గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2756 సమస్య :: యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే. యతులు ప్రాసలు లేని పద్యాలే మేలు అని గురువులు చెబుతున్నారు కదా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: తెలుగులో పద్యాలు వ్రాయాలంటే యతులతో ప్రాసలతో చాలా కష్టంగా ఉంది అని విచారించే వారు ఇక మీద సంస్కృత భాషలో పద్యాలు సులభంగా వ్రాయవచ్చు. సంస్కృతంలో యతి అంటే విరామం మాత్రమే. పాదం లోని మొదటి అక్షరానికి తగిన మిత్రాక్షరాన్ని యతిస్థానంలో ఉంచవలసిన అవసరం లేదు. ప్రాస నియమాన్ని పాటించవలసిన అవసరం లేనే లేదు. కాబట్టి కవులారా! కష్టపడవలసిన పని లేకుండా సులభంగా దేవభాషలో పద్యాలు వ్రాసి (విబుధుల) దేవతల ఆమోదాన్ని కూడా పొంది విశ్వ శ్రేయస్సును ప్రసాదించండి అని గురువులు చెబుతున్నారు కదా అని విశదీకరించే సందర్భం.
యతులున్ ప్రాసలు నిల్పి పద్యముల వ్రాయంబూన నాంధ్రమ్మునం దతి కష్టం బని పల్కు వార, లిక శ్రేయమ్మున్ బ్రసాదింప సం స్కృత మందున్ విరచించి మించి విబుధ స్వీకారముం గాంచుడీ, ‘’యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే.’’ కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (8-8-2018)
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ======================== యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే ========================== ఛందోబద్దమైన పద్యములకు యతులు ప్రాసలే ప్రాణములై ఉండ, అవి లేని పద్యములే బాగుండునని గురువులు చెప్పినారనుటలో అసంబద్దమే సమస్య =========================== సమస్యా పూరణము - 220 ====================
యతులకై పోరు మతులవి జారు ప్రాసలను చూడగ అదే జోరు వాక్యములవి విరిగిన తీరు భావమెక్కదుగ అర్థమౌ తేరు మెజారిటీలదె మెచ్చగ లేరు మైనారిటిలిదె మారగ బోరు యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచును గురుల్ సెప్పరే
====##$##====
ఛందోబద్ద పద్యమును వ్రాయు పరంపరగ యతుల కోసం పోరాడితె మన మతులవి పోవును తప్పక, అలాగే ప్రాసల కోసం ప్రాకులాడటమనునది కూడా మనలను ఉక్కిరి బిక్కిరి చేయుట తథ్యం. అంతియే కాదు గణముల లెక్కింపు క్రమమున వాక్య ములను ముక్కలుగా నరికి పై పాదము కింది పాదములలో సర్దుబాటు చేయవలసి ఉంటుంది. భావము ఒక పట్టాన అంతు బట్టి రథమునెక్కి ఊరేగదు. అధిక సంఖ్యా కులైన పామరులకు అర్థమవదు కావున వారు మెచ్చుకోరు, అల్ప సంఖ్యాకులైన పండితులు మాత్రం తమ మార్గమొదిలి ఇవతలికి రారు. ఇట్టియెడ యతులు ప్రాస లు లేని పద్యములే మంచివని గురువులు సెలవిచ్చినారని భావము.
...............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య🤷♀.................... యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
సందర్భము: ఎటువంటి ఆదర్శాలూ లేకుండా తాము చెప్పినట్టల్లా (గంగిరెద్దుల్లా) తల లూపే మగలు కావాలని కోరుకుంటారు మగువలు. (వాళ్ళ ఆదర్శాలు వాళ్ళ కుంటాయి కదా.. అనుకోరు.) అట్లాగే వున్నది యీ వ్యవహారం. ============================== ఎట్టి యాదర్శములు లేని యట్టి మగలు
మాకుఁ గావలె ననుచుంద్రు మగువ లెపుడు..
నటులె యన్న దీ వ్యవహార; మనగఁ దగునె!
"యతులు ప్రాసలు లేని పద్యములు మేలు"
మరొక పూరణము:
సందర్భము: "పద్య" మనే శబ్దం మాత్రం కావా లట! ఎందుకు? దానికి కొంత పేరొచ్చింది కదా! పద్యంలోని యతి ప్రాసలు మాత్రం అక్కర్లే దట! టీ లేని టీ కప్పు మేలు మేలు.. అన్న ట్టున్నది. ============================== "పద్య" మను శబ్దమును వీడి పలుకలేరు.. పద్యమున యతి ప్రాసలు వ ద్దనెదరు.. మెరయు టీ లేని టీకప్పు మేలె యయిన యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
✒~ డా. వెలుదండ సత్య నారాయణ 8-8-18 """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మేలు + అనుచు = మేలనుచు' అవుతుంది. యడాగమం రాదు. "మే ల।టంచు..." అనండి. కన్నడంలో ప్రాస ఉంది. యతి లేదు. తమిళంలో యతి ఉంది. ప్రాస లేదు.
కాని యతిప్రాసలను సరిగా వినియోగించిన సందర్భాలూ వినియోగించని సందర్భాలూ కూడా కొల్లలేను. అక్షరసామ్యయతిని కిట్టించటం కోసం కృతకంగా పదాలను అతికించటం సర్వసాధారణం . ఇక ప్రాసకోసం చేసే కిట్టింపు వ్యవహారం ఇంకా దారుణం. కృతకపదావళికి తోడు అనవసరమైన పాదోల్లంఘనలూ వాడటం మామూలు వ్యవహారమే. కాని చేయితిరిగిన కవులు ఇవి మరీ తెలిసిపోకుండా జాగ్రత్త పడగలరు. అలా జాగ్రత పడటం కుదరని పద్యాలు పడుతూ లేస్తూ నడుస్తుంటాయని చదువరులందరికీ తెలిసిందే.
వీలైనంతవరకూ పాదోల్లంఘనలు పరిహరిస్తూ, యతిస్థానం అనబడే విరామస్థానం పదం మధ్యలో పడకుండా జాగ్రత తీసుకోగలిగితే పద్యాలు శోభిస్తాయి మరింతగా.
ఈ యతిప్రాసల గొడవ వదిలేసి బెంగలీ కవి మైకేల్ మధుసూదన్ దత్ అనే కవి మేఘనాధ వధ కావ్యం వ్రాసి సంచలనం సృష్టించాడని చిన్నప్పుడు చదివాను.
శ్రవణసుభగత్వ మెంతయు చెవుల నిడని
రిప్లయితొలగించండిఛందమందలి సొగసులు చవులు గాని
శబ్దసంపద కరవైన షండకవికి
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు .
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండిఉప్పు కారము లన్నను మెప్పు కాదు
రిప్లయితొలగించండితిండి కాంక్షలు పెట్టగ దిమ్మ దిరిగె
యుగపు మహిమలు పెరిగెను యోగ విద్య
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
అక్కయ్యా,
తొలగించండిమీ పద్యభావం అవగాహనకు రాలేదు...?
రిప్లయితొలగించండిబస్తీ మే సవాల్ :)
అడ్డా లోనే సవాల్ :)
గతి శృతుల పామరులనెల్ల కట్టి వేయు
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
గీతములు హాయిగొల్పుచు కిక్కు చేర్చు
సత్య మిదియె ధాటిగ చెప్ప జంకు లేదు !
నారదా
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్య మన్ననెఱుంగని పామరుండు
రిప్లయితొలగించండిపలికె నీరీతి సఖునితో వచనమందు
కవిత జెప్పెడు వారలే కవులు ఘనులు
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండి"యతులు ప్రాసలు లేని పద్యములు మేలు"
తే.గీ*
పద్యము రచించ లేనట్టి గద్యకవియు
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
పదుగురు సులువుగా గ్రహించెదరటంచు
పద్యములపైన విరుచుకు పడెను కుకవి
.................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసమస్యాపూరణం...
యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే !!
తాతయ్య... మనుమరాలుతో...
ప్రతిమా ! పద్యములెన్నగా
గణయతిప్రాసాదిసంబద్ధముల్ !
కృతులన్ వ్రాసిరి నన్నయాదులిటులే ! యెంతో శ్రమన్ పొంది ., నీ
మతికిన్ చిక్కవటంచు లక్షణములన్ మార్చంగ రాదమ్మడూ !
యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిడా.ఎన్.వి.ఎన్.చారి
రిప్లయితొలగించండిమతికిన్ ధారయు దట్టినన్ సులభ సన్మార్గమ్మె పద్యంబునౌ
యతులున్ ప్రాసలు పద్యమున్ సహజ
సద్యస్పూర్తి జేరున్ గదా!
అతుకుల్ బెట్టుటకంటె ముత్యసర మందారంభమున్ జేయగా
యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచు గురుల్ సెప్పరే
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ముత్యసరము'...?
కామ్యమై, శ్రావ్యమై, రస రమ్య మగుచు
రిప్లయితొలగించండిసార భావమ్ముతో దివ్య ధార తోడ
శిష్ట పదములు కలిగి యనిష్ట దుష్ట
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
విజయకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దుష్ట' విశేషణం కేవలం యతులకే వర్తిస్తున్నది. 'ప్రాసలు'? "శిష్టపదములు గలిగియు దుష్టమైన। యతులు ప్రాసలు..." అంటే బాగుంటుందేమో?
అవునండి. ప్రచురించాక నాకూ అదే అనుమానం వచ్చింది. మీ సవరణ బాగుంది. ధన్యవాదాలు.
తొలగించండి
రిప్లయితొలగించండియతనంబెంతయు జేసి నాను కవిరాట్ యజ్ఞంబు గాసూవె ! హా
వెతలాయెన్ పద బంధ ముల్ సుఖముగా వేగంబు వేగంబు గా
జతగాంచంగ జిలేబు లై యమరలే జవ్వాదు లన్దీర్చుచున్
యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జాతినుద్ధరించ రచనసలుప నెంచ
రిప్లయితొలగించండియతులు ప్రాసలు లేనిపద్యములు మేలు
గతలచి రచించ సులభమె గాని యటుల
యతినికూడ చలుపక పద్యమననెటుల?
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శృతి లయలు లేని సంగీత కృతుల తీరు
రిప్లయితొలగించండితాళముద్రలు లేనట్టి తాండవంబు
ఉప్పుకారము లుప్తమై నోగిరమ్ము
తగిన వంచును జనమ్ము తలచెనేని
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదంలో గణదోషం. "తగిన వంచును జనులెల్ల తలతురేని* అనండి.
ధన్యవాదములు గురుదేవా! సవరించెదను!🙏🙏🙏
తొలగించండిశృతి లయలు లేని సంగీత కృతుల తీరు
తొలగించండితాళముద్రలు లేనట్టి తాండవంబు
ఉప్పుకారము లుప్తమై నోగిరమ్ము
తగిన వంచును జనులెల్ల తలతురేని
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు!
భావ గర్భిత ముగ నుండ వలెను రచన
రిప్లయితొలగించండిభావి తరములఁ దీర్చుచు భవిత కొఱకు
తేటగీతి యాటవెలది తీరులను కు-
*"యతులు ప్రాసలు లేని పద్యములు మేలు"*
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఛందమును నేర్పు కక్ష్యలో మందు డొకడు
రిప్లయితొలగించండిగురువు లఘువులు గణముల నెరుగలేక
యనుగుడైనట్టి సహపాఠి కనియె నిట్లు
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిశృతిలయలు లేని పాటలు, మతియె లేని
రిప్లయితొలగించండివాని మాటలు, గతిలేని వానిప్రేమ
యతులు ప్రాసలు లేని పద్యములు, మేలు
పరుల కొసగలేని ధనము వ్యర్థములిల.
విరించి గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
...............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
సందర్భము: తెలుగు పద్యానికి సహజములైన అలంకారాలు యతి ప్రాసలు.
వెన్నెలలు లేని జాబిల్లిని కోరినట్టుగా యతి ప్రాసలు లేని పద్యాన్ని కోరడ మేమిటి? ఇలా అనడ మేమిటి?
"యతి ప్రాసలు లేని పద్యాలు మేలు."
==============================
తెలుగు పద్య శశికి వెన్నెల లగు యతులు
ప్రాసలును; వెన్నెలలు లేని రాజు గలడె!
అట్టి శశిఁ గోర దగునె! యి ట్లనగఁ దగునె!
"యతులు ప్రాసలు లేని పద్యములు మేలు"
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
8-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[యతిప్రాసలు పద్యానికి వన్నెఁగూర్చును. అది తెలుఁగు పద్యానికి సహజాభరణము. అట్టి యతిప్రాసలను వాడవలదని నవ్య సంప్రదాయము తేఁదగునా? అటులయిన "యతిప్రాసములు లేని పద్యమే మేలైన" దని మన గురువులు చెప్పకుందురా? యని పద్యమున యతిప్రాసలు వలదనువారిని మందలించు సందర్భము]
యతులుం బ్రాసలు వన్నెఁగూర్చుచును, బద్యమ్మున్ మనోల్లాసిగా
సతముం జేయుచు నిల్చియుండెను మహిన్ సౌందర్య సంపాద్యమై!
గతమున్ మార్చఁగ నుత్సహింప నగునే, కాంక్షించి నవ్యత్వమున్?
"యతులున్ బ్రాసలు లేని పద్యములె మే"లంచున్ గురుల్ సెప్పరే?
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2756
సమస్య :: యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే.
యతులు ప్రాసలు లేని పద్యాలే మేలు అని గురువులు చెబుతున్నారు కదా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: తెలుగులో పద్యాలు వ్రాయాలంటే యతులతో ప్రాసలతో చాలా కష్టంగా ఉంది అని విచారించే వారు ఇక మీద సంస్కృత భాషలో పద్యాలు సులభంగా వ్రాయవచ్చు. సంస్కృతంలో యతి అంటే విరామం మాత్రమే. పాదం లోని మొదటి అక్షరానికి తగిన మిత్రాక్షరాన్ని యతిస్థానంలో ఉంచవలసిన అవసరం లేదు. ప్రాస నియమాన్ని పాటించవలసిన అవసరం లేనే లేదు. కాబట్టి కవులారా! కష్టపడవలసిన పని లేకుండా సులభంగా దేవభాషలో పద్యాలు వ్రాసి (విబుధుల) దేవతల ఆమోదాన్ని కూడా పొంది విశ్వ శ్రేయస్సును ప్రసాదించండి అని గురువులు చెబుతున్నారు కదా అని విశదీకరించే సందర్భం.
యతులున్ ప్రాసలు నిల్పి పద్యముల వ్రాయంబూన నాంధ్రమ్మునం
దతి కష్టం బని పల్కు వార, లిక శ్రేయమ్మున్ బ్రసాదింప సం
స్కృత మందున్ విరచించి మించి విబుధ స్వీకారముం గాంచుడీ,
‘’యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే.’’
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (8-8-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చాలా బాగుంది.
తొలగించండిబాగుబాగు! బహుమంచి యోచన అవధానిగారూ!! 👌👌👌
రిప్లయితొలగించండికాని మావంటి వారికి “గంజికి గతిలేదంటే పరమాన్నం తినమన్నట్లుంది” 😊😊😊
తొలగించండిఅదురహో రాజశేఖరులు ఆపై డబల్ అదురహో సీతాదేవి గారు :)
రాజ శేఖరులు పలికి రౌర సంస్కృ
తమ్మున సులభ మగు వ్రాయ తరముగాను
యతులు ప్రాసలు లేని పద్యములు! మేలు!
గంజికి గతిలే పాసము గదుకుటయకొ :)
జిలేబి
శ్రీమతి సీతాదేవి గారికి ప్రణామాలు.
తొలగించండిసహృదయులు జిలేబి గారికి
తొలగించండిపద్యరూప ప్రశంస నందించినందులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
========================
యతులున్ బ్రాసలు లేని పద్యములె
మేలంచున్ గురుల్ సెప్పరే
==========================
ఛందోబద్దమైన పద్యములకు యతులు
ప్రాసలే ప్రాణములై ఉండ, అవి లేని
పద్యములే బాగుండునని గురువులు
చెప్పినారనుటలో అసంబద్దమే సమస్య
===========================
సమస్యా పూరణము - 220
====================
యతులకై పోరు మతులవి జారు
ప్రాసలను చూడగ అదే జోరు
వాక్యములవి విరిగిన తీరు
భావమెక్కదుగ అర్థమౌ తేరు
మెజారిటీలదె మెచ్చగ లేరు
మైనారిటిలిదె మారగ బోరు
యతులున్ బ్రాసలు లేని పద్యములె
మేలంచును గురుల్ సెప్పరే
====##$##====
ఛందోబద్ద పద్యమును వ్రాయు పరంపరగ
యతుల కోసం పోరాడితె మన మతులవి
పోవును తప్పక, అలాగే ప్రాసల కోసం
ప్రాకులాడటమనునది కూడా మనలను
ఉక్కిరి బిక్కిరి చేయుట తథ్యం. అంతియే
కాదు గణముల లెక్కింపు క్రమమున వాక్య
ములను ముక్కలుగా నరికి పై పాదము
కింది పాదములలో సర్దుబాటు చేయవలసి
ఉంటుంది. భావము ఒక పట్టాన అంతు
బట్టి రథమునెక్కి ఊరేగదు. అధిక సంఖ్యా
కులైన పామరులకు అర్థమవదు కావున
వారు మెచ్చుకోరు, అల్ప సంఖ్యాకులైన
పండితులు మాత్రం తమ మార్గమొదిలి
ఇవతలికి రారు. ఇట్టియెడ యతులు ప్రాస
లు లేని పద్యములే మంచివని గురువులు
సెలవిచ్చినారని భావము.
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
--- ఇట్టె రమేష్
( శుభోదయం )
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపద్య ఛందస్సు లెవ్వియు పట్ట లేని
గేయ వచన గీతమ్ముల కృతుల నల్లు
గ్రంథకారుల కెల్లను కక్కరమగు
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాజా రావు గారు “పద్య + ఛందస్సు” పద్యచ్ఛందస్సు సాధువండి.
తొలగించండిబ్లాగు విడచి వెళ్ళునపుడు పద్యములను
రిప్లయితొలగించండిచూచి దోషములను తెల్పు సుముఖుడెవరు
లేరు, కఠినమౌ ప్రాసల పూరణములు
చేయ మనుచుండు గురువులు చిత్ర గతిని,
హతవిధీ నేమి చేతును సతము నుండ
భావ్యము గదా సరసముగ పద్యములకు
యతులు, ప్రాసలు లేని పద్యములు మేలు,
సీస పద్యము ల్జాలును పూసపాటి
మార్చు మెపుడు కందమును మనసు బెట్టి
ప్రాస లేనట్టి ఘనమైన సీసమునకు
తొలగించండిసీస మొక్కటి చాలద చింత దీర్చి
పూస పాటిగ పద్యము పొంగుగాన :)
జిలేబి
తొలగించండిమనకదేల జిలేబియ! మదిరనయన!
యతులు ప్రాసలు లేని పద్యములు? మేలు
సీస మొక్కటి చాలద చింత దీర్చ
పూస పాటిగ పద్యము పొంగుగాన :)
జిలేబి
పూసపాటి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
__/\__
పద్య రచనకై పూనియు పాటుపడగ
రిప్లయితొలగించండియతులు ప్రాసలు కుదరక యలమటించి
(విసిగి చీకాకు పడిపోయి వేసరిల్లి)
తలచె నొక్కడు తుదకును తాను మదిని
"యతులు ప్రాసలు లేని పద్యములు మేలు"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గణములననవ గాహనగానియట్టి
రిప్లయితొలగించండిమందజనులకుసులువుగమదికిదెలియ
యతులుప్రాసలులేనిపద్యములుమేలు
ఛందయుతమైనపద్యాలెయందగించు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఛందోయుతమైన' అనడం సాధువు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅతడా మేటి కవిత్వ వైఖరి ననాయాసమ్ముగా వల్లెవే
య తయారైనను పద్యఛందముల ఛాయన్నేమి నేర్వంగ లే
ని తఱిన్ గద్దెపు గేయముల్ వచన నానీలున్ మఱింకన్సదా
యతులున్ ప్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే?
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శృతిశుద్ధంబు లయాత్మకంబవని శాస్త్రీయంబగున్ గీతమున్
రిప్లయితొలగించండిజతులున్ తాళము ముద్రలన్ గనని లాస్యంబున్ కళారాధనన్
హితమౌ కారము క్షారలుప్తము చవీహీనోగిరంబున్ దగన్
మితవాదంబని మూఢులే బొగడ నిర్భీతిన్ జనామోదమన్
యతులున్ బ్రాసలు లేని పద్యములు మేలంచున్ గురుల్ చెప్పరే
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చవీహీనము' దుష్టసమాసం.
ధన్యవాదములు గురుదేవా! సవరణ మీరే సూచించ ప్రార్ధన! 🙏🙏🙏
తొలగించండియతి విరామమే మిత్రత్వ మవసరమ్ము
రిప్లయితొలగించండిలేక యతి పురాతనములు ప్రాకటంపు
సురవ రోచిత సంస్కృత శ్లోకము లవి ,
యతులు ప్రాసలు లేని పద్యములు, మేలు
విత తార్థ ద్యుతి వెల్గు చుండగను బ్రావీణ్యంపు శబ్ద ప్రభన్
నుతియింపం బడఁ బండి తోత్తముల చే నోరార రమ్యంబుగన్
శృతి కానందము గూర్పఁ దోడ్పడఁగ వైచిత్ర్యమ్ము దోషంబులౌ
యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండియతుల నియమాలు లేని గేయమములు నిలువ
జాల వేనోట నిలను బ్రజాళి మెచ్చు
ప్రాస నియమపు వృత్తాలు ప్రాపు గనియె
యతులు ప్రాసలు లేని పద్యములు "మే..హ్..".లు
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మే...హ్..'...?
డా}పిట్టానుండి
తొలగించండిఆర్యా}, అవి మేకల అరపులు.
భావ మెంత యున్నను గాని వాసి నిడవు
రిప్లయితొలగించండియతులు ప్రాసలు లేని పద్యములు! మేలు
జాతి కైతల బడయంగ ఛంద మనెడి
భాండమున చింతనల వండి వార్చ వలయు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిడా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిగతికిన్ శుద్ధ మతీ లలామలకు వే గంభీరమౌ చాలనం
బతుకున్ సోయగ మబ్బ హాయి గనగా"నబ్బబ్బ వాడేమి యా
శృతి దప్పెన్ గొన బ్రాసయేది జతకున్ శుద్ధాటవీ జీవియే?!"
యతులున్ బ్రాసలు లేని పద్యములు"మే..!(మేకల అరుపులు)లంచున్ గురుల్ సెప్పరే!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
...............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
సందర్భము: ఎటువంటి ఆదర్శాలూ లేకుండా తాము చెప్పినట్టల్లా (గంగిరెద్దుల్లా) తల లూపే మగలు కావాలని కోరుకుంటారు మగువలు. (వాళ్ళ ఆదర్శాలు వాళ్ళ కుంటాయి కదా.. అనుకోరు.)
అట్లాగే వున్నది యీ వ్యవహారం.
==============================
ఎట్టి యాదర్శములు లేని యట్టి మగలు
మాకుఁ గావలె ననుచుంద్రు మగువ లెపుడు..
నటులె యన్న దీ వ్యవహార; మనగఁ దగునె!
"యతులు ప్రాసలు లేని పద్యములు మేలు"
మరొక పూరణము:
సందర్భము: "పద్య" మనే శబ్దం మాత్రం కావా లట! ఎందుకు? దానికి కొంత పేరొచ్చింది కదా! పద్యంలోని యతి ప్రాసలు మాత్రం అక్కర్లే దట!
టీ లేని టీ కప్పు మేలు మేలు.. అన్న ట్టున్నది.
==============================
"పద్య" మను శబ్దమును వీడి పలుకలేరు..
పద్యమున యతి ప్రాసలు వ ద్దనెదరు..
మెరయు టీ లేని టీకప్పు మేలె యయిన
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
8-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
యతులుప్రాసలు లేనిపద్యములుమేలు
రిప్లయితొలగించండియనుచు కన్నడిగులు మాన?"వినుటకింపు
దగ్గ!రాయలుదెలుపుచు నిగ్గుదేల్చె
భాషలన్నిట తెలుగన్న పలుకుమిన్న
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మేలు + అనుచు = మేలనుచు' అవుతుంది. యడాగమం రాదు. "మే ల।టంచు..." అనండి.
కన్నడంలో ప్రాస ఉంది. యతి లేదు. తమిళంలో యతి ఉంది. ప్రాస లేదు.
తెలుగులో యతిప్రాసలు రెండూ ఉన్నాయి.
తొలగించండికాని యతిప్రాసలను సరిగా వినియోగించిన సందర్భాలూ వినియోగించని సందర్భాలూ కూడా కొల్లలేను. అక్షరసామ్యయతిని కిట్టించటం కోసం కృతకంగా పదాలను అతికించటం సర్వసాధారణం . ఇక ప్రాసకోసం చేసే కిట్టింపు వ్యవహారం ఇంకా దారుణం. కృతకపదావళికి తోడు అనవసరమైన పాదోల్లంఘనలూ వాడటం మామూలు వ్యవహారమే. కాని చేయితిరిగిన కవులు ఇవి మరీ తెలిసిపోకుండా జాగ్రత్త పడగలరు. అలా జాగ్రత పడటం కుదరని పద్యాలు పడుతూ లేస్తూ నడుస్తుంటాయని చదువరులందరికీ తెలిసిందే.
వీలైనంతవరకూ పాదోల్లంఘనలు పరిహరిస్తూ, యతిస్థానం అనబడే విరామస్థానం పదం మధ్యలో పడకుండా జాగ్రత తీసుకోగలిగితే పద్యాలు శోభిస్తాయి మరింతగా.
ఈ యతిప్రాసల గొడవ వదిలేసి బెంగలీ కవి మైకేల్ మధుసూదన్ దత్ అనే కవి మేఘనాధ వధ కావ్యం వ్రాసి సంచలనం సృష్టించాడని చిన్నప్పుడు చదివాను.
రిప్లయితొలగించండిచదువ సులభము గా నుండి చక్క దనపు
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు!
గ్రోల మదిరము కైపును గూర్చ వలయు
నంతయె!యది యేపాత్రలోనైన నేమి :)
జిలేబి
తొలగించండిపై పద్యము జీపీయెస్ వారి కొసరు బకాయి :(
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జిలేబీ:
తొలగించండిఅత్త నైతిని ముట్టక దుత్తనిపుడు
చూచుచుంటిని సణుగుచు వేచియుండి
కోడలెట్టుల జేయునో కోడి కూర...
పూర్తి జేయునొ నెట్టులొ పూరణమ్ము:
"యతులు ప్రాసలు లేని పద్యములు మేలు"
తొలగించండిఇంక ఆటవిడుపు వృత్తము రావడమే తరువాయి :)
వెల్కం బెకబెక !
జిలేబి
మతియే లేని విధమ్మునన్ పలుకగన్ మన్నింపరీ లోకులే
రిప్లయితొలగించండిగతమున్ గాంచగ పండితోత్తముల సత్కావ్యమ్ములో నుండవే
యతులున్ బ్రాసలు లేని పద్యములె, మేలంచున్ గురుల్ సెప్పిరే
శ్రుతియున్ శ్రావ్యత యున్న పద్యములనీ లోకమ్ములో నిల్చు నే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్తుతి సంవర్ధనులైరి సంస్కృత కవీశుల్ కావ్య పద్యమ్ములన్
రిప్లయితొలగించండితత వైశిష్ట్య విశేష సత్కవన శబ్దప్రాభవావిష్కృతిన్
కృతికిన్ భావము లక్షరమ్ములు సుసంకీర్ణమ్ములై నిల్వగాఁ
యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ప్రాసలేలేని పద్యముల్ భళిర యనగ
రిప్లయితొలగించండియతులె లేనట్టి పద్యము ల్వెతుక తరమె ?
పద్య విద్య నెరుంగని పామరుడనె
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*సవరణతో*
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య
*యతులు ప్రాసలు లేని పద్యములు మేలు*
పూరణ
పద్యమును చదువ గలిగి వ్రాయలేరు
భావము సులువుగా బోధపడని వారు
వచన కవిత మధుర మని పలుకుదురిటు
*యతులు ప్రాసలు లేని పద్యములు మేలు*
హంసగీతి
8.8.18
గీత గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతివా ప్రాసగు నందమైన కడియా లా యమ్మ పాదాలకున్
రిప్లయితొలగించండిసతికిన్ మెట్టెలు కాలి వ్రేళ్ళకు యతుల్ సౌభాగ్య చిహ్నంబు లౌ
పతితో కూడిన పద్య కాంత కివియే భాగ్యంబు లే తావునన్
యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువు గారికి.
తొలగించండిఅద్భుతమైన పూరణ మిస్సన్నగారూ! అభినందనలు!!💐💐💐
తొలగించండిధన్యవాదాలమ్మా సీతా దేవి గారూ.
తొలగించండి
రిప్లయితొలగించండిపద్యరచననకు వలయు వాసిగాను
యతులు ప్రాసలు తప్పక యవనియందు
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు
ననెడి వారలసలు పద్యమల్ల లేరు.
పద్యవిలువలు తెలిసిన వారలెవరు
యతులు ప్రాసలు లేని ॥పద్యములు మేలు
ననగ బోరు నిజమ్మిది యవనియందు
ప్రాణములగు ప్రాసలు,యతుల్ పద్యములకు
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తేటగీతి
రిప్లయితొలగించండిధీర్ఘ పదసమాసమ్ముల దిశను మార్చి
యతియె విశ్రాంతి గూర్చుచు నందమిడఁగ
పాదముల మువ్వలై మ్రోగ ప్రాస, లెటుల
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు?
మత్తేభవిక్రీడితము
అతుకుల్ వేయుచు మాటలన్ గలుపి నేనానందమున్ బొందగన్
యతియే దప్పెనె! యయ్యతిన్ బొదుగ పద్యమ్మందు ప్రాసల్ విడెన్
గతిఁదప్పెన్ గణముల్ ప్రభూ! యెటుల సాకారమ్మగున్ బద్యముల్
యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే?
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిధార్మికతను వచించు తత్వ సమ భాష
యతులు ప్రాసలు లేని పద్యములు మేలు.
కోటి దీపార్చనలకన్న కొమరు మిన్న.
విబుధ సుజన బృందములకు వినుత జేయ.
అతుకుల్ బొంతల కైతలన్ విరివిగా నాంధ్రమ్మునన్ జూడగా
రిప్లయితొలగించండిచతికిల్ బడ్చుచు మొత్తుచున్ తలలన్ శ్రాద్ధమ్ము మాదంచుచున్
మతిలేనట్టివి బంధముల్ తెలుగునున్ మండించు కాష్ఠమ్ములీ
యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే!