18, అక్టోబర్ 2017, బుధవారం

సమస్య - 2496 (కాలు పెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాలు పెండ్లియాడె కరము వలచి"
(ఆకాశవాణి వారి సమస్య)

90 కామెంట్‌లు:

 1. మేనమామ సుతను మెరుపు తీగను బోలు
  మేను గల్గి నట్టి మించు బోడి
  మంచి మనసు గల్గు మానవతిని పాన
  కాలు పెండ్లియాడె కరము వలచి.
  ******
  కరము =మిక్కిలి;కడు; అత్యంతము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   పానకాలు అనే యువకుడు మేనమరదలిని పెండ్లాడాడన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. పంక మందు పుట్టి పరిసెన దశదొల్గ
  తూర్పు దిక్కు నందు మార్పులేక
  భాను డుద్భవింప ప్రణయ వికసిత సూ
  కాలు పెండ్లియాడె కరము వలచి.
  (సూకము=తామరపూవు, సూకాలు=తామరపూలు, పరిసెనము=మొగ్గ, కరము=కిరణము)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
   ప్రేమతో విచ్చుకున్న సూకాల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. చెరకు తోట లోన చెలికాని వలపుకై
  మనసు దీర ప్రేమ మదిని నింపి
  విరహ వేద నందు వేసారు చెలిని నూ
  కాలు పెండ్లి యాడె కరము వలచి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నాకు తెలిసినంత వరకు 'నూకాలు' అన్న పేరు ఆడవాళ్ళకే ఉంటుంది. "వేసారి ప్రియుని నూకాలు పెండ్లియాడె..." అంటే బాగుంటుందేమో?!

   తొలగించండి
 4. సోదర సోదరీ మణు లందరికీ దీపావళి శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 5. ఆదిదేవుడతడు ;ఆద్యంతరహితుండు;
  సర్వభక్తజన వశంకరుండు;
  పర్వతేశుపుత్రి పార్వతి యమ్మహా
  కాలు పెండ్లియాడె కరము వలచి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   మహాకాలుని పార్వతి పెండ్లాడిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అతడు + ఆద్యంత..' అన్నప్పుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు కదా! అక్కడ "ఆదిదేవు డాత డాద్యంతరహితుండు.." అంటే బాగుంటుంది కదా!

   తొలగించండి


 6. మగువ పేరు లక్ష్మి! మానదుడౌ పాన
  కాలు పెండ్లియాడె ; కరము, వలచి
  న మగువను దరి గన ననుపువడెను సూవె
  పరిణయమది ప్రణయ పథము లోన !

  దీపావళి శుభాకాంక్షలతో
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   లక్ష్మిని పెండ్లాడిన పానకాలు గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మానధుడు'...? అక్కడ "మానధనుడు పాన..." అంటే సరిపోతుంది కదా!

   తొలగించండి

  2. ధన్య వాదాలండి కంది వారు !

   వెల్కం బెక బెక! మీ చార్ధామ్ యాత్రా విశేషాల గురించి టపా కై యెదురు చూస్తున్నాం !

   మానదుడు - self-respecting proud man

   ఆంధ్రభారతి ఉవాచ ! సరియేనా ?

   జిలేబి

   తొలగించండి
 7. పసిడి గొలుసు వలచె పడతి కంధరమును,
  కమ్మలు మనువాడె కర్ణములను,
  ముక్కెర నసను పరిణయమాడగ, అరవం
  కాలు పెండ్లి యాడె కరము వలచి


  అరవంకాలు : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 గ్రంథసంకేత వివరణ పట్టిక
  వి. (మాం) , బహు.
  • చేతి పై భాగమున (రెట్టకు) పెట్టు నగ (సర్కా).

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   అరవంకాలతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
   మూడవ పాదంలో యతి తప్పింది. "నసను ముక్కెర పరిణయమాడగ నరవం..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 8. డా.పిట్టా
  శాస్త్ర శోధన గొని చదువు "నరేంద్రు1"ని
  కోర్కె మీర; నతని గూడి యాడి
  విశ్వ వంద్యు జేసె విమల బోధల పుస్త
  కాలు పెండ్లియాడె కరము వలచి.
  1.వివేకానంద స్వామి.Love reading books;they will love you.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ గారూ,
   పుస్తకాలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   (అన్నట్టు మీరు పోస్టులో పంపానన్న పుస్తకం నాకు చేరలేదు).

   తొలగించండి
  2. డా.పిట్టా
   ఆర్యా,మరొకటి పంపిస్తాను.రూమ్ నం. ఉండాలేమో?

   తొలగించండి
  3. డా.పిట్టా
   ఆర్యా,మరొకటి పంపిస్తాను.రూమ్ నం. ఉండాలేమో?

   తొలగించండి


 9. ఆ.వె:తననె మదిని కోరి తపము చేయుచునున్న
  పార్వతినిగని యట బ్రహ్మచారి
  గానె చెంత చేరి ఘనముగా యొప్పించి
  కాలు పెండ్లియాడె కరము వలచి.

  ఆ.వె:వనిత కోరినట్టి బావ నాలయమున
  మిత్రు లెల్ల చేరి మేటిగాను
  నుత్సుకతను బూని నూద సుస్వరపు బా
  కాలు పెండ్లియాడె కరము వలచి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "ఘనముగా నొప్పించి" అనండి.

   తొలగించండి
 10. డా.పిట్టా
  పెళ్ళి చూపులైన పేర్మి"నీమేల్లై"1న
  కల్పు జంటలెన్నొ, "కలి"2ని వింత
  భద్ర జగతి "శైల"3 పరిపాటిగా ఫోను
  కాలు పెండ్లియాడె కరము వలచి!!(1.e mail,2.కలికాలము, 3.అమ్మాయి పేరు.)

  రిప్లయితొలగించండి
 11. చిన్న నాటి నుండి చెలిమి తో మెలగు చు
  మనసు తెలిసి మ స లు మామ యందు
  మరులు పెంచు కొన్న మగువ యై నట్టి నూ
  కాలు పెండ్లియా డే కరమువలచి

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఏ ఇబ్బంది లేకుండా, క్షేమంగా, తృప్తికరంగా చార్ ధామ్ యాత్ర ముగించుకొని నిన్న రాత్రి నెలవు చేరాను.
  ఇన్ని రోజులు సమస్యలకు పూరణ లందించి, పరస్పర గుణదోష విమర్శ చేసుకున్న అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జియో నెట్ వర్క్ లేదు. అందువల్ల ఇన్ని రోజు మిత్రుల పూరణలను చదవలేకపోయాను. తీరిగ్గా అన్ని రోజుల పూరణలను వీక్షించి నా స్పందనను తెలియజేస్తాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కంది శంకరయ్య గారు,
   మీరు ఒక సమస్య ను ఇచ్చిన తరువాత అందరూ వ్రాసిన వాటిని మీరు సరిదిద్దడం లేదా మెచ్చడం చూస్తూ ఉన్నాను. కానీ మీరెలా ఈ సమస్యను పూరిస్తారో చూడాలని ఉంది.

   తొలగించండి
  2. నీహారిక గారూ,
   అప్పుడుప్పుడు నేను నా పూరణలను పెడుతూనే ఉన్నాను. ఇకనుండి ప్రతిరోజు సమస్యాపూరణ చేయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

   తొలగించండి
  3. తీర్థయాత్ర శుభప్రదముగా ముగించుకొని వచ్చిన గురు దేవులకు వందనములు.

   తొలగించండి
 13. గురుదేవులకు నమస్సులు! మీ యాత్ర దిగ్విజయంగా జరిగినందుకు అభినందనలు!
  దీపావళి శుభాకాంక్షలు!🙏🙏🙏🙏

  రిప్లయితొలగించండి
 14. మనసు మనసు కలసి మనువాడ నెంచగ
  కులము గోత్ర ములవి కుడ్యమవగ
  సంప్రదాయ రీతి సాధ్యమవక సంత
  కాల పెండ్లి యాడె కరము వలచి

  రిప్లయితొలగించండి

 15. కల్లు ముల్లు నెండ కాపాడి ఘనమైన
  పాదుషాల నుండి పామరునికి
  పాదరక్ష యనుచు బహుపేరు బొందగ
  కాలు పెండ్లియాడె కరము వలచి!

  ఇది మా మనుమరాలు మౌక్తిక ఐడియా!
  కవి మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   చక్కని సూచన చేసిన చి. మౌక్తికకు ఆశీస్సులు!

   తొలగించండి
 16. పొలఁతిఁ గూర్చ వాని బూడిదఁ జేయంగ
  తగదు మీకటంచు నగజ బలుక
  తరుణి నూరడించి హరుఁ డాపి రతికి శో
  కాలు, పెండ్లి యాడె కరము వలచి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   రతీదేవి శోకాలు మాన్పి పార్వతిని శివుడు పెండ్లాడన్న మీ పూరణ ప్రశస్తంగా, వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.
   తమరి పునరాగమనము మరియు పద్య సమీక్ష సంతోషదాయకం.ప్రణామములు.

   తొలగించండి
 17. గురువర్యులకు నమస్సులు. మీ ఛార్ధాం యాత్ర దిగ్విజయంగా పూర్తయినందుకు చాలా సంతోషంగా వుంది
  గురువు గారికి, కవి మిత్రులందరికి దీపావళి శుభాకాంక్షలు.
  నిన్నటి సమస్యకు నా పూరణను పరిశీలించ ప్రార్థన.
  ధన్యవాదములు.
  అంతయు తానై మెలగుచు
  చింతల బాపగ సతతము చేతులు కలుపన్
  పంతము లాడక నా నిజ
  కాంతను సేవించు వారె ఘనులు, జన హితుల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   ధన్యవాదాలు.
   మీ (నిన్నటి) పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. డాపిట్టా సత్యనారాయణ నుండి
  ఆర్యా ,తలవని తలంపుగా తీర్థయాత్ర సంపన్నం కావడం అత్యంత ముదావహము.ఇది మీ సాహిత్య సేవకు ఉపకృతిగా నేను భావిస్తున్నాను.దర్శన యోగం సిద్ధించినందులకు హర్ష పూర్వక అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. గొప్ప వారియింట కొమరప్ప పెంపుడు
  జంతువులకు కూడ జరుగు ముద్దు
  కనగ ఒకరి వీట కనులవిందుగ సున
  కాలు పెండ్లి యాడె కరము వేడ్క

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   శునకాల పెండ్లిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 20. వివిధ పరిణయ ధ్రువీకర ణాధికా
  రి సముఖమున నిజ పరిజన సు పరి
  చితులు చూచు చుండఁ జేసి యింపుగ సంత
  కాలు పెండ్లియాడె కరము వలచి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ సంతకాల పెండ్లి పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
  3. మఱి యొక పూరణ:

   భద్ర వీర భూమి పల్నాటి వీరుండు
   బాల చంద్రుఁ జూచి పరమ పుణ్య
   కాంత యంత వింతఁ గాఁ గోరి వీరున
   కాలు పెండ్లియాడె కరము వలచి

   [వీరునకు+ఆలు = వీరునకాలు]

   తొలగించండి
 21. అందగత్తెయైననాదిలక్ష్మినిపాన
  కాలుపెండ్లియాడెకరమువలచి
  వారిబంధమెపుడునారుపూవులుగను
  మూడుకాయలుగనునుండుగాక!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మూడు పువ్వు లారు కాయలు' అనవలసింది... మీరు "మూడు కాయ లారు పువ్వు" లన్నారు.
   "వారి బంధ మెప్పు డారు కాయలుగను। మూడు పువ్వులుగను మురియు గాక" అనండి. (నాల్గవ పాదంలో యతి తప్పింది)

   తొలగించండి
 22. డా.పిట్టా
  ఆర్యా.గంగా॥ఉత్ రీ(దిగినది),యమునా॥ఉత్ రీ లతో వచ్చిన పేర్లేమో.ప్రయాణం కష్ట తమమంటారు.మీకెలా ఆనిపించిందో!

  రిప్లయితొలగించండి
 23. కలవరించె యాత్రకై గురువర్యులు
  కల ' వరించె ' హితులు కరుణ జూప
  చారు ధాము యాత్ర సఫలమై సాగెను
  కలయె వాస్తవమ్ము కాగ నేడు.


  రిప్లయితొలగించండి
 24. నడుము వంగిపోయె నడచుట కాయాస
  పడుచు వృద్ధుఁ డొకఁడు పట్టుకొఱకు
  చేతి నొకటి దించి చేర్చె మోకాలిపై
  కాలు పెండ్లియాడె కరము వలచి.

  రిప్లయితొలగించండి
 25. మనసు దోచినట్టి మామను చేరగ.
  కలికి గుండె నిండ కాంతులెగసె.
  వెలిగె వారి నొసట పేర్మితోడను భాషి
  కాలు,పెండ్లియాడె కరము వలచి

  రిప్లయితొలగించండి
 26. మరియొక పూరణ.
  వధువు సొగసు మెఱీసె భాగ్యమై యోగ్యమై.
  పరిణయంపువేళ భామ చెలువు
  చెవులఁదాల్చె పైడి సింగారమొలుకు జూ.
  కాలు పెండ్లి యాడె. కరము వలచి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   జూకాలతో మీ రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 27. మదిని ముదము నింపు మగువ కోర మనువు
  ప్రీతి పెంచు వలపు పిలుపు నందు
  వచ్చి పెండ్లి ఘడియ,వరుడు కట్టగ బాసి
  కాలు, పెండ్లి యాడె కరము వలచి

  రిప్లయితొలగించండి
 28. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,


  కాలు క్రి౦ద నిడక కారులో జను , పాన

  కాలు పె౦డ్లి యాడె కరము వలచి >

  పేదరాలి యి౦టి బిడ్డను రాధిక |

  నె౦త భాగ్యవతియొ యె౦చి చూడ ! !

  రిప్లయితొలగించండి
 29. . కళ్ళు,కళ్ళు గలువ?కాంతయు,కాంతుని
  చేయి,చేయి తడుమ చెలియకాలు,
  కాలు పెల్లియాడె|కరము వలచి రాత్రి
  శోభ లేని ప్రేమ శోభనాన|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   శృంగార రస భరితమైన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 30. నృత్య రీతులెన్నొ నేర్పించెడి పడతి
  చిత్ర లేఖనమ్ము చేయు నతని
  కోరి యాలి యయ్యె కూర్మి యొప్పారగ!
  కాలు పెండ్లి యాడె కరము వలచి!

  రిప్లయితొలగించండి
 31. గురువు గారి కి నమస్సులు. మీ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసి నందులకు అభనందనలు.నా పూరణ లోని దోషములు సవరింపుడు.
  ధ రణి ముద్దు సుతుడు తల చెన్ వలపుల
  చెలియ సొగసు చూడ ,చెక్కిలి వయ్యా రి
  మీన నయన వెలుగు మిస్సమ్మ శ్రీ నిచ్చ
  కాలును పెండ్లి యాడె కరము వలచి
  విభిన్న o గ పూరించాలని ప్రయత్నం.
  వందనములు.

  రిప్లయితొలగించండి
 32. రె o డ వ పాదము లో లోపాలు గల వు. గణము లు
  పెక్కు గలవు. సవరించి పంపుదును.

  రిప్లయితొలగించండి
 33. రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   వైవిధ్యంగా పూరించాలన్న మీ ప్రయత్నం ప్రశంసనీయం. బాగుంది. అభినందనలు.
   మొదటి పాదంలోను గణదోషం. 'తలచెన్' అన్నదాన్ని "తలచెను" అంటే సరి.

   తొలగించండి
 34. ప్రళయ కాలమందు బాల కృష్ణుడు తన
  కాలి బొటన వ్రేలు కరము నొడిసి
  పట్టి నోట బెట్టు వైనమ్ము గన్పట్టు
  కాలు పెండ్లి యాడె కరము వలచి

  రిప్లయితొలగించండి
 35. ఆలయమ్ములోన నతి శుభమని నమ్మి
  మామ కూతురైన మంజులత కు .
  చేర పతిగ నొకడు చెల్లించి సర్వ సుం
  కాలు పెండ్లియాడె కరము వలచి

  నిన్నటి సమస్యకు నా పూరణ

  అంతము లేని సమస్యలు
  వింతగ నీ బ్లాగు లోన వెలువడగ న్ని
  శ్చింత న్నింపగ నలువని
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి
 36. తీర్ధయాత్రలుబాగుగదెమలుచుకొని
  యేగుదెంచినకవివర!యిపుడమిమ్ము
  భక్తరక్షకుడైనట్టిభవుడుదయను
  నెల్లవేళలజూచుత!చల్లగాను

  రిప్లయితొలగించండి
 37. చార్దాము యాత్ర చేసి వచ్చిన గురుదేవులకు ప్రణామములు

  నిన్నటిసమస్యకు నాపూరణ
  ఎంతయు మలినపు పొగలను
  నంతమ్మొనరించి స్వచ్చమగు జీవనమున్
  సొంతము జేయంగ ప్రకృతి
  కాంతను సేవి౦చు వారె ఘనులు జన హితుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ (నిన్నటి) పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 38. చార్దాము యాత్ర చేసి వచ్చిన గురుదేవులకు ప్రణామములు,అక్కడి విషయములను మాకు తెలుప గలరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరప్రసాద్ గారూ,
   ధన్యవాదాలు.
   యాత్రావిశేషాలతో ఒక పోస్ట్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం ప్రయాణపు బడలికతో కొంత అస్వస్థుణ్ణై ఉన్నాను.

   తొలగించండి
 39. ఇతరమతపు కొమ్మ యింపుగూర్చగ, తల్లి
  దండ్రుల యనుమతిని, తనివి నిరు ర
  కాలు పెండ్లియాడె కరమువలచి తాను
  పెద్దలంతకూడి దీవెనలిడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారూ,
   సమస్యను మూడవ పాదంలో ఇమిడ్చి 'ఇరు రకాలు'గా పెండ్లి చేసిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 40. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి