3, అక్టోబర్ 2017, మంగళవారం

సమస్య - 2481 (రాధ నాలింగనము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాధ  నాలింగనము జేసె రాఘవుండు"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

63 కామెంట్‌లు:

 1. వాసు దేవుడెవరి నేలె వనము లోన?
  సీత జాడను గనుగొని శీఘ్ర ముగను
  వద్ద కేతెంచు కపివరు వాయు సుతుని;
  రాధ ; నాలింగనము జేసె రాఘవుండు

  రిప్లయితొలగించండి
 2. మిథిల యందలి ప్రజలెల్ల మిగులప్రేమ
  గనుల నిలుపుక గాంచెడి గణ్యచరిత;
  వీతిహోత్రసంస్తుత; సీత; విమల;నిరప
  రాధ నాలింగనము జేసె రాఘవుండు.


  రిప్లయితొలగించండి
 3. మదిని కృష్ణుడీమెను గాదె మనసుపడె, కు
  చేలుని గని కృష్ణుండేమి జేసె? మురిసి,
  రావణునిచంపె నెవ్వాడు? రణమునందు,
  రాధ, నాలింగనము జేసె, రాఘవుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. రావణునియింట బందీగ లంకనున్న
  ధర్మపత్నిని విడిపించి దగిన రీతి
  జ్వలనపునీత జానకీ జనని, నిరప
  రాధ నాలింగనము జేసె రాఘవుండు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువర్యా ధన్యవాదములు! మీ వ్యాఖ్య కనగానే చాల సంతోషము కలిగింది!
   🙏🙏🙏🙏🙏

   తొలగించండి
 5. వాసుదేవుని వలచెను ద్వాపరాన
  రాధ,నాలింగనము జేసె రాఘవుండు
  నంజనీ తనయు నడవు లందు గాంచి
  తనకు తగిన దూతయనుచు మదిని తలచి.

  గోకులమ్మున నెవరిపై కూర్మి చూపె
  వాసు దేవుండు ముదమున ద్వాపరాన
  పవన సుతునకే మొనరించె వసుధ లోన.

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  (ఈడా,పింగళ,ల సంయోగం వల్ల సషుమ్నా నాడి నడుస్తుంది.ఈ కలయిక ఆధ్యాత్మిక మైనది.ధ్యాన యోగ పద్ధతులలో "రాధాస్వామి"యోగా సుప్రసిద్ధము.కలయికయే యోగము.)
  వామ నాసికా పుటమున వరలు శశియు
  కుడిని చరియించు సూర్యుని గూడ సిద్ధి(రాఘవుడు సూర్యవంశమువాడు)
  నాట్యమాడు నాధ్యాత్మిక నాడి యిదియ!
  సూర్య తేజస్సు శశికళన్ జూపినట్టు
  లీ "సుషుమ్న"యే కలయికన్నిటను వాయు-
  రాధ నాలింగనము జేసె రాఘవుండు!!
  ప్రాణాయామ పరిజ్ఞానమునకు సంబంధించిన యీ యోగాను అభ్యాసంలో పెట్టవలసినదిగా సవినయ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. నేను రాధాస్వామీ అనుయాయుడనే వారి ప్రస్తావన నాకెంతో సంతోషాన్ని కలిగించింది ధన్యవాదాలు

   తొలగించండి
  3. డా.పిట్టా నుండి
   ఆర్యా,మీకును శ్రీ ప్రసాద్ గారికిని కృతజ్ఞతాభివందనములు.ఈనాటికిR.S అనుయాయి మిత్రునికనుగొన గలిగితిని.ధన్యోస్మి!"విశాలాచ పృథ్వీ"!

   తొలగించండి
 7. లంకలో యశోకవనిన సంకటములు
  బడయు చున్దన దలపునే విడవనట్టి
  శ్యామ, హిమరాతి పరిశుద్ధ, సాధ్వి ,నిరప
  రాధ, నాలింగనము జేసె రాఘవుండు

  రిప్లయితొలగించండి
 8. రాధ సీత గా నటి యించు రంగ మందు
  రాము డ నురా గ ములు పొంగ రమ్య మల ర
  రాధ నా లింగమును జేసే రాఘవుoడు
  నటన కయ్యేడ చప్పట్లు న భ ము నంటే

  రిప్లయితొలగించండి
 9. మైలవరపు వారి పూరణ:

  వేణుమాధవుడేతెంచి ప్రేమమీఱ
  రాధ  నాలింగనము జేసె , రాఘవుండు
  సీతఁ బెండ్లాడె ద్రుంచియు శివుని విల్లు !
  మదిని పులకింపజేయునీ మధుర కథలు !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
   ****
   ప్రభాకర శాస్త్రి గారూ,
   మరి మీ పూరణ?

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు:

   కించిత్తు అనారోగ్యం, నీరసం కారణంగా పూరణలలో పాల్గొన లేకుండా ఉన్నాను. క్షంతవ్యుడను. నమస్సులు.

   తొలగించండి
  3. అదే కంద పాద సమస్య అయితే ఏ జ్వరమూ అడ్డురాదు.

   తొలగించండి
  4. మిత్రులు శంకరయ్య గారూ,
   GP Sastry గారిని పట్టుకొని అలా అనేసారేమిటండోయ్ "అదే కంద పాద సమస్య అయితే ఏ జ్వరమూ అడ్డురాదు" అని. అబ్బే అలా కోప్పడటం బాగోలేదండీ.

   శాస్త్రిగారూ,
   పూరణలో పాల్గొనటం ఐఛ్చికం కదా, ఇంత మాత్రానికే క్షమాపణలు చెప్పుకోవటం దేనికో అర్థం కావటం లేదు.

   తొలగించండి
  5. శ్యామల రావు గారూ,
   శాస్త్రి గారితో నాకున్న చనువు అది! అంతే! ధన్యవాదాలు.

   తొలగించండి
  6. శ్యామల రావు గారూ:

   నమస్సులు. నలభై సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి వెలగబెట్టిన నాకు క్లాసులు ఎగకొట్టిన పిల్లలను మందలించడం, వారి కుంటి సాకులు విని నవ్వడం అలవాటే.

   తొలగించండి

  7. జీపీయెస్ వారికి

   రాధ పరిష్వంగమనగ రఘురామునికే !

   జిలేబి

   తొలగించండి
  8. *మనఘ

   రాధ పరిష్వంగ మనఘ రఘురామునికే

   తొలగించండి
  9. వేధించగ కడు విరహపు
   బాధ, కుములి క్రుంగుచుండ,
   వార్తాహరుడా
   మేధావి కపివరునకై,
   రాధ! పరిష్వంగ మనఘ రఘురామునికే :)

   నీరసం పరార్!

   తొలగించండి
  10. జిలేబీ గారు కంద పాద సమస్యను ఇవ్వడం, శాస్త్రి గారి జ్వరం పరార్ కావడం.. ఒక చక్కని పూరణ రావడం... ఆహా.. ఆనందకరం.

   తొలగించండి


  11. ఆధమనము కన్నడికే
   రాధ పరిష్వంగ మనఘ! రఘురామునికే
   రాధనము జానకి! జిలే
   బీ, ధక్కా దిన పెనిమిటి వెంగళి నీకౌ !

   జిలేబి

   తొలగించండి
  12. మాకంద కంద సంధాన సందో హానం దారవిం దానన సుందరున కందఁ జేయుదు వందన శతముల్!!!

   తొలగించండి
  13. కొందరిని కందమమితా నందం!శ్రీశ్రీ తేటగీతి ని బాగా యిష్టపడేవాడంట!

   తొలగించండి
 10. రాధనాలింగనముజేసె రాఘవుండు
  నాటకంబునవారట్లునటనజేసె
  గాని నిజజీవితంబునగాదు సామి!
  రాధ రాఘవులిరువురుబాత్రలచట

  రిప్లయితొలగించండి
 11. పరుని పంచన నుండిన పత్నిగాన
  కోర నగ్నిపునీతగఁ దీరి రాగ
  ధర్మమూర్తిగ లోకనిందాకృతాప
  రాధ నాలింగనము జేసె రాఘవుండు

  రిప్లయితొలగించండి
 12. విమల తర శరచ్చంద్ర ముఖి మను జేంద్ర
  తనయ ధరణిజాత పతివ్రతా మతల్లి
  భార్య మిథిలాపుర నభో విభాసమాన
  రాధ నాలింగనము జేసె రాఘవుండు

  [రాధ = మెఱపు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వరరావు గారూ,
   రాధ శబ్దం యొక్క అర్థాంతరంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 13. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,

  అనయ౦ బ౦చు దల౦చకు౦డ సభలో నా

  . . దుస్ససేను౦డు కా౦

  తను వస్త్ర౦బుల నూడ్చి లాగు తరి

  . . క్రోధజ్వాల - నేత్రద్వయిన్

  గనలన్ , దద్గద నూపుచున్ , బ్రతినలన్

  . . గావి౦చు > స౦గ్రామ భీ

  మునికిన్ గోపమె భూషణ౦ బగు బ్రజా

  . . మోదమ్ము స౦ధిల్లగా

  రిప్లయితొలగించండి
 14. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,

  చాకలి నయిన , నే వెర్రిచవట c గాను |

  పరుని ప౦చన నున్నట్టి భార్య నెటుల

  నేలుకొనెద నో మామ ! యి౦కేల తగవు ?

  రావణుని చె౦త ను౦డి తా రాగనె యప

  రాధ నాలి౦గనము చేసె రాఘవు౦డు |

  …………………………………………………………

  ఓరి ! నీ వాయి పడిపోను ! ఊరుకోర !

  " నిరపరాధ - యగ్నిపునీత - నేలపట్టి "

  ………………………………………………………

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 15. అగ్నిహోత్ర పునీత!ధన్యాత్మురాలు!
  జనకపుత్రి!పవిత్ర!విజ్ఞాన రాశి!
  సాధ్వి!భూమిజ!సుగుణ సంస్తవచరిత్ర!
  రాధనాలింగనముఁజేసె
  రాఘవుండు

  రాధ=A flash of lightning.
  శంకర నారాయణ నిఘంటువు

  రిప్లయితొలగించండి
 16. రావణాసురుని వధించి రణమునందు
  వానిసోదరునకు లంక వశముచేసి
  చెరను వీడిన జానకిఁ జేరి, నిరప
  రాధ నాలింగనము జేసె రాఘవుండు

  రిప్లయితొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వెల్లివిరిసెడి ప్రేమతో వెన్నదొంగ
  యెలమితో వనమందు తానేమి జేసె?
  కోపగించి పౌలస్త్యుని గూల్చె నెవరు?
  రాధ నాలింగనము జేసె; రాఘవుండు
  రిప్లయితొలగించండి

 18. రాధ! నాలింగనముఁజేసె రాఘవుండు
  వీర హనుమంతుని, నతడు వివరముల తె
  లుపగ సీతమ్మ క్షేమము; లూటిపుచ్చు
  కొనెను రాముని మనసును కోమలాంగి !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని రాధ పదం సంబోధనగా ఉన్నప్పుడు 'యాలింగనము' అని యడాగమం వస్తుంది. ఇది ఇక్కడ కుదరదు.
   మరో ప్రయత్నం చేయండి.

   తొలగించండి
 19. ఊహ లుయ్యాల లూగంగ?యువిధ| కృష్ణ
  రాధనాలింగనము జేసె|”రాఘవుండు
  హనుమ సద్భక్తియందుండ?సహజమైన
  హృదయమందున గనిపించె పృథివియందె|

  రిప్లయితొలగించండి


 20. బోటి ! వినవమ్మ, యవనారి పొంకముగను
  రాధ నాలింగనము జేసె; రాఘవుండు
  రాధనము గనెను,జిలేబి, రాజ్ఞి సీత
  మదిని చూరగొనుచు పరమాత్ముడనఘ !

  జిలేబి

  రిప్లయితొలగించండి

 21. పిన్నక నాగేశ్వరరావు.

  మాధవుండు బృందావనమందు తన కొ

  ఱకు నిరీక్షించు చున్నట్టి రమణియైన

  రాధ నాలింగనము జేసె; రాఘవుండు

  సీత జాడను కనుగొని చేర వచ్ఛు

  హనుమను గని తా ప్రేమగా హత్తు
  కొనియె.

  రిప్లయితొలగించండి
 22. నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” త్రయస్త్రింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.

  మేటి బైరవాసమ్ములు వీటి నునిచి
  వీడి మనసార రాజ్యమ్ము వేద విదుఁడు
  రాఘవుండు ఘన యశస్వి మేఘ సన్ని
  భాంగుఁ డుండ మనియెఁ దల్లి పాల నన్ను

  రిప్లయితొలగించండి
 23. మధుర భావము లలరార మాధవుండు
  రాధ నాలింగనము జేసె ! రాఘవుండు
  శివధనువు నెక్కిడగ నంత సిగ్గు లొలుకు
  సీత మదిని పలుకరించె శీఘ్ర గతిని !

  రిప్లయితొలగించండి
 24. చూపరుల హృదయాలను జూర గొనగ
  సీత యగ్ని పునీతయై చేర రాగ
  పరమ పావనమగు ధర్మ పత్ని,నిరప
  రాధ నాలింగనము జేసె రాఘవుండు.
  (శ్రీ అల్వాల లక్ష్మణ మూర్తి గారి భావన ఆధారంగా)

  రిప్లయితొలగించండి