15, అక్టోబర్ 2017, ఆదివారం

సమస్య - 2493 (తమ్ముల నిరసించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్"

41 కామెంట్‌లు:

 1. "రమ్మిటు యన్నా, రాజై
  మమ్ముల పాలింపుమన్న, మాకెవ్వరుది
  క్కిమ్మహి" యని వాపోయిన
  తమ్ముల నిరసించె రామధరణీశు డొగిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇంకొక పూరణ:
   చూడగా, 'నిరసించ'డాన్ని, 'ని' తీసి, 'రసించ'డమనచ్చు కదా అని తట్టింది.

   "ఇమ్మగు సుఖముల వీడెను!
   సొమ్ముల భవనమ్ములన్న సొక్కవు యాహా!
   కమ్మని ప్రేమకు గురుతులు!
   తమ్ము"లని రసించె రామధరణీశు డొగిన్!

   తొలగించండి

 2. తమ్మిముఖ సీతగానక
  కమ్మిన దుఃఖము, విరహము కలచగ హృది పం
  తమ్మున చెంతను గల కెం
  దమ్ముల నిరసించె రామధరణీశు డొగిన్

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. 1. క్రమముగా.
   2. శ్రద్ధగా.
   3. చక్కఁగా.

   తొలగించండి

  2. ధన్యవాదాలండి జనార్ధన రావు గారు

   ధరణీశుడు + ఒగి

   ఒగి - క్రమముగా etc

   జిలేబి

   తొలగించండి
 4. నమ్మితి నా కోదండము
  నిమ్ముగ తెగటార్తు వైరులెందఱినైనన్
  పొమ్మని పిరికితనము,శాం
  తమ్ముల నిరసించె రామ ధరణీశుడొగిన్

  రిప్లయితొలగించండి
 5. కమ్మని తన పలుకులతో
  తమ్ములనే యాదరించు ధర్మాత్ముడురా !
  నమ్మను కలనైన యెపుడు
  "తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్?"

  రిప్లయితొలగించండి


 6. అమ్ములు వేగమవన్ ఘా
  తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగి
  న్నమ్ముని వాటికన తన
  న్నమ్మిన వారి తలగాచి నమతుండతడౌ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. పొమ్మన నడవికి పితరుడు
  కిమ్మనక వెడలె ససీత కినుకయె లేకన్
  పిమ్మట గూడిన దుష్ఫలి
  తమ్ముల నిరసించె రామ ధరణీశుడొగిన్

  రిప్లయితొలగించండి
 8. ఇమ్మహి నేలుము కాంతా
  రమ్మున వాసమ్ము వలదు రామా రయమున్
  రమ్ము నయోధ్యకు యనగా
  "తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్"

  రిప్లయితొలగించండి
 9. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  క్షేమంగా చార్ ధామ్ యాత్ర ముగించుకొని ఢిల్లీ చేరుకున్నాము.
  సెంట్రల్ ఢిల్లీలో బిర్లా లక్ష్మీ నారాయణ దేవాలయం ధర్మశాలలో దిగాము.
  రేపు మధ్యాహ్నం హైదరాబాదుకు ప్రయాణం.
  ఢిల్లీ మిత్రులు ఎవరినైనా కలిసే అవకాశం ఉందా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువు గారి పాద పద్మములకు నమస్కారము. మీరు యాత్ర దిగ్విజయముగా ముగించుకొని వచ్చినందుకు చాలా సంతోషము. శంకరుడు లేని కైలాసము లాగా ఉన్నది శంకరాభరణము మీరు వచ్చి త్వరలో శంకరాభరణము కవులకు సంతోషము కలిగించాలని ఆ కపర్ధిని ప్రార్దిస్తున్నాము. అభినందనలు.

   తొలగించండి
 10. డా.పిట్టా
  తమ్మి1య విశేష వృక్షము
  తుమ్మ2గ సృజియింప దగునె?తోచదె, "విషమా3?!
  కొమ్మవు ముప్పురి పాలవు4
  "తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్"?
  1.పద్మము2.ముళ్ళచెట్టు,తుమ్మ3.విష వృక్షమా,రామాయణ విష వృక్షము4 పాలపిట్ట ,ము*పాల॥ముప్పాళ (మూడు పురుల,పాళుల-- ముప్పురి)రంగనాయకమ్మవు.

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా
  ఇమ్మహి పూర్ణ పూరుషుడు నేదిశ నుండడటన్న సూక్తి1మై
  కొమ్మయె రంగ నాయిక2యె కోరి విపర్యయ గాథ3 నల్లగా
  "అమ్మ!యిదేమి శాస్త్ర"మని యందరునున్ నిరసించి రందులో
  తమ్ముల బ్రేమ లేమి సతతమ్ముకృశించగ జూచె రాముడే?!
  1."Ideal is never real". 2. ముప్పాళ రంగనాయకమ్మ3.రామాయణ విష వృక్షము..ఆమెగారి గ్రంథము.

  రిప్లయితొలగించండి
 12. తమ్ముడు లక్ష్మన్నయు సీ
  తమ్మయు తనతోడురాగ తరలగ వనికిన్
  రమ్మనరాజ్యమునకు చిన
  తమ్ముల నిరసించె రామధరణీశు డొగిన్

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టా
  ఆర్యా, నా పూరణకు మరో సాధారణ అధోజ్ఞాపిక
  "Man is a bundle of inconsistent qualities" O.Henry.

  రిప్లయితొలగించండి
 14. కొమ్మ ధరణి జ ను లంకకు
  దోమ్మిగ చేకొని యు పోయె దురితాత్ముoడై
  అమ్మేయి ద శ కం ఠుని చే
  తమ్ముల నిరసిం చె రామ ధరణీ శుడోగి న్

  రిప్లయితొలగించండి
 15. దమ్మమునే గాపాడగ
  ఉమ్మడిగా తన యనుజుల యూతము తోడ
  న్నిమ్మహి లోగల యఘజా
  "తమ్ముల నిరసించె రామ ధరణీశుడొగిన్"

  రిప్లయితొలగించండి
 16. (ఖరదూషణాది రాక్షసులను సంహరిస్తున్న శ్రీరామచంద్రుడు)
  వమ్మవకుండగ వేవే
  లమ్ముల గురిపించుచు గగనాంగణ మంతన్
  గ్రమ్ముచు ఖరదూషణ ప్రో
  తమ్ముల నిరసించె రామధరణీశుడొగిన్.

  రిప్లయితొలగించండి
 17. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

  తమ్ములకు ప౦చెను మిగుల

  కమ్మనిప్రేమ౦బుమరియుక్ష్మాసుతకై యు

  ద్ధమ్మున దశముఖు నాతని

  తమ్ముల నిరసి౦చె రామధరణీశు డొగిన్

  రిప్లయితొలగించండి
 18. అమ్ముని కోరగ వేవే
  గమ్మున జన్నము వనమున గాచెన్నాసాం
  తమ్ముగనా రాక్షస పం
  "తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్"

  రిప్లయితొలగించండి
 19. ఇమ్మహిని ధర్మ నిరతి వి
  ధమ్మును పెంపొందఁజేసె దాశరథుఁడు బా
  ణమ్ములఁ దుర్మతి దితిజా
  తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్

  రిప్లయితొలగించండి
 20. సమ్మతి దెలుపగ దండ్రియె
  నమ్మిన యామునుల యరుల నాశముము జేసెన్
  గ్రమ్మర యజ్ణానపు ధ్వాం
  "తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్"

  రిప్లయితొలగించండి
 21. నమ్మగశక్యముకానిది
  తమ్ములనిరసించెరామధరణీశుడొగి
  న్నమ్మహితాత్మునినిరసన
  తమ్ములపైయుండదెపుడుతమకముతప్పన్

  రిప్లయితొలగించండి
 22. అమ్ముని సత్తములకు ని
  త్యమ్ము వెత లొసంగెడు నసహన దైత్య నికా
  యమ్ముల దుర్భర దుష్ట కృ
  తమ్ముల నిరసించె రామ ధరణీశుఁ డొగిన్

  రిప్లయితొలగించండి
 23. ముమ్మోటు మడేలన్న వి
  షమ్మును జిమ్మఁగ వనముల సాధ్విని బంపన్
  దమ్మ విరుద్ధమన ననుచి
  తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్

  రిప్లయితొలగించండి
 24. అమ్ముని రూపున నసురుడు
  కొమ్మను గొనిపోవనకట కోమలి తోడన్
  నెమ్మది విహరించిన ప్రాం
  తమ్ముల నిరసించె ధరణీశు డొగిన్

  రిప్లయితొలగించండి
 25. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,


  తమ్ములకు ప౦చెను మిగుల

  కమ్మనిప్రేమను.మరియును క్ష్మాసుతకై యు

  ధ్ధమ్మున దైతేయ వ్రా

  తమ్ముల నిరసి౦చె రామధరణీశు డొగిన్

  రిప్లయితొలగించండి
 26. . సార్ఇది నిన్నటిపూరణ
  సీత మనసుజేర నేతగు దశరథ
  తనయుడుపతియయ్యె|”తరుణి మురిసె
  రాజులచట జూడ?మోజును బెంచె|స్వ
  యం వరమునపెళ్లి యద్భుతంబు|
  15.10.17. నమ్మిరి విశ్వామిత్రయా
  గమ్మిక లక్షణముగ జరుగు గమనించంగన్
  యమ్ముల పొదనందుకె|భూ
  తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్|  రిప్లయితొలగించండి
 27. మీ యాత్ర బాగాజరిగినందుకు చాలా సంతోషం
  శ్యామల

  రిప్లయితొలగించండి
 28. గురువు గారి కి నమస్సులు. యాత్ర దిగ్విజయంగా జరిగినందులకు సంతోషము.

  రిప్లయితొలగించండి

 29. తమ్ముని మృగముగ పంపెను
  తమ్మి కనులసీతఁబట్ట దశకంఠుండున్;
  తమ్ముని తోచనుచులతాం
  తమ్ముల నిరసించె రామధరణీశుడొగిన్.

  రిప్లయితొలగించండి
 30. అన్నయ్యగారూ నమస్సులు.యాత్ర చక్కగా ముగిసినందుకు శుభాభినందనలు.

  రిప్లయితొలగించండి