గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2774 సమస్య :: పిల్లి జనింపగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ నొప్పునా పులికి పిల్లి పుట్టింది. ఇది ఒక వింత అని చెప్పుకోవడానికి వీలు కాదు కదా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: ఇంద్రుని వజ్రాయుధం తగిలి నేలపై బడిన తన బిడ్డను (హనుమంతుని) చూచి తల్లడిల్లిన వాయుదేవుడు తాను సంచరించడం ఆపివేయగా లోకాలన్నీ ఊపిరి ఆడక భయపడ్డాయి. అప్పుడు వాయుదేవుడు అందరికీ ప్రాణభయాన్ని కలిగించే పులి వంటివాడు అయ్యాడు. విశ్వరూపాన్ని పొందగల ఆంజనేయస్వామి లంకలో ప్రవేశించేటప్పుడు యుద్ధనీతిని అనుసరించి తన పరిమాణమును తగ్గించుకొని {లంక అనే కలుగులో ఉన్న రాక్షసులు అనేటటువంటి ఎలుకలను పట్టి చంపేందుకోసం అన్నట్లుగా} వృషదంశక మాత్ర (పిల్లి) పరిమాణమును పొందినాడు. అప్పుడు మారుతి పిల్లి వంటి వాడు అయ్యాడు అని అనవచ్చు. కాబట్టి పులికి పిల్లి పుట్టింది. ఐతే ఇది ఒక వింత అని చెప్పుకొనవలసిన పనిలేదు అని విశదీకరించే సందర్భం.
విద్య లందు మేటి విద్వాంసుడైనట్టి కోవిదు నకు శుంఠ కొడుకు కలుగ కమల గర్భు సృష్టి గాంచి యు ప ల్కిరి పిల్లి పుట్టె పులికి వింత యగు నె ______కరణం రాజేశ్వర రావు
విద్య లందు మేటి విద్వాంసుడైనట్టి కోవిదు నకు శుంఠ కొడుకు కలుగ కమల గర్భు సృష్టి గాంచి యు ప ల్కిరి పిల్లి పుట్టె పులికి వింత యగు నె ______కరణం రాజేశ్వర రావు
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== పిల్లి జనింపగా బులికి వింతగ జెప్పుకొనంగ నొప్పునా ======================= పిల్లికి పిల్లియే, పులికి పులియే పుడతాయి తప్ప, పులికి పిల్లి పుట్టదుగా, కాని పులికి పిల్లి పుట్టినను దానిని వింతగా చెప్పు కోవలసిన అవసరమేమున్నదని చెప్పటంలో గల అసంబద్దతె సమస్య ========================== సమస్యా పూరణము - 242 ====================
చూడుమదె జొంకి కాళ్ళ తీరు పులి తలగా లైగర్ జోరు చిరుతగ జాగ్లియన్ సౌరు కంచర గాడిద గుర్రపు వేరు మార్జాల వ్యాఘ్రముల్ రెండు ఫెలిడె కుటుంబమని చెప్పనా పిల్లి జనింపగా బులికి వింతగ జెప్పుకొనంగ నొప్పునా
====##$##====
వేరు వేరు జంతువుల మధ్య సంపర్కం వలన జనించిన కొన్ని సంకరజాతి జంతు వులను క్రింది విధంగా పరిశీలిద్దాం !
...............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య🤷♀.................... పిల్లి పుట్టెఁ బులికి వింత యగునె
సందర్భము: అంపశయ్యమీ దున్నప్పటికీ పులి పులే! అలాంటి వాడు భీష్ముడు. ఆయనకు దప్పి వేసింది. అర్జునుని బాణ ప్రయోగంతో పాతాళగంగ ఒక నీటిబుగ్గ యేమో అని యందరూ వింతగా చూస్తూ వుండగా చిప్పిల్లినది..అనగా పై కుబికి వచ్చినది. ఆ నీటితో భీష్ముని దాహం తీరింది. అందరికీ వింతగా తోచింది. పులిలాంటి భీష్మునికి మాత్రం కాదు. అది అతనికి సహజమే అనిపించింది. అతనికి అర్జునుని అస్త్రవిద్యా ప్రావీణ్యం తెలుసు గదా!
చిప్పిల్లు = పై కుబుకు, స్రవించు, ఉద్గమించు ============================== అంపశయ్యమీద నైతేమి పులి పులే! భీష్మునకును దప్పి వేసెఁ ; బార్థు డుర్వి నమ్ము నేసె ; నొక నీటి బుగ్గ చి ప్పిల్లి పుట్టెఁ ; బులికి వింత యగునె!
✒~ డా. వెలుదండ సత్య నారాయణ 29-8-18 """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
వింత యుగమ టంచు వేయిచో ద్యములంట
రిప్లయితొలగించండిమనిషి కడుపు లోన మత్స్య ముండు
పురుష పుంగ వుండు పుత్రుని కన్నంత
పిల్లి పుట్టెఁ బులికి వింత యగునె ?
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విజయ లక్ష్మి తోడ వేంచేతుననిబల్కె
రిప్లయితొలగించండినుత్తరుండు,పరుగులెత్తె రధము
విడిచి సేన గాంచి గడగడ వణుకుచు,
పిల్లి పుట్టె పులికి వింత యగునె
కృష్ణసూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెరచె సేన గాంచి' అంటే బాగుంటుందేమో?
రిప్లయితొలగించండిమల్లి! చెప్ప కోయి మాట తప్పగు సుమా !
పిల్లి పుట్టెఁ బులికి వింత యగు! నె
పుడు సజాతి తత్వపు జననంబగు! పిల్లి
పిల్ల పిల్లి పులికి పిల్ల పులియె !
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
👍
తొలగించండిశత్రుసేన దునిమి జయమును సాధించి
రిప్లయితొలగించండివత్తుననుచు పలికియుత్తరుండు
ప్రాణభయము తోడ పాఱుట గాంచినన్
బిల్లి పుట్టెఁ బులికి వింత యగునె.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅంతగొప్పవాడు ఆ గాంధి గారికి
నలువురైన సుతులు కలిగినారు ;
తండ్రిపేరు నిలుప తగడెవ్వడును గూడ
పిల్లి పుట్టె బులికి వింత యగునె !
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మీరు మాత్రం తండ్రి పేరు నిలుపుతున్నారు. సంతోషం!
ధన్యవాదాలండీ!
తొలగించండితల్లిని జంపగా సుతుడు దైన్యము నెంచక దుష్ట బుద్ధితో
రిప్లయితొలగించండివెల్లువ భోగభా గ్యముల వేయివి ధమ్ముల తేలియా డుచున్
చల్లగ దోచుకో దలచి సంబర మందున క్రూరభా వమున్
పిల్లి జనింపగాఁ బులికి వింతగఁ జెప్పు కొనంగ నొప్పునా ?
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయదోషం ఉన్నది.
రిప్లయితొలగించండిమల్లి! విచిత్ర మైన దిది! మారగు పుట్టుక కల్గదోయి! యే
పిల్లి జనింపఁగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ నొప్పు? నా
తల్లియె తల్లడిల్లు సుమి ! తండ్రివ లెన్ తన బిడ్డ లేడటం
చల్లల నాడు కాడ్పడుచు ! చంద్రకి భేలము కోరు నెప్పుడున్ !
జిలేబి
👌🏻👏🏻💐
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచెల్లెను పాతకాలమని చేసెను దా ప్రతిసృష్టి మానవుం...
తొలగించండిడల్లదె శాస్త్రసంపద సహాయముగా గొని , మందు జల్లియున్
మల్లియతీవెకున్ గొనెను మామిడికాయల ! నేటిరోజులన్
పిల్లి జనింపఁగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ నొప్పునా ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మురళీకృష్ణ గారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి" ఎలుగుబంటి జూచి ఎవ్వరు భీతిల
తొలగించండివలదు., భీతి గొనినవారు వచ్చి
నన్ను చుట్టుముట్టుమన్న" నవ్విరి జనుల్
పిల్లి పుట్టె పులికి వింతగాను !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కల్ల కాదు నిజము కలికాలమందున
రిప్లయితొలగించండిపిల్లి పుట్టెఁబులికి వింత యగునె!
మగడు పారి వచ్చె-మగువ మాంచాలయు
పసుపు నిచ్చె నట్టి పతినిఁజూచి.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిపిల్లలు కోరితెచ్చియొక పిల్లిని పెంచుకొనంగసాగిరా
రిప్లయితొలగించండిపిల్లికి ముద్దునన్ 'పులి'గ పేరును పెట్టిరి యాడదౌటనా
పిల్లికి గర్భమయ్యెఁ తగువేళకుఁగాన్పునయ్యెఁగాన్పునన్
*"పిల్లి జనింపఁగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ నొప్పునా"*
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "కాన్పును నయ్యెఁ/కానుపు నయ్యెఁ" అనండి.
మతలబులు దెలియగ మాయాబజారున
రిప్లయితొలగించండిసుందరి యని పాడు సుందరుండు
లక్షణముగ చూడ లక్ష్మణ కుమారుని
*"పిల్లి పుట్టెఁ బులికి వింత యగునె"*
బజారు ఉర్దూ పదమే కదా! అందుకే మతలబు కూడా వాడేశా!!😊
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అల్లిబిల్లి గాను నాటలాడుచు గెంతు
రిప్లయితొలగించండిపిల్లికూన గనిన ప్రేమబుట్టు
నెవరికైన , నాడుపిల్లికి చిన్నారి
పిల్లిబుట్టె, పులికి వింత యగునె?
చెల్లునుబో మహామహులు చేయగ శోధన నూత్నరీతులన్
తొలగించండిపిల్లి జనించెగా పులికి వింతగ జెప్పుకొనంగ నొప్పునా?
కల్లగు మాటకాదు కలికాలము వింతల మూటయేనొకో
మల్లెకు బూయునుల్లియును మారును పిల్లయు పిల్లవాడుగా!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'పులికి' అన్వయం?
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!
తొలగించండిపిల్లికి పిల్ల పుట్టడంలో పులికి వింత యేమున్నదని భావించాను!🙏🙏🙏🙏
తల్లియుఁ దండ్రియున్ మరియు తాతలు ముత్తలు ముందు వారల
రిప్లయితొలగించండిట్లెల్లరు విద్యలం గడచి రిద్ధరలో, తగదిట్లు, మొద్దువో ?
చెల్లునె ? పుత్రకా ! చదువు, చిత్తము నిల్పు, సుధీసుతుం డనన్,
పిల్లి జనించెగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ, నొప్పునా!.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2774
సమస్య :: పిల్లి జనింపగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ నొప్పునా
పులికి పిల్లి పుట్టింది. ఇది ఒక వింత అని చెప్పుకోవడానికి వీలు కాదు కదా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: ఇంద్రుని వజ్రాయుధం తగిలి నేలపై బడిన తన బిడ్డను (హనుమంతుని) చూచి తల్లడిల్లిన వాయుదేవుడు తాను సంచరించడం ఆపివేయగా లోకాలన్నీ ఊపిరి ఆడక భయపడ్డాయి. అప్పుడు వాయుదేవుడు అందరికీ ప్రాణభయాన్ని కలిగించే పులి వంటివాడు అయ్యాడు.
విశ్వరూపాన్ని పొందగల ఆంజనేయస్వామి లంకలో ప్రవేశించేటప్పుడు యుద్ధనీతిని అనుసరించి తన పరిమాణమును తగ్గించుకొని {లంక అనే కలుగులో ఉన్న రాక్షసులు అనేటటువంటి ఎలుకలను పట్టి చంపేందుకోసం అన్నట్లుగా} వృషదంశక మాత్ర (పిల్లి) పరిమాణమును పొందినాడు. అప్పుడు మారుతి పిల్లి వంటి వాడు అయ్యాడు అని అనవచ్చు.
కాబట్టి పులికి పిల్లి పుట్టింది. ఐతే ఇది ఒక వింత అని చెప్పుకొనవలసిన పనిలేదు అని విశదీకరించే సందర్భం.
తల్లడమందు పుత్రు గని దారుణ నిశ్చల దీక్ష బూనె దా
నెల్లెడ భీతి గూర్చు పులి యెన్నగ నప్పటి వాయుదేవుడే,
పిల్లియె లంకలో నడుగు పెట్టెడి వేళను వాయుపుత్రుడున్,
‘’పిల్లి జనింపగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ నొప్పునా ?’’
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (29-8-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండివేరొకవిధముగా,
రిప్లయితొలగించండితల్లియుఁ దండ్రియున్ మరియు తాతలు ముత్తలు ముందు వారల
ట్లెల్లరు విద్యలం గడచి రిద్ధరలో, తగదిట్లు, మొద్దువో ?
చెల్లునె ? పుత్రకా ! నిలుపు చిత్తముఁ, బండితపుత్రశుంఠవై,
పిల్లి జనించెగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ, నొప్పునా!.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిఈ పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిగర్భ మమరు చుండు కాంతుల కేలనో?
నింబములకు కాచు నిమ్మపండ్లు
అద్భుతంబులెన్నొనగు నీ కలియుగాన
పిల్లి పుట్టె పులికి వింత యగునె?
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఎన్నొ యగు' అనండి.
ధర్మ పథము తప్పు ధరణియందున వింత
రిప్లయితొలగించండిలెన్నొ సంభ వించు నెంచి జూడ
నీత చెట్టు వేప పూత పూచుచు నుండె
పిల్లి పుట్టెఁ బులికి వింత యగునె ?
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పందికనెనునొక్కబాలునినిజమది
రిప్లయితొలగించండిచదివియుంటివార్తసాక్షిలోన
కలియుగముననివియకలుగుచుండగమఱి
పిల్లిపుట్టెపులికివింతయగునె
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పంది కనియె నొక్క' అనండి.
విద్య లందు మేటి విద్వాంసుడైనట్టి
రిప్లయితొలగించండికోవిదు నకు శుంఠ కొడుకు కలుగ
కమల గర్భు సృష్టి గాంచి యు ప ల్కిరి
పిల్లి పుట్టె పులికి వింత యగు నె
______కరణం రాజేశ్వర రావు
విద్య లందు మేటి విద్వాంసుడైనట్టి
రిప్లయితొలగించండికోవిదు నకు శుంఠ కొడుకు కలుగ
కమల గర్భు సృష్టి గాంచి యు ప ల్కిరి
పిల్లి పుట్టె పులికి వింత యగు నె
______కరణం రాజేశ్వర రావు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపెరటి యందు తిరుగు పెంపుడు పిల్లికి
పిల్లి పుట్టె; బులికి వింత యగునె
కాననమున పులియె కలుగుచుండు టదియ?
జీవ చక్ర మందు చేవ గనుము
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
పిల్లి జనింపగా బులికి
వింతగ జెప్పుకొనంగ నొప్పునా
=======================
పిల్లికి పిల్లియే, పులికి పులియే
పుడతాయి తప్ప, పులికి పిల్లి
పుట్టదుగా, కాని పులికి పిల్లి
పుట్టినను దానిని వింతగా చెప్పు
కోవలసిన అవసరమేమున్నదని
చెప్పటంలో గల అసంబద్దతె సమస్య
==========================
సమస్యా పూరణము - 242
====================
చూడుమదె జొంకి కాళ్ళ తీరు
పులి తలగా లైగర్ జోరు
చిరుతగ జాగ్లియన్ సౌరు
కంచర గాడిద గుర్రపు వేరు
మార్జాల వ్యాఘ్రముల్ రెండు
ఫెలిడె కుటుంబమని చెప్పనా
పిల్లి జనింపగా బులికి
వింతగ జెప్పుకొనంగ నొప్పునా
====##$##====
వేరు వేరు జంతువుల మధ్య సంపర్కం
వలన జనించిన కొన్ని సంకరజాతి జంతు
వులను క్రింది విధంగా పరిశీలిద్దాం !
1. Zebra + Donkey = Zonkey
2. Lion + Tiger = Liger
3. Jaguar + Lion = Jaglion
4. గాడిద + గుర్రం = కంచర గాడిద
పై విధంగా జంతువుల జననం
సంభవమైనపుడు,ఒకటే కుటుంబం అనగా
"ఫెలిడే" కుటుంబమునకు చెందిన పులికి
పిల్లి పుట్టినను ఆశ్చర్యమేమున్నదని
భావం.
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం )
పిల్లిజనింపగాబులికివింతగజెప్పుకొనంగనొప్పునా
రిప్లయితొలగించండినొల్లగజిత్రమేమనకుహుండముపిల్లినిగంటయిధ్ధరన్
గల్లలుగావులేకలియుగంబునజర్గునునట్లుగా,నికన్
నల్లదెయెన్నిజూతుమికయచ్చెరువయ్యెడివింతలన్సుమా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఒప్పునా యొల్లగ...' అనండి. 'ఇకన్ + అల్లదె = ఇక నల్లదె' అవుతుంది. నుగాగమం రాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసృష్టి యందుఁ దనరు చిత్రమ్ము లెంచఁగఁ
రిప్లయితొలగించండిదరమె యేరి కైన ధరణి యందు
రయమునఁ జరియించఁ బ్రసవంపు వేదనం
బిల్లి పుట్టెఁ బులికి వింత యగునె
[పులుకు = వేదనతో కను రెప్పలార్పుట]
ఉల్లము తల్లడిల్లఁగ మహోగ్ర మృగేంద్ర నికాయ ముండఁ గో
కొల్లలు క్రూర జంతువులు ఘోర నినాద వనాంతరమ్మునం
బిల్లలు, వన్యజంతు తతి భీతిలి నిల్వఁగ దద్దఱిల్లి కం
పిల్లి, జనింపఁగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ నొప్పునా
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిద్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండివిక్రముడగు నృపుడు విరటుని సుతుడయి
రిప్లయితొలగించండియుద్ధభీతి కల్గియును గరిమగ
బీరములను పల్కువిధమును గాంచగ
పిల్లి పుట్టె బులికి వింత యగునె
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంతుకంతులట్లు సాగగబలహీన
రిప్లయితొలగించండిమైనదొకటి గలిగె!దానిజూడ
పిల్లిబుట్టె బులికి!వింతయగునెయన?
గానుపించురీతి కళ్లయందు!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమరము సేయజాలనన్న అర్జునునితో శ్రీ కృష్ణుని మాటలుగా.......
రిప్లయితొలగించండిఎల్లెడ బంధుజాలమని యెవ్విధి జంపుదు నంచు పల్కుటన్
జెల్లదు, ధర్మమున్ నిలుప జేయక దప్పదు సంగరమ్మునే
పిల్లతనంబు చేష్టలవి వీరులకెట్లు తగున్ జనాళియే
పిల్లి జనింపగా బులికి వింతగ జెప్పుకొనంగ నొప్పునా?
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పల్కగాఁ జెల్లదు' అనండి.
పిల్లికి నాదిరూపమట బెబ్బులి యిర్వుర నొప్పు సామ్యతన్,
రిప్లయితొలగించండిమెల్లనఁ జేరి మానవసమీపము మచ్చిక నొంది సాధువౌ
పిల్లికిఁ , తల్లి గాదె పులి ? వేరగు నెట్లు ? సజాతిఁ బుట్టువన్
పిల్లి జనించగాఁ బులికి , వింతగఁ జెప్పుకొనంగ నొప్పునే ?.
కంజర్ల రామాచార్య.
రామచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అల్లిక తోడ జన్యువుల హారము గూర్చిన శాస్త్రమన్న తా
రిప్లయితొలగించండిమొల్లక తప్పటంచు యెదు రొడ్డుచు బోవ ప్రయోగ మంతయున్
మెల్లగ వీగి పోయెనట మేథ వినాశము నడ్డ మేల్కొనన్
పిల్లి జనింపగా బలికె వింతగ జెప్పు కొనంగ నొప్పునా!
గురువర్యులకు నమస్సులు, నిన్నటి నా పూరణను కూడా పరిశీలించ ప్రార్థన.
ధన్యవాదములు.
రోత కలిగించు రీతుల
పోతన కావ్యమ్మున రసపోషణ లేదే!
ప్రీతిగ భాగవతమిలను
చైతన్య మిడుచు బ్రతుకున సందడి చేయున్!
...............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
పిల్లి పుట్టెఁ బులికి వింత యగునె
సందర్భము: అంపశయ్యమీ దున్నప్పటికీ పులి పులే! అలాంటి వాడు భీష్ముడు. ఆయనకు దప్పి వేసింది. అర్జునుని బాణ ప్రయోగంతో పాతాళగంగ ఒక నీటిబుగ్గ యేమో అని యందరూ వింతగా చూస్తూ వుండగా చిప్పిల్లినది..అనగా పై కుబికి వచ్చినది. ఆ నీటితో భీష్ముని దాహం తీరింది.
అందరికీ వింతగా తోచింది. పులిలాంటి భీష్మునికి మాత్రం కాదు. అది అతనికి సహజమే అనిపించింది. అతనికి అర్జునుని అస్త్రవిద్యా ప్రావీణ్యం తెలుసు గదా!
చిప్పిల్లు = పై కుబుకు, స్రవించు, ఉద్గమించు
==============================
అంపశయ్యమీద నైతేమి పులి పులే!
భీష్మునకును దప్పి వేసెఁ ; బార్థు
డుర్వి నమ్ము నేసె ; నొక నీటి బుగ్గ చి
ప్పిల్లి పుట్టెఁ ; బులికి వింత యగునె!
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
29-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిలిల్లిపుటుల స్విఫ్టు ( Jonathan Swift)లీలగ వర్ణించె
చెల్లనాయె నాటి చేవ గనగ
ఎల్ల నెత్తు లావు లీనాడు తగ్గెను
పిల్లి పుట్టె బులికి వింత యగునె
కలియుగమ్మునందు కాదేది వింతయు
రిప్లయితొలగించండిమతియు లేనివాడు మాన్యుడౌను
క్రూరమృగములెల్ల కూరిమితో నుండ
పిల్లి బుట్టె బులికి వింత యగునె.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండితల్లియుదండ్రులిద్దరును తామయి కీర్తికి బ్రాకులాడుచున్
బిల్లల జూచుకోన్ విడుపు పేరదిగానక సంతు శీలమున్
ఎల్ల జగంబు ఛీ యనగ నేరము ఘోరముకైన బాల్పడన్
పిల్లి జనింపగా బులికి వింతగ జెప్పుకొనంగ నొప్పునా!
శంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండి*పిల్లి బుట్టె పులికి వింత యగునె*?
పూరణ
వేప చెట్టు నందు తీపి మామిడి పండ్లు
కాచునేమొ వచ్చు కాలమందు
విశ్వ మందు జరుగు వింతలను గనగ
*పిల్లి బుట్టె పులికి వింత యగునె*?
హంసగీతి
29=8.18
గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.....
రిప్లయితొలగించండిఇలలో మానవ జాతి పాపములు స్వామీక్షించ లేకన్ వడిన్
కలి కాలంబున నడ్గు కోర్కులను శ్రీకాంతుండు తీర్చంగ నే
వలనున్గానక దిక్కుతోచకను, దా స్వాంతంబు శాంతింపగా
కలిగెన్ గోరిక శ్రీసతీ విభునకున్ గైలాసమే యేలఁగన్.
తల్లి మాట వినక తందాన తానంచు
రిప్లయితొలగించండిపెళ్ళి జేసి కొనగ ప్రేమయంచు
నిల్లు వీడి జనిన నిల్లరికమ్మందు
పిల్లి పుట్టెఁ బులికి వింత యగునె :)
చెల్లియొ చెల్లకో పులయ చెల్లెలి కూతుకు పుత్రునివ్వగా
రిప్లయితొలగించండిఇల్లరికంబటంచు సుతుడింటిని వీడగ చెల్లికల్లుడై
మెల్లగ మెల్లగా ఘనుడు మెత్తని పిల్లిగ మారిపోవగా...
పిల్లి జనింపఁగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ నొప్పునా?
చెల్లి తెలుంగు దేశమున చెల్లక జేరగ భాజపానహా
రిప్లయితొలగించండిపెళ్ళికి ముందు కాంగ్రెసున వెన్కన జేరగ చంద్రశేఖరున్
తల్లికి రాజకీయమున తండ్రి యొసంగగ కుండమార్పులన్
పిల్లి జనింపఁగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ నొప్పునా?