వేదసారమ్మునెరిగినవిజ్ఞవరుల దైవనామమ్ము తలచెడుదివ్యగుణుల లోకశుభములుగోరువిలోకమతుల తా *"పసుల సేవ పరమపదమ్మొసంగు"*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 అని ధర్మరాజు గంగుల(కవిరాజు)గారు పూరించారు.(WHATSAPP) *†*****†* నిజానికి నేనా సమస్య పంపినది కందములో. "పసులను సేవింప పరమ పథమబ్బునుగా!" బ్లాగు వారు ఆటవెలదిగా మార్చినారు.తేటగీతిలో పూరణ బహుచక్కగ నున్నది. అభినందనలు !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాక మనుచు నెంచి లోక కల్యాణమ్మె
రిప్లయితొలగించండిపెద్ద మనసు మఱియు పేర్మి బలిమి
కలిగి నట్టి మేటి కపటము లేని;తా
"పసుల సేవ పరమపథ మొసంగు"
రిప్లయితొలగించండివ్యర్థ మౌ జిలేబి, వదులుట మేలు తా
పసుల సేవ ! పరమపద మొసంగు
దేవ దేవు డౌత ! దేహీ యన వలదు
మనుజుల మునుపు, వనమాలి యండ !
జిలేబి
శక్తిహీనులకును సహకారమందించి
రిప్లయితొలగించండియహమునాదిలోనె యణఁగఁద్రొక్కి
నియతితోడమరియు నిశ్చలమతిని తా
పసుల సేవ పరమపథ మొసంగు
క్షణిక సుఖము లెల్ల తృణప్రాయముగ నెంచి
రిప్లయితొలగించండియాత్మ శుద్ధి గలిగి హరిని గొలిచి
ముక్తి పథము తెలుపు మోక్షగాములగు తా
పసుల సేవ పరమ పదమొసంగు
క్షణిక సుఖము లెల్ల తృణప్రాయముగ నెంచి
రిప్లయితొలగించండియాత్మ శుద్ధి గలిగి హరిని గొలిచి
ముక్తి పథము తెలుపు మోక్షగాములగు తా
పసుల సేవ పరమ పదమొసంగు
డా.పిట్టా
రిప్లయితొలగించండిదేవగోవు సకల దీప్తిప్రదాయిని
గణప వక్రతుండ గజము చూడ
ప్రాణకోటియందు పరమాత్మ యొక్కడే
పసుల సేవ పరమపద మొసంగు!
డా.పిట్టా
రిప్లయితొలగించండిపచ్చి మాంసము దిను ప్రాచీన కాలాన
పాము పూజ(నాగదేవతారాధన)సేయు ప్రథయు లేదె?
వంటకాలు పెక్కు వరలగ మానవా!
పసుల సేవ పరమ పదమొసంగు!
డా.పిట్టా
రిప్లయితొలగించండిమన్కి కోసమంచు మానవు నమ్మేవె?!
రాతి పూజ వల్ల రాదు బదులు
మూగ ప్రాణులెట్టి మోసము నెరుగవు
పసుల సేవ పరమపదమొసంగు!
ధశరధమహారాజుతో వశిష్టమహాముని:
రిప్లయితొలగించండిప్రాణసముల సుతుల పసివారలనుచు నీ
కౌశికుండుఁ గోర కాదనకుడు
యాగ రక్షణార్థ మేగఁ దగునయ తా
పసుల సేవ పరమపద మొసంగు.
మంచి ఎడ్ల దోయి బెoచును సేద్యము ,
రిప్లయితొలగించండిబర్రె లిచ్చు నెపుడు పాలు మనకు,
మానవా వినగదె ,మహిలోన వర కైల
పసుల సేవ పరమపద మొసంగు"
కైలపసులు : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 గ్రంథసంకేత వివరణ పట్టిక
వి. , బహు. • కపిలగోవులు.
సకల దేవరూప సాధుస్వభావ యా
రిప్లయితొలగించండినల్లనయ్య గాచు నందినదియె
సౌరశక్తి గ్రహణ సౌభాగ్య దాయియౌ
పసులసేవ యొసగు పరమపదము
రెండవ పాదములో చివర "నందిని యదె" యని చదువ ప్రార్ధన!
తొలగించండిపసులసేవ పరమపద మొసంగు!
తొలగించండిఅరయలోకమందు నధికారదాహమ్ము
రిప్లయితొలగించండిపరుల ధనము గొనెడి పనులు మాని
జపము చేయునట్టి జడధారులైన తా
పసులసేవ యొసగు పరమపదము
అక్షరమ్ము రాదు నాకలింపుయు లేదు
రిప్లయితొలగించండినెటుల బ్రతుక గలవు నిటులనున్న
కొలువటన్న నీకు గోపాలకా!తగుఁ
బసుల సేవ పరమపద మొసంగు
వాంఛలన్ని విడచి వాసదేవుని గూర్చి
రిప్లయితొలగించండితత్వమెల్లనెఱిగి ధ్యానమంది
మురళి గానమందు ముఱియుచు నుండు తా
పసుల సేవ పరమపద మొసంగు
పసుల సేవ పరమ పదమొసంగు ననుట
రిప్లయితొలగించండియక్షరాల నిజము ,హర్ష మదియ
గోవు వలన మనకు కొండంత లాభమ్ము
పసుల జంప గలుగు పాపమార్య !
కామధేను,వమరగజ,కచ్ఛపాదులు,
రిప్లయితొలగించండిసింహ,వ్యాఘ్ర,నంది,క్షీరదములు,- జంతుమయము దైవ సంపూజ్యమేగదా
పసులసేవ వరమపదమొసంగు
తాపస పద సేవ ధర్మ రక్షణ దీన
రిప్లయితొలగించండిజన సముద్ధరణ సుజన సురక్ష
రాజ వంశ వీర రాజికి మంది కా
పసుల సేవ పరమ పద మొసంగు
[కాపు + అసుల = కాపసుల; మంది = కాల్బలము; కాపు =రక్షణ; అసి = ఖడ్గము]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆటవెలదిని తేటగీతిలో పూరణ (WHATSAPP)
వేదసారమ్మునెరిగినవిజ్ఞవరుల
దైవనామమ్ము తలచెడుదివ్యగుణుల
లోకశుభములుగోరువిలోకమతుల
తా *"పసుల సేవ పరమపదమ్మొసంగు"*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
అని ధర్మరాజు గంగుల(కవిరాజు)గారు పూరించారు.(WHATSAPP)
*†*****†*
నిజానికి నేనా సమస్య పంపినది కందములో.
"పసులను సేవింప పరమ పథమబ్బునుగా!"
బ్లాగు వారు ఆటవెలదిగా మార్చినారు.తేటగీతిలో పూరణ బహుచక్కగ నున్నది. అభినందనలు !
రిప్లయితొలగించండికందమ్మున కై పదము
న్నందరి కిన్నిచ్చినాడ! యాటవెలదిగన్
చందము దీర్చగ మా కవు
లందంబుగ తేటగీతి లబ్జుగ గనిరౌ :)
జిలేబి
భేష్ !
తొలగించండిరైతు బాంధవు ల యిర హి మీర శ్రమియిన్చి
రిప్లయితొలగించండిస్వార్థ మింత లేని పావన పు
జీవులౌచు జగతి జీవ నా డి గ నుండు
పసుల సే వ పరమ పమొ ।సం గు
మూ డ వ పాద ము లో పావన oపుఅని చద వాలి
రిప్లయితొలగించండిక్షమించి రెండో పాదము లో అని చదవండి
తొలగించండిఆవుపూజ దలచ నారాధ్యమనియెంచ?
రిప్లయితొలగించండిపసులసేవ పరమ పదమొసంగు|
ఆవు యర్ద కేగి నందించు బంగారు
కామదేను పూజ?కలిమి బలిమి.
నెమ్మనంబునందు నిరతమ్ము విష్ణునా
రిప్లయితొలగించండిమంబు జపము చేయు మాన్యవరులు
భక్తి పథమునందు వైరాగ్య ఖచిత తా
పసుల సేవ పరమపద మొసంగు
మునులు జ్ఞానధనులు మూఢ నమ్మకముల
రిప్లయితొలగించండిబార ద్రోలి ధర్మ పథము జూపి
జ్ఞాన ధనము పంచు సన్మానులైన తా
పసుల సేవ పరమపద మొసంగు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధేనుసేవ జేసే ధీరదిలీపుండు ;
రిప్లయితొలగించండిమాద్రిబిడ్డ డాలమంద గాచె ;
గోగణమున దిరిగె గోపాలకృష్ణుండు ;
పసుల సేవ పరమపద మొసంగు.
మొదటిపాదం-జేసె
రిప్లయితొలగించండినా “శ్రీమదాంధ్ర సుందర కాండ” పఞ్చత్రింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.
రిప్లయితొలగించండితామర సాంబకుండు వసుధా జన సత్త్వ మనోహరుండు నీ
రాముఁడు రూప నైపుణ విరాజిత కాయ సముద్భవుండు తే
జోమయ దేహ ధామముల సూర్య నిభుండు క్షమా గుణంబునన్
భూమి సముండు గీష్పతియ బుద్ధుల నింద్రుఁడు కీర్తి నెంచగన్
మూలము:
రామః కమలపత్త్రాక్ష స్సర్వసత్త్వమనోహరః.
రూపదాక్షిణ్యసమ్పన్నః ప్రసూతో జనకాత్మజే৷৷5.35.8৷৷
తేజసాదిత్య సఙ్కాశః క్షమయా పృథివీసమః.
బృహస్పతిసమో బుద్ధ్యా యశసా వాసవోపమః৷৷5.35.9৷৷
raama karunaa prapti rastu
తొలగించండి🙏🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిడా. సీతా దేవి గారు ధన్యవాదములు.
తొలగించండిసూర్య కుమార్ గారు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిద్వాపరమ్మునందు వాసుదేవుడు చేసె
పసుల సేవ :పరమపదమొసంగు
నట్టి సేవ చేయ నఘములెల్లనుబాయు
ననవరతమ టండ్రు నవని బుధులు .
సర్వసంగములను జగతిలో విడనాడి
పరుల మేలు కోరు పథము నందు
సాగు చున్నయట్టి సజ్జనులైన తా
పసుల సేవ పరమ పదమొసంగు
పాడి పంటలొసగి ప్రజకు మేలును గూర్చు
పసుల సేవ పరమ పదమొసంగు
ననుచు ముదముతోడ నవనియందు
కొలుచు చుందు రెపుడు కూర్మి తోడ.