16, అక్టోబర్ 2017, సోమవారం

సమస్య - 2494 (బాలభానుఁడు నేలపై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"బాలభానుఁడు నేలపై పరుగులెత్తె"
(ఆకాశవాణి వారి సమస్య)

40 కామెంట్‌లు:

 1. ఆల కాపరి చెప్పిన ఆత్మవిద్య
  ఆర్యవర్త జనులకంది ఆర్యులవ్వ
  వచ్చె శంకరాచార్యులు వసుధ పైన
  బాల భానుడు నేలపై పరుగులెత్తె!

  సూర్యుడు జ్ఞాన స్వరూపం కదా.. అందుకని శంకరులను నేల నడవ బాలుడైన భానుడు అన్నాను. ఇంకొక ఔచిత్యం, శంకరులు శంకరుని అవతారమని అంటారు కదా, ఆయన సూర్యుడైతే, ఈయన బాల సూర్యుడవ్వాలి కదా..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇంకొక పూరణ:
   కొన్ని సార్లు సాధారణ దృశ్యాలలో అసాధారణమైన భావాలను ఆపాదిస్తూ, మన మనసులోనే మురిసి పోతూ ఉంటాం.. అలాంటి ఓ భావనకు ఇది భాష...

   నిండ నీళ్ళున్న కడవలో నింగి నున్న
   సూర్య బింబము కనపడే వర్యునకును,
   మగువ కడవతో పరుగిడ, మనసు మురిసె
   "బాల భానుడు నేలపై పరుగు లెత్తె"

   తొలగించండి


 2. మనసు దోచుచు కొమరుడు, మరకత మణి
  వలె బుడిబుడి యడుగుల సవడుల గనుచు
  చాల చక్కని రూపము చయ్య నంగ
  బాలభానుఁడు నేలపై పరుగులెత్తె !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. సూర్యవంశాన బుట్టిన సుందరుండు;
  నీలిచిరుమబ్బు బోలిన మేలిశిశువు;
  నమ్రకోసలజనకోటి నయనపద్మ
  బాలభానుడు నేలపై పరుగులెత్తె.

  రిప్లయితొలగించండి
 4. వెన్న దొంగిలించినవాడు విసుగు నిడుచు
  తల్లి మనసును నొప్పించ, తాడు తోడ
  తనను గట్టునని దలచి దాగు కొనుచు
  బాలభానుఁడు నేలపై పరుగులెత్తె"

  రిప్లయితొలగించండి
 5. తొలగి చీకటి తెరలన్ని వెలుగు చిమ్మె
  మత్తు వీడిన ప్రాణుల చిత్త మలర
  పక్షి గణములు కిలకిల పరవ శించ
  బాల భానుఁడు నేలపై పరుగు లెత్తె

  రిప్లయితొలగించండి
 6. రామచంద్రుండు జగదభిరామ గుణుడు
  చిన్నతనమున సఖులతో చేరియుండి
  యాటలందున నత్యంత హర్షమొదవ
  బాలభానుఁడు నేలపై పరుగులెత్తె.

  రిప్లయితొలగించండి
 7. గోరు ముద్దల దినుపింప జేరి కైక
  బ్రతిమి లాడిన వినకుండ పరుగుదీయు
  రఘుకులాన్వయు డైనట్టి రాముని గన
  బాలభానుడు నేలపై పరుగు లెత్తె

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  నే నుషాసూక్త పఠనము నిష్ఠ సలుప
  గడగి మై మరుపును గొన్న ఘడియలోనె
  భళ్ళుమని తెల్లవార సువర్ణార్ణవమ్ము గడచి
  బాలభానుడు నేలపై పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 9. డా.పిట్టా
  రాత్రి -కడగండ్ల నన్నిటిన్ రంగరించి
  సేదదీర్పించు పరమాత్మ "శివు"ని గనము,
  "నేనె" యని ముద్దు ముద్దుగా నిలిచి ముందు
  బాల భానుడు నేలపై పరుగులెత్తె!

  రిప్లయితొలగించండి
 10. తూరుపె రు పేక్కి వెలుగులు తోమ య్యే
  గూళ్ళు విడిచి యు నెగిరెను గువ్వ లు పొడిచే
  బాల భానుడు ::నేల పై పరుగు లె త్త
  హరి ణము లు గంతు లేయు చిత్త రు ణ మందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటి పాదము లో తోరమయ్యే అని చదవాలి

   తొలగించండి
  2. రెండవ పాదము
   గువ్వ లేగిరి పోయెను కొ oడకొన పొడిచె
   anni

   అని చదవాలి

   తొలగించండి
 11. డా.పిట్టా
  నెరినట బాల భానుడవనీ తలమందున బర్వు లెత్తెడిన్...Proposal

  వర గగనార్ద్ర కేశముల వాయగ చిక్కుల దీసి మేల్మినిన్
  సరగున కన్యయౌ( ఉ)యుషయె శాంతిని నల్గడలన్ స్ఫురింపగా
  సుర,నర,కిన్నెరుల్ దివిని జూడగ బంగరు వర్ణ రాశినిన్
  నెరి నట బాలభాను డవనీతలమందున బర్వులెత్తెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జగద్గురు శంకరాచార్యులు........

   వర కవితావిశారదుడు వైదిక ధర్మ పరంపరార్యుడై
   స్ఫురదురు ధర్మశాస్త్ర చయ శోభితమై యలరారునట్టి శం
   కర గురు బోధనల్ వినుచు కౌతుకమొప్పగ బల్కిరిట్టులన్
   "నెరినట బాల భానుడవనీ తలమందున బర్వు లెత్తెడిన్"

   నెరిన్ = అందముగా, ప్రశస్తముగా

   తొలగించండి
 12. గుంటూరు సీమ పల్నాటి పులి వీరబ్రహ్మనాయని వంశోద్ధారకుడు బాలచంద్రుడు జననమందిన సందర్భం.
  శత్రుమూకల గుండెలు జారిపోవ.
  తోటివారల యాశలు తొంగిచూడ.
  బాలచంద్రుడు ఫల్నాట ప్రభవమందె.
  బాలభానుడు నేలపై పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 13. బాల జపియింప భానుని భక్తిమీర
  లీల జనియించె పుత్రుడు హేలగాను
  తల్లి రాధతో నాడెడి తరుణమందు
  బాలభానుడు నేలపై పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 14. శ్రీనివాస బ్రహ్మోత్సవ సేవఁ దలఁచి
  తిరుమలాద్రినె వైకుంఠ పురిగ నెంచి
  గరుడ హనుమంతు లాదిగా సురలు దిగఁగ
  బాల! భానుడు నేలపై పరుగులెత్తె!

  రిప్లయితొలగించండి
 15. శ్రీనివాస బ్రహ్మోత్సవ సేవఁ దలఁచి
  తిరుమలాద్రినె వైకుంఠ పురిగ నెంచి
  గరుడ హనుమంతు లాదిగా సురలు దిగఁగ
  బాల! భానుడు నేలపై పరుగులెత్తె!

  రిప్లయితొలగించండి
 16. రెండు భ్రమలకు లోనైతి బండిమీద
  పయన మగువేళ తూర్పున పైకి లేచు
  భాను డెండమావిని తాను ప్రతిఫలింప
  బాల భానుడు నేలపై పరుగు లెత్తె
  *****
  భ్రమలు :1.ఎండమావి.2.వేగంగా ముందుకు పోతున్నపుడు కదలని వన్నీ వెనకకు పరుగెడు నట్లు కలిగే భ్రమ.

  రిప్లయితొలగించండి
 17. చూడముచ్చటయాయెనుసొబగుగలిగి
  బాలభానుడు.నేలపైపరుగులెత్తె
  నాదుమనుమడుబులిబులినడక వంటి
  పరుగుతోడనగ్రిందకుపడుచులేచి

  రిప్లయితొలగించండి
 18. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

  బాలభానుడు నేలపై పరుగు లెత్తె

  ననుచు పలికెను మాతోడ ననుగు చెల్లి

  కాశికిన్ మేము ధూమశకటము లో బ్ర

  యాణము నొనరి౦చెడు సమయమ్ము న౦దు |

  రిప్లయితొలగించండి
 19. అనిని వ్యూహము భేదించు నవసరమున
  బరగు వీరాభిమన్యుడు పార్థు సుతుడు
  బాల వీరుడు రణమున భాను సముడు
  "బాల భానుడు నేలపై పరుగులెత్తె"

  రిప్లయితొలగించండి
 20. అల్లరిపనులఁజేయుచు నహరహమ్ము
  గొల్లయిండ్లలో వెన్ననుఁ గొల్లగొట్ట
  చిలిపి కృష్ణుని వెంటాడ తలియశోధ
  బాల భానుడు నేలపై పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 21. మోము యెర్రని నిప్పును బోలి యుండ
  తూర్పు దిక్కున ప్రభవించి నేర్పు మీర
  తిమిర భూతమున్ తరుముచు తేజరిల్లి
  బాల భానుడు నేలపై పరుగు లెత్తె

  రిప్లయితొలగించండి
 22. బుడిబుడి యడుగు లవి వడివడి నడువ త
  డఁబడ నడలుచుఁ బడి లేచుచుఁ బరుగు లిడు
  చు నెడ నెడఁ గడు ముద మిడు చుండు నపర
  బాలభానుఁడు నేలపై పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 23. తెల్ల వారగ నుదయించె తీరు గాను
  బాల భానుడు; నేలపై పరుగులెత్తె
  నిత్య జన జీవన స్రవంతి ప్రత్యయమున
  నుర్వి జనులకు నుత్సాహ ముప్పతిల్ల

  రిప్లయితొలగించండి
 24. తమదు చిన్నారి సుతునకు ప్రమద మెసగ
  భానుడను పేరు పెట్టంగ బాలుడపుడు
  అడుగులను వేయనేర్చుచు నడచి నడచి
  బాలభానుండు నేలపై పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 25. పార్థసుతు డభిమన్యుడపార సూరి
  యత డరిభయంకరుడు వీర రౌద్ర భీమ
  బాల భానుడు; నేలపై పరుగులెత్తె
  కురు బలము, నాతనెదురాడ బిరుసు లేక.

  రిప్లయితొలగించండి
 26. ఇనకులంబున జనియించి ఘన విశుద్ధ
  చాప శస్త్రాస్త్ర విద్యలఁ ప్రాపుగాంచి
  బరగె రాముండు విద్వత్ప్రభావ మెసఁగ
  బాలభానుఁడు నేలపై పరుగులెత్తె

  రిప్లయితొలగించండి
 27. గురువు గారి కి నమస్సులు. నా పూరణ లోని దోషములు తెల్పుడు.పూ జ్యు లు కామేశ్వర రావు గారు సవరింప మనవి.
  పూర్వ ప శ్చిమ లట పుడమిన భా స్కర
  ఉదయస్తాచ లమగు వుత్తర దిశ
  ధీ గజముఖునకు సుదివ్యమో మా న వ
  బాల భా నుడు నేల పై పరు గు లి త్హె.
  వo ద న ము లు.

  రిప్లయితొలగించండి
 28. అరుణ కాంతులు వెలయించి యభ్రమందు
  తిమిర సంహార కరుడుగ తేజరిల్లె
  బాలభానుడు; నేలపై పరుగులెత్తె
  నాయురారోగ్య వృద్ధికై యవనిజనులు

  రిప్లయితొలగించండి
 29. తూర్పునుదయించి కిరణాలుతొంగిజుచి
  సూర్య దేవుని పాదాలు సోకి పిదప
  బాలభానుడు నేలపై పరుగు లెత్తె|
  నేటి కోణార్కు గుడియందు చాటు నిజము|.

  రిప్లయితొలగించండి
 30. తే.గీ.
  ముదముమీర నా తండ్రి ముద్దడగబోయి
  బాలరాముని పట్టగా పరుగు లిడుచు
  బాలభానుఁడు నేలపై పరుగులెత్తె
  ననుచు దశరథుడు మురిసె నలసిపోగ!

  రిప్లయితొలగించండి
 31. తూర్పు కొండల ప్రాకగ తొంగి చూడ
  బాల భానుడు, నేలపై పరుగు లెత్తె
  కడుపు పుచ్చుకొనుచు నొక కష్ట జీవి
  పూట గడువగ తప్పదు పోటి యనుచు!

  రిప్లయితొలగించండి
 32. డా.పిట్టా
  నెరినట బాల భానుడవనీ తలమందున బర్వు లెత్తెడిన్...Proposal

  వర గగనార్ద్ర కేశముల వాయగ చిక్కుల దీసి మేల్మినిన్
  సరగున కన్యయౌ( ఉ)యుషయె శాంతిని నల్గడలన్ స్ఫురింపగా
  సుర,నర,కిన్నెరుల్ దివిని జూడగ బంగరు వర్ణ రాశినిన్
  నెరి నట బాలభాను డవనీతలమందున బర్వులెత్తెడిన్

  రిప్లయితొలగించండి
 33. డా.పిట్టా
  ఆర్యా
  నే నుషా‌సూక్త....తరవాత పాదములో"భళ్ళుమని తెల్లవారె సువర్ణ వర్ణ" గా సవరించినాను.

  రిప్లయితొలగించండి
 34. ప్రాచి దిశను బుట్టు ప్రతిదినమ్ము భువిని
  వాహనమెట దిరుగు వాసిగాను
  కొత్తవింతలుగన కూర్మితోనరుడు
  బాలభానుఁడు నేలపై పరుగులెత్తె.


  ద్యోతకమగు చుండు తూరుపు దిశ యందు
  బాలభానుఁడు: నేలపై పరుగులెత్తె
  లేతపచ్చిక దిన లేగదూడలవెల్ల
  ప్రకృతి మాత మురిసె పరవశాన.

  రిప్లయితొలగించండి
 35. మొదటి పద్యంలో సవరణను గమనించగలరు.

  1. తే.గీ.
  ముదముమీరగ నాతండ్రి ముద్దులడిగి/
  బాలరామునిపట్టగా పరుగు లిడుచు/
  బాలభానుఁడు నేలపై పరుగులెత్తె/
  ననుచు దశరథుడు మురిసె నలసిపోగ!

  2. తే.గీ.
  నాదు వ్యూహము భేదించె నన్ను గెలువ/
  వీరవిక్రమ మున పార్థు మీరె; నితడు/
  బాలభానుడు నేలపై పరువులెత్తె/
  ననుచు నభిమన్యు కొనియాడె నపుడు గురుడు!

  3. తే.గీ.
  వీరవిక్రమమున పార్థు మీరె; నితడు/
  శౌర్య మున్ జూపెనే! బాణ చాలనమున/
  బాలభానుడు నేలపై పరువులెత్తె/
  ననుచు నభిమన్యు కొనియాడె నపుడు గురుడు!
  - రాధేశ్యామ్ రుద్రావఝల
  (16.10.2017)

  రిప్లయితొలగించండి