3, ఆగస్టు 2018, శుక్రవారం

సమస్య - 2751 (తలగడ మంత్రమ్మె...)

కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్"
(లేదా...)
"తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ"

105 కామెంట్‌లు:


 1. అయ్యరు గారి నెట్లు బుట్టలో పడవెయ్యట మను తెకినీకు సీక్రెట్ వెల్లడి యగుచుండె బహుపరాక్ :)


  విలవిల నేడ్చుచు సణుగుచు
  పలుమార్లు గొణుగుచు ముక్కు బర్రున చీదం
  గ లలనల మటంచు తెలియ
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. స్వానుభవంతో చెప్పినట్టున్నారు. చక్కని పూరణతో శుభారంభం చేసారు. అభినందనలు.

   తొలగించండి
  2. మీ తెకునీకులె తెలిసెను
   మాతా! మీయింతులకిది మాన్యంబేనా!
   యీ తీరున మగని గెలువ
   పోతీసుకు పోయి పట్టు పొడవఁ దెమ్మనన్!!
   😄🙏🏻💐

   తొలగించండి
 2. పలుమార్లు మండి పడగను
  తలుపులు మూయుచు దబదబ తైతక మనుచున్
  కలవర మిడగను మగనికి
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

  రిప్లయితొలగించండి
 3. నిన్న సమస్య ఏం ఇవ్వాలా అని ఆలోచిస్తూ కూర్చున్నా... మా ఆశ్రమం మైకులో నేను కలెక్ట్ చేసి ఇచ్చిన పాత పాటలు వస్తున్నాయి. అందులో మాంగల్యబలం సినిమాలోని 'హాయిగా ఆలుమగలై కాలం గడపాలి...' పాట వస్తున్నది. పాటలో "తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవొద్దు" అని ఉంటుంది. అది వినగానే ఈ సమస్య సిద్ధమయింది.

  రిప్లయితొలగించండి
 4. తలచిన కార్యము లన్నియు
  నలకలతో బొందలేరు హంసా వినవే
  కులుకుల నొలుకుచు పతికిన్
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

  రిప్లయితొలగించండి


 5. విలవిల నేడ్చి మూల్గగ దవిత్రము పెన్మిటి వీచగానటన్
  గలగల చేరి దస్కమును గట్టిగ నొక్కగ పర్సులోనటన్
  తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ
  జలజ!జిలేబి! పద్మముఖి! చామ!కళింగ! బిరాన గానుడీ :)

  జిలేబి
  ఇవ్వాళ వరద మొదలయ్యె :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ముసలాణ్ణి! పూరణల వరదలో ముంచెత్తకండి. సమీక్షించే ఓపిక ఉండొద్దూ... అందులోనూ మీరు నైఘంటిక పదాలు ఎక్కువగా ఉపయోగిస్తారు.

   తొలగించండి
  2. కారపు జిలేబి..
   నయగారపు జిలేబి
   🙏🏻😄

   తొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  మహాశ్వేతతో.... చెలికత్తె

  వలచితి పుండరీకమునివర్యుని ! కామశరాగ్ని జిక్కి చిం...
  తలబడుచుంటి ! సాజమిది! తప్పదు!లోకమునందు నిట్టివా
  రలకిదె యౌపధానపరిరంభము శాంతిని గూర్చు ! నమ్ముమా !
  తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ !

  ఉపధానము... దిండు
  పరిరంభము... కౌగిలి

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. అద్భుతమైన పూరణ!! నమస్సులు!!🙏🙏

   తొలగించండి
  3. శ్రీమతి సీతాదేవి గారికి 🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  4. వలపులరాణివీవనుచు పల్కిన నాథుడు పారిజాతమున్
   చెలియకు రుక్మిణీ సతికి చెంతనె చేరి ధరింపజేసె ! నే
   నలిగితి నంచు విప్పి చికురాళిని , పానుపు జేరె సత్యయే !
   తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ !


   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 7. అలుకలతోడన్ పరుషపు
  పలుకులతో బాధపెట్టవలదెపుడు పతిన్
  తలబోయకుండుట పగలు
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

  రిప్లయితొలగించండి


 8. పలుమార్లడిగిన నెక్లెసు
  కలకంఠి, మగడు కొనివ్వ కన్బోయెనకో?
  ఉలుకక పలుకక చదువన్
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. పలువిధముల నొప్పించక
  తలచిన కోరికలనంద తననాథునితో
  పలుకక యలుకను దెల్పెడి
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్.

  రిప్లయితొలగించండి
 10. ములుకులు కాగ మన్మథుని పూలశరమ్ములు గ్రుచ్చి గ్రుచ్చి హా!
  కలవరమంద జేయగను కాంతుడు లేని వియోగ వేళలో
  తలగడ డాలటంచు కట!తన్వి మనంబున నెంచె నిట్లుగా
  *"తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ"*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 11. కలత ను జెంద క పనుల ను
  కలకంఠియె చేయు చుండ కాంతుడు పలికె న్
  లల నా మాను ము పనుల ను
  తలగడ మంత్ర మ్మేమేలు తరుణుల కె పుడు న్

  రిప్లయితొలగించండి


 12. నెలతుక! జిలేబి! మగడు ము
  సలాడని విడువకు సూవె! జరియంచుల సే
  లల కోరగ కొనకున్నన్
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. అలనాడు సత్య కృష్ణుని
  యలుకన పాదమ్ము తోడ నటు తల దన్నెన్
  కలికాల మిద్దె తప్పదు
  తలగడ మంత్రమ్మె మేలు తరుణులకెపుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కృష్ణుని నలుకన...కలికాల మిదియె...' అనండి.

   తొలగించండి
 14. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  =======================
  తలగడ మంత్ర మింతులకు దప్పక
  మేలొనరించు నెచ్చెలీ
  ========================
  భర్తను సాధించ నెంచిన జవరాలు
  దిండును దూరంగా జరుపుకుని
  అందులోకి తల దూర్చి ముఖమును
  కనబడనీయక అలుకను అశ్రువులను
  వినబడనిచ్చే ప్రయత్నమే స్త్రీలకు
  మిక్కిలి మేలును చేకూర్చుతుందని
  చెప్పటంలో విశేషమే సమస్య
  =========================
  సమస్యా పూరణము - 215
  ====================

  కులుకు అలుక అశ్రువులా? తప్పు
  ఆవిరి యంత్రములై ఒప్పు
  ముదిత కన్నీటి కథలవి చెప్పు
  శక్తి టర్బయినులను అవి తిప్పు
  మగవారిని బక్రలుగా చేసి
  "మే, మే" యనిపించగ కోమలి
  తలగడ మంత్ర మింతులకు
  దప్పక మేలొనరించు నెచ్చెలీ

  ====##$##====

  ఆడదాని అలుకలో ఒలికే కన్నీరది ఆవిరి
  యంత్రముల కన్నను అధిక పీడనమును
  కలిగి ఉంటుంది. వనిత తానుగ ఏడ్చుచు
  చెప్పే కథలు హైడల్ పవర్లో శక్తిని ఉత్పన్నం
  చేసే టర్బైనులను సైతం తిప్పగలవు. ఈ
  రీతిగా ఆడది మగవారిని బక్రలుగా మార్చి
  వారిచేత "మే", "మే" యని అనిపించగలదు
  సుమా !
  కావున తమ తమ కోర్కెలను ఈడేర్చు
  కొనుటకు అతివలకు తలగడ మంత్రమే
  తారక మంత్రమని భావము.

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం )


  రిప్లయితొలగించండి

 15. పారిజాత పుష్పాన్ని రుక్మిణికిచ్చాడని తెలిసిన సత్యభామ అంతరంగం:

  అలిగితివా సఖి యనుచును
  పులి పిల్లిగ కాళ్ళ బేరమునకే వచ్చున్
  నలమేనికి తగున దిదియె
  *"తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్"*

  రిప్లయితొలగించండి
 16. చెలియను వీడి లక్ష్మణుఁడు జేర వనాంతర సీమలందునన్
  కలతలు వీడియూర్మిళయు కాలము నిద్రను వెళ్ళబుచ్చెగా
  బలమగు కారణంబు నిజ భర్త సుదూరము నున్నవేళలో
  తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ

  రిప్లయితొలగించండి


 17. మలమల మాడంగ సుమా
  వలపుల పూదోటలోన పరిణేతయు క
  న్నులవించిజోదు చలువన్
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. వలపులు జూపుచు పతితా
  పిలువగ సరసకు కులుకుచు ప్రియముగ చేరన్
  చిలిపిగ గని పతి తొడ యను
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్"*

  లలనా మణితా పతితో
  కలలో జూచిన గొలుసును కడుమోదముతో
  నిలలో కొని తెమ్మనగా
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్"*

  రిప్లయితొలగించండి
 19. కలలను దేల్చగ వథువుల
  కలతను నొలికెడి యశ్రువుల కౌగిలి గొనగా
  తలపుల పంచెడి వ్రాతల
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చెలగగ వలపుల తలపులు
   చెలియును చెలికాడు గూడి చేరగ పడకన్
   తలనిడ నిజపతి యురమను
   తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

   తొలగించండి
  4. సవరించిన పూరణ:
   కలలను దేల్చగ వథువుల
   కలతనొలుకు కంటినీరు కౌగిలి గొనగా
   తలపుల పంచెడి వ్రాతల
   తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

   తొలగించండి
 20. జలజల కన్నీరు నయన
  ములనుంచి బడినను చలనము కలుగని పతిన్
  సులువుగ మనసును గెలిచెడు
  "తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్"

  రిప్లయితొలగించండి

 21. బామ్మ బువ్వ బంగరు బువ్వ :)


  పిలవాడు బువ్వ తినక మొ
  గిలు చూపెనకో ? వడివడి క్రిందా మీదన్
  తలకిందుల బోవక మా
  త! "లగడ" మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి

 22. ఝండూబామ్ రుద్ది బొజ్జొనవలయున్ :)


  అల నాఫీసున నీ బా
  సులు కేనారముల తిన్న చురచుర వలదోయ్
  తలనొప్పి యెక్కు వైనన్
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. (కోపమందిరంలో సాత్రాజితి)
  అలలౌ కోపభరమ్మున
  లలనామణి సత్యభామ రసమయు కృష్ణున్
  పులకితహృదయుని గాంచదు;
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్.

  రిప్లయితొలగించండి
 24. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2751
  సమస్య :: తలగడ మంత్ర మింతులకు తప్పక మేలొనరించు నెచ్చెలీ.
  తలగడ మంత్రమే స్త్రీలకు మేలుచేస్తుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: ‘’ఈ శంకరాభరణం ఏమని వచ్చిందో గాని మా ఆయన మళ్లీ మళ్లీ దీన్నే చూస్తున్నాడు. నన్ను చూడటంలేదు. పద్యమో పాడో ఏమి వ్రాస్తున్నాడో గాని కలాన్ని (చరవాణిని) వదలిపెట్టడు. నన్ను మట్టుకోడు. నా బాధను పట్టించుకోడు’’ అని కోమలాంగులు తమ ప్రాణేశుని గుఱించి ఆడిపోసుకొంటున్నారు. ‘’ఇక ఇంతులకు తలగడమంత్రమే మేలుచేస్తుంది.’’ అని ఒక భామ ఒక స్నేహితురాలి దగ్గఱ తన గోడును వెళ్లబోసుకొంటున్న సందర్భం.

  ‘’ఇల నిది శంకరాభరణ మేమని వచ్చెనొ ? భర్త దీనినే
  పలుమరు జూచు నన్గనడు, పద్యమొ పాడొ కలమ్ము వీడ, డా
  కులత నెఱుంగబో,’’డనుచు కోమలు లాడుచు నున్నవా, రికన్
  ‘’తలగడ మంత్ర మింతులకు తప్పక మేలొనరించు నెచ్చెలీ.’’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (3-8-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోపం మగనిమీద కాదు, శంకరాభరణం మీద... అద్భుతమూ, మనోరంజకమూ అయిన పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. శ్రీ గురుభ్యో నమః
   చాలామంది గృహిణులు ఇదేవిధంగా నేరం మోపుతున్నారండీ.
   అందఱినీ పద్యరచనకు అభ్యాసవేదికయైన శంకరాభరణంలో శిష్యురాండ్రుగా చేర్పించడమే తరుణోపాయము
   తరుణోపాయము
   తరణోపాయము
   అని కొంతమంది అభిప్రాయం.

   తొలగించండి
 25. చెలికాడు లెక్కచేయక
  పలువిధముల బాధపెట్టి పనులను చెరపన్
  చెలువుని దారిని బెట్టగ
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

  రిప్లయితొలగించండి
 26. కూతురుకు వివాహము చేసి అత్త వారింటికి పంపుచు ఒక తల్లి తన కూతురుకు హితములు పలుకు సందర్భము


  వేయేండ్లు నిరువురు వీలుగా బతకుము , పతిసేవ నెఱియని సతి మెలంగ
  వలె, ననుదినము సేవలు నత్త మామలకుం జేయవలయు, సుగుణవతియని
  బంధు జనంబులు పలుమార్లు పొగడంగ వలయును, కోపము కలుగగ నిర
  తంబు తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడు ననుచు తలచగ వలదు
  కోకలు నగలు కొనమని కోర వలదు ,
  పొరుగు మాటలను వినుచు పొగడ వలదు
  పుట్టి నింటిని, జరుపు కాపురము ననుచు
  దారికకు హితమును చెప్పె తల్లి యొకతె

  గురువు గారి విన్న మాంగల్య బలము సినిమా లో పాటకు సరిసమముగా
  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆ పాట మొత్తం భావాన్ని పద్యంలో ఒదిగించారు. అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 27. కందం
  అల కైకయె పతి గెల్చెను
  విలవిల లాడించె సత్య ప్రియతమ కృష్ణున్
  కలినైనన్ ఫలితమ్మిడ
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

  రిప్లయితొలగించండి
 28. చంపకమాల
  అల రఘురామచంద్రుని దయారహితమ్ముగ కైక కోరఁగన్
  వలవల లాడి కానలకుపంపెను పంక్తిరథుండు, సత్యయున్
  విలవిల లాడకృష్ణుడట వేగమె పారిజమంద పంపెగా
  తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ!

  రిప్లయితొలగించండి
 29. ఈరోజు రాత్రికి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో చిత్తూరుకు బయలుదేరుతున్నాను. రేపు కాణిపాకంలో మేడసాని వారి అష్టావధానం చూసి ఎల్లుండి రాత్రికి తిరుగు ప్రయాణం. కనుక రేపు, ఎల్లుండి బ్లాగుకు అందుబాటులో ఉండను. పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
  అన్నట్టు ఈ ప్రయాణంలో ఎక్కడైనా కవిమిత్రులు కలిసే అవకాశం ఉన్నదా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. వెల్కం బెకబెక కాణీపాకమునకు

   కలిసెదము మిమ్ము కందివ
   రుల కాణీపాక మందు రూఢిగ సుమ్మీ :)


   జిలేబి


   జిలేబి

   తొలగించండి
  2. సార్!

   మీరేవూరు వెళ్ళినా అచ్చట జిలేబులు దొరకగలవని వారి ఉద్దేశ్యము 😊

   తొలగించండి
  3. కాణీపాకం దగ్గరే ఇల్లు కదా ?

   భగవంతుడా ! ఈ శంకరుని రక్షించు

   ఆమెన్ ఓ ఫాదర్ ఇన్ హెవన్ హేవ్ మెర్సీ‌

   హే అల్లా తేరీ‌ రహమ్ హో ఇన్ కో బచావో‌ :)

   తొలగించండి

  4. జీపీయెస్ వారు బహు షార్ప్ :)


   జిలేబి

   తొలగించండి
 30. కల వెల్ల భాధలకుఁ గిటు
  కులు పలు రీతులు వగ పుడుగుమ సత్వరముం
  దల నొప్పి కెంచఁ దొలఁగుడు
  తలగడ, మంత్రమ్మె, మేలు తరుణుల కెపుడున్


  జలజ సుఖాస నాద్యమర సన్నుత భావజ జన్మ కార కా
  మల కలధౌత బంధుర సుమస్తక రత్న మొకింత నంతటం
  దొలఁగగఁ జేసి పొందెఁ గద తొయ్యలి సత్యయె పారిజాతముం
  దలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ

  రిప్లయితొలగించండి
 31. తొలిరోజు సినీమ యనక
  వెలజూచుచు చీర కొనక వెంపర లాడన్
  చెలికాని రోగ మడచగ
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  అరయగ పురుషార్థమ్ములు
  నరునకు మూడయ్యె నిపుడు , నాలుగు మోక్షం
  బరకొర తాపసుల వశము
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్

  రిప్లయితొలగించండి
 32. నెలత శుభంబు నీకగును నిచ్చలు నీ గురు విచ్చు నామముం
  దలచుము దీక్ష కాలమున ధాత్రిని పండుము, మేలు భోజనం
  బలవడ నొంటి పూట, మరి పండెడు వేళను తూర్పుయామ్యలే
  తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ.

  రిప్లయితొలగించండి
 33. 3.8.18
  శంకరాభరణం వారి సమస్య

  *తలగడ మంత్ర మింతులకు తప్పక మేలొనరించు నెచ్చెలీ* !!

  పూరణ


  చంపకమాల

  కిలకిల నవ్వు చుండగను కిన్నెరకంఠివి ముద్దు మోముతో
  విలవిల లాడు చుంటి తివి వేదన నొందుచు దారి గానకన్
  చెలునికి చెప్పలేక దరి చేరక కోపము జూప నుంటివా
  *తలగడ మంత్ర మింతులకు తప్పక మేలొనరించు నెచ్చెలీ* !!

  హంసగీతి
  3.8.18

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చుంటి వతి వేదన... గానకే' అనండి.

   తొలగించండి
 34. అలకను బూనబోకుమది హానియె కూర్చును కార్యసిద్ధికిన్
  వలచినవాని చెంతన ముభావముకూడదు ప్రేమమీరగన్
  వలపుల బాణముల్ విసిరి పైటను జార్చుచు భర్తకర్ణమున్
  తలగడమంత్ర మింతులకు దప్పక మేలొనరించు నెచ్చెలీ.

  రిప్లయితొలగించండి
 35. లలనలకొందఱి భావము
  లలరించినవేగమదినినాహాయనగ
  న్నలగాభావముగలిగిన
  తలగడ మంత్రమ్మెమేలు తరుణులకెపుడున్

  రిప్లయితొలగించండి
 36. "తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ!
  యలుకలె రూఢి యాయుధము లమ్మ"ని నెచ్చెలి జెప్పినంతనే
  పలికెను కొమ్మ యొక్కతెయె "పాతబడెన్ యల నాటి పద్ధతుల్
  వలనుగ చర్చ జేసి పతి వైఖరి మార్చగ బూనగావలెన్"

  రిప్లయితొలగించండి
 37. వలపుల తలపుల కలయక
  మలపున నిలువగనెభర్త మైమరపించే
  కలయిక!తరుణిని కవ్విం
  తలగడ మంత్రమ్మే మేలు తరుణులకెపుడున్ (గడ=సమూహము=భార్యాభర్తలు)

  రిప్లయితొలగించండి
 38. ఆటవిడుపు సరదా పూరణ:
  ("శశిరేఖా సిద్ధాంతం")

  వలపుల రాయుడా నిశిని బాణము లొడ్డుచు నొక్కటొక్కటిన్
  నెలకొని జాలమున్ దరిని నిచ్చెన నల్లుచు సైగ చేయగా
  తులవగ దిండ్లు కూర్చుచును దుప్పటి కప్పుచు పారిపోయెడీ
  తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ!

  జాలము = కిటికి

  రిప్లయితొలగించండి
 39. విలయముదాండవించిననువేసటనొందిననేమియైనను
  న్దలగడమంత్రమింతులకుదప్పకమేలొనరించునెచ్చెలీ!
  లలనలలాస్యభంగిమలరమ్యముజూడగరెండుకళ్ళును
  న్వలపుగొనంగజాలవెయవారితవీక్షణమెంతయైనసూ

  రిప్లయితొలగించండి
 40. జలతారుచీర తెమ్మని
  నులికోరిక కోరగ పతి నూలుది తేవన్
  యలుకను ప్రకటించుటకై
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

  రిప్లయితొలగించండి
 41. మిత్రులందఱకు నమస్సులు!

  [పారిజాత కుసుమమును నాథుఁడు తన సవతికి నిచ్చెనని చెప్పిన చెలికత్తెతో సత్యభామ పలికిన సందర్భము]

  "వలపుల రాణి న న్విడి, సపత్నికిఁ బూవును నిచ్చునే సఖీ?
  తలఁపునఁ బూనితిం గొనఁగఁ దద్ద్రుమముం బతి తెచ్చియీన్ వెసన్;
  గలఁతు నెడంద నిప్పుడ మగండిటు రాన్; గనిపింప నల్క, నీ
  దలగడ మంత్ర మింతులకుఁ దప్పక మే లొనరించు నెచ్చెలీ!"

  రిప్లయితొలగించండి
 42. సవరణతో :
  "తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ!
  యలుకలె రూఢి యాయుధము లమ్మ"ని నెచ్చెలి జెప్పినంతనే
  పలికెను కొమ్మ యొక్కతెయె "పాతబడెన్ గద నాటి పద్ధతుల్
  వలనుగ చర్చ జేసి పతి వైఖరి మార్చగ బూనగావలెన్"

  రిప్లయితొలగించండి
 43. విలువల జీవితమ్మునను వీడి చరించుచు, గేస్తురాలి తా
  తలకొని బాధపెట్టుచును తద్దయు కోపము తోడ నిత్యమున్
  మెలగెడి ప్రాణనాథు గని మేలములాడుట కడ్డగించుచున్
  తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ

  రిప్లయితొలగించండి
 44. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వలచిన దేదియు కాదని
  పెలుచ వహించెడి పురుషుల వివధము మార్చన్
  చలమంచముపై నావడి
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్

  రిప్లయితొలగించండి
 45. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  తలగడ మంత్ర మింతులకుఁ దప్పక
  మేలొనరించు నెచ్చెలీ

  సందర్భము: ఒక నవ యువతికి ఆమె స్నేహితురాలు ఎంత మంచి హితబోధ చేస్తున్నదో చూశారా!...
  "ఆడుబిడ్డలు వస్తే చుట్టాలము మేమంటూ ఎవరైనా వస్తే ఆరోగ్యం బాగాలే దని గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకొని గొళ్ళెం పెట్టుకొని తలగడ మంత్రం పఠించాలి.. అంటే గుఱ్ఱుపెట్టి నిద్రపోవాలి.
  (పని తప్పించుకున్న ట్టవుతుంది.)"
  ==============================
  "తలపగ నాడుబిడ్డలును
  దగ్గరి వార మటంచు చుట్టముల్
  బిలబిల వచ్చిపడ్డపుడు
  బిఱ్ఱుగఁ దల్పులు మూసి, గొళ్ళెమున్
  బలముగ వేసి స్వస్థతకు
  భంగ మటంచు గదిన్ జొఱన్ వలెన్
  తలగడ మంత్ర మింతులకుఁ
  దప్పక మేలొనరించు నెచ్చెలీ!"

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  3-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 46. శంకరాభరణం వారి సమస్యకు ఇలా పూరణ చేసాను

  కలగ నువేళ లందుత నకన్ను లముంద రనేమి కాంచునో
  తలపు లయందు తాప్రియు నితప్పు లనెంచు చునుండు నేలనో
  చెలుని మనస్సె రుంగక నుచేసి నతప్పు కునేడ్చు నప్పుడీ
  తలగ డమంత్ర మింతుల కుతప్ప కమేలొ నరించు నెచ్చెలీ

  రిప్లయితొలగించండి
 47. :

  1.మరి రెండు పూరణలు
  ఇలలో క్రొత్తయు కాదిది
  యలిగిన సమయమ్ము నందు నతివలకెల్లన్
  గెలుపొందగ జేసెడిదీ
  తలగడ మంత్రమ్మె ,మేలు తరుణుల కెపుడున్.

  2.యలకను చూపుచు సతతము
  కలవరపెట్టుచు పతులను కన్నీరిడుచున్
  తలచిన వస్తువు పొందగ
  తలగడ మంత్రమ్మె మేలు తరుణుల కెపుడున్"*

  రిప్లయితొలగించండి
 48. "కులుకుచు తోడి కోడలట గొంతున జూపగ వజ్రహారమున్
  కెలుకుచు నాడబిడ్డ తన కెంపును జూపగ కంఠమందునన్",
  పొలతియె చాటె చెల్లెలికి ముద్దులు పెట్టుచు నప్పగింతలన్:👇
  "తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ"

  రిప్లయితొలగించండి