17, అక్టోబర్ 2017, మంగళవారం

సమస్య - 2495 (కాంతను సేవించువారె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాంతను సేవించువారె ఘనులు జనహితుల్"
(లేదా...)
"కాంతాసేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్"
(ఆకాశవాణి వారి సమస్య)

48 కామెంట్‌లు: 1. ఎంత చదివినన్నరుడా !
  కొంతైనను యత్నము సరి గొనుచున్ పద్యం
  బింతై న గూర్చి కవితా
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. చింతించేరిని కామియె ?
  ఎంతో మేలగు మధువని యెవరందురయా ?
  స్వాంతము గొప్పగు వారలు
  "కాంతను ; సేవించువారె ; ఘనులు,జనహితుల్"

  రిప్లయితొలగించండి
 3. అంతామిథ్యని యాత్మశోధనముకై యాత్మీయులన్ వీడి, తా
  నంతో నింతయొ కాదటంచు జగమే నాదంచు భావించి, యే
  కాంతన్ వింతగ చూడకుండ నిరతం కామేశ్వరాలింగితా
  కాంతా సేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్

  ఇంకొక పూరణ:
  సాధారణంగా విధవలు కనిపిస్తే కనీసం పలకరించకుండా వెళ్ళిపోతున్నారు, అలా కాక, అట్టి వారికి సైతం మర్యాద ఇవ్వగల వ్యక్తిత్వం ఉన్నవారే ఘనులు, వారి వల్లే లోక కళ్యాణం కూడా అని నా భావన..

  అంతాచింతగ తోచుచు
  వింతగు చూపులు పొడవగ వీధిన వెళ్ళే
  చింతాక్రాంతగు విధవా
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్ !

  రిప్లయితొలగించండి
 4. సాంతము దాసోహ మనుచుప్ర
  శాంతము కోరగ సతిగని చాలన జేయన్
  వింతగు ప్రేమను పొగడుచు
  కాంతను సేవించు వారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి
 5. అంతయు జగతియు భ్రాంతియె
  చింతింపగ వలయు హరిని చిన్మయు ననుచున్
  స్వాంతమున దలచుచు విడుపు
  "కాంతను సేవించువారె ఘనులు,జనహితుల్"

  రిప్లయితొలగించండి
 6. శాంతము బూనుచు,సుఖ మా
  సాంతము వీడుచు,స్థిరమతి సద్గురుకరుణన్
  ధ్వాంతము వెల్వడి మోక్షపు
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్.

  రిప్లయితొలగించండి


 7. కొంతైనన్ యతనమ్ము గాంచి మృగముల్ క్షోణీజముల్లా మహా
  కాంతాసేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్!
  శాంతాకారముగా జిలేబి మనుజుల్, సర్వంసహాలోకము
  న్నెంతైనన్ పరిరక్షజేయ దగునౌ నేర్పైన రీతిన్ సదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. ఎంతయు సంతస మందుచు
  స్వాంతమ్మున నిష్ఠబూని శ్రద్ధాభక్తిన్
  కంతుద్వేషికి ప్రియతమ
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్.

  రిప్లయితొలగించండి
 9. డా.పిట్టా
  "స్వాంతస్సుఖాయ" యని వే
  భ్రాంతుల జగమునబ్రశాంత భావ విధాతల్
  క్రాంతస్రష్టలు వాణీ
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి
 10. ఎంతటి సరసుండ్రోగన
  కాంతను సేవించు వారె, ఘనులు జనహితుల్
  చింతింపక స్వార్థమ్మును
  కొంతైననుపరి హితమ్ము గూర్చెడు వారే.


  కొంతైనను స్వార్థమనక
  పంతముతో దీనరక్ష పరమావధిగా
  చింతించుచు నధికారపు
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి
 11. ఎంతటి సరసుండ్రోగన
  కాంతను సేవించు వారె, ఘనులు జనహితుల్
  చింతింపక స్వార్థమ్మును
  కొంతైననుపరి హితమ్ము గూర్చెడు వారే.


  కొంతైనను స్వార్థమనక
  పంతముతో దీనరక్ష పరమావధిగా
  చింతించుచు నధికారపు
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి
 12. డా.పిట్టా
  డాంతుల్ శాంతు లనంత విక్రములునై డాసేరు స్త్రీ పొంతకున్
  క్రాంతుల్యుద్యమ జ్వాలలున్ పెనగొనన్ గాయంబనిత్యంబనన్
  శ్రాంతిన్ బోనడవన్ సమర్థతగనన్ సాక్షాత్తు శ్రీమాతకౌ
  కాంతా సేవలు జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్!

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టా
  "జ్వాలలున్ బెనగొనన్"రావలసి యుండెను.ద.చే. సవరించి చదువగలరు.

  రిప్లయితొలగించండి
 14. స్వాంతoబoదున దైవ చింతన ల తో స్వార్ధ oబువర్జిoచియు న్
  శాంతం బు న్ కరుణాది సత్వ గుణ ము ల్ సౌ భా గ్యమై యోప్పగా
  ధ్వాoతoబoదున దివ్య భావ నల తో ప్రార్థించుచు న్ మోక్ష పున్
  కాంతా సేవలు చే యు వా ర లె జగత్ కళ్యాణ సం ధా య కు ల్

  రిప్లయితొలగించండి

 15. సంతసము తోడ నిల శ్రీ
  కాంతుని స్మరణమ్ము లోనె కాలమువగడుపన్
  స్వాంతన మందుచు నక్షర
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్.
  అక్షరకాంత=మోక్షకాంత

  చింతింపగ పనిలేదిక
  శాంతము తోడను సతతము సర్వేశునిలన్
  పంతంబును బూని ముగితి
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్.
  ముగితి=ముక్తి

  సుంతైనను యోచింపక
  శాంతము తోడను జనములు జగతిన నెపుడే
  కాంతము నందున నమృత
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్.
  అమృత=మోక్షము.

  రిప్లయితొలగించండి
 16. కాంతా!వినుమా కవితా
  కాతనుసేవించువారెఘనులుజనహితుల్
  గాంతలుబెక్కురుగలిగిన
  కొంతైననుసాటియగునె?కువలయమందున్

  రిప్లయితొలగించండి
 17. 2వపాదము మొదట
  కాతను బదులు కాంతను
  అనిచదువప్రార్ధన

  రిప్లయితొలగించండి
 18. ఎంతగనో స్తోత్రమ్ముల
  చింతాక్రాంతులకు భువిని సేమమ్మిడగన్
  శాంతమ్ముగన్ మహేశ్వరు
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి
 19. కొంతైనను సాహిత్యము
  సంతసమొసఁగుచు సమాజ సంక్షేమమ్మున్
  చింతించుచు వ్రాయ నలువ
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి
 20. పంతమున భర్త వీడెనె ?
  చెంతనె హృదయమ్మునందు స్థిరవాసమెగా!
  చింతలఁ దీర్చఁ బ్రజకు శ్రీ
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి
 21. పంతము నిరక్షరాస్యత
  నంతము చేయగఁ దలంచి హరుసము తోడన్
  సంతత జలజాసను ప్రియ
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి
 22. పంతంబుల్ విడనాడి -బంధుజనులాపద్బాంధవుల్ స్నేహితుల్-
  చింతంపన్ పనిలేదులేదనుచు నిస్సీ!మాయకున్ లోనుగా.
  భ్రాంతిన్జెందగనేల?నీశ్వరుని దివ్య ప్రాభవోల్లాసు,శ్రీ
  కాంతాసేవలఁజేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్

  రిప్లయితొలగించండి
 23. సుంతయు స్వార్ధంబెంచక
  సంతత జీవన సఫలత సాధించంగన్
  చింతించగ నవని ప్రకృతి
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్!

  రిప్లయితొలగించండి
 24. చింతన్ వీడుచు నంతరంగమున నా శ్రీకంఠునిన్ దల్చి య
  శ్రాంతంబాత్మ వివేచనంబనుచు విశ్వాసంబునన్ నిల్చి యా
  ద్యంతంబంతయు మిథ్య గా నెఱిగి మాయన్ వీడుచున్ మోక్ష స
  త్కాంతాసేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్

  రిప్లయితొలగించండి
 25. సుంత యు వె రు వక చెడు గుల
  పంతము తో నె ది రించి తనదు వంత గు ధృతి తో
  నంత మొన ర్ప గ కవితా
  కాంత ను సేవించు వారె ఘనులు జన హితుల్

  రిప్లయితొలగించండి
 26. కాంతారమ్ముల మఱి భువ
  నాంతరముల నున్న నరుల కాకలి తీర్చన్
  సంతతము హర్షమున భూ
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్


  కాంతా జ్యోతినిఁ జేసె నక్షర సుసంఘాతేశ్వరిన్ బ్రహ్మయే
  కాంతా శ్రేష్ఠము నుంచె వక్షమున భూకాంతుండు విష్ణుండొగిన్
  కాంతారత్నము నుంచె నర్ధ ఘన సత్కాయమ్మునన్ శంభుఁడే
  కాంతాసేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రశస్తమైన పూరణలు ! కామేశ్వర రావు గారు! అభినందనలు! "శంకరాభరణం" బ్లాగు వారి అధ్వర్యములోనే నిర్వహింపబడ్తుతున్న WHATSAPP " సమస్యా పూరణ" లో మీరు పోస్ట్ చేయటం లేదు.చాలా మంది పాల్గొంటున్నారు. మీరు పాల్గొంటే అందరికీ ఉపయుక్తంగాను, మార్గదర్శకంగాను ఉంటుందని నా భావన.

   తొలగించండి
  2. అదే విధంగా FACEBOOK లో కూడా పాల్గొన మనవి!

   తొలగించండి
  3. జనార్దన రావు గారు ధన్యవాదములు. మీ సూచన యభినందనీయము. కారణాంతరముల వలన ప్రస్తుతము శంకరాభరణ పూరణలకు పరిమితుఁడను.

   తొలగించండి
  4. రెండు పూరణలు బాగున్నాయండి. నమస్సులు.

   తొలగించండి
 27. సంతత భవభయహారిణి
  కంతుని ద్వే్షించు శివుని కాంతామణి యా
  ద్యంతము పావని గంగా
  కాంతను సేవించు వారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి
 28. ఎంతటి చదువు చదివినను
  పంతము తోడన్ హలమును బట్టి కమతమున్
  సంతస ముగజేసి మహా
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్"

  రిప్లయితొలగించండి
 29. చింతాకంతయు చింత లేక మదిలో శ్రీకాంతునే దల్చుచు
  న్సుంతైనన్భవ బంధనాల బడకన్ శుష్కాల్నివారించుచు
  న్నంతా శ్రీహరి లీలగానెరిగియున్నాదివ్య యాధ్యాత్మికా
  కాంతా సేవల జేయువారలె జగత్కల్యాణ సంధాయకుల్.

  రిప్లయితొలగించండి
 30. సంతత వ్యవసాయమున ని
  తాంత పరిశ్రమము జేసి ధాన్యపు రాశుల్
  సంతన జేయంగ మహా
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్
  సంతనజేయు=సమకూర్చు, మహాకాంత = భూమాత

  రిప్లయితొలగించండి
 31. ఎంతటి వారైననుగన?
  అంతట శ్రీలక్ష్మి,వాణి,అంబగు శక్తిన్
  చింతించుచుభక్తిగ శ్రీ
  కాంతను సేవించు వారె ఘనులు,జనహితుల్|
  కాంతా కూర్పులు బ్రహ్మ నందుకొనిలోకాలన్ని సృష్టించుగా|
  కాంతే బేర్చిన లక్ష్మితో హరియు|లౌఖ్యంబందు జీవించుటౌ|
  కాంతే నర్ధముగాగ|యీశ్వరుడు నైఖ్యంబయ్యు బాసిల్లుచున్
  కాంతా సేవలు జేయు వారలె జగత్ కళ్యాణ సంధాయకుల్|  రిప్లయితొలగించండి
 32. గురువు గారి కి నమస్సులు.పెద్దలు కామేశ్వర రావుగారు నా పూరణ లోని దోషములు సవరింప ప్రార్థన.
  సంత స మి చ్చు ను ధ్యానము
  కాంతిని తెచ్చును న ర కుని ఖo డ న దినమున్
  శాంతిని బొందురు మురళీ
  కాంతను సేవించు వారె ఘనులు జనహితుల్.
  వo ద న ము లు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువు గారు ఆ న్వ య లో ప ము.
   శాంతి యుతుడు నవ మురళీ
   అని మార్చ డ మైనది.
   పద్యము లో లోపాలు ఉన్నాయని నా భా వ న.
   సవరణ చేయుదరని ప్రార్థన.

   తొలగించండి
  2. గురుతుల్యులు కామేస్వర రావు గారికి ప్రణామములు నా పద్యములలో తప్పులు సవరించటము లేదు. మీ కినుకకు కారణము అవగతము కావటము లేదు స్వామీ

   తొలగించండి
 33. చింతాక్రాంతుని నిల్లుఁ జేరఁ బతినిన్ సేవించి షట్కర్మలన్
  సంతోషమ్మున వంశగౌరవములున్ సత్కీర్తిఁ బొందంగఁ దా
  సంతానంబును దీర్చి దిద్దు సరళిన్ సాయమ్ము నందించఁగన్
  కాంతాసేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్.

  రిప్లయితొలగించండి
 34. స్వాంతమ్మందున విద్యపైన కడు నాప్యాయమ్ము సంధిల్లగన్
  పంతమ్మున్ గొని నిత్యసాధనముతో వర్తిల్లుచున్ భక్తి నా
  సాంతమ్మున్ ధృతితో పితామహుడు, విశ్వస్రష్ట భార్యామణీ
  కాంతాసేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్

  రిప్లయితొలగించండి
 35. స్వాంతము జనులకు శుభమన
  కాంతుఁడు హాలాహలమ్ము గైకొనెదననన్
  సాంతము తలయూచు శివుని
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి
 36. హొంతకారి యగు గాలుల
  నంతమ్మొనరించి స్వచ్ఛ మగు జీవనమున్
  సొంతము జేయంగ ప్రకృతి
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్

  రిప్లయితొలగించండి


 37. సంతోషముతో వ్రాయగ
  సంతసమదికల్గు మదికి సతతము భువిలో
  సంతతము విడక వాణీ
  కాంతను సేవించువారె ఘనులు జనహితుల్"*

  రిప్లయితొలగించండి
 38. కాంతారమ్మున మెండు రోసి కపినిన్ గాలింప నర్థించెడిన్...
  శాంతమ్మంతయు కోలుపోయి సరిగా శారీరమర్థంబిడున్...
  చింతల్ దీర్చగ పాదసేవ నిడుచున్ శృంగార తల్పమ్ముపై
  కాంతాసేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్ 😊

  రిప్లయితొలగించండి
 39. చింతల్ వంతలు జేయకుండ కొనుచున్ శృంగార రత్నమ్ములన్
  వింతౌ రీతిని జూపుచుండు నభమున్ విశ్వంపు దృశ్యమ్ములన్
  గొంతెమ్మౌచును తీర్చి కోర్కెలనిలన్ గొంతెత్తి మాట్లాడకే
  కాంతాసేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్

  రిప్లయితొలగించండి