31, అక్టోబర్ 2017, మంగళవారం

న్యస్తాక్షరి - 48 (స-ర-స్వ-తి)

అంశము- సరస్వతీ స్తుతి
ఛందస్సు- తేటగీతి (లేదా) చంపకమాల
స్యస్తాక్షరములు... 
అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "స - ర - స్వ - తి" ఉండవలెను.
(దయచేసి మొత్తం పద్యాన్ని సంబోధనలతో నింపకండి)

112 కామెంట్‌లు:

  1. సరసులను జేసెదవు వాణి! సర్వ జనుల
    రమ్య మగుమోము గన మది రంజిలు గద!
    స్వర్ణ మయము భవిత నిను స్మరణ జేయ
    తిరముగ నిను గొలిచెదము దీవెనలిడు!

    రిప్లయితొలగించండి
  2. సర్వవాజ్మయసంపూర్ణసంవిలాస
    రసమయివి నీవు భారతి!రాజితాంఘ్రి!
    స్వస్తి కలిగింప రావమ్మ సత్వరమ్ము;
    తిమిరసంతతి బాపుము దివ్యవాణి!

    రిప్లయితొలగించండి


  3. సరసమగు పదములనిమ్మ చదువులమ్మ!
    రసమయ జగత్తున జనులు రమ్యముగను
    స్వచ్చముగ నీవలె జవసత్వములనుగని
    తిరముగ నిలువను భగవతి! వినుతింతు !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. సరసి జాసన నినుగొల్వ సంత సమున
    రమ్య మైనట్టి భాషల రాగ మలర
    స్వర్ణ మయమైన పలుకులు స్వాంత నమ్ము
    తిరము గాకుండునే మది తేనె లొలుక

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    స రసకందమైనట్టి చదువు పోయె
    రగడ లవివేక వృత్తాలు రాటుదేలె
    స్వయముగా*పాట*మిగులగ సర్వ కావ్య
    తిమిరమున నెక్కడుంటివో, తెలుగువాణి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      చక్కని భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  6. సరసిజభవు ప్రాణేశ్వరి సంతతమ్ము
    రమణతోడ మానసమందు వ్రాలి నేను
    స్వయముగా చక్కని కవిత వ్రాయు నటుల
    తిరపు విద్యనిమ్ము పెరుఁగ తెలుఁగు భాష

    రిప్లయితొలగించండి

  7. సరసపు పల్కులన్ జగతి శాంతము గా వెలయన్ మహిన్ తుషా
    ర రవము గాంచి మానవులు రమ్యము గా నిను గొల్వగన్నప
    స్వరముల మీరి మేలుగన భారతి ! నీదు కటాక్షమున్ సదా
    తిరముగ నిమ్మ ! వాణి! వినుతించెద తెల్లనితల్లి ! శారదా !

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర అర్థం కాలేదు...

      తొలగించండి


    2. కందివారు

      నెనరులు !

      గొల్వగన్, అపస్వరముల మీరి మేలు గన ...

      జిలేబి

      తొలగించండి
  8. సకల కళానిధానమయి సత్కవివర్యుల మానసంబునన్
    రకరకమైన భావన పరంపరలన్ నెలకొల్పు భారతీ!
    స్వకరుణతోడ భక్తులకు జ్ఞానవరమ్మిడి వారి మేథలో
    తికమక దూరమున్నిలుపు దేవికి వందన మాచరించెదన్

    రిప్లయితొలగించండి
  9. *స*కల మనోభిరామములు,సంస్తుత వాక్సుమ రాజితంబులై,
    *ర*కరకముల్ వచోమృత భరమ్ములు సత్య సమంచితంబులై,
    *స్వ*కరుణ జాలువారు విలసన్మధు ధారలు పొంగి పొర్లగన్
    *తి*కమక లేని భావనలు దేవి మదంబరొ నాకొసంగవే!

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    సర్వము దెల్యగా సుఖమె సాక్షరతల్ బరువాయె కావ్య సా
    (ర+అర్వు=రార్వు)రార్వదె2పాటగా నెగిరిరా,కవివర్యుల వాసిదప్పె నీ
    స్వర్వు3‌సమంపు గద్యమదె స్వైర విహారము జేయుచుండ నీ
    తిర్వుల4బద్యపుం బ్రభల దీరిచి దిద్దవె వాణి!తెల్గునన్!
    (సాక్షరత=చదువు,1.అర్వము=గుర్రము23స్వరువు=స్వతంత్రము4తిరువుల=తిర్వుల=తిరుగులాటలలో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      చంపకమాలకు బదులు మీరు ఉత్పలమాల వ్రాశారు. అయినా పద్యం బాగుంది. చంపకమాలలో మరో ప్రయత్నం చేయండి. కొద్ది మార్పులతో పై పద్యాన్నే చంపకమాలగా మార్చవచ్చు.

      తొలగించండి
  11. సరస వచోవిలాస గుణసాంద్ర సుధాభరితాశుపద్యధా
    ర రయమునన్ ప్రవాహమన రంజిలదే రసనాగ్రమందు , సు...
    స్వర వర వైణికస్వన విభాసితమానసులైన వారికిన్ !
    తిరమున నాదు జిహ్వపయి దీర్చి వసింపవె భారతీసతీ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  12. *నేటి అంశము* :

    *స* తివయి బ్రహ్మనాల్క పయి చక్కగ నిల్చి , యశస్సు గూర్చు భా
    *ర* తి ! నిను భక్తితో దలచి , ప్రార్థన జేసెద సర్వదా సర
    *స్వ* తి ! వర రాగ భావముల సాగు కవిత్వ మొసంగు మమ్మ , ఖ్యా
    *తి* తిరముగాగ , నా మది నుతింతును, వాణి ! నమస్కరించెదన్.

    రచన కోట రాజశేఖర్ నెల్లూరు.

    రిప్లయితొలగించండి
  13. డా}.పిట్టా
    సవరణలు ఘంటమునకెన్ని సంకటములు!
    రకరకాల లే పలకల రాదె రా(వ్రా)త
    స్వయముగా కవి వ్రాలును దలప వశమె?
    తిరముగా వ్రేళ్ళ నొక్కుటె దిక్కు ,వాణి!!

    రిప్లయితొలగించండి

  14. సత్కవిత్వమ్ము చెప్పెడు శక్తి కలుగ
    రసనపై బీజ వర్ణాలు వ్రాయుమమ్మ
    స్వచ్ఛ సంజ్ఞానమిమ్ము భాషా మతల్లి!
    తిరముగా నిను గొల్చు తితిక్ష నిమ్ము

    రిప్లయితొలగించండి
  15. సరస సంగీత సాహిత్య శక్తీ యుక్తి
    రమ్య భావాల భాగ్యము ర హి నొసoగి
    స్వర విరాజిత రాగాల వాణి నిచ్చి
    తి ర ము గా మమ్ము గావుము దివ్య ము గ ను

    రిప్లయితొలగించండి




  16. తే.గీ:సరసిజ భవుని రాణివి చదువు లెల్ల
    రయము తోడను నేర్వను రక్తి నిమ్ము
    స్వరము లన్నియు చక్కగ పాడు శక్తి
    తిరముగ నొసగు భారతీ దేవి మాకు.

    తే.గీ:సతము మదిని తలతునమ్మ జగతి యందు
    రయముగా నెల్ల చదువను వ్రాయగాను
    స్వరము నెత్తి శ్రావ్యంబుగ పద్యములను
    తికమకపడక పాడు శక్తినిడు మమ్మ.

    .
    చం:సతతమునిన్ను కొల్చెద నుజాగు నుచేయ కమ్మ భా
    రతి సమవిద్య లెల్లను సరాగము తోడనునేర్చుశక్తులన్ స్వయముగపాడి మెప్పును రసజ్ఞుల చేతను పొందు భాగ్యమున్
    తిరముగ నుండు నట్లుగ సుధీజను లెల్లర నొప్ప జేయవే


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      చివరి పూరణ మొదటి పాదంలో గణదోషం. మూడవ పాదంలో ప్రాస దోషం. సవరించండి.

      తొలగించండి
  17. సత్కవన సుధఁ బంచెడు శైలి నిమ్మ
    రమ్మ! వాక్కున సుస్వర రాగమౌచు
    స్వక పదాంచిత వైవిధ్య స్వాదనమ్ము
    తిరము వెలయంగ భారతీ! స్మరణ జేతు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వైవిధ్య స్వాదనమ్ము' అన్నపుడు 'ధ్య' గురువై గణదోషం. అక్కడ "వైవిధ్య సాధనమ్ము" అనవచ్చు కదా!

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. తమరి సవరణతో :

      సత్కవన సుధఁ బంచెడు శైలి నిమ్మ
      రమ్మ! వాక్కున సుస్వర రాగమౌచు
      స్వక పదాంచిత వైవిధ్య సాధనమ్ము
      తిరము వెలయంగ భారతీ! స్మరణ జేతు

      తొలగించండి
  18. తేటగీతి గర్భ చంపకమాల

    సరసముగా మదిన్ (సతత సద్గుణ సంయుత సత్త్వ సిద్ధి) జే
    ర- రచన లందునన్ (రసిక రంజకమౌ పద రత్న సృష్టి); సు
    స్వర పద జాలమున్ (స్వమల భావ చయమ్మును జాల నిమ్ము) నే
    తిరముగ గొల్తు నిన్ (తిరిగి ధీబలమిమ్మిక దేవి వాణి) రో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతము విజయకుమార్ గారూ! అభినందనలు!💐💐💐💐

      తొలగించండి

    2. అద్భుతమండీ


      విజయకుమార్ గారు !


      జిలేబి

      తొలగించండి
    3. విజయ కుమార్ గారూ,
      న్యస్తాక్షరి పూరణలో గర్భ కవిత్వం. అద్భుతం. అభినందనలు.

      తొలగించండి
    4. విజయకుమార్ గారూ అద్భుతమైన పద్యం. అభినందనలు 👏👏👏🙏🙏🙏

      తొలగించండి
    5. సీతాదేవి గారూ, జిలేబి గారూ, శంకరయ్య గారూ, సహదేవుడు గారూ! ధన్యవాదాలు.

      తొలగించండి
    6. గర్భ కవిత్వం తో మీ పూరణ అద్భుతంగానున్నది 🙏🙏🙏🙏

      తొలగించండి
    7. చంపక మాలలో గీతను
      సొంపుగ దురిమిన ఘనుడవు సూరీ, పదముల్
      జంపక పసతో కవులకు
      నింపునిడిన విజయ,నీవు నేర్పరి విసుమా!

      తొలగించండి
  19. సత్యలోకంబున వెలుగు సత్వగుణము
    రసములొలుకగ కంజాక్షు రసనయందు
    స్వచ్ఛ మంగళ రూపున సంచరించు
    తిమిర సంహారి తెల్లని తేనె నీవు

    సర్వ మంగళ ధవళాంగ సాధురూప
    రసము చిప్పిలు రసరమ్య రచనలిమ్ము
    స్వర రాగరంజిత పద సామలోల
    తిన్నగ నడుపు ననుదేవి తెలుగు బాట!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మూడవ పాదం ప్రారంభంలో గణదోషం. "స్వర సురాగ రంజిత..." అనవచ్చు కదా!

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు! ఎందుకో యెప్పుడూ స్వర యని వ్రాసినప్పుడల్లా స్వ గురువుగా తోచి తప్పు చేస్తున్నాను!
      క్షమించాలి! తప్పక సవరిస్తాను.ధన్యవాదములు!🙏🙏🙏

      తొలగించండి
    3. సర్వ మంగళ ధవళాంగ సాధురూప
      రసము చిప్పిలు రసరమ్య రచనలిమ్ము
      స్వర సరాగరంజిత పద సామలోల
      తిన్నగ నడుపు ననుదేవి తెలుగు బాట!

      తొలగించండి
  20. సరస సంగీత సాహిత్య సభల యందు
    రక్తి గొలిపెడి భావముల్ రంజిలంగ
    స్వర్ణ సింహాసనంబున సాగు భార
    తిని గనిన వీక్షకులభినుతించ బోరె !

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సకల విద్యల యందున సౌష్ఠవమిడి
    రకముగల విదునిగ మార్చి రక్ష గూర్చి
    స్వచ్ఛమౌ మాటలల్లుచు వఱలు నటుల
    తిన్న జేయుము వాగ్దేవి! నన్ను సతము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రకము గల విదునిగ...' ?

      తొలగించండి
  22. (స)కల జనులకు గుర్తింపు సంఘమందు
    (ర)సన రూపాన నొసగుచు నసదృశమగు
    (స్వ)రము లనుజూపి రక్షించు జనని! భార
    (తి)!యిదె వందనంబులగొని దీప్తి నిమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      దీప్తివంతమైన పూరణ మీది. అభినందనలు.

      తొలగించండి
  23. సరససంగీతసాహిత్యచారుశీల
    రమ్యమైనట్టిగాత్రమ్మురహినినిమ్ము
    స్వఛ్ఛమగుపదలాలిత్యమంచితముగ
    తిరముగానుండువిధమునుబరగజేయు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సు+అచ్చమగు' అనుకుంటే మూడవ పాదంలో యతి సరిపోయినట్టే!

      తొలగించండి
  24. (స)రసిజభవుని రాణివి శారదాంబ
    (ర)సమయ పదసంచయమున రమ్యరీతి
    (స్వ)ర మధురిమ లొల్కు కవన స్వనము తో ను
    (తి)౦తు పద్యపుష్పముల నర్చింతు నమ్మ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  25. సరస గుణ శోభితమ్మగు చారునేత్ర
    రసములన్నిట మూలమౌ రసిక హృదయ
    స్వర మహోన్నత రాగల వర పవిత్ర
    తిమిర నాశనికొసగెద తేటగీతి

    రిప్లయితొలగించండి
  26. (స)(ర)స మృదు సు(స్వ)రము ల(తి)శయముగఁ దన
    (ర)గను గించిదప(స్వ)ర సంగమ మ(తి)
    (స్వ)యముగ స(తి) మాన్పంగను వరము నిమ్ము
    (తి)విరి కృపఁ జూడుమ (సరస్వతీ) సతతము


    సకల సువాఙ్మ యావళికి శారద దేవత వీవు తల్లి సా
    ర కవి వరాళి పూజిత సురప్రకరార్చిత తృప్త వీవు సు
    స్వక రచనా సుపూజిత విభాసిత మానస కొల్తు నిన్ను నా
    తి కరము భక్తిఁ దోరముగ దేవి కృపంగను బ్రాహ్మి భారతీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. వినూత్నంగా ఆలోచించడం మీకే చెల్లింది. మొదటి పూరణలో 'సరస్వతి, రస్వతి, స్వతి, తి' అక్షరాలను పొదిగిన మీ నైపుణ్యానికి నమోవాక్కులు!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. స రస్వతి



      రస్వతి




      స్వతి




      స్వ
      తి సరస్వతి

      తొలగించండి
  27. సత్యవాక్కుల బల్కెడు సన్మతినిడి
    రమ్యభావముల్ వెలయంగ రచనమున, సు
    స్వర పదమ్ముల జాల్వారు భాగ్యమొసగి
    తిరమగు కృపజూపుమ భారతీ !నతులివె!!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుస్వర' అన్నపుడు 'సు' గురువై గణదోషం. అక్కడ "రచనమందు। స్వర.." అనవచ్చు కదా!

      తొలగించండి
  28. సరసిజమాధవేశనలసంభవసన్నుతపాదకంజ! సా
    రసదళనేత్రి! భారతి! పరాకు వహింపగ న్యాయమౌనె నా
    స్వరమున ఘటమందునను సంతసమొప్పగ నీవు సర్వదా
    తిరుగుచునుండ కైత లవి తీరుగ నూరవె తీరవే వెతల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. రెండవపాదం ప్రాస సరిచేయ ప్రార్థన.

      తొలగించండి
    3. పొరపాటుకు చింతిస్తున్నాను గురువుగారూ.
      సత్యనారాయణ రెడ్డిగారికి ధన్యవాదములు.
      సవరించిన పద్యం:

      సరసిజమాధవేశనలసంభవసన్నుతపాదకంజ! పు
      ష్కరదళనేత్రి! భారతి! చికాకు హరింపవె వేడుకొందు నా
      స్వరమున ఘటమందునను సంతసమొప్పగ నీవు సర్వదా
      తిరుగుచునుండ కైత లవి తీరుగ నూరవె తీరవే వెతల్.

      తొలగించండి
    4. మిస్సన్న గారూ- మూడవపాదంలో ఘంట మందునను అనుకుంటాను.

      తొలగించండి
    5. సరసిజమాధవేశనలసంభవసన్నుతపాదకంజ! పు
      ష్కరదళనేత్రి! భారతి! చికాకు హరింపవె వేడుకొందు నా
      స్వరమున ఘంటమందునను సంతసమొప్పగ నీవు సర్వదా
      తిరుగుచునుండ కైత లవి తీరుగ నూరవె తీరవే వెతల్.

      అవును రెడ్డి గారూ. మళ్ళా...

      తొలగించండి
  29. సరసిజభవుని సతి వీవు, జనకు మాత
    రమను మెప్పించి కవులకు రమ్య గతిన
    స్వర్ణ శోభతో యధికమౌ సంపదలను
    తిరుగు లేక యొసంగుచూ కరుణ నిడుము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సతతము నీదు నెయ్యమున చక్కని కైత లిఖించ మంగళా
      రతినిడి భక్తి తోడుత నిరంతర పూజలఁ జేతు నో సర
      స్వతి! పలువిద్యలిచ్చి నను భాస్కరులీల వెలుంగజేసి ఖ్యా
      తి తిరముగా ఘటిల్లగను దీవెన లిమ్ము కరమ్ము ప్రేమతో

      తొలగించండి
    2. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ******
      అన్నపరెడ్డి వారూ,
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
    3. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  30. సరసిజగాత్ర! శారద! విశారద! శారదసుందరాభ్రసా
    ర! రమణహస్తపంకజవిరాజితదివ్యమహాక్షమాల! సు
    స్వరవరదానశీల! సురసంఘనమస్కృతపాద! విష్ణుసూ
    తిరమణ! వర్ణమాతృక! సుధీహృదయాబ్జవిలాసినీ! నతుల్.

    రిప్లయితొలగించండి
  31. సర్వమానవ భాషణ సాకగల్గి
    రవళి వీణకు నిడు సుస్వరాల వాణి|
    స్వతము బుద్దియు గలుగునా?సర్వులకును
    తిరము గాదిది శ్రీ భారతీవరమగు| {స్వతము= స్వాతంత్ర్యము}
    2.సమరస భావనా పటిమ సద్గుణ మార్గమునీతి నిష్టలున్
    రమరమి విద్యయున్ నొసగి|రక్షగ నిల్చు సరస్వతీ|దయే
    స్వముమని నెంచకన్ బ్రతుకు సాగదు| జీవన యానమందునన్
    తిమిరము నిల్వగా వెలుగు తేలికచే పనులెట్లు జేయుటౌ? {స్వము=ధనము,తాను}



    రిప్లయితొలగించండి
  32. సకల కళా విశారదుల సార్థక విద్యలు నీదు భక్తి కా
    రకములు నీదు చూడ్కినిల రాజితమైన కవిత్వ శక్తి హ్ర
    స్వకమును గాని ప్రజ్ఞయును వాక్కున ప్రౌఢియు నిత్యమైన మౌ
    క్తికమును వోలు భూరియగు కీర్తియు నిక్కము గల్గు భారతీ

    రిప్లయితొలగించండి
  33. సలలిత, మధుర వాక్కుల నెలవగునటు
    రస మయ కవితా గానము రాగమొప్ప
    స్వర లయలు జోడుగ మదిని వఱల జేయ
    తిరముగ నుతింతు వాణిని దీవనలిడ!

    గురువు గారికి నమస్సులు. నిన్నటి నాపూరణను పరిశీలింప ప్రార్థన. ధన్యవాదములు.
    భార్యగ భానుమతి వలచె
    దుర్యోధను బెండ్లి యాడి! ద్రోవది మురిసె
    న్నార్యావర్తములో తా
    నార్యుల నేవుర వరించ నతిశయ మొందన్!

    రిప్లయితొలగించండి
  34. సచ్చిదానంద వాజ్ఞయ శక్తి రూప
    రసనపై చిల్కు పలుకుల రమ్య గతికి
    స్వర మధురిమలు పంచెడు వలువ రాణి
    తిమిర సంహారి, అక్షర దివ్య దీప్తి

    రిప్లయితొలగించండి
  35. సరళ పదమ్ములన్ గొని రసజ్ఞ మనోజ్ఞ కవిత్వమల్లగో
    ర రహి! మరాళగామిని! వరాల నొసంగు, మరందమాధురిన్
    స్వరస సరాగ విద్యల విశారద! నీదు విశుద్ధ నేత్రముల్
    తిరముగ మాయెడన్ కరుణ వర్షిలుగాక ప్రకాశ చంద్రికల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ---) సరళ పదమ్ములన్ గొని రసజ్ఞ మనోజ్ఞ కవిత్వమల్లగో... అద్భుతః !

      సీతాదేవి గారు చాలా బావుంది.

      జిలేబి

      తొలగించండి
    2. ధన్యవాదాలు జిలేబిగారూ!

      నాల్గవ పాదములో “కరుణ దేల్చును గాక” యని చదువ ప్రార్ధన!

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
  36. సకల పద్యవిద్యా కళ సరస సృష్టి
    రమణు ల రుచిరార్థకవన రసమ యoబు
    స్వచ్ఛ పుష్టి తేజోకర స్వగత చెలి
    తిరముగా నా మదిన నిలు ధి ష ణ ముకు

    రిప్లయితొలగించండి
  37. అందరి పూరణలు అద్భుతంగా నున్నవి.. మీమ్ను సరస్వతీ దేవి సదా కాపాడాలని కోరుకుంటూ..
    =లల====లలల==≠===లల===
    సరసిజ భవుండు వలచిన శారదాంబ
    రమ్య మగు పద్య రాశులు వ్రాసినారు
    స్వరములను బాగుగ నిచ్చి వారికెల్ల
    తిమిరమును పార ద్రోలుము దేవివాణి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "బాగుగ నొసంగి" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదాలు

      సరసిజ భవుండు వలచిన శారదాంబ
      రమ్య మగు పద్య రాశులు వ్రాసినారు
      స్వరములను బాగుగ నొసంగి వారికెల్ల
      తిమిరమును పార ద్రోలుము దేవివాణి!

      తొలగించండి
  38. మిత్రులందఱకు నమస్సులు!
    (1)
    తతము నిన్నుఁ గొల్తు; మనసారఁగ సంస్తుతి సేతు నెప్డు భా
    తి! నను నమ్ముమమ్మ! పిసరంతయు బొంకు హుళక్కియే సర
    స్వతి! ననుఁ గావుమమ్మ! జలజాక్షి! మదీయ హృదంతరాన శాం
    తి తిరముగా వెలుంగ; గణుతించెడి కైత లిఖింపఁజేయుమా!

    (2)
    కల కళా విభూషిత ప్రశస్త కవిత్వ విభాసమాన సా
    కరగుణాన్వితోజ్జ్వలిత రమ్య సుకీర్తిత కావ్య రాజమున్
    స్వకర విరాజమానముగ వ్రాయఁగఁ జేసియు నాదు మానసాం
    తికమున నీవు వెల్గుచు విధేయుని నన్ వెసఁ గావు భారతీ!

    రిప్లయితొలగించండి
  39. ధన్యవాదాలు గురువుగారు
    సరస్వతి దేవిని స్తుతి స్తూ
    పద్యవిద్యలకారాధ్య భాను డీవు
    అని చెప్ప వచ్చా?లిం గ భేదము వర్తించదా?
    నా సందేహము తీర్చుడు.

    రిప్లయితొలగించండి
  40. భారతీ మాతా!

    సతతము పద్యమే మదికి సాంత్వన నీయ భవత్కృపాంబుధిన్
    రతనములా యనన్ కవన రాగ విరాజిత సాంద్ర భావ భా
    స్వత పద మాధురీ సుధలు వాక్కున రంజిలఁ జేసి వాజ్ఞ్మయా
    తితివున రాలగా మిగిలి తీరిన భంగి యశమ్మునీయవే.

    రిప్లయితొలగించండి
  41. గురుదేవులకు ధన్యవాదాలు
    సరసిజభవుని తోడను శారదాంబ
    రమ్యమగు పదములనిమ్ము రాజితాంఘ్రి
    స్వరములను గట్టి బాగుగ చదువులమ్మ
    తిరముగా నామదిని నేలు దివ్యవాణి!

    రిప్లయితొలగించండి
  42. ధన్యవాదాలు అన్నయ్యగారూ.సవరించిన
    పద్యము

    చం:సతతమునిన్ను కొల్చెద నుజాగు నుచేయక మమ్ము కావు భా
    రతి సమవిద్య లెల్లను సరాగము తోడనునేర్చుశక్తులన్
    స్వతహగపాడి మెప్పును రసజ్ఞుల చేతను పొందగాను
    ఖ్యా

    తితిరముగాను నుండగ సుధీజను లెల్లర నొప్ప జేయవే

    రిప్లయితొలగించండి
  43. *జ్ఞానజ్యోతులు గురుబ్రహ్మలు*

    వేదాంత తత్త్వ వాట్సప్ వేదిక

    *నేటి సమస్యా పూరణ అంశము* ::


    *సరిగమలన్వసించిస్వరసంగమమేర్పడహృద్యమౌచుతీ*
    *రరయసుధా రసంబనగనాకృతిదాల్చికవిత్వధారయై*

    *స్వరమనమోక్షపంక్త్యుపనిషత్తులనిల్చిదయార్ద్రచిత్తయై*
    .
    *తిరముగబ్రోచుతల్లినినుతింతుసరస్వతినాత్మనెప్పుడున్*






    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి