24, అక్టోబర్ 2017, మంగళవారం

సమస్య - 2502 (దశకంఠునిఁ గొల్చు నరులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా"
(లేదా...)
"దశకంఠుం గడు భక్తిఁ గొల్చు నరులే ధన్యుల్ గదా చూడఁగన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

74 కామెంట్‌లు:

  1. శశివదనుఁడు, రఘురాముఁడు,
    మశకీకృత రాక్షసుండు, మహనీయుఁడు, స
    ద్యశుఁ, డనఘుం డగు నిర్జిత
    దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా!

    రిప్లయితొలగించండి
  2. కుశలముగా బ్రహ్మను మరి
    శశిధరునికి చిన్న కొడుకు షణ్ముఖు తోడన్
    నశియించని ముక్తి కొఱకు
    దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా!

    4+6 = 10

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      ఆహా! *చతుర్ముఖుడు + షణ్ముఖుడు = దశముఖుడు* అని మంచి ఫార్ములా కనిపెట్టారే!
      బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. సార్! కొంచెం భయపడ్డాను.. దశముఖుడు దశకంఠుడేనా అని. మీరు దయతో ఆమోదించారు కావున హాయిగా నిదురించెదను!

      🙏🙏🙏

      తొలగించండి
    3. సార్!

      ఇరవై సంవత్సరాల క్రితం ఐ.ఐ.టి. ఖరగ్పూరులో నేనూ నా మిత్రుడూ పచార్లు చేస్తున్నపుడు ఒక పరీక్షా హాలులో ముగ్గురు పర్యవేక్షకులు తనిఖీ చేస్తూ కనిపించారు. అప్పుడు నేను ఈ హాలులో కాపీలు జరుగవు అన్నాను. ఎందుకంటే ఉన్నది ముగ్గురు ఇన్విజిలేటర్లే అయినా 28 కళ్ళతో కనిపెట్టియున్నారు. అదియెట్లన, వారి పేర్లు:

      1. ప్రొ. పంచానన్ ఛటర్జీ
      2. ప్రొ. పంచానన్ ప్రమాణిక్
      3. ప్రొ. ఆర్.కే. బ్రహ్మ

      ...బెంగాలులో ఎన్ని తలలు కావాలంటే అన్ని తలలు కిట్టించ వచ్చు....

      తొలగించండి

    4. సూర్య కోటి సమప్రభాకరుడు జీపీయెస్సు వారు :)

      జిలేబి

      తొలగించండి
  3. దిశలన్నిట వ్యాపించిన
    విశుద్ధమౌ ముని మనముల వెల్గెడు మూర్తిన్
    వశపరచు కొనుచు; నిర్జిత
    దశకంఠుని గొల్చువారు ధన్యులు కదరా
    నిర్జిత దశ కంఠుడు = రాముడు.
    ****}{}{}{****
    మశకమ్మున్ కొన గోట నల్పినటులే మర్దించె నా రావణున్
    దిశలన్నింటను గీర్తి బొందెగద యా ధీరుండు శ్రీరాముడున్
    వశమౌ గద భక్త కోటి కెపుడున్; దా నిర్జించె నా క్రూరుడౌ
    దశ కంఠుం;గడు భక్తి గొల్చు నరులే ధన్యుల్ గదా చూడగన్.
    ****)()()()(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వృత్త పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  4. (రావణుడు హితుల బోధలచే రాత్రింబవళ్ళు ఆలోచించి మనసు మార్చుకొని సీతను శ్రీరామునికి అప్పగిస్తే)
    నిశలున్ బవలున్ జింతిలి
    వశమున నుండిన జనకజ వలదని తనదౌ
    దిశమార్చి రామున కొసగు
    దశకంటుని గొల్చు నరులు ధన్యులు గదరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      ఊహాజనిత భావంతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  5. వశ మండోదరి సతతము
    దశకంఠునిఁ గొల్చు, నరులు ధన్యులు గదరా
    శశి భూషను యభిషేకము
    కుశలత తో కార్తికమున గుడిలోజేయన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శశిభూషణు నభిషేకము' అనండి.

      తొలగించండి

  6. శశబిందువు నిర్గమనుడు,
    దశకంఠునిఁ గొల్చు నరులు, ధన్యులు గద, రా
    మ! శరణు జొచ్చిరి నీచెం
    త, శమనమున్నొందిరి సతతముసేవింపన్ !

    ಜಿಲೇಬಿ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. దశరథనందను డాతడు
    దశదిశలం గీర్తి నందె దైత్యగుణాలన్
    భృశ మెగురగ దునుమాడెను
    దశకంఠునిఁ, గొల్చు నరులు ధన్యులు గదరా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. హత వాలీశు ననన్యా
    దృశ కీర్తిత పితృ వచన విధేయుని రామున్
    నిశితాస్త్రాహత దూషిత
    దశ కంఠుని గొల్చు నరులు ధన్యులు గదరా!

    రిప్లయితొలగించండి
  9. ప్రాస సవరణతో

    యశ ఇద్ధ ధనుననన్యా
    దృశ కీర్తిత పితృ వచన విధేయుని రామున్
    నిశితాస్త్రాహత దూషిత
    దశ కంఠుని గొల్చు నరులు ధన్యులు గదరా!

    రిప్లయితొలగించండి

  10. వశమై నిల్చెను మానవుండు, తిధులున్, వారమ్ము నక్షత్రముల్,
    శశిపర్వంబులు, మీనమేషములనన్ శాసించి, కాలమ్మిటన్,
    దశవర్గంబులు చేరి సంకటబడన్ తాకించు, గానన్, "మహ
    ర్దశ" కంఠుంగడు భక్తిఁ గొల్చు నరులే ధన్యుల్ గదా చూడఁగన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మిగతావాటి సంగతేమో కాని మీ పూరణ చదివే 'మహర్దశ' మాకు పట్టింది. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  11. డా.పిట్టా
    అశన గ్రాహులు ద్రవిడపు1
    వశులై తమ మాతృ భాష పరమౌ దృఢతన్
    కుశ భాతిని, వాడిని, తమ
    దశకంఠుని గొల్చువారె ధన్యులు గదరా!(1.ద్రావిడ భాష యొక్క)
    తెలుగు రాష్ట్రాలే ఆంగ్ల మాధ్యమమును ప్రోత్సహిస్తున్న వైనము పై సద్విమర్శగా....

    రిప్లయితొలగించండి
  12. క్రమాలoకార ము లో
    నిశిత పుశర ము ల రణ ము n
    దశరథ సూను oడుజంపె ద ను జునె వ రి నో ?
    దశ ముఖ నిర్జిత రాము న్
    దశ కంఠుని ;గోల్చు నరులు ధన్యులు గదరా

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా
    అశనంబన్నను రక్త మాంసములవే హ్లాదంబులౌ బాణుకున్(బాణాసురుడు, భాగవతంలో)
    వశమై శంకరు డాజి బ్రోచుగద శైవజ్వరంబెన్ని యా
    దిశనున్ గృష్ణునిదైన వైష్ణవ జ్వరోద్వేగంబె మించెన్ననిన్
    అశనాసక్తులు శైవ, వైష్ణవ సముల్ ల్నార్యుల్ మరిన్ ద్రావిడుల్!
    దశకంఠుం గడు భక్తి గొల్చు నరులే,ధన్యుల్ గదా చూడగన్!
    ఫలశృతి:
    శ్రీకృష్ణుడు,"ఓ త్రిశిఖా! నీకు జ్వర భయము లేకుండుగాక! మన సంవాదమును విన్న వారికి నీ(జ్వరము)వలన భయముండదు.శ్రీకృష్ణునికి నమస్కరించి శైవ జ్వరము వెళ్ళి పోయినది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ. బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. డా.పిట్టా
      2వ పాదంలో:............ శైవాత్తాపమే జెల్లనా

      తొలగించండి
  14. అశనిని బోలు శరమ్ముల
    నిశాటులను సంహరించి నిజమిత్రులకున్
    దశదిశలను మార్చెడి జిత
    దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా

    రిప్లయితొలగించండి
  15. పశుప్రాయులు దైత్యసములు
    దశకంఠుని గొల్చు నరులు; ధన్యులు గదరా
    నశియింపని ముక్తి గొన న
    నిశము శశిధరుని జపింప నేర్చినవారల్!

    శ్రీలంకలో కొందరు దశకంఠుని భక్తులున్నారు!

    రిప్లయితొలగించండి
  16. ధన్యవాదాలార్యా!
    సవరణ:
    "వశమౌ వేలుపు భక్తకోటి కెపుడున్; నిర్జించె దుష్టుండునౌ"

    రిప్లయితొలగించండి
  17. యశమున్నన్ దశదిశలన్
    పశుప్రవృత్తిఁ పరకాంత బంధింపంగన్
    నిశితమ్ముగ రాముడణచ
    దశకంఠునిఁ, గొల్చు నరులు ధన్యులు గదరా.

    రిప్లయితొలగించండి


  18. విశిఖములతోడ నచ్చో

    నిశాచరుని గర్వమణచ నావేగముతో

    శశిముఖి హర్తను చంపిన

    దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా.

    ఆవేగము=కోపము .


    దశరథ నందను డిలలో

    నిశాచరుని సంహరించి నెమ్మది తోడన్

    శశిముఖి గాచిన నిర్జిత

    దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా.

    పశుపతి భక్తుడె యైనను
    పశుబలమును జూపి యచట పడతిని దాయన్
    విశిఖముల రాముడణచెను
    దశకంఠుని,గొల్చు నరులు ధన్యులు గదరా.

    రిప్లయితొలగించండి
  19. యశభూషణు నిశచరహరు
    వశభక్త హృదయనివాసు పావనరూపున్
    దశరథ తనయుని కరుణా
    దశకంఠునిగొల్చు నరులు ధన్యులు గదరా

    రిప్లయితొలగించండి
  20. దశరథ నందనునిఁ జతు
    ర్దశ భువన భయంకర ముని దత్తబ్రహ్మా
    స్త్ర శరాపాత విదారిత
    దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా


    కుశలం బిచ్చును మానవాళికి ధరం గ్రోధాదు లన్నింటికిన్
    వశమై యుండక సంచ రింపగను సద్భావమ్ము తోడన్ మహ
    ర్షు శమున్ దార్మికుఁ దాప సోత్తమ వరున్ రూపాంతరశ్రీ మహ
    ద్దశ కంఠుం గడు భక్తిఁ గొల్చు నరులే ధన్యుల్ గదా చూడఁగన్

    [రూపాంతరశ్రీ మహద్దశ = అవతారములు (రూపాంతరములు) భాగ్యదములును గొప్పవి పది కలవాఁడు , విష్ణువు; కంఠుఁడు = సమీపమున నున్నవాఁడు, విష్ణు భక్తుఁడు]

    రిప్లయితొలగించండి
  21. శశి నింగి యందువెలుగడి
    నిశి రాతిరి మందు కొట్టి నీల్గుచు నొకడా
    దశ బుద్ధి చెడగ పలికెను
    దశ కంఠుని గొల్చునరులు ధన్యులు గదరా

    రిప్లయితొలగించండి
  22. విశిదమ్మొప్పగ దేవతాపురుషులన్ వేమారుదూషింపుచున్
    కశితోవారిని తూలనాడునొకడా కారుణ్యతామూర్తులన్
    దిశలన్ యేలెడి వారి తిట్టుచు మహా ద్వేషమ్ముతో నిట్లనెన్
    ద్దశ కంఠుం గడు భక్తిఁ గొల్చు నరులే ధన్యుల్ గదా చూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      దిశలన్ + ఏలెడి = దిశల నేలెడి.. అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
  23. పశుసము డగునరుడు బలికె
    నిశలను రక్కసుల పూజ నిష్ఠను జేయన్
    కుశలంబగు ,కలియుగమున
    దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా !

    నిన్నటి సమస్యకు నా పూరణ

    వెరవక యమునంటుచు జని
    వరముగ పతినొంది మిగుల భక్తి ప్రపత్తి
    న్నిరతము తన పూజల నా
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే

    రిప్లయితొలగించండి
  24. మశకముకంటెనుహీనులు
    దశకంఠునిగొల్చునరులు.ధన్యులుగదరా!
    కుశలవులిరువురునరయగ
    దశరధునకుమనుమలగుటధరణినిమిగులన్

    రిప్లయితొలగించండి
  25. దశరథ తనయుడు జంపెను
    దశకంఠుని” “గొల్చు నరులు ధన్యులు గదరా
    శశిధరుని భక్తి చేతను
    విశుడెంచుచు పూజజేయ?విజ్ఞుండగులే| {విశుడు=మానవుడు}
    2.దశలే మారును నీతి వీడగనె ప్రాధాన్యంబు లోపించగా
    పశు వైపోవును| జీవితాశయము|”చావన్ జేసెరాముండటన్
    దశకంఠుం” గడు భక్తిగొల్చు నరులే ధన్యుల్ గదాచూడగన్
    వశమౌ భక్తికిరామచంద్రు డెపుడున్భావంబు మీరుంచగా”|

    రిప్లయితొలగించండి
  26. పిశితమ్మున్ గొని సంచరించు జన సర్వేశుండు దుర్బుద్ధితో
    పశువై సీత హరించ, దాశరథి తా బాణాగ్ని కూలార్చె నా
    దశకంఠుం, గడు భక్తిఁ గొల్చు నరులే ధన్యుల్ గదా చూడఁగన్
    వశుడౌ రాముడు తప్పకుండ ధృతితో బ్రార్థించు భక్తాళికిన్

    రిప్లయితొలగించండి
  27. గురువు గారికి నమస్సులు.నా పూరణ లోని లోపములు ను తెల్పుడు.
    దశదిశల లంకన హితమౌ
    దశకంఠుని గొల్చు నరులు ధన్యులు గదరా
    విశ దముగ వేద విద్యల
    సుశ్రుతమున పలుకుదురు సుమధుర వాణీ.
    వo దనములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివరి పాదము మార్చడ మైనది
      సుశ్రుతమున పలుకుదురు స్వర సుమధుర వాణీ.

      తొలగించండి
    2. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. సవరించండి. 'సుశ్రుతము' అన్నపుడు 'సు' గురువై గణదోషం. అద్రుచు, విద్రుచుల వలె సుశ్రుతమును తేల్చి పలుకలేము.

      తొలగించండి
  28. అశరులు, దుర్మేధులగును
    దశకంఠుని గొల్చు నరులు, ధన్యులు గదరా
    దశరథసుతుడగు రాముని
    దశరూపమ్ముల ననిశము దలచిన మనమున్!!!

    రిప్లయితొలగించండి
  29. దశరథు సూనుని భార్యను
    వశవర్తిని జేయ,తనను వధియింప౦గన్
    యశమును సద్గతి ధ్రువమను
    దశకంఠుని గొల్చు నరులు ధన్యులు గదరా

    రిప్లయితొలగించండి
  30. వశమౌ లంకకుఁ జేర్చ సీతయని గర్వాంధుండు లంకేశునన్
    యశమున్ గానక భిక్షువై తగని మాయల్బన్ని గొంపోవగన్
    దశమీ పర్వమునందు దాశరథి నిర్దాక్షిణ్యుడై గూల్చగన్
    దశకంఠుం, గడు భక్తిఁ గొల్చు నరులే ధన్యుల్ గదా చూడఁగన్

    రిప్లయితొలగించండి
  31. కుశలురు లంకా వాసులు
    దశరథ సుతు వైరి సాటి ధరలేడనుచున్
    విశదమ్ముగ బలికిరిటుల
    "దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా"

    రిప్లయితొలగించండి
  32. నిశితంబైనవి బాణసంచలనతో నిర్వాణ మిప్పించి యా
    దశకంఠుం;...గడు భక్తిఁ గొల్చు నరులే ధన్యుల్ గదా చూడఁగన్
    దశరా రాముని సీత లక్ష్మణులనున్ దండంబుతో పావనిన్...
    మశకా లోర్చుచు కాళ్ళు గోకుచునయో మా భాగ్యనగ్రమ్మునన్

    రిప్లయితొలగించండి