసప్తతి కథలు"అనే పుస్తకంలో వెలయాలుగా మారకుండా రోజుకొక కథను ఆమె వెళ్ళబోయే ముందు శుకము చెప్పుతుంది.ఆమె తన ప్రయత్నాన్ని ఆపినట్లు నీతిని అందించే కథలవి.రంకు పెడదారిగా సూచించబడాలని,ఈ సమస్య .రంకుకు బొంకులాడినా లాభం లేదుకాని బొంకుతో రంకును కప్పి పుచ్చ లేమనియే చెప్పడం.
బొంకు పలుక వచ్చు పొట్ట నింపు కొనగ
రిప్లయితొలగించండిచింకి బట్ట కట్టి సిగ్గు విడచి
కంకు లెల్ల నోట పెంకిగ కూసినా
వంక లేనిదమ్మ రంకు లాడి !!
శంకర ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తిఁ గృష్ణు గొలిచి , భావించి దేహమ్ము
రిప్లయితొలగించండిమూత్ర రక్త మాంస పాత్ర యనుచు ,
పడుపు వృత్తినున్న భామ చింతామణి
వంకలేనిదమ్మ ! రంకులాడి !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిచింతామణిని ప్రస్తావించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
మాన ధనము పోయి, మగడుఛీ కొట్టగా,
రిప్లయితొలగించండిపరువు పోయి సుతుని కొరకు పడుపు
బాట నెంచు కొనెడు భరత స్త్రీ యెప్పుడు
వంక లేని దమ్మ రంకు లాడి
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకలు వద్దు వల్లభుని చక్కగ జూచును, బిడ్జలిద్దరున్
రిప్లయితొలగించండిపెంకిగనుండినన్ సైచు,పెద్దలయందున భక్తి జూపు,చా
లింక పొగడ్తలీపురుషులే చెడగొట్టిరిగాని తానుగా
వంకలు లేనిదమ్మ పలుభంగుల రంకులు నేర్చులెమయే
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సైచు' అన్నచోట గణభంగం. 'సయిచు' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విటుని నుర్రూత...' అనండి.
హొయలఁ జిలికి విటుని నుర్రూతలూగించి
తొలగించండితొలివలపుల నేలు దొరవటంచు
సిరులఁ గొనుచు సరస శృంగారమున దేల్చ
వంక లేనిదమ్మ! రంకులాడి!!
పెద్ద చదువు చదివి పెంపొంది మున్ముందు
రిప్లయితొలగించండితమల నుద్ధరించు తనయు కొరకు
విటుల సరస జేరి విత్తమ్ముగొనెగాని
వంక లేనిదమ్మ రంకులాడి
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తమల'? 'తమ్ము నుద్ధరించు' అనండి.
కూటికొరకు గాదె కోటి వృత్తులు సరి
రిప్లయితొలగించండిదినము గడుప తనకు దిక్కులేదు
రోజుకొక్కరైన మోజు రావలె తన
వంక, లేని దమ్మ రంకు లాడి
గోలి వారూ,
తొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
శభాష్! గోలివారూ!
తొలగించండిమాస్టరుగారికి, సహదేవుడు గారికి ధన్యవాదములు.
తొలగించండివంక లేని దమ్మ రంకు లాడి యనుట
రిప్లయితొలగించండిపాడి యగునె సామి ! భామ లనగ
పూజ్యు లుగద మనకు పూర్వకాలమునుండి
యాది శక్తి రూపు లార్య !వారు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబింకపు ముచ్చటన్ సొగసు పేడిని సైతము రెచ్చఁగొట్టెడున్
తొలగించండిపంకములోని పద్మమన పల్లవపాణి భుజాంతరమ్మునన్
శంకలు వీడ విప్రునకు సాంత్వన నిచ్చెడు దేవదేవి యే
వంకలు లేనిదమ్మ! పలు భంగుల రంకులు నేర్చు లేమయే!!
వంకలు లేనిదమ్మ పలు భంగుల రం కులు నేర్చు లేమయే
రిప్లయితొలగించండిశంకర యేమియంత కసి సాధ్వులు వారలు సింత జేయఁగన్
బింకము గాదె వారలటు పాడయిపోవుట కారణంబు సూ
రంకుగ మార్చిరే గదిల రాజులు పూర్వము వారినయ్యెడన్
కులము వృత్తి జేసి కూటికి జరుపుచు
రిప్లయితొలగించండిబతుకు తెరవు గడపు భామ తాను
చెడెను తానె గాని చెడపదు నెవ్వరి
వంక లేనిదమ్మ రంకులాడి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంక మందు నుండు శంక జంకులు లేక
తొలగించండిరొక్క మున్న వాని పక్క యింక
బొంక నేర్చు నమ్మ పూబోడి నిరుపేద
వంక లేనిదమ్మ రంకులాడి
జింకలఁ జూచి నంతటనె చిత్తము నందు ముదంబు పొంగు నీ
పంకజ నేత్రకుం గరము పన్నుగ చూచుచు నాడు భామయే
శంక పడంగ నేల బహు సద్గుణ రాశియె యీమె సూడ నే
వంకలు లేనిదమ్మ పలు భంగుల రంకులు నేర్చు లేమయే
[రంకులున్+ఏర్చు=రంకులు నేర్చు; రంకు = తెల్లనివెండ్రుకలును మెత్తనితోలును గల యిఱ్ఱి (జింక); ఏర్చు= ఎన్ను
కామేశ్వరరావుగారికి నమశ్సతములు.అద్భుతం.
తొలగించండిమిస్సన్న గారు నమస్కారములు. ధన్యవాదములును.
తొలగించండిబింకమైన వయసు పొంకంపు సొగసున్న
రిప్లయితొలగించండిపెంటి పిచుక, తాను,ప్రేమ మీర,
శాబకముల నోట చక్కగా తినుపించు
వంకలేని దమ్మ "రంకులాడి""
వంశినూదుచున్న వంశీధరునిగూడ
రిప్లయితొలగించండిజంకులేక గోపజనము చెలగ
నాత్మనాత్మ గలియ నదియె రాసక్రీడ
వంకలేనిదమ్మ రంకులాడి!
పూర్ణ చందు వోలె భూసుత సీతమ్మ
రిప్లయితొలగించండివంక లేని దమ్మ! రంకులాడి
ప్రజలు గర్భవతిని పంపిరే కానకే!
నిష్కృ తే దయోధ్య నేరమునకు?
రంకు = అపవాదు, నింద
హీనవంశమందు కూనగా బుట్టితి
రిప్లయితొలగించండిదల్లి మాట వినక తప్పదనుచు
పరపురుషులతోడ బ్రతుకునీడ్చెడి చిఱు
వంక లేని దమ్మ రంకు లాడి
అశ్లీలమనియుజూడక
రిప్లయితొలగించండిసశ్లీలముకలుగునటుల జక్కగ దానిన్
విశ్లేషించియుప్రతిభను
నశ్లీలముదొలగునటుల వ్రాయగ వలయున్
పంకమటంచు తల్చక ప్రభాతమునుండియు నార్జనన్ గొనన్
రిప్లయితొలగించండిజంకను మాట మానసపు సాగరమందునఁ జేర్చకుండగా
బొంకుచు నమ్మమాటలను పూర్తిగనమ్మిచరించు జాణ యే
వంకలు లేనిదమ్మ పలు భంగుల రంకులు నేర్చు లేమయే
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివేశ్య కులము నందు వెలయు చుండెడి కాంత
కట్టుబాట్ల కొదిగి కదలు చుండి
వృత్తియె నమృతమని పేర్కొనునట్టి దా
వంక లేని దమ్మ రంకులాడి
బింకమసలు గనము బిడియమ్ము సున్నరా!
రిప్లయితొలగించండిఎంత వారికైనా సొంత మనిషి
ప్రేమ పంచు తాను భేదభావము లేక
వంక లేనిదమ్ము రంకు లాడి!
బింకమొకింతలేక తన ప్రేమను గోరు జనాళి కెప్పుడున్
శంకను వీడి పంచుర!రసాను భవమ్మును జెంతచేరుచున్!
సంకట హారిణీ!సరస సాముల కెల్లను తాపమార్పగన్
వంకలు లేనిదమ్మ పలు భంగుల రంకులు నేర్చు లేమయే
శంకలేక, శిశువుఁ చంకనెత్తక తన
రిప్లయితొలగించండిపడుచు దనపు బిగువు సడల నీక,
తిండి కొఱకు నిశిని తిప్పలు పడు నాతి
వంక లేనిదమ్మ రంకులాడి
బాల్యమందె ముసలి వాని కూడు పడతి
రిప్లయితొలగించండిపరిణయము నెదురగ పాటు పడియె
మహిళ బ్రతుకు కాచ రహిని మధురవాణి
వంక లేనిదమ్మ రంకు లాడి!
రిప్లయితొలగించండితెలివి చూపి తాను వలచె కృష్ణ విభుని
వంక లేని దమ్మ రంకులాడి
యైన నీతి విడక యనవరతము కొల్చి
మాన్య యయ్యె మగువ మహిని తాను.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
మెతుకు కోసమనుచు గతిలేని స్థితిలోన
వృత్తిలోకి దిగిన వేశ్య, విటుల
కున్ సుఖమ్మునిచ్చు కోరిక మేరకు
వంక లేనిదమ్మ రంకుటాలు.
*****************************
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిచీఁకు చింత లేని చింతామణిని బిల్హ
ణుండు మెచ్చి పల్కె నొక్కనాఁడు;
"పుడమి లోన మిగుల బొంకునేర్చినయట్టి
వంకలేనిదమ్మ ఱంకులాఁడి!"
చింతామణిని పరిచయం చేస్తూ.....
రిప్లయితొలగించండివంకలు లేనిదమ్మ ! పలు భంగుల రంకులు నేర్చు లేమ , యే...
ణాంకుని బోలు నెమ్మొగము , నందము జూడుడు మత్తు గొల్పు , మీ..
నాంకుని కేళి దేల్చి యధరామృతపాననివేదనమ్మిడున్
శంకయె లేదు! రండనుచు చక్కగ శ్రీహరి పిల్చె పాంథులన్ !!
వంకలు లేనిదమ్మ పలు భంగుల రంకులు నేర్చు లేమయే
పంకిల గాదు , విష్ణుపదభక్తి నటించుచు విప్రదేవునిన్
పొంకము జూపి పొందుగొనె పోడిమి నందనవాటి , దేవయా
న్యంకము జేరు బాపనికి ఆ హరి రక్షకుడయ్యె గాంచుడీ !!
వంకలు లేనిదమ్మ పలు భంగుల రంకులు నేర్చు లేమ , యే
పంకమునందు బుట్టినను పంకజమున్ మలినమ్ములంటునే ?
శంకయె లేదు పంతులొక సానిని జేరగదీయనామె, యే
వంకరలేనిదై మధురవాణిగ కీర్తిగడించె సాహితిన్ !!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిరోజంతా ప్రయాణం చేసి ఇంతకుముందే ఇల్లు చేరాను. ప్రయాణపు బడలిక వల్ల మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.
మహిళలందునెన్న మణిపూస వెదుకనే
రిప్లయితొలగించండివంకలేనిదమ్మ రంకులాడి
అనుచు పొగిడె మిగుల నక్కసు గనరాగ
సభన తప్ప దనిన సగటు మహిళ
ఆ పతివ్రత మది నంతయున్ స్వార్ధమే
రిప్లయితొలగించండిఈర్ష్య తప్ప ప్రేమ నెరుగ దెపుడు
నీమె రంకులాడి యే మానవత్వాన
వంక లేని దమ్మ రంకు లాడి
అంకెలు మెండు కూడుచును హంగులు మీరగ వోట్ల కోసమై
రిప్లయితొలగించండిచంకలు నాకి వీడి పలు జాతుల నేతల నెన్నికందునన్
రంకెలు వేసి వేడుకొని రంగులు మార్చెడి రాజకీయమే
వంకలు లేనిదమ్మ పలు భంగుల రంకులు నేర్చు లేమయే!