18, జూన్ 2017, ఆదివారం

దత్తపది - 116 (పద్యము-గద్యము-మద్యము-హృద్యము)

"పద్యము - గద్యము - మద్యము - హృద్యము"
పై పదాలను ఉపయోగిస్తూ
కవిత్వం యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

59 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. పద్యము గద్యము పాటయు
      మద్యమ్మౌ కవివరులగు మహనీయులకున్
      హృద్యమ్మౌ శ్రోతలకును
      చోద్యము కించిత్తు లేదు శోభిల్లంగన్

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      హృద్యమైన పద్యంతో శుభారంభం చేశారు. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  2. పద్యము పోతన హృదయము
    గద్యము నల్లంగ నతడు ఘటికుడు గాదే
    మధ్యము పానము కంటెను
    హృద్యముగా నుండు నంట హృద్గత మౌగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మద్యమును గ్రోలు కంటెను' అనండి.

      తొలగించండి
  3. పద్యము పండిత పాఠము
    గద్యము పామరహృదయము గడుసరితనమున్
    మద్యము మత్తిల జేయును
    హృద్యము ఖయ్యామ్ గజళ్ళు హేలగ పాడన్!

    రిప్లయితొలగించండి
  4. పద్యము రసాభిషేకము
    గద్యము గమనంబు నందు గతిగొని సాగన్
    మద్యము సరిరా దిచ్చట
    హృద్యము సాహిత్యసీమ హిత మరయంగన్!

    రిప్లయితొలగించండి
  5. ఉ . పద్యమొ పాటయో పలుక భావము నింపుచు హృద్యమే గదా
    గద్యము నేర్పుతో నుడువ కమ్మగ నెల్లరకున్ రుచించులే
    మద్యము తప్పనౌ గఝలు మాదురి స్వాదన లో తపించగా
    చోద్యము కాదులే !సరళ సున్నిత , పద్యము వ్రాత తేలికే !!

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    పద్యము హృద్యమన్న పలు భాతుల నాటక వాచకంపు నై
    వేద్యము నొల్లకే సగటు పేలవ గద్యము గాచిరీ యిలన్
    మద్యము ద్రాగి పాడిరదె మాదిది విద్య యటంచు నిష్టమౌ
    సేద్యము జేయ సంస్కృతియె చిల్లులువారె కవిత్వపుం బ్రభన్!!

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టానుండి
    ఆర్యా, మొన్నటి తెలం.ఆవిర్భావ వేళ కందము వ్రాసి యగరుగని యువకునికి వరంగల్ లో "కవి" శ్రేష్ఠునిగా
    రు.51,116 ల పురస్కారం ఎలా యిచ్చారని అడిగిన వారు లేరు.సాంప్రదాయమున్నూ మనది కాదతనిది.ఇదీ మన పారదర్శికత!సమయానుగుణంగా, కాకతాళీయంగా మీ కలం నుండి జాలువారిన సమస్య, సంస్కరణాత్మకమైనది,అభినందనలు.నా పలుకులను కనీ‌సం పద్యకవుల వరకైనా బ్లాగ్ ద్వారా చేర వేయ మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యకవులకు గుర్తింపు లేదన్న మీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. ఏం చేద్దాం? ఏ రంగంలోనైనా సంప్రదాయం నిర్లక్ష్యం చేయబడుతూనే ఉన్నది.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా, కృతజ్ఞతలు

      తొలగించండి
  8. వేకువ ఝామున పద్యము ,
    కాకులు లేచిన సమయము గద్యము గురువా
    ప్రాకిన మద్యపు మత్తులు
    తాకు హృ ధ్యమయిన ఘజళ్లు తానిషనైనా !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర ప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరిపాదంలో గణదోషం. "తాకును హృద్యపు గజళ్ళు ..." అనండి.

      తొలగించండి
  9. పద్యము వ్రాయుట సులభము
    గద్యము మెప్పించ నమిత కష్టంబగు; శ్రీ
    మద్యమునా తట విహార
    హృద్య ముకుంద స్తవమె ప్రహృష్టము మాకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయకుమార్ గారూ,
      మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
      మూడవ పాదం మూడవ గణంగా నిషిద్ధ జగణాన్ని వేశారు. అక్కడ "తట విహరణ" అనండి.

      తొలగించండి
    2. పద్యము వ్రాయుట సులభము
      గద్యము మెప్పించ నమిత కష్టంబగు; శ్రీ
      మద్యమునా తట విహరణ
      హృద్య ముకుంద స్తవమె ప్రహృష్టము మాకున్

      - విహరణ అని సరి చేసిన తరువాత మీ సవరణ చూసాను. మీరూ అదే సూచించారు. 🙏

      తొలగించండి
  10. గద్యము కాదు కాదు రసగంధములొల్కుచు ఛందబద్ధమై
    హృద్యము కాగ సీసములు నుత్పలమాలలు చంపకమ్ములున్
    పద్యములై చెలంగు బహుభంగుల వృత్తములన్ లిఖింపగన్
    మద్యము కంటె మత్తుగొని మానసమెంతయు సోలిపోవదే
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      'ఛందోబద్ధము' సాధువు కదా! అక్కడ "శాస్త్రబద్ధమై" అనండి.

      తొలగించండి
  11. పద్యము హృద్యము తానిక
    గద్యముతో గూడి యుండి కడు రమ్యంబై
    సద్యశ మొసగెడు వాఙ్మయ
    మద్యముగా ముదము గూర్చు మదులకు నెపుడున్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  12. పద్యము మాధురీ ఝరులు పారెడు భాసుర దీప్తిభావనన్
    గద్యమునాపివేసి మదివికాసత నొందగ పద్యదేనెలన్
    మద్యమురీతి గ్రోలనది మానస మందున పొంగిపొర్లగా
    హృద్యముగొల్పు పద్యసిత హేలలు వెల్గులు జిమ్మెనో నిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "గద్యము నాపివేసియు వికాసము నొందగ..." అనండి.

      తొలగించండి
  13. పద్యము రాగరంజిత వి
    భాకలితంబది రక్తిగొల్పగన్
    గద్యము సుందరాత్మకు వి
    కాసములద్దెడి భావవీచిలో
    మద్యము నీకదేల నిక
    మంజుల రాగ మరంద ధారలై
    హృద్యముగాగ కావ్యరస
    హేలలనాడు ప్రభావగీతముల్!

    రిప్లయితొలగించండి
  14. సిగరెట్టు దమ్ముతో చిత్రసీమ కవులు
    గద్యములను గొని పద్యములుగ
    రచియించ,గాయకుల్ రమణీయముగ పాడి
    మద్యము మత్తు సమముగ మనసు
    రంజింప చేసెను ,రంభాది అప్సర
    సలుకు దీటుగ నృత్యములను చేసి
    మనుజల హృద్యము మైమరుపు తోనింపె
    నర్తకీ మణులు ఘనతల నిడుచు,


    ఆటగత్తె యాడును మంచి పాట పాడ,
    గాయకుండు పాడును మంచి కవిత నీయ,
    కవులు కావ్యము లెప్పుడు ఘనత నొందు
    ఇంటికి పునాది భంగిన ఎదురు లేక ,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రంభాది+అప్సరస' లన్నపుడు యణాదేశ సంధి వస్తుంది. విసంధిగా వ్రాయరాదు. 'మైమరుపు' అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
  15. పద్యముపద్యమే పరవశింపగజేసి
    .....పఠితల నానందవార్థి ముంచు
    గద్యముగద్యమే గద్యమందునగూడ
    .....కైతలుచెప్పెడి ఘనులుకలరు
    మద్యముమద్యమ న్మాటనుతలతురే
    .....పద్యసుధాపాన వ్యసనులైన
    హృద్యముహృద్యమే యిసుమంతయున్ రాదు .....విసువని పొగడరే విన్నవారు

    పద్యకైతలు హృద్యమౌ గద్యములును
    మంచి సాహిత్యజలధి లభించుమణులు
    మునిగి గాలించి వెలిదీసి మోదమలర
    ననుభవించెడివారి భాగ్యమె ఘనమ్ము.

    రిప్లయితొలగించండి
  16. గురుదేవా సవరించిన ది
    సిగరెట్టు దమ్ముతో చిత్రసీమ కవులు
    గద్యము లను గొని పద్యములుగ
    రచియించ,గాయకుల్ రమణీయముగ పాడి
    మద్యము మత్తు సమముగ మనసు
    రంజింప చేసెను ,రంభాది యప్సర
    సలుకు దీటుగ నృత్యములను చేసి
    మనుజల హృద్యము మైకము తోనింపె
    నర్తకీ మణులు ఘనతల నిడుచు,


    ఆటగత్తె యాడును మంచి పాట పాడ,
    గాయకుండు పాడును మంచి కవిత నీయ,
    కవులు కావ్యము లెప్పుడు ఘనత నొందు
    ఇంటికి పునాది భంగిన ఎదురు లేక ,


    రిప్లయితొలగించండి
  17. యౌగపద్యమున హృదయ మలర వలయు
    శబ్ద భావోచితమ్ముల సరసముగ సు
    గద్యమునయి హృద్యమునోర్మికా నిభ పద
    యోగ మహిమ మద్యము ఘోరు నూరడింప

    [యౌగపద్యము=ఏకకాలమందగుట; సుగద్యము = బాగుగా చెప్పఁదగినది; హృత్+యమునా+ ఊర్మికా = హృద్యమునోర్మికా = హృదయమను యమునా నదీ తరంగములు; మత్+ యముడు = మద్యముడు (నాలో యున్న యముడు)]

    రిప్లయితొలగించండి
  18. మద్యమునకేది హృద్యము?
    గద్యము పద హంసకముల ఘల్లున మ్రోగన్
    పద్యము రసభరితమ్మై
    ఆద్యంతము హృదయసీమ నలరించు గదా.

    రిప్లయితొలగించండి
  19. పద్యమున్నకవన వనము
    పరిమళించునెంతయున్
    గద్యమిడును వర్ణశోభ
    కలిమి మనసుకింపుగన్
    మద్యమటుల దివ్యలోక
    మందునిలుపు కవనమే
    హృద్యమగును పఠిత రసిక
    హృదయకోటి కెల్లెడన్

    ,,,,,.,,,........ అమరవాది రాజశేఖర శర్మ

    రిప్లయితొలగించండి
  20. గద్యము కన్నా మిన్నగ
    పద్యము లనుమెచ్చుగాదె పామరు లైనన్
    హృద్యముగా పద్యములను
    మద్యము వలె గ్రోలుచున్న మైమరపించున్!!!

    రిప్లయితొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.

    పద్యము రసరంజితమౌ

    గద్యమ్ము రసానుభూతి కలిగించునుగా

    హృద్యము తెలుగున రెండును

    మద్యమ్మిడు మత్తు పగిది మనసును
    దోచున్.
    ****************************

    రిప్లయితొలగించండి
  22. పద్యము కదలించును గా
    ద్గద్యము కలిగించునోయి కవితా ఝరియై
    మద్యం బొసగని యా సౌ
    హృద్యము, చిత్తి, కవనము సుకృతముం జేయున్

    రిప్లయితొలగించండి
  23. పద్యమెపుడు నాలుకలపై పలుకుచుండు
    గద్యము చదివినఁ దనివి కలుగఁ జేయు
    మద్యమునుగొని నట్టి సమయమునందు
    హృద్యముగ వ్రాయ తరమౌన యింపుగాను

    రిప్లయితొలగించండి
  24. పద్యము కందం బగుచో
    మద్యము వలె విందు గొలుపు మాన్య కవులకున్
    గద్యము నంత్య ప్రాసలు
    హృద్యమముగ నుండు నెపు డహీనము గాగన్

    అహీనము = హీనము కానిది

    రిప్లయితొలగించండి
  25. ఈ రోజు నాన్నల పండుగ సందర్బంగా..
    1.పద్యము హృద్యమంచునను పాడగ మంటివి చిన్ననాటనే
    చోద్యమదేమొగానిమది సొంపక మానితి మందబుద్ధినై
    గద్యము గంధమంచు చిరు గ్రంధము లెన్నియొ నందజేసినన్
    తధ్యమటంచు నెంచనుగ తండ్రి!మనంబున నీదుపల్కులన్
    మిధ్యగ మారెనిప్పుడవి,మించెను కాలము నేర్వసాధ్యమా!
    మద్యము లైనపల్కులను మానిన భాగ్యము నెట్లుదెల్పెదన్

    మద్యము=ప్రియము
    2.పద్యము ప్రాణమై తెలుగు భాషను వర్ధిల జేసెనెల్లడన్
    గద్యము వేణిియై తెలుగు గంగను పొంగగ జేసెఉద్ధృతిన్
    మద్యమనంగ బాఱెనిల మత్తును నింపగ సీసపద్యముల్
    హృద్యము లైనపద్యములు హేలగ లీలగ వెల్గెతెల్గులో

    రిప్లయితొలగించండి
  26. ఓ శ్రీమతి తాను భారతితో...

    గద్యము నీ ప్రసాదమని కళ్లకు నద్దుచు స్వీకరించుఁ దా
    పద్యము తీర్థరాజమని పాడుచు గైకొను తన్మయమ్మునన్
    మద్యము త్రాగినట్లు! సుధ మానస చేతన మిచ్చునట్లుగన్
    హృద్యము గొల్పు భావనల నేర్పడజేయవె నాదు భర్తకున్!

    రిప్లయితొలగించండి
  27. పద్యమే హృదయానురాగ నిబద్ధమై సుధలూరెడిన్
    గద్యవైఖరి సూరి,పోతన,కావ్యరీతులు చాటెడిన్
    మద్యమిచ్చిన మత్తులో కవి మానసంబుప్పొంగగా
    హృద్యమై యనవద్యమైకవితామృతం బొగి పారెడున్

    రిప్లయితొలగించండి
  28. హృద్యమై యనవద్యమై కవినేలుగాపుతకైతలున్
    అని చివరి పాదలో ఉండవలెను పొరపాటుకు క్షమార్హుడను

    రిప్లయితొలగించండి
  29. పద్యము రూపము నైనను
    గద్య ముగానైన వ్రాయుకవితలు వినగన్
    మద్యము ద్రాగిన మాదిరి
    హృద్యము గానుండి మనలనోలాడించున్

    రిప్లయితొలగించండి
  30. ఓ శ్రీమతి తాను భారతితో...

    గద్యము నీ ప్రసాదమని కళ్లకు నద్దుచు స్వీకరించుఁ దా
    పద్యము తీర్థరాజమని పాడుచు గైకొను తన్మయమ్మునన్
    మద్యము త్రాగినట్లు! సుధ మానస చేతన మిచ్చునట్లుగన్
    హృద్యము గొల్పు భావనల నేర్పడజేయవె నాదు భర్తకున్!

    రిప్లయితొలగించండి
  31. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పద్యమ్ము ధార వలనను
    గద్యమ్ము పదకుదిరికల గాఢత తోడన్
    మద్యమ్ము నధిక కైపున
    హృద్యమ్మై నవి సరసుల హృది తేలించున్

    రిప్లయితొలగించండి




  32. పద్యమైననుపరికింప గద్య మైన

    జనులనాకట్టు కొనుచున్న సంతతంబు

    హృద్యమగుచు పాఠకులకు తృప్తి నొసగి

    మద్యములు త్రాగినట్లుండు మహిని నిజము.



    మద్యము త్రాగినవాడున్

    పద్యములను చెప్పగలడు వసుధా స్థలిలో

    హృద్యంబుగ నద్దానిని

    గద్యములో చెప్పుచు జనుల గాభర బెట్టున్.


    సద్యస్ఫూర్తిని  జూపుచు

    పద్యములనల్లుచుండు  వదలక నెపుడున్

    గద్యము లేకయె భువిలో

    మద్యము పైననుసతతము మానుగ కవియున్.


    పద్యరచనమన్న వసుధలో కొందరు

    హృద్యమనుచు  నుందు రెల్ల వేళ

    గద్యమన్ననుమరి కఠినము కాదంచు

    మద్యము వలె  నొసగు మత్తటంచు.

    రిప్లయితొలగించండి
  33. 3.పద్యమొక్కటి వ్రాయగా మది పండు వెన్నెల నిండులే
    గద్యమొక్కటి వ్రాయగా మది గండు కోయిల చందమౌ
    మద్యమందున లేని మత్తును మంచి పద్యము నిచ్చులే
    హృద్యమే కద!పద్య వేదిక హేమ భాసుర మానమై


    4.పద్యమొక్కటి దక్క పాలింతు విశ్వంబు రాజరాజు నగుచు తేజముగను
    గద్యమొక్కటి దక్క కరిగింతు రాళ్ళను కథలనల్లి మనసు వ్యధలు గిల్లి
    మద్యమక్కట నోడు మత్తుజల్లుటలోన మాదు సీసములను పాదుకొల్ప
    హృద్యమగుచు వెల్గు నాద్యంతములు నాదు తెల్గు కైత కలువ తేజరిల్లి

    పద్య రాజములకు పల్కు గీతమిదియె!
    గద్య కీర్తి కిదియె గాన మరయ!
    మద్య మాధురులకు మరి దెల్పనా స్వస్తి!
    హృద్య పద్యములకు హృదయ మొసఁగి!!

    రిప్లయితొలగించండి
  34. పద్యము వ్రాయు నట్టి కవి పావన భారత భూమియందునన్
    గద్యము తోడనూ కవిత గానము జేయు పురాణపూరుషుల్
    మద్యము త్రాగరే కవులు మానసమేసుగుణాలమాధురీ
    హృద్యము గాకవిత్వమును హృద్యము గా మన బ్లాగు నందు నన్

    రిప్లయితొలగించండి
  35. పద్యము ఛందో బద్దము
    గద్యమునకునియమమేది గనబడదెపుడున్
    మద్యముపైహృద్యములగు
    పద్యములును గద్యములునుప్రకటంబయ్యెన్ !!!

    రిప్లయితొలగించండి
  36. గద్య పద్య మయీ వాణీ "చంపూ" రిత్యభిధీయతే!

    గద్యము భారతీసతికి గాంచుచు వామపయోధరమ్ముగా ,
    పద్యమునెంచి దక్షిణపు భాగ కుచమ్మని , ప్రీతి గ్రోలి శ్రీ...
    మద్యమునాపగా పులిన మంజుల సంచరణానురక్తునిన్
    హృద్యముగా దలంప ప్రభవింపదె కావ్యము *చంపువై* మహిన్ !!

    *గద్యము* కవితామృతమౌ
    *పద్యము* రస రాగ భావ బంధుర సుధయౌ !
    *మద్యము*లే యుభయమ్ములు!
    *హృద్యము*లజరామరములివే సుఖదమ్ముల్ !!



    రిప్లయితొలగించండి
  37. సరదాగా..
    5.పద్యమందు నేను పండితుడను గాను
    గద్యమందు నేను ఘనుఁడ గాను
    మద్య మాధురులను మదియించ లేదింక
    హృద్య మండ్రు దాని మద్య ప్రియులు


    6.తెలుగు మరంద మాధురులు తెల్యగ జేసెను పద్యముల్ భళా!
    కలిగె రసాను భూతులవి కావ్యము లందున గద్యమొప్పగన్
    ఒలికె పదాలు కీర్తనలు హో యన మద్యము వోలె తెల్గునన్
    పలికె నసంఖ్య రీతులవి పల్లవ మొందుచు హృద్య మైయిటన్!
    శ్రీహర్ష

    రిప్లయితొలగించండి



  38. ఉ:పద్యములోన చెప్పగనె భావము చక్కగ నర్థమై సదా

      హృద్యమటంచుగద్యమును హేలగ వీనుల విందుకాగ నే

     విద్యయు లేనియట్టి ప్రజ వేడుక తోడను నాలకింపగా

    మద్యము త్రాగుటన్ విడిచి మానుగ కూటము చేరిరచ్చటన్.

    రిప్లయితొలగించండి
  39. పద్యము ఛందబద్ధమగు భావపరంపర యెంచిచూడగన్
    గద్యము భావమాలికల కందము గూర్చెడి పద్యభాషయే
    మద్యము భావభంజకము మక్కువ నెక్కువ గ్రోలువారికిన్
    హృద్యము మానవాళికిని మృగ్యము భావసరంబు లేకయున్

    రిప్లయితొలగించండి