తలచుచు పాండవేయుల ను దమ్ము లు గా తల పోసి సంధి తో వలచిన రాజ్య భాగము ను బంచ గ తా మెడ బాయకుండ ధీ విలసిత మై యశoబుగని విక్రము లై కడు పున్యులై మన న్ చెలగు దు వీ పురాకృ త విశిష్ట త తో వెలుగoగనో ప రే
కడు శబ్దము ద్రుతాంతము. కడు తో సమాసము చేయు నపుడు పరుషము “పు” పరమైన ను గాగమము నిత్యము. అప్పుడది “బు” గా మారును. “కడు” స్త్రీసమ శబ్దమని నా భావన.(ఏలన కడుడు, కడుము శబ్దములు లేవు కదా.) పూజ్యులు శంకరయ్య గారిని సంశయ నివృత్తి జేయ గోర్తాను.
సమస్యా పూరణ కదా యని తెలిసి తెలిసి వ్యాకరణ భంగము చేయుట కవి సమ్మతము కానేరదు. అది గ్రామ్యమే యగును.
కామేశ్వర రావు గారూ, మీరు లేవనెత్తిన అంశము సరియైనదే. రాత్రి పూరణ చేసే సమయంలో సందేహం వచ్చింది కూడా. కాని గత్యంతరం తోచలేదు. ఈనాటి పూరణలలో ఎక్కువగా మిత్రులు ఈ పొరపాటు చేశారు కూడా! ఒక సందేహం..."సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు (ఎల్లన్ + అర్థంబులు = ఎల్ల యర్థంబులు)" అన్న సూత్రం ఇక్కడ వర్తించదా?
“కడున్ పుణ్యవతి” సమాసమున ద్రుతము లోపించి “కడు పుణ్యవతి”, సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకుం, బుంపులకుం బరుష సరళంబులు పరంబులగునపుడు ను గాగమము వలన “ను” వచ్చి ద్రుత సంధి జరిగి “కడుఁ బుణ్యవతి” యగును.
శంకరాభరణము వ్యాకరణ దోష భూయిష్ఠ మైన పూరణలను నిస్సందేహముగఁ దిరస్కరించ వలెనని నా దృఢాభిప్రాయము. ఈ దోషముతో పూరణలు చేసిన వారందఱు సవరించగలరని నా విశ్వాసము.
తలచితిమి మిమ్ము మదిలోన తన్మయమున కామెడమరవు కారకు మేము కాదు కడు పునీత కుంతి తనయులై, కరుణ సౌరి ఘనుడవీ! పుణ్య చరితలు గ మము మార్చు. పాండవులు శ్రీ కృష్ణుడు తో వేడు కొంటూ దేశో పద్రవమునకు కారకలము మేము కాదు అని నా భావన కడు పునీత ఒక చోట ప్రయోగము గలదు.దుష్ట సమాసమైన వేరొకటి తోచలేదు.
నిండు సభలో తనను పరాభవించిన కౌరవులు ఒక్కడుకూడ మిగలరాదని ద్రౌపది శ్రీకృష్ణునితో అన్న మాటలు *తల*తు శ్రీకృష్ణ!నిన్ను నా పిలుపు వినుము. పొడ*మె డ*గ్గఱ మాదు సంపూర్ణ జయము. ఒ*కడు పు*రమున బ్రతుకుటకోర్వజాల వచ్చు పద*వీ పు* రస్కృతి లచ్చి మాకు. పురము=శరీరము ఆం.భా డగ్గఱ=దగ్గర
రాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడు దుర్యోధనునితో.....
రిప్లయితొలగించండితలఁచియు ధర్మము, నెదలో
పలి క్రూరాలోచన మెడఁబాపి సయోధ్యన్
నిలుపవె కడు పుణ్య మమరు,
నిలలో సౌఖ్యమ్ముఁ గాంతు వీ పుడమిఁ గదా!
ఇలలో, పుడమిన్ అని పునరుక్తి దోషం వచ్చింది. సవరిస్తున్నాను.
తొలగించండిరాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడు దుర్యోధనునితో.....
తొలగించండి(సవరణతో)
తలఁచియు ధర్మము, నెదలో
పలి క్రూరాలోచన మెడఁబాపి సయోధ్యన్
నిలుపవె కడు పుణ్య మమరు,
నెలమిన్ సౌఖ్యమ్ముఁ గాంతు వీ పుడమిఁ గదా!
సార్! కందం అద్భుతము! ఈరోజు నేను పరీక్ష ఎగ్గొడుచున్నాను. కొశ్చిను పేపరు చాలా కష్టంగా నున్నది.
తొలగించండిశుభ రాత్రి!
శాస్త్రి గారూ,
తొలగించండిధన్యవాదాలు!
గతంలోను ఇలాగే ఎగ్గొడతానని చెప్పి లేటుగా వచ్చి పరీక్ష వ్రాసి పాస్ మార్కులు సంపాదించుకున్నారు!
బృహన్నల ఉత్తరునితో:
తొలగించండికోతలతో కడు పురమున
నీతమె డస్సులని పలికి నివ్వెఱ యేలా!
ప్రీతిగ నీవీ పుడమిని
చేతలతో గెలిచి చూపు చెల్లెలు మురియున్!
నీతము = నియమము
డస్సులు = ప్రగల్భాలు
(ఆంధ్ర భారతి)
*****************************
పాసా సార్! ఫైలా?
రెండు తలలూ ఒక తోక కూడా ఉన్నాయి...
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిపాస్ మార్కులు 35% కాదు మీకు 60% మార్కులిస్తున్నాను. బాగుంది మీ పూరణ. అభినందనలు.
hammayya!!!
తొలగించండిశ్రీ ప్రభాకరశాస్త్రి గారూ... రెండుతలల పాము ఒకతోకతో చాలా బాగుంది... 💯%👌🏻👏🙏( రెండు కొత్త పదాలు నేర్పినందుకు ధన్యవాదాలండీ)
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
తాము తలపోసి నవియన్ని తప్పి పోగ
రిప్లయితొలగించండివింత ! తామెడ బాటైరి విభవమునకు
పాడియె? కడు పుణ్యాత్ములు పాండు సుతులు !
ఓ రవీ ! పుడమి పయిన పెను ఘోరమిదియె !
జనార్దన రావు గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
ధన్యవాదాలార్యా !
తొలగించండిశీతల ఛాయల నిలబడి
రిప్లయితొలగించండిభూతల నాధుండు బలికె భోగమ్మెడ బాపన్
చేతల జూపకడు పున్నెమె
వేతస న్యాయమ్ము వీడు వీపుడ మిన్ భీమా
అక్కయ్యా,
తొలగించండికొంత తొందరెక్కువైనట్టుంది. మొదటి పాదం తప్ప మిగిలిన పాదాల్లో గణదోషం. 'శీతల+ఛాయ = శీతలచ్ఛాయ' అవుతుంది.
అవును కదా
తొలగించండిఅమ్మాయి [మధురిమ ]3. నెలలుగా ఉండి నిన్ననే ఇండియాకు వెళ్ళిపోయింది . ఆమత్తు ఇంకా వదలలేదు. అదన్నమాట అసల్ సంగతి
నా తలపు విని పిలువుము నక్కమందు
రిప్లయితొలగించండికడు పులకలు పొడమ "కీచక! ప్రియ!" యనుచు
భారమెడద బాపెదను ద్రుపద తనూజ!
సవన దేవీ!పురంద్రీ!విశాలనేత్రి!
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నర్తన శాలలో కీచకుడు సైరంధ్రి రూపంలోని భీమునితో )
రిప్లయితొలగించండితలపులెన్నె న్నొ ముసిరేను కలికి మిన్న !
కడుపునీతుడ నయ్యెద గనుము నన్ను
కాల మెడమైన నోపను కరుణ జూపు
తగ్గ వీపులకింతలు సిగ్గుపడకె !
సెభాష్ బాపూజీ గారు . అభినందనలు
తొలగించండిబాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదాలండి!
తొలగించండినర్తన శాలలో కీచకుడు సైరంధ్రి రూపంలోని భీమునితో )
రిప్లయితొలగించండితలపులెన్నె న్నొ ముసిరేను కలికి మిన్న !
కడుపునీతుడ నయ్యెద గనుము నన్ను
కాల మెడమైన నోపను కరుణ జూపు
తగ్గ వీపులకింతలు సిగ్గుపడకె !
చక్కని పూరణ! అభినందనలు!
తొలగించండిధన్యవాదాలండి!
తొలగించండిఈ సమస్యా పూరణ కోసం తమరి ఆలోచనలని కీచకుని వరకు తీసుకెళ్లటమే ఒక పెద్ద సాహసం. తరువాయి మీరు పలికించిన భావం అపూర్వం. సొగసుగా ఉంది వర్ణన.
తొలగించండిDhanyavadalandi!
తొలగించండిDhanyavadalandi!
తొలగించండివిరటరాజు కంకుభట్టుతో నన్న మాటలు:
రిప్లయితొలగించండివిడుమిక కోతలన్ నిజము వీడకు మెప్పుడు కంకుభట్ట! యా
మె డమరుకన్ ధ్వనింప విని మేటిగ నాడు బృహన్న లెట్టులో
కడు పులకింత కల్గగను కౌరవసేనల పారద్రోలెనా
విడుమయ మంత్రికిన్ తెలియవీ పురుషోత్తమ వీరకృత్యముల్
సోమయాజులు గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండిఒకడు పురట పుట్టగ వీ
డి కర్ణుడై తలపులన్ కడిగడి పిరిమి య
య్యె! కిరీటి యెమ్మె డవులు మ
రొకడాయె సువీ ! పుడమిన రూపడుగెవడో ?
*కడిగడి - కడుంగడు అన్న అర్థంలో -
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని భావం కొంత బోధ పడలేదు. తీరిగ్గా ఆంధ్రభారతి సాయం తీసుకొని చూస్తా. తరువాత చెప్తాను. :-)
తొలగించండిఅందరికీ ఆంధ్రభారతి యే అంతరాత్మ :)
నెనరులు ; వేచి వుంటాము
జిలేబి
అమ్మా! ఆంధ్రభారతి కూడా నాకు సాయపడలేదు. దయచేసి మీ పద్య భావాన్ని వివరించండి.
తొలగించండి
తొలగించండికందివారు
నమో నమః
ఒకడు బంగారు (పురట); పుట్టుకలోనే తనను (కుంతిని) వీడి కర్ణుడై తలపుల లో (మదిలో) నెలవు.
మరొకడు కిరీటి మనోహరము (ఎమ్మె) ; సొంపు (డవులు)
రూపడుగు- మృత్యువు - వీరిద్దరి లో ఎవరిని
మృత్యువు కబళిస్తుందో అని కుంతి మనోవ్యధ.
ఎమ్మె ; డవులు ;కడిగిడి ; ఆంధ్రభారతి స్పాంసర్డ్ :)
జిలేబి
మైలవరపు వారి పూరణ:
రిప్లయితొలగించండిరాయబారం సమయంలో సుయోధనుని వచనములు...
చెడుగా చేతల మమ్ము జూపితివిటన్ , చిత్రించి వర్ణించితో
కడు పుణ్యాత్ములు పాండవేయులనుచున్ ! కానిమ్ము కానిమ్ము ! మే..
మెడమోముంబెడమోములైతిమెపుడో ! యీనాడు పుష్పింపవీ...
పుడమిన్ పూవులు సంధివాక్యములతో ! పోరొక్కటే మార్గమౌ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
వలపు బాణాలు వేయగ తలపు చూలి
రిప్లయితొలగించండిహెచ్చె క్రీడికి యనురాగ మెడద లోన
కడు పులకరించుచు నులూచి కరము పట్టె
యిక్షు శరముల కెదురు లేవీ పుడమిని
విజయకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కరము పట్టె। నిక్షు శరముల...' అనండి.
డా.పిట్టా
రిప్లయితొలగించండిమహాభారతము, పురాణముల పఠనం ద్వారానే నీతి పాఠాలుLife skills సబోధించాలన్న ప్రతిపాదనకు స్పందించిన పంతులయ్య మనోగతమును కవి గారికి విన్నవించుట:
నే*తల* జేయ భారతము నెట్టుల నాసరగొందు, వారికౌ
నాతుల సంఖ్యలా*మెడ*కునైన సుదూరమనాది పోలికల్
పూతమె?చూడ జూడ* కడు పు*ణ్యులకైన ననేక స్పర్ధ లీ
భాతి క*వీ!పు*రాణమును బట్టిన బ్రశ్నలు బెక్కు వచ్చు బో,
ఖ్యాతికి బెన్గులాటలన, గానను బోధలు ,నీతి సాధనల్!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిసుకవీ ! పుడమిన్ భారత
ము కడు పురటయగుచు పద్యములకు నెలవుగా
మకులముగ యెమ్మె డవులై
సుకరపు తలపుల జనులకు సురటిగ సువ్వీ !
జిలేబి గుండు సున్న :)
😨
తొలగించండిఅర్జునునిపై మరులు గొన్న ఊర్వశి మానసం ...
రిప్లయితొలగించండిలలిత లతాంగి మరుల్ గొన
వలపుల తాపమెడ బాపు ఫల్గుణుడితడే?
నిలువన్ దరి తాకడు, పుల
కల తనువీ పురుషునెంచె! కౌగిలి చేదో ?
సహదేవుడు గారూ,
తొలగించండిలలిత మనోహరమైన పూరణ. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు. 🙏🙏🙏
తొలగించండితలచుచు పాండవేయుల ను దమ్ము లు గా తల పోసి సంధి తో
రిప్లయితొలగించండివలచిన రాజ్య భాగము ను బంచ గ తా మెడ బాయకుండ ధీ
విలసిత మై యశoబుగని విక్రము లై కడు పున్యులై మన న్
చెలగు దు వీ పురాకృ త విశిష్ట త తో వెలుగoగనో ప రే
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
చూర్ణకుంతల ద్రౌపది శోక తప్త
రిప్లయితొలగించండికనగ నామెడస్సి మదిని కలత నొంద
వినక కడుపుణ్యమూర్తి నావేదనలను
పొంద మౌనము యశస్వీ పుణ్యమూర్తి
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలో గణదోషం. "మౌనమును యశస్వి.." అనండి.
భూతల నాథుఁడు కర మెడ
రిప్లయితొలగించండిమై తమ్ముల తోడ భూ మహా విభవైశ్వ
ర్యాతిశయముల కులుకడు పు
నీతను సాధ్వీ పురంధ్రినిఁ గని యలమరెన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఉత్తమమైన పూరణ మీది అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిహిడింబిని చూచి భీమసేనుడు పల్కిన పలుకులు
రిప్లయితొలగించండిమెడదలో దిరుగాడు మెరుగు బోడి, యెచట
దానవు , నీ తల్లిదండ్రు లెవరు,
సురటివీపుల పుట్టుసుతుని మనసు దోచి
నట్టి రూపసి, నీదు నామ మేమి,
ఇసిఱింతలమగు సంహసనము గలిగన
రమణీ, యెవరు నీవు, రంభ జెల్లి
వా, గడు పుణ్యమీ వాయుసుతుడు గత
జన్మలో యొనరించ సరస గతిన
నాకు సుందరముగ ఈవనమున కలిసి
నావు, నీవు గోరిన రీతిన పరిణయము
నాడెదను, వివరము దెల్ప బాడి గాదె,
యనుచు భీముడు బల్కెను వనిత గాంచి
పూసపాటి వారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. సురటివీపులపుట్టు.. మొదలైన విశేష పద ప్రయోగం ప్రశంసనీయం. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా అంతా మీ ఆశీస్సులు
తొలగించండికాలమెడబాపగా రాజ్యశ్రీలు వోవ
రిప్లయితొలగించండికడుపునీతుడు పాండవాగ్రజుడు విరటు
చెంతలక్ష్మీకి దూరమౌ స్థితిని బొందె
చెల్లవీపుత్రమోహాలు జనవరేణ్య
ధృతరాష్ట్రునికి విదురుని హితబోధ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
“రాయబార సందర్భమున శ్రీకృష్ణుడు రారాజుతో పల్కిన పల్కులు”
రిప్లయితొలగించండిఅని* తల*మున తలపడచు నర్జున శర
ఘాత మోర్పతర *మె డం*బు కనగ జేయ
మీరలకు?* కడు పు*రి గొని మిమ్ముల పరి
మార్చగల *వీ పు* డమినందు మాట వినుమ.
తోపెల్ల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వ్యాకరణ విశేషావలోకనము:
రిప్లయితొలగించండికడు శబ్దము ద్రుతాంతము. కడు తో సమాసము చేయు నపుడు పరుషము “పు” పరమైన ను గాగమము నిత్యము. అప్పుడది “బు” గా మారును.
“కడు” స్త్రీసమ శబ్దమని నా భావన.(ఏలన కడుడు, కడుము శబ్దములు లేవు కదా.)
పూజ్యులు శంకరయ్య గారిని సంశయ నివృత్తి జేయ గోర్తాను.
సమస్యా పూరణ కదా యని తెలిసి తెలిసి వ్యాకరణ భంగము చేయుట కవి సమ్మతము కానేరదు. అది గ్రామ్యమే యగును.
ఉదా.
తొలగించండివిను కొందఱైనఁ గడుఁ దెం
పున మార్కొని కడిమి మీఱి పొంగి యడరినన్
మొన యెంత యైన విఱుగుం
జనునే కయ్యంబు వొడువ శక్తుల కైనన్...... భార. శాంతి. 3. 17.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీరు లేవనెత్తిన అంశము సరియైనదే. రాత్రి పూరణ చేసే సమయంలో సందేహం వచ్చింది కూడా. కాని గత్యంతరం తోచలేదు. ఈనాటి పూరణలలో ఎక్కువగా మిత్రులు ఈ పొరపాటు చేశారు కూడా!
ఒక సందేహం..."సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు (ఎల్లన్ + అర్థంబులు = ఎల్ల యర్థంబులు)" అన్న సూత్రం ఇక్కడ వర్తించదా?
క్షమించాలి. ఆ సూత్రం కేవల 'ఎల్లన్' శబ్దానికే పరిమితమైనట్టుంది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
తొలగించండికువలయంబునన్ + వారు దృతము లోపించి “కువలయంబున వారు” సాధువు.
“కడున్ పుణ్యవతి” సమాసమున ద్రుతము లోపించి “కడు పుణ్యవతి”,
సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకుం, బుంపులకుం బరుష సరళంబులు పరంబులగునపుడు ను గాగమము వలన “ను” వచ్చి ద్రుత సంధి జరిగి “కడుఁ బుణ్యవతి” యగును.
శంకరాభరణము వ్యాకరణ దోష భూయిష్ఠ మైన పూరణలను నిస్సందేహముగఁ దిరస్కరించ వలెనని నా దృఢాభిప్రాయము.
ఈ దోషముతో పూరణలు చేసిన వారందఱు సవరించగలరని నా విశ్వాసము.
తలచితిమి మిమ్ము మదిలోన తన్మయమున
రిప్లయితొలగించండికామెడమరవు కారకు మేము కాదు
కడు పునీత కుంతి తనయులై, కరుణ సౌరి
ఘనుడవీ! పుణ్య చరితలు గ మము మార్చు.
పాండవులు శ్రీ కృష్ణుడు తో వేడు కొంటూ దేశో పద్రవమునకు కారకలము మేము కాదు అని నా భావన
కడు పునీత ఒక చోట ప్రయోగము గలదు.దుష్ట సమాసమైన వేరొకటి తోచలేదు.
నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కుంతి సుతులై" అనండి. లేకుంటే గణదోషం.
నిండు సభలో తనను పరాభవించిన కౌరవులు ఒక్కడుకూడ
రిప్లయితొలగించండిమిగలరాదని ద్రౌపది శ్రీకృష్ణునితో అన్న మాటలు
*తల*తు శ్రీకృష్ణ!నిన్ను నా పిలుపు వినుము.
పొడ*మె డ*గ్గఱ మాదు సంపూర్ణ జయము.
ఒ*కడు పు*రమున బ్రతుకుటకోర్వజాల
వచ్చు పద*వీ పు* రస్కృతి లచ్చి మాకు.
పురము=శరీరము ఆం.భా
డగ్గఱ=దగ్గర
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించండిఅరయ కడుపుణ్యరాశి యా యాజ్ఞసేని
రిప్లయితొలగించండిబడెను వెతలను బతుకున భంగపడుచు
లలిత సుకుమారి యగునామె డస్సిపోయి
బొగిలె పాపములె గలవీ పుడమియనుచు!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవరించిన పూరణ:
తొలగించండిమానము కడు, పునీతదా మాలిని గను
బడెను వెతల, వేధింపుల భంగపడుచు
లలిత లావణ్య యగునామె డస్సిపోయి
బొగిలె కష్టములె గలవీ పుడమియనుచు
తల.. మెడ.. కడుపు.. వీపు...
రిప్లయితొలగించండిఅన్యార్థాలలో భారతవృత్తాంతం...
రాయబారం లో కృష్ణుడు..అర్జునుని పరాక్రమ వర్ణన...
అతనిన్ జూడగ నాజి భూతల కృతాంతాకారుడై దోచు ! దే...
వతలే తామెడమై చరింతురు భయోత్పాతమ్మునన్ వానికిన్ !
రతుడై యుద్ధమునందు
జంకడు పురారాతిన్ నిరోధింపగా !
ప్రతికూలమ్ములు గాంతువీ పురమునన్ ! పార్థుండు క్రుద్ధుండుగాన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
కాండవ దహనసమయం
రిప్లయితొలగించండిఅతలకుతలంబు నగ్నియు నావరించ
కాండవదహనమె డవులు కాదుకాదు
అగ్నికి కడు పుష్టియనగ యర్జు నుండు
పైరవీ పులకింతగా కారుచిచ్చు|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..యనగ నర్జునుండు..' అనండి. 'పైరవీ'...?
ద్రౌపదితో కృష్ణుడు
రిప్లయితొలగించండివంతలన్నితొలగి మీకు శాంతికలుగు
సంధి యత్నమెడలి పోరుజరుగు నమ్మ
మీరుకడు పునీతులగుటఁ జేరు జయము
సత్య! నీవీ పుడమి దొరసాని సుమ్ము
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఊర్వశి అర్జునుని తో
తలపు లెన్నొ మదిని తాండవ మాడెరా
బాపుమెడదలోని బాధ పార్థ
కడుపునీతవౌదు ఘనుడగు నినుచేర
వీడవీపులకలు వ్రీడ హెచ్చె.
కీచకవధ ఘట్టంలో
చింతలనిలమాను చేకూర్తు ముదమిక
భారమెడబాపు పడతి వీవు
కంటనీరు వలదు కడుపుణ్య శాలిని
వీపుడమిన విడుము వేగ వగపు.
ద్రౌపది నోదార్చుతూ భీముడు
దుఃఖమెడబాపు మోతన్వి దురము నందు
కడుపునీతవౌ నిన్నిటు కస్తి బెట్టు
కురుపతి నణతు మెడదలో కుతిని వీడి
చింతలను బారద్రోలుము శివము గూర్తు.
వంతల నిట బాపు పార్థ దురమునందు
రిప్లయితొలగించండివీడుమెడదలోని వెతల నెల్ల
కడుపునీతుడగుచు గౌరమమందుమీ
వీపుడమిన కలుగ విజయ మిపుడు.
తల - మెడ - కడుపు - వీపు
రిప్లయితొలగించండికుంతీ దేవి శ్రీకృష్ణుడితో...............................
తలచిన చాలు నీ దయ నిధానము మాకు కలుంగునయ్య చిం
తలు తొలఁగున్ మహాత్మ సతతమ్మును మమ్మెడ బాయకయ్య శ
త్రుల దురితంబు నాకడుపులున్ దొరయించఁగ శక్తిహీనతన్
బిలచిన బిల్వకున్న పృథివీపురుషోత్తమ మమ్ము గాచుమీ !
నాకు + అడుపులు = నాకడుపులు ( దెబ్బలు / కష్టములు )
కడు పునీత సరి అయిన ప్రయోగమా ?కాదా?దయచేసి
రిప్లయితొలగించండితెల్పుడు.చాలా మంది కవులు ఈ రోజు వాడినారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికీచకుడు సైరంధ్రి తో....
రిప్లయితొలగించండిదేవీ బాపుమెడద వెత
రావే నాతలపు దీర్ప రాగముతోడన్
ఈవే కడు పులకింతల
నీవీ పుడమిని పొదిగొను నిక్కము దివినే.