16, జూన్ 2017, శుక్రవారం

సమస్య – 2386 (పాకిస్తాన్ ప్రజలు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పాకిస్తాన్ ప్రజలు విష్ణుభక్తులు శిష్టుల్"
(లేదా...)
"పాకిస్తాన్ ప్రజలెల్ల విష్ణువునకున్ భక్తుల్ సదాశిష్టులున్"

63 కామెంట్‌లు:

 1. పోకిరి వారే సతతము
  పాకిస్తాన్ ప్రజలు , విష్ణు భక్తులు శిష్టుల్
  లోకమున పరుల నెప్పుడు
  సాకుచు జీవింతురుగద సౌఖ్యము తోడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. ఏకేశ్వరమత వాదులు
  పాకిస్తాన్ ప్రజలు; విష్ణుభక్తులు శిష్టుల్
  లోకంబుల కవ్వలగ న
  లోకంబగు వెలుగు కెపుడు లోబడు వారల్

  ఏకేశ్వరమతము = monotheism

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   విరుపుతో మీ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. కాకల్దీరిన పండితుల్,సగుణ,సాంఖ్యావాదులున్ సర్వులున్
  చీకాకుల్ మదిలేక నేకమగు విశ్వేశున్ కడున్ కాంచరే!
  లోకాతీతుడు దైవమంచెరిగి,కల్లోలంబు చల్లారగా
  పాకిస్తాన్ ప్రజలెల్ల విష్ణువునకున్ భక్తుల్ సదా శిష్టులున్

  రిప్లయితొలగించండి
 4. లోకేశుని సేవించుచు
  శాకా హారమును ముట్టి శైవులు కాగ
  న్నేకాగ్రత పాటించగ
  పాకిస్తాన్ ప్రజలు విష్ణు భక్తులు శిష్టుల్

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  పాకన తేజము పేరుకు1
  సోకోర్చగలేని2 దనుజ శూరులు పగచే
  చేకురు సామగ్రిని3 గను
  పాకిస్తాన్ ప్రజలు విష్ణు భక్తులు శిష్టుల్4
  (1"పేరుకు పాకిస్తానము, తిమిరానికి తేజోనామము"కాళోజీ
  2సోకోర్చువాడె మనుజుడు.బద్దెన ‌సుమతి
  3వైరక్రియా సామగ్రినన్ శిశుపాల ముఖ్యులు. పోతన భాగవతం
  4శిష్టుల్..ఆజ్ఞాపింప బడినవారలు.శ.ర)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   విశేషార్థాలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. డా.పిట్టా
  వీకన్నా శిశుపాల ముఖ్యుల వలెన్ వీక్షన్ గనన్ దస్యులై
  పాకన్నట్టి పవిత్ర నామమున సంబంధమ్మునున్ గూర్చకన్
  పోకన్ రావణ, కుంభకర్ణ సములై పోరంగ నీ ఖండపున్
  పాకిస్తాన్ ప్రజలెల్ల విష్ణువునకున్ భక్తుల్ సదా శిష్టులున్!(నిత్య సత్య సమస్య.భళా!)

  రిప్లయితొలగించండి
 7. మీకున్ జెప్ప నిఘంటువుల్ దెలుపు నా మేలైన యర్థంబు నిం
  కేమాత్ర మ్మనుమాన మేల వినుడో యీ విశ్వమం దెల్లెడన్
  సోకొప్పంగను నుండువాఁ డనుచు విష్ణున్, ఖుదా యట్టులే,
  పాకిస్తాన్ ప్రజలెల్ల విష్ణువునకున్ భక్తులు సదా శిష్టులున్.

  రిప్లయితొలగించండి
 8. శంకేల? వినుము హైందవ
  పాకిస్తాన్ ప్రజలు విష్ణుభక్తులు శిష్టుల్
  శ్రీకాంతుని భజియించుచు
  శ్రీకరముగమనుచునుంద్రు స్థిరచిత్తముతో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో ప్రాస తప్పింది. "మీకేల శంక హైందవ" అనండి.

   తొలగించండి
 9. రాకాసులమదమణిచిరి
  చీకాకులబెట్టమున్ను శ్రీహరికృపచే,
  పోకరితనమికచెల్లదు
  పాకిస్థాన్! ప్రజలు విష్ణుభక్తులు శిష్టుల్!!!

  రిప్లయితొలగించండి
 10. ఏకాంతాన నమాజు చేయు ప్రజలా హిందూత్వవాదమ్ముకున్
  చేకూరంగ ప్రయోజనమ్ములెపుడున్ చేబూనరే ఐక్యతన్
  శ్రీకారమ్మొనరింతురాలయములన్ స్నేహాంజలుల్ శోభిలన్
  పాకిస్థాన్ ప్రజలెల్ల విష్ణువుకున్ భక్తుల్ సదా శిష్టులున్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి 11. కాకలు దీరిన యోధులు

  పాకిస్తాన్ ప్రజలు:విష్ణుభక్తులు శిష్టుల్

  చేకూర్చుకొనగ ధనమును

  కోకొల్లలుగా చనిరట కొలువుల కొరకై

  రిప్లయితొలగించండి
 12. ఏ కరణి గెలుతువు క్రికెట్
  పాకిస్తాన్? ప్రజలు విష్ణుభక్తులు శిష్టుల్
  శ్రీకర భారతమందున,
  మాకే విజయమ్ము నిచ్చు మాధవుఁ డెపుడున్.

  రిప్లయితొలగించండి
 13. భారత ప్రజల గర్జన:

  దూకుడు నాపక మీరిన
  మీకౌ శిశుపాలుని గతి! మేల్కొన కున్నన్
  తాకున్ సుదర్శనమ్మది
  పాకిస్తాన్! ప్రజలు విష్ణుభక్తులు శిష్టుల్!!

  రిప్లయితొలగించండి
 14. శ్రీ కాశ్మీరము మాదే!
  పాకిస్తాన్ ! ప్రజలు విష్ణుభక్తులు శిష్టుల్
  మా కిల ! మా కోపాగ్నులు
  తాకన్ మీ దేశమెల్ల దగ్ధము గాదే!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
  [6/16, 7:09 AM] మైలవరపు మురళీకృష్ణ: శ్రీ కాశ్మీరము భారతాంబ నుదుటన్ సిందూరమౌ ! దానిపై
  మాకున్ హక్కని బల్కి యన్య జన సంపచ్ఛ్రీలు మావందువా?
  పాకిస్తాన్ ! ప్రజలెల్ల విష్ణువునకున్ భక్తుల్ సదా శిష్టులున్
  మాకీదేశమునందు ! క్రోధమన తీక్ష్ణ జ్వాలగానెంచుమా !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 15. తా కలడు విష్ణు నటనన్
  పాకిస్థానమున పేరు బడయగ జనులున్
  వే కొనియాడచు నుందురు
  పాకిస్థాన్ ప్రజలు విష్ణు భక్తుల్ శిష్టుల్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి

 17. మూకుమ్మడి ప్రా ర్ధనములు
  భీకర యుపవాసవిధిని వీరోచితమున్
  పోకడ యొకటే కనుగొన
  పాకిస్తాన్ ప్రజలు విష్ణుభక్తుల్ శిష్టుల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొందరు రాక్షసులు కూడ భక్తులున్నారు కదా! అయితే వారు శిష్టులు కారు నిజమే!
   భక్తి విషయంలో తేడా లేదని భావన!

   తొలగించండి
  2. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. పోకడ గిట్టక భారత్
  సౌకర్యమని దలఁచి విభజనమున నుండన్
  మా కాశ్మీరమునన్ మీ
  పాకిస్తాన్ ప్రజలు విష్ణుభక్తులు శిష్టుల్!

  రిప్లయితొలగించండి
 19. ఇంటి పనులుండు కతనాన నించుకయును
  శంకరాభరణ పుపుట జదువ వీలు
  లేక వ్రాయుట వలనుగా లేదు సామి!
  తివిరి చేరుదు శీఘ్రమేదేవళమున

  రిప్లయితొలగించండి
 20. వాకొన,ప్రాకృత యవనులు
  పాకిస్తాన్ ప్రజలు,విష్ణుభక్తుల్ శిష్టుల్
  వ్యాకులత జెందు రచ్చట
  కాకమ్ముల మూక నడుమ గంధర్వమనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...జెందురు రచట...' అనండి.

   తొలగించండి
 21. లోక నుత చతుర్దశ భువ
  నైకప్రాభవ కృపా గుణాన్విత సాల్లా
  నేక సునాముఁడు విష్ణువు
  పాకిస్తాన్ ప్రజలు విష్ణుభక్తులు శిష్టుల్

  [స+అల్లా+అనేక= సాల్లానేక; “అల్లా” దైవనామము.]


  సాకుల్ సెప్పక మానసమ్మునను విస్తారమ్ము పూజింపగ
  న్నేకాంతమ్ముగ నిచ్చు నున్నతి భువిన్నే దైవమైనం ద్రుటిన్
  యేకైకమ్ముగ నుండ భారతమునం దెల్లన్, విసర్జించనా
  పాకిస్తాన్ ప్రజలెల్ల, విష్ణువునకున్ భక్తుల్ సదాశిష్టులున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 22. కాకలుదీరిన గ్రూరులు
  పాకిస్తాన్ బ్రజలు,విష్ణుభక్తులుశిష్టు
  ల్లేకాగ్రత బాటించుచు
  నాకేశవుదలచుచుండ్రు హరిహరి యనుచున్

  రిప్లయితొలగించండి
 23. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వాకాటుల నెంతు రెపుడు
  పాకిస్తాన్ ప్రజలు; విష్ణుభక్తులు శిష్టుల్
  నేకోదర భావముతో
  ప్రాకెడి వారలు వరీయ భారత వాసుల్

  రిప్లయితొలగించండి
 24. లోకుల గాచెడి దైవం
  బా కేశవుడైన గాని యల్లాయైనన్
  సాకును తన వారిగ నను
  పాకిస్తాన్ ప్రజలు విష్ణుభక్తులు శిష్టుల్

  రిప్లయితొలగించండి
 25. డాకుల మూకల చందము
  పాకిస్తాన్ ప్రజలు , విష్ణు భక్తులు శిష్టుల్
  వాకిట , కసితో రగులుచు
  పీకల కోతకు దిగబడు ప్రేతము లవుచున్

  రిప్లయితొలగించండి
 26. ఏ కారుణ్యములేనివారలగుచున్ హింసించ మా సైన్యమున్
  పాకిస్తాన్! ప్రజలెల్ల విష్ణువునకున్ భక్తుల్ సదాశిష్టులున్!
  దూకుల్లన్ శిశుపాలుఁ జంపు విధమున్ దుర్మార్గ మాపంగఁ దా
  శోకమ్ముల్ తొలగంగ జేయ నవ తేజో మూర్తిగా పుట్టడే

  రిప్లయితొలగించండి
 27. మాకున్నవి నియమమ్ములు
  పాకీస్తాన్! ప్రజలు విష్ణు భక్తులు, శిష్టుల్
  ఏకముగ పోరు నెదురుచు
  మీ కోరలు పీకి వేయ మిగుల సమర్ధుల్!

  మా కొహ్లి తోడుతె గెలుపు,
  పాకీస్తాన్! ప్రజలు విష్ణు భక్తులు, శిష్టుల్
  ఆ కేశవుడె సమూహము
  నాకసమున కెత్తి వైచు నతిశయమొప్పన్!

  రిప్లయితొలగించండి
 28. నీకున్నాకును జీవకోటి కిలలో నీరేజపత్రేక్షణుం
  డే కల్యాణములిచ్చి కాచుననుచు న్నింపారధ్యానింతురే
  యేకాలమ్ముననైన నీభరతధాత్రి న్నమ్ము పోబోకుమా
  పాకిస్తాన్ ప్రజలెల్ల విష్ణువునకున్ భక్తుల్ సదాశిష్టులున్.

  రిప్లయితొలగించండి

 29. పిన్నక నాగేశ్వరరావు.

  ఆ కాలమందు నేగిరి

  పాకుకు హిందువులు కూడ వలసగ
  వివిధం
  బౌ కారణముల, హైందవ

  పాకిస్థాన్ ప్రజలు విష్ణుభక్తులు శిష్టుల్.

  ******************************

  రిప్లయితొలగించండి
 30. వేశ్య... విటుడితో..

  ( వేశ్య గనుక గ్రామ్యపదాలు గ్రాహ్యములు )

  నాకిస్తే రూక తమల
  పాకిస్తాన్ ! ప్రజలు , విష్ణుభక్తులు , శిష్టుల్ ,
  నాకై తపించిరిల ! నా
  సోకుంగని సొమ్మసిల్లి చుక్కలు గనరే !!

  రిప్లయితొలగించండి
 31. కోకల్ దెచ్చుచు రేవు నుండియును తా కోరండు నూకల్నహో
  రూకల్ నాలుగు కర్చు లేకయనె తా రొక్కమ్ము చేకూర్చునే
  పీకల్ నిండుగ మేసి బజ్జొనక తా బీబీల మోసేనహో...
  పాకిస్తాన్ ప్రజలెల్ల విష్ణువునకున్ భక్తుల్ సదాశిష్టులున్

  విష్ణువు = విశ్వమంతా వ్యాపించియున్నవాడు (గాడిద)

  https://kandishankaraiah.blogspot.com/2017/01/2250.html?m=1

  రిప్లయితొలగించండి