డా. పిట్టాసత్యనారాయణ కర్మను దప్పకుండ గడనన్ గను విద్దెల నొక్క బాల నా శర్మము నందజాలకనె చారితి కెక్కు మరొక్క బాలదౌ మర్మము పంతులయ్య యవమానము!రెండవ వాడు "నేత" యౌ ధర్మము నాచరించునెడ దప్పదు దండన మెట్టివానికిన్! (ఈ కాలంలో విద్యా వ్యాప్తి జరిగింది.ఇక విద్వత్తు గలవారికే ఓటు గోరు హక్కునిద్దామా?!నేతలకు పూలమాల లర్పించడం మానుకుందామా?!)
గురువులలో శ్రేష్ఠుడైన ద్రోణాచార్యులవారిని యుద్ధమునందు ఓడించలేక , " అశ్వత్థామ ! హతః ! కుంజర !" అని ధర్మరాజుతో చెప్పించి , కుయుక్తితో పాండవులు ద్రోణాచార్యుని సంహరించారు. ద్రోణాచార్యుడు ధర్మానికి కట్టుబడి కౌరవ పక్షాన ఉండటం వల్లనే ఆయన మరణం సంభవించిందనే భావంతో వ్రాసిన పద్యం ;
ధర్మజుడంతవాడును యధర్మపు రీతిన యుద్ధమందునన్ మర్మపు ద్రౌణి నామ గజ మారణ వార్తను దెల్ప - పాండవుల్ ధర్మజుడైన ద్రోణుని యధర్మపురీతిన సంహరింతురే ! ధర్మము నాచరించునెడ దండన దప్పదు నెట్టివానికిన్ ! ద్రౌణి = ద్రోణుని పుత్రుడు , అశ్వత్థామ
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== ధర్మము నాచరించునెడ దప్పదు దండన మెట్టివానికిన్ ======================= ధర్మమును పాటించు వానికి శిక్షలు తప్పక విధించబడునని చెప్పుటలో పరస్పర విరుద్ద అర్థమే - సమస్య ======================== సమస్యా పూరణము - 217 ====================
సులభమై తోచినను, ఫ్యాషనుగా వీచినను పరాయి ధర్మము / పరాయి సంస్కృతిని మనము ఆచరించరాదు. కఠినమైనను గాని వారసత్వంగా సంక్రమించిన మన ధర్మమునే ఆచరించవలెను, లేని యెడల ఎలాంటి ముందు సమాచారము లేకయే విధి చేత దండింపబడెదమని భావము.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2753 సమస్య :: ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టివారికిన్. ధర్మాన్ని ఆచరిస్తే దండన తప్పదు ఎటువంటి వారికైనా సరే అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: ధర్మాన్ని రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది. ధర్మాన్ని మనం చంపినట్లయితే అది మనలను చంపివేస్తుంది అని మనుస్మృతిలో చెప్పబడి ఉన్నది. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః । తస్మాత్ ధర్మం న త్యజామి మా నో ధర్మో హతోఽవధీత్।। అనే శ్లోకాన్ని వినియున్నాం కదండీ. దుర్యోధనుడు ‘’స్వార్థంతో కూడిన రాజధర్మమే కవచంలా రక్షిస్తుంది. సుఖాన్ని ఇస్తుంది’’ అని భావించి దురాలోచనతో పాండవులను వంచించినాడు. అందుకు తగిన దండనను పొందినాడు. అపకీర్తిని కూడా పొందినాడు. కాబట్టి స్వార్థముతో కూడిన అటువంటి రాజధర్మమును ఆచరిస్తే ఎటువంటి వారికైనా కఠిన దండన తప్పదు అని విశదీకరించే సందర్భం.
గురువు గారు బిజీగా ఉన్నట్లున్నారు. నా పద్యం చదివి మీ అభిప్రాయం తెలియజేయవలసినదిగా మిగిలిన సభ్యులను ప్రార్ధిస్తున్నాను.
గురువులలో శ్రేష్ఠుడైన ద్రోణాచార్యులవారిని యుద్ధమునందు ఓడించలేక , " అశ్వత్థామ ! హతః ! కుంజర !" అని ధర్మరాజుతో చెప్పించి , కుయుక్తితో పాండవులు ద్రోణాచార్యుని సంహరించారు. ద్రోణాచార్యుడు ధర్మానికి కట్టుబడి కౌరవ పక్షాన ఉండటం వల్లనే ఆయన మరణం సంభవించిందనే భావంతో వ్రాసిన పద్యం ;
ధర్మజుడంతవాడును యధర్మపు రీతిన యుద్ధమందునన్ మర్మపు ద్రౌణి నామ గజ మారణ వార్తను దెల్ప - పాండవుల్ ధర్మజుడైన ద్రోణుని యధర్మపురీతిన సంహరింతురే ! ధర్మము నాచరించునెడ దండన దప్పదు నెట్టివానికిన్ ! ద్రౌణి = ద్రోణుని పుత్రుడు , అశ్వత్థామ
వామన కుమార్ గారు నమస్సులు. మీ పద్యము చాలా బాగుంది. అయితే చిన్న చిన్న సవరణలు చేయవలసి యున్నది. 1. వాఁడును – అధర్మపు లో సంధి నిత్యము. యడాగమము రాదు. “వాఁడును నధర్మపు” అనవచ్చు. 2. “రీతిని” అంటే బాగుంటుంది. 3. దెల్పఁ బాండవుల్ అనండి. 4. ద్రోణుని ధర్మజుఁ డన లేము. “ధర్మరతుండు” అనవచ్చు. 5. ద్రోణుని నధర్మపు రీతిని అనండి.
కర్మననుసరించి కర్మఫలంబుండు
రిప్లయితొలగించండిన్యాయ వర్తనునకె యశము గలుగు
కలుగు రాజ్యమందు కలుషాత్ముడైన య
ధర్మవర్తనునకె దండనమ్ము
నమోనమః
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధర్మపథానువర్తులయి , దైవమునే నెఱనమ్ముకొంచు స...
తొలగించండిత్కర్మలనాచరింప గని దైవమె గాచెడు , నట్లుగాక దు...
ష్కర్మల బద్ధుడైన హరి చక్రము ద్రుంచదె ! దైవదూషణా...
ధర్మమునాచరించునెడ దప్పదు దండనమెట్టివానికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కుత్సితమతులైన కొందరు బోధింప
రిప్లయితొలగించండికృష్ణరాయడంత కృపను మాలి
తిమ్మరుసుని పట్టి తీయించె కన్నులే ;
ధర్మవర్తనునకె దండనమ్ము.
👏👏
తొలగించండిధన్యవాదాలండీ!
తొలగించండికలియుగంబులోన కలుషాత్ములకు పెద్ద
రిప్లయితొలగించండిపీట వేయ బడుట వింత గాదు
కల్లలాడు వాని నెల్లరు మెత్తురు
ధర్మ వర్తనునకె దండనమ్ము.
మర్మ మెరుంగు మోయి యనుమానము లేదొక యింతయేని స
త్కర్మలు చేయబూను శుభ కాలము కాదిది యీయుగంబునన్
నిర్మల వర్తనంబునకు నిత్యము కష్టము లందుచుండు నౌ
ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టివానికిన్.
అన్న చేసెడి పనులన్నితప్పని దెల్ప,
రిప్లయితొలగించండిలంక నుంచి పంపె లక్షణముగ
దహరుని దశ ముఖుడు దయమరుగు నబడ
ధర్మ వర్తనునకె దండనమ్ము
రావణాసురుడు తమ్ముడు విబీషనుని దయలేక లంక నుంచి పంపిన సందర్భము
ధర్మము నందు సూక్ష్మముల తప్పుగ వ్యాఖ్యలు చేయబోకు
రిప్లయితొలగించండిమే
ధర్మము, వాలి! చెప్పినది తమ్ముని రాజ్యము వీడ బంప? నే
ధర్మము బోధ చేసినది తమ్ముని భార్యను పొంద? దప్పినన్
ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టివానికిన్.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిచాకలి మడియేలు శాస్త్ర సంపన్నుడా?
ఏరి కోరి రాము నెరగ జేసె
సాధ్వి సీత కడవి సరి నిర్ణయంబని;
ధర్మ వర్తనునకె దండనమ్ము
రిప్లయితొలగించండిబతుకు బాట లో నుపాంశువిదియె సూవె
ధర్మ వర్తనునకె దండనమ్ము
దెబ్బ పైన పడగ దెబ్బలు మనుజుడు
రాణి కెక్కు జీవరత్నమగుచు.
జిలేబి
గతపు పాప ఫలము కలుగు జీవితమున
రిప్లయితొలగించండిధరణి పుట్టి నట్టి నరుని కెపుడు
నట్టి ఫలము నేడు కట్టి కుడుపు చుండ
ధర్మ వర్తనునకె దండనమ్ము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిడా. పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండికర్మను దప్పకుండ గడనన్ గను విద్దెల నొక్క బాల నా
శర్మము నందజాలకనె చారితి కెక్కు మరొక్క బాలదౌ
మర్మము పంతులయ్య యవమానము!రెండవ వాడు "నేత" యౌ
ధర్మము నాచరించునెడ దప్పదు దండన మెట్టివానికిన్!
(ఈ కాలంలో విద్యా వ్యాప్తి జరిగింది.ఇక విద్వత్తు గలవారికే ఓటు గోరు హక్కునిద్దామా?!నేతలకు పూలమాల లర్పించడం మానుకుందామా?!)
గురువులలో శ్రేష్ఠుడైన ద్రోణాచార్యులవారిని యుద్ధమునందు ఓడించలేక , " అశ్వత్థామ ! హతః ! కుంజర !" అని ధర్మరాజుతో చెప్పించి , కుయుక్తితో పాండవులు ద్రోణాచార్యుని సంహరించారు. ద్రోణాచార్యుడు ధర్మానికి కట్టుబడి కౌరవ పక్షాన ఉండటం వల్లనే ఆయన మరణం సంభవించిందనే భావంతో వ్రాసిన పద్యం ;
రిప్లయితొలగించండిధర్మజుడంతవాడును యధర్మపు రీతిన యుద్ధమందునన్
మర్మపు ద్రౌణి నామ గజ మారణ వార్తను దెల్ప - పాండవుల్
ధర్మజుడైన ద్రోణుని యధర్మపురీతిన సంహరింతురే !
ధర్మము నాచరించునెడ దండన దప్పదు నెట్టివానికిన్ !
ద్రౌణి = ద్రోణుని పుత్రుడు , అశ్వత్థామ
చేయ రాని పనులు సిగ్గు విడిచి చేసి
రిప్లయితొలగించండిపరుల హింస చేయు పాత కునికి
జగతి యందు జూడ జటిలమైన ట్టీ న
ధర్మ వర్తను న కె దండ న మ్ము
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
ధర్మము నాచరించునెడ దప్పదు
దండన మెట్టివానికిన్
=======================
ధర్మమును పాటించు వానికి శిక్షలు
తప్పక విధించబడునని చెప్పుటలో
పరస్పర విరుద్ద అర్థమే - సమస్య
========================
సమస్యా పూరణము - 217
====================
సుళువది అయిననేమి ఆచరించకు
పర ధర్మము నిషిధ్ధము
కఠినమై నిలచినను కాదనకు
స్వధర్మమును పాటిధ్ధము
వివేకము లేక పరాయి ధర్మము
నాచరించునెడ దప్పదు
దండన మెట్టివానికిన్ విధించునదె
విధి తానుగ చెప్పదు
====##$##====
సులభమై తోచినను, ఫ్యాషనుగా వీచినను
పరాయి ధర్మము / పరాయి సంస్కృతిని
మనము ఆచరించరాదు. కఠినమైనను గాని
వారసత్వంగా సంక్రమించిన మన ధర్మమునే
ఆచరించవలెను, లేని యెడల ఎలాంటి
ముందు సమాచారము లేకయే విధి చేత
దండింపబడెదమని భావము.
"శ్రేయాన్ స్వధర్మో విగుణః -
పర ధర్మాత్ అనుష్టితాత్
స్వధర్మే నిధనం శ్రేయః
పర ధర్మో భయావహః "
--- భగవద్గీత (కర్మ యోగము)
శ్లోకము : 35
(మాత్రా గణనము : అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
(శుభోదయం )
చట్టసభల యందు చట్టమెంతగమార
రిప్లయితొలగించండిధర్మమోడిపోక తప్పదుమరి
మానవాళి తలపు మారకున్నజరుగు
ధర్మ వర్తనునకె దండనమ్మ
దుష్టడైన రాజు ద్రోహచింతన చేత
రిప్లయితొలగించండిభ్రష్ట మౌను జగతి పాలనంత
దుష్టు లెల్ల కూడి దునుమాడు చుందురు
"ధర్మ వర్తనునకె దండనమ్ము"
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2753
సమస్య :: ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టివారికిన్.
ధర్మాన్ని ఆచరిస్తే దండన తప్పదు ఎటువంటి వారికైనా సరే అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: ధర్మాన్ని రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది. ధర్మాన్ని మనం చంపినట్లయితే అది మనలను చంపివేస్తుంది అని మనుస్మృతిలో చెప్పబడి ఉన్నది.
ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః ।
తస్మాత్ ధర్మం న త్యజామి మా నో ధర్మో హతోఽవధీత్।। అనే శ్లోకాన్ని వినియున్నాం కదండీ.
దుర్యోధనుడు ‘’స్వార్థంతో కూడిన రాజధర్మమే కవచంలా రక్షిస్తుంది. సుఖాన్ని ఇస్తుంది’’ అని భావించి దురాలోచనతో పాండవులను వంచించినాడు. అందుకు తగిన దండనను పొందినాడు. అపకీర్తిని కూడా పొందినాడు. కాబట్టి స్వార్థముతో కూడిన అటువంటి రాజధర్మమును ఆచరిస్తే ఎటువంటి వారికైనా కఠిన దండన తప్పదు అని విశదీకరించే సందర్భం.
‘’శర్మము నంద నా కెపుడు స్వార్థయుత మ్మగు రాజధర్మమే
వర్మ’’ మనెన్ సుయోధనుడు, వంచన జేయుటఁ బొందె దండనన్,
నిర్మల బుద్ధి లేక కనె నీచుడుగా నపకీర్తి, నట్టిదౌ
‘’ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టివారికిన్.’’
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (5-8-2018)
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి["ధర్మాచరణమందున్నవారలకుఁ గలుగు దండన మది దైవపరీక్షయే గాని, శిక్షకాదు. చూచువారల కది దండనము వలెనే కనిపించినను, దండింపబడువా రది దండన మనుకొని భ్రమించినను, దైవ విషయమున నది పరీక్షయే గదా! హరిశ్చంద్రుని విషయమున విశ్వామిత్రుఁ డతనిని ధర్మభ్రష్ఠునిఁ జేయుటకై దండనలకు గుఱిచేసితిననుకొన్నను, దైవ విషయమున నది పరీక్షయే యయి, యందుఁ జివరకు హరిశ్చంద్రునకు విజయమునే చేకూర్చెను గదా!" యను సందర్భము]
ధర్మము నిల్పఁ బుల్కసునిఁ దానయి కొల్చెఁ ద్రిశంకు సూనుఁ; డా
ధర్మము నిల్పఁ జంద్రమతి దాసిగ మాఱి, కొఱంత నూనె; నా
ధర్మము నిల్ప లోహితుఁడు దర్పిత సర్పపుఁ గాటు నందెఁ; ద
ద్ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టివానికిన్!
ధర్మము నిల్పువారి కిడు దండన, దైవ పరీక్షయే కదా!!
మరణ మొంద పిదప మనిషికి స్వర్గమో
రిప్లయితొలగించండినరకమొ యన దెల్ప నరుని వశమె ?
బ్రతికి బాధ లెన్నొ పడె హరిశ్చంద్రుడు
ధర్మ వర్తనునకె దండనమ్ము
నిన్నటి సమస్యకు నా పూరణ
ఆలమున గూల్చె రాముడు
వాలినిఁ; బార్థుండు గూల్చె బవరమునందున్
నేలను దిగ రధ చక్రము
జాలిని జూపంబ బోక సమరధు కర్ణున్
కాయలుండుకుఠికికఱ్ఱదెబ్బవిధము
రిప్లయితొలగించండిధర్మవర్తనునకెదండనమ్ము
మంచివానికిలనుమనుగడకష్టమ్ము
ధర్మపాలనమ్ముధరకుమేలు
నేటితో నా వివాహ జీవితం 35 సంవత్సరాలు పూర్తయింది. Asnreddy
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
తొలగించండిశ్రీ అన్నపురెడ్డి వారికి వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు
నమస్సులు. ధన్యవాదములు. అసనారె
తొలగించండిరెడ్డి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
తొలగించండినమస్సులు ధన్యవాదములు అసనారె
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారు బిజీగా ఉన్నట్లున్నారు. నా పద్యం చదివి మీ అభిప్రాయం తెలియజేయవలసినదిగా మిగిలిన సభ్యులను ప్రార్ధిస్తున్నాను.
రిప్లయితొలగించండిగురువులలో శ్రేష్ఠుడైన ద్రోణాచార్యులవారిని యుద్ధమునందు ఓడించలేక , " అశ్వత్థామ ! హతః ! కుంజర !" అని ధర్మరాజుతో చెప్పించి , కుయుక్తితో పాండవులు ద్రోణాచార్యుని సంహరించారు. ద్రోణాచార్యుడు ధర్మానికి కట్టుబడి కౌరవ పక్షాన ఉండటం వల్లనే ఆయన మరణం సంభవించిందనే భావంతో వ్రాసిన పద్యం ;
ధర్మజుడంతవాడును యధర్మపు రీతిన యుద్ధమందునన్
మర్మపు ద్రౌణి నామ గజ మారణ వార్తను దెల్ప - పాండవుల్
ధర్మజుడైన ద్రోణుని యధర్మపురీతిన సంహరింతురే !
ధర్మము నాచరించునెడ దండన దప్పదు నెట్టివానికిన్ !
ద్రౌణి = ద్రోణుని పుత్రుడు , అశ్వత్థామ
వామన కుమార్ గారు నమస్సులు. మీ పద్యము చాలా బాగుంది.
తొలగించండిఅయితే చిన్న చిన్న సవరణలు చేయవలసి యున్నది.
1. వాఁడును – అధర్మపు లో సంధి నిత్యము. యడాగమము రాదు. “వాఁడును నధర్మపు” అనవచ్చు.
2. “రీతిని” అంటే బాగుంటుంది.
3. దెల్పఁ బాండవుల్ అనండి.
4. ద్రోణుని ధర్మజుఁ డన లేము. “ధర్మరతుండు” అనవచ్చు.
5. ద్రోణుని నధర్మపు రీతిని అనండి.
ధన్యవాదములు.
తొలగించండిప్రతిరోజూ పద్యం వ్రాసే అవకాశం లభించక , అభ్యాసం లేక తప్పులు దొర్లుతున్నాయి.
ధర్మమునాచరించునెడదప్పదుదండనమెట్టివానికి
రిప్లయితొలగించండిన్ధర్మమె?యిట్లుబల్కుటకుధర్మమెగాచునునెల్లవేళల
న్దండనకర్హులౌదురిలదాష్ట్యముతోడన నుండువారెసూ
ధర్మమువీడకుండగనుధాత్రిజనంబులుమెల్గుటొప్పగున్
పడయ వచ్చు భోగ భాగ్యములు దనరి
రిప్లయితొలగించండియేల వచ్చు ధరను గాల మెల్లఁ
గాని కాంచఁ గలము కాలు ధామమున న
ధర్మ వర్తనునకె దండనమ్ము
కర్మ ఫలంబ యాయె నిఁకఁ గాటికిఁ గాపు త్రిశంకు సూనుఁడే
ధర్మపు మూర్తి దాశరథి దారుణ గోత్ర నివాసి యయ్యెనే
ధర్మము ధర్మ మంచు నల ధర్మజుఁ డయ్యెను రాజ్య దూరుఁడే
ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టి వానికిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ ఎయస్ యన్ రెడ్డిగారికి పెళ్ళిరోజుశుభాకాంక్షలు
రిప్లయితొలగించండిధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండితనను గొల్వ మనుచుఁ దనయుని పీడించి
తగరురౌతుఁ జూడ దైత్యుఁడెంచ
కంబమయ్యగ దిగి కడుపుఁ జీల్చెఁ గద, య
ధర్మ వర్తనునకె దండనమ్ము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధరణి యందు నెపుడు ధర్మమ్ము నిలుపుచు
రిప్లయితొలగించండిమనెడు వాడె జగతి మాన్యుడగును
స్వార్థ చింత తోడ చరియించు నట్టి య
ధర్మ వర్తునకె దండ నమ్ము
ధర్మమూర్తి యంచు ధరణియే కొలిచిన
రిప్లయితొలగించండిపాండవాగ్రజుండతండు గాదె
కానలందు జేరి కష్టాల పాలయ్యె
ధర్మ వర్తను నకె దండ నమ్ము
శర్మయె చెప్పె తమ్మునకు జంచల చిత్తుడటంచు నివ్విధిన్
రిప్లయితొలగించండిమర్మమెఱంగుమోయి యిల మాన్యత నొందుచు కీర్తినందునే
ధర్మము నాచరించునెడ, దప్పదు దండన మెట్టివారికిన్
ధర్మము తప్పినంత నిది తథ్యము నందురు జ్ఞానశీలురే
పలుకుబడులు లేని బాధ్యతగలవాడు
రిప్లయితొలగించండినీతివీడినోడి నియమమందు
జేయుపనికి శిక్ష జెప్పకనబ్బు!న
ధర్మవర్తనునకె దండనమ్ము
రిప్లయితొలగించండికర్మఫలమ్ము కారణము కష్టము నష్టము లెల్ల గుంపుగా
నిర్మల మాన సమ్ము నట నింకిరి జేయుచు తీక్షణంబవన్
ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టివానికిన్,
మర్మపు జీవితంబిదియె మాన్యులు పారులు బద్ధులేసుమా !
జిలేబి
ధార్మిక సంఘముల్ పెరిగి ధర్మము నంతయు మార్చెగా త్రయీ
రిప్లయితొలగించండిధర్మము సన్నగిల్లినది తామర తంపరగా నధర్మమే
పేర్మిని ద్రుంచినిద్ధరను పెంచెను నిర్దయ రామ!కాలుడే
ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టివానికిన్
సత్య పథమునందు సాగు ధార్మికులకు
రిప్లయితొలగించండిహాని జరుగ బోదు నవని యందు
ధర్మభ్రష్టులగుచు దారిని తప్పు న
ధర్మ వర్తనునకె దండనమ్ము.
2.ధర్మమార్గము విడ ధరణిలో నప్పటి
కయ్యది సరి యౌ నటంచు సాగ
తుదకు ఖేద మొసగి దుఃఖమె మిగులు,న
ధర్మవర్తనునకె దండనమ్ము.
ధర్మమాచరించి ధర్మజు డుధరలో
తమ్ముల నొడ గూడి తాపమొందె
రంతిదేవుడాది రాజులు నటువలె
ధర్మవర్తనునకె దండనమ్ము.
...............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
ధర్మ వర్తనునకె దండనమ్ము..
సందర్భము: "వేదికమీ దున్న అందరికీ ఒక్కొక్క పూవు అందించవలె. ధర్మ వర్తనుడైన కవికిమాత్రం పూలదండ వేస్తే సరి..నమ్మవయ్యా!అందరికీ వేయాల్సిన పని లేదు"
అంటున్నాడు సభా నిర్వాహకుడు తన సహాయకునితో...
==============================
"తక్కు వారికెల్ల నొక్కొక విరి యిత్తు
మొక్కటె విరి దండ యున్నది మరి..
అందరికిని దండ లవి యేల?కవి కొక్క
ధర్మ వర్తనునకె దండ.. నమ్ము.."
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
5-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన పంతులయ్యకున్
రిప్లయితొలగించండిధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన పోలిసోడికిన్
ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన గాంధితాతకున్
ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టివానికిన్
దండన (దండనము) = punishment