ఆకాశవాణి, హైదరాబాదు వారు
'సమస్యాపూరణం' కార్యక్రమాన్ని
ప్రారంభిస్తున్నారు.
4-11-2017 (శనివారం) నుండి ప్రారంభం.
ప్రతి శనివారం ఉదయం 7-30 గం.లకు ప్రసారమౌతుంది.
ప్రారంభ సమస్య....
"పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లుగన్"
పూరణలను పంపవలసిన చిరునామాలు....
email :
padyamairhyd@gmail.com
Postal Address :
సమస్యాపూరణం,
c/o స్టేషన్ డైరెక్టర్,
ఆకాశవాణి,
హైదరాబాద్ - 500 004.
చాల మంచి వార్త! ఔత్సాహికులకు స్ధానముంటుందా? పెద్దలంతా వ్రాస్తారేమో!
రిప్లయితొలగించండిఎవ్వరైనా వ్రాయవచ్చు.
రిప్లయితొలగించండిపద్య రచన కు ప్రోత్చాహ ము కల్పించ డ ము ఎంతైనా ముదావహం
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅద్యతనీయమందు భళి యద్భుత మైనటి సాఫ్టు వేరుతో
గద్యము లన్ జిలేబి సరి గాంచుచు యత్నములెల్ల జేయగన్
విద్యగ శ్రద్ధ జూప గను వింగడ మై, మదిలో సరాగమై
పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లుగన్!
జిలేబి
👏👏👌
తొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండిఆర్యా,వారియెంపికను నమ్ముకుంటే కవులార్జిం
చినselfconfidence సన్నగిల్లుతుంది.పైగా"నే నెప్పుడో ఆ.వాణి సమస్యా పూరణానికి వ్రాసినాను, అని వచన కవితలే వ్రాస్తున్న మిత్రులెందరో నాకు కనిపించారు.నిజంగా అది పెద్దల cup.సమయం తక్కువ.పంపిన వారికి నిరాశ.ఇది నా అనుభవం.మీ లాగా ప్రోత్సాహమీయని తీరు.చేతులు నేనూ కాల్చుకున్నాను.
డా.పిట్టా
రిప్లయితొలగించండివిద్యల నభ్యసించు గతి వీడిరి పెద్దలె గద్య పక్షులై
సద్యశ మందినామనుచు చంకలు గొట్టరె, పద్యమిప్పుడే
ఉద్యమమల్లె రావలెను యూపిరి ఛందమటన్న నాడె పో
పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లుగన్
గద్యము వ్రాయగో రగను కాకలు దీరిన పండితో త్తముల్
రిప్లయితొలగించండిహృద్యముగా ప్రబంధ రసరమ్యపు సుందర భావజాలముల్
చోద్యము గారచించి మది చూరగొనంగను పారవశ్యమున్
పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లుగన్
విద్యలరాణి వాణి వరమిచ్చెను ముచ్చట పల్కునిచ్చి; ప్ర
రిప్లయితొలగించండిజ్ఞద్యుతిఁ వెల్గె సారము; విచారము తీరము దాటెనుప్పెనై;
హృద్యము భావజాలము; మహీభృత భారము గుండె నిండగన్;
పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లుగన్!
హృద్యములైన భావముల; నృత్యమొనర్చెడి శబ్దసంపదన్;
రిప్లయితొలగించండివేద్యము గాగ నెల్లరకు;విశ్రుతకీర్తులు మిన్నుముట్టగా;
సేద్యమువోలె సుస్థిరపు శ్రేయము గూర్చుచు సర్వవేళలన్;
బద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లుగన్.
మద్యము కాదు గ్రోలుటకు మంచి కవిత్వము; వాణి మెచ్చు నై
రిప్లయితొలగించండివేద్యము, వ్యాకృతి స్ఫుటము, విజ్ఞులు మెచ్చగ పద్య భారతీ
సేద్యము సేయబో కవి కృషీవలుడొక్కడు, వానికెప్పుడున్
పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లగున్
హృద్యము, సజ్జనాదరణ యోగ్యము, రక్తిని గల్గజేయగన్
రిప్లయితొలగించండిసద్యము శక్తివంతమగు సాధనమేయగు కావ్యమల్లగన్
విద్యలు నేర్చుకున్న సుకవీంద్రుల బుద్ధికి వేసటెట్లగున్?
పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలు నట్లుగన్!
పద్యపులక్షణంబులనుబాగుగనేర్చినవానికెప్పుడున్
రిప్లయితొలగించండిపద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లుగన్
సద్యముతీపినిన్గలిగిశర్కరమిశ్రితమౌవిధంబుగా
హృద్యముగాగనెప్పుడునుహేయననొప్పుచునుండునేగదా
:విద్యల నెల్లనేర్చుచును విశ్వము నందున పండితోత్తముల్
రిప్లయితొలగించండిగద్యము తోడుగా సతము కమ్మని చిక్కని ధారతో నిటన్
విద్యల రాణి మెచ్చునటు వేడుకతోడను వ్రాసిరెల్లరున్
పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలినట్లుగాన్.
గద్యము వ్రాయజాలకయె గర్వము వీడుచు రోజురోజిటన్
రిప్లయితొలగించండిసద్యతి ప్రాసలన్ వడిగ చక్కని వ్యాకరణంపు సొంపుతో
విద్యలు శంకరాభరణ వేదిక నందున నేర్చుచుండగా
పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లుగన్