బ్లాగు నిర్వాహకులు కూడా శంకరయ్య గారే కదా. వారిదే responsibility. శంకరాభరణం బ్లాగు వేల మంది చదువుతారు. వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వ్హాట్సప్ కానీ బ్లాగు కానీ, పూచీ నిర్వాహకులదే.
రాజకీయ పూరణలంటే ఉదాహరణకి...నిన్నటి "టం టం టం..." కి మీరంతా ఏవేవో ఊహించి వ్రాశారు. నేనైతే మన డిగ్గీ రాజా (పదవి ఊడి, సెక్యురిటీ ఊడి , తుస్సుమన్న దిగ్విజయ సింగ్) మీద ఒక మహా వృత్తం వ్రాసి ఉండేవాడిని ;)
అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. "కంటికి నగుపించె" అనండి. ****** ప్రభాకర శాస్త్రి గారూ, రాజకీయ నాయకులపై చేసే వ్యంగ్యాత్మకమైన పద్యాలను, వ్యాఖ్యలను, కార్టూనులను చదివి ఆనందించడాని 'సెన్స్ ఆఫ్ హ్యూమర్' ఉండాలి. అది లేనివారు ఆనందించకుండా విమర్షిస్తారు. నాయకులమీద విపరీతాభిమానం ఉండేవాళ్ళు కోపానికి రావడం కద్దు. లేనిపోని వివాదాలకు, వ్యక్తిగత విమర్శలకు, పరస్పర దూషణలకు 'శంకరాభరణం' వేదిక కాకూడదని నా భావన. నిర్వాహకుడిగా 'పూచీ' నాదే అన్నారు. నన్నేం చేయమంటారో సూచించండి.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2755 సమస్య :: దమయంతిన్ దగఁ బెండ్లియాడెను గదా ధర్మాత్ము డా రాముడే. సందర్భం :: అందమునకు నిలయమైన మన్మథునికి తల్లి యగు లక్ష్మీదేవి సీతగా అవతరించింది. రావణుడు మొదలైన దైత్యరాజులపై దమన కాండను కొనసాగించ దలచింది. విష్ణుమూర్తి యొక్క అంశతో జన్నించినవాడు ధర్మాత్ముడు ఐన శ్రీ రాముడు పరమశివుని ధనుస్సును ఎత్తినవాడై ఆ దమయంతిని అంటే ఆ సీతను పెండ్లియాడినాడు. అని విశదీకరించే సందర్భం. (తన అందముచే ఇతరులను దమించునది అనగా అణచివేయునది దమయంతి అనే వ్యుత్పత్యర్థము ఆధారంగా సీతాదేవి దమయంతి యైనది అని చెప్పడం జరిగింది.)
కృష్ణ సూర్యకుమార్ గారూ, కందపాదాన్ని సీసంలో ఇమిడ్చి చేసిన పూరణ బాగున్నది. అభినందనలు. ముగ్గురూ వనవాసం చేసిన విషయాన్ని సమన్వయపరిచిన విధానం ప్రశస్తంగా ఉన్నది. 'రాజుని/ రాజును...'
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ======================= దమయంతిన్ దగ బెండ్లి యాడెను గదా ధర్మాత్ము డా రాముడే ======================== నలుడి భార్యగా సుపరిచతమైన దమయంతిని ధర్మాత్ముడు అయిన రాముడు కోర్కె మీరగ వివాహం చేసుకున్నాడని చెప్పటంలో పరస్పర విరుద్ద అర్థము - సమస్య ========================= సమస్యా పూరణము - 219 ===================
దమనుడు అనే ముని వరప్రసాదమున పుట్టినదిగా, విధర్భను పాలించే భీముడి కూతురిగా , నలమహారాజు దేవేరిగా మాత్రమే కాక దమయంతి యనగా పతి యెడల మిక్కిలి అనురాగము గల స్త్రీ అనియు, తన అందముచే ఇతరులను అణచునది లేదా ఓడించునదనియు అర్థములు కలవు. అట్టి యెడ తన పట్ల మిక్కిలి అనురాగమును కలిగినదియు, గొప్ప సౌందర్యవతి అయినదియు అగు సీతను కోర్కె మీరగ రాముడు వివాహం చేసుకున్నాడని భావము.
ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** జిలేబీ గారూ, స్వయంవరానికి ముందు నలుడు కొంత శ్రమపడ్డాడు. దేవతలు తమలో ఒకరిని వరించేవిధంగా దమయంతిని ఒప్పించమని నలున్నే పంపారు.
రిప్లయితొలగించండిసుమనస్కుడునలుడు సుమా
దమయంతినిఁ బెండ్లియాడె, దశరథసుతుఁడే,
సమవాయి పుడమి పట్టికి
సమజము గతియయ్యె రెండు సంగడములకున్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విమల చరితుండగు నలుడు
రిప్లయితొలగించండిదమయంతినిఁ బెండ్లియాడె, దశరథ సుతుడే
సుమధుర గాత్రుడు చేగొనె
సుమకోమలి సీతకరము సురలు పొగడగన్.
విరించి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి అద్భుత పూరణ
రిప్లయితొలగించండిస్థిమితాంతఃకరణుండు గాధిజ శుభాశీర్వాదసంపన్నుడై
విమలుండై శివకార్ముకమ్ముఁ గొని తా భేదింప , భూజాత వి
భ్రమమందన్ ,
మిథిలేశదంపతులు దెల్పన్ తత్సభన్ పేర్మితోఁ
దమ యంతిన్ ., దగఁ బెండ్లియాడెను గదా ధర్మాత్ముఁ డారాముఁడే"
అంతి.... సంతోషము
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
స్తిమితాంతఃకరణుండు... అని గమనింప మనవి 🙏🙏
తొలగించండి..మైలవరపు మురళీకృష్ణ
విలక్షణమైన విరుపుతో మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివిమలము నలమా రాజట
రిప్లయితొలగించండిదమయంతినిఁ బెండ్లియాడె , దశరధ సుతుఁడే
రమణీ మణిసీత నుగని
మమకారము పొంగె నంట మాలిమి తోడన్
అక్కయ్యా,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదాన్ని "విమలుడు నల భూపాలుడు" అనండి.
మింటను మెరిసెడి తారక
రిప్లయితొలగించండికంటికి యగుపించె నంత కలవర పడగన్
జంటగ నిలచిన చాలును
టంటంటం టంటం టంట టమ్మనె భేరుల్
-------------------------------
జి.పి.య్స్. వారూ " నిన్నటి పూరణ
అద....న్న....మాట. [అసల్ సం...గతి ..." ]
రాజేశ్వరి గారూ:
తొలగించండిమొన్న "జడ కందాల" ఆవిష్కరణ లో మీ కోడలి గారిని (మనుమరాలు ?) గారినీ కలిసి మాట్లాడాను...చాలా సంతోషం
👏
అన్నయ్యా! నీ సమస్య వాట్సప్ లో గదా! బ్లాగుకేమాయె?
తొలగించండిబ్లాగు నిర్వాహకులు కూడా శంకరయ్య గారే కదా. వారిదే responsibility. శంకరాభరణం బ్లాగు వేల మంది చదువుతారు. వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వ్హాట్సప్ కానీ బ్లాగు కానీ, పూచీ నిర్వాహకులదే.
తొలగించండి
తొలగించండిప్రొటెస్టింగ్ కిడ్ :)
జిలేబి
Escapist (సాకులమారి)
తొలగించండి😊
రాజకీయ పూరణలంటే ఉదాహరణకి...నిన్నటి "టం టం టం..." కి మీరంతా ఏవేవో ఊహించి వ్రాశారు. నేనైతే మన డిగ్గీ రాజా (పదవి ఊడి, సెక్యురిటీ ఊడి , తుస్సుమన్న దిగ్విజయ సింగ్) మీద ఒక మహా వృత్తం వ్రాసి ఉండేవాడిని ;)
తొలగించండి
తొలగించండిఆహా మిస్సయ్యామే ! మా ఆబకం నకు కూడా ఢోకా పడే ను.
వెంఠనే రాసి దిగ్విజయంగా రంగంలోకి దిగేయండి మళ్ళీ :)
జిలేబి
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కంటికి నగుపించె" అనండి.
******
ప్రభాకర శాస్త్రి గారూ,
రాజకీయ నాయకులపై చేసే వ్యంగ్యాత్మకమైన పద్యాలను, వ్యాఖ్యలను, కార్టూనులను చదివి ఆనందించడాని 'సెన్స్ ఆఫ్ హ్యూమర్' ఉండాలి. అది లేనివారు ఆనందించకుండా విమర్షిస్తారు. నాయకులమీద విపరీతాభిమానం ఉండేవాళ్ళు కోపానికి రావడం కద్దు. లేనిపోని వివాదాలకు, వ్యక్తిగత విమర్శలకు, పరస్పర దూషణలకు 'శంకరాభరణం' వేదిక కాకూడదని నా భావన.
నిర్వాహకుడిగా 'పూచీ' నాదే అన్నారు. నన్నేం చేయమంటారో సూచించండి.
రాజకీయ నాయకునిది కానీ వేరెవరిది కానీ "పేరు"బెట్టి దూషణ చేసే వ్యాఖ్య మీ బ్లాగులో కానీ వ్హాట్సప్ సమూహములో కానీ కనబడిన వెంటనే ఆ వ్యాఖ్యను తొలగించండి.
తొలగించండిఎందుకైనా మంచిది...ఎన్నికలు వస్తున్నాయి.
నేను మీకు పంపిన చిత్రం లోని
"రంగ రాయ వాస్తవ శతకము"
మా బావ గారికి వారు హఠాతు heart attack వచ్చి surgery కొరకు hospital లో admit అయి ఉండగా చేరినదట. నాకా విషయం తెలియదు.
ఆ శతకం చదివి నవ్వులు ఆపుకోలేక ఎగిరి పడుతూ ఉంటే surgeon విడ్డూరంగా విస్తుపోయాడట.
కానీ ఆ శతకంలో ఒక్క పద్యాన్ని కూడా నా బ్లాగులో ప్రచురించ లేదు. మీరు గమనించే ఉంటారు...
"Strictly for fun and limited circulation"
అని cover page మీద వ్రాశాను. కేవలం ఐదు కాపీలు మాత్రమే ప్రింట్ చేశాను. నా వద్ద ఒక్కటే కాపీ మిగిలి ఉన్నది. ఈ సారి కలిసినప్పుడు మీకు అంద చేస్తాను.
మీకు రాజకీయాలలో ఇష్టాయిష్టాలు లేవని నాకు తెలుసు.
ఒక్క పద్యం మాత్రమే మహాత్మా గాంధీపై ఉన్నది:
2. "Gandhi statue unvelied in British Parliament Square"
ఉతికినోరు గాంధ్ని బతికినన్నాళ్ళు
కొట్టినోరు జైల్లొ నెట్టినోరు
చచ్చినోడి చెవులు చారడేసిగదర
వేంకటాద్రి సుతుడ వినుర రంగ!
తొలగించండిఉతికెను గాంధీ గారిని
బతికున్నప్పుడు బ్రిటీషు ప్రభుతయు సుమ్మీ
వెతికి వెతికి శిల గట్టిర
య తీరు గా లండనుస్క్వ్యయరులో రంగా :)
జిలేబి
మీరందరూ శంకరాభరణం పాఠశాలలో ఇంకా చదువుకొంటూ ఉంటే, నేను పాస్ ఐపోయి డిగ్రీ తీసుకొని "పై" చదువులకు పారిపోయానోచ్!!!
తొలగించండి
తొలగించండియాడికి పోయిరి ?
జిలేబి
"యద్గత్వా న నివర్తన్తే ..."
తొలగించండి
తొలగించండిन तत्र सूर्यो भाति न चन्द्रतारकं
नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः।
తొలగించండిఒక్క అంధ దృతరాష్ట్రుడు ఇంత జ్ఞాననేత్రాన్ని తెరిపించేడా !
अमि एक् जाजाबोर्
एक् कलि दो पत्तिया :)
जिलेबी
:)
తొలగించండి"తమేవ భాంతమనుభాతి సర్వం
తస్య భాసా సర్వమిదం విభాతి"
మీరు నాకన్నా రెండడుగులు ముందే ఉన్నారు :)
తొలగించండిమిష్టిదొయి ఖాబేన్ ! భాలో సోబేన్ :)
జిలేబి
ఇదేదో మీకూ జిపియెస్ గారికే అర్థమవ్వాలి 😕.
తొలగించండిబైదివే, మీకెన్ని / ఏయే భాషల్లో ప్రవేశం ఉంది "జిలేబి" గారూ?
తమితో నైషధపతియే
రిప్లయితొలగించండిదమయంతిని బెండ్లియాడె; దశరథసుతుడే
రమణీమణి సీతమ్మను
కమనీయ విధము నవమిని కరము వరించెన్
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తమితోడ నిషధపతియే" అనండి.
ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!
తొలగించండితమితోడ నిషధపతియే
తొలగించండిదమయంతిని బెండ్లియాడె; దశరథసుతుడే
రమణీమణి సీతమ్మను
కమనీయ విధము నవమిని కరము వరించెన్
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2755
సమస్య :: దమయంతిన్ దగఁ బెండ్లియాడెను గదా ధర్మాత్ము డా రాముడే.
సందర్భం :: అందమునకు నిలయమైన మన్మథునికి తల్లి యగు లక్ష్మీదేవి సీతగా అవతరించింది. రావణుడు మొదలైన దైత్యరాజులపై దమన కాండను కొనసాగించ దలచింది.
విష్ణుమూర్తి యొక్క అంశతో జన్నించినవాడు ధర్మాత్ముడు ఐన శ్రీ రాముడు పరమశివుని ధనుస్సును ఎత్తినవాడై ఆ దమయంతిని అంటే ఆ సీతను పెండ్లియాడినాడు. అని విశదీకరించే సందర్భం.
(తన అందముచే ఇతరులను దమించునది అనగా అణచివేయునది దమయంతి అనే వ్యుత్పత్యర్థము ఆధారంగా సీతాదేవి దమయంతి యైనది అని చెప్పడం జరిగింది.)
అమరెన్ మన్మథు మాత సీతగను తా నందమ్ముచే దైత్యరాట్
దమనమ్మున్ కొనసాగ జేయుటకునై, దండింపగా రావణున్;
విమలుండై శివచాప మెత్తి ఘనతన్ విష్ణ్వంశ సంభూతు డా
‘’దమయంతిన్ దగఁ బెండ్లియాడెను గదా ధర్మాత్ము డా రాముడే.’’
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (7-8-2018)
కోట వారూ,
తొలగించండి'దమయంతి' శబ్దార్థంతో విలక్షణమైన పూరణతో అలరింపజేశారు. అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండినిషధ దేశపు రాజుని మదిలోన తలచి వరమాల వేయగ గఱువ నలుడు
రిప్లయితొలగించండిప్రియ దమయంతినిఁ బెండ్లియాడె, దశరథసుతుఁడే ముక్కంటి ధనువు విరిచి
పరిణయ మాడెను పంటవలతి పట్టిని ,శకులి యంత్రము నేర్పు తోడ
ఛేదించి మనువాడె శ్వేతవాహనుడు పాంచాలిని ,వేల్పులు చండ మొంద
విపినముకు చనె నల భూపతి, పితురుండు
నానతి నిడెనని సతితో కాననమ్ము
నకు నొకడు ,నన్న పలుక నొకడు వెడలె
నడవికి, విధి రాతను దాట నరుల తరమ
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండికందపాదాన్ని సీసంలో ఇమిడ్చి చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.
ముగ్గురూ వనవాసం చేసిన విషయాన్ని సమన్వయపరిచిన విధానం ప్రశస్తంగా ఉన్నది.
'రాజుని/ రాజును...'
విమలుడు సుబలుడు నలుడే
రిప్లయితొలగించండిదమయంతిని బెండ్లియాడె ; దశరథసుతుడే
యమలన్ సీతన్ జనకజ
ప్రమదము నిండగ గనులను బరిణయ మాడెన్ .
బాపూజీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నమస్సులండీ!
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅమృతుల నాందిని నలుడా
దమయంతిని బెండ్లియాడె; దశరథ సుతుడే
ప్రమదాథిపు విల్లు విఱిచి
కమనీయమ్ముగ ధరణిజ కరమందుకొనెన్
రాజారావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అమృతుల నాందిని'...?
అమృతుల నాందిని= దేవతల ఆశీర్వాదంతో
తొలగించండిఅమలిన ప్రేమను నలుడే
రిప్లయితొలగించండిదమయంతినిఁ బెండ్లియాడె ; దశరథసుతుఁడే
కమలాక్షి యగు ధరణిజను
మమకారము గరిగొనంగ మనువాడె కదా!
జనార్దన రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమరన్ హంసల రాయబారమది
రిప్లయితొలగించండిప్రేమారన్ నలుండా సతీ
దమయంతిన్ దగ బెండ్లియాడెను గదా; ధర్మాత్ముడా రాముడే
రమణీయంబుగ తండ్రియానతిని సాలంకారి సీతమ్మకే
ప్రమధాధీశుని చాపమున్ విరచి సౌభాగ్యమ్ము నందించెగా!
సీతాదేవి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిఅమలమనస్కుడగు నలుడు
రిప్లయితొలగించండిదమయంతినిఁ బెండ్లియాడె, దశరథసుతుఁడే
సమయించి రావణాసురు
సమరమునను, లంకనుండి జానకి తెచ్చెన్(కాచెన్)
అన్నపరెడ్డి వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
=======================
దమయంతిన్ దగ బెండ్లి యాడెను
గదా ధర్మాత్ము డా రాముడే
========================
నలుడి భార్యగా సుపరిచతమైన
దమయంతిని ధర్మాత్ముడు అయిన
రాముడు కోర్కె మీరగ వివాహం
చేసుకున్నాడని చెప్పటంలో పరస్పర
విరుద్ద అర్థము - సమస్య
=========================
సమస్యా పూరణము - 219
===================
విధర్భ రాజు భీమసుత
దమన వరప్రసాదిత నలుడి సహచరిత
పతి యెడలన్ అనురాగ భరిత
అందమున ఇతరులనోడించు వనిత
దమయంతి యన అర్థములు
పెక్కుండెను సీతగా వివరము నరయుడే
దమయంతిన్ దగ బెండ్లి యాడెను
గదా ధర్మాత్ము డా రాముడే
====##$##====
దమనుడు అనే ముని వరప్రసాదమున
పుట్టినదిగా, విధర్భను పాలించే భీముడి
కూతురిగా , నలమహారాజు దేవేరిగా
మాత్రమే కాక దమయంతి యనగా పతి
యెడల మిక్కిలి అనురాగము గల స్త్రీ
అనియు, తన అందముచే ఇతరులను
అణచునది లేదా ఓడించునదనియు
అర్థములు కలవు. అట్టి యెడ తన పట్ల
మిక్కిలి అనురాగమును కలిగినదియు,
గొప్ప సౌందర్యవతి అయినదియు అగు
సీతను కోర్కె మీరగ రాముడు వివాహం
చేసుకున్నాడని భావము.
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం )
రిప్లయితొలగించండినమనము లయ్యా కందివ
ర! మరిమరి యటునిటు త్రిప్పి రామాయణమున్
గమనము గా చూచితి యే
దమయంతినిఁ బెండ్లియాడె దశరథసుతుఁడే ?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ ప్రశ్నారూపమైన పూరణ బాగున్నది. అభినందనలు.
తమిగొని నాడా నలుడే
రిప్లయితొలగించండిదమయంతినిఁ బెండ్లియాడె; దశరథసుతుఁడే
గమకించి జనకుని సభను
శ్రమ నొందక శివుని ధనసు క్షణమున నెత్తెన్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విమలాత్ముండగు రామచంద్రుడు వెసన్ విశ్వాత్ము చాపమ్ము తా
రిప్లయితొలగించండికమనీయమ్ముగఁ ద్రుంచి కొల్వునను విక్రాంతమ్ముతో శోభిలన్
రమణీరత్నము నేలపట్టి కడు హర్షంమొంద నాజానకిన్
దమయంతిన్ దగఁ బెండ్లియాడెను గదా ధర్మాత్ముఁ డారాముఁడే
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుమనస్కుండు నిషధ పతి
రిప్లయితొలగించండిదమయంతినిఁ బెండ్లియాడె దశరథసుతుఁడే
యమిత దయ రక్ష సేసె ని
డుమ లందు వనములఁ దిరిగెడు తరుణ మందున్
విమలాంతఃకరణుండు సత్యరత గంభీరేద్ధ ధానుష్కుఁడున్
సమదేభాభ సు సంప్రహార నుత సచ్చారిత్ర సీతా సతిం
గమనీయంబుగ లక్ష్మి నాఁ బరగు సత్కాంతా మణిన్ విష్ణు చం
దమ యంతిం దగఁ బెండ్లియాడెను గదా ధర్మాత్ముఁ డా రాముఁడే
[అంతి = సంతోషము]
20/12/2017 నాటి సాదృశ సమస్యాపూరణ:
తొలగించండిక్రమముగ సురలను మెప్పిం
చి మహారాజు నిషధ ధవ శేఖరుఁడు పరా
క్రమ నలుఁడు వీరసేనుని,
దమయంతినిఁ బెండ్లియాడె, ధర్మసుతుఁ డొగిన్
[ధర్మసుతుఁడు = న్యాయమైన కొడుకు/ ఔరస పుత్రుఁడు]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణల గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. ధన్యోస్మి.
తొలగించండిడా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిరమణగ యూరేగింపుల
సమధిక శుభ రథములు పది సంపాదించెన్
కమనీయగుణ యనాథను,
'దమయంతిని' బెండ్లియాడె దశ రథ సుతుడే!
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిక్షమకుం బేరును స్వచ్ఛ రూపమన తత్సాధ్వీమణీ చీరనున్
రమణన్ వే పతి కిచ్చి గప్పుకొన మర్యాదౌనె యంచెంచ దా
రమణీ సీతయు నార చీరల గనన్ రాణీ కుటుంబంబెంచదే!
దమయంతిన్ దగ బెండ్లి యాడెను గదా ధర్మాత్ముడౌ రాముడే!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'రమణగ నూరేగింపుల' అనండి.
రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
రిప్లయితొలగించండిఇవ్వాళ్టికి ఉల్టాయే బెటరు :) Throw the ball back to court :)
సుమనుస్కుండగు వీరసేను సుతుడే శోభిల్ల ప్రాంగమ్ము లో
దమయంతిన్ దగఁ బెండ్లియాడెను గదా, ధర్మాత్ముఁ డా రాముఁడే
డ మయాన్నంబుగ గాధ లో తగలడెన్? డాంకారమున్జేసిరే
జమగట్టేరకొ మందబుద్ధులనుచున్ స్వామీ? అవాల్మీకమి
ద్ది మహాపాతక మైన యోచన సుమా! దిద్దండి మీ వాక్యమున్
జిలేబి
పూరణ బాగున్నది. ఒకటి రెండు వ్యావహారికాలు దొర్లాయి.
తొలగించండివిమలమనస్కుడగునలుడు
రిప్లయితొలగించండిదమయంతినిబెండ్లియాడె,దశరధసుతుడే
సమరంబొనరిచిరావణు
సమవర్తిన్దరికిపంపెసక్రోధనుడై
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రమకోర్చి నలుడు ప్రేమగ
రిప్లయితొలగించండిదమయంతినిబెండ్లియాడె!"దశరథసుతుడే
మమకారంబున ప్రజలకు
సమతుల్యత బంచిబెంచె సర్వులుమెచ్చన్"
తొలగించండిశ్రమకోర్చి :) దమయంతి యే వచ్చి వర మాల వేస్తే ను :)
జిలేబి
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
స్వయంవరానికి ముందు నలుడు కొంత శ్రమపడ్డాడు. దేవతలు తమలో ఒకరిని వరించేవిధంగా దమయంతిని ఒప్పించమని నలున్నే పంపారు.
విమలుండానరపుంగవున్నలుడువేసారబ్రేమోద్భటిన్
రిప్లయితొలగించండిదమయంతిన్ధగబెండ్లియాడెనుగదా,ధర్మాత్ముడారాముడే
క్షమకున్భారమువీడగాదలచియాక్షణంబెమూకుమ్మడి
న్సమవర్తిన్దరిజేర్చెనాఖలులదాసారించివిల్లంబులన్
విమలుండౌ నర దేవుఁ డా నలుఁడు సంప్రీతిన్ సతీరత్న మా
తొలగించండిదమయంతిందగఁ బెండ్లి యాడెను గదా,ధర్మాత్ముఁ డా రాముఁడే
క్షమకు న్భారము తీర్పగాఁ దలఁచి తత్కాలంబ మూ కుమ్మడి
న్సమవర్త్యంకము సేర్చె నా ఖలులఁ దా సారించి నారిన్ వడిన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ సోదరుల సవరణతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
కమనీయంబుగ నలుడట
రిప్లయితొలగించండిదమయంతిని పెండ్లియాడె; దశరథ సుతుడే
సుమశోభిత యగుచు వరలు
రమణిన్ సీతను గొనుచు విరాజిలె భువిలో!
శిష్ట్లా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విమల గుణోపేతను, పూ
రిప్లయితొలగించండిత మహీనందినిని, జనక తనయను, సీతన్
రమాకృతిని, దుర్భావపు
దమయంతిని బెండ్లి యాడె దశరథ సుతుడే
శమయంతిని, సుగుణమ్ముల
రమయంతిని, మైథిలిని, ధరా ప్రియ సూనన్
విమలాత్మను, కుగుణమ్ముల
దమయంతిని బెండ్లి యాడె దశరథ సుతుడే
విజయకుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవపాదం ప్రారంభంలో జగణం వేయరాదు కదా!
విమలాత్ముండగు రాఘవుండెగద శ్రీవిష్ణుస్వరూపుండటన్
రిప్లయితొలగించండిరమయే పుట్టెను సీతయై ముదముతో రామున్ వరింపంగ నా
కమలాక్షుండట చాపమెత్తి సుదతిన్ కామాక్షియౌ జానకిన్
దమ యంతిన్ దగ బెండ్లియాడెను గదా ధర్మాత్ముడా రాముడే
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులు శ్రీ సూరం వారికి ప్రణామాలతో..
రిప్లయితొలగించండివిమలాత్మిక, జనకజ, నా
కమలాలయ, బైడినెలత, క్ష్మాసుత, సీతన్
సుమతి సునీతి నహంతా
*"దమయంతినిఁ బెండ్లియాడె దశరథసుతుఁడే"*
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅమలిన మనమున్న నలుడు
దమయంతినిఁ బెండ్లియాడె,దశరథసుతుఁడే
ప్రమథాధిపు ధనువెత్తగ
సుమనసులటమెచ్చ కురిసె సుమవర్షంబే.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
dhanya vaadamulu G.P.S. VARU
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండికమనీయమైన నటనన్
సమర్థులన పాత్ర పేరె సార్థకమైనన్
సమకూర వధూవరులుగ
దమయంతినిఁ బెండ్లియాడెదశరథసుతుఁడే
మత్తేభవిక్రీడితము
కమనీయమ్మగు వారివౌ నటనలన్గౌశల్యమున్ జూపగన్
తమవౌ పాత్రల పేర్లు సార్థకమునై ధన్యత్వ మున్ బొందగన్
రమణీయమ్మగు పెండ్లి వేదిననిరేరంజిల్లుచున్ బ్రేక్షకుల్
"దమయంతిన్ దగఁ బెండ్లియాడెను గదా ధర్మాత్ముఁ డారాముఁడే"
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిక్షమకుం బేరును స్వచ్ఛ రూపమన తత్సాధ్వీమణీ చీరనున్
రమణన్ వే పతి కిచ్చి గప్పుకొన మర్యాదౌనె యంచెంచ దా
రమణీ సీతయు నార చీరల గనన్ రాణీ కుటుంబంబెంచదే!
దమయంతిన్ దగ బెండ్లి యాడెను గదా ధర్మాత్ముడౌ రాముడే!
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిరమణగ యూరేగింపుల
సమధిక శుభ రథములు పది సంపాదించెన్
కమనీయగుణ యనాథను,
'దమయంతిని' బెండ్లియాడె దశ రథ సుతుడే!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదం చివర గణదోషం.
రెండవ పూరణలో 'రమణగ నూరేగింపుల' అనండి.
డా}.పిట్టా నుండి
రిప్లయితొలగించండిఆర్యా, ధన్యవాదములు.2వపూ.3వ పాదంలో "రాణీ కుటుంబీకయే" తో సవరణ
...............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
దమయంతినిఁ బెండ్లియాడె దశరథసుతుఁడే
సందర్భము: శమయంతి దమయంతి అర్థా లందరికీ తెలిసేట్టుగా సులభంగా గుర్తుం చుకునేలా తేలికైన పద్యం..
==============================
శమ మింద్రియ నిగ్రహ మగు..
శమయంతినిఁ బెండ్లి యాడె జనక సుపుత్రిన్..
దమము మనో నిగ్రహ మగు..
దమయంతినిఁ బెండ్లియాడె దశరథ సుతుఁడే
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
7-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
కమనీయమ్మగు రామగాథనటతా క్రమ్మించి వైరుధ్యమున్
రిప్లయితొలగించండితిమురున్ మీరగ రంగనాయకమ భల్ తేల్చంగ వైషమ్యునన్
యమలోకమ్ముకు నేగుచున్ పలికెతా నానందమొప్పారగా:👇
"దమయంతిన్ దగఁ బెండ్లియాడెను గదా ధర్మాత్ముఁ డారాముఁడే"