30, ఆగస్టు 2018, గురువారం

సమస్య - 2775 (హరికిఁ గైలాసము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె"
(లేదా...)
"కలిగెన్ గోరిక శ్రీసతీవిభునకున్ గైలాసమే యేలఁగన్"

79 కామెంట్‌లు:



  1. మా హరిబాబు తెలుగోడు తమిళనాట ముఖ్యమంత్రి‌నైపోతా అని సలహా అడిగేరు‌ :)


    పంచ దశలోకమందుటపాల వేయు
    హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె
    తమిళ నాటన ముఖ్యమంత్రైవెలయగ
    సభికుల తలపుల తెలుప సాయమడిగె :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మంత్రి + ఐ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "తాను మంత్రియై వెలయగ తమిళనాట" అందామా?

      తొలగించండి
  2. పరమ పదమేల చక్రికి భార మవగ
    ప్రమద గణముల తోగూడి పరమ ప్రీతి
    నాట్య మందున హేలగ నవత గోరి
    హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవగ' అన్నరూపం సాధువు కాదు. అక్కడ "భార మనగ" అనండి.

      తొలగించండి
    2. పరమ పదమేల చక్రికి భార మనగ
      ప్రమద గణముల తోగూడి పరమ ప్రీతి
      నాట్య మందున హేలగ నవత గోరి
      హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    జలజాతాసనసూతి వల్కె హరితో " స్వామీ! భుజంగమ్ముపై
    చలదబ్ధిన్ శయనింప నిద్ర యెటులౌ ? స్వప్నమ్ములెట్లౌను ? ని...
    శ్చలమౌ ప్రాంతము వెండికొండ ! యని ., యాశ్చర్యమ్మునన్ లీలగా
    కలిగెన్ గోరిక శ్రీసతీవిభునకున్ గైలాసమే యేలఁగన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. లలితార్ద్రామలలక్షణుండు మన కైలాసమ్ము ., ప్రత్యర్థిగా
      నిలిచెన్ దుర్గుణు.,డస్మదీయునకు రానిమ్మా ! జయమ్మంచు లో...
      కులు ప్రార్థింపగ మెచ్చి యెన్నికలలో గూర్చెన్ జయమ్మెన్నగన్
      కలిగెన్ గోరిక శ్రీసతీవిభునకున్ గైలాసమే యేలఁగన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  4. అల వైకుంఠము నేలగా హరుడు తా నాశించె చిత్రంబుగా
    *కలిగెన్ గోరిక శ్రీసతీవిభునకున్ గైలాసమే యేలఁగన్*
    యిలలో పూజల నందగా నలువతా నెన్నేళ్లుగా వేచెనో
    భళిరా!దూరపు కొండలే నునుపుగా భావించె నామూర్తులే

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏలగన్ + ఇలలో' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  5. శశిధరుడతడు జగమేలు జంగమయ్య
    యాదిమధ్యముల్ లేనట్టి యాదిభిక్షు
    వతడు భక్తపోషకుడైన భవుడు పాప
    హరికి కైలాస మేలెడు నాశ కలిగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో అఖండయతి. (దోష మనను కానీ...)

      తొలగించండి
  6. అప్సరోగణముల నాట్యమందు విసిగి
    భోగభాగ్యంబులను రోసి భూతనాథు
    నిర్వికారత, నిజతత్వ నిష్ఠ నచ్చ
    హరికి కైలాసమేలెడు నాశగలిగె

    హరి= ఇంద్రుడు( ఊహా జనితము)

    రిప్లయితొలగించండి
  7. బ్రహ్మ కోరెను హక్కును వారసత్వ
    ముగ గణించుచు వైకుంఠ పురముపైన
    శంభుడు స్మశాన భూమిలో సాగుచుండ
    హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె

    రిప్లయితొలగించండి
  8. నిరత యోగేంద్ర వందిత నిర్మలునకు
    పరగ వైకుంఠ వాసమే ప్రాణమయ్యె
    హరికి,-కైలాసమేలెడు నాశఁగలిగె
    చటుల తాండవ కేళికై శంకరునకు.

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2775
    సమస్య :: కలిగెన్ గోరిక శ్రీ సతీ విభునకున్ గైలాసమే యేలగన్.
    కైలాసాన్ని తన సొంతం చేసికొనాలని విష్ణుమార్తికి కోరిక కలిగింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: పది తలలు ఇరవై చేతులు ఉన్న రావణుడు బలగర్వంతో ఒకసారి కైలాస పర్వతాన్ని పెకలించి ఎత్తేందుకు ప్రయత్నం చేసినాడు. అప్పుడు కైలాస పర్వతం కొద్దిగా కంపించింది. అందుకు భయపడిన పార్వతి తన భర్త యైన పరమశివుని గట్టిగా కౌగలించుకొన్నది. ఈ విషయాన్ని తెలిసికొన్న విష్ణుమూర్తి ఆహా ! తనంత తానుగా భార్య భర్తను కౌగలించుకొనడం అంటే అది ఒక మహాభాగ్యం కదా! అటువంటి భాగ్యం నేను కూడా పొందితే బాగుంటుంది కదా అని ఆలోచించసాగినాడు. కొంతసేపటికి విష్ణుమూర్తికి ఒక ఆలోచన వచ్చింది. ఒక వింత కోరిక కలిగింది. కైలాసాన్ని తన సొంతం చేసుకోవాలి అన్నదే ఆ కోరిక అని ఊహించి చెప్పే సందర్భం.

    అల నా రావణు డెత్త గోరి బలిమిన్ బట్టంగఁ గైలాసమున్
    గలిగెన్ శూలికి భార్యకౌగిలియె, భాగ్య మ్మబ్బెగా వింతగా,
    గలుగన్ జాలునె యట్టి భాగ్య మని వీకన్ యోచనన్ జేయగా
    గలిగెన్ గోరిక శ్రీ సతీ విభునకున్ గైలాసమే యేలగన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (30-8-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
      అయినా ఆ భాగ్యానికి జడమైన కైలాసమే కావాలా? శేషుణ్ణి కాస్త కదలమంటే చాలదూ?

      తొలగించండి
    2. ఆదిశేషుడు కదలడం విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఆలింగనం కలగడం అప్పుడప్పుడూ ఉండేదే కదండీ. కైలాస పర్వతం పైన ఉండి ఉన్నట్టుండి తనకు తానుగా భార్య కౌగిలి లభించడంలో ఉండే ఆనందంలో ఉండే (వెరైటీ) ప్రత్యేకత వేఱుగా ఉంటుంది కదండీ. ఆ విషయం శివుని పేరు పెట్టుకొని ఉన్న మనకు తెలిసిందే కదండీ.

      తొలగించండి
  10. (మోహినీ రూపంతో భస్మాసురుని భస్మమయేలా చేసిన శ్రీహరికి కైలాసం బాగానచ్చింది)

    అలరన్ మోహినిరూపు దాల్చుచు మహాహంకారి భస్మాసురున్
    నిలువౌ బూడిదకుప్ప జేసిన సురానీకస్తుతుండా హరిన్
    బలువౌ నీశ్వరు నిత్యనిర్మలనిజావాసంబు సంస్తవ్యమై
    కలిగెన్ గోరిక శ్రీసతీవిభునకున్ కైలాసమే యేలగన్.

    రిప్లయితొలగించండి
  11. భువిని మృగరాజ పదవిని బుష్కలముగ
    ఖ్యాతినార్జించి బరగగ నాత్మయందు
    భృత్యువగుటను దలచుచు మృత్యుసమము
    హరికి కైలాసమేలెడు నాశగలిగె!

    హరి= సింహము

    రిప్లయితొలగించండి
  12. హరికి గైలాస మేలెదు నాశ కలిగె
    ననుట భక్తా ళి నమ్మక నందు రిటు ల
    హరికి హరునకు భేదమ్ము లసలు లేక
    నుందు రను మాట నమ్ము చూ నుల్లమందు
    _______కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నమ్మక యుందు...లేక యుందురను..." అనండి.

      తొలగించండి
  13. వరములివ్వగ?శివుని విశ్వాస మిడచి
    రావణుండట భావనరగుల తనల
    హరికి కైలాస మేలెడినాశగలిగె|
    ఆశ నత్యాస గామార?నధముడగును|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విడచి'ని 'ఇడచి' అనరాదు. "విశ్వాసము విడి" అనండి.

      తొలగించండి
  14. ధర్మ సంస్థాప నార్థమై ధరణి లోన
    పెక్కు సూక్తల విరచించి పేర్మి బొంది
    మిగుల సంతృప్తితో నాడు మేటి భర్తృ
    "హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె"

    రిప్లయితొలగించండి
  15. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    కలిగెను గోరిక శ్రీసతీ విభునకు
    గైలాసమే యేలగన్
    ======================
    వైకుంఠమునకు అధిపతియైన,
    లక్ష్మీ దేవికి నాథుడైన శ్రీ మహా విష్ణువు
    నకు కైలాసమును ఏలవలెనన్ను కోరిక
    పుట్టినదట యని చెప్పటంలో గల
    అసంబద్దతె సమస్య
    ==========================
    సమస్యా పూరణం - 243
    ==================

    సతి లేని పతిగ భవుడు శివుడు
    బైరాగిగొప్పి తిరిగినాడు
    మరుభూమిని తానుండినాడు
    దారుక వనమున చెలగినాడు
    రాజు లేని రాజ్యమునకిక
    అదనపు బాధ్యత మేలగున్
    కలిగెను గోరిక శ్రీసతీ విభునకు
    గైలాసమే యేలగన్

    ====##$##====

    సతీ వియోగంతో కలత చెందిన శివుడు
    విరాగియై, బైరాగివోలె స్మశాన వాటికలలో
    దారుకా వనంలో తిరుగుచుండ కైలాసము
    ఏ అధికారి లేని కార్యాలయము వలె బోసి
    పోయినది. అట్టి యెడ కైలాసము బాగోగు
    లు చూచుటకు ఎవరో ఒక అధికారి అదన
    పు బాధ్యత (Full Additional Charge) తీసుకొనవలెను కదా,అందుకే శ్రీ మహా
    విష్ణువునకు కైలాసమును ఏలవలెనన్న
    కోరిక జనించినదని భావము.

    ( మాత్రా గణనము- అంత్య ప్రాస)
    ----- ఇట్టె రమేష్
    (శుభోదయం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రమేశ్ గారూ,
      మీ భావానికి నా పద్యరూపం...

      శివుడు సతినిఁ గోల్పోయి తాఁ జెంది కలత
      రాగదూరుఁడై చనగ బైరాగి యగుచు
      ప్రభువులేని లోటును జక్కఁబరచ నెంచ
      హరికిఁ గైలాస మేలెడి నాశ కలిగె.

      తొలగించండి
  16. పాల సంద్రాన శయనించు పావనుండు
    *"హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె"*
    శివుడు తానున్న కైలాస శిఖరమునను
    వదల లేనన్చుఁ బలుకగా బన్నము పడె

    బన్నము పడు = చిన్నబోవు

    రిప్లయితొలగించండి
  17. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,



    ఆ దశవదను డమిత దురాశ తోడ

    నాత్మలింగము హరియింప నకట > యయ్యె

    నెల్ల రజితాద్రి తేజోవిహీన | మపుడు

    హరికి గైలాస మేలెడు నాశ గలిగె ,

    ప్రమథగణము నూరార్చు నభిమత మలర |


    { ఊరార్చు = ఓదార్చు }


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  18. హరికికైలాసమేలెడునాశకలిగె
    హరియుహరులునునొక్కరేయగుటవలన
    యాశకలిగెనుననుటలోయర్ధమదియ
    యించుకంతయులేదనియెఱుగుమయ్య!

    రిప్లయితొలగించండి
  19. శక్తి త్రిమూర్తులను సృష్టించి ఒక్కొకరికి నొక్క వాసము నిడగా విష్ణు మూర్తి ఆభరణ ప్రియుడు అయిన కారణమున వెండి కొండ అయితే సకల విధములు గా సిరులు పొందవచ్చు పాల సంద్రములో లాభము ఏమున్నది అని తలచి కైలాసము నేలుకొన్న బాగుండును గదా అని ఒక్క క్షణము యోచన చేసెనను భావనము.



    జగతి సృష్టిని కోరుచు శక్తి . సృష్టి
    చేసె గద నా త్రిమూర్తులన్, జేజె పెద్ద
    కిచ్చె సత్య లోకము, ఘన క్షీర జలధి
    సహిత వైకుంఠము నిడెను చక్రి కపుడు,
    పాల కడలి లభ్ది నిడదు, ఫలము కలది
    వెండి కొండయని తలచి విస్మయముగ
    హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె
    నొక్క క్షణము. జనని కోర నుత్తరునకు
    నొదలె కైలాసము, వసించె ముదము తోడ
    శేష తల్పాన సతికూడి సిరుల రేడు




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒదలె' అనడం సాధువు కాదు. "వదలె కైలాసము" అనండి.

      తొలగించండి
  20. అల విశ్వాంతరభాసమానభువనవ్యాప్తాధిపత్యాంతభూ

    వలయాధీశితృసృష్టిపాలనలయస్వాధీనుడై యుండి, కే

    వలశీతాద్రినిఁ గోరుటెట్లు? సవరింపం బూనుమా వాక్కులన్

    గలిగెన్ గోరిక శ్రీసతీవిభునకుం గైలాసమే యేలగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  21. సవరణతో
    (మొదటి పాదంలో యతి తప్పినదని శ్రీ వెలుదండ సత్యనారాయణ గారి ఎఱుక పఱచగా)
    గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2775
    సమస్య :: కలిగెన్ గోరిక శ్రీ సతీ విభునకున్ గైలాసమే యేలగన్.
    కైలాసాన్ని తన సొంతం చేసికొనాలని విష్ణుమార్తికి కోరిక కలిగింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: పది తలలు ఇరవై చేతులు ఉన్న రావణుడు బలగర్వంతో ఒకసారి కైలాస పర్వతాన్ని పెకలించి ఎత్తేందుకు ప్రయత్నం చేసినాడు. అప్పుడు కైలాస పర్వతం కొద్దిగా కంపించింది. అందుకు భయపడిన పార్వతి తన భర్త యైన పరమశివుని గట్టిగా కౌగలించుకొన్నది. ఈ విషయాన్ని తెలిసికొన్న విష్ణుమూర్తి ఆహా ! తనంత తానుగా భార్య భర్తను కౌగలించుకొనడం అంటే అది ఒక మహాభాగ్యం కదా! అటువంటి భాగ్యం నేను కూడా పొందితే బాగుంటుంది కదా అని ఆలోచించసాగినాడు. కొంతసేపటికి విష్ణుమూర్తికి ఒక ఆలోచన వచ్చింది. ఒక వింత కోరిక కలిగింది. కైలాసాన్ని తన సొంతం చేసుకోవాలి అన్నదే ఆ కోరిక అని ఊహించి చెప్పే సందర్భం.

    బలిమిన్ రావణు డెత్త గోరి వెస జేపట్టంగ గైలాసమున్,
    గలిగెన్ శూలికి భార్యకౌగిలియె, భాగ్య మ్మబ్బెగా వింతగా,
    గలుగన్ జాలునె యట్టి భాగ్య మని వీకన్ యోచనన్ జేయగా
    గలిగెన్ గోరిక శ్రీ సతీ విభునకున్ గైలాసమే యేలగన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (30-8-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  22. డా.పిట్టా సత్యనారాయణ
    ఉరికి పాలను ద్రాగెడి యూహగాని
    బరిదెగం హద్దులందున భారతీయ
    నరవరుల జంపగా పాక్!న్యాయమొక్కొ
    హరికి గైలాసమేలెడు నాశ గలిగె!

    రిప్లయితొలగించండి
  23. డా.పిట్టా సత్యనారాయణ
    ఇల సామాన్యుల, సైనికాళి, ధనికున్నెంచంగ జంపేయగా
    నల కీర్తింగను యాకతాయి గరిమన్నా మోదినిన్ గూల్చగా
    వలబన్నం ఘనకీర్తి గొంచు మురియన్ వాంఛన్ మరీ బెంచరే;
    కలిగెన్ గోరిక శ్రీ‌సతీ విభునకున్ గైలాసమే యేలగన్!

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. ఫాలనయనుండు నెలతాల్పు నీలగళుఁ డ
      మేయ భూత భేతా ళాధినాయకుండు
      హరున కపరాజితునకు శంకరునకు నుత
      హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె


      లలి తోద్యాన తటాక సల్లలిత విభ్రాజిష్ణు భూభృత్తునున్
      విలయద్యోతక సత్క్రియా వర మనోభీష్టాత్త విఖ్యాతుఁ డా
      లలితస్కంధుఁడు చంద్రశేఖరుఁడు సర్పభ్రాజితాంకద్యుతిం
      గలిగెం గోరిక శ్రీ సతీవిభునకుం గైలాసమే యేలఁగన్

      [శ్రీ సతీవిభుఁడు = శ్రీ శంకరుఁడు]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
      శ్రీ సతీవిభుడైన శంకరుని ఎవ్వరూ ప్రస్తావించలేదు. అద్భుతం!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  25. గురువర్యులకు నమస్సులు. నిన్నటి, మొన్నటి నా పూరణలను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.
    అల్లిక తోడ జన్యువుల హారము గూర్చిన శాస్త్రమన్న తా
    మొల్లక తప్పటంచు యెదు రొడ్డుచు బోవ ప్రయోగ మంతయున్
    మెల్లగ వీగి పోయెనట మేథ వినాశము నడ్డ మేల్కొనన్
    పిల్లి జనింపగా బలికె వింతగ జెప్పు కొనంగ నొప్పునా!

    రోత కలిగించు రీతుల
    పోతన కావ్యమ్మున రసపోషణ లేదే!
    ప్రీతిగ భాగవతమిలను
    చైతన్య మిడుచు బ్రతుకున సందడి చేయున్!

    రిప్లయితొలగించండి
  26. శంకరాభరణం వారి సమస్య

    *హరికి గైలాస మేలెడు నాశ కలిగె*!!

    పూరణలు

    తపము జేయ నసురులకు తగని వరము
    లిచ్చు సురలు భోరు మనగ నీశుడెపుడు
    శివుని భోళాతనమెరిగి చిత్రముగను
    *హరికి గైలాస మేలెడు నాశ కలిగె* !!(1)

    నటన తోడ మెప్పించిన నంద మూరి
    తనయునికి తొందరేలనో తండ్రి గారి
    దరికి చేర తెలుపకుండ తాను వెడలె
    *హరికి గైలాస మేలెడు నాశ కలిగె*!!(2)

    హుసగీతి
    30.8.18

    రిప్లయితొలగించండి
  27. కలిగెన్గోరికశ్రీసతీవిభునకున్గైలాసమేయేలగ
    న్దలచన్వారలువేరుగారుగదతాదాత్మ్యంబుతోడన్గదే
    జలజాతాసనవాసవాదులునునాశంభున్నివాసంబున
    న్చలనంబొందుచుజీవకోటినిలజైజైయంచురక్షింతురే

    రిప్లయితొలగించండి
  28. చెలగెన్ శ్రీయన శోభనార్థముగ, విశ్లేషించి వాక్రుచ్చినన్,

    పొలుపొందన్ సతి పత్నియై, విభుడనన్ ముక్కంటిగాకెవ్వడౌ?,

    నల వైరుధ్యమె లేదు సుంత, కనుటె ట్లామాట చోద్యమ్ముగన్?

    గలిగెన్ గోరిక శ్రీసతీవిభునకుం గైలాసమే యేలగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  29. పిలువన్ పార్వతి సోదరుండగు హరిన్ ప్రేమమ్ముతో స్వీయపున్
    నిలయంబున్ కన, లక్ష్మితోడ చనియెన్ నెయ్యమ్ముతో శౌరితాన్
    చల సంతోషము చూపగా నచలపై సంసారమున్ చేయ గన్
    కలిగెన్ గోరిక శ్రీసతీవిభునకున్ గైలాసమే యేలఁగన్

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. మలుపున్ గోరెను విష్ణువే యనగ హేమాద్రిన్ విలాసం బునన్
      కులుకన్ మోదము నొందుచున్ సఖియ తోకూడన్ వినోదమ్ము గా
      వలపున్ సీమలు నేలగా మనము నంప్రేమన్ విహంగం బునై
      కలిగెన్ గోరిక శ్రీసతీ విభునకున్ గైలాసమే యేలఁగన్

      తొలగించండి
  31. గణపతయ్యనుఁ జేరగ గరికపత్రి
    పచ్చదనమును మెచ్చగఁ బరమ శివుడు,
    వెచ్చదనమునుఁ జిందించ వెండి కొండ,
    హరికిఁ గైలాస మేలెడు నాశ కలిగె..

    హరి = పచ్చదనము

    రిప్లయితొలగించండి
  32. another puuraNa reflecting a current event:

    అలసి వాహనంబునడిపి యర్థరాత్రి
    తండ్రి తనుగూడ జేరెనా? తనయునయ్యొ,
    శివుని లీలలు జిత్రమౌ, జెప్పఁ దరమె?
    హరికిఁ గైలాస మేలె(గె)డు నాశ కలిగె..

    రిప్లయితొలగించండి
  33. [8/30, 8:26 AM] Dr Umadevi B: ధన్యవాదాలు అన్నయ్యగారూ
    సవరణతో
    : డా.బల్లూరి ఉమాదేవి.

    క్షీరసాగరమె గృహము సిరియె సతియు
    హరికి,కైలాసమేలెడు నాశ కలిగె
    నంత యద్రిజన్ గూడుచు హరుడు సాగె
    నాట్యమాడగ నెంచుచు నవ్యరీతి

    రిప్లయితొలగించండి
  34. ...............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    కలిగెన్ గోరిక శ్రీసతీవిభునకున్ గైలాసమే యేలఁగన్

    సందర్భము: రావణుడు కైలాస గిరిని పెకలించబోగా అది యించుక కంపించింది. భయమందిన పార్వతీదేవి శంకరుని తనంతనే తటాలున కౌగలించుకొన్నది. అదొక మహాభాగ్యంగా భావించబడింది.
    అది తనకు లభించలే దని భావించిన శ్రీహరి కొకింతసేపు కైలాస మేలే కోరికా కలిగింది.
    ఎవడైనా రాక్షసుడు ఆది శేషుని అదేవిధంగా ఎత్తా లనుకొని వుంటే అదొకింత కంపించి వుంటే లక్ష్మీదేవి కూడా బెదరి శ్రీహరిని కౌగలించుకొని వుండేది కదా! అని ఒక సాహితీప్రియు డన్నాడు.
    వీక=ఉత్సాహం, పరాక్రమం, విజృంభణం, గర్వం
    ==============================
    ఖలుడౌ రావణు డెత్తబోవ బలిమిన్
    కైలాసమున్.. గౌరి కౌ
    గిలి గిల్గింత తనంత శంభునకు కల్గె
    న్గా మహా భాగ్యమై..
    కలిగెన్ గోరిక శ్రీసతీవిభునకున్
    గైలాసమే యేలఁగన్...
    గలుగన్ జాలునె రాక్షసుం డెవడొ వీ
    కన్ శేషునిన్ బట్టినన్!

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
    30-8-18
    """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి
  35. పరుగు పెట్టుచు వెడలెను బంగ భూమి

    ఫెడరలు దళము మనమని గడుసరిగను

    హస్తినాపురి నేలెడు మస్తి తోడ...

    హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె :)

    రిప్లయితొలగించండి
  36. తలచెన్ మామక పార్వతీశ్వరుడు నే తాళంగజాలన్నికన్

    పిలచెన్ నన్నటు హస్తినాపురము నా పీఠంబు నీదేయనన్

    నిలువన్ జాలక బంగభూమికిని తానేగంగ తోచున్నిటుల్:

    కలిగెన్ గోరిక శ్రీసతీవిభునకున్ గైలాసమే యేలఁగన్

    రిప్లయితొలగించండి
  37. KTR meets Jagan at Lotus Pond:

    తలవన్ నాయుడు చంద్రశేఖరునిటన్ తప్పించి యేలంగ తా
    విలపించించును గుండెబాదుచునహా భీతిల్లి పార్పోవగా
    కలిగెన్ కోరిక గుండు ముక్కునకటన్ కయ్యంబు సల్పించగా
    పిలచెన్ జగ్గను మోహనుండినిటన్ విందాడ నాంధ్రమ్మునన్: 👇
    "కలిగెన్ గోరిక శ్రీసతీవిభునకున్ గైలాసమే యేలఁగన్"

    రిప్లయితొలగించండి