13, అక్టోబర్ 2017, శుక్రవారం

సమస్య - 2491 (కరణ మేల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరణ మేల కావ్య కరణమునకు"

49 కామెంట్‌లు:

  1. భూమిలెక్క జూచు భూసురోత్తముడయ్యు
    తిమ్మిబమ్మి చేయు తీరుదెలిసి
    యూరివారి సొమ్ము నూరికే భోంచేయు
    కరణమేల కావ్యకరణమున

    రిప్లయితొలగించండి
  2. వచన రచన తోటి భావాల నందించ
    కవిత నవల కథయు గణుతికెక్కి
    నేటి కాల మందు మేటియై సాగ వ్యా
    కరణమేల కావ్య కరణమునకు!

    రిప్లయితొలగించండి
  3. ఇహపరముల కొరకు నీలోక మందున
    కావ్య రచన పుణ్య కార్య మౌను
    సకల జనుల హితము సాధింప గను వేరు
    కరణమేల కావ్య కరణమునకు.

    రిప్లయితొలగించండి
  4. లోకమెల్ల కవివిలోకనము వలన
    నవరసరుచి తోడ నాట్యమాడు ;
    ప్రతిభ పరిమళించు పరిపూర్ణకవికి వ్యా
    కరణమేల కావ్యకరణమునకు?

    రిప్లయితొలగించండి
  5. రాజు మెచ్చి వివిధ రతనాలు పంపించ
    వద్దటంచు పలికె భక్త పోత
    నార్యుడంత రాజు నడిగెనీ రీతిధి
    క్కరణ మేల కావ్య కరణమునకు

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! నమస్కారము.

    సోదరులిరువురు రసోన్ముఖులగుటచే
    పోరులన్ని కవనపుష్పమయమ!
    తల్లిమందలించె "తప్పురా! చాలుని
    క! రణమేల కావ్య కరణమునకు!"

    సూచనలు సవరణలు సెలవీయ ప్రార్థన!

    రిప్లయితొలగించండి
  7. అర్ధరాత్రివేళ నాత్రుతమతులౌచు
    శంకరాభరణము శంకరుండు
    యేమి ప్రశ్ననిడునొ యెటుల పూరింతుమో
    యెల్లవారికళ్ళు యెదురుజూచు

    రిప్లయితొలగించండి
  8. భాష చాలు భావ ప్రకటన జేయంగ
    కవిత లల్ల మధుర కవన ములకు
    పండి తుండు తెలుపు భక్తి యుక్తంబుగ
    కరణ మేల కావ్య కరణ మునకు

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    తలపు మెరియగానె తానె దీపించును
    ముందు వెన్కజూడ ముడిని వడును
    భావ వితతి బట్టు భద్ర లగ్నంబదె
    కరణ1మేల కావ్య కరణమునకు?!(1.బవ,బాలవాది ముహూర్త కరణము)

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    చేయువాడు పనిని జేసి చూపించంగ
    చేయలేని వాడు వ్రాయు ననిరి2
    చేత రీతి పంటక్షేత్రమె కవనము
    కరణ1మేల కావ్య కరణమునకు?!(1.పనియే చేయడమన్నది2.Those who can, do,(but)those who cannot,write అనే ఆంగ్ల సూక్తి కలదు)

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    "ఏమి వ్రాత లయ్య, ఎన్నెన్నిని గ్రంథాలు?


    పిచ్చివాడవేమొ, పేరు కొరకొ"
    "భావ ధారనాప భవుడు నన్ మెచ్చునే,
    కరణ1మేల కావ్య కరణమునకు?"(1.లెక్క వ్రాయువాడు)

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    వేద,శాస్త్ర,రీతి విత్తపు బొత్తముల్
    వస్తు మార్పున గొనవచ్చు రాజ్య
    మన్న బ్రిటిషు వారి మమతను గాంచరె
    కరణమేల కావ్య కరణమునకు?
    "We are ready to give up our kingdom if you are ready to surrender your whole libraries to us"..Once the Britishers said so.

    రిప్లయితొలగించండి


  13. శరణు శరణ ననుచు చక్కగ చదువుల
    తల్లి ని భజియింప తరుణు లార
    చంద మగుచు బుద్ధి సంపత్తి పెంపొంద
    కరణ మేల కావ్య కరణమునకు!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. రసము లుప్ప తిల్లు రస రమ్య మైన ట్టీ
    జగము మేలు కోరి జాణ ల గు చు
    యోగ్య రచన చే యు నుత్త మ కవులు oడ
    కర ణమేలకావ్య కరణ మునకు ?
    కరణ మ్ రాజే శ్వర రావు

    రిప్లయితొలగించండి

  15. ఇహపరముల కొరకు నీలోక మందున
    కావ్య రచన పుణ్య కార్య మౌను
    సకల జనుల హితము సాధింప గను వేరు
    కరణమేల కావ్య కరణమునకు.

    రిప్లయితొలగించండి
  16. సంఘహితము గోరి సత్కృతి సృజియించు
    వారు కొంద రిట్లు పలుకు చుంద్రు
    స్వేచ్ఛతోడ రచన చేయంగ వలె యను
    కరణ మేల కావ్య కరణమునకు.

    రిప్లయితొలగించండి
  17. కవులకు బలుకుజెలి కరుణ మేల్జేయును,
    చక్క నైన కవన జారు యతని
    కలము నుంచి రయము గాను, ఖానుల యది
    కరణ మేల కావ్య కరణమునకు"
    ఖానులు = రాజులు

    రిప్లయితొలగించండి
  18. అంకితమ్ము సేసె నపురూప గ్రంథమ్ము
    భక్తి మీర రామ భద్రునకును
    పోతనార్యుడపుడు;భూపతులదగు స్వీ
    కరణమేల కావ్య కరణమునకు,

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    రస మలంకృతమ్ము ప్రాణమ్ము శయ్యయు
    పాక యుక్తములగు వర్ణనలిడి,
    ఘనత వెలయ వ్రాయఁ "గవి"యె కావలెఁ గాని,

    "కరణ" మేల కావ్యకరణమునకు?

    రిప్లయితొలగించండి
  20. కులము మతములనుచు కుళ్ళును నింపుచు
    పుస్తకముల రాసి పోరు పెంచి
    ఐక్య భావనలను నాదర్శముగ వ్రాయ
    క, రణమేల కావ్యకరణమునకు

    రిప్లయితొలగించండి
  21. కులము మతములనుచు కుళ్ళును నింపుచు
    పుస్తకముల రాసి పోరు పెంచి
    ఐక్య భావనలను నాదర్శముగ వ్రాయ
    క, రణమేల కావ్యకరణమునకు

    రిప్లయితొలగించండి
  22. చరితమారె!భావజాలము కనరాదు
    కారుకూత లకట!కళలులేవు.
    నవ్యకవతలందు నవరసములు లేవు
    కరణమేల కావ్యకరణమునకు

    రిప్లయితొలగించండి
  23. కావ్య లక్షణమ్ము, కవనమ్ము దెలిసియున్
    వ్యాకరణమెరింగి ప్రాకటముగ
    నంకురించఁ దగు నలంకారమే యను
    కరణ మేల కావ్య కరణమునకు?

    రిప్లయితొలగించండి

  24. గ్రామపెద్దలుండకార్యసఫలతకు కరణమేల.కావ్యకరణమునకు పదునెనిమిదియైనవర్ణనలుండవ
    లయునునంతెకాక రమ్యముగను

    రిప్లయితొలగించండి
  25. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

    ( కావ్య అను అమ్మాయిని స౦బోధి౦చి

    తన స్నేహితురాలు అ౦టున్న మాటలు )


    వ్యాకరణము ఛ౦ద మవియేల ? పద్యాను

    కరణ మేల ? కావ్య ! కరణమునకు ||


    చిత్రకవులు నేడు చెత్త పాటలు వ్రాసి

    సాహితీ విలువల చ౦పుచు౦ద్రు

    { కరణమునకు = వ్రాయుటకు }

    రిప్లయితొలగించండి
  26. శైలి,శయ్య నొప్పు శబ్దములను గూడి
    వర్ణనలు పెక్కు వలయు గాని
    సుంత శోభ నీని శుష్కమయిన యలం
    కరణ మేల కావ్య కరణ మునకు.

    రిప్లయితొలగించండి
  27. ఊరివారిసొమ్మునూరికేభోంచేయ
    నూరివారలేమివెర్రివారె?
    పనినిబట్టియుండుభరణమ్ముపుడమిని
    దెలిసికొనుమయిదియదేవిమాత!

    రిప్లయితొలగించండి
  28. ఆర్యా! కోపించవలదు! యిది యేదో పూరణ కోసం చేసినదే గాని , యొకరిని కించ పరచుటకు కాదు!
    అయినను అలనాటి నిండి యిలనాటి వరకు రెనెన్యూ శాఖలో గిమ్మిక్కులు జరుగుతూనే ఉన్నాయనడం అక్షర సత్యం!🙏🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  29. చదివిధారణమ్ము సలిపి ప్రియముగాను
    విజ్ఞతగొనినట్టి వేద్యునకిల
    పరుల పుస్తకముల పదముల నిత్యాను
    కరణమేల కావ్యకరణమునకు

    రిప్లయితొలగించండి
  30. సదమల చరితమును శబ్దార్థ భావ యు
    క్త విలసితము దగును గావ్య మనఁగ
    ననుకరణ వికారమును వ్యాకరణ నిరా
    కరణ మేల కావ్య కరణమునకు

    రిప్లయితొలగించండి
  31. పూరణ ను చూడుడు.దోషములు తెల్పు డు.
    పూరణలు సలుపుట పూర్ణ మ తి కిని వ
    ర ర మ నీ య జ్ఞాన వపు ష విద్య
    ధీర సూరి రచన ధీ బల బాల వ్యా
    కరణ మేల కావ్య క ర ణ మునకు

    రిప్లయితొలగించండి
  32. రమ్యమైన పలుకు రసములొలుకురీతి
    కావ్యమందు గూర్చ శ్రావ్యముగను
    మానసోల్లసితము మంగళప్రద మన్య
    కరణమేల కావ్యకరణమునకు?

    రిప్లయితొలగించండి
  33. పెద్దలు కా మేశ్వర రావు గారికి నమస్కారములు.పూరణ ను చూసి లోప మును తె ల్ప ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ గారు బాగుంది మీ ప్రయత్నము.
      రెండవ పాదములో ర - వ లకు యతి చెల్లదు.
      రమణీయ జ్ఞాన లో య గురువు. గణ దోషము.
      “బాలవ్యాకరణ”.. లో ల గురువై గణ దోషము.
      వపుష అనడము సాధువు కాదు. వపోవిద్యా సాధువు.
      విద్యా ధీర అనడము సాధువు.
      రమణీయ ముద్రణ దోషము.
      వ్యాకరణ మవసరమనియా కాదనియా మీ భావము?

      తొలగించండి
    2. పూజ్యులు కామేశ్వర రావు గారికి మనవి.
      సవ రించిన పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు.

      పూరణలు సలుపుట పూ ర్ణ మతికిని వ
      ర రమణీయ భా వ రమ్య విద్య
      కర్ణ హేయ శబ్ద కర్కశ నల్పాను
      కరణ మేల కావ్య కరణము నకు
      కార్యాలయ పు పనిలో నిమగ్నమై ఉన్నా ను. తొందర గా సవరించిన పూరణ పంప లేకపోయినాను.నమస్సులు.

      తొలగించండి
    3. సవరించిన పూరణ భావము బాగుంది శబ్ద ప్రయోగములు బాగున్నవి.
      అయితే “కర్కశన్” అనరాదు. “కర్కశమునన్” అనవలసి యుండును.

      తొలగించండి
    4. ధన్యవాదములు. మీ అమూల్యమైన సలహాలు ,సూచనలు గుర్తుంచుకొని త దు ప రి సమస్యా పూరణ లు చేయుదును.
      నమస్సులు.

      తొలగించండి
    5. “కర్కశత్వాల్పాను / కరణ” అనండి సరిపోతుంది.

      తొలగించండి
  34. రిప్లయిలు
    1. కవిత తస్కరించ కడు హేయమగుచుండు!
      చిత్తమందు కలుగు చింతల గొని
      ప్రజల హితవు కోరి వ్రాయ నెంచక నను
      కరణమేల కావ్య కరణమునకు!

      తొలగించండి
  35. రాజకీయ రచయిత ఉత్చాహం
    పనికిరాని రచన జేసిపట్టుబట్టి యచ్చుకున్
    ఘనతగ భహుకరణ మేల?కావ్యకరణమునకు తా
    ధనము ఖర్చు జేసె నంట|దాతగాదు జూడగా
    మనుగ డందు నాయకుండు మర్మ మెరిగిజేయుటె| {కరణం=వ్యాపారం}

    రిప్లయితొలగించండి
  36. డా.పిట్టా
    వేద,శాస్త్ర,రీతి విత్తపు బొత్తముల్
    వస్తు మార్పున గొనవచ్చు రాజ్య
    మన్న బ్రిటిషు వారి మమతను గాంచరె
    కరణమేల కావ్య కరణమునకు?
    "We are ready to give up our kingdom if you are ready to surrender your whole libraries to us"..Once the Britishers said so.

    రిప్లయితొలగించండి