24, జూన్ 2017, శనివారం

సమస్య – 2393 (ముని నుదుటను సీత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ముని నుదుటను సీత ముద్దు లిడెను"
(లేదా...)
"ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దు లిడెన్ గడు సంతసమ్మునన్"
(చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)

83 కామెంట్‌లు:

 1. చక్క దనము నందు చంద్రబింబ మనగ
  మమత పెంచు నంట మంచి తనము
  ప్రేమ పొంగి పొరల వేడ్కమీరగ రా
  మునికి నుదుట సీత ముద్దు లిడెను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం చివర గణదోషం. "వేడ్క మీర రఘురా..." అనండి.

   తొలగించండి
 2. వెదకి వెదకి వెదకి వేసారి చింతతో
  సేద దీర్చు కొనుచు చెట్టు క్రింద
  కునుకు తీసెడి రఘుకుల తిలకుండు రా
  మునికి నుదుట సీత ముద్దు లిడెను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నిజానికి 'రామునకు' అనడమే సాధువు. 'రామునికి' అనడం జనసాధారణం కనుకను, ఇది కేవలం సమస్యాపూరణం కనుకను దానిని స్వీకరించవచ్చు. పూర్వకవి ప్రయోగాలు ఏమైనా దొరుకుతాయేమో అని వెదికితే పద్య కవులవి దొరకలేదు కాని అన్నమయ్య కీర్తన దొరికింది. "రామునికి శరణంటే రక్షించి బ్రతుకరో" అని.
   ఎందుకైనా మంచిదని సమస్యను సవరిస్తున్నాను. స్వస్తి!

   తొలగించండి
  2. డుమంతంబునకు ద్వితీయాద్యేకవచనంబు పరంబగునపుడు నిగాగమంబు సర్వత్ర విభాష నగు.
   రామునిని - రాముని, రామునిచేతను - రాముచేతను, రామునికిని - రామునకును.
   సర్వత్ర యనుట నగాగమ బాధనార్థము.

   పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పై సూత్రము చే “రామునికి” ప్రయోగము సాధువే యగునని నా యభిప్రాయము.

   తొలగించండి
 3. రఘుకుల తిలకుడగు రాముని మోమును
  గనుచును జనక సుత కలువ కనుల
  తిలకమును నొసటను దిద్దగ పురుషోత్త
  మునికి నుదుట సీత ముద్దు లిడెను"

  రిప్లయితొలగించండి
 4. ఘనమగు నీశచాపమును కౌతుకమొప్పగ నెక్కుఁబెట్టి,నె
  మ్మనమున మౌని కకంజలిడు మాన్యుని రాఘవు,విక్రమోన్నతున్
  వినయముతోడ మాలఁగొని విభ్రమమందుచు మందయాన రా
  ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దులిడెన్ కడు సంతసంబుగన్

  రిప్లయితొలగించండి
 5. కైక ముద్దు బిడ్డ లోకమ్ము నేలెడి
  వాడు, కరుణ సాగ రుండు, హనుమ
  పూజితుండు ,పంతి ముఖ మర్ధ నుండు, రా
  మునికి నుదుట సీత ముద్దు లిడెను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. "కరుణకు ఘన వార్ధి" అందామా? అలాగే "పంక్తిముఖ.." అనండి.

   తొలగించండి
 6. శిలనహల్యగ మలచిన రాఘవునకు
  తాటకందునిమిన దాశరథికి
  సత్వగుణములందు సంపన్నుడౌనుత్త
  మునికి నుదుట సీత ముద్ద్దులిడెను

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  వర్ష హర్ష ధాత్రి వాసిగా నారుద్ర
  పురుగు లెల్లయెడల పొడమ జూచి
  సాగుబాటుకైన సరదాల "నాగలి
  ముని"1కి నుదుట సీత2 ముద్దులిడెను
  (1మానవీకరణమైన నాగలి 2నాగలి చాలు).


  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  కన వనమైన కష్టములు గాసిల జేయగనైన మాతయే
  మనునొక తీరుగా, సుతులు మాన్యులునయ్యు వనాంతరంబునన్
  మనవలె నెట్టులోయని యమాంతము విహ్వలమంది, వారికౌ
  ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దులిడెన్ గడు సంతసంబునన్

  రిప్లయితొలగించండి
 9. డా.పిట్టా
  ఆర్యా,T.Sలో"సాగుబాటు,అనగా ఏరువాక

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. డా.పిట్టానుండి
   ఆర్యా, ధన్యవాదములు.నుదుటిపై ముద్దు పిన్నలకే చెందునని పూరించాను.కృతజ్ఞతలు.

   తొలగించండి
 10. మనమును బుద్ధిజూడ వణుమాత్రము కుంలఘు చిత్స్వరూపమం
  దున విలసుండు బ్రహ్మమయ తోరపు తేజవిరాజు డయ్యు రా
  వణముఖ దైత్యులం బొరిగొ నంగను సాకృతు డైన యట్టి రా
  ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దు లిడెంగడు సంతసమ్మునన్
  ఐతగోని వేంకటేశ్వర్లు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకటేశ్వర్లు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అణుమాత్రము కుంలఘు..' ? మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 11. రణమునందున వడి రావణునిన్ ద్రుంచి
  చెఱను తొలగజేయ శీఘ్రముగను
  రమణతోడుత రఘురామునికి కలి భీ
  మునికి నుదుట సీత ముద్దు లిడెను
  కలిః యుద్ధము

  రిప్లయితొలగించండి
 12. దానవ చెర బాపి మాననీయుండన
  జనులు జయమటంచు స్వాగతించ
  మురిసి ప్రాణనాధు పుణ్యాత్ముఁ బురుషోత్త
  ముని నుదుటను సీత ముద్దు లిడెను

  రిప్లయితొలగించండి
 13. అంజలించి తనకు నాశ్రయమునిడిన
  మునికి., నుదుట సీత ముద్దు లిడెను
  కుశలవాఖ్యులయిన కొమరుల కిద్దరి
  పోలికలును రామమూర్తివనుచు !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   వైవిధ్యమైన విరుపుతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.

   తొలగించండి
 14. రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తనరుచు'... టైపాటు!

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు టైపాటు సవరణతో

   చంపకమాల

   రణమున గూల్చ రావణుని, రాజ్యము మెచ్చుచు ధర్మమూర్తినిన్
   మునిగణ వందితున్ జనులు మోదము మీరఁగ స్వాగతించగన్
   తనియుచు ప్రాణనాధుఁబరితాపము వీడుచుఁజెంతఁజేరి రా
   ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దు లిడెన్ గడు సంతసమ్మునన్

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు టైపాటు సవరణతో

   చంపకమాల

   రణమున గూల్చ రావణుని, రాజ్యము మెచ్చుచు ధర్మమూర్తినిన్
   మునిగణ వందితున్ జనులు మోదము మీరఁగ స్వాగతించగన్
   తనియుచు ప్రాణనాధుఁబరితాపము వీడుచుఁజెంతఁజేరి రా
   ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దు లిడెన్ గడు సంతసమ్మునన్

   తొలగించండి
 15. ఏసు పటము, గనుల మూసిన యొక మౌని
  పటము దెచ్చె తండ్రి భక్తి తోడ
  ఏసు పటము జించి ఇదియె నచ్చినదని
  మునికి నుదుట సీత ముద్దు లిడెను
  (ఈమె రామాయణం లో సీత కాదు లెండి. మా యింటి పక్కనున్న మరొక సీత.)

  రిప్లయితొలగించండి
 16. తండ్రి మాట కొఱకు దనదు సౌఖ్యము వీడి
  ధర్మమార్గ మెంచి మర్మమెరిగి
  కాననమ్ము వెడల గామించు నారాజ
  మునికి నుదుట సీత ముద్దు లిడెను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "మునిరాజ వేషియై "యని త్యాగరాజ స్వామి " యెవరికై యవతార మెత్తితివో " యనే కీర్తనలో రాముని సంబోధించారు!

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. సనక సనందనాది ముని సన్నుత సర్వ జగత్తు పూజితా
  ఇనకుల వంశ చంద్రముడ, ఈప్సిత సిద్ది ప్రదాత మారుతీ
  ఘన కపిసేవితా యనుచు కానన లోపవళించి నట్టి రా
  ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దులిడెన్ గడు సంతసమ్మునన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జగద్విపూజితా' అనండి.

   తొలగించండి
 18. కనులకు విందు గొల్పుచును కాంచనదేహము కాంతులీనగన్
  మనమున భీతిచెందుచును మాయమృగమ్మదిసంచరింప మా
  నిని వెసగోరె దెమ్మనుచు నేర్పుగ పట్టగపైనమైన రా
  ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దులిడెన్ గడుసంతసమ్మునన్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 19. దినకర వంశజుండు ఋత దీక్షిత బద్ధుడు తండ్రి యొక్క శా
  సనమున తత్క్షణాన సమజంబుల కేగగ నిశ్చయించియున్
  జనుటకు ధర్మపత్నికిని సమ్మతి నీయగ మోదమంది రా
  ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దు లిడెన్ గడు సంతసమ్మునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణికుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దీక్షితు డార్యుడు' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  2. గురువుగారూ నమస్సులు. మీ సవరణకి ధన్యవాదములు.

   తొలగించండి
 20. కననీశ్వరు కార్ముకమును
  వినుతమ్ముగ నెక్కుపెట్టు వీరుడె నీకున్
  పెనిమిటి యౌనని బల్కిన
  ముని నుదుటను సీత వెస ముద్దు లిడెన్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 21. శివుని విల్లు ద్రుంచి చీనపు మెడలోన
  మూడు ముళ్ళు వేసి ముదము తోడ
  తనదు కరము పట్టి మనసు గెలిచిన రా
  మునికి నుదుట సీత ముద్దు లిడెను

  రిప్లయితొలగించండి
 22. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  24, జూన్ 2017, శనివారం

  *లవుడు నేర్చెవిద్యలాఘవమొప్పగన్*
  *నిలిచెనాశ్రమమున*

  *తెలిపి తల్లి పాదములకుమ్రొక్కముదమందుచున్*
  ప్రథ
  *"ముని నుదుటను సీత ముద్దు లిడెను"*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  రిప్లయితొలగించండి
 23. సీత కౌగిలించె శ్రీరామచంద్రుని
  సీత ముద్దు పెట్టె భూతలమును
  వింత నభము వీడి వేగ శివుని, వేడ
  ముని, నుదుటను సీత ముద్దు లిడెను

  [సీత = సీతా దేవి; నాఁగటిచాలు; ఆకాశగంగ]


  మనమున నున్నకోరికలు మానుగఁ దీరఁగఁ దృప్తిఁ జెంది కా
  నన ఘన దర్శనైషణ వనభ్రమణాశ ఫలింప సత్యమై
  వనమున నుండి మైథిలి యపార పరాక్రమ విక్రముండు రా
  ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దు లిడెన్ గడు సంతసమ్మునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు మనోహరంగా (ముఖ్యంగా రెండవది అద్భుతంగా) ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
  3. కామేశ్వరరావుగారూ ఎప్పటిలాగనే అద్భుతమైనపూరణల నిచ్చారు.నాదొకచిన్నసందేహము రెండవపూరణలో మైథిలి,ధరాత్మజ అర్థపునరుక్తికాలేదా అని.ఆసక్తితప్ప విమర్శకాదు దయచేసి గమనించండి.

   తొలగించండి
  4. మిస్సన్న గారు నమస్సులు. మైథిలి (మిథిలా నగర రాజకుమారి) ధరాత్మజకు విశేషణముగా దలచిన పునరుక్తి కాదని నా యభిప్రాయము.

   తొలగించండి
  5. మకర కుండల సద్భూషు మంజు భాషు
   నిరుపమాకారు దుగ్ధసాగర విహారు
   భూరి గుణ సాంద్రు యదు కులాంభోధి చంద్రు
   విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. భాగ. 10.ఉత్తర. 979

   తొలగించండి
  6. నమస్సులు కామేశ్వరరావుగారూ.

   తొలగించండి
 24. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  24, జూన్ 2017, శనివారం

  *లవుడు నేర్చెవిద్యలన్ నిల్చె ప్రథముడై*
  *యాశ్రమమున వచ్చెనమ్మకడకు*
  *తెలిపి పాదమంటె దీవించి యా ప్రథ*
  *"ముని నుదుటను సీత ముద్దు లిడెను"*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  రిప్లయితొలగించండి
 25. [24/06, 11:53 AM] సందిత బెంగుళూరు: *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  24, జూన్ 2017, శనివారం

  *"ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దు లిడెన్ గడు సంతసమ్మునన్"*

  *వనమున పర్ణశాలనటు వచ్చెనుదిద్దలలాటనామమున్*
  *వనజదళాక్షుడౌవిభుడువారితటంబుననుండసిద్ధుడై*
  *గొనియటుసింధురంబుకొనగోటనుగంధముదిద్దుకొంచు తాఁ*
  *గనిసరిదిద్దెనట్టులతికమ్రతరంబగుటన్ మనోభిరా*
  *"ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దు లిడెన్ గడు సంతసమ్మునన్*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  [24/06, 11:58 AM] సందిత బెంగుళూరు: భార్య భర్తకు నుదుట ముద్దిచ్చుట శాస్త్రసమ్మతంకాదు సంప్రదాయవిరుద్ధము అయిననూ ఆ సందర్భము ఉచితమే! అక్కడప్రాధాన్యము నామశోభితమైన ప్రదేశానికే కళాత్మకము కావున🙏🌹🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సందిత గారూ,
   మీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 26. హరుని ధనువు విరువ హరుషంబున జనులు

  గాంచుచుండ మురిసి కంఠమందు

  మల్లె మాల వేసి మందహాసమున రా

  ముని నుదుటను సీత ముద్దు లిడియె.  వనము నందు గనుచు పసిడి జింకను తాను

  కోరగానె పతియు కూర్మితోడ

  తరలి వెళ్ళు చుండ దాశరథియగు రా

  ముని నుదుటను సీత ముద్దులిడియె.  జనకునింట తాను చాపము నెత్తుచు

  విరువసంతసాన భేషటంచు

  జనులు మురియుచు జయజయ నాదములిడ రా

  ముని నుదుటను సీత ముద్దు లిడియె.

  రిప్లయితొలగించండి
 27. పనిగొనకౌశికుండు ముని పంపును మన్ననజేసి నమ్రుడై
  ఘనమగు ప్రజ్ఞతోడుతను కాచెవితానము, తున్మిదైత్యులన్
  వినయముతోడుతన్ శివుని విల్లును త్రుంచగ, తండ్రి మెచ్చ రా
  ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దు లిడెన్ గడు సంతసమ్మునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

   తొలగించండి
 28. అశ్వముఁ గని బట్ట నాటలాడు నటుల
  కవల జూచినంత కనికరమున
  కోరి తల్లి కడకు కొడుకుల జేర్చ రా
  ముని,నుదుటను సీత ముద్దు లిడెను

  నిన్నటి సమస్యకు నా పూరణ

  అనలమున జరుపు హోమము,
  మునివరుల కఠోర దీక్ష, ముప్పున బడగా
  పెనుభూతములసురుల నా
  వనిఁ,తల ఖండించువాఁడె బల్లిదుఁ డగురా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 29. కంటిరెప్పవోలె కన్నవారిని గాచు
  అనుజులనిల జూచు ననునయముగ
  రాముడనుచు సుతుని ప్రజలు నుతించ సో
  ముని నుదుటను సీత ముద్దులిడెను!!!


  నీలమేఘ ఛాయ మేలు దేహమువాని
  కంజములను బోలు కనులవాని
  చిత్తరముగ జూచి చిత్రపటమున రా
  ముని నుదుటను సీత ముద్దులిడెను!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'సోముడు'?
   'మేఘ+ఛాయ = మేఘచ్ఛాయ (తుగాగమ సంధి)' అవుతుంది. అక్కడ "నీలమేఘము వలె మేలు..." అనండి.

   తొలగించండి
 30. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అనిని రావణాసురుని మదమడగించి
  పూనికొంది తనను పొందు జేసి
  యాదుకొనిన సొబగుడా ప్రభువు తన రా
  ముని నుదుటన సీత ముద్దులిడెను  రిప్లయితొలగించండి
 31. సోమధార నుండి జూటమ్మునన్ జిక్కి
  యభ్భగీరధుండు నార్తివేడ
  పాయగా భువి దిగ పరవశమంది సో
  ముని నుదుటను సీత ముద్దు లిడెను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   గంగ శివుని జటాజూటం నుండి బయలుదేరుతూ అక్కడే ఉన్న నెలవంకను ముద్దు పెట్టుకున్నదన్నమాట! బాగుంది. ముందు అవగాహన చేసికొనలేక పోయాను. బాగుంది పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. చంద్రుని కాదు శివుని నుదుట ముద్దులిడెను అన్నభావంతో వ్రాశాను సర్.

   తొలగించండి
 32. ప్రసవమాయె పుడమిపట్టి యశ్రమమున
  కవల బిడ్డలను సకాలమందు
  నీలి మేఘఛాయ బోలిన యాబాల
  ముని నుదుటను సీత ముద్దు లిడెను

  రిప్లయితొలగించండి
 33. తన పతి ధర్మబద్ధముగ ధాత్రినినేలుచు శ్రాంతుడౌట , వీ...
  వన గొని వీచి , స్వేదకణవారిని తా తుడువంగ నెంచె రా...
  ముని నుదుటన్ ధరాత్మజయె ., ముద్దు లిడెన్ గడు సంతసమ్మునన్
  గని హనుమంతుడున్ మురిసి గాలిని దేలగ గెంతి వాలమున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 34. ధనువు విరిచి తనదు ధవుడయ్యినాడని
  మనము నందు కమియు మధుర హేల
  లలర కేలు బట్టి హ్లాదమందుచును రా
  ముని నుదుటను సీత ముద్దు లిడెను!

  కమియు=కవియు

  రిప్లయితొలగించండి