3, జూన్ 2017, శనివారం

నిషిద్ధాక్షరి - 37

కవిమిత్రులారా,
అంశము - కైకేయి వ్యక్తిత్వము
నిషిద్ధాక్షరములు - ఎ, ఏ, ఐ అను అచ్చులు, ఈ అచ్చులతో కూడిన హల్లులు.
ఛందస్సు - మీ ఇష్టము.

69 కామెంట్‌లు:

 1. రమణి!సౌశీల్యము నీకు రామరక్ష!
  కన్నబిడ్డగ రాముని గాంచినావు
  కుటిలతను మంధరకు లొంగి కుత్సితంపు
  పనుల నొనరించినావు నిబ్బరములేక.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "సౌశీల్యమది నీకు..." అనండి. "లేక' అని నిషిద్ధాక్షరాన్ని ప్రయోగించారు. అక్కడ "నిబ్బరము వీడి/ తొలగి" అనవచ్చు.

   తొలగించండి
  2. సవరించుకుంటాను ధన్యవాదాలు

   తొలగించండి
 2. వరము తీరెడి సమయము వచ్చె గాన
  కపట బుద్ధిని కోరెను కరుణ లేక
  రాము నడవికి బంపిన లాస్య మనుచు
  భరతు నకుపట్టము గట్టు భాగ్య మనెను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం బాగుంది. కాని 'తీరెడి, వచ్చె, కోరెను, లేక, అనెను' అన్నప్పుడు నిషిద్ధాక్షరాను ప్రయోగించారు. మరో ప్రయత్నం చేయండి.

   తొలగించండి
  2. జిలేబి గారు కనిపించని కొరత కొట్టవచ్చినట్లు కనిపించుచున్నది...

   తొలగించండి
 3. భరతునికి తల్లి యయినను
  మురిపెముతో జూచి బాల్యమున రాముని మం
  థర పల్కులు విని యడవికి
  తరలించుట బ్రోవ సకలతాపసగణమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నేమాని వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మురిపెము' అన్నచోట నియమోల్లంఘన జరిగింది. అక్కడ "మురిపము" అనవచ్చు.

   తొలగించండి
 4. పెంచి నావు శ్రీ రాముని ప్రేమ తోడ,
  కుటిల మంధర నీలోన కోర్కె పెంచ,
  నీదు సుతునకు రాజ్యము ముదము తోడ
  కట్ట బెట్టి పెంచిన , ప్రేమ కాల ద్రోసి
  వనమునకు రాము నంపిన ఘనత నీది

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగమణి గారూ,
   పద్యం బాగుంది. కాని 'పెంచి, ప్రేమ, కోర్కె పెంచ, బెట్టి' అని నిషిద్ధాక్షరాలను ప్రయోగించారు. సవరించండి.

   తొలగించండి
 5. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
  ధరణి కల్యాణమును గోరి భరతు మాత
  నింద మోసినట్టి సుగుణ నిధియె తాను
  రామ వనవాస నెపమున రాక్షసులను
  తాను చంపించె! గయ్యాలి యౌెనె జూడ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   పద్యం బాగుంది. కాని 'నిధియె, నెపము, చంపించె, యౌనె' అన్నప్పుడు నియమోల్లంఘన జరిగింది. సవరించండి.

   తొలగించండి
 6. డా.పిట్టా
  ఆశ నాడించు తత్త్వములరయ తమరు
  క్రొత్త పుంతన రాముని గుణసహితుని
  అడవికంపగ వనమున నలర శ్రియము
  హితవరివి నీవ యనిరి సన్మత విబుధులు!

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  ఆర్యా,పైని పూరణలో భరతు మాతకు కవి వినిపి స్తున్న మాటలు.ఇది సాధారణీకరణకొరకు.
  రహిని పగ రగల్చగ మంథరలును చాలు
  బుద్ధి భ్రమియించు మాతను బోలు సతికి
  యనుసుయుక్తి భరతు మాత కగును సొత్తు
  కష్టములు రామునకు నిడ ఘనయశమ్ము

  రిప్లయితొలగించండి
 8. విరించి గారి పూరణ....

  విని మంథర పలుకులు రా
  ముని వనవాస మ్ము పంప మూర్ఖపు టాలో
  చనతో కుచ్చితు రాలగు
  వనిత గ నిలిచితివి నీవు వసుధను గాంచన్.

  రిప్లయితొలగించండి
 9. దశరథుని మూడవ సతిగ ధరణిలోన
  సుతుడు భరతునిరాజుగా చూడదలచి
  రాముడడవులకుతరలి రాక్షసపతి
  రావణుని పరిమార్చ కారణమునీవు

  రిప్లయితొలగించండి
 10. సవతి పుత్రుఁడన్న సంకుచితము వీడి
  రామచంద్రుఁ జూచి ప్రాణసముగ
  నమ్ము పట్టు విధము నమరంగ తపియించి
  వని నధర్మ మడఁచ బనుపఁ దలఁచు

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా(పిట్టా సత్యనారాయణ)
  శ్రీమతి రాజేశ్వరి నేదునూరి అక్కయ్యగారికి,అక్కయ్యా.ఆ వెంటిలేటరును,మృత్యు దేవతను వెంటాడి తరిమి వేసి, మామధ్యకు వచ్చిన మీ ఆశీర్వాదాలు మాకు కావాలి.I wish you speedy recovery and longevity!

  రిప్లయితొలగించండి
 12. కైక
  (కందములు)

  తననాథుడు సురగణముల
  కనిలో విజయంబు గూర్చ నరిగిన తరి యా
  తని గూడి సహకరించిన
  ఘనతర శౌర్యాఢ్య కయిక కాంతల లోనన్. 1.

  పతియన బ్రాణము కన్నను
  క్షితిపయి నత్యున్నతంపు సిరియని దలచున్
  నతు లాయమ కాపట్టున
  చతురతతో మగని గాచు జాణకు నిడుదున్. 2.

  వరముల నిత్తును కొనుమని
  నరపతి పలుకంగ వాని నా కవసరమౌ
  తరుణంబున గోరుదునని
  తరుణి యనుటను గన ముందు తలపును జూపున్.3.

  మలినంబగు భావంబున
  నలనా డా మంధర తన కాడిన మాటల్
  నిలిపి మనంబున పతిపయి
  యలిగిన దవురా యనంగ నా సమయమునన్. 4.

  మతిహీన యనగ దగునా
  సుతుపయి మోహంబు మీరు చొప్పన నగునా
  చతురత యగునా రాముని
  నతి కఠినత జూపి యడవి కనుపుట దలపన్. 5.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   'కైకేయి వ్యక్తిత్వం' అన్న అంశానికి సంపూర్ణ న్యాయం చేస్తున్నవి మీ మనోహర పద్యాలు. అభినందనలు.

   తొలగించండి
  2. అద్భుతం సార్! మూడు రోజుల పిదప మీ దర్శనం!

   తొలగించండి
  3. ధన్యవాదాలండి, నమస్కారం.

   తొలగించండి
 13. భరతునిన్ రాజు గానుంచ ప్రతిన బూని
  రాము నంపితివికద యారామమునకు
  మంథర వచనములువిని మంద బుద్ధి !
  నీదు పతిని జంపితివను నింద పడగ

  రిప్లయితొలగించండి
 14. భరతుని గనిన నోయమ్మ !భవ్య చరిత !
  రామ చంద్రుని గొడుకుగా మమత లొసఁగి
  చూచి లాలించి తివిగద సొబగు మీర
  పంపు చుంటివి యడవికి పాడి యగున ?

  రిప్లయితొలగించండి
 15. దుష్టమతిని దూర కలుగు దురిత మికను
  మంధర పలుకులు వినగ మాయ పొంది
  దుష్టురాలుగ నిలవగ దురిత మంది
  విధవతన మందితివి కదా విలువ పోవ

  రిప్లయితొలగించండి
 16. శ్రీ రాముని పిన్నమ్మా!
  శ్రీ రాముని సీత తోడ శ్రీ లక్ష్మణునిన్
  కారడవికి పంపి భళా
  శ్రీ రావణుజంపితీవు స్థిరముగనమ్మా!

  రిప్లయితొలగించండి
 17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 18. రాముడన నీవు కొడుకని రాగ మొంది
  తనను భరతుని కన్నను తలచినావు
  విధి కనగ నాడు నాటక వింత యనగ
  రాము వనవాస మదికోర రక్కసిగను

  రిప్లయితొలగించండి
 19. మిత్రులందఱకు నమస్సులు!

  రాము వనవాసమంపియు రమణమీఱఁ
  గొమరునకుఁ బట్టముంగట్టఁ గోర్కు లబ్బి,
  దమకు హితమొదవునటంచుఁ దలఁచి, భరత
  జనని, మంధర బోధను స్వాగతించు!

  రిప్లయితొలగించండి
 20. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి.

  ఆభిజాత్యమున్న అందాల జవరాలు

  మంథర పలుకులకు మాన్యతొసగి

  కూర్మి తోపతి తనకొసగిన వరములన్

  మిషగ చూపినట్టి  యింతి తాను.


  వలపు తోడ పతియు వరము లిడగ తాను

  వలదటంచు వడిగ పలికి దాని

  చూపుచు మిష గాను సుతుని నయోధ్యకున్

  ప్రభువగునటు లతివ  ప్రభువు నడిగి


  నంత నాగకుండ నారామ చంద్రుని

  వనికి పంపు మనుచు బాస నపుడు

  పంక్తి రథుని నుండి వాసిగా పొందిన

  గొప్ప మాతృ మూర్తి కువలయాన.


  గూని మంథర మాటలు కువలయాన

  నాలకించి పతిమృతికి నతివ బాధ్యు

  రాలు కాగజనులు దుష్టు రాలు ననగ
  నతివతాను కుములు చుండు ననవరతము  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   కైక వ్యక్తిత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు మీ పద్యాలలో. అభినందనలు.

   తొలగించండి
 21. కన్న బిడ్డకు పట్టమ్ము గట్టదలచి
  గచ్చు లాడిని నమ్మిన గన్నతల్లి
  మనసు నవనీతకము మరి మాట కరుకు
  మమత మాటున దాగిన మంకుదనము
  తనది దప్పని దోచిన క్షణమునుండి
  దిద్దుకొనుటకు యత్నించు ధీరవనిత
  రామ చరితకు మూలమౌ రమణి కయిక
  దశరథుని మూడవ బసాలు ధన్యురాలు!!!  రిప్లయితొలగించండి
 22. రాము డనిన యనురాగము మది నిండ
  బడతి చంద్రముఖి యశ్వపతి సుతకు
  మంథర కలుషిత మానసవ్యధిత యా
  రమణి గిరివ్రజ రాకుమారి
  రాజ లాంఛనరత ప్రధన విశారద
  శిఖరిణి యా యుధాజిత్తు భగిని
  స్వార్థ చిత్త పరమ చండి ముక్కోపిని
  పండిత మానిని భరత మాత


  రాజ నీతిఁ దలచి రామునిఁ గంటక
  హీన రాజ్య భోగ మిమ్ముగఁ బడ
  యంగఁ బంపిన వనజాయతాక్షి ధరణి
  దశరథ సతి సాటి తరుణిఁ గనము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆత్మకామా సదా చణ్డీ క్రోధనా ప్రాజ్ఞమానినీ.
   అరోగా చాపి మే మాతా కైకేయీ కిమువాచ హ৷৷ రా. 2.70.10৷৷

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ అత్యద్భుతంగ ఉంది. అభినందనలు.

   తొలగించండి
  3. చిన్న సవరణ: “మంథర కలుషిత మానసవ్యధిత యా రమణి గిరివ్రజ రాజతనయ”

   తొలగించండి
 23. రామచంద్రుని జూచి రాకా శశిని గాంచు
  జలరాశి యన్నట్లు సంతసించు!

  బాలరాముడనంగ భరతుని సమునిగా
  జూచుచు ననురాగ సుధలఁ బంచు !

  రాముడనగ దశరథరూపమని నమ్మి
  మురియుచు మదిలోన ముదమునందు!

  పిన్నిగా దలపక కన్నతల్లిని బోలి
  ప్రియనామము సదా జపించుచుండు!


  నయిన మంథరా దుష్ట వాక్యమ్ము నమ్మి
  రామవనవాసమును గోరి రాజ్యభోగ
  ములను భరతునకడుగుట వలన దశర
  థాధిపుని ముద్దులసతి దుష్టాత్మ యనిరి !!

  రిప్లయితొలగించండి
 24. దశరధుని ముద్దు సతిగ ఉద్దతిని పొంది
  యున్ననూ సవతు లిరువురన్న సంత
  సమ్ము తోవారి సుతులను సాకి నావు,
  వల్ల మాలిన యనురక్తి ఉల్లమందు
  మిడిసి పడగ శ్రీ రాముని మీసరముగ
  తీర్చి దిద్ది నావుట నీవు దీటు గాను,
  దాసి మాటలు మనసును దహన పరచ
  భరతుడే రాజు యనుచు నీ భర్త యొక్క
  మదిని గాయ పరచినావు, మారు మాట
  లాడ వలదని పలుకుచు ఆడి తప్ప
  వలదు మీరనుచు, ధవుని వరము తీర్చ
  మనుచు ఆజ్ఞ యొసగినావు, మారు మాట
  లాడ నీయక రాముని అడవి లోకి
  పంపి నావు, మాట వినక పాలనమ్ము
  వలద నిభరతు డుయనంగ వగచి నావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగమణి గారూ,
   కైకయి వ్యక్తిత్వాన్ని చక్కగా వివరించారు. పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. తనయుడు భరతునకు రాజ్యము నొసగుటయు,
  రాము నడవికి బంప వరము లడిగన
  తల్లి మనసున్ గ్రహించగ తరము కాదు.
  కఠినవజ్రమా!నవనీతకమ్మరయగ!!

  రిప్లయితొలగించండి
 27. శిష్టజన రక్షణము సల్ప శ్రీ హరి భువి
  రావణుని పీడ తొలగించ రాము డగుచు
  నవతరించిన కతనము నడవికంపు
  వరము లడిగిన పినతల్లి భక్తి భక్తి

  రిప్లయితొలగించండి
 28. దశరథుని చిన్నరాణితా దాశరథిని
  కన్నతల్లి కన్నను కరమున్నతమగు
  ప్రేమతో పరిపోషించి పెద్దజేసె
  రామకథకును మూలమారామసుమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెడ్డి గారు మూడవ పాదము లొ ప్రేమ, పెద్ద , జేసి, అనునవి నిశిద్ధములని గురువుగారు సెలవు
   ఇచ్చినారు. నేను వ్రాసిన పైన పద్యములు చూడండి మొదటి పద్యంలో ప్రేమ పెంచ్ అనునవి పనికి రావని పద్యము సవరించమన్నారు.

   తొలగించండి
  2. రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నాగమణి గారు పేర్కొన్నట్టు మూడవ పాదంలో రెండు నిషిద్ధాక్షరాలను ప్రయోగించారు. సవరించండి.

   తొలగించండి
 29. దశరథుని మూడవ సతిగ ధరణిలోన
  సుతుడు భరతునిరాజుగా చూడదలచి
  రాముడడవులకుతరలి రాక్షసపతి
  రావణుని పరిమార్చ కారణమునీవు

  రిప్లయితొలగించండి

 30. పిన్నక నాగేశ్వరరావు.

  " పంపమనుచు రాముని వనవాస
  మునకు
  పట్టమున్ గట్టుము సుతుడు
  భరతునకును "
  స్వార్ధ బుద్ధితో భర్త నీ వరము లడుగ

  దశరథుడు కుప్పకూలగ తక్షణంబు

  దుష్టురాలిగా కయికను దూఱుచుంద్రు.

  ****************************

  రిప్లయితొలగించండి
 31. డా.పిట్టా(పిట్టా సత్యనారాయణ)
  శ్రీమతి రాజేశ్వరి నేదునూరి అక్కయ్యగారికి,అక్కయ్యా.ఆ వెంటిలేటరును,మృత్యు దేవతను వెంటాడి తరిమి వేసి, మామధ్యకు వచ్చిన మీ ఆశీర్వాదాలు మాకు కావాలి.I wish you speedy recovery and longevity!

  రిప్లయితొలగించండి
 32. క్రొవ్విడి వెంకట రాజారావు

  వలపు వాత్సల్యముల తోడ వహిని జూపి
  భరతునికి మించి గారాము పఱచి యుండి
  రాఘవు నడరించిన పిన్ని లలిని తునిమి
  నతని నడవుల కంపుట యబ్బురమగు

  రిప్లయితొలగించండి
 33. ఆశ్రితుడగుశిష్యుడు తా
  శుశ్రూష లొనర్చి గురుని సొత్తుహరించెన్
  విశ్రుతమౌ కథ నెరుగరె
  ఆశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన్

  రిప్లయితొలగించండి