23, అక్టోబర్ 2017, సోమవారం

సమస్య - 2501 (చరణముతోఁ బతికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే"
(లేదా...)
"చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్"
(ఆకాశవాణి వారి సమస్య)

75 కామెంట్‌లు:

  1. నిరతము తలిదండ్రులె యా
    తరుణికి సద్బోధ జేయ దండన తోడన్
    మరువక యా బోధ; సదా
    "చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      సదాచరణముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. నరకుని జంపనెంచి జను నాథుని జూచియు సత్యభామ దా
    దురమును జూచు నాజ్ఞ గొని తోడుగ బోయెను తేరునందునన్
    పరిణతి గల్గి స్కంథమున భర్తయు మిక్కిలి సోలి సొమ్మసిం
    చ రణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  3. (తన ఆయువునిచ్చి బతికించిన రురుని ప్రమద్వర సేవించటం)
    అరయగ బ్రమద్వర హటా
    న్మరణము నందగ దనదగు మాన్యపుబ్రతుకున్
    రురుడీయగ బ్రతికి సదా
    చరణముతో బతికి సేవ సలిపెను సతియే.

    రిప్లయితొలగించండి
  4. తరుగని సంపదౌను తన దాసిగ బత్నియె సేవజేయగన్
    దొరకును స్వర్గమే యిలను తొయ్యలి యేయనుకూలమైనచో
    కరుణయె గల్గినట్టి యొక కల్కియె యాదర మొప్పగన్ సదా
    "చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్"

    రిప్లయితొలగించండి
  5. పరమార్థము నెరిగినదై
    సిరి గృహమును వీడి నపుడు చింతింపకయున్
    హరిలీలంచును తా నను-
    -చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే

    హరుడు వరుడు కాగ వధువు
    హరిణేక్షణ కోరె సగము హర దేహమునన్
    చెరి సగము చేసి కొని తన
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే

    దేహము నిల్చోవాలంటే రెండు కాళ్ళు ఉండాలి కదా, మరి అర్థనారీశ్వరుడు నిల్చోవాలంటే అమ్మ తన చరణముతో సేవ చేస్తున్నట్లే కదా! :)

    ఇరువురు సత్కవిత్వముల నిండగు కుండలు ఒక్కటైరి; భా
    సురముగ పద్యమల్లె శుభ శోభన మంచము పైకి ఎక్కుచున్;
    అరవిరి కంట చూడ పదమాగెను నివ్వెఱ పాటు చెంద; నో
    చరణము తోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్

    పెళ్ళి అయ్యింది; ఇద్దరికి కవిత్వం వచ్చు; భర్త శోభన మంచం ఎక్కుతూ ఓ పద్యం మొదలు పెట్టాడు. అప్పుడు అరవిరి కళ్ళను చూసి నిశ్చేష్టుడయ్యాడు, అప్పుడు ఆమె ఒక పద్య చరణము అందించిందని (పరిచర్య చేసించిదని) భావము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భరద్వాజ్ గారూ,
      మీ మూడు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నవి. అభినందనలు.
      'లీల+అంచును' అన్నపుడు సంధి లేదు. "హరిలీల యనుచు దా నను..." అనండి.
      'కుండులు + ఒక్కటి" అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "కుండలు నొక్కటైరి/ కుండలె యొక్కటైరి... పైకి నెక్కుచు। న్నరవిరి..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు. సవరణలను మనసులో ఉంచుకుంటాను..

      తొలగించండి


  6. వరమై వచ్చిన పెనిమిటి
    ని రసమయ జగత్తులోన నిలయనములతో
    "మురిపాలముకుందా" యను
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
      'నిలయనము'తో దాగుడుమూత లెందుకు? "నిజ/నెరి గానమునన్" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  7. అరుదగు నవ కాశoబును
    వరము గ భావించి సీత వనవాస ము న న్
    తి ర చిత్త ముతో సేవా
    చరణ ము తో బతికి సేవ స లి పె ను సతియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      సేవాచరణముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "స్థిత చిత్తముతో..." అనండి.

      తొలగించండి

  8. "శరణము నీకు మేలుగను చక్కని రాజ! జిలేబి యయ్యరో !
    విరసము గాదు సుమ్మి , మజ, వీనుల విందగు గీత మయ్యరో !
    సరసముకుంద ! మాలి,కరసాన మనోహరమయ్యె సూవె "యా
    చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    కరణమున దాసి యనరే(కరణేషు దాసీ, కార్యేషు మంత్రీ)
    బరువుల బ్రతుకులకు నియమ బంధమె శ్రుతియౌ
    సరి సంపద గనని సదా
    చరణముతో బతికి సేవ సలిపెను సతియే!(ధనిక దేశాలలో ని(Gender sensitization) మనము పాటించి సతికి సేవ జేయడం అనే స్మృతిని బలపరచ వలసి వస్తున్నది.)

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    ధరణి "సొమాలియా" ప్రజకు దార్ఢ్యత నివ్వని కూడు; జన్మలున్
    మరణములొక్కటన్నగతి మన్నెను దీర్ఘపు టంగహీనతల్,
    కరములు లేని జీవికన కాళ్ళకు శిక్షణనిచ్చి సత్కృతిన్
    చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్!
    (సొమాలియాలో పోష కాహార లోపం వల్ల వారి అవయవములు పుష్టికరంగా ఉండవు.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      సహజంగానే మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా, కృతజ్తతలు.ద.చే.మీ చిరునామా 9849812౦54 కు SMS చేయగలరు.పుస్తకం వెంటనే పంపగలను.

      తొలగించండి
  11. విరిసిన వివాహ జీవన
    పరిమళ గేయమునకు పతి పల్లవికాగా
    స్వర మధురిమ గూర్చుచు తా
    చరణముతో పతికి సేవ సలిపెను సతియే

    రిప్లయితొలగించండి
  12. కాపురమునకు భర్త పల్లవి భార్య చరణము అను భావనతో

    రిప్లయితొలగించండి
  13. విరిసిన వివాహ జీవన
    పరిమళ గేయమునకు పతి పల్లవికాగా
    స్వర మధురిమ గూర్చుచు తా
    చరణముతో పతికి సేవ సలిపెను సతియే

    రిప్లయితొలగించండి
  14. అందరికీ నాగులచవితి సందర్భంగా శుభాకాంక్షలు.
    ≠========≠========
    పరమ పురుషునన్ జేరగ
    హరినే పతియనుచు దలచి నారజ భువిలో
    వర శ్రీపతినే హరి యను
    చరణముతో, బతికి సేవ సలిపెను సతియే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '... దలచి నారజ'...?

      తొలగించండి
  15. ధరను కనుపించు దైవము
    వరించిన మగడని యెఱిగి పావన మదితో
    నిరతము ప్రాజ్ఞుల నుడులా
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే

    రిప్లయితొలగించండి
  16. పరమ సతి సతీ దేవియె
    గిరిజగ జన్మించి శివుని కేలంబట్ట
    న్నురు తపమొనరించె; తప
    శ్చరణముతో బతికి సేవ సలిపెను సతియే!

    రిప్లయితొలగించండి
  17. వరమని మురియుచు కిలకిల
    తరుణము వెదుకంగ నెంచె తగవే సలుపన్
    నిరతము నెపమును నెఱపి యా
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "నెపము నెఱపి" అనండి.

      తొలగించండి
  18. సరసములో విరసములో
    పరకాంతను మెచ్చినట్టి పరవశమందున్
    నరవరులకు నరహరికిన్
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ శృంగారాభాస పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. వరముగ దన పతిని బడసి
    విరివిగ ప్రేమానురాగ వికసన మందున్
    సరసంపు గాన సుస్వర
    చరణముతో పతికి సేవ సలిపెను సతియే!

    రిప్లయితొలగించండి
  20. విరి పారిజాతమున్గొని
    హరి రుక్మిణికందజేసి యలరఁగ దెలియన్
    దరిజేర సత్య నలుకన్
    జరణముతోఁ బతికి సేవ సలిపెను! సతియే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      పారిజాతాపహరణ నేపథ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.
      చివరి పాదసవరణతో:

      విరి పారిజాతమున్గొని
      హరి రుక్మిణికందజేసి యలరఁగ దెలియన్
      దరిజేర సత్య నలుకన్
      చరణముతోఁ బతికి సేవ సలిపెను! సతియే?

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు.
      చివరి పాదసవరణతో:

      విరి పారిజాతమున్గొని
      హరి రుక్మిణికందజేసి యలరఁగ దెలియన్
      దరిజేర సత్య నలుకన్
      చరణముతోఁ బతికి సేవ సలిపెను! సతియే?

      తొలగించండి
  21. తరియించెడి పథమనుచును
    వరియించిన పతిని దాను వదలక నెపుడున్
    పరమగు తరగని ధర్మా
    చరణముతో బ్రతికి సేవ సలిపెను సతియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువర శంకరార్యా:

      ఉదయం సీతా దేవి గారు ప్రచురించిన పై పూరణ ఏలనో తొలగిపోయినది. అందువలననే పునః ప్రచురణ...

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. పరగడుపునసంకీర్తన
    చరణముతోబతికిసేవసేసెనుసతియే
    పరగనుబుట్టినరోజది
    యరయంగానగుటవలననట్లుగజేసెన్

    రిప్లయితొలగించండి
  23. మైలవరపు వారి పూరణ:


    సరసుడు శంకరాభరణసత్కవి రాతిరి చింతజేయుచున్
    సరసతనెంచి భామిని కుచమ్ములపైనొక పద్యమల్లగా
    చరణములయ్యె *మూడు* నట , జక్కగ నల్లియు దాఁ దురీయమౌ
    చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్ !!

    ( భర్త కష్టపడుతుంటే భార్య చేసే ప్రతి సహాయము సేవయే.. అనే ఆలోచనతో..)

    తురీయము =నాలుగవ
    చరణము = పద్యపాదము

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  24. దొరికిన రోగిష్ఠి పతిని
    బరువుగ భావించక తన వామపదమ్మే
    విరిగినను ప్రీతితోనా
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే

    రిప్లయితొలగించండి
  25. అరయఁగ నిఁక రవి వారము
    పరుగు లిడెడు సతము మఱచి పనులను మదినిం
    గర మలిగి సుప్రభాతో
    చ్చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే!


    వరముల నిచ్చి నిత్యమును బన్నుగఁ జూచును లక్ష్మి సేయగం
    దరుణులు భక్తి తోడుత వ్రతమ్ముల నంచుఁ దలంచి యంతఁ దా
    శరణము వేడి మా సతిని శ్రావణ మంగళ వార సువ్రతా
    చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్

    [వ్రత+ఆచరణము = వ్రతాచరణము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  26. పరిణయమాడి పెన్మిటితొ పట్టణవీధుల నేగుచుండగన్
    కరములు కోలుపోయెనొక కారు ప్రమాదమునందు నక్కటా
    సరియన రాని ప్రేమ విభుసన్నిధియే పరమంచు నెంచుచున్
    చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్

    రిప్లయితొలగించండి
  27. కరమను రాగమ్మొసగగ
    పరిచర్యలు సేయ నిద్ర పట్టని వేళన్
    సరసత మీరగ పాటల
    చరణముతో పతికిసేవ సలిపెను సతియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      పెన్మిటితొ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించండి
  28. అరవి౦దము మోము,కనులు,
    కరచరణములన్నిసతికి కమలములవగన్
    మురియుచు ముద్దులు కురియుచు
    చరణముతో పతికి సేవ సలిపెను సతియే

    రిప్లయితొలగించండి
  29. నిన్నటి నా పూరణము ఒక్కసారి పరిశీలించరూ


    పండితులకిది ఘనమైన పసిడి గిన్నె ,
    చదువరల కిది నిత్యము సరస సదము,
    వింత నిడు సమస్యల సమావేశ మిదియె,.
    శక్తి నిచ్చెడు ప్రాజ్ఞుల సంస్థ యిదియె,
    తియ్య నైన తేనె లిడెడు దిమ్మ యిదియె,
    శలుని సతి కులుకులిడెడి శాల యిదియె,
    తమ్మిచూలి స్త్రీ యిచట నృత్తమ్ము జేయు,
    సత్కవు లిచట జేయగ సస్యము బహు
    మధురమైన కావ్య ఫలముల్ మనకుదొరుకు,
    అనవరతము లాస్యాంగముల్ యతిశయించు,
    చిత్ర గర్భ కవిత్వము చిగురు దొడుగు
    తడగ మిదియె, విజరపు లతలకు హస్త
    మిడుచు శంకరా ర్యుని బ్లాగు మిసిమి తోడ
    దినదినము పెరిగి పెరిగి దీప్తి నిడును

    మొదటి అక్షరములు కలిపి చదువు కోవాలి అనవరతము అను పాదములో మాత్రము 8 వ అక్షరము కలిపి చదువు కోవాలి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ చిత్ర కవితా ప్రావీణ్యం కడుంగడు ప్రశంసనీయం. అభినందనలు.

      తొలగించండి
  30. కరమగు ప్రేమతోడుతను కంతుని బోలెడి చక్కనయ్య తా
    నిరతము భార్య కోరికల నిర్మలమైన మనస్సుతోడుతన్
    తిరముగ వెంటనంటుకొని తీర్చుచునుండగ, స్వచ్ఛమౌ సదా
    చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్

    రిప్లయితొలగించండి
  31. ఒరగెడు యన్నమయ్యఁ గని యూరఁగ దైన్యము వేంకటేశుడున్
    స్థిరముగ నుండ మీరు చిరజీవిగ జేతుమటంచు పాడగన్
    పరవశమంది వారివగు పాటల రంజిలి గానవాహినిన్
    చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్!

    ( అన్నమయ్య చిత్రములోని ప్రపంచ సినీ చరిత్రలో మకుటాయమానమై చిరస్మరణీయమైన చివరిఘట్టం)

    రిప్లయితొలగించండి
  32. వరములు గల్గినాననుచువాదనజేయగ భార్యచెంత”యే
    మరచియు నీతిదప్పకు*ప్రమాదమె|రావణకూహదెల్పియా
    చరణము తోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్|
    మరువక గౌరి పూజ దినమంతయుజేసెను యుద్దముండగా|
    2,ధరలోయబలన భార్యను
    మరచితిరా “నర్మదమ్మ”మహిమలు లేకే
    తిరుగక నిలిచెనురవి”యా
    చరణముతో పతికిసేవసలిపెను సతియై|

    రిప్లయితొలగించండి
  33. గురువు గారికి నమస్సులు.నా పూరణ లోని లోపములు వివరింపుడు.
    పరిపూర్ణ శాంతి కొరకై
    పరమేశునకున్ వివాహ బంధం వర మౌ
    సిరివెన్నెలమమతలశ్రీ
    చరణముతో పతికి సేవ సలిపెను సతియే
    వందనములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బంధము... అనండి.

      తొలగించండి
  34. కరువై పోవగ నిద్దుర
    పరిపరి విధముల హృదయము పరుగులు దీయన్
    పురుషు ననునయించగ నొక
    చరణముతో బతికి సేవ సలిపెను సతియే!

    రిప్లయితొలగించండి

  35. చిరునగవును వీడకనే
    మరుమాటలనాడకుండ మహిలో దానున్
    ననయము దప్పక ధర్మా
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే.

    సరసపు మాటలనాడుచు
    బెరుకన్నదిలేక సతము వెన్నుని గాథల్
    పరిపరి విధముల పాటల
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే.

    రిప్లయితొలగించండి
  36. (ధనమా? దైవమా? చిత్రంలోని ' నీమది చల్లగా స్వామీ నిదురపో ' అనే పాటలోని ఓ చరణంతో పతిని ఓదార్చే సతి)

    సిరులున్ సౌఖ్యము లేలన్
    కరగుపడఁగ నాత్మశాంతి? కలిమిన్ లేమిన్
    పరమాత్మఁ దలఁచుకో మను
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే.

    రిప్లయితొలగించండి
  37. సరసము తోడ కౌగిలిని శక్తికి మించిన దార్ఢ్యమందునన్
    విరసములోన చెక్కిలిని పిండుచు ముద్దిడు యత్నమందునన్
    పరసతిఁ జూచి మైమరచి పన్నుగ మెచ్చిన పల్కులందునన్
    చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్

    రిప్లయితొలగించండి
  38. పరసతి వంక జూచెనని పక్కను జేరుచు వెక్కివెక్కుచున్
    మరణమె నాకు మేలనుచు మంకును బట్టెడి వంగభామదౌ
    చరణము బట్టి వేడుకొని చల్లగ ముద్దిడి మ్రొక్కగానునా
    చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్

    రిప్లయితొలగించండి