21, అక్టోబర్ 2017, శనివారం

సమస్య - 2499 (మారీచుఁడు రాము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మారీచుఁడు రాముఁ జంపి మాన్యుం డయ్యెన్"
(లేదా...)
"మారీచుండు ధరాత్మజాపతిని దుర్మార్గుండునై చంపెరా"

86 కామెంట్‌లు:

  1. (క్రమాలంకారం)
    "భీరత్వంబున నెవ్వా
    డేరిని వంచితు నొనర్చె? నేపని జేసెన్
    శ్రీరాముడు రావణు నని?"
    "మారీచుడు రాము; జంపి మాన్యుండయ్యెన్."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  2. మారెను జింకగ నీచుడు
    కోరెనెవరి సీత జింక గొనితెమ్మనుచున్
    ఘోరాజిని నరకుని హరి
    "మారీచుఁడు ; రాముఁ ; జంపి మాన్యుం డయ్యెన్"

    రిప్లయితొలగించండి
  3. కోరిన సీతను గానక
    జారెను రాముని హృదయము
    జంజాటముతో --
    కోరిన స్వర్గము బడయగ
    మారీచుఁడు రాముఁ జంపి మాన్యుం డయ్యెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ భావం అర్థం కాలేదు. దయచేసి వివరించండి.

      తొలగించండి
    2. మారీచుడు రాముని చేతులో
      చావుకు సిద్ధమై మాయలేడి వేషం ధరించి వచ్చాడు. ఇది తనకు స్వర్గ ప్రాప్తియే అని భావించాడు.

      పాపం రాముడు ఏమరుపాటుతో అనుకోని విధంగా సీతను కోల్పోయాడు. తన హృదయం ఒక్కసారిగా జారిపోయినది అర్ధాంగిని పోగొట్టుకొనడంతో. ఈ విధంగా మారీచుడు రాముని హృదయ విచ్ఛేదనం చేసి చంపినంత పని చేసాడు.

      ఈ మధ్యనే తొలి సారిగా రామాయణమునూ మహాభారతమునూ చదివాను. అదీ ఆంగ్లంలో రాజగోపాలాచారి వ్రాసిన ప్రసిద్ధ గ్రంధాలలో.

      రెండు కావ్యాలూ (గ్రీకు భాషలో హోమర్ రచించిన ఇలియడ్ ఒడెస్సీ లను పోలుచూ) హత్యాకాండతో నిండుకొనినవి.

      కానీ రామాయణంలో మారీచుడూ, భారతములో భీష్ముడూ ఆత్మహత్యకు లోనయ్యారు. ఒకడు రాక్షసుడూ మరొకరు క్షత్రియుడూ. అది వేరే విషయం.

      అందుచే మారీచుని ఒక విధంగా మాన్యుడని ఒప్పుకున్నాను.

      ధర్మ సందేహాలు, ధర్మసంకటాలూ మన రామాయణం, మహాభారతాలలో కోకొల్లలు. ఇవి గ్రీకు భాషలోని ఇలియడ్, ఒడెస్సీలలో కానరావు. ఇది భారతీయ సంస్కృతికీ పాశ్చాత్య సంస్కృతికీ ఉన్న గొప్ప తేడా.

      నా భావము వివరించమన్నారని ఈ చేంతాడు వ్రాసాను. క్షంతవ్యుడను.

      తొలగించండి

    3. జీపీయెస్ వారు ,

      ---భారతములో భీష్ముడూ ఆత్మహత్యకు లోనయ్యారు ????


      దీని భావమేమి తిరుమలేశా ?

      జిలేబి

      తొలగించండి
    4. "కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి.."

      మారీచుడు శ్రీరాముని చేతిలో, భీష్ముడు శ్రీకృష్ణుని చేతిలో...

      తొలగించండి
  4. శ్రీ కళ్యాణ గుణాభిరాముడు జగచ్ఛ్రేయో విలాసుండు లీ
    లా కారుణ్య ఘనప్రతాప మహితోల్లాస ప్రతాపుండు లో
    కైకాధ్యక్షుడు క్రుంగె మానసమునన్ కాఠిన్యుడై,సీతకై-
    మారీచుండు ధరాత్మజాపతిని దుర్మార్గుండునై చంపెరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మారీచుడు రాముణ్ణి మానసికంగా చంపాడంటారు. బాగుంది. పద్యం అద్భుతమైన ఎత్తుగడతో అలరించింది. కాని ప్రాస తప్పింది.

      తొలగించండి
    2. ప్రాసలు ఈవిధంగా ఉన్నాయి.
      శ్రీకళ్యాణ.....
      (లీ)లాకారుణ్య.....
      (లో)కైకాధ్యక్షుడు.....
      క కార ప్రాస ఉన్నదనీ భావించాను.
      తప్పైతే తెలుపండి

      తొలగించండి
  5. వీరుండున్ పితృవాక్యపాలకుడు సంప్రీతిన్ ధరాపుత్రితో
    చేరన్ కాననసీమ లందు సుఖులై జీవించుచుండంగనే
    పోరున్ గెల్వగలేని రాముడు వెసన్, మోహింపగా మాయలన్
    మారీచుండు ధరాత్మజాపతిని, దుర్మార్గుండునై చంపెరా

    రిప్లయితొలగించండి

  6. బడా బాబు కి రామాయణం నేర్పిన తాసిల్దారు :)

    ఆ రావణుడికి బంధువు
    మారీచుఁడు రా, ముఁ జంపి! మాన్యుం డయ్యెన్
    హోరాహోరీ పోరు
    ల్లా రఘుపతితో వలదని లబ్జుగ తెలుపన్ !


    ముజంపి - ముజందారుడు - తాలూకా కచేరి‌ బడా బాబు :)

    రిప్లయితొలగించండి


  7. ఆ రావణుడణచె హరిని ;
    మారీచుఁడు రాముఁ జంపి మాన్యుం డయ్యెన్
    రారాజు చంపె భీముని;
    పోరి ! శకారునివలెన్ కపోలము గలదే :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండవ పూరణ అన్ని విధాల బాగున్నది.
      మొదటి పూరణలో మీరిచ్చిన అర్థంలో 'ముజంపి'లో అరసున్నా ఉండదు కదా! 'పోరుల్+ఆ' అన్నపుడు లకారద్విత్వం రాదు. గమనించండి.

      తొలగించండి
  8. నేటి సంస్కృత భాష పరిస్థితి గుర్తుకు వచ్చి ఇలా...

    శ్రీరాముఁడు సంస్కృతమన
    మారీచుఁడు హూణ భాష! మాయా రూపం!
    దారుణమే చూడ నిపుడు
    మారీచుఁడు రాముఁ జంపి మాన్యుండయ్యెన్!

    సంస్కృతము అంటే సంస్కరింపబడినది అని కదా అర్థం! మరి రాముని మించిన సంస్కారవంతుడెవరు? అందుకు రాముడు సంస్కృతం.
    ఇక మారీచుడు మాయా రూపం దాల్చి వచ్చాడు కదా, అదే హూణ భాష, ఆంగ్లం. మాయ లేడి సీతమ్మవారినే కోరేలా చేసింది, రాముని తనకు దూరం చేసింది. అలానే, ఈ ఆంగ్లం కూడా మనల్ని మన సంస్కృతి నుంచి దూరం చేసింది అని భావం..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భరద్వాజ్ గారూ,
      చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'రూపం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ "రూపం। బారయ దారుణ మిప్పుడు..." అందామా?

      తొలగించండి
  9. దూరాలోచన లేని రావణుడుఁ దా దోషంబుగానెంచకన్
    నారీరత్నము పైన మోహమున పన్నాగంబు దేనెంచగన్
    తోరంబౌ నెఱి యేణి రూపు గొనియున్ దూరంబు గొన్పోయెనా
    మారీచుండు ధరాత్మజాపతిని దుర్మార్గుండునై, చంపెరా
    వీరాగ్రేసర వల్లభుండు శఠమున్ భేదించె హీనాత్ములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. మీ యాత్ర శుభముగా సుఖముగా ముగిసిందని తలుస్తాను.

      తొలగించండి
  10. (1)
    సారంగమైన దెవ్వఁడు?
    చేరి యెవని మోసగించెఁ? జెలఁగి రఘువరుం
    డేరీతి ఖ్యాతి నందెను?
    మారీచుఁడు; రాముఁ; జంపి మాన్యుం డయ్యెన్.
    (2)
    ఘోరారణ్యనివాసుడై యలర నా కోదండరాముండు, బం
    గారంబైన తనుద్యుతుల్ గల కురంగంబై ప్రమోషించె నా
    మారీచుండు ధరాత్మజాపతిని దుర్మార్గుండునై; చంపెరా
    నారాచంబును వేసి యాతనిఁ గృతాంతాకారుఁడై రాముఁడే.

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    పోరాజ్ఞల సైనికులే
    కారే ప్రాణులును వారికౌనే పగలున్
    తీరా సరిహద్దున నొక "మారీచుడు"1"రాము"2జంపి మాన్యుండయ్యెన్!
    (1.పాకిస్తాన్ సిపాయి,2.భారతీయ యుద్ధవీరుడు.)

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    బ్యూరోక్రాటుల మట్టువెట్ట సమతా భోగంబు సాధ్యంబనన్3.
    ఊరూరన్ గల శ్రామికుల్ ధనికులన్ యూచల్ వలెన్ గోయరే
    పోరా?కాదొక యుద్యమంబు గనుకన్ బుణ్యాలె పాపాలుగాన్
    "మారీచుండు"1 ధరాత్మజాపతి"2ని దుర్మార్గుండునై చంపెరా!
    (1.రష్యా శ్రామికుడు,2.భూ,సంపదలకు స్వామిని, బ్యూయూరోక్రాటును,ఆ పేరు మోసే ధనికుని3.ధనికుల జంపి యా ద్రవ్యమును రాజ్యముకప్పగించిననే ఆర్థిక సమానత సాధ్యం అనే సిద్ధాంతాన్ని నమ్మి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      సాధారణంగా మీ పూరణా విధానం వైవిధ్యంగా ఉంటుంది. అలాగే నేటి పూరణలు కూడా. బాగున్నవి. అభినందనలు.
      'ధనుకులన్+ఊచల్' అన్నపుదు యడాగమం రాదు.

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి
      ఆర్యా,సత్సాంగత్వే...‌.మీఆభరణము మహిమ.సామాజిక.....పూరణము కదా,దానికి కట్టు వడి
      "సదసద్ విమర్ష" వైపు అడుగులు .గురు కృప.

      తొలగించండి


  13. పోరాటమ్ముల జేసినాను ! వినునా బోధల్! ధనుష్పాణిని
    న్నీరేడుర్విని గెల్వ లేరు జనులౌ నిక్కంబిదే" , చెప్పుచున్
    మారీచుండు, "ధరాత్మజాపతిని దుర్మార్గుండునై చంపె రా
    పుల్రీఢమ్ములు వీడ" గోరె భళి కోపుల్నాటి ఘాతమ్ము లౌ !


    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. దారుణ ము గ నె వ రె వ రిని
    ధారు ణి వంచన మొన ర్చే ?దశము ఖు నని లో
    నారాము డే మి చే సె న్
    మా రీ చు డు రాము ;చంపి మాన్యoడయ్యే న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. ఈ రావణు యురి కంటెన్
    శ్రీరాముని చేత ముక్తి శ్రేయంబనుచున్
    గూరిచి మదిలో కోరఁగ
    మారీచుఁడు రాముఁ, జంపి మాన్యుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
  16. క్రూరుం డెవ్వడు జింక రూపమున నా కొమ్మన్ దనేమార్చెనో?
    శూరుం డెవ్వని గొల్చు చుండ్రు జనులే శుద్ధాత్ములై భక్తితో?
    కారుణ్యమ్మది లేక పార్థు సుతునే కాలుండు ఘోరమ్ముగన్!
    "మారీచుండు ధరాత్మజాపతిని దుర్మార్గుండునై చంపెరా"

    రిప్లయితొలగించండి
  17. కృూరుడు రావణు పనుపున
    సారంగాకృతిని సీత సమ్మోహితయై
    కోరునటుల వంచింపగ
    మారీచుడు, రాము జంపి మాన్యుండయ్యెన్!

    రిప్లయితొలగించండి
  18. మీరగ ధనవ్యామోహము
    నేరములే సాధనములు నేరుపు మీరన్
    ధారుణి ధర్మము దొలగగ
    మారీచుడు రాము జంపి మాన్యుండయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ధనవ్యామోహము' అన్నపుడు 'న' గురువై గణదోషం.

      తొలగించండి
    2. SeethaDevi Gurramఅక్టోబర్ 21, 2017 10:33 AM
      గురుదేవులకు నమస్సులు! ధన్యవాదములు!
      "మీరగ సిరిపై మోహము" యనిన సరిపోవు ననుకొందును! 🙏🙏🙏🙏

      తొలగించండి


  19. మారుచు మృగమై నదెవరు?

    క్రూరుండగు యన్న పంప కువలయమందున్

    తేరన్ చనుచును దానిని

    మారీచుఁడు .రాముఁ జంపి మాన్యుం డయ్యెన్"*

    రిప్లయితొలగించండి
  20. హారామా యెటులుండెనీచదువులాహా యింతనిర్లక్ష్యమా
    లేరే యెందున జూచినన్ తెలుగులో లెస్సైనయర్థమ్ములన్
    సారింపన్ గలవారలొక్కడు విలాసమ్మొప్పగా నిట్లనెన్
    మారీచుండు ధరాత్మజాపతినిదుర్మార్గుండునై జంపెరా

    రిప్లయితొలగించండి
  21. ధారణమున వంచించగ
    మారీచుఁడు రాముఁ; జంపి మాన్యుం డయ్యెన్.
    సారంగ వేషధారిని
    నారాచమ్ములను విడిచి నడికాననమున్ / నట్టడవికడన్

    రిప్లయితొలగించండి
  22. ఆ రాక్షసాధిపతికిని
    సారెకు సంతసము గూర్ప చక్కగ పలికెన్
    ఓ రాక్షసాధముడు తా
    మారీచుడు రాము జంపి మాన్యుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  23. రావణుని మొదటి సారి సీతాపహరణ నిమిత్తము మారీచుని వద్దకు వచ్చినపు డతఁడు రాముని ప్రభావము తెల్పి సాహసము వలదని నచ్చజెప్పి తిరిగి పంపించిన సందర్భము:

    ఆ రాముని బల విక్రమ
    పౌరుషములు దెల్పి వక్ర భావము వలదం
    చా రాక్షసేంద్రు రావణు
    మారీచుఁ డు రాముఁ జంపి మాన్యుం డయ్యెన్
    [మారీచుఁడు+ఉరు+ఆము= మారీచుఁడు రాము; ఉరు= అధికము; ఆము = మదము]


    ధారాళంబుగ ధాత్రి నింపి జవసత్త్వశ్రేణి సృష్టించె నా
    మారీచుండు ధరాత్మజాపతిని దుర్మార్గుండునై చంపె రా
    మారాతి త్రి జగద్భయంకరుఁడు బాహాటమ్ము శ్యేనీయునిన్
    వీరావేశత జానకీ హరణమున్ వీక్షించి పోరాడగన్

    [మారీచుఁడు = మరీచి తనయుఁడు,కశ్యపుఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉరుటాము సాధువుకదా. అందుకని యీ అర్థభేదము:

      మారీచుఁడు+ఆరాము మారీచుఁ డారాము; ఆరాము = విహారణముచేయు వాడు. ఇక్కడ రావణుని లోని స్వేచ్ఛావిహారణుని.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  24. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,

    నారిన్ సీత (న్) భ్రమి౦పజేయుటకు

    . బ౦గార౦పు మాయా మృగ౦

    బై రాణి౦చిన దెవ్వరో ? యనిలజు౦

    . డత్య౦తమౌ భక్తితో

    నేరిన్ గొల్చె ? జటాయువున్ దశముఖు౦

    . డేరీతి గావి౦చెనో ?

    మారీచు౦డు | ధరాత్మజాపతిని |

    . దుర్మార్గు౦డునై జ౦పెరా !


    { గురువు గారు క్షమి౦చాలి .

    గరుభ్యో నమ : మొదటిపాద౦ బి౦దు యతి

    నేను ఈక్రి౦ది విధ౦గా భావి౦చి యతి చేశాను .


    ౦ గ = ఙ్ఞ = న || అదియునుగాక

    బ౦గార౦పు = బన్గార౦పు }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలోనిది బిందుయతిగా పరిగణింపబడదు. బన్గారంపు... కాదు... బఙ్గారంపు.. కదా! అక్కడ "స్వర్ణంబైన మాయా..." అనవచ్చు కదా!

      తొలగించండి
  25. సారంగమై దిరుగుచు ప్ర
    తారించె నెవరిని జెపుమ? దశకంఠుననిన్
    శ్రీరాముడేమి జేసెను
    మారీచుడు రాముఁ, జంపి మాన్యుండయ్యెన్!!!

    ప్రతారించు= మోసగించు,మభ్యపెట్టు

    రిప్లయితొలగించండి
  26. ఒౌరాయేమనియంటిరి
    మారీచుడురాముజంపిమాన్యుండయ్యెన్
    మారీచుడుచంపుటయా!
    యారాక్షసుదరమెజంపయార్యా!రామున్

    రిప్లయితొలగించండి
  27. .ధీరోదాత్తుడు శక్తివంతుడన వాదింపేల?మోసమ్ముతో
    మారీచుండు ధరాత్మజాపతిని దుర్మార్గుండునైజంపెరా|
    “ఔరా|యూహల కందనట్టి దదియే|యానందమే నింపెగా
    ప్రారబ్దంబిటు మార్చి వేసె” కల”సాఫల్యంబు లూహించగా|
    2.మారెను మాయాజింకగ?
    నేరము జేయంగ లంకనేలెడి రాజున్?
    ఓరాయిమార్చ రాతిగ?
    1.మారీచుడు2.రాముజంపె3.మాన్యుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  28. నేరముల జేకొని వఱద
    వాఱెడు సొమ్ముల బడసిన వారలె యీ నా
    డీ రాజ్యమేల జూచిరి!
    మారీచుడు రాము జంపి మాన్యుండయ్యెన్!

    రిప్లయితొలగించండి
  29. సమస్య లోని రాము పదము ద్వితీయా విభక్తిలో నున్నది.ఆ పదాన్ని ప్రథమా విభక్తిగా వాడటం కుదరదు,భావం పొసగదు.విజ్ఞలైన పెద్దలేమంటారో ? శ్రీకామేశ్వర రావు గారు చెప్పాలి!

    రిప్లయితొలగించండి
  30. మోఱకుతో విబుధుండనె
    "దారిన నిను పిచ్చి కుక్క తగ కఱచినదా?
    సారా ద్రావితివా? యే
    "మారీచుఁడు రాముఁ జంపి మాన్యుం డయ్యెన్"
    మోఱకు = మూఢుడు.

    రిప్లయితొలగించండి
  31. ఆరామంబున జానకీసతికి విన్యాసమ్ములన్ జూపగన్
    దారన్ సంతస బెట్ట వెంటఁ బడ సీతా! లక్ష్మణా యంచు బం
    గారమ్మౌజిగి మేని వర్ణఁపు కురంగమ్మౌచు వంచించగన్
    మారీచుండు ధరాత్మజాపతిని దుర్మార్గుండునై, చంపెరా!

    రిప్లయితొలగించండి
  32. కోరెను సీతను కృష్ణుడు,
    మారీచుడు రాము జంపి మాన్యుండయ్యెన్,
    వారధి గట్టితి యనుచున్,
    సారా సేవించి బలికె జపలుం డొకడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...గట్టితి ననుచున్' అనండి.

      తొలగించండి
  33. గురువు గారికి నమస్కారములు
    కార్తిక మాస సందర్భముగా శివాలయములో పూజాది కార్యక్రమములు పూర్తి అయ్యేటప్పటికి రోజు
    మధ్యాన్నము రెండు గంటలు అవుతుంది అందువలన ఉదయము బ్లాగులో సమస్యలను పూరించ లేక పోవుచున్నాను

    రిప్లయితొలగించండి
  34. సారంగమ్ముగ మార వేల్పురిపు డాచందమ్ము వీక్షించుచున్
    కోరెన్ రాముని సీత యేణమునకై, కువ్వాళమున్ చేయగా
    మారీచుండు ధరాత్మజాపతిని దుర్మార్గుండునై, చంపెరా
    ఘోరారణ్యము లోన విడ్చి శరముల్ కోదండ రాముండు తా

    రిప్లయితొలగించండి
  35. ఘోరాటవి గూలె నెవడు
    యేరీతిని సీత పొందు నీచుడు దలచెన్
    హెరామ్మను హరి కేమయె
    మారీచుఁడు /రాముఁ జంపి/ మాన్యుం డయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎవడు+ఏరీతి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి
  36. గురువు గారి కి నమస్సులు.నా పూరణ లోని దోషములు తెల్పు డు.
    శ్రీరామ వంచకు డె వరు?
    నా రూఢిగ రావణు మతి నేమియు తలచున్?
    వీరుల కే మి ఫ లితమో?
    మారీచుండు రాము జంపి మాన్యు o డయ్యెను.
    వందనములు.


    రిప్లయితొలగించండి
  37. రా! రమ్మంచును పిల్చె లేడి తనువున్ రమ్యమ్ముగా దాల్చుచున్
    మారీచుండు ధరాత్మజాపతిని;...దుర్మార్గుండునై చంపెరా
    భీరుండై తన మామనున్ పనుపుచున్ వీరంపు స్వర్గమ్ముకున్...
    లేరేరీ యిటనట్టి రావణునివోల్ లీడర్లు కాంగ్రేసునున్!

    రిప్లయితొలగించండి