23, అక్టోబర్ 2017, సోమవారం

సర్ప బంధ తేట గీతిక

సుబ్రహ్మణ్య స్వామి పార్ధన

కార్తికేయుడు, కాంతుడు, కొమరసామి,

అంబికేయుడు, శరజుడు, అగ్నిసుతుడు 

చాగ ముఖుడు, విశాఖుడు, షణ్ముఖుండు,

సౌరసేయుడు, స్కందుడు, శక్తి ధరుడు,

భద్ర శాఖుడు, కందుడు, బ్రహ్మచారి,       

శరవణ భవుడు, చండుడు, షడ్వదనుడు,

అగ్ని సంభవుడు, స్దిరుడు, అగ్నినంద

నుడు, భవాత్మజుడు, షడాననుడు, కొమరుడు,

నెమ్మి రౌతు, అగ్నేయుడు, నెమ్మిరేడు,

అగ్ని నందనుడు, గుహుడు, అగ్నిజుడు, మ

హౌజసుడు, యుద్ధ రంగుడు, హవన సుతుడు,

శంభుజూడు, మహా సేనుడు, షడ్లపనుడు,

క్రౌంచభేదిగాంగేయుడు,  క్రౌంచరిపుడు,

పార్వతీ సుతుడు, సతము  బాధ లన్ని

తీర్చుచు ఘనముగ మనకు దీవెనలిడు.
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

5 కామెంట్‌లు:

  1. పూసపాటి వారికి శుభోదయం. పద్యం బంధం చాలా బాగున్నది. మొదటి పాదం యతిని చూడండి.

    రిప్లయితొలగించండి
  2. స్కందునిగూరిచిచెప్పిన
    బందముతోనుండుకవితబహుచక్కంగన్
    విందునుగూర్చెనుచెవులకు
    వందనములనందుకొనుమపండితవర్యా!

    రిప్లయితొలగించండి