20, అక్టోబర్ 2017, శుక్రవారం

సమస్య - 2498 (రాణ్ముని దుర్యోధనుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుఁడే"

89 కామెంట్‌లు:

  1. డా.పిట్టా
    "రాణ్మణి దుర్యోధనుండు....."అనుకుంటాను.,ఆర్యా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      కావాలనే 'రాణ్ముని' అని ఇచ్చాను. 'రాణ్మణి' కాదు!

      తొలగించండి
  2. షణ్ముఖ సముడౌ జనకుడు;
    మృణ్మయమౌ మతి గలిగిన మేటియె కాదే !
    చిన్మయ రూపుండు కుశుడు;
    "రాణ్ముని ; దుర్యోధనుండు ; రాముని సుతుఁడే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      బాగుంది మీ పూరణ. అభినందనలు.
      న-ణ లకు ప్రాస చెల్లడం ఉభయప్రాస.

      తొలగించండి
    2. శంకరయ్య గారు ! ధన్యవాదాలు ! ఉభయ ప్రాసను గురించి ' సులక్షణ సారం ' లోనూ, 'అప్పకవీయం' లోను చదివియున్నాను.

      తొలగించండి
  3. భంగ్యంతర పూరణ :
    (మూడవ పాదం మాత్రము)
    షణ్ముఖ సముడౌ జనకుడు;
    మృణ్మయమౌ మతి గలిగిన మేటియె కాదే !
    రాణ్ముని జనకుని మనుమడు
    "రాణ్ముని ; దుర్యోధనుండు ; రాముని సుతుఁడే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ భంగ్యంతర పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  4. రాణ్ముని కౌశికుడే నీ
    షణ్మాత్రము శంకలేక శంకర గురువి
    ద్వణ్మణి నెటుబల్కె నకట
    రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుడే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవిగారూ! నమస్తే. విద్వత్+మణి= విద్వన్మణి అవుతుంది గాని విద్వణ్మణి అయ్యే సూత్రం లేదు. గమనించగలరు.
      కచటతప లకు అనునాశికాక్షరములు పరమైనపుడు తద్వర్గ పంచమాక్షరం వస్తుంది. త వర్గ పంచమాక్షరం “న” గాని “ణ” కాదు గదా! మరోలా అనుకోకండి ఇలా చెప్పానని.

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కౌశికుడే యీ।షణ్మాత్రము..." అనండి. "విద్వన్మణి" అనడంలో ప్రాసదోషం లేదు. ఉభయప్రాసలో న-ణ లకు ప్రాస చెల్లుతుంది.

      తొలగించండి
    3. ఆర్యా నమస్కారము! సహృదయముతో చేసిన యే సూచన యయినా స్వీకరింపదగినదే! ధన్యవాదములు!

      తొలగించండి
    4. గుగరదేవులకు నమస్సులు! సమస్య కఠినంగా తోచి చేసిన పూరణ. విద్వన్మణి విషయములో సందేహిస్తూనే వ్రాశాను. మీరు సహృదయముతో అంగీకరించారు! ధన్యవాదములు!🙏🙏🙏🙏

      తొలగించండి
    5. సవరించిన పూరణ:
      రాణ్ముని కౌశికుడే యీ
      షణ్మాత్రము శంకలేక శంకర గురువి
      ద్వన్మణి నెటుబల్కె నకట
      రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుడే?

      తొలగించండి
  5. ప్రత్యామ్నాయ పూరణ :
    షణ్ముఖ సముడౌ జనకుడు;
    మృణ్మయమౌ మతి గలిగిన మేటియె గా!యీ
    షణ్మాత్రము వెడయె? కుశుడు;
    "రాణ్ముని ; దుర్యోధనుండు ; రాముని సుతుఁడే"
    *****)()(****
    వెడ = అనృతము; అసత్యము; అబద్ధము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనారదన రావు గారూ,
      మీ ప్రత్యామ్నాయ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  6. మృణ్మయ మైనటి వాడౌ
    రాణ్ముని దుర్యోధనుండు; రాముని సుతుఁడే,
    షణ్ముఖ, కుశుడరయన్నీ
    షణ్మాత్రము హరిమ చాలు చక్కగ గనుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. 'ఐనట్టి'ని 'ఐనటి' అన్నారు. దుర్యోధనుడు రాణ్ముని కాదు కదా! షణ్ముఖ శబ్దాన్ని సంబోధన చేశారా! అప్పుడు ! చిహ్నాన్ని పెడితే సందేహానికి తావుండదు.

      తొలగించండి
  7. షణ్ముఖ జనకుడు శివుడట
    మృణ్మయ మగుశిలయె గాదె మృత్యుం జయుడే
    షణ్మత స్తాపన శంకరు
    రాణ్ముని దుర్యోధ నుండు రాముని సుతుఁడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. మూడవ పాదంలో 'షణ్మత స్థాపన' అన్నపుడు 'త' గురువై గురువై గణదోషం. సమస్య పరిష్కరింపబడినట్లు లేదు.

      తొలగించండి
    2. షణ్ముఖ జనకుడు శివుడట
      మృణ్మయ మగుశిలయె గాదె మృత్యుం జయుడే
      షణ్మత బోధక గురువులు
      రాణ్ముని దుర్యోధ నుండు రాముని సుతుఁడే

      తొలగించండి
  8. (మతి భ్రమించిన పండితుని పలవరింతల గురించి పలుకుతున్న పుత్రుడు)
    షణ్మాసములు గడచె;నీ
    షణ్మాత్రము వైద్యమికను సత్ఫల మిడదే?
    మృణ్మయమతి నతడిటులను;
    "రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుడే."

    రిప్లయితొలగించండి
  9. షణ్మతముల నొకటి నిలిపె
    షణ్మద మూర్ఖతను కూలె సంగరమున నీ
    షణ్మాత్రపుయెరె? కుశుడే
    రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుఁడే

    (యెర=సందేహము, రాణ్ముని= బుద్ధుడు, (షణ్మతములు ఒక ప్రచారం ప్రకారం "బౌద్ధం, వైదిక, శైవంచ, సౌరం,విష్ణుంచ శాక్తకం.")

    రిప్లయితొలగించండి
  10. ఫణ్మానసి మిథిలేశుడు?
    షాణ్మాతురుఁబోలు రాజు?(సత్యంబగునే?)
    ఛణ్మాత్ర బాణనిపుణుడు.
    రాణ్ముని,దుర్యోధనుండు,రాముని
    సుతుడే
    ఫట్+మానసి=ఫణ్మానసి.
    మనసును అవలీలగా అధిగమించినవాడు.
    ఛట్+మాత్ర=ఛణ్మాత్ర.
    తృటిలో.
    క్రొత్త పదాలను ఊహించి వాడాను క్షమించండి

    రిప్లయితొలగించండి
  11. షణ్ముఖభక్తుడవయి యీ
    షణ్మాత్రము నిజముగాని జల్పము లేలా?
    మృణ్మయమతి! వినుమా యో
    రాణ్ముని! దుర్యోధనుండు రాముని సుతుఁడే?

    రిప్లయితొలగించండి
  12. అందరికీ వందనములు
    అందరి పూరణలూ అలరించు చున్నవి
    అలరించ నున్నవి

    గురు శిష్య సంవాదము :

    01)
    ____________________

    రాణ్ముని యెవరను ప్రశ్నకు
    "రాణ్ముని దుర్యోధనుండు - రాముని సుతుఁడే"
    షణ్ముఖుడన, నొజ్జ తెలిపె
    రాణ్ముని యన కౌశికుడని - లాలిత్యముగన్ -
    ____________________
    లాలిత్యము = లలితము = సున్నితము = ఖచ్చితము

    రిప్లయితొలగించండి
  13. మన్మథుని బోలు రూపున
    సన్మానములందె వైచి చక్కటి పాత్రల్
    తన్మయమిడ తానె జనక
    రాణ్ముని, దుర్యోధనుండు, రాముని సుతుఁడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (న-ణ లకు ప్రాస చెల్లడం ఉభయప్రాస)

      తొలగించండి
  14. శకారుని మాటలు......

    "షణ్ముఖుని తండ్రి విష్ణువు,
    షణ్మాసము లుండు నొక్క సాలునఁ గనఁగన్,
    రాణ్మణి యనఁగఁ గుచేలుఁడె,
    రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుఁడే!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఎట్లా అర్థం చేసుకోవాలో
      తెలియ జేయ గలరు

      జిలేబి

      తొలగించండి
    2. శకారుని మాటలు అనే సూచన గమనించండి జిలేబిగారూ!

      తొలగించండి

    3. శకారుడంటే ఎవరండి ?

      ఆంధ్రభారతి వెతికా అర్థం కనబడలే !

      జిలేబి

      తొలగించండి
    4. "పాలకుడనే రాజు ఉజ్జయినీ నగరం రాజధానిగా అవంతీ రాజ్యాన్నిపరిపాలిస్తుంటాడు. ఆ రాజొక దుష్టుడు. శకారుడు – రాజు గారి బావమరిది. శకారుడు మూర్ఖుడు, అవకాశవాది, క్రూరుడు...."

      http://poddu.net/2010/మృచ్ఛకటికం-రూపక-పరిచయం/

      తొలగించండి
    5. సంస్కృతంలో శూద్రకుడు అనే కవి రచించిన నాటకం 'మృచ్ఛకటికమ్'. అందులో శకారుడు అనేవాడు ప్రతినాయకుడు. రాజు బావమరదిననే గర్వంతో నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పురాణ జ్ఞానం ఏమాత్రం లేనివాడు, మూర్ఖుడు. అతని మాటలన్నీ తెలివి తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు... "కుంభకర్ణుడు కుంతి కొప్పు పట్టుకొని ఈడ్చినట్లు.... వాలి ద్రౌపదిని లంకలో బంధించినట్లు..." ఇలా ఉంటాయి.
      ఈనాటి సమస్య వంటివి వచ్చినపుడు ఎందరో కవులు శకారుని మాటలుగా పూరణలు గతంలో చేశారు.

      తొలగించండి
    6. ఈ నాటకం తెలుగులో 'వసంతసేన' అనీ, హిందీలో 'ఉత్సవ్' అనీ సినిమాలుగా వచ్చింది. శకారుని పాత్రను తెలుగులో ఎస్.వి.రంగారావు, హిందీలో అమ్జద్ ఖాన్ వేశారు.

      తొలగించండి
    7. ఈ మృచ్ఛకటిక నాటకం ద్వారానే దేవానాం ప్రియః అంటే మూర్ఖుడు అనే అర్థంఎక్కువగా వాడుక లోకి వచ్చింది అనుకొంటాను.

      తొలగించండి

    8. కందివారు

      నెనరులు !

      @ జీపీయెస్ వారు

      అద్భుతమైన లింకు అందించారు !

      వ్యాసకర్త బ్లాగాడిస్తా రవి గారు లాజవాబ్ !

      ఇంతకు మునుపు వీరి వ్యాసాలు చాలా చదివా (వారి బ్లాగులో) సంస్కృతం లో మంచి పటుత్వం‌
      వున్నవారు, వా టిని తెలుగులో అందంగా హృద్యంగా రాయగలిగిన వారు బ్లాగాడిస్తా రవి‌గారు !

      నెనర్లు!

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    9. శంకరార్యా !
      శకారుని ప్రేలాపన ద్వారా మీ పూరణ ఉత్తమముగా నున్నది.
      అభినందనలు.


      తొలగించండి
  15. డా.పిట్టా
    గురు శిష్య సంవాదము:ఏక,బహు వచనముల సుడి॥
    రాణ్మునియును తదనంతర
    రాణ్మణి దుర్యోధనుండు రాజాంశల నీ
    షణ్మాత్రము బహు వచనమె?
    "రాణ్ముని, దుర్యోధనుండు రాముని సుతుడే?(డే,డే,డే/లే, ..లేదే!!!)

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టా
    రాణ్ముని రాణ్మణి రాముడు
    షాణ్మాసములారు మూడె షడృతువుల నీ
    షణ్మాత్ర గణన దప్పెనొ
    "రాణ్ముని, దుర్యోధనుండు,"రాముని ---సుతుడే?"

    రిప్లయితొలగించండి
  17. షణ్ముఖుడు వ్రాసె సరియని
    షణ్మాసపరీక్షలందు ఛాత్రుడు తా నీ
    షణ్మాత్రంబును దలపక
    రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుఁడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  18. మృణ్మయ మైనట్టి నరుడు,
    రాణ్ముని! దుర్యోధనుండు; రాముని సుతుఁడే, 
    షణ్ముఖ! కుశుడరయన్నీ 
    షణ్మాత్రము హరిమ చాలు చక్కగ గనుమా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. హమ్మయ్య ! సరి యే నా ?


      మృణ్మయుడౌ, కాడోయీ
      రాణ్ముని, దుర్యోధనుండు; రాముని సుతుఁడే, 
      షణ్ముఖ! కుశుడరయన్నీ 
      షణ్మాత్రము హరిమ చాలు చక్కగ గనుమా!

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      ఇప్పుడు సరిగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  19. షణ్ముఖ దయ రాజాయెను
    రాణ్ముని,దుర్యోధనుండు రాముని సుతుడే
    మృణ్మయమతి విడిచిన వి
    ద్వన్మని కురురాజ రామ వంశాంకురమై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      క్షమించాలి! మీ పూరణ భావం అర్థం కాలేదు. వివరిస్తారా?

      తొలగించండి
    2. షణ్ముఖుని దయచే ఒకరాజు రాజర్షి అయ్యాడు. ఇకమృణ్మయమతి(అజ్ఞానం) వీడి విద్వణ్మని ఐన కురురాజు కు ప్రియమైవ కొడుకుగా దుర్యోధనుడు వంశాంకురమై జన్మించెను. కురురాజరామ=కురురాజుకు ప్రియమైన
      రాముడు అనినపదాన్ని ప్రియమైన అని తీసుకున్నాను

      తొలగించండి
  20. రాణ్మ్తిత్ర! గాధిజుడెవరు?
    రాణ్మానధనుండెవరు? విరాడ్రామునితో
    ద్విణ్మణి వలె పోరె నెవడు
    రాణ్ముని - దుర్యోధనుండు - రాముని సుతుడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ద్విట్+మణి= ద్విణ్మణి కదా!ద్విట్సు మణిః ద్విణ్మణిః అనుకొంటాను.

      తొలగించండి
    2. విజయకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ద్విణ్మణి' రూపమే సాధువు.

      తొలగించండి
    3. ద్విట్ శబ్దానికి ఆంధ్రభారతిలో యిప్పుడే అర్ధము గ్రహించాను! ధన్యవాదములు!

      తొలగించండి
  21. సన్మాత పుత్రుడత డీ
    షణ్మాత్రంబైన మదిని సందియమేలన్
    సన్మానితుడౌ కుశుడే
    రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుడే

    రిప్లయితొలగించండి
  22. శృణ్మా శంకర వర్యా!
    గుణ్మణి యౌ నాదు గుండె గుబగుబ లాడెన్
    ధణ్మని సమస్య జూడగ:
    రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుఁడే!

    రిప్లయితొలగించండి
  23. గురువు గారి కి నమస్సులు. నా పూరణ లోని దోషములు తెల్పుడు.
    రాన్మా నో జ్ఞయ మూర్తుడు
    ప్రాణ్యాతి సభాస కళల పo డితు డన రున్
    గణ్యాది గుణ సంహితుడున్
    రాన్ముని దుర్యోధనుడు రాము ని సుతుడే
    ణ ను మొదటి పాదము మొదటి పదము లోను
    చివరి పాదము మొదటి పదము లోను పద్య పూరణ లో చదువు కోవలసినదిగ మనవి.
    వందనములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ గారూ,
      భావం సందిగ్ధంగా ఉంది. రెండవ, మూడవ పాదాలలో ప్రాస తప్పింది. మరో ప్రయత్నం చేయండి.

      తొలగించండి
    2. గురువు గారు మరో ప్రయత్నం .అయినా లోపాలు ఉన్నాయని నా భావన .సవరిo చె దరని ప్రార్థన
      సన్మాన పూజ్యo న్డెవ్వడు?
      భాన్మతి వలచిన కురుకుల భానుడు నత డే
      రా న్మానో జ్ఞాo బుధుడే
      రాన్ము ని దుర్యోధనుడు రాము ని సుతు డే.
      ణ గ మూడు నాలుగు పాదాల మొదటి పదము లో చదువ ప్రార్థన.
      వందనములు

      తొలగించండి
    3. పంచరత్నం వారూ,
      నిజమే! మీ రెండవ ప్రయత్నంలోనూ లోపాలున్నవి. (ఔత్సాహిక కవులకు సహజమే. నిరుత్సాహ పడకండి!)
      మొదటి పాదంలో గణదోషం. 'పూజ్యు డెవ్వడు' అంటే సరి. భానుమతిని భాన్మతి అనరాదు. మూడవ పాదం అర్థం కాలేదు.

      తొలగించండి
  24. మృణ్మయమైనఁ దలచును హి
    రణ్మయ మని బుద్దిఁ గనికరము గనలే మీ
    షణ్మాత్రము నపవిద్ధ వి
    రాణ్ముని దుర్యోధనుండు రా ముని సుతుఁడే

    [విరాణ్ముని = రాజర్షి , ఇక్కడ ధర్మరాజు; ముని సుతుఁడే - కాఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      విలక్షణమైన భావాలతో, విశేషార్థ శబ్దాలతో, వైవిధ్యంగా పూరణలు చెప్పడంలో మీకు మీరే సాటి! అద్భుతమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కడుంగడు ధన్యవాదములు.

      తొలగించండి
  25. చిన్మ య కౌశికు డె వ రో ?
    తన్మయు డైమయ సభ గని తనిసి న దె వ రో ?
    షణ్ముఖుని వంటి కుశు డే
    రాన్ముని దుర్యోధనుండు రాముని సుతుడే

    రిప్లయితొలగించండి
  26. షణ్ముఖునిదండ్రిశంభుడె
    రాణ్ముని.దుర్యోధనుండురామునిసుతుడే
    సన్మతిహీనుడు.కుశుడే
    హన్మా!వినుమామరియీ యక్షరసత్యమ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      దుర్యోధనుడు రాణ్ముని కాదు కదా! 'సన్మతిహీనుడు' కుశునకు విశేషణ మెలా అయింది. సత్యమ్ అని హలంతంగా పదాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  27. షణ్ముఖులగు కవులకు నీ
    షణ్మాత్రము వెఱపు లేదు ఛందమె గురువై
    షణ్మాత్రుకై విరాజిల
    రాణ్ముని ధుర్యోధనుండు రాముని సుతుడే

    రిప్లయితొలగించండి
  28. క్రమాలంకారము
    షణ్ముఖ రాగంబుబలికె
    షణ్ముఖ రణరంగవిద్య సాధించెనుగా|
    షణ్ముఖ-లవుడనయెవ్వరు?
    రాణ్ముని1 దుర్యోధనుండు2.రాముని సుతుడే.

    రిప్లయితొలగించండి
  29. షణ్ముఖ ! కౌశికుడే వి
    ద్వన్మణి , క్రూరుండు, కుశుడు , ధరనింకెవ రీ
    షన్మాత్రము శంక వలదు
    రాణ్ముని /దుర్యోధనుండు /రాముని సుతుఁడే"

    రిప్లయితొలగించండి
  30. గురువు గారు సవరించిన పూరణ మొదటి పూరణ దగ్గర పోస్ట్ చేసినాను.

    రిప్లయితొలగించండి
  31. సన్మార్గుడు జనకుడెవరు?
    రాణ్మనుజేంద్రుడు శశి కుల రాజెవరగు? వి
    ద్వన్మణి, కుశుడెవరందువు?
    రాణ్ముని, దుర్యోధనుండు, రాముని సుతుడే!

    రిప్లయితొలగించండి
  32. షణ్ముఖరావును గనుచున్
    ధన్మని బలికె యొక వెడగు,ధారుణి లోనన్
    షణ్మతములు నెలకొల్పిన
    రాణ్ముణి దుర్యోధనుండు రాముని సుతుడే!!!


    రాణ్ముని యన నెవ్వరనుచు
    మృణ్మయ మతి గలిగినట్టి మిత్తరునడగన్
    షణ్ముఖరావిట్లనియెన్
    రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుడే!!!

    రిప్లయితొలగించండి

  33. చిన్మయరూపుని గొల్చును
    తన్మనమున సతతమ్ము తల్లడమొందున్
    రాణ్మోహనుడౌ కుశుడును
    రాణ్ముని ,దుర్యోధనుండు,రాముని సుతుడే.

    రిప్లయితొలగించండి

  34. సవరణతో

    చిన్మయరూపుని గొల్చును
    తన్మనమున సతము తాను తల్లడమొందున్
    రాణ్మోహనుడౌ కుశుడును
    రాణ్ముని ,దుర్యోధనుండు,రాముని సుతుడే.

    రిప్లయితొలగించండి