శైల చిత్ర బంధ తేటగీతి
శైల చిత్ర బంధ తేటగీతి
వత్సరమ్ము వేచి
లపక వాంఛ తోడ
లక్ష్మి పూజను చేయును లలన లెల్ల,
దేహి యనినంత నిచ్చును దీవెనలు
వి
ధాత జనని మురిపెముగన్ తల్లి
పూని
కి యని తలచుచు,
పున్నమికి గత కాల
మందు వంక లేని భృగు వార మందు పూజ
చేయమని ముదముగ
బల్కె సిరి పడతుక
చారు
మతికి స్వప్నమున ,విషయము లెల్ల
పతికి నెల్లర కును దెల్ప పమ్మె మోద
ము ,
నలివేణు లెల్లరు వేచి ముఖ్య మైన
దినము
నేతెంచగ జలనిధి సుతను
కడు
భక్తి తోడ
పూజలు జేయ, పద్మ వాస
కడు సిరుల నిడెను
గద నపుడు, సని నిడ
మరుని తల్లి దురదురమున్
సిరుల నిడును
(పమ్ము= పొందు , లపక =
ధనము , సని = పూజ,
దురదరము = శీఘ్రము)
బంధ
కవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్