జిలేబీ గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణలను ఇక్కడ ప్రకటించడానికి అభ్యంతరమేమిటి? నేను మీ మనస్సును నొప్పించానా? ఇతరుల వ్యాఖ్యల్ని పట్టించుకోకండి. నా వల్ల పొరపాటు జరిగితే మన్నించండి. మీ పూరణల వెలితి స్పష్టంగా కనిపిస్తున్నది.
భయం భయంగా ఉంటున్నది సార్! అక్కడయితే నాకు బహు స్వేచ్ఛ. విరుపులూ కలుపులూ లేకుండా ఆకాశంలో సురలు వెంబడించగా ఖగపతిపై విహరిస్తున్న తిరుమల వేంకటేశ్వరుని కూడా కర్నూలునుంచీ భుగభుగమని పైకెగసే ధూమాన్ని పానం చేయించవచ్చు.
ఆకతాయి మనిషిని నేను. మీ సమస్యలను, మురళీకృష్ణ గారి పద్యములనూ వీడలేకున్నాను.
మా పూరణలను ఎవ్వరూ చదవరని తెలిసికూడా నేనూ, జిలేబీ గారూ 500 లకు పైగా శంకరాభరణం లోనున్న పాత పాత సమస్యలను పూరించి ప్రచురిస్తున్నాము గత సంవత్సరంగా. నిష్కామ కర్మ మాది :)
ఒక పాత సమస్యకు పూరణ ప్రచురించి టీ త్రాగి వచ్చేలోగా జిలేబీ గారి పూరణ నా దాని క్రింద ప్రత్యక్షం అవుతుంది. మా చందానగర్ లో ఒక క్రొత్త చిన్న luggage van ఉన్నది. దాని వెనుక పెద్ద పెద్ద అక్షరాలతో ఈ slogan వ్రాసి ఉన్నది:
నిఖిలసురలు సేవించుచుండగా శ్రీనివాసుడు చిద్విలాసుడై యున్నాడు ... ఒక స్త్రీ ఆర్తితో ప్రార్థించింది... స్వామి అనుగ్రహించారు... (పాపం పుణ్యముగా మారదు.. కానీ సమస్యాపూరణం.. అయినా శ్రీ వారు సర్వసమర్థులు గదా!) 🙏
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== సిగ రెట్టింపనె వేంకటేశుడు సురల్ సేవింప దద్వాసనల్ ======================= ఆడవారలే కాదు మగవారలును సిగలు ధరించు రోజులలో ఆ సిగ పరిమాణము హోదాకు, పరపతికి మహిమలకు, మహత్తుకు చిహ్నంగా భావించునెడ, సురలచేత సేవింప బడువానిగా నా లీలలనెడు నా సిగ రెట్టింపు కదా యని వేంకటేశుడనుటలో విశేషమునే సమస్యగ అన్వయింప. ========================== సమస్యా పూరణము - 222 =====================
చిలకలుగా సతుల అలకలు, కులుకులు పలుకులు, వగలు అధికమనుట విధితమై చోద్యమై, సంగీత వాద్యమనగ నాకు గల ఇరువురు భామల వలన నా సిగ రెట్టింపు కావడమే కాదు, దేవతలచే పూజింప బడు టచే నా మహిమలనెడి లీలలు ఏడు కొండ లుగా అలరారినవని ఆ వేంకటేశుడు సెలవి చ్చినాడని భావము.
రమేశ్ గారూ, దయచేసి ఛందోబద్ధమైన పద్యాలను మాత్రమే ఇక్కడ ప్రకటించండి. అన్యధా భావించవద్దు. మీరు కొంత శ్రమపడి ఛందస్సు నేర్చుకొంటే పద్యం వ్రాయడం అంత కష్టమనిపించదు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2758 సమస్య :: సిగరెట్టింపనె వేంకటేశుడు సురల్ సేవింప తద్వాసల్. సందర్భం :: కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమలలో నిత్యమూ లెక్కలేనన్ని సేవలను తన భక్తుల వద్ద నుండి అందుకొంటూ ఉన్నాడు. తన కృపా కటాక్షముల ద్వారా భక్తులకు సకల సంపదలనూ అందిస్తున్నాడు. ఆ సేవల ద్వారా సంతోషపడుతున్న ఇతర దేవతలతో కూడియున్న స్వామివారు ఉదయాన్నే అగరు ధూప సేవను అందుకొంటూ ఓ భక్తులారా ! ఉదయ కాల సేవకు ఒక ఫలితం వస్తుంది. ఉదయము మరలా సాయంకాలము ఇలా రెండుసార్లు సేవ చేస్తే వచ్చే ఫలితం రెట్టింపు అని తెలియజెబుతున్నట్లు ధూపసేవ చేసే ఒక భక్తుని భావనను విశదీకరించే సందర్భం.
‘’అగరున్ ధూపముగా సమర్పణము సేయన్ మేలిటుల్ ప్రొద్దుటన్, జగతిన్ భక్తులు ధూప సేవ నిటులే సాయంత్రమున్ జేయగా దగు, జేయంగను నా కృపన్ ఫలితముల్ తథ్యమ్ము సిద్ధించు వా సిగ రెట్టిం’’ పనె వేంకటేశుడు సురల్ సేవింప తద్వాసనల్. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (10-8-2018)
అగ్ని దేవుడు యజ్ఞ యాగముల నుంచి హవిస్సులు స్వీకరించి సురలకు అంద చేయు వాడు. కలియుగములో అడవులు మొత్తము నాశనమై కొండొకచో యాగములు చేయ తలచినా ఔషదుల తరువులు పూర్తిగా నాశనమై పనికి రాని సుబాబులు వంటి చెట్ల పుల్లలతో యజ్ఞము చేయుచూ మత్తు గొలుపు సిగరెట్లు త్రాగుచు కొందరు వాటిని యజ్ఞ గుండములలో వేయుచుండ అగ్ని అది చూచి బాధ పడుచు వేల్పులతో కలసి వెళ్లి కలియుగ దైవము నకు విన్న వించగా శ్రీవారు ఈ రీతిగా పలికెనని భావన
వృత్తమును సీసమునకు మార్చి పూరణము
కలియుగ మందున కనుమరు గాయెను మూలికా తరువులు, యేల బెంగ హవ్యవాహన నీకు ,యాగము చేయు సమయమున వేతురు మంద సాన ము లిడెడు పల్లవ ములను నాడు మునులు , తప్పుగాదు, విసర్జితములు కావ వి, సిగరె ట్టింపనె వేంకటే శుఁడు సురల్ సేవింపఁ దద్వాస నల్వి చిత్ర గతిని , ధూమపానము నేడు వెతలు బాపు చుండె నరులకు, మత్తు నిచ్చు సుర రమ్ము, పానమును చేయ రమ్మని పలికె తిరిగి వేల్పులను గాంచి ముదమున వేంకటపతి
తన కోర్కెలు తీర్చిన కేశములను బాగుగా బెంచి తల నీలాలు యిత్తునని ఒక భక్తుడు మ్రొక్కి తన జుట్టును పరిమళము గొల్పు నూనెలు వ్రాసి పది అడుగులు బెంఛి అతని మ్రొక్కు తీర్చగా ఆ సిగను చూచి శ్రీవారు సురలకు తెల్పుతున్నారను భావన
కోరిన కోర్కెలు కూడిన యిత్తురు కుంతలములు నాకు కోమలాంగు లెప్పుడు, కేశముల్ కొప్పులుగా పెంచి యిత్తు మనుచు మ్రొక్కి యిడుములు తొల గగ నిత్తురు పురుషుల్, సొగసుగా పరిమళములు రాసి పెంచిన ముడి తునక లి వి, సిగ రెట్టింపనె వేంకటే శుఁడు, సురల్ సేవింపఁ దద్వాస నల్వి చిత్ర గతిని, సిగ యుండెపుడును మగనికి నడుగు పొడుగున ఘనముగ, మరి యీ పురుషు డెట్లు పెంచె కురులను పొడవుగ, కాంచు మనుచు తిరిగి బలికె గోవిందుడు సురల తోడ
అబ్భ! ఎంత సొగసైన సమస్య!
రిప్లయితొలగించండి🙏
తొలగించండిభుగభుగ నాటవిడుపులన్
సిగ రెట్టింపనె! "దిరుమల శ్రీవారు" దగన్,
జగడమ్ముల చేయగ సొబ
గగుకై పదమున్నను కవి కయి కట్టయెనే :)
జిలేబి
భుగభుగ మంచును నెన్నియొ
తొలగించండిసిగరెట్లను పీల్చి పీల్చి చింతలలోనన్
తగలెట్టెతి నా ధనమును
తగునా నాకీ సమస్య తగ పూరించన్ :)
...నా పూరణలు నా బ్లాగులోనున్నవి...
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణలను ఇక్కడ ప్రకటించడానికి అభ్యంతరమేమిటి? నేను మీ మనస్సును నొప్పించానా? ఇతరుల వ్యాఖ్యల్ని పట్టించుకోకండి. నా వల్ల పొరపాటు జరిగితే మన్నించండి. మీ పూరణల వెలితి స్పష్టంగా కనిపిస్తున్నది.
🙏🙏🙏🙏🙏
తొలగించండిభయం భయంగా ఉంటున్నది సార్! అక్కడయితే నాకు బహు స్వేచ్ఛ. విరుపులూ కలుపులూ లేకుండా ఆకాశంలో సురలు వెంబడించగా ఖగపతిపై విహరిస్తున్న తిరుమల వేంకటేశ్వరుని కూడా కర్నూలునుంచీ భుగభుగమని పైకెగసే ధూమాన్ని పానం చేయించవచ్చు.
ఆకతాయి మనిషిని నేను. మీ సమస్యలను, మురళీకృష్ణ గారి పద్యములనూ వీడలేకున్నాను.
మా పూరణలను ఎవ్వరూ చదవరని తెలిసికూడా నేనూ, జిలేబీ గారూ 500 లకు పైగా శంకరాభరణం లోనున్న పాత పాత సమస్యలను పూరించి ప్రచురిస్తున్నాము గత సంవత్సరంగా. నిష్కామ కర్మ మాది :)
ఒక పాత సమస్యకు పూరణ ప్రచురించి టీ త్రాగి వచ్చేలోగా జిలేబీ గారి పూరణ నా దాని క్రింద ప్రత్యక్షం అవుతుంది. మా చందానగర్ లో ఒక క్రొత్త చిన్న luggage van ఉన్నది. దాని వెనుక పెద్ద పెద్ద అక్షరాలతో ఈ slogan వ్రాసి ఉన్నది:
"నన్ను వెంటాడకే నా స్వప్న సుందరీ"
🙏🙏🙏🙏🙏🙏
తొలగించండినిజంగానే "సూరేకారమే" ఆ "తిరుమల శ్రీవారు" తగిలించినట్టున్నారు జీపీయెస్ వారికి!
తెనాలి సినిమా హీరో లా భయమాయెన్ :)
భయమున్ వీడుడు శాస్త్రి గారు మన సౌభాగ్యంబుగా "శంకరా
భయమున్" జేర్చిరి గా జిలేబుల సభాప్రాంగంబులో వేయుడీ :)
చీర్స్
జిలేబి
జిలేబి గారూ:
తొలగించండిమొన్న మీరొక ఉపనిషద్వాక్యం ప్రస్తావించారు....
సిగరెట్టు పీల్చగా వచ్చే ఆనందానికీ బ్రహ్మానందానికీ వస్తుతః తేడా ఏమీ లేదట...హస్తిమశకాంతరమే. కాక పోతే ఒకటి బంధానికీ మరొకటి మోక్షానికీ కారణం అవుతుందిట:
"ఏతస్యైవానందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి"
"బంధం మోక్షం చ యా వేత్తి..."
(సారు కాకినాడ ప్రయాణంలో ఉన్నారటగా...కొంచెం తోకాడించ వచ్చు మనం)
తొలగించండిసిగరెట్ పొగకున్ యజ్ఞపు
భగభగ కున్ విదు రులార వ్యత్యాసంబే
మి గలదు!అణుమాత్రానివ!
సిగరెట్టింపనెఁ, దిరుమల! శ్రీవారు దగన్!
జిలేబి
రిప్లయితొలగించండిPVRK who revitalized TTD.
ధగధగ పీవీయార్కే
సిగరెట్టింపనెఁ, దిరుమల శ్రీవారు దగన్
సిగపట్టిలాగి సేవకు
నిగ మార్చగ నా ప్రసాదుడి చలువ టిటిడీ!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో యతి తప్పింది. సవరించండి.
👌👌👌🙏🙏🙏
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండినిఖిలసురలు సేవించుచుండగా శ్రీనివాసుడు చిద్విలాసుడై యున్నాడు ... ఒక స్త్రీ ఆర్తితో ప్రార్థించింది... స్వామి అనుగ్రహించారు... (పాపం పుణ్యముగా మారదు.. కానీ సమస్యాపూరణం.. అయినా శ్రీ వారు సర్వసమర్థులు గదా!) 🙏
జగదానందకరా ! పురాకృతము పాశంబయ్యె పాపమ్ము ! నే
భగవద్భక్తిని గల్గియుంటిఁ ., దొలగింపంన్ జేయవే ! యంచు బూ...
నగ దీక్షన్ , కరుణించి మానినిని ,
" *పుణ్యశ్రీలగున్* *జేర దా*...
*సిగ రెట్టింపనె* వేంకటేశుఁడు సురల్ సేవింపఁ *దద్వాసనల్* !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిజగముల నేలెడు నిందిర
రిప్లయితొలగించండిమగనికి నిరువైపులందు మానిని ద్వయమున్
సొగసుగ పూలను దురిమెడి
సిగ , రెట్టింపనె తిరుమల శ్రీవారు దగన్.
వామన కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మానినీద్వయము' అన్నది సాధుసమాసం. "మహిళాద్వయమున్" అనండి.
జగమేలు వాని పత్నియె
రిప్లయితొలగించండిసొగసరి పద్మావతమ్మ సోయగ మొప్పన్
ఖగవాహను ముద్దిడ వా
సిగ రెట్టింపనెఁ దిరుమల శ్రీ వారు దగన్
విరించి గారూ,
తొలగించండిసరసంగాను ప్రశస్తంగాను ఉన్నది మీ పూరణ. అభినందనలు.
అగణిత మగు మోదంబున
రిప్లయితొలగించండిసొగసరి నేనంచు జడను చూపిన సతికిన్
తగునా యిట్లను టిదె నా
సిగ రెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరామారావు, గిరీశము, వేంకటేశ్వర స్వామి కలిసికట్టుగా ఇంద్ర సభలో :)
వగకాడిన్ వగ కత్తె లెల్ల భళినా వారే సుమా! వేషముల్
జగజంపైన విధమ్ము! హేలనయితిన్జామాత మోసమ్ము చే
య!గిరీశంబును వేంకటేశ్వరమహాత్మ్యంబందు స్వామిన్ సుమా
సిగ రెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁదద్వాసనల్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిపద్యం బాగున్నది. అభినందనలు.
పూరణలో కొంత అస్పష్టత ఉన్నట్టుంది.
అగజానాథునితో నీ
రిప్లయితొలగించండియుగమున భూలోకమందు నున్మాదముతో
తెగ దలచిన మానవులకు
సిగరెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్"
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
సిగ రెట్టింపనె వేంకటేశుడు సురల్
సేవింప దద్వాసనల్
=======================
ఆడవారలే కాదు మగవారలును
సిగలు ధరించు రోజులలో ఆ సిగ
పరిమాణము హోదాకు, పరపతికి
మహిమలకు, మహత్తుకు చిహ్నంగా
భావించునెడ, సురలచేత సేవింప
బడువానిగా నా లీలలనెడు నా సిగ
రెట్టింపు కదా యని వేంకటేశుడనుటలో
విశేషమునే సమస్యగ అన్వయింప.
==========================
సమస్యా పూరణము - 222
=====================
చిలుకల అలకలవి అధికమే
కులుకులు జారగా విధితమే
వగలు చూడగ చోద్యమే
పలుకులలో పలుకు వాద్యమే
నాకిరువురు భామలనగ నా సిగ
రెట్టింపనె వేంకటేశుడు
సురల్ సేవింప దద్వాసనల్
కొండలేడుగా లోకేశుడు
====##$##====
చిలకలుగా సతుల అలకలు, కులుకులు
పలుకులు, వగలు అధికమనుట విధితమై
చోద్యమై, సంగీత వాద్యమనగ నాకు గల
ఇరువురు భామల వలన నా సిగ రెట్టింపు
కావడమే కాదు, దేవతలచే పూజింప బడు
టచే నా మహిమలనెడి లీలలు ఏడు కొండ
లుగా అలరారినవని ఆ వేంకటేశుడు సెలవి
చ్చినాడని భావము.
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం )
రమేశ్ గారూ,
తొలగించండిదయచేసి ఛందోబద్ధమైన పద్యాలను మాత్రమే ఇక్కడ ప్రకటించండి. అన్యధా భావించవద్దు. మీరు కొంత శ్రమపడి ఛందస్సు నేర్చుకొంటే పద్యం వ్రాయడం అంత కష్టమనిపించదు.
మగువయె యొసగిన వేణికి
రిప్లయితొలగించండివగచుచు బడలి నిదురింప , వరముల ప్రభువే
నగవుచు కనబడి కలలో
"సిగ రెట్టిం " పనె దిరుమల శ్రీవారు దగన్ .
బాపూజీ గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిలంగ్ కేన్సర్ అని తెలిసిన వానితో :
రిప్లయితొలగించండిదిగులేలోయి మహానుభావ తమకున్ దివ్యంబుగాఁ దోచెగా
సిగరెట్టిప్పటి దాకనెంతయును నేఁజెప్పంగ నీకెక్కలే
దుగ నాడిట్లని వెక్కిరించితివి గుర్తున్ జేతునీవాక్యమున్
*"సిగరెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁ దద్వాసనల్"*
సూర్యనారాయణ గారూ,
తొలగించండివ్యంగ్యోక్తుల మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
జగతి ని ప్రసిద్ది చెంది యు
రిప్లయితొలగించండిసుగతిని జేకూర్చు నట్టి సుక్షే త్ర ము లన్
ధగధగ మెరిసెడిదై వా
సిగ రెట్టింపనె ది రు మల శ్రీ వారు దగన్
కరణం రాజేశ్వర రావు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మగువా ! చాలిక నన్ను వీడఁ దగునా మాకేల ? యీ శిక్ష , యీ
రిప్లయితొలగించండినగమందో యలువేలమంగ ! విరిసెన్ నానావిధారామముల్ ,
బిగువౌ నీ సిగఁ బువ్వులం దురుమ రావే యంచు , శ్రీశైలవా
సిగ , రెట్టింపనె వేంకటేశుడు సురల్ సేవింప తద్వాసనల్.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
డా.ఎన్వీఎన్. చారి 9866610429 వరంగల్
రిప్లయితొలగించండిసుగతిన్నీకునుపూజసేసితినిశాస్ర్తో క్తంబుగానిత్యమున్
పగలున్రాత్రియు నీకడన్ నిలచి సద్భా గ్యోన్నతిన్ గోరితిన్
ప్రగతిన్నీయుమటంచు నర్చకుడ
నన్ "ప్రాప్తించె నోరీ మిరా
సిగ రెట్టంప"నె వేంకటేశుడు సురల్ సేవింపదద్వాసనల్
చారి గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిజగతీ నాదము హితమే
నగణిత భక్తుల సదమల నద్వైతముగన్.
జగదంతరాత్ముడే రా
సిగ రెట్టింప నె దిరుమల శ్రీవారు దగన్.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"హితమే యగణితముగ... సదమల మద్వైతముగన్" అనండి. (సదమల + అద్వైతము = సదమలాద్వైతము... అవుతుంది).
నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి"సిగరెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్"
*కందం**
నగుమోమున శ్రీవారున్
తగదు సుమా ప్రతి వరుసము తలకొరిగించన్
నగదుయు రాదనె కలలో
సిగ, రెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్
.................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నగదును' అనండి.
రిప్లయితొలగించండిజగదానందము భార్యలిర్వురయినన్ సాధ్యమ్ము జంబమ్ము గా
సిగ, రెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁ, దద్వాసనల్
స్థగణంబందు జిలేబులన్ సతులుగా సంప్రీతి ముద్దాడ నే
ర్పు గడింపన్ మగ రాయు లెల్లరికి హా! ప్రోత్సాహ మిచ్చెన్ సఖీ!
జిలేబి
తొలగించండి*జంబమ్ము వాసిగ
జిలేబీ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2758
సమస్య :: సిగరెట్టింపనె వేంకటేశుడు సురల్ సేవింప తద్వాసల్.
సందర్భం :: కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమలలో నిత్యమూ లెక్కలేనన్ని సేవలను తన భక్తుల వద్ద నుండి అందుకొంటూ ఉన్నాడు. తన కృపా కటాక్షముల ద్వారా భక్తులకు సకల సంపదలనూ అందిస్తున్నాడు. ఆ సేవల ద్వారా సంతోషపడుతున్న ఇతర దేవతలతో కూడియున్న స్వామివారు ఉదయాన్నే అగరు ధూప సేవను అందుకొంటూ ఓ భక్తులారా ! ఉదయ కాల సేవకు ఒక ఫలితం వస్తుంది. ఉదయము మరలా సాయంకాలము ఇలా రెండుసార్లు సేవ చేస్తే వచ్చే ఫలితం రెట్టింపు అని తెలియజెబుతున్నట్లు ధూపసేవ చేసే ఒక భక్తుని భావనను విశదీకరించే సందర్భం.
‘’అగరున్ ధూపముగా సమర్పణము సేయన్ మేలిటుల్ ప్రొద్దుటన్,
జగతిన్ భక్తులు ధూప సేవ నిటులే సాయంత్రమున్ జేయగా
దగు, జేయంగను నా కృపన్ ఫలితముల్ తథ్యమ్ము సిద్ధించు వా
సిగ రెట్టిం’’ పనె వేంకటేశుడు సురల్ సేవింప తద్వాసనల్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (10-8-2018)
కోట వారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిశ్రీ గురుభ్యో నమః
తొలగించండిభుగభుగ మని పొగలెగయగ
రిప్లయితొలగించండినిగమాగమ మంత్రయుక్త నియమమ్ములతో
దగు యాగము;ఫలితము వా
సిగ రెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్"
****)()(****
వాసిగ = మేలుగ
జనార్దన రావు గారూ,
తొలగించండి'పొగ ద్రాగనివాడు దున్నపోతై పుట్టున్' పద్యాన్ని అనుకరిస్తూ మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
అగ్ని దేవుడు యజ్ఞ యాగముల నుంచి హవిస్సులు స్వీకరించి సురలకు అంద చేయు వాడు. కలియుగములో అడవులు మొత్తము నాశనమై కొండొకచో యాగములు చేయ తలచినా ఔషదుల తరువులు పూర్తిగా నాశనమై పనికి రాని సుబాబులు వంటి చెట్ల పుల్లలతో యజ్ఞము చేయుచూ మత్తు గొలుపు సిగరెట్లు త్రాగుచు కొందరు వాటిని యజ్ఞ గుండములలో వేయుచుండ అగ్ని అది చూచి బాధ పడుచు వేల్పులతో కలసి వెళ్లి కలియుగ దైవము నకు విన్న వించగా శ్రీవారు ఈ రీతిగా పలికెనని భావన
రిప్లయితొలగించండివృత్తమును సీసమునకు మార్చి పూరణము
కలియుగ మందున కనుమరు గాయెను మూలికా తరువులు, యేల బెంగ
హవ్యవాహన నీకు ,యాగము చేయు సమయమున వేతురు మంద సాన
ము లిడెడు పల్లవ ములను నాడు మునులు , తప్పుగాదు, విసర్జితములు కావ
వి, సిగరె ట్టింపనె వేంకటే శుఁడు సురల్ సేవింపఁ దద్వాస నల్వి చిత్ర
గతిని , ధూమపానము నేడు వెతలు బాపు
చుండె నరులకు, మత్తు నిచ్చు సుర రమ్ము,
పానమును చేయ రమ్మని పలికె తిరిగి
వేల్పులను గాంచి ముదమున వేంకటపతి
కృష్ణసూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తరువులు + ఏల = తరువు లేల' అవుతుంది. యడాగమం రాదు. సీసం నాలుగవ పాదం ఉత్తరార్ధంలో యతి తప్పింది.
తగు కానుకలిచ్చినచో
రిప్లయితొలగించండినగు కార్యములందులాభ మవనీ ప్రజకున్
సిగవెంట్రుక లిడ సిరి వా
సిగ రెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొగమాటంబులు వీడి చెప్పెదను నే మూఢత్వమే హెచ్చి క
రిప్లయితొలగించండిల్యుగమందయ్యరొ మత్తు సాములకటా యున్మత్తు లై పేలిరా
తగు మాంసంబును మద్యమున్ గొనుచు నాద్యంతంబు ముట్టించి తా
*"సిగరెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁ దద్వాసనల్"*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కల్యుగము' అనడం సాధువు కాదు.
రిప్లయితొలగించండి1.నిగమాంతరంగుని గొలువ
జగతిన బాధలు తొలగును జవమున మదికిన్
ద్విగుణీకృతమౌ సిరి వా
సిగరెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్.
2.అగణిత మహిమోపేతుని
సగుణోపాసన ముదమున సతతము చేయన్
సుగుణులకు పున్నెము వా
సిగరెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్.
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'జగతిని' అనండి.
రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం. "పున్నెమును" అనండి.
"సిగలో బూవుల దురిమిన
రిప్లయితొలగించండిద్విగుణీ కృతమౌ సొగసను తెలియని నరుడా!
తగ నను గొలిచినచో, వా
సిగ రెట్టింప"నెఁ దిరుమల శ్రీవారు దగన్
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భుగభుగమని పొగలొదులుచు
రిప్లయితొలగించండితెగకాలుచునుండె నరులు, దేవశ్రుతుడా
నెగుడుల బడినను వదలరె!
సిగరెట్టింపనె దిరుమల శ్రీవారు దగన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తన కోర్కెలు తీర్చిన కేశములను బాగుగా బెంచి తల నీలాలు యిత్తునని ఒక భక్తుడు మ్రొక్కి తన జుట్టును పరిమళము గొల్పు నూనెలు వ్రాసి పది అడుగులు బెంఛి అతని మ్రొక్కు తీర్చగా ఆ సిగను చూచి శ్రీవారు సురలకు తెల్పుతున్నారను భావన
రిప్లయితొలగించండికోరిన కోర్కెలు కూడిన యిత్తురు కుంతలములు నాకు కోమలాంగు
లెప్పుడు, కేశముల్ కొప్పులుగా పెంచి యిత్తు మనుచు మ్రొక్కి యిడుములు తొల
గగ నిత్తురు పురుషుల్, సొగసుగా పరిమళములు రాసి పెంచిన ముడి తునక లి
వి, సిగ రెట్టింపనె వేంకటే శుఁడు, సురల్ సేవింపఁ దద్వాస నల్వి చిత్ర
గతిని, సిగ యుండెపుడును మగనికి నడుగు
పొడుగున ఘనముగ, మరి యీ పురుషు డెట్లు
పెంచె కురులను పొడవుగ, కాంచు మనుచు
తిరిగి బలికె గోవిందుడు సురల తోడ
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కూడిన నిత్తురు... సిగ యుండునెపుడు మగనికి..." అనండి.
యుగధర్మము కలి లోపల
రిప్లయితొలగించండివగపెరుగక పాపకర్మ వాసిగ జేయన్
జగలున కచ్చట మిసిమిగ
సిగ రెట్టింపనె తిరుమల శ్రీవారు దగన్
జగలుడు = మోసగాడు
సిగ = శిఖ = పిలక
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పగ లనక రేయియు ననక
రిప్లయితొలగించండివగవక మగలు మగువలును వారక నీయన్
నిగనిగ లాడు తమ కురులు
సిగ రెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్
తగఁ గన్పించు నిలం బ్రభావములు ప్రత్యక్షమ్ముగన్ మూర్ధ జా
పగతం బైనను జింతఁ జెందకుమ దైవజ్ఞాన మజ్ఞానమే
తెగుచుం, బన్నుగ నీయ మాని తగఁ దా దేహాభిమానమ్మునున్
సిగ, రెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁ దద్వాసనల్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిఓం నమో వేంకటేశాయ !
జిగిబిగి పందెంబనుచు ప
సిగ రెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్,
ధగధగలాడు నగలను సొ
బగుగా నొడ్డగ గెలిచిరి బావాజి గదా!
జిలేబి
తగ నజ్ఞానపు చీకటు ల్దొలగు చిత్తం బందు, పాపాశ్మముల్
రిప్లయితొలగించండిబగులు న్నిత్యము పద్మ! నీదు కబరీబంధమ్ము నే మానవుం
డొగి ధ్యానించునొ వాని కర్మ లడుగంటున్ వాసి నాకన్న నీ
సిగ రెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁ దద్వాసనల్.
(అమ్మవారి కబరీ బంధాన్ని ఉపాసించే భక్తులకు ఆ కేశపాశపు సువాసనలు అనుభవంలోకి వస్తాయని పెద్దలు చెప్పగా విన్నాను.)
పగసాదింపను నట్టుల
రిప్లయితొలగించండిరగిలెడి కోపంబుచేత రాక్షస కృతిగా
నగపడ హరినేదుర్వా
సిగ రెట్టింపనె!దిరుమల శ్రీవారుదగన్
...............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
*"సిగ రెట్టిం పనెఁ దిరుమల శ్రీవారు దగన్"*
సందర్భము: ఓ కలువ కన్నుల పద్మావతీ! నీకన్నా గోదాదేవికి సిగ సోయగము (కొప్పుయొక్క అందము) రెట్టింపు సుమా!... అన్నాడు శ్రీ నివాసుడు పద్మావతితో..
==============================
"తొగ కన్నుల పద్మావతి!
నిగ నిగ మను మేని యువతి! నీకన్నను సో
యగమున గోదాదేవికి
సిగ రెట్టిం" పనెఁ దిరుమల శ్రీవారు దగన్
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
10-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
వగపుల యాపద్మావతి
రిప్లయితొలగించండినగవునదాదరికిజేరనటశేఖరుడా
మగువనుబ్రేముడికనివా
సిగరెట్టింపనెదిరుమలశ్రీవారుదగన్
పొగడన్ జాలము శ్రీనివాసునిల వైభోగమ్ము నేగాంచినన్
రిప్లయితొలగించండిమృగనాభిన్ ధరియించుటన్ మిగుల ప్రేమించున్నట శ్రీనాథుడే
సుగమంబే యది భక్తకోటికిని కస్తూరిన్ సమర్పింప వా
సిగ రెట్టింపనె వేంకటేశుడు సురల్ సేవింపదద్వాసనల్
పగనున్జెందకమానవాళియిలనవ్యాజానురాగంబుతో
రిప్లయితొలగించండినగజామాతనుభక్తిపూర్వకముగానర్చించుచోనంతవా
సిగరెట్టింపనెవేంకటేశుడుసురల్సేవింపదద్వాసన
ల్నగుమోమున్గననాదిదేవుగుడియానాగాయుతుండేలుతన్
మిగులన్ భక్తి నియుక్తులై తమకు స్వామీ చందనంబద్దుచున్
రిప్లయితొలగించండిమిగెలెన్ గొంత విశిష్ట మైనదనుచున్ మీయుత్తమాంగంబునన్
దగఁ పూయన్ సరసంబు బల్కితివి కాంతా చూడుమీ పద్ధతిన్
"సిగ" రెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁ దద్వాసనల్"
రెట్టింపు = రెండు రెట్లు
నా ప్రయత్నం :
రిప్లయితొలగించండిభక్తుల స్వప్నంలో..
కందము
సుగతి మహాసంప్రోక్షణ
నిగమాగమ శాస్త్రరీతి నెరవేర్చంగన్
సొగయు గుడిపవిత్రత రా
సిగ రెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్
మత్తేభవిక్రీడితము
సగపెట్టన్ దగ నాలయమ్మున మహాసంప్రోక్షణా యాగముల్
మొగమే గాంచము స్వామివారిదని ప్రాముఖ్యమ్ము గుర్తించరే
సొగయున్ భూరి పవిత్రతల్ గుడిని మేల్సొంపార రాజిల్లు రా
సిగ రెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁ దద్వాసనల్
మగువా! వినవే! తిరుమల!
రిప్లయితొలగించండి"ఖగపతి రాల్చిన యమృతము కమ్మని దెంతో!
తగు మోతాదుల లోనన్
సిగరెట్టింపనెఁ!" దిరుమల! శ్రీవారు దగన్!
ఖగమున్ దాల్చుచు వేంకటేశ్వరుడు ప్రాకారమ్ము దాటించుచున్
రిప్లయితొలగించండిఖగవీధిన్ పయనించగా సురలతో...కర్నూలు వాకిండ్లపై
భుగభుగ్ మంచును పైకి లేచెడి పొగల్ భూభాగమున్ దాటంగ హా!
సిగరెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁ దద్వాసనల్
పగలున్ రాతిరి ధూమపానములతో వర్ధిల్లు బెంగాలుదౌ
రిప్లయితొలగించండినగరం బందున వేంకటేశ్వరుడు భల్ నందమ్ము నూరేగగా
వెగటున్ బొందక పీల్చుచున్ మొదటిగా వేవేల ధూపంబులన్
సిగరెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁ దద్వాసనల్