7, అక్టోబర్ 2017, శనివారం

సమస్య - 2485 (కరుణను గురిపించ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

31 కామెంట్‌లు: 1. వరమై వచ్చిన జీవిత
  ము రణంబుగ మార కష్ట ముగను నరునిపై,
  మరణంబు శరణ్యమనన్,
  కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. చెరసాల లోన త్రోసితి
  కొరడా దెబ్బలుతికించి కోపము గంటిన్
  తరియించర గోపన్నా!
  కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్

  రిప్లయితొలగించండి
 3. పరుగిడితి విషయము వినన్
  కరుణను గురిపించఁ దలఁచి, కఠినుఁడ నైతిన్
  అరచితిఁ వివసుండ నగుచు
  జరిగినది స్వయంకృతమని జనులట చెప్పన్.

  రిప్లయితొలగించండి
 4. ధరణీ పతి యొక డనెగా
  "దురాత్ముల మదమ్ము నడచి ద్రోహుల ద్రుంచన్
  పుర జనులు సజ్జనులపై
  "కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్"

  రిప్లయితొలగించండి
 5. (అగస్టన్ తన భార్య మేరీతో కొడుకు జార్జి వాషింగ్టన్ సత్యసంధత మెచ్చుకుంటూ)
  అరుణారుణదేహుండు;కొ
  మరుడగు జార్జి నిజమాడి మనసున్ గదిపెన్;
  మరియా!సుతుపై నిండగు
  కరుణను గురిపించదలచి కఠీనుడనైతిన్.

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  శ్రీ భగవానువాచ:
  మరువకు నను గను భక్తుని
  సరకునుగొని లేములెల్ల సంగ్రహ పరతున్
  నెర తగులమె విడనాడగ
  కరుణను గురపించ దలచి కఠినుడ నైతిన్!
  (భవ బంధనములువిడిపోవులాగా,నా భక్తుని సర్వసంపదలను హరిస్తాను.తగులములే ముక్తికి ఆటంకములు.ఈ రూపముగా నేను కఠినుడ నైతినిగదా!..ఇట్లు మీ భగవానుడు)

  రిప్లయితొలగించండి
 7. నరసింహ స్వామి పలుకులుగా:

  నిరతము మా సేవకుడై
  దురితమ్మున వైరభక్తిఁ తూలు హిరణ్యున్
  పరిమార్చి మమ్ము జేర్చెడు
  కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్

  రిప్లయితొలగించండి
 8. వరమడిగిన దనుజుల గని
  కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
  పరుసముగ హింస జేసెడి
  నరులే రాబందు లనగ నగుబాట నగన్

  రిప్లయితొలగించండి
 9. What is needed is not the brutal knife of a butcher but the healing touch of a surgeon

  ఒక వైద్యుని ఊహ


  నరకముతో వ్రణ బాధను
  నిరతము భరియించువాని నిర్దయ నేని
  త్తరి కోసి తీసివేసెద.
  కరుణనుఁగరిపించ దలచి కఠినుడనైతిన్

  రిప్లయితొలగించండి
 10. నిరతము వ్యసనంబులతో
  నురుతర రుగ్మతల నంది యున్న సఖునకున్
  సురుచిర సద్బోధనలం
  గరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్.

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణ:

  గోవర్ధనోద్ధరణ తరుణంలో ఇంద్రుడు...

  కురిపించితి సాంవర్తక
  వర ఘనముల భయద వృష్టి వ్రజ జనులారా !
  పరమ దయాళుని కృష్ణుని
  కరుణను కురిపింప దలచి కఠినుడనైతిన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 12. శరణాగతు లాపన్నుల
  నిరుపేద ల నాదు కొ న గ నిశ్చల మతితో
  దురితము ల రి కట్టు ట కై
  కరుణ ను గురి పింపదలచికఠిను డ నైతిన్

  రిప్లయితొలగించండి
 13. పిల్లలను పెంచే విధానంలో Tough Love చూపించే ఒక తండ్రి తనలో తాను అనుకొంటున్నాడు:
  తిరముగ పిల్లల పెంచుచు
  మరిమరి క్రమశిక్షణ నిడు మార్గము నందా
  తరుణము వచ్చిన నటుపై
  కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్

  రిప్లయితొలగించండి
 14. భారవి పట్ల తండ్రి భావన!

  వరపుత్రుని జనులందరు
  పరిపరి విధముల పొగడగ పరితోషమునన్
  కరమాయుక్షీణమనుచు
  కరుణను కురిపించ దలచి కఠినుడనైతిన్!

  రిప్లయితొలగించండి
 15. పరువముగలయొకయాడుది
  యురముననాఛ్ఛాదనంబునోపమివలనన్
  సరగున కినుక వహించుట
  కరుణనుజూపించదలచికఠినుడనైతిన్

  రిప్లయితొలగించండి
 16. గురు శిష్య బంధము మఱచి
  తరుణాదిత్య నిభు భీష్ముఁ దలపడి భృశమున్
  శరణాగతాంబ పయి తమిఁ
  గరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్

  రిప్లయితొలగించండి
 17. ధరణిని సత్యము నిలిపెడి
  చరితార్థుడవీవు నీకు సత్వరమున శ్రీ
  కరమగును హరిశ్చంద్రా!
  కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్

  రిప్లయితొలగించండి
 18. భరతావనిలో జనులకు
  కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
  చిరు సమయము దప్పదు వెత,
  సరుకుల ధరలు దిగుచుండ సంతస మొచ్చున్

  నవంబరు నెల లో నోట్ల రద్దు చేసిన తర్వాత మోడీ మనోగతము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ పద్యం బావుంది!
   "ధరలు దిగివచ్చుచుండ ధన్యుడనైతిన్"
   అంటే యెలా ఉంటుంది?

   తొలగించండి
  2. సీతా దేవి గారు ధన్యవాదములు నాల్గవ పాదములో మీరు సూచించిన వాక్యము గణ భంగము జరిగినది గదా పరిశీలించండి

   తొలగించండి
  3. అవునండీ, సారీ! ధరలవి యని గాని, ధరలే యనిగాని యనవచ్చు ననుకుంటా!😊😊

   తొలగించండి
 19. చురచుర మంటల మధ్యన
  పరుగెత్తగ లేనిపాము”పరిరక్షించే
  తరుణాన కాటువేయుట
  కరుణను గురుపించ దలచి కఠినుడనైతిన్|
  2.విరివిగ విద్యను నేర్పియు
  నిరుపేదకు బిడ్డ నొసగ?నిందలచేతన్
  తిరుగుచు ధూషించల్లుని
  కరుణను గురిపించ దలచి కఠినుడ నైతిన్|

  రిప్లయితొలగించండి
 20. పరకాంతలననునిత్యము
  పరాభవించుచు వసించు పాషండుండౌ
  దురితాత్మునిపై కడుని
  ష్కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్

  రిప్లయితొలగించండి 21. దురితము లొనర్చు ఛాత్రుని

  సరిదిద్దగ నెంచి సతము సన్మార్గములన్

  మరలించిహితము దెల్పుచు

  కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్

  రిప్లయితొలగించండి

 22. పరువముగలయొకయాడుది
  యురమునుదాబాదుచుండనోపకయపుడున్
  సరగునదండనజేయుట
  కరుణనుజూపించదలచికఠినుడనైతిన్

  రిప్లయితొలగించండి