10, అక్టోబర్ 2017, మంగళవారం

సమస్య - 2488 (నెలఁ జూచి లతాంగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్"
(ఆకాశవాణి వారి సమస్య)

45 కామెంట్‌లు:

  1. నెల రోజులు పుట్టింటికి
    సెలవులపై వెడలి వచ్చి చిరునవ్వులతో
    పలు విధముల కడవలు గి
    న్నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్

    రిప్లయితొలగించండి
  2. నెలత యొకతుక ప్రియ సఖుని
    గలవంగా నెంచె; తోట కడకేగు తఱిన్
    సలిపెడి కాలికి గల యా
    "నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్"
    (ఆనెలు = బొబ్బలు ; దద్దుర్లు)

    రిప్లయితొలగించండి
  3. వలరాజు వింటిబాణము
    నిలువున నాటంగ మదిని నిట్టూర్పులతో
    చెలికాడు చెంత లేడని
    నెలజాచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్!

    నెల= పున్నమి చంద్రుడు

    రిప్లయితొలగించండి
  4. కలలోపల ననిరుద్ధుని
    చెలువమ్ము నుషాకుమారి చెలిమిగ గనియెన్ ;
    మిలమిల మెరసెడి పున్నమి
    నెలజూచి లతాంగి యేడ్చే నేరుపుమీరన్.

    రిప్లయితొలగించండి
  5. చెలువము తన పతిఁగోరగ
    తలపుల విరహాగ్నివేగి తమకముతోడన్
    చిలుకల పలుకులు విని,వె
    న్నెలఁజూచి లతాంగి యేడ్చె నేరుపుమీరన్

    రిప్లయితొలగించండి
  6. కలువల కన్నుల కాంతుడు
    విలువగు వేల్పుల సుమమును వేడుకతోడన్
    నెలతుక రుక్మిణి కీయ
    న్నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్

    నెల=స్ధానము

    రిప్లయితొలగించండి


  7. కలవలె మిగిలిన బతుకున
    నెలఁ జూచి లతాంగి యేడ్చె; నేరుపు మీరన్
    చెలికారంబనుచు ముదము
    గలిగిన నెఱకాడు తనను కాదని విడువన్ !

    నెల- వెన్నెల/ చంద్రుడు అన్న అర్థం లో

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. తలపు న మెదిలె ను నాథుడు
    పలు రోజుల క్రితము వెళ్ళ పర దేశ ము న కు న్
    వలపు లు పొంగిన త రి వె
    న్నేలజూచి లతా oగియేద్చేనేరుపుమీరన్

    రిప్లయితొలగించండి
  9. ఇలుచేరనీయక రజని
    వలపులవల విసరుచు కడు వయ్యారముతో
    చెలికానితోతిరుగు క
    న్నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్

    రిప్లయితొలగించండి
  10. కలనైన విరహబాధను
    దలపగ లేనట్టి వేళ తననాథుం డా
    వలనొక యూరికి నేగెడి
    నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్.

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    కలికికి దుఃఖము బాపగ
    బలియగు సామాజికంపు బాధల గాధన్
    తొలి రచనన్ భారత క
    న్నెల జూచి లతాంగి యేడ్చె నేరుపుమీరన్

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    కలలే కరిగెడి వితమున
    బలి యగుటే నిత్య వార్త; బలిమి చదువులౌ
    కలికాల రీతి గొను క
    న్నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా
    ఇలలో రక్కసు లింటనె
    కలకాలము మహిళ నణచ గాంచమె"వార్త"న్?
    వెలలన్ రత్నములౌ క
    న్నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్!

    రిప్లయితొలగించండి
  14. డా}.పిట్టా
    "వెలగల చీరెలు మాకట
    పలు వన్నెల లంగ లోణ్లు ప్రక్కన బెట్టెన్"
    వలువల దానము గొన నొక
    నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్!

    రిప్లయితొలగించండి
  15. తలవాల్చె శత్రుమూకల
    విలయమ్మున మీదు భర్త వీరుండనఁగ
    న్నల శవపేటిని మువ్వ
    న్నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్!

    రిప్లయితొలగించండి
  16. వరూధిని యేడుపు

    చలిమల సానువు చెంత
    న్నిలవేలుపు సొగసుజూచి నివ్వెరబోవన్
    వలదన్న వలపు చింత
    న్నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్!

    రిప్లయితొలగించండి



  17. తలపులనిండపతి నిలువ

    నెలత విచారమది నిండ నెమ్మియు పెరుగన్

    తలచుచు విరహము పెంచెడు

    నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్"*

    రిప్లయితొలగించండి
  18. వెలుపలి కీ నాడు వెడల
    వలదు, శశిని గన వదంతి వచ్చు ననెడి యా
    చెలికాడి పలుకులు వినక
    నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్"
    (వినాయక చవితి రోజున వ్రతము చేయక భర్త పై నలిగి శశిని కాంచిన మహిళ అను భావన)


    రిప్లయితొలగించండి
  19. భంగ్యంతర పూరణ:
    ****)()(****
    వలచిన తన ప్రియ సఖునే
    వలవేసి వశపరచు కొను వనితను, మరియా
    లలనకు గల వన్నెల, చి
    న్నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రమా భంగ్యంతర పూరణ వివరించగలరు

      తొలగించండి
    2. KRISHNA SURYA KUMAR PUSAPATI గారికి నమస్సులు.భంగ్యంతర పూరణంటే ఒక అవధాని కానీ, కవి కానీ తాను ఇదివరకే పూరించిన సమస్యను మరొక విధంగా భిన్నంగా పూరించటం.కీ.శే. C.V. సుబ్బన్న శతావధాని రచించిన " శతావధాన ప్రబంధము" (3 భాగాల వరకు వెలువరించారు.)లో ఈ పదబంధము తరచు కనిపిస్తుంది. అవధానం ముగిసిన తర్వాత సాయంత్రమో,రాత్రో కవిమిత్రులు కలిసి సమస్యను మరోవిధంగా పూరించమని అడుగు తుంటారు.అప్పుడు చేసేదే భంగ్యంతర పూరణ. అది నా రెండవ పూరణ కాబట్టి అలా సూచించాను.

      తొలగించండి
    3. ధన్యోస్మి కొత్త విషయము తెలుసుకున్నాను

      తొలగించండి
  20. రిప్లయిలు
    1. కలవర మంది భృశమ్ముగ
      నలినాక్షి విజిత తరుణ దినప్రణి సుమన
      స్తల తుల్య పాదమున నా
      నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్

      [ఆనె = దద్దురు; ఏడ్చెను + ఏరుపు = ఏడ్చెనేరుపు; ఏరుపు = మంట]

      తొలగించండి
  21. చెలియను వీడ్కొని చనెనొక
    చెలికాడటు యెడబాటుకు చింతిలు వేళన్
    చలువల రాయని సిరివె
    న్నెల జూచి లతాంగి యేడ్చె నెరుపు మీరన్

    రిప్లయితొలగించండి
  22. నెలరోజులైన పెళ్ళియు
    అలిగినయల్లుడికి కట్నమందక పోగా
    పొలతుల మాటలతో వె
    న్నెల జూచి లతాంగి యేడ్చెనేరపుమీరన్|

    రిప్లయితొలగించండి
  23. వలపులబాధనునోర్వక
    నెలజూచిలతాంగి యేడ్చెనేరుపుమీర
    న్నెలలేనెలలునుదాటగ
    బలుకులుదనభర్తతోడభామినియపుడున్

    రిప్లయితొలగించండి
  24. వలువల నివ్వక సఖియలు
    చెలియను కూపంబు నెట్టి సిడిముడి నుండన్
    మెలపున తనపై బడు వె
    న్నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్

    రిప్లయితొలగించండి
  25. కలికాల మాయె ప్రియమగు
    చెలి పుట్టిన దినము నైన చేయరు వంటన్
    సెల వేది యందు రని గి
    న్నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్.

    రిప్లయితొలగించండి
  26. కులుకుల చెలులు తన మగని
    వలపులలో ముంచి నటుల స్వప్నము గాంచన్
    కలయని దలచక నా క
    న్నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్!

    రిప్లయితొలగించండి
  27. చులుకన జేసిన ప్రవరుని
    తలచి వరూదిని విరహపు తాపము హెచ్చన్
    కలువకు సౌఖ్యము గూర్చిన
    నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్!

    రిప్లయితొలగించండి
  28. వెలయాలి పొందు గోరుచు
    తలమాసిన వాడొకండు తన సతిని విడన్
    కులటను గనె నేర్వగ; వ
    న్నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్"

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ఐహిక మును విడిచి యాముష్మికమున కై
    నిరత మచ్యుతుగన నిష్ఠ తోడ
    జపము సలుపు నట్టి సత్పురుషులు తా
    పసుల సేవ పరమపద మొసంగు

    రిప్లయితొలగించండి
  29. కలలో తన ప్రియసఖునిన్
    దలచిన తత్క్షణమె లేచి తల్లడిలుచు బా
    ధల గూర్చు విరహమిడు వె
    న్నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్

    రిప్లయితొలగించండి
  30. కలహంసల యంచుజరీ
    వలువను కోరగ ప్రియపతి వారింపంగన్
    కలలో నందలి పలువ
    న్నెలజూచి లతాంగి యేడ్చె నేరుపుమీరన్!

    రిప్లయితొలగించండి



  31. వలరాజు తొందరిడగా
    లలనామణి యుస్సురనెను లాహరి పెరుగన్
    చెలికానిని మది తలచుచు
    నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్

    రిప్లయితొలగించండి
  32. భంగ్యంతర పూరణ(మరొక భిన్నమైన)
    అల నాడేగిన తన పతి
    నెల దాటెను రాకపోడు నేడే యనుచు
    నల వచ్చెడి ఖాళీ దో
    నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్
    (దోనెలు = పడవలు; ఏరుపు మీరన్ = బాధ హెచ్చగా)

    రిప్లయితొలగించండి




  33. వలరాజు తొందరిడగా

    లలనామణి యుస్సురనెను లాహరి పెరుగన్

    చెలికానిని మది తలచుచు

    నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్

    రిప్లయితొలగించండి