15, జూన్ 2017, గురువారం

సమస్య – 2385 (చచ్చె సింహము...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ"
(లేదా...)
"చచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్"
(ఆకాశవాణి వారి సమస్య...)

84 కామెంట్‌లు:

 1. ద్వాపర యుగ కధ , త్రేతా యుగ కధ  ఎలుగు బంటుతో పోరాడి యలసి సొలసి
  చచ్చె సింహము, జింకచే నచ్చెరువుగ
  మురిసి పోయి శ్రీ రాముడు మోస పోవ
  పడతి దూరమాయెనుగదా అడవి లోన

  రిప్లయితొలగించండి
 2. వరము పొందిన యసురుడు భరము చేత
  భస్మ మొనరించ వెంటాడె భవుని శిరము
  సూక్ష్మ బుద్ధియె లేకున్న చోద్య మదియె
  చచ్చె సింహము జింకచే నచ్చె రువుగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పొంది యసురుడు కావరము చేత" అనండి.

   తొలగించండి
  2. వరము పొంది యసురుడు కావరము చేత
   భస్మ మొనరించ వెంటాడె భవుని శిరము
   సూక్ష్మ బుద్ధియె లేకున్న చోద్య మదియె
   చచ్చె సింహము జింకచే నచ్చె రువుగ

   తొలగించండి
 3. శాప వశమున నుడుగవే శక్తులన్ని!
  కృష్ణుడంతరించెనుగ నికృష్టముగను!
  పార్థుడంతరించెనుగద బభ్రు చేత!
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ...

  రిప్లయితొలగించండి
 4. వచ్చెన్ శంకరు డుగ్రనేత్రుడగుచున్ వాత్సల్యమేపారగా
  రచ్చల్ సేయని భక్తునిన్ ,కరుణ,మార్కండేయుఁగాపాడగా
  మెచ్చెన్ బాలుని,పారె నా యముడు 'సామీ!రక్ష!మాంరక్ష'నాన్
  చచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్

  మార్కండేయుడనే జింక యముడనే సింహాన్ని
  పారద్రోలెనని నా భావన

  రిప్లయితొలగించండి
 5. గురువు గారికి వందనములు. నిన్నటి నా పూరణ పరిశీలించ ప్రార్థన. ధన్యవాదములు.
  శ్రీకరుండె కలము చేతికిచ్చినటుల
  సిద్ధహస్తుడయ్యె సింగిరెడ్డి
  నామ వంశజుండు నారాయణుడనెడి
  రెడ్డి తెలుగు కవిత రెచ్చి పోవ!

  రిప్లయితొలగించండి
 6. పరుగు పరుగున హరిణమ్ముఁ బట్ట నెంచి
  లక్ష్యమును పొందు దృష్టి యురకలు వేయ
  కనక బావిలోన బడుచు కాళ్లు విరిగి
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ

  రిప్లయితొలగించండి
 7. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  పచ్చి వలసవాదంబున రెచ్చిపోయి
  దేశముల నేలు బ్రిటను కావేశములను
  ఒక్క గాంధేయ తత్త్వమే యుక్కడంచె
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ

  రిప్లయితొలగించండి
 9. డా.పిట్టానుండి
  కావేషము సాధువు.కావున "నిర్దేశ తతిని" గా స్వీకరించ మనవి.2వ పాదములో..

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా
  వచ్చీ పోయెడు దగ్గు మిక్కుటమవన్ వారిచ్చిరీ యౌషధం
  బచ్చంగా నిదురించనిమ్మనుకొనిరి నప్పారిన్ సినారేకు నా
  డిచ్ఛన్ గొంతున కాని,పోని కఫమే డించెన్ మహద్వాణినిన్
  చచ్చెన్ సింహము జింక చేత నకటా!శౌర్యంబు వోనాడుచున్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   వృత్తం రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
   (19వ తేదీ కవిసమ్మేళనానికి వస్తున్నారా?)

   తొలగించండి
  2. డా.పిట్టానుండి
   ఆర్యా,ధన్యవాదాలు.సవరణ జరిగనది.19న వస్తున్నా.18 న కాక.కళా వైభ.కి మనవారిని పిలిచే యత్నం శ్రీరాం తో చేయించండి

   తొలగించండి
 11. నటమృగేద్రము గణనమున్ నలిగిపోవ
  నూరుపేరు లేని మనిషి యుధృతిచేత
  జనులు పలికిరి కాంచి విస్మయముతోడ
  “చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ”

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గణనము, ఉధృతి'...?

   తొలగించండి
  2. కల్వకుర్తి ఎన్నికలో ఊరూ పేరూ లేని వ్యక్తి చేతిలో ఎన్.టి.రామారావు గారు ఓడిపోయారు. ఆసంఘటన. గణనముః ఎన్నిక, ఉధృతిః తీవ్రమైన పోటీ.
   నటమృగేద్రము గణనమున్ నలిగిపోయె
   నూరుపేరు లేని మనిషి యుధృతినెదర
   జనులు పలికిరి కనుగొని సంతసముగ
   “చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ”

   తొలగించండి
 12. అతిశయోక్తుల స్పర్థలో నబ్బురముగ
  దోమకుత్తుక దూరెను సామజ మని
  యాడ నొక్కడు మరియొక్క డనియె నిట్లు
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ.

  హ.వేం.స.న.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ అతిశయోక్తుల పోటీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. కచ్చన్ రాక్షస కూటమిన్ బనిపి తా కంసుండు శ్రీకృష్ణునిన్
  నిచ్చల్ జంపగనెంచినన్ దునిమె తా నెంతేని దర్పోధ్ధతిన్
  వచ్చెన్ సోదరుతోడ మామనుసురుల్ వాలయమై తీయగన్
  చచ్చెన్ సింహము జింకచేతనకటాశౌర్యమ్ము వోనాడుచున్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి

 14. నీచ కీచకు భీముడే పీచమడచ
  నిజముదెలియక కృష్ణపై నిందవేసి
  వానిమిత్రులు తలపోసి పలికిరిట్లు
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ.

  రిప్లయితొలగించండి
 15. రెచ్చెన్ వీరకిశోరమౌచుఁ దగ నాంగ్లేయాదు లల్లాడగన్
  వచ్చున్ కష్టము మన్యమెల్ల ననుచున్ భావించి యల్లూరి తా
  స్వచ్ఛందమ్ముగ లొంగిపోవ నెదనే సారించి తూటాడగన్
  జచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్

  రిప్లయితొలగించండి
 16. నిన్న మొన్ననె క్రీడలో కన్ను తెరచి
  బ్యాటు మింటను రాణిగా పదును తేరి
  కనగ మారిను నోడించి తనరె సింధు
  చచ్చె సింహమ్ము జింక చే నచ్చెరువుగ
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  బలమది తెలివి నేర్పుల కలవడు నటు
  వేటలో సింహ మాజింక వెంట బడుచు
  యదియె దాటిన గర్తము నందున పడి
  చచ్చె సింహము జింకచే నచ్చెరువున
  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..బడుచు। నదియె...' అనండి.

   తొలగించండి
 18. రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. గాంధీ గారి పరంగా మీ పూరణ బాగుంది. మూడవ పాదంలో యతి?

   తొలగించండి
  3. గురువుగారూ నిన్న మీ రడిగిన ప్రశ్న ఇవాళ నిజమయింది.
   నా పూరణలో మూడవ పాదంలో యతి భంగమయింది. అందుచేత తొలగించాను.
   గుండా సహదేవుడు గారు గమనించి చెప్పారు.
   సవరించిన పూరణ ఇది:

   తెచ్చెన్స్వేచ్ఛను భారతావనికి తా ధీరత్వమేపారగా
   సచ్ఛీలత్వ మహింస సత్యములనే సంధించి మ్లేచ్ఛాళిపై
   తుచ్ఛుండేయ ప్రణామమున్సలుపుచున్ తూటా పడెన్ ధాత్రిపై
   చచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్.

   గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి ధన్యవాదములు.

   తొలగించండి
  4. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాను.

   తొలగించండి
 19. క్రొవ్విడి వెంకట రాజారావు
  :చిన్ని సవరణ-

  బలమది తెలివి నేర్పుల కలవడు నటు
  వేటయందు కురంగమ్ము వెంట బడుచు
  యదియె దాటిన గర్తము నందున పడి
  చచ్చె సింహము జింకచే నచ్చెరువున
  రిప్లయితొలగించండి
 20. అరయ కార్టూను చిత్రాల నద్భుతముగ
  ఎలుక పిల్లిని దరిమెను నెలమి తోడ
  ఈగ మనుజుని జంపెను వేగముగను
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ!!!

  రిప్లయితొలగించండి
 21. రిప్లయిలు
  1. మీరి హరిణమ్ము తృణమును మేయు చుండ
   నంత మృగరాజు కుప్పించి యారగించెఁ
   గాంచి నంతనె సారంగ ఘాసము లట
   చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ


   మచ్చం దెచ్చిరి దేశ కీర్తికిక సన్మానంపు గర్వమ్మునం
   గచ్చెన్ గెల్చెను బంతియాట నిట బంగ్లాదేశ మా పౌరులే
   మెచ్చంజూ పరులెల్ల భారతమునన్ మిథ్యోర్వి వర్తిల్లగం
   జచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా సారంగ ఘాసాలు సింహ హరిణాలచే చచ్చాయన్న మొదటి పూరణ వినూత్నమైన పద్ధతిలో అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు

   తొలగించండి

 22. పిన్నక నాగేశ్వరరావు.

  జింకను తరుముచుండగా సింహ
  మొకటి
  దారిలోని యగడ్తను దాటె జింక

  కందకమ్మును గానక యందున బడి

  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ.

  *****************************

  రిప్లయితొలగించండి
 23. బాహుబలి గొప్ప బలశాలి; పవరమందు
  నిత్య విజయుడు; కట్టప్ప నీతి మాలి
  వెన్నుపోటును పొడువంగ కన్నుమూసె;
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగను

  రిప్లయితొలగించండి
 24. మందగమనుని మహిమచే మందభాగ్యు
  డౌచు ముక్కంటి యౌరౌర డంబమొదలి
  చెట్టు తొర్రలోదాగెనే చెడ్డవేళ
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'డంబము విడి' అనండి. ఒదలి అన్నది సాధువు కాదు.

   తొలగించండి
 25. పట్టగా బుసలిడి పగబట్టు పాము
  చిట్టి చీమల చేజిక్కి పుట్టలోనె
  తుత్తునియలై నశించెను తుట్ట తుదకు
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ

  శ్రీ కంది శంకరయ్య గారికి నమస్సులు
  నిన్న ప్రయాణపు తొందరలో తేటగీతి రచించాను
  అదే అంశం పై ఆటవెలదిని నేడు వ్రాసాను

  శ్రీ సి.నా.రె కిడిరి శ్రీ దేవి వాగ్దేవి
  సిరులు కవన ఝరులు చిత్ర గతిని
  నా "సుభాషితముల" నారసి మురిసి వా
  రెన్నొ దీవెనలను మున్నె యిడిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మీ సుభాషితాలు సినారె గారి మెప్పును పొందినందుకు సంతోషం!

   తొలగించండి
 26. కచ్చ గట్టిన యంబ శిఖండి యగుచు
  జనన మందెను భీష్ముని చంపెను గద
  హరిణమౌ యంబ యెదిరించ కురు హరీంద్రు,
  జచ్చె సింహము జింకచే నచ్చెరువుగను

  రిప్లయితొలగించండి
 27. చొచ్చెన్ క్రొత్తగ రాజకీయములలో సోద్యమ్ముగానప్పుడే
  వ్రచ్చెన్ భీకరమైన మొగ్గరములోరామయ్యనే వింతగా
  నచ్చంబౌ విజయమ్ముగాంచి జనముల్ హర్షమ్ముతో పల్కెడిన్
  “చచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్”

  రిప్లయితొలగించండి
 28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 30. *గురజాడ ఫౌౌంండేషన్ USAవారి రాష్ట్రమరియు జాతీయ విశిష్టసాహితీసేవా పురస్కార గ్రహీత సహస్ర కవిరత్న సహస్ర కవిభూషణ*
  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  15, జూన్ 2017, గురువారం

  *కవిమిత్రులారా!*

  ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

  *"చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ"*

  (లేదా...)
  *"చచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్"*

  *వచ్చెన్ దూకె క్షుదాప్రభావగతిఁనూర్ధ్వాభ్రప్లవద్వక్రయై*
  *గ్రుచ్చన్ గొమ్ములుశూలశీర్షములనన్ గుండెన్ వడిన్ చీల్చుచున్*
  *చచ్చెన్ జింకభయంబుచేయెడచవిచ్చన్ సింహనాదంబుచేన్*
  *"చచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్"*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సందిత గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీరు కేవలం పూరణ ఇస్తే చాలు... అని గతంలోనూ చెప్పాను.

   తొలగించండి
  2. క్షుధాప్రభావగతి కి బదులు క్షుదాప్రభావగతి యని పడినది.

   తొలగించండి
 31. బదులు పలుకుదు ప్రశ్నకు బాగు ననెడు
  బుద్ధిమంతునడిగెనట బుడతకొడుకు
  తిట్టి తివితాతనికనాకు తీరునిదియ?
  చచ్చె సింహమ్ము జింకచే నచ్చెరువుగ

  రిప్లయితొలగించండి
 32. [15/06, 5:08 PM] సందిత బెంగుళూరు: *గురజాడ ఫౌౌంండేషన్ USAవారి రాష్ట్రమరియు జాతీయ విశిష్టసాహితీసేవా పురస్కార గ్రహీత సహస్ర కవిరత్న సహస్ర కవిభూషణ*
  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  15, జూన్ 2017, గురువారం

  *కవిమిత్రులారా!*

  ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

  *"చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ"*

  (లేదా...)
  *"చచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్"*

  *వచ్చెన్ దూకె క్షుదాప్రభావగతిఁనూర్ధ్వాభ్రప్లవద్వక్రయై*
  *గ్రుచ్చన్ గొమ్ములుశూలశీర్షములనన్ గుండెన్ వడిన్ చీల్చుచున్*
  *చచ్చెన్ జింకభయంబుచేయెడద విచ్చన్ సింహనాదంబుచేన్*
  *"చచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్"*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  సవరణ అనంతరం...
  సింహము జింకపైకి దూకింది.కాసీ
  ఆకలిప్రభావంచే గతి తప్పిగురితప్పి ఆకాశంపైకి ఎగరటంలో తప్పుడువంపులకు గురియై...
  బల్లెములపదునైనకొనలతో పోల్చదగిన జింక కొమ్ములపై పడటంతో అవి గుండెల్లోకిచీల్చుకుంటూవెళ్ళాయి.సింహం అరుపుకే గుండె ఆగి జింక చచ్చింది. జింక వలన సింహమూ చచ్చింది యాదృఛ్ఛికంగా
  [15/06, 5:14 PM] సందిత బెంగుళూరు: ధన్యురాలను గురుదేవా.
  ఊర్ధ్వాభ్ర=ఆకాశంపై
  ప్లవత్ =తేలుతున్నప్పుడు
  వక్రయై= తప్పుడు వంపుతిరిగినదై

  మళ్ళీపోస్టు చేసినందుకు మన్నించండి ప్రయాణంలో బస్సులో పాట్లు🙏🌹🙏🌹�🙏

  రిప్లయితొలగించండి
 33. తే . గీ . చెట్టు చాటుకు రాముడు చేరి నక్కి

  విల్లు వేయగొల్లున "వాలి" విధి వశమున

  జచ్చె సింహము జింకచే నచ్చెరువుగ

  పోరు సలుపననుంజుని మీర గలఁడె ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర ప్రసాద్ గారూ,
   ఎన్నాళ్ళకెన్నాళ్ళకు? సంతోషం!
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పోరు సలుపగ ననుజుని మీరగలఁడె" అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 34. వెడలె హిమ నిర్ఝరమునుండి వేడిగాలి,
  పూచెనే పూలు రాలకు, తోచె నదిగొ
  శిశిర మందున వర్షము, చిత్రమదియ,
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ!

  రిప్లయితొలగించండి
 35. దుముక బోవ నా సింగము దుప్పి గాంచి
  వేట గాని శరమొకటి వేగిరమున
  చేరి నంత తప్పుకొనిన జింక బ్రతికె!
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ!

  రిప్లయితొలగించండి

 36. చిచ్చున్ రేపె మనోభవుండిదె *మృగాక్షీ* ! నా మనంబెందుకో
  నచ్చెన్ నిన్నె యటన్న *సింహబలునిన్* నైపుణ్యమేపార రా
  నిచ్చెన్ *నర్తనశాల*కున్ మధువునందింపంగ నచ్చోటనే
  చచ్చెన్ *సింహము జింకచేత* నకటా శౌర్యంబు వోనాడుచున్ !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గాజు సింహము , మట్టితో గట్టిదైన
   జింక బొమ్మను వరుసల జేర్చనొకడు
   చేయి జార కేసరి పయిన్ జింక పడగ
   చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ!!

   తొలగించండి
  2. మురళీకృష్ణ గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి

 37. జూలు విదిలించి క్రూరపు చూపు తోడ
  పైకి దూకుచు నుండంగ భయము చేత
  పరుగు దీసెనా హరిణమ్ము పట్టబోయి
  దాని ,పడిపోయి వలలోన దారి గనక
  చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ.

  రిప్లయితొలగించండి
 38. వేటగాడు మచ్చుగ జింక పెట్టె ననెడు
  నెరుక లేక యాకట జింక కొరకు బోయి
  యుచ్చులో జిక్కి దీనయై యుస్సురనుచు
  చచ్చె సింహమ్ము జింకచే నచ్చెరువుగ
  (మచ్చు అనగా జంతువును వేటాడటానికి ఆహారంగా ఇచ్చే మరొక జంతువు)

  రిప్లయితొలగించండి
 39. వచ్చెన్ వేసవి రోగముల్ వడి వడిన్ భాగ్యంపునగ్రమ్మునన్,
  పుచ్చిన్ మాంసము పెట్టగా భడవడా ప్రొద్దున్న జూనందునన్,
  చచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్;...
  నచ్చెన్ నాకుర! నీది కైపద మిదే నాదైన పూర్ణంబహో :)

  రిప్లయితొలగించండి