ధైర్యము వహించి రావణుకార్యము జేయగ నరిగెను కాననమునకాశ్చర్యము మారీచుండవ, హర్యక్షము, జింకఁ, గాంచి యడలుచుఁ బాఱెన్.
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,పద్యం బాగుంది. కాని కొంత అన్వయలోప మున్నట్టుంది. చివరి రెండు పాదాలలో మీ భావం?
వర్యుడు యుద్ధము నందున్నార్యుడమెరికనుడు పారె నౌరాయనగన్ శౌర్యము వీడి వియత్నామ్:"హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్"Vast America defeated by tiny Vietnam in Vietnam War (1964-75)
ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.వియత్నామ్ అన్నచోట కొంత అన్వయలోపం ఉంది.
పర్యంకముపై వనితను శౌర్యము తోజూచి భర్త సంతస మొందెన్ క్రౌర్యపు చూపుల సతిగని హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్
అక్కయ్యా,బాగున్నది మీ పూరణ. అభినందనలు.
మర్యాదన్ ప్రహ్లదునిహర్యక్ష నరావతారమగు శ్రీహరి,ధీవర్యునిఁజూచిన--కశిపుడుహర్యక్షము--జింకఁగాంచి యడరుచుఁబాఱెన్
ప్రసాద రావు గారూ,పూరణ బాగున్నది. కాని కొంత అన్వయలోపం ఉన్నది. ఇక్కడ హిరణ్యకశిపుడు హర్యక్షమా? జింకయా?
అయ్యా!నమస్కారము.హిరణ్యకశిపుడు హర్యక్షము ప్రహ్లాదుడు జింక--కశిపుడు హశ్యక్షము--కశిపుడు రాక్షసరాజు కనుక హర్యక్షమే!!ఒక సందేహము తెలిసికొనుటకడుగుచున్నాను.నివృత్తిజేయ ప్రార్థన పద్యంలో మొదటి పాదం గురువుతో ప్రారంభిస్తేనే మిగతా 3పాదాల గురలఘువైతేవే ఉండాలి.ఈ నియము ఉందా?
గురువైతే అన్నీ గురువులు,లఘువైతే అన్నీ లఘువులు ఉండాలనే నయమం ఉందా?
తేటగీతి, ఆటవెలది, సీస పద్యాల్లో తప్ప మిగిలిన పద్యాల్లో మొదటి పాదం మొదటి అక్షరం గురువైతే మిగిలిన అన్ని పాదాలు గురువుతోనే ప్రారంభించాలి. లేదా అన్ని పాదాల మొదటి అక్షరాలు లఘువులై ఉండాలి.
ధన్యవాదాలు
డా.పిట్టాచర్యయె జన్మకు హేతువుక్రౌర్యపు "హరి" అప్పు పడెను కలికి"హరిణి"కాశ్చర్యము తన గత మెరిగినహర్యక్షము జింక గాంచి యడలుచు బారెన్
డా.పిట్టాబరితెగి కాపు సార గను బట్టిని బెట్టిన పంతులయ్య తానెర వణకించు బాలకుల నేస్తము వీడిన1నందు శిష్యుడౌసరియధికారి తారసిల చప్పున బట్టునటన్న ధ్యాసతోహరిణము గాంచి సింహము భయంబున బారె వడంకుచున్ వడిన్!1.సేవానివృత్తిని బొందగా
డా. పిట్టా సత్యనారాయణ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టానుండిఆర్యా ధన్యవాదాలు
కెరలె దవానలమ్ము ఘన కీలలతో వనమెల్లఁ గాల్చుచున్గర మనురక్తి నిప్పు చెలికాఁడు సహాయముఁ జేయ వచ్చె సంబరమున వాయుదేవునకు వాహనమై చెలరేగునట్టి యాహరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. వాయుదేవుని వాహనము లేడి యని విశదపఱచుచు చేసిన మీ పూరణ మనోహరముగ నున్నది. వాయుదేవుని బలమున లేడి కూడ దుర్వారామే. చిన్న సందేహము. “సహాయము” (సాహాయ్యము నకు) పదము వాడుకలో ప్రశస్తమైన గ్రామ్యమని నా యనుమానము. “సహాయతఁ జేయ..” అనిన నెట్లుండును?
భార్యలనుచు లేమల నాచార్యుడు పీడించ యొకతె, చతురత తోడన్వీర్యమిడు నంగము కొరికె ,హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్
సూర్యకుమార్ గారూ, కొంత ఆశ్లీలార్థం గోచరిస్తున్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*శ్రీమతి జి సందిత బెంగుళూరు**06-06-2017 (మంగళవారము)**సమస్యా పూరణము*💐🌺💐*"హర్యక్షము జింకఁ !గాంచి యడలుచుఁ బాఱెన్"*కం.*సూర్యుండొరిగెన్ పడమటఁ**ధైర్యంబదిలుప్తమయ్యె ధాత్రిసురునకున్**క్రౌర్యోద్ధతిన్ వధింపగఁ**"హర్యక్షము జింకఁ !గాంచి యడలుచుఁ బాఱెన్"*🌺🌺🌺 🌸🌸🌸🌸🌸🌸🌸🌸*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
సందిత గారూ, అడవిలో జింకను చంపిన సింహాన్ని చూచి బ్రాహ్మణుడు భయంతో పారిపోయాడు. చక్కని భావంతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
మర్యాద పూర్వ కమ్ముగకార్యము సాధించ జూడ కలహము గోరన్నార్యు నహింసకు జడిసిరి హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్
కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్యా నాథుని వర బలపర్యవసానమున సైంధవ మృగం బాపెన్వీర్యోద్ధత కురు హరులన్హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్!!!హరిణ చమూరు వానర గజాహి గుహాశయ జంతు జాలమున్హరి కలకంఠ గృధ్ర చట కాళి చకోర విహంగ రాజులన్స్థిరముగఁ గాన నన్య మొక చిత్రపు భీకర సింహ రాజమున్హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్[హరిణము = తెల్లనిది; రాజి = పఙ్త్కి]
కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
ఆర్యా యేమీ చిత్రముహర్యక్షముజింకగాంచి యడలుచుబారెన్ శౌర్యము గల యా సింహపు చర్యలు మరి యుండెననుట సముచిత మగునే?
సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.'చర్య లటుల నుండె ననుట...' అనండి. బాగుంటుంది.
ఆర్యుడ వీవా యంచునుక్రౌర్యముతో నరచుచుండి కవచాన్విత యైధైర్యంబు జూపుదానిని హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్.నిరుపమమైనభీతి ననునిత్యము గాంచిన ప్రక్కత్రోవలన్పరుగిడు భీరువయ్యు బహుభంగుల దిట్టుచు కాలుడోయనన్ చరిచెద నంచు వచ్చుటను సత్వమొ, మాయయొ యెంచలేక యాహరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్.హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ, మీ రెండు పూరణలు చక్కగా నున్నవి. అభినందనలు.
మర్యాదనుజూపుమునుతశౌర్యముదోడకరిమీద స్వారీ ఘనమౌకార్సముజేసి పిపీలకహర్యక్షము జింక గాంచియడలుచు బారెన్పిపీలక హర్యక్షము=గండుచీమ
శ్రీరామ్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: హర్యక్షమును గనిన వడిధైర్యము వీడక హరిణము దాను చగల గాం భీర్యత జూపుచు నుండగ హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్ (చగల గాంభీర్యత= మేకపోతు గాంభీర్యము)
రాజారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విరించి గారి పూరణలు..... కరుణ యెలేని క్రూరపు మృగమ్ము వనమ్ము జరించు వేళలో నరుచుచు పైకి దూకినది యాకలి బాధను తాళలేక నా హరిణము గాంచి సింహము . భయంబున బారె వ డం కుచున్మరణము తప్పుతెట్లనుచు మందను జేరగ నెంచి జింకయే క్రౌర్యము తో పై దూకెను హర్యక్షము జింక గాంచి . య డలుచు బారె న్నా ర్యుమ్ డా దృశ్యము గని ధైర్యము గోల్పోయి తాను దర మే జేరం
విరించి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కొన్ని టైపాట్లున్నవి.
పర్యాటక ప్రాంతమ్మునభార్యామణి తోడ తిరుఁగ, పరుగులు బెట్టన్క్రౌర్యమ్మున వెంటబడఁగహర్యక్షము జింకఁ! గాంచి యడలుచుఁ బాఱెన్
సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హర్యక్షము నాయకు డయిపర్యయమెరుగని హరిణముప్రజలై నొకచో ధైర్యమ్ముగ నెదిరించినహర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్
తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ప్రజలై యొకచో" అనండి.
గురుదేవుల సూచనతో సవరించిన పద్యముహర్యక్షము నాయకు డయిపర్యయమెరుగని హరిణముప్రజలై యొకచో ధైర్యమ్ముగ నెదిరించినహర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్
పరిణయ మెంచి మీరి 'శశి'బాలను లక్ష్మణు డంత జేరుచున్సరసము లాడబోయి చెలి చక్కని మోమున దా ఘటోత్కచున్దరిశనమంది సత్యమని తాళెనె? రాక్షస మాయలోనిదౌహరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్
క్రౌర్యపు చూపుల పైబడహర్యక్షము జింక గాంచి యడలుచు బారెన్శౌర్యముగని చూపరులాశ్చర్యంబులు ముప్పిరిగొన నాగిరి భీతిన్
డా. ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్యా సినిమాకువెడలెఆర్యుడొకడుతాను ప్రేమహారికతో నాశ్చర్యము! భార్యనుగనియట!హార్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్2 ధరణి తలంబునన్ విలయ తాండవమాడియు తెల్లవారులున్తరణి, శశాంకు జూచిదిగు తానటు పశ్చిమదిక్కు సంధ్యలోతరుణము బట్టి మారునిల ధైర్యమధైర్యము తావులందునన్హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్
హర్షశ్రీ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*శ్రీమతి జి సందిత బెంగుళూరు**తరలెనుశస్త్రహస్తములతన్మనుజేంద్రునిసైన్యమట్లుభీ**కరనినదోగ్రశబ్ధపరికంపితగాఢవనాంతరంబునన్**శరమునగూల్చెభూవిభుడుచంపగఁదామదినెంచినట్టి యా**హరిణముఁ !గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్.**శ్రీమతి జి సందిత బెంగుళూరు*
సందిత గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఆర్యుడ! హరిణం బొక్కటిపర్యావరణమ్ము గాచు పాలకు వెంటన్ ధైర్యముగా నడయాడన్హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్!
ధరణిని నేలు యాంధ్రులిట దంచుచు మొత్తుచు త్రొక్కుచుండగాహరిణులవోలు బిడ్డలను హాయి తెలంగణ మాతృభూమిలోతిరముగ కల్వకుంటడిట తీరుగ కుమ్ముచు పారద్రోలగా హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్!
ధైర్యము వహించి రావణు
రిప్లయితొలగించండికార్యము జేయగ నరిగెను కాననమునకా
శ్చర్యము మారీచుండవ,
హర్యక్షము, జింకఁ, గాంచి యడలుచుఁ బాఱెన్.
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని కొంత అన్వయలోప మున్నట్టుంది. చివరి రెండు పాదాలలో మీ భావం?
వర్యుడు యుద్ధము నందు
రిప్లయితొలగించండిన్నార్యుడమెరికనుడు పారె నౌరాయనగన్
శౌర్యము వీడి వియత్నామ్:
"హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్"
Vast America defeated by tiny Vietnam in Vietnam War (1964-75)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వియత్నామ్ అన్నచోట కొంత అన్వయలోపం ఉంది.
పర్యంకముపై వనితను
రిప్లయితొలగించండిశౌర్యము తోజూచి భర్త సంతస మొందెన్
క్రౌర్యపు చూపుల సతిగని
హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్
అక్కయ్యా,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
మర్యాదన్ ప్రహ్లదుని
రిప్లయితొలగించండిహర్యక్ష నరావతారమగు శ్రీహరి,ధీ
వర్యునిఁజూచిన--కశిపుడు
హర్యక్షము--జింకఁగాంచి యడరుచుఁబాఱెన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిపూరణ బాగున్నది. కాని కొంత అన్వయలోపం ఉన్నది. ఇక్కడ హిరణ్యకశిపుడు హర్యక్షమా? జింకయా?
అయ్యా!నమస్కారము.హిరణ్యకశిపుడు హర్యక్షము ప్రహ్లాదుడు జింక--కశిపుడు హశ్యక్షము--
తొలగించండికశిపుడు రాక్షసరాజు కనుక హర్యక్షమే!!
ఒక సందేహము తెలిసికొనుటకడుగుచున్నాను.నివృత్తిజేయ
ప్రార్థన
పద్యంలో మొదటి పాదం గురువుతో
ప్రారంభిస్తేనే మిగతా 3పాదాల గురలఘువైతేవే ఉండాలి.ఈ నియము ఉందా?
గురువైతే అన్నీ గురువులు,లఘువైతే అన్నీ లఘువులు ఉండాలనే నయమం ఉందా?
తొలగించండితేటగీతి, ఆటవెలది, సీస పద్యాల్లో తప్ప మిగిలిన పద్యాల్లో మొదటి పాదం మొదటి అక్షరం గురువైతే మిగిలిన అన్ని పాదాలు గురువుతోనే ప్రారంభించాలి. లేదా అన్ని పాదాల మొదటి అక్షరాలు లఘువులై ఉండాలి.
తొలగించండిధన్యవాదాలు
తొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండిచర్యయె జన్మకు హేతువు
క్రౌర్యపు "హరి" అప్పు పడెను కలికి"హరిణి"కా
శ్చర్యము తన గత మెరిగిన
హర్యక్షము జింక గాంచి యడలుచు బారెన్
డా.పిట్టా
రిప్లయితొలగించండిబరితెగి కాపు సార గను బట్టిని బెట్టిన పంతులయ్య తా
నెర వణకించు బాలకుల నేస్తము వీడిన1నందు శిష్యుడౌ
సరియధికారి తారసిల చప్పున బట్టునటన్న ధ్యాసతో
హరిణము గాంచి సింహము భయంబున బారె వడంకుచున్ వడిన్!
1.సేవానివృత్తిని బొందగా
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టానుండి
తొలగించండిఆర్యా ధన్యవాదాలు
కెరలె దవానలమ్ము ఘన కీలలతో వనమెల్లఁ గాల్చుచున్
రిప్లయితొలగించండిగర మనురక్తి నిప్పు చెలికాఁడు సహాయముఁ జేయ వచ్చె సం
బరమున వాయుదేవునకు వాహనమై చెలరేగునట్టి యా
హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. వాయుదేవుని వాహనము లేడి యని విశదపఱచుచు చేసిన మీ పూరణ మనోహరముగ నున్నది. వాయుదేవుని బలమున లేడి కూడ దుర్వారామే.
తొలగించండిచిన్న సందేహము. “సహాయము” (సాహాయ్యము నకు) పదము వాడుకలో ప్రశస్తమైన గ్రామ్యమని నా యనుమానము. “సహాయతఁ జేయ..” అనిన నెట్లుండును?
భార్యలనుచు లేమల నా
రిప్లయితొలగించండిచార్యుడు పీడించ యొకతె, చతురత తోడన్
వీర్యమిడు నంగము కొరికె ,
హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్
సూర్యకుమార్ గారూ,
తొలగించండికొంత ఆశ్లీలార్థం గోచరిస్తున్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
రిప్లయితొలగించండి*06-06-2017 (మంగళవారము)*
*సమస్యా పూరణము*
💐🌺💐
*"హర్యక్షము జింకఁ !గాంచి యడలుచుఁ బాఱెన్"*
కం.
*సూర్యుండొరిగెన్ పడమటఁ*
*ధైర్యంబదిలుప్తమయ్యె ధాత్రిసురునకున్*
*క్రౌర్యోద్ధతిన్ వధింపగఁ*
*"హర్యక్షము జింకఁ !గాంచి యడలుచుఁ బాఱెన్"*
🌺🌺🌺
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
సందిత గారూ,
తొలగించండిఅడవిలో జింకను చంపిన సింహాన్ని చూచి బ్రాహ్మణుడు భయంతో పారిపోయాడు. చక్కని భావంతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
మర్యాద పూర్వ కమ్ముగ
రిప్లయితొలగించండికార్యము సాధించ జూడ కలహము గోర
న్నార్యు నహింసకు జడిసిరి
హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్యా నాథుని వర బల
రిప్లయితొలగించండిపర్యవసానమున సైంధవ మృగం బాపెన్
వీర్యోద్ధత కురు హరులన్
హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్!!!
హరిణ చమూరు వానర గజాహి గుహాశయ జంతు జాలమున్
హరి కలకంఠ గృధ్ర చట కాళి చకోర విహంగ రాజులన్
స్థిరముగఁ గాన నన్య మొక చిత్రపు భీకర సింహ రాజమున్
హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్
[హరిణము = తెల్లనిది; రాజి = పఙ్త్కి]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఆర్యా యేమీ చిత్రము
రిప్లయితొలగించండిహర్యక్షముజింకగాంచి యడలుచుబారెన్
శౌర్యము గల యా సింహపు
చర్యలు మరి యుండెననుట సముచిత మగునే?
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చర్య లటుల నుండె ననుట...' అనండి. బాగుంటుంది.
ఆర్యుడ వీవా యంచును
రిప్లయితొలగించండిక్రౌర్యముతో నరచుచుండి కవచాన్విత యై
ధైర్యంబు జూపుదానిని
హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్.
నిరుపమమైనభీతి ననునిత్యము గాంచిన ప్రక్కత్రోవలన్
పరుగిడు భీరువయ్యు బహుభంగుల దిట్టుచు కాలుడోయనన్
చరిచెద నంచు వచ్చుటను సత్వమొ, మాయయొ యెంచలేక యా
హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు చక్కగా నున్నవి. అభినందనలు.
మర్యాదనుజూపుమునుత
రిప్లయితొలగించండిశౌర్యముదోడకరిమీద స్వారీ ఘనమౌ
కార్సముజేసి పిపీలక
హర్యక్షము జింక గాంచియడలుచు బారెన్
పిపీలక హర్యక్షము=గండుచీమ
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిహర్యక్షమును గనిన వడి
ధైర్యము వీడక హరిణము దాను చగల గాం
భీర్యత జూపుచు నుండగ
హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్
(చగల గాంభీర్యత= మేకపోతు గాంభీర్యము)
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విరించి గారి పూరణలు.....
రిప్లయితొలగించండికరుణ యెలేని క్రూరపు మృగమ్ము వనమ్ము జరించు వేళలో
నరుచుచు పైకి దూకినది యాకలి బాధను తాళలేక నా
హరిణము గాంచి సింహము . భయంబున బారె వ డం కుచున్
మరణము తప్పుతెట్లనుచు మందను జేరగ నెంచి జింకయే
క్రౌర్యము తో పై దూకెను
హర్యక్షము జింక గాంచి . య డలుచు బారె
న్నా ర్యుమ్ డా దృశ్యము గని
ధైర్యము గోల్పోయి తాను దర మే జేరం
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కొన్ని టైపాట్లున్నవి.
పర్యాటక ప్రాంతమ్మున
రిప్లయితొలగించండిభార్యామణి తోడ తిరుఁగ, పరుగులు బెట్టన్
క్రౌర్యమ్మున వెంటబడఁగ
హర్యక్షము జింకఁ! గాంచి యడలుచుఁ బాఱెన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హర్యక్షము నాయకు డయి
రిప్లయితొలగించండిపర్యయమెరుగని హరిణముప్రజలై నొకచో
ధైర్యమ్ముగ నెదిరించిన
హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రజలై యొకచో" అనండి.
గురుదేవుల సూచనతో సవరించిన పద్యము
తొలగించండిహర్యక్షము నాయకు డయి
పర్యయమెరుగని హరిణముప్రజలై యొకచో
ధైర్యమ్ముగ నెదిరించిన
హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్
పరిణయ మెంచి మీరి 'శశి'బాలను లక్ష్మణు డంత జేరుచున్
రిప్లయితొలగించండిసరసము లాడబోయి చెలి చక్కని మోమున దా ఘటోత్కచున్
దరిశనమంది సత్యమని తాళెనె? రాక్షస మాయలోనిదౌ
హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిక్రౌర్యపు చూపుల పైబడ
హర్యక్షము జింక గాంచి యడలుచు బారెన్
శౌర్యముగని చూపరులా
శ్చర్యంబులు ముప్పిరిగొన నాగిరి భీతిన్
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్యా సినిమాకువెడలె
రిప్లయితొలగించండిఆర్యుడొకడుతాను ప్రేమహారికతో నా
శ్చర్యము! భార్యనుగనియట!
హార్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్
2 ధరణి తలంబునన్ విలయ తాండవమాడియు తెల్లవారులున్
తరణి, శశాంకు జూచిదిగు తానటు పశ్చిమదిక్కు సంధ్యలో
తరుణము బట్టి మారునిల ధైర్యమధైర్యము తావులందునన్
హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్
హర్షశ్రీ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
రిప్లయితొలగించండి*తరలెనుశస్త్రహస్తములతన్మనుజేంద్రునిసైన్యమట్లుభీ*
*కరనినదోగ్రశబ్ధపరికంపితగాఢవనాంతరంబునన్*
*శరమునగూల్చెభూవిభుడుచంపగఁదామదినెంచినట్టి యా*
*హరిణముఁ !గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్.*
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
సందిత గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఆర్యుడ! హరిణం బొక్కటి
రిప్లయితొలగించండిపర్యావరణమ్ము గాచు పాలకు వెంటన్
ధైర్యముగా నడయాడన్
హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్!
ధరణిని నేలు యాంధ్రులిట దంచుచు మొత్తుచు త్రొక్కుచుండగా
రిప్లయితొలగించండిహరిణులవోలు బిడ్డలను హాయి తెలంగణ మాతృభూమిలో
తిరముగ కల్వకుంటడిట తీరుగ కుమ్ముచు పారద్రోలగా
హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్!