4, ఆగస్టు 2018, శనివారం

సమస్య - 2752 (వాలినిఁ బార్థుండు...)

కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్"
(లేదా...)
"వాలినిఁ జంపె యుద్ధమునఁ బార్థుఁడు కంసుఁడు గాంచి మెచ్చఁగన్"

58 కామెంట్‌లు:

 1. మేలౌ రాముడు గూల్చెను
  వాలినిఁ ;బార్థుండు గూల్చె బవరమునందున్
  కాలము మూడగ కర్ణుని
  కోలాహలమున భళిభళి ఘోరపు రీతిన్

  రిప్లయితొలగించండి
 2. కోలమిడి చిదిమె రాముడు
  వాలినిఁ ,బార్థుండు గూల్చె బవరమునందున్"
  పాలసుడు, నీతి రహితుడు
  భాలు సుతుడు కర్ణుని కడు బామము తోడన్

  రిప్లయితొలగించండి
 3. శాలిని! వధించె రాముడు
  వాలిని, బార్థుండు గూల్చె బవరము నందున్
  నేలను రథమది కృంగిన
  వేళన రాధేయుని యట వెన్నుడె యొప్పన్.

  రిప్లయితొలగించండి


 4. ఆలము నగూల్చె రాముడు
  వాలినిఁ, బార్థుండు గూల్చె బవరమునందున్
  హేలగ సైంధవుడాదిగ
  వేలకొలది సైనికులను వెన్నుని దయతో

  రిప్లయితొలగించండి
 5. వాలిని గూల్చెను రాముడు
  వాలి సహోదరుని బ్రోచి పాలించమనెన్
  వాలించెద నీ వ్యాఖ్యను
  *"వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్"*

  రిప్లయితొలగించండి
 6. లీలగ రాముఁడుఁజంపెను?
  తాళక సైంధవునిఁబట్టి తరుముచు నురిమెన్
  పాలనఁజేయుచు ధర్మము?
  వాలిని-పార్థుండుఁగూల్చె బవరమునందున్

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  వాలివధ... సైంధవవధ... కంసవధ... (నాటకత్రయము)

  గ్రామప్రజలలో వైరభావముతో ఆయా నాటకాలలోని పాత్రలు వారి వారి వర్గాలకు ప్రతీకలుగా నటిస్తున్నారు.. పగవాడు చనిపోతే.. ఆనందమే కదా కంసపాత్రధారికి..

  కాలము మారె , జాతులని గ్రామములున్ విడిపోయి వేరుగా
  హేలగ నాటకత్రయము నేర్పడజేయగ కూడలిన్ , గనన్
  కోలను క్రీడి సైంధవుని గూల్చగనెంచ., శరమ్ము తప్పి , య...
  వ్వాలినిఁ జంపె యుద్ధమునఁ బార్థుఁడు , కంసుఁడు గాంచి మెచ్చఁగన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 8. బాలుండు భయము నందుచు
  కాలుని దలపించు గురుని కాఠిన్యతకున్
  కేలెత్తి పలికె తడబడి
  వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్

  రిప్లయితొలగించండి

 9. సందర్భము - కంది వారి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్రయాణము లో కడప పరిసరాలలో కోతుల దర్శనం ,
  అర్జునుడి విలువిద్యానైపుణ్యము కలగలిపి విద్యుల్లత లా కైపదము స్ఫురించుట :)


  రైలున కడపను దాటుచు
  గోలాంగూలముల చూడ కుప్పించుచు,రం
  గీలా సమస్య మెరిసెన్
  "వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్"

  జిలేబి


  రిప్లయితొలగించండి
 10. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  వాలినిఁ బార్థుండు గూల్చె
  బవరమునందున్

  సందర్భము: సమస్యను రెండవ పాదంలోకి తీసుకోకుండానే మరొకరకమైన పూరణము.
  ==============================
  "లీలగ నొకటవ వా డా
  వాలిని.. రెండవ యతనిని పార్థుడు గూల్చెన్
  మే" లన రాముడు కర్ణుని
  వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్

  రెండవ పూరణము..

  సందర్భము: సమస్యను రెండవ పాదంలోకి తీసుకోకుండానే మరొకరకమైన పూరణము ఏ పేరూ రాకుండగా...
  హేల(న్)=తిరస్కారము(గా)
  ==============================
  లీలఁ బ్రథముడు తృతీయుని
  హేల ద్వితీయుని చతుర్థుడే కూల్చె ననన్
  మేలుగ రాముడు కర్ణుని
  వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  4-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఇవ్వాళ సత్య నారాయణ గారు మేథా మే ట్రిక్కు చేసి నారు :)


   జిలేబి

   తొలగించండి
 11. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ========================
  వాలిని జంపె యుద్దమున బార్థుడు
  కంసుడు గాంచి మెచ్చగన్
  ========================
  రామాయణ కాలపు వాలిని భారత
  కాలం నాటి అర్జునుడు చంపగా,
  కంసుడు తాను మెచ్చుకొనెను అని
  చెప్పుటలో ఏ ఒక్కటి మరొక దానితో
  అతకక పోవటమే ఇందులోని సమస్య
  ==========================
  సమస్యా పూరణము - 216
  ====================

  నిత్య పారాయణమటుంచు
  పాత్రల పేర్లు తెలియగ నెంచు
  రామాయణ భారతములంచు
  నైతిక విలువలు నీవుగ గాంచు
  పాశ్చాత్యీకరణ ప్రభావమది
  ప్రాచ్యముగ వెలిబుచ్చగన్
  వాలిని జంపె యుద్దమున బార్థుడు
  కంసుడు గాంచి మెచ్చగన్

  ====##$##====

  రామాయణ మహాభారతములను
  నిత్యము పారాయణము చేయక పోయినా,
  వాటిలోని పాత్రలేమిటో తెలుసుకునే ప్రయ
  త్నమైనా చేయవోయి. రామాయణ మహా
  భారతముల అవలోకనమున నైతిక విలువ
  లు నీలో జాగృతమౌతావోయి.

  పాశ్చాత్యీకరణ ( Westernization )
  (విదేశీ ) ప్రభావమున గతులు తప్పిన
  ప్రాచ్యము (స్వదేశము) రామాయణ,
  మహాభారతములను కూడా తెలియలేకు
  న్నది, వాలిని యుద్దమున అర్జునుడు
  చంపినాడు కంసుడు మెచ్చుకొనగా యని
  అజ్ఞానమున వదరుచున్నది.

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ------ ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. అరకొర చదువుల కాలము :)


   జాలపు చదువుల కాలము
   లో లలన!తెలియవు సూవె లోతైన కథల్
   లీలగ తోచగ చెప్పిరి
   "వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్"


   జిలేబి

   తొలగించండి
 12. *"వాలినిఁ జంపె యుద్ధమునఁ బార్థుఁడు కంసుఁడు గాంచి మెచ్చఁగన్"*
  యేల సమస్యనీగతిని యేరుచు కోరుచు నిచ్చినారు ధీ
  శాలని మేడసానిని విచారము చేయుడు కాణిపాక దే
  వాలయమందు నేడట జవాబు లభించును శీఘ్రమే దొరా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మేడసాని వారికిచ్చిన లేక ఇవ్వ బోయె సమస్యే నేమో యిది కొంప దీసి :)


   జిలేబి

   తొలగించండి
 13. డాఎన్.వి.ఎన్.చారి
  ఏలగతమరాజ్యంబును
  మేలగు పున్నమి వెలుంగు మెండుగ నిండన్
  తాలిమితోగెల్చె "సినీ
  వాలిని" బార్థుండు గూల్చె బవరము నందున్

  రిప్లయితొలగించండి
 14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2752
  సమస్య :: వాలిని జంపె యుద్ధమునఁ బార్థుడు కంసుడు గాంచి మెచ్చగన్.
  వాలిని అర్జునుడు చంపినాడు. దానిని చూచి కంసుడు మెచ్చుకొన్నాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: ఏ కాలంలోనైనా సరే చిన్నపిల్లలు నాటకాలు వేయడంలో పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోవడంలేదు. అలా కొంతమంది బాలురు రామాయణాన్ని రామలీల పేర ప్రదర్శిస్తూ ఉంటే పార్థుడు చూచినాడు. మరొకచోట అదే రామలీల నాటకాన్ని కంసుడు చూచినాడు. ఆ నాటకంలో *వాలివధ* అనే ఘట్టంలో శ్రీరాముడు వాలిని చంపడాన్ని పార్థుడు మెచ్చుకొన్నాడు. కంసుడు కూడా మెచ్చుకొన్నాడు అని విశదీకరించే సందర్భం.

  బాలురు నాటకమ్ములను బాగుగ వేయుచు నుండ, వాటిలో
  లీలగ రామలీలలను ప్రీతిగ బార్థుడు జూచె, కంసుడున్
  మేలని జూచె, వాలివధ మెప్పును బొందెను; రామచంద్రు డా
  ‘’వాలిని జంపె యుద్ధమునఁ బార్థుడు కంసుడు గాంచి మెచ్చగన్.’’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (4-8-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. కోటవారిది "పద్యమో పాడో" కానే కాదు సుమా !

   అద్భుత మైన పూరణ ! అవధానులవధానులే జిలేబులు జిలేబులే !


   జిలేబి

   తొలగించండి
  2. సహృదయులు జిలేబి గారికి ధన్యవాదాలు

   తొలగించండి
 15. కోలున రాముడు జంపె ను
  వాలిని ; పార్థు oడు గూల్ చె బ వ ర ము నందు న్
  జాలిని వీడి యు శర మున
  బేలగరథ చక్ర మేత్తు వీరు ని కర్ణున్

  రిప్లయితొలగించండి
 16. మిత్రులందఱకు నమస్సులు!

  తాలక రామభారతకథల్ బెరయించి శకారుఁ డుర్విభృ
  చ్ఛ్యాలకుఁ డందఱన్ మిగుల హాస్యముచేఁ దనియింప నిట్లనెన్
  "వాలినిఁ జంపె యుద్ధమునఁ బార్థుఁడు, కంసుఁడు గాంచి మెచ్చఁగన్;
  బాల రఘుండు పూతనకు వస్త్రము లిచ్చియు సత్కరించెరా!"

  రిప్లయితొలగించండి
 17. కూలిచె నేరిని రాముడె?;
  యాలము నందున నరులనె యవలీలగనే;
  లీలగ జెలగెను భీముడె;
  "వాలినిఁ ; బార్థుండు గూల్చె; బవరమునందున్"

  రిప్లయితొలగించండి
 18. డా.పిట్టా సత్యనారాయణ
  'గాలిబు' గీతము మెచ్చెను
  హాలికుడౌ 'పార్థు'డొకడు ఆంధ్రపు కవియై
  మేలిమి ఛందస్సున "క
  వ్వాలి" ని బార్థుండు గూల్చె బవరమునందున్!

  రిప్లయితొలగించండి
 19. డా.పిట్టా సత్యనారాయణ
  కాలపు రేఖలన్నియును కానబడున్ నభమందు;కాంతికౌ
  మేలిమి వేగమున్ గనిన; మేటి యుపగ్రహరాశి దిర్గగన్
  ఏలకొ గడబిడన్ గలుగ నేర్పడ రక్ష సభాంతరంబునన్
  వాలిని జంపె యుద్ధమున బార్థుడు కంసుడు గాంచి మెచ్చగన్

  రిప్లయితొలగించండి

 20. సందర్భము - కంది వారు వెంకటాద్రి యెక్స్ప్రెస్ ప్రయాణములో ట్రైను డిలే కారణంగా చికాకు తో వున్నారు. ఇప్పుడే పాకాల స్టేషను దాటుచున్నారు. ఆ సందర్భములో చికాకు వల్ల పలువిధమైన‌ విషయములు కలగాపులగమై ఒక అద్భుత సమస్య తట్టినది అదెట్లన


  జాలము వీడి పోయెదను సత్పుర విఘ్నవినాయకున్ గనన్
  గోల జిలేబి, శాస్త్రులును గూర్తుర దెట్లు సమస్య నేడు కై
  పాలల కత్తిరింపగ సభాస్థలి లో గమనింతు నేను! పా
  కాలను దాటినాను గనుడయ్య సమస్యయు తట్టె నిప్పుడే!
  వాలినిఁ జంపె యుద్ధమునఁ బార్థుఁడు కంసుఁడు గాంచి మెచ్చఁగన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  వాలినిఁ బార్థుండు గూల్చె
  బవరమునందున్

  సందర్భము: నేటి ఇంగ్లీష్ మీడియం
  విద్యార్థుల పురాణ పరిజ్ఞానం...
  ==============================
  "హేలగఁ గర్ణుని రాముడు
  లీలగఁ గూల్చె" ననె నింగిలీషుఁ జదువు నా
  బాలుడు.. మరియొక డి ట్లనె..
  "వాలినిఁ బార్థుండు గూల్చె బవరమునందున్"

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  4-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 22. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఆ లక్ష్మీపతి జంపెను
  వాలిని; బార్థుండు గూల్చె బవరమునందున్
  బేలతనమ్మున పెనగొని
  వ్రాలిన రాధేయుడాది వచరుల నెల్లన్

  రిప్లయితొలగించండి
 23. డా.పిట్టా సత్యనారాయణ
  ఆర్యా, క్షమాపణలతో నిన్నటి పూరణలు
  చలమది మానరే చెలులు సాధ్వికి బువ్వులు మర్చిపోవుటల్
  ఇలనిక లేవు;యాంగ్లమును యిప్పుడె నేర్వగబూను మీ వరుల్
  అలిగిన వేళ నేమనగ నారయు బోధన ,శబ్దజాలముల్
  విలవిల లాడె సంస్కృతియు వీగెను; నాటి యుపాయమెట్టులీ
  "తలగడ మంత్ర మింతులకు దప్పక మేలొనరించు నెచ్చెలీ!
  తలగడ మంత్ర వంతులను తప్పక జేర్చరె వైద్య శాలన్!!
  (ఆంగ్ల ప్రొ॥గా నీ సన్నివేశమును హాస్యం కోసం ఉపయోగించినాను.Communication skills నేర్వకుంటే భిన్న సం స్కృతుల మనుగడలు మన జాలవు.Psychiostic treatment కు దారి తీస్తాయి సుమా, జాగ్రత, జాగ్రత!)

  రిప్లయితొలగించండి
 24. డా.పిట్టాసత్యనారాయణ
  అలిగన వేళనె కృష్ణుని
  పొలమేరల నుండి గనుట పుణ్యము గ్రోలన్
  కలమియె రుక్మిణి;సత్యకు
  తలగడ మంత్రమ్మె మేలు-తరణులకెపుడున్

  రిప్లయితొలగించండి
 25. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


  ( పురాణగ్రంథాలను బాగా చదివిన పేరిశాస్త్రికి బుర్ర

  చెడిపోయింది . అపుడిలా అన్నాడు . )  మేలిమి యైన పాండితిని , మించిన శ్రద్ధవహించి సర్వశా

  స్త్రాలఁ బురాణపుస్తకములన్ బఠియించిన పేరిశాస్త్రి గ

  గ్గోలు వడెన్ | జెడెన్ మెద | డగోచర వాక్కుల పల్కె నిట్టులన్ :--

  " వాలిని జంపె యుద్ధమున ‌ బార్థుడు కంసుడు గాంచి మెచ్చగ్ "

  రిప్లయితొలగించండి
 26. ఆలమునజంపెరాముడు
  వాలిని,బార్ధుండుగూల్చెబవరమునందు
  న్బాలసుడగునాకర్ణుని
  చాలినశరగణముతోడజనములు మెచ్చన్

  రిప్లయితొలగించండి

 27. ఆకాశ వాణి వచ్చే వారపు సమస్యా పూరణ :)

  గణనాయకు గళమునందు గరళము నిండెన్ !  ప్రణవము వెలువడె డమరుక
  మున, తనువున సగము చర్మముండ కొలువుగాం
  చెను శక్తికి మూలంబగు
  గణనాయకు గళమునందు గరళము నిండెన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 28. వాలి సుగ్రీవ ద్వంద్వ సమరములో రాముఁడు వాలిని జంపు సందర్భము:

  ఆలిని బాసిరి యిద్దఱు
  నా లలిత స్నేహ రతిని నల సుగ్రీవుం
  బాలన సేయ రఘువరుఁడు
  వాలినిఁ బార్థుండు గూల్చె బవరము నందున్


  కాలము దేశ సంస్ఠితులు గ్రమ్మఱ నింపుగ ధీరుఁడై మహీ
  లాలస బుద్ధి సన్నిహిత రాజ్య ధరాపతి యౌ విరోధినిన్
  లాలిత కాలనేమి మధురాపతి యొక్కఁడు, గొల్చి తా సినీ
  వాలినిఁ, జంపె యుద్ధమునఁ బార్థుఁడు, కంసుఁడు గాంచి మెచ్చఁగన్

  [సినీవాలి = పార్వతీ దేవి; పార్థుఁడు = మరియొక రాజు]

  రిప్లయితొలగించండి
 29. అవధాని వర్యులు శ్రీ కోట రాజశేఖరార్యులకు కృతజ్ఞతాభివందనాలతో...

  హైదరాబాదు ఎ, హైదరాబాదు బి, వివిధభారతి కేంద్రాల ద్వారా మూడు ప్రోగ్రాములు ఒకే సమయంలో ప్రసారం చేయగా ఆ శబ్ధ తరంగాలు మిళితమైతే ఇలా ఉంటుందని భావన!

  లీలగ మూడు కేంద్రములు లెస్సగ భారత రామ గాథలన్
  మాలగ నొక్క కాలమున మాన్యముగా ప్రసరింప జేయగా
  హేలగ నాకసమ్మునను నేర్పడుచున్ వినిపించె నిట్టులన్
  *"వాలినిఁ జంపె యుద్ధమునఁ బార్థుఁడు కంసుఁడు గాంచి మెచ్చఁగన్"*

  రిప్లయితొలగించండి
 30. బాబు గారికి నమస్సులు . చక్కని వినోదభరిత పూరణము !

  రిప్లయితొలగించండి
 31. గు రు మూ ర్తి ఆ చా రి


  గు రు వ ర్యు ల కు ప దా భి వం ద న ము లు • జ డ కం ద ము ల పు స్త‌ క ము

  పం పి నం దు కు ధ న్య వా ద ము లు •

  రిప్లయితొలగించండి
 32. నేలనె జంపెనురాముడు
  వాలిని!"బార్థుండు గూల్చెబవరమునందున్
  జాలియులేకను కర్ణుని
  మూలము కృష్ణుండుదెలుప?మోక్షము జేర్చెన్!

  రిప్లయితొలగించండి
 33. బాలచర్యుడు శక్తి కేలున దాల్చి యుద్ధము లోన కూల్చెను తారకాసు
  రుని, వలలుడు కీచకుని పట్టి చంపెను నర్తన శాలలోన, గహనమున
  సంచారమును జేయు సమయము లో రామ చంద్రుడు గురిచూసి చంపె నపుడు
  పత్రితో వాలిని , బార్థుండు గూల్చె బవరము నందున్ సైంధవ తలను తన
  శరము తోడ రవిని జూప చక్రి తనకు ,
  కందమును బట్టి చంపెను సుందరముగ
  పూసపాటి జిలేబి కై, సీసమందు
  చొనుపు నిడుచు సమస్యను ఘనత తోడ

  రిప్లయితొలగించండి
 34. ఆటవిడుపు పూరణము సుమీ జిలేబి గారి కోరిక

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. పూసపాటి వారు మీరు మామూలు వాక్యాలలా సీసపద్యాలను రాసేస్తారండి !

   నమో నమః

   మొదటి సారి చదివి అరె ఈయన ఏదో కామింటు రాసేరనుకున్నా ఆపై చూస్తే సీసం‌ !


   అద్బుతమండి


   జిలేబి

   తొలగించండి
 35. ఆటవిడుపు సరదా పూరణ:
  ("సంజయ ఉవాచ")

  రాలగ పండ్లు మోడివట రాహులు గెల్చెను పార్లమెంటులో...
  మేలని మల్లికార్జునుడు మెచ్చగ పిచ్చిది ముష్టియుద్ధమున్...
  చాలిక పుట్టుగ్రుడ్డివహ! చల్లగ చెప్పెద ఫేకు వార్తనున్:
  "వాలినిఁ జంపె యుద్ధమునఁ బార్థుఁడు కంసుఁడు గాంచి మెచ్చఁగన్"

  వాలి = నరేంద్ర మోడి
  పార్థుడు = రాహుల్ గాంధి
  కంసుడు = మల్లికార్జున్ ఖర్గె
  పుట్టుగ్రుడ్డి (ధృతరాష్ట్రుడు) = మన్మోహన్ సింగ్
  సంజయుడు = ఆకాశవాణి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆబ కం :)

   రాలెను మోడికి పండ్లని
   మేలయ్యెను రాహులుడని మేడము తో చె
   ప్పాలని ఖార్గే వ్రాసెన్
   వాలినిఁ బార్థుండు గూల్చె బవరము నందున్ !

   జిలేబి

   తొలగించండి
 36. శూలి వరియించెను సినీ
  వాలినిఁ, బార్థుండు గూల్చె బవరమునందున్
  లీలగ సూర్యకుమారుని
  నాలక్షీనాథుఁడు తనకండగ నుండన్

  రిప్లయితొలగించండి
 37. వాలినిజంపెయుధ్ధమునబార్ధుడుకంసుడుగాంచిమెచ్చగన్
  వాలినిజంపుటాయనిని?బార్ధుడుకంసుడుమెచ్చెనా?భళా
  బాలకుమాటగాదనరెభవ్యతగల్గునె?నిట్లనంగగన్
  వాలముకోతిమాదిరిగవాక్యమునీయగనొప్పునే?రమా!

  రిప్లయితొలగించండి
 38. ఉత్పలమాల
  తూలుచు సార తో నలరి తొంగుచు రాఘవపాండవీయమున్
  హేలగఁ ద్రుళ్లుచున్ జదివి యింగిత మన్నది లేక పల్కితో
  వాలము లేదుగాని నువు బల్కెడు తీరది కోఁతి చేష్ట! యే
  వాలినిఁ జంపె యుద్ధమునఁ బార్థుఁడు కంసుఁడు గాంచి మెచ్చఁగన్?

  రిప్లయితొలగించండి

 39. కాణీపాకము నుండి లైవు గ రిలే కాంతామణీ గానుమా :)  కాణీపాకము! కంది వర్యులట ప్రాంగంబందు చిత్తూరు జి
  ల్లా నీకాశము మేడసాని వరులన్ శ్లాఘించి మాకందమున్
  మాణిక్యంబగు కందపద్యపు సమామ్నాయంబు‌ నందించి‌ స
  న్మానింపన్ మునిగోటి, గుర్రముజనార్ధన్రావులున్ జూచిరే


  జిలేబి
  శుభాకాంక్షలతో

  రిప్లయితొలగించండి
 40. శూలి వివాహమాడె సినీ
  వాలిని,బార్థుండు గూల్చె బవరమునందున్
  లీలగ కర్ణాదులను గో
  పాలుని దీవెనలతోడ భారతమందున్

  రిప్లయితొలగించండి
 41. మేలుగ రాముడు జంపెను
  వాలిని, బార్ధుండు గూల్చె బవరము నందున్
  జాలము జేయక కర్ణుని
  నీలమణియె జూచుచుండ నేరిమి తోడన్!!!

  రిప్లయితొలగించండి
 42. జాలియె లేక రాముడట చక్కగ దాగుచు నేమిచేసెరా?
  తేలికగా నెవండటను త్రెంచెను సూటిగ మత్స్యయంత్రమున్?
  మూలగకుండ పూతనట ముద్దుగ నెట్టుల పోయెచావుకున్?
  వాలినిఁ జంపె యుద్ధమునఁ;..బార్థుఁడు;..
  కంసుఁడు గాంచి మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి