20, అక్టోబర్ 2017, శుక్రవారం

చతురస్ర బంధ కందము

 


హరి వడువును ,హరి తనయుడు,
హరిత వనిన,  హరితము వలె ,హరి పై బడగన్
హరి శరము, హరికి తగులగ, 
హరి హరి యనుచు, హరిపురికి, హరి పయనించెన్
పూసపాటి కృష్ణ సూర్యకుమార్

13 కామెంట్‌లు:

 1. బంధపుకవితలకవివర!
  బంధముచతురస్రమదియపఠనముజేయన్
  గంధముజల్లిననట్లును
  కంధరమునుద్రాగినటులుగమ్మగనుండెన్
  ----
  కంధరముఅనగా వెన్నతీయనిమజ్జిగ

  రిప్లయితొలగించండి
 2. చాలా బాగుంది కృష్ణ సూర్య కుమార్ గారు మీ చతురస్ర బంధ కందము.
  హరి హరీ యే హరి మీహరి యయ్యెనో యేహరిని జంపెనో యంతయు గందరగోళముగా నున్నది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదములు కామేశ్వర రావు గారు హరి వడువు = ఇంద్ర కుమారుడు సుగ్రీవుడు, హరి తనయుడు = సూర్య కుమారుడు వాలి , హరి = కపి , హరి = సింహము , హరి = రాముడు , హరి = యముడు అయ్యా మీ ముందర నేనెంత ఎదో నన్ను పరీక్షిస్తున్నారు మహానుభావా

   తొలగించండి
  2. అద్భుతమైన విన్యాసము! అభినందనలు.
   అయ్యా మీరు తారుమారు చేశారు. ఇంద్ర కుమారుడు వాలి, సూర్యకుమారుడు సుగ్రీవుడు. కానీ పద్యమున కేమీ లోటు లేదు.

   తొలగించండి


 3. ఈ బంధ కవిత్వమంటే ఏమిటి ?
  వీటి నియమ నిబంధన లేమిటి ?
  తెలియ చేయ గలరు

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. తెలియని వారుండరు గద
  జిలేబి యనిన భువిలోన, జిక్కడెవరికిన్,
  తెలియని విషయమ్ముండదు
  జిలేబి కవికి,కుసుమమ్ము చెవిలో నిడుచున్

  యడుగు చుండెను, కవివరా యర్భ కుండ,
  నేర్చు చుంటి,ఓ నమముల నిప్పుడిపుడె,
  పిచుక పైనేల యస్త్రము,పీ హెచిడులు
  జేసిన జిలేబి, విడువుము చిట్టి కవిని
  జిలేబి వారు నాకు నియమ నిబంధనలు ఏమి తెలియవు అమ్మవారి కృపతో పూర్వీకుల చిత్రముల ఆధారముగా బంధ కవిత్వము వ్రాస్తున్నాను. గురువు గారు సరిగ్గా విశ్లేశిమ్చగలరు అన్యధా తలచ వలదు పూసపాటి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. అయ్యబాబోయ్ మమ్మలి యింట్లో రుబ్బురాయి తిప్పేవారిని పీయెచ్చడీ యనేసారు మీరు !   చిక్కదు జిలేబి దొరకదు
   యెక్కడ గలదో తెలియదు యెవరికి గూడన్ :)
   చక్కగ కమింట్ల వాద్యము
   పక్కల వాయించుచుండు పద్యపు రమణీ :)

   నెనరులు !
   నిజంగా తెలియదండి
   ఆంధ్రామృతం వారు ఓ పొత్తము లింకు యిచ్చారు అది చదివితే గూడా గుట్టు తెలియలే :)

   ఎవరైన విశదీకరిస్తారేమో అని అడిగా అందుకే

   చీర్స్
   జిలేబి

   తొలగించండి


  2. ఇందుగలదందు లేదని
   సందియము వలదు జిలేబి చట్రము లోనన్
   బందీ యై యుండెను గో
   విందుని మరచి భువిలోన వివరంబరయన్ !

   జిలేబి

   తొలగించండి