9, జూన్ 2017, శుక్రవారం

సమస్య – 2380 (అష్టవధానికి సమస్య...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అష్టవధానికి సమస్య లతి కష్టదముల్"
(లేదా...)
"అష్టవధానికిన్ జటిలమౌను సమస్యల పూరణమ్ములే"

32 కామెంట్‌లు:

 1. ఇష్టము లేకనె విరుపులు
  దుష్టసమాసములు మెండు దుష్కర ప్రాసల్
  క్లిష్టమ్మౌ సంధులతో
  అష్టవధానికి సమస్య లతి కష్టదముల్

  రిప్లయితొలగించండి
 2. క్లిష్ట మగు పదజాలములను
  స్పష్టముగా దెలుప నెంచి పరమ ప్రీతిన్
  దుష్ట సమాసము లనుమరి
  అష్టవధానికి సమస్య లతి కష్టదముల్

  రిప్లయితొలగించండి
 3. స్పష్టత గోచరింపకయె,చప్పని,తప్పుసమాసవాక్య సం
  కష్ట దురూహ సంజనిత,కర్కశ,ఘోర,కళావిహీనతన్
  దుష్ట వినష్ట భావములతోమతిఁబోవగఁజేయు పట్టునన్
  అష్టవధానికిన్ జటిలమౌను సమస్యల పూరణమ్ములే

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టా
  కష్టములాంగ్ల పదాలవి
  స్పష్టత గాననిది ఉక్తి బహుళ గిమిక్కుల్
  దుష్ట సమాసపు రొష్టుల్
  అష్టవధానికి సమస్యలతి కష్టదముల్

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  స్పష్ట సమాస పోకడల సంచయమొక్కటలేని తీరు నా
  దుష్ట కుయుక్తులే మొలుచు,దుర్బలమైనది ఉక్తి,నాంగ్లపున్
  క్లిష్ట పదంపు ప్రాససరి, కేళియె భావము గూడ మేల్మినిన్?
  అష్టవధానికిన్ జటిల మౌను సమస్యల పూరణమ్ములే!

  రిప్లయితొలగించండి
 6. పుష్టిగ వాగ్విద్యా పరి
  వేష్టితుఁడై పూరణముల వెలయించుచు నా
  స్రష్ట నుదుటి వ్రాతలనిడ
  నష్టవధానికి సమస్య లతి కష్టదముల్

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  కష్టములెన్మిదొక్కపరి గల్గినగాని చలింపకున్కి తా
  నిష్టము జేసికోవలయు నెప్పటికప్పుడు ధారణంబునున్
  విష్టపమెల్ల మెచ్చుకొను వవేడుక గావలె భావ సామ్యపున్
  అష్టవధానికిన్ జటిల మౌను సమస్యల పూరణమ్ములే!

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  ఆర్యా,"వ"ఎక్కుడౌట టైపాటు3వ పూ.3వ పాదములో,సవరించగలరు.

  రిప్లయితొలగించండి
 9. డా.పిట్టా
  ఆర్యా,సమస్యాపాదం పూర్వపు పాదమిది:
  స్పష్టత,శబ్దచాలనము సంభవమా తలపెట్ట వాక్కునన్?...అదే 3వ పూరణలో,sorry!

  రిప్లయితొలగించండి
 10. నిష్ఠగ వాగ్దేవినిమది
  నిష్టముగా దలచి కోర నీప్సితముల సం
  తుష్టిగదీర్చును కాబో
  వష్టవధానికి సమస్యలతి కష్టదముల్

  రిప్లయితొలగించండి
 11. మా బావమరది మార్గం నాగేశ్వరరావు (మాజీ కార్పొరేటర్) చనిపోయాడు. అటే వెళ్తున్నాను. ఈరోజు మీ పూరణలను సమీక్షించే అవకాశం దొరకక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 12. 1) *సమస్యానుకుల పూరణం*..

  *క్లిష్టాన్వయ* *లుప్తాక్షర*
  *దుష్టార్థద్యోతకములు* *తుష్టికరమ్ముల్*
  *మృష్టాన్నమ్ములు కావవి* ,!
  యష్టవధానికి సమస్యలతికష్టదముల్ !

  2) *సమస్యా ప్రతికూల పూరణం*...

  క్లిష్టాన్వయ లుప్తాక్షర
  దుష్టార్థద్యోతకములు తుష్టికరమ్ముల్
  మృష్టాన్నమ్ములు !.., *కావవి*
  *యష్టవధానికి* *సమస్యలతికష్టదముల్* !

  రిప్లయితొలగించండి
 13. స్రష్టగ పృచ్ఛకులె బొగడి
  కష్టములను కలుగజేయ కవిపుంగవుఁ సం
  క్లిష్ట సమస్యల నునుచగ
  నష్టవధానికి సమస్య లతి కష్టదముల్

  రిప్లయితొలగించండి
 14. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  *9, జూన్ 2017, శుక్రవారం*
  *"అష్టవధానికి సమస్య లతి కష్టదముల్"*

  (లేదా...)

  *"అష్టవధానికిన్ జటిలమౌను సమస్యల పూరణమ్ములే"*


  *దుష్టులచేష్టలు బంధువు*
  *నిష్టూరమువెన్నుపోటు నిందలునింటన్*
  *నష్టారోగ్యశ్రీల్ గన*
  *నష్టవధానికి సమస్య లతి కష్టదముల్"*


  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  రిప్లయితొలగించండి
 15. స్పష్టముగ నవసరమ్ము వి
  శిష్టామల మనము జయము సేకుఱ నవనిన్
  నష్ట మతి నికృష్ట వ్యస
  నాష్ట వధానికి సమస్య లతి కష్టదముల్

  [సప్త వ్యసనాలకి కీర్తి కండూతి కలిపితే ఎనిమిది వ్యసనాలు.]


  ఇష్టము తో నదృష్టమునె యెంచక మిక్కిలి దీక్ష తోడఁ దాఁ
  గష్టము సేయ ధైర్యమునఁ గాగల వన్ని యనాయసమ్ములే
  కష్టము కష్ట మంచు మది గట్టిగఁ దల్చినఁ గష్ట మౌను లే
  యష్ట వధానికిన్ జటిలమౌను సమస్యల పూరణమ్ములే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సమస్యలో చిన్న ధర్మ సందేహము. అవధానము నకు “వధానము” తద్భవ మనుకుంటాను. అప్పుడు అష్ట వధాని దుష్ట సమాసమని యనుమానము.

   తొలగించండి
 16. పుష్టిగ భారతీ జనని ముచ్చట గొల్పెడు విద్యనీయగన్
  క్లిష్టత వీడిపోవ నవలీలగ పూరణలందజేసినన్
  స్రష్టయె ఫాలభాగమున జాలియె లేక లిఖించ బాధల
  న్నష్టవధానికిన్ జటిలమౌను సమస్యల పూరణమ్ములే

  రిప్లయితొలగించండి
 17. స్పష్టపు దుష్కర ప్రాసల
  స్రష్ట సతీమణియొసంగు సౌజన్యముతో
  తుష్టినిడసమస్యలుగా
  నష్టవధానికి సమస్య లతి కష్టదముల్

  రిప్లయితొలగించండి
 18. ఇష్టముతోడపద్యముల నింపుగ ధారణ చేయకుండగా
  తుష్టిని పొందుచున్ మదిని తోరపుఁ బ్రజ్ఞ ఘటిల్లె నంచు నా
  స్రష్ట సధర్మచారిణియె సన్నిధియంచు చరించు గర్వియౌ
  యష్టవధానికిన్ జటిలమౌను సమస్యల పూరణమ్ములే

  రిప్లయితొలగించండి
 19. విరించి గారి పూరణలు....


  ఓటు విలువయె తెలియక నుర్వి జనులు
  నోటు బొంది యెన్ని కలలో నోటు వేయ
  నేల గెలుతురు సద్గుణ శీలు రిలను
  నీతి రహితుడె జనులకు నేత యగును

  ఏ తరి గెల్తురీ పుడమి నేలగ సద్గుణ సత్య శీలు రౌ
  నేతలు గాంచ లోకులిల నీతిని తప్పి ధనమ్ము పొందుచున్
  నేతల కోటు వేయగను నెగ్గుచు పాలకులై ధారీత్రి లో
  నీటి విహీనులే జనుల నేతగ గారవ మందు నెల్లెడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ....నెగ్గుచు పాలకులైరి ధాత్రిలో.సెట్ టైపాటును మంచి పాఠకుడు గ్రహిస్తాడు.అలాగే నీటి.నీతిగాను..ఆచార్యులవారి ఆందోళనను ‌సూచిస్తున్నాయి.వృద్ధాప్యపు మీ అవిరళ శ్రమ శ్లాఘనీయము,ఆర్యా,

   తొలగించండి
 20. కష్టము గావు సమస్యలు
  అష్టవధానికి, సమస్యలతి కష్టదముల్
  యిష్టంబుగనవధానమ్
  స్పష్టముగా నేర్వనట్టి వారికి యిలలో!!!

  రిప్లయితొలగించండి
 21. మృష్టాన్నమ్మును తిని కవి
  కష్ష్టపడుచు సభకు వెడల కనురెప్పలపై
  కిష్టపడి నిదుర రాగా
  అష్ట వ ధానికి సమశ్యలతి కష్ట దముల్

  రిప్లయితొలగించండి
 22. ఇష్టమగు తిండి పెట్టక
  నష్టపు బేరమ్ము లాడి నగదుకు నసగన్
  భ్రష్టులు వేదిక నెక్కగ
  నష్టవధానికి సమస్య లతికష్టదముల్

  రిప్లయితొలగించండి
 23. కం. స్పష్టత గల పృఛ్ఛకులు వి
  శిష్టత నిండిన యమర విశేషము నిలుపన్ ,
  సృష్టించగ బద్యములను
  అష్ట వధానికి సమస్య లతి కష్టదముల్
  కొరుప్రోలు రాధా కృష్ణారావు

  రిప్లయితొలగించండి


 24. హృష్టంబౌనట్లుగ తా
  నిష్టముతో దత్తపదుల నిలలో నెపుడున్
  నష్టకవుల నలరించెడి
  నష్టవధానికి సమస్యలతి కష్టదముల్.

  రిప్లయితొలగించండి
 25. ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుడు.

  కారు పాండవులెప్పుడు కానివారు
  వారు రాజ్యమ్ముకోసమై వాచిలేరు
  ఏమిటీవింత వాదనలెరుకలేక
  చెప్పునామాట వినకుంట సెల్లునయ్య.

  రిప్లయితొలగించండి

 26. పిన్నక నాగేశ్వరరావు.

  అష్ట కవులిడు సమస్యల

  తుష్టిగ పూరించును పరితోషము
  కలుగన్
  క్లిష్టమ్ములు కావేవియు

  నష్టవధానికి సమస్యలతి కష్టదముల్.

  ****************************

  రిప్లయితొలగించండి


 27. పిన్నక నాగేశ్వరరావు.

  అష్ట కవులిడు సమస్యల

  తుష్టిగ పూరించును పరితోషము
  కలుగన్
  క్లిష్టములైనను ; కావవి

  నష్టవధానికి సమస్యలతి కష్టదముల్.

  ****************************
  చిన్న సవరణతో​....
  ****************************

  రిప్లయితొలగించండి
 28. మృష్టాన్నము గని ప్రీతిగ
  పుష్టిగ భుజియించి మత్తు పొందిన వేళన్
  నిష్టగ పృచ్ఛకులడిగిన
  అష్టవధానికి సమస్య లతి కష్టదముల్

  రిప్లయితొలగించండి
 29. ఇష్టము లేకయే చనుచు నింటిని గోలను పారిపోవుటన్
  సుష్టగు భోజనాంతరము సుందర స్వప్నము లూరడించగా
  దుష్టుడు పృచ్ఛకుండొకడు దుష్కర ప్రాసను కూర్చిగ్రుచ్చగా
  నష్టవధానికిన్ జటిలమౌను సమస్యల పూరణమ్ములే

  రిప్లయితొలగించండి