1, అక్టోబర్ 2017, ఆదివారం

నా చార్ ధామ్ యాత్ర

          ఇంతకాలం 'చార్ ధామ్ యాత్ర' నాకొక తీరని కల! నా ఆర్థిక పరిస్థితుల కారణంగా జీవితంలో ఈ యాత్ర చేస్తానని కలలో కూడా ఊహించలేదు. కాని ఆ కోరిక తీరుతున్నది. 
          మన బ్లాగు మిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారి సౌజన్యంతో యాత్రకు బయలుదేరుతున్నాను. వారు ఆ 'టూర్స్ అండ్ ట్రావెల్స్' వారితో ఏం మాట్లాడారో, ఎంత ఇచ్చారో తెలియదు. (ఈ యాత్ర పాకేజీ ₹24000). నాతో మాత్రం "వాళ్ళు నాకు తెలిసినవాళ్ళు. ప్రతి ట్రిప్పులో ఒకరిని ఫ్రీగా తీసుకువెళ్తుంటారు. ఈసారి మిమ్మల్ని తీసుకువెళ్ళమని సూచించాను" అన్నారు. 
          గతంలో మేం దంపతులం కాశీ, రామేశ్వర యాత్రలు కూడా వారి సౌహార్దం వల్లనే సాధ్యమయ్యాయి. భగంతుడు వారికి ఆయురారోగ్యైశ్వర్యాలను ప్రసాదించు గాక!
          రేపే నా ప్రయాణం. ఆ ఏర్పాట్లలో ఉన్నాను. 18వ తేదీన తిరిగి నా నెలవు చేరుకుంటాను. నిరంతర ప్రయాణం వల్ల బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పటిదాకా రోజుకొక సమస్య వచ్చే విధంగా షెడ్యూల్ చేశాను. మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

23 కామెంట్‌లు:

 1. మీ యాత్ర సుఖవంంతము ఫలవంంతంం కావలెనని భగవంంతున్ని ప్రార్థిస్తున్నాను గురువుగారు.

  రిప్లయితొలగించు
 2. మీ యాత్ర సుఖవంంతము ఫలవంంతంం కావలెనని భగవంంతున్ని ప్రార్థిస్తున్నాను గురువుగారు.

  రిప్లయితొలగించు
 3. నమస్కారములు
  మా తమ్ముడూ మరదలు చార్ ధాం యాత్రకు వెడుతున్నందుకు చాలా అనందం గాఉంది. మీ యాత్రదిగ్విజయంగా కొనసాగాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించి అక్క
  మన సోదరులు శ్రీ చంద్రమౌళిగారికి ధన్య వాదములు + శుభాశీస్సులు

  రిప్లయితొలగించు
 4. గురువు గారికి శుభకాంక్షలు.చార్ దాం యాత్ర దిగ్విజయంగా పూ ర్తీ చేయాలని మనసారా భగవo తున్ని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించు
 5. గురువర్యులకునమస్సులు. యాత్రదిగ్విజయంగా పూర్తికావాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించు
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారు సౌ హా రద్ర త కు
  మరియు వారి వదాన్యత కు ధన్య వాదములు.

  రిప్లయితొలగించు
 7. చారుధామ యాత్ర సఫలమగుటకును
  సేమముగనుగృహము చేరుటకును
  వలయు శక్తియుక్తు లలవోకగామీకు
  కలుగు గాత! శివుని కరుణ వలన

  రిప్లయితొలగించు
 8. మీ ప్రయాణం నిరాటంకంగా ఆనందంగా సాగాలని కోరుతూ శుభాకాంక్షలు

  రిప్లయితొలగించు
 9. మీ ప్రయాణం నిరాటంకంగా ఆనందంగా సాగాలని కోరుతూ శుభాకాంక్షలు

  రిప్లయితొలగించు
 10. పరస్పర గుణదోష అంటే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.మీరే ఒకరిని సూచించండి

  రిప్లయితొలగించు
 11. ఇంకొకసారి ఎప్పడూ ఒక్కరే వెళ్శకండి.అమ్మగారిని తీసుకుని వెళ్ళండి. మేమందరం సహకరిస్తాం.

  రిప్లయితొలగించు
 12. ఇంకొకసారి ఎప్పడూ ఒక్కరే వెళ్శకండి.అమ్మగారిని తీసుకుని వెళ్ళండి. మేమందరం సహకరిస్తాం.

  రిప్లయితొలగించు
 13. మాస్టరుగారూ! మీ తీర్థ యాత్ర సుఖంగా సాగి భగత్కృప తోడుగా దిగ్విజయంగా తిరిగిరావాలని మనసారా కోరుకొనుచున్నాను. సూర్యనారాయణ గారికి అభినందనలు.

  రిప్లయితొలగించు
 14. భక్తుల సేవ భగవత్సేవ కన్నమిన్న! మీ యాత్ర ఘటింప జేయుచున్న సూర్యనారాయణమూర్తి గారికి భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యాల నొసగాలని ప్రార్ధిస్తున్నాము!🙏🙏🙏🙏🙏🙏

  రిప్లయితొలగించు
 15. మీ చార్‍ధామ్ యాత్ర ఆనందదాయకంగా, మనోఽభీష్టసిద్ధిదాయకంగా, ఆయురారోగ్యఫలదాయకంగా నెరవేరాలని ఆ భగవంతుడిని మనఃపూర్వకంగా వేడుకొంటున్నాను. విజయోఽస్తు! శుభాభినందనలతో...
  మీ మిత్రుఁడు...
  గుండు మధుసూదన్

  రిప్లయితొలగించు
 16. గురుదేవులకు యాత్ర సమస్తము నిర్విఘ్నమై శుభకరమై సుఖప్రదమై దైవ సుదర్శన సంప్రాప్తంబై మనోరంజకమై సత్ఫలప్రదమై సంపూర్ణంబై వర్తిల్ల శ్రీమన్నారాయణుం డనుగ్రహించు గాక!!!

  రిప్లయితొలగించు
 17. మీ యాత్ర సుఖప్రదంగా సాగాలని కోరుకుంటున్నాను!

  రిప్లయితొలగించు
 18. గురువుగారూ నమస్సులు. మీరు సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొంది సుఖసంతోషాలతో మీ ప్రణాళిక ననుసరించి సత్వరమే తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాము.

  రిప్లయితొలగించు
 19. చారుధామ యాత్ర చక్కగా నొనరించి
  మరలి రండు తమరు మానుగాను
  స్వామి యాశిసులను వాసిగా నందుచు
  కన్నులార యన్ని కాంచి రండు.

  రిప్లయితొలగించు
 20. గురుదేవులక యాత్ర సునాయాసంగా సాగాలని శుభాకాంక్షలు. చంద్రమౌళి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు

  రిప్లయితొలగించు
 21. గురుదేవులక యాత్ర సునాయాసంగా సాగాలని శుభాకాంక్షలు. చంద్రమౌళి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు

  రిప్లయితొలగించు