9, ఆగస్టు 2018, గురువారం

సమస్య - 2757 (పఙ్క్తిముఖునిఁ గాంచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్"
(లేదా...)
"పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముఁడే"

98 కామెంట్‌లు:



  1. పఙ్క్తిగ కొట్టెను నడచుచు
    పఙ్క్తిముఖునిఁ గాంచి, రామభద్రుం డడలెన్,
    పఙ్క్తిగ కుశలవలు కథను
    పఙ్క్తికి పాడుచు తెలుపగ పడతి జిలేబీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      ఎలాగైతేనేం? గట్టెక్కారు. అభినందనలు.
      'కుశలవులు' టైపాటు.

      తొలగించండి
    2. ఒకసారి గట్టెక్కాక ఊరుకుంటారా....మరల మరిన్ని గట్స్ చూపుతారు జిలేబిగారు
      😄👏🏻👌🏻💐

      తొలగించండి

    3. విట్టుబాబు గారు

      వచ్చె వచ్చె కందమన్నాక పఙ్క్తిగ ఓ నాలుగైనా చెయ్యాలి గా :)


      జిలేబి

      తొలగించండి
  2. పఙ్క్తిగ శరములు రాల్చెను
    పఙ్క్తిముఖుని గాంచి రామ భద్రుం, డడలెన్
    పఙ్క్తిముఖుడె రాముని శర
    పఙ్క్తులనే గనుచు ప్రాణ భయమును బొందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. పంక్తిరథుని ప్రియపుత్రుడు ;
    పంక్తులలోపల గణింప ప్రథముండు ; ప్రభా
    పంక్తుని వంశ్యుండైనను
    పంక్తిముఖుని గాంచి రామభద్రుం డడలెన్ .
    (పంక్తిరథుడు - దశరథుడు ; ప్రభాపంక్తుడు - సూర్యుడు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని రావణుని చూచి రాము డడలడం? 'ఙ్క్తి' టైపు చేయడం వీలు కాలేదా?

      తొలగించండి
    2. ఎంత మహావీరుడైనా కావ్యనాయకుడైనా ప్రతినాయకుని
      గురించి ఒకానొక క్షణంలో కొంత సంకోచించటం తప్పదుకదండీ! అనునాసికాక్షరాలకు పూర్ణబిందువును
      అంగీకరించారుకదా! టైపు చేయటం కూడా కుదరలేదు
      ధన్యవాదాలండీ!

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    పఙ్క్తి యటన్నచో వరుస , పఙ్క్తిముఖుండననగ్రగామియౌ !
    పఙ్క్తి యనంగ ఛందమన , పఙ్క్త్తిముఖుండన విష్ణువే ! పదిన్
    పఙ్క్తికినర్థమున్ గొనిన పఙ్క్తిముఖుండు దశాస్యు., డిందునే
    పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముఁడే ??

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి మాధుర్యమది సరే!
      మీదు పద్యమెపుడు ముచ్చటించు
      సెలవ దెన్ని నాళ్ళు చెప్పు ప్రభాకర!
      వెలుగు పంచవయ్య వినతి నంది
      🙏🏻😀

      తొలగించండి
    2. 🙏

      నా పిచ్చి పూరణలు నా బ్లాగులో కలవు...

      తొలగించండి
    3. పఙ్క్తికి ఛందమర్థమన... అందాం... నమోనమః 🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి

    4. జీపీయెస్ వారికి

      పిచ్చి పూరణలను పఙ్క్తికి తెలిపిన పఙ్క్తిగ నవ్వులు
      పఙ్క్తిగ వచ్చును . మూసి పెట్టిన సహపఙ్క్తి‌కానిది శోభిల్లదు :)


      జిలేబి

      తొలగించండి
    5. "ఇంటికన్నా గుడి పదిలం"

      ...అక్కడ నాపై దండయాత్రలకు స్కోపు తక్కువ 😊

      తొలగించండి
    6. పఙ్క్తిముఖుం గనుంగొని , యపారభయమ్మును బొంద , రాముఁడే
      పఙ్క్తిగ నస్త్రశస్త్రశరవర్షములన్ గురిపింప జచ్చె ., పై
      పఙ్క్తికినెత్వమున్ గలిపి వ్రాయ సమస్యగ మారె ! జూడరా !
      పఙ్క్తిముఖుం గనుంగొని , యపారభయమ్మును బొందె రాముఁడే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    7. అదురహో మైలవరపు విరుపు!


      జిలేబి

      తొలగించండి
  5. సరదాగా...

    రుఙ్క్తిఙ్గ్చాఙ్గ్ నగరమ్మున
    మఙ్క్తిఙ్గ్ టా మనెడి వ్యక్తి మద్యముఁ గొని తాఁ
    బఙ్క్తిం గూర్చొని వాగెను
    "పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్"

    (చైనాలోని ఒక నగరం రుంక్తింగ్ చాంగ్. అందులో వసించే వ్యక్తి పేరు ముంక్తింగ్ టామ్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చీన దైశ్య పద ద్వయముతో నద్భుత మైన పూరణము.
      చీన దేశ భాష పలుకుటకే కాక వ్రాయుట కూడా దుష్కరమే.

      రుఙ్క్తింగ్ + చాంగ్ = రుఙ్క్తింగ్చాంగ్ / రుఙ్క్తింగ్చాఙ్గ్ ; ముఙ్క్తింగ్ +టామ్= ముఙ్క్తింగ్టామ్

      రుఙ్క్తింగ్, ముంక్తింగ్ లలో పరుషములకు న మ లు పరము కాలేదు కదా తదనునాసి కాదేశమునకు! మీ రనునాసి కాగమము చేశారు.

      ముఙ్క్తింగ్టామ్ + అనెడి = ముఙ్క్తింగ్టామ్మనెడి.

      ఒక్క సారి పరిశీలించండి.

      తొలగించండి

  6. ఇవ్వాళ కంది వారు సెలవా ! వామ్మో యేమి ప్రాస యిది !


    పఙ్క్తిని మర్కటమ్ములట పంతును బొందెను గాంచ నెవ్వరిన్?
    పఙ్క్తికి పఙ్క్తి గానిలచి పౌషము లోన పలాశు లెల్లరిన్
    పఙ్క్తిగ కొట్టి రావణుని పట్టుగ కొట్టిన వీరుడెవ్వడో ?
    పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె; రాముఁడే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సెలవంటే పూర్తిగా సెలవు కాదు కాని రైల్వే రిజర్వేషన్ల కోసం చంద్రమౌళి సూర్యనారాయణ గారిని కలవడానికి వెళ్ళాలి. ఆ తర్వాత బండకాడి అంజయ్య గౌడ్ గారి మనుమరాలి నామకరణోత్సవానికి వెళ్ళాలి. అదీ సంగతి! ఎంత దుష్కరప్రాస ఇచ్చినా పూరణలు వస్తూనే ఉన్నాయి...
      మీ తాజా పూరణ క్రమాలంకారంలో బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  7. పఙ్క్తిలమున కిరివకొ? సహ
    పఙ్క్తిని చేరుచు హుళక్కి పలుకులవేలా?
    పఙ్క్తియె తప్పు సుమా ! యే
    పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. పఙ్క్తియను పదముతో నొక
    పఙ్క్తిని కందంబులోన పలికెదనని యా
    పఙ్క్తినిగలవా డాడెను
    పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్.

    రిప్లయితొలగించండి


  9. శంకరార్యుల మన్ కీ బాత్ :)


    పఙ్క్తిగ నేడుపనులకద!
    పఙ్క్తియు టైంపాసు గాన పదబంధమిదే
    పఙ్క్తికి సమస్య నిచ్చెద!
    పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్.


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. కొనిపోయెదనే లంకక
    నిన "పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయ
    మ్మును బొందె - రాముఁడే"తెం
    చిన త్రుంచడె యీ ఖలునని సీతతలచుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      ఉత్పలమాలను కందంలో ఇమిడ్చి అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  11. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    పంక్తి ముఖుం గనుంగొని యపార
    భయమ్మును బొందె రాముడే
    ========================
    పంక్తి ముఖుడనగా వరుసగా తలలు
    కలవాడు అనగా రావణుడు అట్టి
    దశకంఠుని చూచి రాముడు మిక్కిలి
    భయపడినాడని చెప్పడంలో గల
    అసంబద్దమే ఇందులోని సమస్య
    =========================
    సమస్యా పూరణము - 221
    ====================

    మారీచుడు పన్నిన మాయల వల
    బంగరు జింకగ తానిల
    మగడు మరుదులయ్యో విలవిల
    జానకి మనమున దిగులు కలకల
    సాధువున పంక్తి ముఖుం గనుంగొని
    యపార భయమ్మును బొందె
    రాముడే గతిని జాడెరిగి
    రక్షించునని సీత కలత చెందె

    ====##$##====

    రావణుడి ఆదేశం మేరకు బంగారు
    జింకగా రూపు దాల్చిన మారీచుడు సీతకు
    దూరంగా రామ లక్ష్మణులను తీసికెళ్ళాడు.
    అదే అదునుగా సీతను అపహరించుటకు
    రావణుడు కపట జడధారియై వచ్చాడు.
    అపహరణకు గురియైన జానకి సాధువులో
    దశకంఠుని గాంచి మిక్కిలి భయపడుటయే
    గాక తన జాడ నెరిగి రామచంద్రుడు తనను
    ఎట్లు కాపాడునో కదా యని కలత చెందినది.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    --- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  12. 🙏🙏డా.ఎన్.వి.ఎన్.చారి
    సవరణతో 9866610429
    పఙ్క్తి ముఖుండు శ్రీధరుడు పావన రాముడు జంపెనెవ్వరిన్?
    పంఙ్క్తి ముఖుండు రావణుని భామిని
    గాంచివడంకె నేవిధిన్?
    పంఙ్క్తి ముఖున్మహోగ్రశర పంఙ్క్తుల
    జంపిన వీరుడెవ్వడో???
    పంఙ్క్తి ముఖుం గనుంగొని;యపార భయమ్మునందె ;రాముడే:

    రిప్లయితొలగించండి
  13. "పఙ్క్తిముఖుం డనం బరమ భక్తుడు శంభున కాత డెన్న సా
    పఙ్క్తిని గూడ దేవతల పాటి యశమ్మున నట్టి విప్రు నే
    పఙ్క్తిగ మున్ను తాళముల భాతి శిరమ్ముల నేయుటా" యిటుల్
    పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముఁడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సహపఙ్క్తి'ని 'సాపఙ్క్తి' అన్నారు.

      తొలగించండి
    2. మీ సూచన మేరకు సవరించిన పద్యం:

      పఙ్క్తిముఖుం డనం బరమ భక్తుడు శంభున కెన్న నొక్కటౌ
      పఙ్క్తిని గూడ దేవతల పాటి యశమ్మున నట్టి విప్రు నే
      పఙ్క్తిగ మున్ను తాళముల భాతి శిరమ్ముల నేయుటా" యిటుల్
      పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముఁడే.

      తొలగించండి
  14. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

    నిన్నటి పూరణ స్వీకరింప ప్రార్థన.
    ...................... .............. ...........


    యతులున్ బ్రాసలు లేక వ్రాయునది గద్యంబౌ గదా ! కావునన్

    యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్ప | రే


    జతులున్ వర్ణన లభ్యసింపని యెడన్ సంగీత మెట్లౌను ? స

    ద్గతులున్ లేనటువంటి జీవము మహోత్సాహంబుగా నుండునే ?



    { జతులు = స్వరజతులు ; స్వరజతులు , వర్ణనలు

    మొ. నవి సంగీతపాఠము లో ముఖ్యభాగములు

    జీవము = జీవనము = బ్రతుకుదెరవు }

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ (నిన్నటి) పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. లంకలో యుద్ధము చేయు సమయమున రాముని వయస్సు చాలా చిన్నది. రావణుని గురించి వినటమే గాని ప్రత్యక్షము గా చూచి ఉండని కారణమున రావణుని భీకర ఆకృతిని గాంచి ఒక్క క్షణము రాముని దేహము వణికెను. వెంటనే తెప్ప రిల్లి రుద్ర మూర్తి అయి ఆతని పాన శర పరంపర కురిపించెనని భావన


    మాలవ్య శ్రేష్టుని మనుమడు, కైకసి,విశ్రవస సుతుడు ,విశ్వ కర్మ
    నిర్మిత లంకాధి నేత ,నిత్య శివార్చకుండు ,విభీషణ, కుంభ కర్ణ
    ఖర దూషణులకు సోదరుడు ,మండోదరి యెలనాగ వల్లభుం డింద్ర జిత్తు
    జనకుడు, పఙ్క్తి ముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్గద త్రుటి సమయము
    రణము లో నెదురు పడగ రధము పైన,
    రెప్ప పాటులో నాతడు తెప్పరిల్లి
    భీషణ వదనుండై వేసె బిట్టు తోడ
    శరము లతనిపై వదలక సంగరమున



    రిప్లయితొలగించండి
  16. అబ్బ ఈ రోజుకు గిట్టు బాటు అయ్యింది పూజ్యులు పెద్ద వారు ఏమంటారో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఏమంటారు ? ఏ సమస్య కైనా సీసాయే సమధాన మంటారు :)

      జిలేబి

      తొలగించండి
    2. సూర్యకుమార్ గారు మీ పూరణ మద్భుతముగా నున్నది. ప్రాసను మీ సీసము తో చీల్చి చెం డాడారు.
      బంధకవిత్వ విముక్తులై సీస పాశ బంధితు లయ్యారు.
      అభినందనలు.
      పులస్త్య బ్రహ్మ మాలవ్యుఁ డెట్లయ్యాఁడు?

      తొలగించండి
    3. Actually Malyavan was the elder brother of Ravana's actual maternal grandfather Sumali and once used to be the former king of Lanka, later Ravana reconquered it.

      తొలగించండి
    4. dhanyvadamulu kameswara ravu garu mee mundu nenenmta chala alpunni mee aseessulu saravada vamchistu pusapati bandha kavi

      తొలగించండి
    5. రావణుని మాతామహుని యన్న మాల్యవంతుఁడు (మాల ధరించు వాడు). మాళవ్యుఁడు (మాళవ దేశాధిపతి) కాదు.

      తొలగించండి

    6. లంకలో యుద్ధము చేయు సమయమున రాముని వయస్సు చాలా చిన్నది. రావణుని గురించి వినటమే గాని ప్రత్యక్షము గా చూచి ఉండని కారణమున రావణుని భీకర ఆకృతిని
      గాంచి ఒక్క క్షణము రాముని దేహము వణికెను. వెంటనే తెప్ప రిల్లి రుద్ర మూర్తి అయి ఆతని పాన శర పరంపర కురిపించెనని భావన
      మొదటి పదము సవరించి పూరణము
      కందము సీసము లోకి పూరణము



      మాల్యవ శ్రేష్టుని మనుమడు, కైకసి,విశ్రవస సుతుడు ,విశ్వ కర్మ
      నిర్మిత లంకాధి నేత ,నిత్య శివార్చకుండు ,విభీషణ, కుంభ కర్ణ
      ఖర దూషణులకు సోదరుడు ,మండోదరి యెలనాగ వల్లభుం డింద్ర జిత్తు
      జనకుడు, పఙ్క్తి ముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్గ ద త్రుటి సమయము
      రణము లో నెదురు పడగ రధము పైన,
      రెప్ప పాటులో నాతడు తెప్పరిల్లి
      భీషణ వదనుండై వేసె బిట్టు తోడ
      శరము లతనిపై వదలక సంగరమున

      తొలగించండి
    7. మాల్యవ యనరాదు. మాల్యవంతుఁడు లేక సమాస యుక్తముగా “మాల్యవత్” అనవలెను.
      సమాసముగా శ్రేష్ఠుఁడు పనికిరాదు. మాల్యవంతుఁ డొక్కఁడే కదా.
      మాతామహుని యన్న గారి మనుమఁ డనుట కన్న మాతామహునిఁ గాని పితామహునిఁ గాని ప్రస్తావించుట మేలుకదా!

      తొలగించండి
    8. పూసపాటి వారూ,
      కందపాదాన్ని సీసపద్యంలో ఇమిడ్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
      కామేశ్వర రావు గారితో శబ్ద చర్చ బాగున్నది. "మాల్యవంతునకును మనుమడు..." అందామా?

      తొలగించండి
  17. పఙ్క్తిగ వానరమ్ములల వారధి గట్టగ గావసీతమున్
    పఙ్క్తిని వెంట బెట్టుకొని బాణ శతాగ్నులు వేసె రాముడే
    "పఙ్క్తిముఖుం గనుంగొని! యపారభయమ్మును బొందె, రాముఁడే
    పఙ్క్తి ముఖుం వధించగను భండన మందున వైరి వర్గమే

    రిప్లయితొలగించండి
  18. "పఙ్క్తిముఖుడె కాదు గదా
    "పఙ్క్తిముఖునిఁ తాతయైన భయపడ వలెగా!
    "పఙ్క్తిముఖుడెంత? యేవిధి
    "పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్ ?

    రిప్లయితొలగించండి
  19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2757
    సమస్య :: పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముడే.’’
    పది తలలు గల రావణుని చూచి రాముడు భయపడ్డాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: లంకలో అశోకవనంలో శోకిస్తూ ఉండిన సీత దగ్గఱకు ఏకజట హరిజట ప్రఘస వికట అనే రాక్షస స్త్రీలు చేరినారు. రావణుని ఆదేశాన్ని అనుసరించి ఆమెను నయాన భయాన ఒప్పించే ప్రయత్నం చేస్తూ ‘’ఓ సీతా! రావణునికి భార్యగా ఉండేందుకు అంగీకరించు. మాట వినకపోతే అతడు చాలా క్రూరంగా వ్యవహరిస్తాడు. నిన్న అర్ధరాత్రి మా అందరికీ ఒక కల వచ్చింది. ఆ కలలో మా రావణుడు నీ భర్త యైన రాముని పట్టి బంధించాడు. విపరీతంగా కొట్టినాడు. అప్పుడు నీ రాముడు భయంకరమైన రూపంతో ఉన్న రావణుని చూచి భయపడ్డాడు అని ఆమెను భయపెట్టే ప్రయత్నం చేసే సందర్భం.

    పఙ్క్తిగ వచ్చి యేకజట వంటి నెలంతలు పల్కినా రటన్
    పఙ్క్తిముఖుండు క్రూరుడని; పల్కిరిటుల్ ‘’నడిఱేయి మా కలన్
    పఙ్క్తిముఖుండు నీ విభుని పట్టెను కొట్టెను, సీత ! సత్యమా
    పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముడే.’’
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (9-8-2017)

    రిప్లయితొలగించండి
  20. పజ్క్తిగ రాక్షససేనలు
    పజ్క్తి పయికొరగె చివరకు వారినృపతియున్
    పజ్క్తిగ చెంతకు దాకొని
    పజ్క్తి ముఖుని గాంచి రామభద్రుండడలెన్

    పజ్క్తి= వరుస, భూమి, గౌరవము, పది
    అడలు=శోకించు

    రిప్లయితొలగించండి
  21. రిప్లయిలు
    1. ఈ క్రూరుని బారి పడి సీత యెంత బాధ పడినదో యని తలఁచు కొని రాముఁడు విలపించు సందర్భము:

      పఙ్క్తి రథాత్మజుఁడు వడయఁ
      బఙ్క్తి క్లేశముల నంత భగ్న హృది మహా
      పాఙ్క్త సురారి పురమ్మునఁ
      బఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్


      అఙ్క్తప లోల మానసుఁడు నా రఘువీరుఁడు దీనుఁడై మహా
      పాఙ్క్త నిశా విహారుఁ డనవద్య ధరాసుత నేమి సేసె నా
      శఙ్క్తర శక్తి హీనుఁ డయి సద్గుణ వంతుఁడు లంక కేఁగి తాఁ
      బఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముఁడే

      [ అఙ్క్తప = గట్టిగ ముద్ర పడ బాధ పడినది; అపాఙ్క్త = పంక్తి కనర్హుఁడు, పతితుఁడు; శఙ్క్తర = సందేహము దాటుట]

      తొలగించండి
    2. అద్భుతం కామేశ్వరరావు గారు. నమస్సులు.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  22. "పఙ్క్తిముఖులు పలువురు నొక
    "పఙ్క్తిగ వచ్చియు నిలిచిన భయమొందడుగా
    "పఙ్క్తిరథుని సుతుడు!యెటుల
    "పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్?"

    రిప్లయితొలగించండి
  23. పంక్తి ముఖానుజుండు గుణవంతుడునైన విభీషణుండు, సా
    పంక్తిగ జేయుచున్న పలు పాపములన్ నిరసించఁ క్రోధుడౌ
    పంక్తిముఖున్ గనుంగొని యపారభయమ్మును బొందె, రాముఁడే
    పంక్తిముఖున్ రణంబున విపన్నత వీడగ సంహరించె తాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  24. గురువుగారికి వందనములు.
    ఇదేదో శార్జ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్ లాంటి ప్రాస వలెనున్నది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ... పనుల ఒత్తిడి వల్ల ఎక్కువ పూరణలు రాకుండా చూడాల్ని దుష్కరప్రాస ఇచ్చాను. అయినా పూరణల సంఖ్య ఎంతమాత్రం తగ్గలేదు!

      తొలగించండి
    2. సరిదిద్దడానికి మీరుంటే పూరణలు తక్కువ ఎలా వస్తాయి గురువర్యా

      తొలగించండి
  25. పంఙ్తిగనమ్ములువేసెను
    పంఙ్తిముఖునిగాంచిరామభద్రుండడరె
    న్బంఙ్తులశరములుగనుగొని
    పంఙ్తుముఖుడురావణుండు భయముననంతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      కొంత అస్పష్టత ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. అందరికీ నమస్సుమనస్సులు!
    కంద పద్య రెండవ పాద అంత్యక్షరం గురువు గా తప్పక ఉండవలెనా? తెలుపగలరు
    ధన్యున్ని
    :)

    రిప్లయితొలగించండి
  27. కంద పద్య లక్షణములు:
    1. నాలుగు పాదములు.
    2. 1, 3 పాదములకు 3 గణములు; 2,4 పాదములకు 5 గణములు.
    1- 2 పాదముల గణములు కలిపితే 8. అట్లే 3 – 4 పాదములకును 8.
    3. భ, జ, స, నల, గగ. గణములను మాత్రమే వాడ వలెను.
    4. బేసి గణము (1, 3, 5, 7.) జ గణము కాకూడదు.
    5. 6 వ గణము నల కాని జ గణము కాని యుండి తీర వలెను.
    6. 2, 4 పాదములలో 4 వగణపు మొదటి యక్షరమునకు యతి మైత్రి.
    7. ప్రాస నియమము కలదు. ప్రాస యతి లేదు.
    8. 2, 4 పాదముల చివరి యక్షరములు గురువులై యుండ వలెను.
    9. మొదటి పాదపు మొదటి యక్షరము గురువైన మిగిలిన 3 పాదముల మొదటి యక్షరములు గురువులే కావాలి. అట్లే లఘువైన లఘువులే కావాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇన్ని కట్టుబాట్ల మధ్య ఎక్కడా పట్టిబడుకుండా పద్యం రాయడం కష్టమే!
      ధన్యవాదాలండి కామేశ్వర రావు గారు :)

      తొలగించండి
    2. శ్రీకర్ గారూ,
      కొద్దిగా నడక పట్టుబడితే అన్నిటికన్నా సులభమయింది కందపద్యమే.

      తొలగించండి
    3. శంకారాభరణ చింతామణి శంకరయ్య గారు!
      ఎమొనండి ప్రయత్నించాలి...
      మీరు నన్ను "గారు" అనకన్డి ఇంకా రెండు పదులు కుడా డాటని వాడిని :)
      ధన్యున్ని

      తొలగించండి
  28. పఙ్క్తి జనాలతో నొకడు పందెము గాయుచు మిత్రులెల్లరున్
    పఙ్క్తిక గొంచబోయినట పంతము గెల్చెడు కోర్కెమీరగా
    పఙ్క్తిగ జేరివాడు కడుపారగ మద్యము గ్రోలి వాగెనే
    పఙ్క్తిముఖుంగనుంగొని యపారభయమ్మును బొందె రాముడే.

    రిప్లయితొలగించండి
  29. పంక్తి శరములు వదల గా
    పంక్తి ముఖుని గాంచి రామ భద్రుoడడ లెన్
    పంక్తి ముఖు డ య్యేడల న్

    రిప్లయితొలగించండి
  30. పంక్తి శరములు వదల గా
    పంక్తి ముఖుని గాంచి రామ భద్రుoడడ లెన్
    పంక్తి ముఖు డ య్యేడల న్

    రిప్లయితొలగించండి
  31. పఙ్క్తిరథాత్మజుండకనిఁ బాసటగా నిలువందలంచుచున్
    పఙ్క్తులు దీరి కోతులట భండన మాడదలంచి వచ్చి యా
    పఙ్క్తిముఖుంగనుంగొని యపారభయమ్మును పొందె, రాముడే
    పఙ్క్తులుగాశరమ్ములను వాసిగ రాల్చి వధించె రావణున్.

    రిప్లయితొలగించండి
  32. ...............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    "పంక్తి ముఖుం గనుంగొని యపార
    భయమ్మును బొందె రాముఁడే"

    సందర్భము: పావని అశోక వనంలో
    సీతతో సంభాషించటం..
    పంక్తి రథుడు=దశరథుడు
    2 వ పా.. పంక్తి ముఖుడు=విష్ణువు
    3 వ పా.. పంక్తి ముఖుడు=అగ్రేసరుడు
    ==============================
    "పంక్తి రథుండు తా మురిసి
    పండుగ జేసె" నటంచు.. "పుత్రుడై
    పంక్తి ముఖుండె రాముడుగ
    వచ్చె" నటం.. చని, రామ భక్తులన్
    పంక్తి ముఖుండు సీత ననె
    పావని "యె ప్డనబోకు మిట్టు.. లా
    పంక్తి ముఖుం గనుంగొని య
    పార భయమ్మును బొందె రాముఁడే!"

    మరొక పూరణము..

    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్

    సందర్భము: పఙ్క్తిముఖ సఖు డనగా విష్ణువు యొక్క మిత్రుడు శివుడు.. అతని భక్తుని..
    పఙ్క్తినిగమ వేదిన్ అనగా వరుసగా వేదములను చదివినవానిని... మరియు బ్రాహ్మణుని... గనన్ (చూచినంతనే)...
    పఙ్క్తిరథ సుతు డనగా దశరథ సుతుడైన రామభద్రుడు ఒకించుక (పఙ్క్తిముఖునిఁ గాంచి) అడలెన్.. అంటే కలవరపడ్డాడు.
    రావణుడు శివ భక్తుడు వేద విదుడు పైగా బ్రాహ్మణుడు... ఇన్ని లక్షణా లుండడం ఎవరికైనా కలవరపాటు కలిగిస్తుంది కదా!
    ==============================
    పఙ్క్తిముఖ సఖుని భక్తుని..
    పఙ్క్తినిగమ వేదిని మరి
    బ్రాహ్మణుని గనన్..
    పఙ్క్తిరథ సుతు డొకించుక..
    పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
    9-8-18
    """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి
  33. ఙ్క్తిని భోజనమందున

    పాఙ్క్తేయుల నడుమ జూచి పట్టపు భుక్తిన్

    పఙ్క్తిని కనుగొని భూతపు

    పఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్

    రిప్లయితొలగించండి
  34. పఙ్క్తిని భోజనమ్మునను పట్టపు రాముడు చూచుచుండగా

    పఙ్క్తిని వానరేశ్వరులు పండుగ జేయగ కోతిచేష్టలన్...

    పఙ్క్తికి మధ్యమందునను ఫక్కున నవ్వుచు ప్రేతరూపుడౌ

    పఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముఁడే :)

    రిప్లయితొలగించండి