26, అక్టోబర్ 2017, గురువారం

సమస్య - 2504 (జిహ్వికకుఁ బంచదార...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జిహ్వికకు పంచదారయె చేదు గాదె?"
ఈ సమస్యను పంపిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.

94 కామెంట్‌లు:

 1. వంగ దేశము నందున భంగు ద్రాగి
  రంగు లాటల దినమున మ్రింగుచుండి
  పందులవలె రసమలైలు వంద తినిన
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మంచి పూరణ. అభినందనలు.
   'రసమలై' నాకు క్రొత్తపదం. రసగుల్లాల వంటివా?

   తొలగించండి
  2. సార్!

   వ్హాట్సప్ సమూహములో ఫొటో పెట్టితిని.


   బెంగాలీ స్వీట్లన్నిటి పేర్లూ (బెంగాలీ అమ్మాయిల పేర్లలా) మధురంగా ఉంటాయి. రూపు తేడా... రుచి ఒకటే.

   🙏🙏👍

   తొలగించండి


  3. బెంగాలీయమ్మాయిల
   వింగడముల్ రసమలాయి విరివిగ మేలౌ
   సింగాఢ మిష్టి దోయీ
   బంగరు దినముల తలపుల వాహ్ జీపీయెస్ :)

   జిలేబి

   తొలగించండి
 2. మత్స్యములు బట్టువారికి మల్లె కంపు
  నిడును, తినగ తినగ ఘన నింబ పత్ర
  మిడగ దీపి మనకు చిత్ర మేమి గాదు
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె?"

  రిప్లయితొలగించండి
 3. వీసె నూనెను త్రాగిన వెగటు బుట్టు
  నేయి తినినంత వాంతులు నిశ్చ యమ్ము
  కోరి శుభమంచు తీపిని మరల మరల
  జిహ్వికకు పంచ దారయె చేదు గాదె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కోరి తినినచో తీపిని మరల మరల' అనండి అన్వయం చక్కగా సరిపోతుంది.

   తొలగించండి
  2. వీసె నూనెను త్రాగిన వెగటు బుట్టు
   నేయి తినినంత వాంతులు నిశ్చ యమ్ము
   కోరి తినినచో తీపిని మరల మరల
   జిహ్వికకు పంచ దారయె చేదు గాదె

   తొలగించండి
 4. కవి మిత్రులకు ఈ రోజు నేను వ్రాసిన లింగ బంధ ఈశ్వర స్తుతి గురువు గారు పెట్టినారు. చూచి మీ అమూల్యమైన అభిప్రాయములు తెలుప గలరు. ధన్యవాదములు పూసపాటి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్య కుమార్ గారు! కనీసపు టుత్వ సంధులు విస్మరించిన ఛందోబద్ధ మనోహర కవిత్వము గాంచ సత్కవులకు బిందెడు చక్కని చిక్కని పాలలో చుక్క విషము కలిపి యిచ్చిన రీతి యగును. మీ మనస్సు కష్ట పెట్టినందుకు క్షంతవ్యున్ని. మాత్ర చేదుగా నుంటే కాని వ్యాధి నయ మవదు కదా!

   తొలగించండి


 5. ఆహ్వయము జిలేబీయట! అచ్చెరియము
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె?
  గహ్వరము మధుమేహము కారణమ్ము
  జిహ్వ చాపల్యమకట గజిబిజి చేయ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వహ్వ వహ్వ వహ్వ మీదు "హ్వ" ప్రాస!

   👏👏👏👏

   తొలగించండి
  2. భోజన ప్రియు డొక్కడు భూజనులకు
   నిష్ట మైన జాంగ్ర్రీలను మిష్టములను
   సుష్టుగా తిన్న తదుపరి చోటులేక
   "జిహ్వికకు పంచదారయె చేదు గాదె?"
   ****}{}{****
   మిష్టములు = స్వీట్స్.

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   మంచి పూరణ. తేటగీతిలో ప్రాస.. అదికూడా దుష్కరప్రాస! భేష్! అభినందనలు.

   తొలగించండి
  4. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

  5. జీపీయెస్సు వారికి కందివారికి

   నమో నమః !

   జనార్ధనరావు గారు

   జాంగ్రీలను ప్రస్తావించారు జిలేబీని వదిలేసేరు :)


   జిలేబి

   తొలగించండి
  6. ఆహ్వరము జిలేబి యగుట
   జిహ్వాచాపలము బెంచు, జిగిబిగి కవితల్
   వహ్వాయను రీతిని మన
   జిహ్వల కాహ్లాదమిచ్చు జిల్ జిల్లనగా!

   తొలగించండి
  7. ముందు ముందు రాబోతున్నాయెన్నో జిలేబీల !

   తొలగించండి
 6. (చక్కెరవ్యాధి తీవ్రత)
  చిన్నదైనను చెదపుర్వు చేరియున్న
  మహితపుస్తకమైనను మట్టిచేయు;
  తలప మధుమేహరోగమ్ము తనువుజెరచు;
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   అర్థాంతరన్యాసంతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 7. యుద్ధము వలదని శ్రీకృష్ణుడు ఎంతచెప్పిననూ రారాజు వినకపోవుటను దృష్టిలో ఉంచుకుని.
  వాసు దేవుడు యుద్ధము వలదనుచును
  పెక్కు తెఱగుల నీతులు ప్రీతిఁ జెప్ప
  దుష్ట సహవాస విషమును ధ్రువము తాగు
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె
  (ధ్రువము=ఎప్పుడూ)

  రిప్లయితొలగించండి
 8. ఎల్ల వేళల పొరుగింటి పుల్ల కూర
  మేలు మేలని మెచ్చుచు మిడుకుచుండ
  ప్రేమ మీరంగ ప్రియురాలు పెదవి తేనె
  జిహ్వికకు పంచ, దారయె చేదు గాదె?

  దార = భార్య

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అద్భుతమైన విరుపు!!!

   తరువాత దారచే నడ్డి విరుపు :(

   తొలగించండి
  2. అద్భుతము మీ పూరణ సత్యనారాయణగారూ! మిక్కిలి అభినందనలు అందుకొనుడీ!

   తొలగించండి

  3. జిగురు జీ గురో !జిగిజిగిలాడె !

   జిలేబి

   తొలగించండి
  4. జిగురు వారూ,
   వైవిధ్యమైన విరుపుతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  5. గురువు గారికి, శాస్త్రి గారికి, శర్మ గారికి, జిలేబి గారికి
   ధన్యవాదములు

   తొలగించండి
 9. డా.పిట్టా
  జిహ్మమగు రుచి నొక్కచో జేర ధనము
  సానులిండ్లను దిరుగగా సాగు నకట!
  ఇల్లు, యిల్లాలు బట్టవు నిరవుగాను
  జిహ్వికకు పంచదారయే చేదు కాదె?!
  (జి హ్మము=వంకరైనది)(పంచ =ఇల్లు;దార=భార్య/ఇల్లు+ఆలు=ఇల్లాలు=భార్య)
  *పుర్రె కో బుద్ధి, జిహ్వకో రుచి--సామెత/జాతీయము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మంచి పూరణ. అభినందనలు.
   'ఇల్లు నిల్లాలు' అనండి.

   తొలగించండి
  2. డా.పిట్టా నుండి
   ఆర్యా, కృతజ్ఞతలు,మీఅడ్రస్ కాగితం దొరకడంలేదు.నా సెల్ 9849812054కు SMS చేయ ప్రార్థన.

   తొలగించండి
 10. జయము జయము కృష్ణ! జయదేవ కృత మధు
  రాష్టపదుల మధువులానినపుడు
  కాంక్ష తీర జిహ్వికకు పంచదారయె
  చేదు కాదె సుధయు చేదు కాదె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విజయకుమార్ గారూ,
   గీత మాధ్యుర్యం ముందు పంచదార ఎంత? మధురమైన పూరణ. తేటగీతి పాదాన్ని ఆటవెలదిలో నిక్షిప్తం చేసిన మీ ప్రావీణ్యం ప్రశంసనీయం. అభినందనలు.

   తొలగించండి
 11. మైలవరపు వారి పూరణ:

  🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  ద్వాదశాక్షరీ మంత్ర దివ్యామృతంపు
  మధుర మధురాతి మధుర సంబంధ మహిమఁ ...
  గొనిన గొనుచుండి గొనబోవు కోర్కెగల్గు
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. మైలవరపు వారి కవిత
   చాలా చక్కటి జిలేబి చక్కెర కేళీ :)

   జిలేబి

   తొలగించండి
  2. మైలవరపు మురళి కృష్ణ మేలు! సాహొ!
   మధుర మధురాతి మధురమై సుధలు గురియు
   భావసౌందర్య భూషిత పద్యమందు
   పూరణము జెప్పు మీకివే భూరి నతులు!

   తొలగించండి
  3. మైలవరపు వారి కవిత
   చాలా చక్కటి జిలేబి చక్కెర కేళీ :)
   కోలో కోలో యన్నన్
   మేలో మేలో యనదగు మెక్కెడి కొలదీ!

   తొలగించండి
 12. అతియు సర్వత్ర వర్జయే తన్న సూక్తి
  నిజ మ దా హా ర సేవన నీమమందు
  మధుర పాయసం బుమరల మరల తినగ
  జిహ్వి క కు పంచదార యె చేదు గాదె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సేవన నియమమందు' అనండి.

   తొలగించండి
 13. రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'స్వరమాధురి' అన్నచోట గణదోషం. "స్వర సుమాధురి మరగిన..." అనండి.

   తొలగించండి
  2. అహరహము హరినామము నారగించు
   రుచియె సంకీర్తనమనుచు రూఢిగాను
   సుస్వర మధురిమ మరయు శుభ్రమైన
   జిహ్వికకు పంచదారయె చేదుగాదె!

   తొలగించండి
 14. వయసు పెరుగగ ముదుసలి వద్దనకనె
  బూరె బొబ్బట్టు రసగుల్ల కోరి మ్రింగి
  బడగ మధుమేహ వ్యాధిని ఫలిత మనగ
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె

  నిన్నటి సమస్యకు నా పూరణ

  కాట్రేనికోన లో గల
  పట్రాయుని కవి యొకండు పట్టుచు మధిరన్
  పేట్రేగుచు వాగె నిటుల
  గట్రాచూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే

  రిప్లయితొలగించండి
 15. రామ నామామృతము గ్రోలి, ప్రజల ధనము
  మందిరమ్ముగ నగలుగ మార్చి తూగి
  రంజిలెడు భక్తుడైనట్టి రామదాసు
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   "పాలు మీగడల కన్న పంచదార చిలుకల కన్న శ్రీరామ నీనామ మెంతొ రుచిరా" అన్న రామదాసును ప్రస్తావించిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 16. ఆకలిని గొన్న వానికి నన్నమిడగ
  కుక్షినిండును కంటికి కునుకు వచ్చు
  నట్లుజేయక చక్కెర నతని కొసగ
  జిహ్వకునుపంచదారయె చేదు గాదె

  రిప్లయితొలగించండి
 17. నిత్యమతిమూత్రపు తెగులు నెగులుపఱచ
  తనువు కాపాడు కొనునట్టి తలపుగల్గ
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె?
  యరయ కాకరగాయలె యమృతమగును

  రిప్లయితొలగించండి
 18. జబ్బుచేసెను సత్తువ జారిపోయె
  కాయమదిడస్సి తనువంత కాకపెరిగె
  నూరుడిగ్రీల జ్వరముతో నోరు పగుల
  జిహ్వికకు పంచదారయె చేదుకాదె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. శ్రీరాం గారు,డస్సిపోతే షుగర్ డౌన.. చక్కెర లాభమే.glucose వసరం.
   డా.పిట్టా

   తొలగించండి
 19. చందురుని వెల్గు నందున నందమైన
  ముదిత యదరామృతముగొన నెదురుచూచి
  కామ కంపనములు మదిఁ గదలు వాని
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె?

  రిప్లయితొలగించండి
 20. తీయతీయగలడ్డులుతినెడునట్టి
  జిహ్వికకుపంచదారయెచేదుగాదె
  తీపివస్తువుల్లతిగనుదినుటవలన
  పుచ్చుపోవునుబండ్లన్నిపురుగుపట్టి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "తీపి వస్తువుల నతిగ దినుటవలన" అనండి.

   తొలగించండి
 21. సుధలు గురిపించు నాచెలి సుందరాంగి
  పరువములసాటి గనలేను ధరణి లోన
  మధురమౌయధరములుండ మధుమతివిట
  *జిహ్వికకు పంచదారయె చేదు గాదె*

  రిప్లయితొలగించండి
 22. కాపురుషు లతి క్రూరులు కాల చోది
  త నరులకు మిత్ర నీతి వచనముల నను
  రాగ మేల యబ్బుఁ బటుతర జ్వర యుత
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   చక్కని అర్థాంతరన్యాసతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 23. నిజమె మధుమేహమున్నట్టి నిఖిల జనుల

  జిహ్వికకు పంచదారయె చేదుగాదె

  పంచదారంటె నందుకే పడదు నాకు

  వద్దు వద్దని యందురు పెద్దవారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దారంటె యందుకే' అనండి. నిజానికి 'దార+అంటే' యడాగమం వస్తుంది.'అంటే' అనడం వ్యావహారికం కూడా.

   తొలగించండి


 24. పండుగలటన్న మరితీపి వంటకాలు

  వాటి వల్ల కలుగు గాదె వాసిగాను

  జిహ్వికకు పంచదారయె ,చేదు గాదె

  నిలను మధుమేహ రోగుల కివియు నెపుడు.


  తీపి వంటకములటన్న తెలుగువారి

  జిహ్వికకు పంచదారయె , చేదు గాదె

  నారగింప చక్కెర రోగు లకునటంచు

  వైద్యులెల్లరు వారింత్రు వసుధ యందు.

  రిప్లయితొలగించండి
 25. వియ్యమందెడి బంధువుల్ వేడుకందు
  నోట చక్కర వేయంగ?చాటుతీపి|
  కాని?కట్నమే దగ్గిన?”కలహమందు
  జిహ్వకకు పంచదారయె చేదుగాదె|


  రిప్లయితొలగించండి
 26. మితము కడచి మాటాడగ హితవు కాదు!
  పట్టు తప్పినంత వెగటు పుట్టు ధరను
  నభిరుచులు రుచుల వలెను! హద్దు మీఱ
  జిహ్వికకు పంచదారయె చేదు కాదె!

  రిప్లయితొలగించండి
 27. వియ్యమందెడి బంధువుల్ వేడుకందు
  నోట చక్కర వేయంగ?చాటుతీపి|
  కాని?కట్నమే దగ్గిన?”కలహమందు
  జిహ్వికకు పంచదారయె చేదుగాదె|
  2.తేనె పెదవిన జిక్కును మానినికడ|
  చెక్కరుండును మాటల నిక్కమందు|
  ప్రక్క జేరని పక్షాన చక్కదనము
  జిహ్వికకు పంచదారయె చేదుగాదె|  రిప్లయితొలగించండి
 28. తీపి తేనీట లేదని యాపి చెలిని
  మోవి తాకించి నీయఁగ పోరినంత
  సణగి శుక్రవారమ్మని చక్కెర నిడ
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె?

  రిప్లయితొలగించండి
 29. రామచంద్రుని నామమున్ రమ్యముగను
  తన్మయత్వము నందుచు తనువు మరచి
  ప్రస్తుతించెడు భక్తుడు రామదాసు
  జిహ్వికకు పంచదారయె చేదుగాదె!!!


  పైత్యదోషమునగలుగు వ్యాధివలన
  ఏది దినినను నోరంత చేదు గాను
  రుచికరమ్మును గోల్పోవు రుజను, రోగి
  జిహ్వికకు పంచదారయె చేదు గాదె!!!

  రిప్లయితొలగించండి
 30. గురువు గారికి నమస్సులు.నా పూరణ లోని లోపములు తెల్పుడు.
  మామిడి రసము ,భక్ష్యము మాతృ ప్రేమ
  సహజమగు తీపి రా!మానస సుత రాజా
  కలియుగంబున తీవ్ర రోగ మధుమేహ
  జి హ్వి కకు పo చదార యు చేదు గాదె
  వందనములు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదం చివర దీర్ఘ మెందుకు?
   (మీరు కేవలం పూరణ ఇస్తే చాలు! "గురువు గారికి నమస్సులు.నా పూరణ లోని లోపములు తెల్పుడు" అనవలసిన అవసరం లేదు. లోపాలుంటే ఎలాగూ తెలియజేస్తాము కదా!)

   తొలగించండి
 31. వహ్వ యనకూరుకుండునే జిహ్వ యకట
  రామ కీర్తుల బాడుచు రాగ ములను
  రామ నామామృతపు రుచు లందు కొనిన
  *జిహ్వికకు పంచదారయె చేదు గాదె*

  రిప్లయితొలగించండి
 32. రామ నామము బలుకంగ రమ్యమౌను
  దాని మించగ నదియేది ధరణి లోన
  కోరి తన్మయమున రుచి గ్రోలుచుండు
  జిహ్వికకు పంచదారయె చేదుకాదె ?

  రిప్లయితొలగించండి
 33. మంచి జెప్పిన నిలలోన వంచకునకు
  చేదుగా దోచునేగాని చెవిన బడదు
  మధుర వచనములను జెప్ప మాట వినని
  జిహ్వికకు పంచదారయె చేదుగాదె ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "దాని మించిన దది యేది..." అనండి.

   తొలగించండి