1, అక్టోబర్ 2017, ఆదివారం

దత్తపది - 124 (కిక్-లక్-చెక్-నెక్)

కిక్ - లక్ - చెక్ - నెక్
పై పదాలను ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
ఈ దత్తపదిని పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

36 కామెంట్‌లు:

  1. తిరుమల బ్రహ్మోత్సవములు నేటి చక్ర స్నానము తో ముగుస్తాయి శ్రీ వేంకటేశ్వరుని మీద చక్ర బందః సీసములో నేను వ్రాసిన బద్యము అవీ ఇవీ వర్గములో గురువు గారు ఉంచారు పరిశీలించి మీ అభిప్రాయములు తెలియ పరచ వలెను
    చక్ర బంధ సీసములో శ్రీ వేంకటేశ్వర స్వామీ ప్రార్ధన
    సీ:శ్రీ లక్ష్మీ వల్లభ, శ్రీ గోపికాలోల , శ్రీ జగత్పాలాయ, శ్రీ నివాస
    శ్రీ వేంకటేశాయ, శ్రీ అమృతాంశాయ, శ్రీ వత్సవక్షసే, శ్రీ హరాయ,
    శ్రీ శాంజ్ఞ పాణయే ,శ్రీకటి హస్తాయ, శ్రీ పద్మనాభాయ, శ్రీధరాయ,
    శ్రీ దీనబంధవే, శ్రీ అనేకాత్మనే, శ్రీ జగద్వాపినే, శ్రీ వరాయ,
    శ్రీ హయ గ్రీవాయ, శ్రీ జగదీశ్వరా, శ్రీ పరంజ్యోతిషే, శ్రీ రమేష,
    శ్రీ మధుసూధనా, శ్రీ భక్త వత్సలా, శ్రీ పరబ్రహ్మణే, శ్రీ శుభాంగ,
    శ్రీ యజ్ఞ రూపాయ, శ్రీ ఖడ్గ ధారిణే, శ్రీ నిరాభాసాయ, శ్రీ గిరీశ,
    శ్రీ వన మాలినే, శ్రీ యాదవేంద్రాయ, శ్రీ సుర పూజితా, శ్రీ శిరీశ,
    తే: నంద నందనా, దశరధ నందన, మధు
    సూధన, పశుపాలకుడ ,అనాధ రక్ష
    కా , దినకర తేజా,సాలగ్రామ హర, పు
    రాణ పురుష, కాపాడు పరమ దయాళు.

    పద్యము చదువు విధానము : 1 అన్న చోటునుంచి “శ్రీ లక్ష్మీ వల్లభ” తో మొదలు పెట్టి మద్యలో ఉన్న శ్రీ తో కలిపి “ శ్రీ గోపికా లోల “అని చదువు కోవాలి చివరిగా
    “శ్రీ శిరీష” తో ఆపి పైన “నంద నందనా” నుంచి చదువుకొని “పరమ దయాళు” వద్ద ముగించాలి
    పూసపాటి కృష్ణ సూర్య కుమార్ (సెల్ 9290042432 )

    రిప్లయితొలగించండి
  2. బృహన్నల మాటలలు విని శమీవృక్షమెక్కిన ఉత్తరుడు అర్జునునితో అంటున్నట్లు
    కిక్కరించిన యీచెట్టు నెక్క నిపుడు
    లక్కనము చెప్ప విప్పగ నిక్కడొక్క
    చెక్కిన శవము గన్పట్ట నొక్కసారి
    నెక్కొనె భయంబు మదినందు నిక్కమిదియె.
    (కిక్కరించిన=దట్టంగా అలుముకున్న, లక్కనము=గురుత, నెక్కొను=వ్యాపించు)

    రిప్లయితొలగించండి
  3. చెక్కిన శిల్పమో యనగ చెన్నగు ద్రౌపది చేయిపట్టగన్
    పెక్కురు రాజ పుత్రులును వీరులు నెక్కొని వచ్చి చేరగన్
    లక్కన మేరికింగనము లక్ష్యము జేరగ బెండ్లి యాడగ
    న్నక్కడ పార్థుడే గెలిచె నాతని కిక్కడ యోటముండునే !

    రిప్లయితొలగించండి
  4. రాయబారమునకు వెళ్ళే ముందు శ్రీకృష్ణపరమాత్మతో పాంచాలి:

    మాకిక తీరగా వలయు మానస మందలి కక్షలట్లె జీ
    కాకులుఁ, గంసముఖ్య రిపు ఖండనసువ్రత! భక్తపాలకా!
    యాకుటిలాత్మునిన్ దుదకు నాలము నందునఁ బ్రోచె కర్ణుడే?
    కాక యనేకకౌరవులొ? కాంచనె కయ్యము లోన నే వెసన్ !

    రిప్లయితొలగించండి


  5. చెక్కించగన్ సురంగము
    లక్కా గృహమునకు నిప్పులంటించంగ
    న్నెక్కగనౌ పరివారము
    కిక్కురుకు వెరయక గుణుడు కింకరుడాయెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. లక్కనపు రీతి యాడిరి
    కిక్కురు పాచిక! పణాయ కిటుకు శకునిదౌ !
    నెక్కొన పందెము వేదిజ
    చెక్కిలి పై చిరు నగవులు చెదిరె జిలేబీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. లక్క యింటిలో భీముడు కుంతితో....

    ఇంక మన కిక్క డుండుట హితము గాదు
    చూడు మిది లక్కయిల్లె యిచ్చోటు వీడి
    పోవు చెక్కడో క్షేమముఁ బొందవచ్చు
    నమ్మ! నాదు భుజము నెక్కు మరుగుద మిక.

    రిప్లయితొలగించండి
  8. నాడు కిక్కురించి శకుని పాడు జూద
    మందు ఓడించె, వెన్నెక్కు మదిన గలుగ
    దుష్ట దుశ్శాసనుడు కృష్ణ దుస్తు బట్టి
    లాగగా, పలక్కుండగ మాగురువులె
    వరును ఖండించ కుండిరి ,వలదు వాసు
    దేవ రాయభారము, నామదిన యతిఘము
    రగులు చుండె, చెక్కులు సేతు రణము లోన,
    యంచు బలికె బీముడు యాగ్రహమ్ము తోడ

    రిప్లయితొలగించండి
  9. ఈ సమస్య రామాయణ అర్ధములో నా పూరణము
    రాముని గాంచిన రక్కసి శూర్ఫణఖ తనను పెండ్లాడ గవలయునని
    వె(న్నెక్కు)న నడుగ, వెలది పలుకులకు (చెక్కు) చెదరనట్టి చిత్తము గల
    దశరధ తనయుడు తనసోదరుడు (లక్కు)మనుని కడకు నంప, మదవతి యను
    రాగము కుప్పించి రమ్యమౌ పరిణయమును కోర, సౌమిత్రి ముందు వెనుక
    తలచక యసితాంగమును కంగులమున నిడి,
    (కిక్కు)రించ తలచినట్టి కేశిని తను
    భస్త్ర ,కుహరములను గోయ భయము తోడ
    యరచి లంకేశుని పురికి పరుగు బెట్టె

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    శ్రీ కృష్ణుడు, కంస వధ తరువాత ఉద్ధవునితో పలికిన పలుకులు:
    ఇచ్చట నేను యీ "మధుర" కిక్కటు బాసిన వేళ, గోపికల్
    అచ్చట లక్ష్య లక్షిత విహారపు బ్రేమను చెక్క బొమ్మలై
    నెచ్చెలు లెల్ల నుండనగు ;నెక్కడిదీ యెడబాటునోప; నీ
    సచ్చరితంబు నాకెరుక "చయ్యన వచ్చెద"నంచు వారలే
    అచ్చెరువందగా వ్రజము కౌనని బోవగదయ్య, ఉద్ధవా!

    రిప్లయితొలగించండి
  11. ద్రౌపది వస్తాపహరణం-సామాన్యుల సంభాషణ.

    కిక్కురుమనరు వృద్ధులు కిన్కుఁబూని
    భామ రోదనలక్కడ. భయముఁగొల్పె
    రాజు పనులకు చెక్ పెట్టరయ్యె బుధులు
    సభికులన్నెక్కులంధిన జాడఁగనుము.

    అన్నెక్కు=మత్తెక్కు

    రిప్లయితొలగించండి
  12. కిన్కు బదులు కిన్క అని చదువ ప్రార్ధన

    రిప్లయితొలగించండి
  13. గురువు గారికి నమస్సులు. నా పూరణ లోని దోషములు తెల్పుడు.
    కిక్కురమనక రారాజ కీ డు సేయు
    తలచి నన్ కృష్ణు తలక్కు నవర మిచ్చు
    పార్థు చెక్కిలిన్ కోమలి మమతన పలు
    ముద్దు లివ్వగ నెక్కొన ముదము నoత.
    వందనములు.గురువు గారి పూరణ ఆనన్య సామాన్యం
    మరియు మల్లేె పూల పరిమళం వలె నుండు.

    రిప్లయితొలగించండి
  14. సభలో పాండవుల పరిస్థితి!

    చెక్కిన శిల్పముల పగిది
    కిక్కురు మనక నగుబాటు కినుకయె లేకన్
    నెక్కొనగ నధర్మమచట
    రక్కసి చర్యల సహించె లక్షించుచునే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెన్నవంటి మాట వేయియేన్గులశక్తి
      గురువుగారి పిలుపు గోచరింప
      యాత్రపేరిటిచట నష్టాదశదినము
      వేచియుండ నకట వేసటగును!

      గురువర్యులకు నమస్సుమాంజలి! శంకరాభరణ కవితాహారానికి మీరే అంతఃసూత్రము! మీ వ్యాఖ్యలేనిదే ఉత్సాహముండదు!అయినను పోయిరావలె హస్తినకు .....
      మీ యాత్ర సఫలము కావలెనని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాము!🙏🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  15. క్రీడ జూదము నోడిన కిక్కుమనక
    లక్షమాయలు కల్పించ లక్కఇంట
    చెక్కిన శిలవోలెయే చీకుచింతలేక
    నెక్కొనెడికీడు ధర్మజ నెదురుకొనవ?

    రిప్లయితొలగించండి
  16. క్రీడ జూదము నోడిన కిక్కుమనక
    లక్షమాయలు కల్పించ లక్కఇంట
    చెక్కిన శిలవోలెయే చీకుచింతలేక
    నెక్కొనెడికీడు ధర్మజ నెదురుకొనవ?

    రిప్లయితొలగించండి
  17. ఊర్వశి విజయునితో :

    కిక్కురుమనవేమి? దొర! త
    లక్కున మానస మెగయదె రంజిల నాతో!
    చెక్కిన శిల్పపు టందము
    నెక్కొల్పదె వలపు కైపు నిబ్బర మేలోయ్!

    రిప్లయితొలగించండి
  18. కీచకుడాడు మాటలను కిక్‍కనలేక భరించు ద్రౌపదిన్
    జూచిన పాండవుల్ కలగి సూచిత లక్‍ష్య విధాన వర్తులై,
    వేచిరి కాంచుచెక్‍కడ నివృత్తి యొనర్పగ వానినంచు....తా
    నేఁచి వృకోదరుండు, పదునెక్‍కిన బుద్ధిని చంపెనాతనిన్.

    రిప్లయితొలగించండి
  19. శంకరయ్య గారికి,
    సంతోషం ! శుభయాత్రాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  20. గురుదేవుల యాత్ర సునాయాసంగా సాగాలని శుభాకాంక్షలు. చంద్రమౌళి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  21. డ.పిట్టానుండి
    ఆర్యా,యాత్రా యోగ పురస్సరంగా అభినందనలు.అమర్ నాథ్ లో జాగ్రత్త.గుర్రం పై balance జాగ్రత్త.వీలుంటే టోలీయే better.హెలీ యాత్ర యైనా నడక తప్పదు.Tablets మరువకండి.I wish u a successful holy pilgrimage!

    రిప్లయితొలగించండి
  22. కికురించుచుఁ బాండవులకు
    చెకుముకి పాచికలు పేరిచి కురు విభుల ము
    న్నె కువలయ మంత దోఁచిరి
    వికృతానను శకునిఁ గూడి పెను కౌరవులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు యాత్ర సమస్తము నిర్విఘ్నమై శుభకరమై సుఖప్రదమై దైవ సుదర్శన సంప్రాప్తంబై మనోరంజకమై సత్ఫలప్రదమై సంపూర్ణంబై వర్తిల్ల శ్రీమన్నారాయణుం డనుగ్రహించు గాక!!!

      తొలగించండి
    2. నర్తనశాలలో కీచకుని గూర్చి భీమునిమనోగతము
      రాత్రికిక్కడ నీతలవ్రాతమారు
      లక్ష్యము మదిలో నీపైన లగ్నమయ్యె
      చక్షువుల్ నిన్ను గాంచ వేసారుచుండె
      నీదు దేహము నెక్కెద నెమ్మితోడ(నిర్భయముగ)

      తొలగించండి
    3. రెడ్డి గారు లక్ రాలేదు మీ పూరణలో (మార్పుతో కలిపి). లగ్న లో లక్ రాదు కదా.

      తొలగించండి
  23. లక్కని యెంచి కీచకుడు లావరి నర్తనశాలజేరగా?
    కిక్కన బోక భీముడటు కీడును బంచెను రాత్రి ధాత్రిపై
    నెక్కనినేర్పునందు తను నీడ్చియు జీవన సారసంపదన్
    చెక్కని మార్చివేసెగద|చెంచల చిత్తుని కీచ కాధమున్.

    రిప్లయితొలగించండి
  24. (పాండవుల వనవాససందర్భం_- సుభద్రతో శ్రీకృష్ణుడు)
    చివురుచెక్కిళ్ళ కన్నీరు చిందనీకు;
    చెల్లి!నీకిక్క డేకీడు చేరదమ్మ!
    ఇట్టి యిడుముల కొండల నెక్కగలిగి
    యరుగుదెంతురు పాండవు లక్కజముగ.

    రిప్లయితొలగించండి
  25. సాధువర్తనుండు శంకరవిబుధుండు
    నిత్యసత్యవాక్యనిర్మలుండు
    స్వాంతమందు శాంతసద్భక్తియుక్తుడై
    చారుధామయాత్ర సలుపుగాక!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీగారూ! మీ రెండు పద్యాలూ ఉత్తమంగా ఉన్నాయి! అభినందనలు!

      తొలగించండి



  26. లక్కగృహమ్మున నుంచగ

    నెక్కొని గుట్టును నరయుచు నేర్పును  జూపుచు

    కిక్కురు మనకుండగ నెం

    చక్కగ సాగిరి పృథజులు జవమున నమతో.

    అమ:తల్లి.

    రిప్లయితొలగించండి