25, అక్టోబర్ 2017, బుధవారం

లింగ బంధ ఈశ్వర స్తుతి


సీ.
శంభుడు,యచలుడు,చంద్రశేఖరుడు,పంచాస్వుడు,ఈశుడు, చదిర ధరుడు,
కాంతిమంతుడు,కురంగాంకుడు,సాంబుడు, ఫాలుడు,జలజుడు,భర్గుడు,శశి,
శ్రీవర్దనుడు, శూలి,సింధు జన్ముడు, అంబుజన్ముడు,బుద్నుడు, చండుడు,పుర
హరుడు,అఘోరుడు,యక్షికౌక్షేయుడు, నభవుడు, భానువు, నటన ప్రియుడు,
ముక్కంటి,పురభిత్తు,మృడుడు,కంకటీకుడు,అంధకరిపువు,కోడె రౌతు,
అంగమోముల వేల్పు,అంబర కేశుడు,,బుడిబుడి తాల్పుడు, బూచులదొర,
మదనారి,సుబలుడు,మరుగొంగ,వామార్ధజాని,గజరిపువు,జంగమయ్య,
జడముడి జంగము,శంకువు,,శర్వుడు,సగమాట దేవర,జ్వాలి,ఖరువు,
గోపాలుడు,విలాసి,కోకనదుడు, విష ధరుడు, జోటింగుడు త్ర్యంగటముడు,
అంబరీషుడు, స్వామి,  అజితుడు నకులుడు  , చండీశుడు ,పురారి, చంద్ర ధరుడు
హరకుడు అభవుడు హంసుడు  సాంఖ్యుడు, అనిరుద్ద్డుడు,కపర్ది, అజుడు. విధుడు,
రాజధరుడు మందరమణి, భూతేశుడు, ధూర్జటి,తుంగుడు ధూర్తుడు పశు
తే.గీ.
పతి,అసమనేత్రుడు, కపాలి  భార్గవుండు,
పంచ వక్త్రుడు ,కామారి, పంచ ముఖుడు,
శమన రిపుడు మలహరుడు ,  శశివకాళి,
గరళ కంఠుడు   సతతము కాచు చుండు                  

కవి : పూసపాటి కృష్ణ సూర్య కుమార్

3 కామెంట్‌లు:

 1. శంభుడు యచలుడు ? శంకరయ్య గారూ ఇదేమిటండీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నమస్కారం.
   వారు పంపినదానిని పంపినట్టు పరిశీలించకుండానే పోస్ట్ చేశాను. అక్కడ యడాగమం దోషమే. కవి దృష్టికి తీసుకువెళ్తాను. ధన్యవాదాలు!

   తొలగించండి
 2. గురువు గారికి నమస్కారములు శ్యామలీయము వారు తెలిపినట్లు యచలుడు అన్న మాటను (ఆచలుడు) అచ్చు వాడకూడదనుకొని ప్రయోగించాను. తప్పు అయితే క్షమించండి సరిదిద్దుకుంటాను.

  రిప్లయితొలగించండి