12, అక్టోబర్ 2017, గురువారం

సమస్య - 2490 (కారము నయనముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్"

45 వ్యాఖ్యలు:

 1. సారసనాభుని మది నిం
  పారగ భజియించి పూజ భక్తి నొనర్పన్
  కూరిమి భాసించెడు నా
  కారము నయనములఁజల్లగన్ హితమబ్బున్

  ప్రత్యుత్తరంతొలగించు


 2. భారమ్మైనహృదయముల
  కైరవలోచన, జిలేబి , కన్నఱ దీరన్
  గారము గా సున్నిత చెలి
  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్!

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పేరిమి చేయని దేదది?
  ఓరిమితో నసాధ్య మేది యొడుపుగ జేయన్?
  కూరిమితో ననునయ మమ
  "కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్"

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చేరగ వచ్చిన యాశ్రితు
  లేరైనను మేలు జేయు మెన్నటి కైనన్
  గారాబముతో మరి మమ
  "కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్"
  (ఏరైనను = ఎవరైనను)

  ప్రత్యుత్తరంతొలగించు


 5. ధీరత్వముగనుచున్, వెట
  కారము జేయన్ మనుజులు, కరభము సాగన్
  కారగ్గివలెన్ ధుమధుమ
  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్!

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 6. భారమయిన హృదయముతో
  కోరగ చెలికాడు ప్రాపు గొంకక మదిలో
  ధీరత్వముతో దగు యుప
  "కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్"

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నేరములెన్నియొ జేయుచు
   కారాగారమున గడుపు ఖైదీలైన
   న్గూరిమి నందింపగ మమ
   కారము, నయనముల జల్లగన్ హితమబ్బున్!

   తొలగించు
 8. వీరలు నాకున్ మిత్రులు;
  వారలు శత్రులు;ననియెడి భావము త్వరగా
  దూరము జేయుచు ధృతి నోం
  కారము నయనముల జల్లగన్ హిత మబ్బున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. డా.పిట్టా
  బీరముగల నరు మృగపు వి
  కారము స్త్రీ మానభంగ కారణ మవగన్
  పోరగ కొడవలి రోకలి;
  కారము నయనముల జల్లగన్ హితమబ్బున్!(Self help is the best help!)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. కోరికలు దీర్చు వేలుపు
  మేరు గభీరు డు గ విషము మింగి న శ oభున్
  గౌరీ పతి యౌహరునా
  కారము నయనము ల జల్లగ న్ హిత మబ్బు న్

  ప్రత్యుత్తరంతొలగించు
 11. డా.పిట్టా
  మారెను చైనా ప్రగతిన్
  గూరునటుల్ వ్యక్తి వ్యక్తి గురుతర విధినిన్
  పోరగ నసూయ వలదే?
  కారము నయనముల జల్లగన్ హితమబ్బున్!(స్పర్ధయా వర్ధతే సిద్ధి!)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. డా.పిట్టా
  బేరముకన్న నుపాయమె
  పారము నందించలేదె పరగ శివాజీ
  చేరగ మిఠాయి బుట్టన్?!
  "కారము నయనములజల్లగన్ హితమబ్బున్"

  ప్రత్యుత్తరంతొలగించు
 13. నా పూరణలలలో మొదటిది క్రమాలంకార పూరణ కాదు.సమాస పద చమత్కారమే.(సమస్యా పూరణకు 15 రరకముల చమత్కారములున్నవి.-"అవధాన విద్య"గ్రంథంలో శతావధాని డా. C.V.సుబ్బన్న శతావధాని)
  -గుర్రం జనార్దన రావు)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. పూరణ నడిగిన గురువుకు
  గౌరవముగ మంచి పద్య కవనము తోడన్
  కోరిన విధముగ దగుచమ
  త్కారము నయనముల జల్లగన్ హితమబ్బున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సారసనేత్రుడు కరుణా
   పారావారుండు నవ్వుబారెడు మోవిన్
   జేరెడు వంశీధరు నా
   కారము నయనముల జల్లగన్ హితమబ్బున్!

   తొలగించు
 16. కూరిమి నెలకొని మది సహ
  కారం బందించి బ్రతుకు కాలం బందున్
  తీరున స్పందన నిడి మమ
  కారమె నయనాల జల్లగా హితమబ్బున్!

  ప్రత్యుత్తరంతొలగించు 17. 1.కేరింతలుగొట్టుచు నిట

      నేరికి జంకక ముదమున నిలలో నాడన్

       గారాబముతో నిక మమ

        కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.


  2:నీరజనాభుని దలచుచు

     నేరుపు తోడన్ పరులకు నెమ్మది గూర్చన్

    నోరిమి తోడను తామమ

    కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.


  3.కారెవ్వరు శత్రువులును

  గారెవ్వరు మిత్రులిలను గమనింపంగన్

  కోరుచు  హరి పదమను మమ

  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.


  4.ధారుణి లో విడగ నహం

  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

  కూరిమి తోడను ప్రజకుప

  కారము సతతమ్ము జేయ ఘనతయు/కలిమియు పెరుగున్.


  5.చోరుల గాంచిజవమ్మున

  బారక ధీరతను జూపి వసుధా స్థలిలో

  నారీమణులెల్ల గుప్పెడు

  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.


  6..ఘోర దురితములు చేయుచు

  కారడవుల యందు తిరుగు కపటుల కనగా

  నేరుపు తోడను వారికి

  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. దారిని కాచి మనుష్యుల
  నేరుపుతో దోచికోవ నిల్చిన వేళన్
  చేరిన వారల నడ్డుచు
  కారము నయనముల జల్లగన్ హిత మబ్బున్

  ప్రత్యుత్తరంతొలగించు
 19. ఘోరపు వేసవి యందున
  నీరమ్ము లుదారముగఁ బని గొని వడిం బ్రా
  కారమ్ములును దడిసెడి ప్ర
  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

  [ప్రకారమున్ + అయనముల = ప్రకారము నయనముల; అయనము = త్రోవ]

  ప్రత్యుత్తరంతొలగించు
 20. పారావారము దాటగ
  గోరుచు హిమగిరిని యున్న గురువుల కొలువన్
  జేరగ గిరి పైగల ప్రా
  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  వడ్డాది వారి వంటలు
  విడ్డూరముగాగ నుండు వివిధ రుచుల తో
  వడ్డన మన వారిదె కద !
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్

  వడ్డాది వారి వంటలె!
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్
  బ్రెడ్డూ క్రీములు కావవి
  జిడ్డెప్పుడు నంటబోదు చేతుల కెపుడున్

  ప్రత్యుత్తరంతొలగించు
 21. శూరత్వము గలిగి యున్నన్,
  జేరె విభీషణుడు రిపుని చెంతకు రయమున్,
  నేరము నోర్వని అనహం
  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్
  (రావణుని నేరము దెలిసి విభీషణుడు రాముని శరణు జొచ్చుట గౌరవము అని భావన)

  ప్రత్యుత్తరంతొలగించు
 22. .నేరము జేయగ శిక్షలు
  కారాగారమున బ్రతుకు ఖైదీజూడన్?
  మారును యధికారుల సహ
  కారము నయనముల జల్లగన్?హితమబ్బున్|
  2.ప్రేరణ విద్యార్థులకున్
  జేరగ సద్గురుల బోధ జీవనసరళే
  మారును నుపయోగపు సం
  స్కారము నయనముల జల్లగన్ హితమబ్బున్|

  ప్రత్యుత్తరంతొలగించు
 23. ఊరూర నిల్లు గట్టిన
  సారాభూతంబు జనుల జంపుచునుండన్
  కోరక నద్దాని తిర
  స్కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. ఊరును బంధుగణంబుల
  పోరును సహియించ లేక పోవగ నెటకో
  సారీ యని వారలమమ
  కారము నయనముల జల్లగన్ హితమబ్బున్

  ప్రత్యుత్తరంతొలగించు
 25. కారణము లేకపెను కని
  కారము జూపుచు పదుగురి కాపాడంగా
  కోరకనే పొందు పుర
  స్కారము నయనముల జల్లగన్ హితమబ్బున్!

  ప్రత్యుత్తరంతొలగించు
 26. పేరొందిన 'కంది' గురులు
  తీరగు పద్యమ్ము వ్రాయు తీరును నేర్వన్
  చేరుదునన దా నంగీ
  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

  ప్రత్యుత్తరంతొలగించు
 27. మారుని గాల్చిరి మిము నే
  చేరెడు మార్గమ్ము వైచె చింతించుమనన్
  గౌరియె! హరుండు నంగీ
  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

  ప్రత్యుత్తరంతొలగించు
 28. ప్రేరితుఁడై యజ్ఞంబుల
  కూరిమి జరిపించఁ యజ్ఞగుండమునందున్
  కోరిన భగవత్సాక్షా
  త్కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

  ప్రత్యుత్తరంతొలగించు
 29. కోరినదె తడవు కోరిక
  తీరగ భక్తి యలముకొన తిరుమల చేరన్
  తీరగు వేంకటపతి యా
  కారము నయనముల జల్లగన్ హిత మబ్బున్!

  ప్రత్యుత్తరంతొలగించు

 30. నారాయణ నరసింహా
  రారా కావగ యనుచును రహితో పిలువన్
  నారదవంద్యుని శుభయా
  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.

  ప్రత్యుత్తరంతొలగించు
 31. నేరుగ సేవలఁజేయుచు
  ప్రేరణతోనహరహమ్ము పెంచుచు తాల్మిన్
  ధారుణిలో ప్రజలకు మమ
  కారము నయనములఁ జల్లగన్ హిత మబ్బున్

  ప్రత్యుత్తరంతొలగించు