19, అక్టోబర్ 2017, గురువారం

దీప, పద్మ బంధ సీసములో శ్రీకృష్ణ ప్రార్ధన

సీ.
నందునింట  పెరిగిన  గిరిధరా, ఘోర
          నందుల నెదిరించిన  బక వైరి, 
భద్రనాథ, సతము భక్తిన పూజించు
          నట్టి రుక్మిణి పతి, నవ్వు తోన
మోర భాసిల్లగా నారి గణము కెల్ల 
          నసను గల్గించెడు  ససి  విభుండ 
ఘన  నగధారి, సకల భాగ్య దాయకా, 
          పూతన పాతంగి, బుధుడ , మాధ
వా పద్మనయన, శ్రీవత్సాంకితా,  రాస
          నాట్య విలాసితా నరసఖ, ఘన
మౌ  చక్రధర, కృష్ణ మాన సంరక్షకా,
          సోమ భాస్కర నేత్ర ,సూరి, నరక
సంహారకా, దాసి జన  రక్షకా, నల్ల
          నయ్య, బుధుడ, దేవి నాగ్న జితి
మానస చోర అమర, కీశ, గంధర్వ,
          నాగ, నర, విహగ నాధ, తపసు
ల మనమున వసించి లబ్ధిని వారల
          కిచ్చెడు వనమాలి,  గీత బోధ
దేవ, కంసారాతి, దీన జనోద్దార
          కుండ, యాదవ నాయకుండ, నర్త
న  వరాసనా, వేండ్రనట్టు పరచు నవ
          నీత  చోరుడ, కాముని జనక, ఘన
మౌళిపై పురి యమరిన దేవరా,  దాన
          వరిపువు, కృష్ణ,యమరుడ, జినుడ,
నగశయన, విధి, వేన  గళరూపా, ఘన
          లక్షణ పాతి, యలంకరణము
కోరునట్టి  మురారి, గోపాల, మల్లారి,
          వజ్ర కిశోరుడ, వజ్ర నాద,
తే:   
నంద నందనా, రుక్మిణీ నాధ, సత్య
భామ మానస మాచలా, భాగ్య దాత,
దేవకీ సుత ,  శ్రీ వాసుదేవ, యాద
వేంద్ర , కాచుమయ్య యన్ని వేళలందు.         

రచన -  పూసపాటి కృష్ణ సూర్య కుమార్

12 కామెంట్‌లు:

 1. కమల ద్ధ్వని పద గతియై
  సమంచితముగా కిరీటి సారథి ని వచో
  సమధికా రోగ్యవి లసతిగ
  నమస్సు లర్పించితిరినవ రీతిన సుకవీ.
  వందనములు.మీకు వినమ్రతతో నా భావావేశం ను తెలిపితిని.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిత్రమా ధన్యవాదములు
   నేను గమనించ లేదు సుమా అన్యదా భావించ వలదు.

   తొలగించండి
 2. ఆర్యా!
  నమస్కారములు.
  సీస పద్యంలోని చివరి పాదంలో గోపా తరువాత ఇందులో కనిపించలేదు.
  దయచేసి అన్యధా భావించక దీనిలోని సీసమాలికకు ఇన్ని పాదములుండవలెనను నియమము ఉన్నదా తెలియజేయ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి గారికి నమస్కారములు నాకు గురువు గారు సూచించిన ప్రకారము సీస పద్యమునకు ఎన్ని పాదములైనను వ్రాయ వచ్చును. ఎత్తు గీత మటుకు 4 పాదములే ఉండాలి. మీరు అడిగిన దానికి వివరణము. గోపా తర్వాత వృత్తములో దీపములున్నవి దానిలో ల మల్లారి వజ్ర కిశోరుడ వజ్ర నాధ అను అక్షరములు ఒక్క్కొక్క దీపములో బంధించ బడినవి వజ్ర నాధ తర్వాత దళములలోకి ప్రవేశించి తేటగీతి నంద నందనా తో ప్రారంభము అయి వేళలందు తో ముగుస్తుంది. ధన్యవాదములు

   తొలగించండి
 3. చిత్ర బంధము లందు చిన్ని నల్లనయ్య చిద్విలాసం అత్యద్భుతమండి.

  రిప్లయితొలగించండి
 4. రిప్లయిలు
  1. ధన్యవాదములు అక్కయ్య గారు నమస్కారములు దీపావళి శుభాకాంక్షలు

   తొలగించండి
 5. నా ప్రశం సా పూర్వక పద్యము పై తమ స్పందన లేదు. నేను తమరికి వినమ్రా పూర్వకంా తెలిపినా ను.

  రిప్లయితొలగించండి