2, ఆగస్టు 2018, గురువారం

సమస్య - 2750 (పురుషార్థములన్...)

కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్"
(లేదా...)
"పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసెఁ బో మూఁడంచు నా బుద్ధికిన్"

107 కామెంట్‌లు:

 1. అరయగ కామము నర్థము
  మరియును ధర్మమును చాలు మమతలు మీరన్
  వరునకు తన పరిణయమున
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్

  గమనిక: మోక్షము సన్యాసులకే :)

  రిప్లయితొలగించండి


 2. అరె!ధర్మంబాధారము
  పరమాత్ముని వెదుక, సుధ్యుపాస్య! జిలేబీ
  పరిశేషార్థంబయ్యెడు
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  కవి మిత్రులకు అభివాదములు...యాదృచ్ఛికముగా...
  ఈ రోజు(2..ఆగస్టు) మా *వైవాహికవార్షికోత్సవం*...మీ అభినందనలను సవినయముగా కోరుచూ...

  *మురళీకృష్ణుడ* , ముప్పదేండ్లక్రితమే పొల్పార దాంపత్య సు...
  స్థిరసామ్రాజ్యమునేలఁ బెండ్లిఁగొని., నే *సీతా మహాలక్ష్మి* తో
  సరసంబంద., *మనోజ*, *సింధుజ* , *సుమల్*, సంతానమై కల్గగాఁ.,
  బురుషార్థంబుల లెక్కిడన్ దెలిసె పో మూఁడంచు నా బుద్ధికిన్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అవధానిగారూ!! 💐💐💐
   సందర్భోచితమైన బహుచక్కని పూరణ!!👏👏👏

   తొలగించండి
  2. ధన్యవాదాలమ్మా శ్రీమతి సీతాదేవి గారూ ����

   ....మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  3. వైవాహిక వార్షికోత్సవ శుభాకాంక్షలు
   కరణం రాజేశ్వర రావు

   తొలగించండి

  4. సీతామహాలక్ష్మి గారికి

   మైలవరపు వారి సరసన్ బంధమై వారికి పురుషార్థముల తెలిపినందులకు మీకున్నూ, నేర్చిన‌ అవధానవరేణ్యులకున్నూ శుభాకాంక్షలతో

   జిలేబి

   తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. వారికి అభినందనలు, పెండ్లిరోజు శుభాకాంక్షలు!

   తొలగించండి
  6. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అవధానిగారూ🌹🌹🌹

   తొలగించండి
  7. ధన్యవాదాలమ్మా 🙏🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  8. మురళీ కృష్ణ గారు శుభాశీస్సులు!
   గృహస్థాశ్రమధర్మపాలనచాతుర్యులై పుత్రపౌత్రాభివృద్ధితో సత్కళత్రానురాగపారావారసన్మగ్నులై పూర్ణాయురారోగ్యములతో వర్ధిల్లు నట్లుగా శ్రీమన్నారయణుండు మిమ్మనుగ్రహించు గాక!!!

   తొలగించండి
  9. మాన్యులు గురుతుల్యులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి మనఃపూర్వక నమశ్శతములు.. ధన్యోऽస్మి 🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  10. ఈ రోజు మా దంపతులపై అభిమానముతో.. శుభాకాంక్షలను... శుభాశీస్సులను... అందించిన మాన్యులు... సర్వశ్రీ ప్రభాకరశాస్త్రి.. శేషఫణి శర్మ.. విరించి... యల్లంరాజు వారు... రాజేశ్వరరావు... కృష్ణప్రసాద్.. వెలుదండ వారు... ఉమాకాంత్.. విజయకుమార్.. తురిమెళ్ల వారు... రంగాచార్యులు.. బాపూజీ..శ్రీమతి సీతాదేవి... శ్రీమతి జిలేబీ... కంది శంకరయ్య... హర్ష శ్రీ... పెద్దింటి వారు... డా. ఉమాదేవి... శిష్ట్లా శర్మ... సహదేవుడు... రామాచార్య.. జనార్దనరావు... మధుసూదన్... పోచిరాజు వారు... ఈశ్వరరెడ్డి... సత్యనారాయణ రెడ్డి... బాలముకుందశర్మగారు... విట్టుబాబు... శ్రీమతి రుక్మిణీ... గురుతుల్యులు శ్రీ సూరం శ్రీనివాసులు గురువులకు... తదితర పెద్దలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు..

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
 4. అరయగ నాలుగని దెలియు
  పురుషార్థములన్ గణింప ,మూఁడని తెలిసెన్
  పరిశోధించ త్రిగుణములు
  మరి యేడని దెలిసె మదికి స్వరములు సుమ్మీ!


  ~ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 5. మరువక ధర్మపథమ్మున
  ధరణిని విత్తమ్ము పొందు తపననె గాంచన్
  నరునకు కామమె మూలము
  పురుషార్థములన్ గణింప మూడని తెలిసెన్

  రిప్లయితొలగించండి
 6. ధరపయి నాల్గని యనియెద
  రరయము మోక్షత్వసిద్ధి యందుట మనకున్
  మరి యీభావము దాల్చుచు
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్.

  రిప్లయితొలగించండి
 7. అర యగ ధర్మము న ర్థము
  నరున కు కామం బు వల యు నాల్గవ దాని న్
  తిరము గ పొందు ట కొరకై
  పురుషార్థము ల న్ గణిoప మూడని తె లి సె న్

  రిప్లయితొలగించండి
 8. మరుగున పడగా మోక్షము
  తరచుగ కలిలో మనుజులు సాధింపదగన్
  సరియగు లక్ష్యము లైనను
  పురుషార్ధములను గణింప మూడని తెలిసెన్

  రిప్లయితొలగించండి


 9. అరె!ధర్మంబగు పట్టుగొమ్మ భువిలో నర్థంబులన్గానగా
  పరిశేషమ్ములు కామ మోక్ష ముల సంపాదింపగా శంకరా!
  మరియీ రీతిని చూచి నేర్వగ భళా మాఱాకుహత్తించగా
  పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసె పో మూఁడంచు నా బుద్ధికిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 11. ( కవితామురళిని మ్రోగించే మురళీకృష్ణగారూ! )

  అరయగ మాకును బుట్టిరి
  మెరసెడి బిడ్డలు త్రయముగ మిన్నగు సుకవీ !
  వరములు వారలు ; మీవలె
  పురుషార్థములన్ గణింప మూడని తెలిసెన్ .

  (లక్ష్మీ కృష్ణులకు కల్యాణదినోత్సవ కమనీయ శుభాభినందనలు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆత్మాశ్రయంగా మీరు వ్రాసిన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 12. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ========================
  పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసె పో
  మూడంచు నా బుద్దికిన్
  =========================
  జీవుడు జీవిత కాలమున నిర్వహించు
  టకై శాస్త్రములు నిర్దేశించిన విహిత
  కర్మలే "ధర్మార్థ కామ మోక్షములు " ఇవి
  నాలుగై ఉండ,లెక్కించగ నాకు మూడుగ
  తెలిసి వచ్చినవని చెప్పుటలో అసంబద్ద
  మే ఇందులో సమస్య
  ===========================
  సమస్యా పూరణము - 214
  ====================

  ధర్మము సామాజికము
  అర్థకామ మోక్షములు వైయక్తికము
  అర్థము తానుగ ప్రాప్తము
  తీరును కామము దొరుకు మోక్షము
  సంపద నిలకడకై మొక్కే మొక్కులు
  సెన్స్ ఆఫ్ సెక్యురిటిగన్
  పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసె పో
  మూడంచు నా బుద్దికిన్

  ====##$##====

  తనతో ముడివడిన అర్థము కామము
  మోక్షములే ఎవడైనా కోరుకునేది సమాజం
  తో ముడివడిన ధర్మమును ఎవడు కోరడు
  సంపద కలిగితె అనగా అర్థము చేకూరితె
  కామము తీరును అనగా కోరికలు తీరి ఆపై
  మోక్షము కూడా లభించునని తలపోయు
  వాడికి లెక్కించగా పురుషార్థములు మూడు
  గానే తెలిసి వచ్చును గదా యని భావం

  కలిగిన సంపదకై మనిషి "హే భగవాన్ నా
  ఈ సంపదను ఇలాగే ఉంచు, కాదంటె కాస్తా
  పెంచు, అంతేగాని ఎంత మాత్రం తగ్గించకు"
  అని ప్రార్థించటమునే "Sense of security"
  అని అంటారు.

  (మాత్రా గణనము - అంత్య ప్రాస)
  ----- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి
 13. భరపడి యర్థము, కామము
  మరి ధర్మము జీవితమున మలయగ వచ్చున్
  దొరకదు మోక్షము, ధరపై
  బురుషార్థములన్ గణింప మూడని తెలిసెన్

  రిప్లయితొలగించండి
 14. డా.ఎన్.వి.ఎన్.చారి
  అరరే ధర్మమునర్థ కామములు మోక్షా దుల్ గదా నాల్గగున్
  పురుషార్థంబులు, పంతులున్ మరచు చున్ మూడంచు పల్కించెనే
  సరికాదంచన, నయ్యవారు తెలిపెన్ సత్యంబు దాంపత్యమున్
  పరుషార్థంబులలెక్కిడన్ , తెలిసె పో మూడంచు నాబుద్ధికిన్

  రిప్లయితొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2750
  సమస్య :: పురుషార్థమ్ముల లెక్కిడన్ దెలిసెపో మూఁడంచు నా బుద్ధికిన్.
  చతుర్విధ పురుషార్థములు అనేవి లెక్కకు మూడే అని నా బుద్ధికి తోచినది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: చతుర్విధ పురుషార్థములు అంటూ ధర్మ అర్థ కామ మోక్షములను గుఱించి చెబుతారు. ఈ నాలిగింటిని మానవుడు పొందాలి అని అంటారు. ఐతే ధర్మము అర్థము కామము అనే (త్రివర్గము) మూడు సాధనములు. వీటి ద్వారా మోక్షము సాధింపబడవలసినది ఔతుంది. అంటే మోక్షము సాధ్యము.
  చెఱకు గడను నాలుగు ముక్కలు చేయాలని అనుకొంటే మూడు సార్లు ముక్కలు చేస్తే చాలు నాలుగవ ముక్క తనకు తానుగా సిద్ధమౌతుంది కదండీ. అలాగే ధర్మము అర్థము కామము అనే మూడు సాధనములద్వారా సాధ్యము అగు మోక్షమును పొందవచ్చు. కాబట్టి సాధనములుగా ఉన్న పురుషార్థములను లెక్కబెడితే అవి మూడే అని నా బుద్ధికి తోచినది అని విశదీకరించే సందర్భం.

  ధరలో సాధనఁ జేసి పొందగవలెన్ ధర్మార్థకామమ్ములన్
  స్థిరమై జేకురు మోక్ష మన్నది స్వతస్సిద్ధమ్ముగా సాధ్యమై,
  సరిగా ధర్మము నర్థకామముల నే సాధింపగా బూని యా
  పురుషార్థమ్ముల లెక్కిడన్ దెలిసెపో మూడంచు నా బుద్ధికిన్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (2-8-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. అద్భుతమైన చెరకుగడ లాజిక్కు !

   బాగుందండీ కోటవారు

   మొత్తం చెరకు లో మోక్షముందా తునకల ద్వారానే మోక్షము వెలువడుతుందా ? తెలియ జేయగలరు :)

   జిలేబి

   తొలగించండి
  2. జిలేబి గారూ నమోనమః
   ఇందు గల దందు లేదను సందేహము వలదు.

   తొలగించండి
  3. రాజశేఖర్ గారూ,
   అద్భుతమైన పూరణ. అభినందనలు.

   తొలగించండి
 16. నిరుపమ మోక్ష పథంబును
  వరియించఁగనెంచు సుజన వరులకునెల్లన్
  చరియింపఁగ నిల కలిగిన
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్.

  రిప్లయితొలగించండి
 17. డా.పిట్టా సత్యనారాయణ
  వర నిహ,పర తరణంబులు
  తిరమర్థము, గామములును; తిన్నని ధర్మం
  బరయగ సూత్రముగా మన
  బురుషార్థములన్ గణింప మూడని తెలిసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వర నిహ'...?

   తొలగించండి
  2. డా.పిట్టానుండి, ఆర్యా, వర తరణంబులు.అవి ఇహపర తరణములు అని,భావించి adj లను పద్యపు నడకలో దూరంగా వాడవచ్చునని..ఆంగ్లఞలో ఈ ప్రయోగాలున్నాయి,ఆర్యా, శ్రేష్టమైన ,నేటివజిని life after death ను తరింప జేసేవి.

   తొలగించండి
  3. డా.పిట్టానుండి, ఆర్యా, వర తరణంబులు.అవి ఇహపర తరణములు అని,భావించి adj లను పద్యపు నడకలో దూరంగా వాడవచ్చునని..ఆంగ్లఞలో ఈ ప్రయోగాలున్నాయి,ఆర్యా, శ్రేష్టమైన ,నేటివజిని life after death ను తరింప జేసేవి.

   తొలగించండి
 18. మిత్రులందఱకు నమస్సులు!

  [చతుర్విధ పురుషార్థాలలో మొదటి మూఁటిని మనము సాధించినచో, నాల్గవది తనంత తానే మనను జేరుననుట]

  నరు లీ పృథ్విని సన్మనాస్థయుతులై నవ్యార్థసాధ్యార్థులై
  తరియింపం గొనఁజాలునయ్య తమితో ధర్మార్థకామమ్ములన్!
  ధర నీ మూఁటినిఁ బొంద నాల్గవదియే తానై నినుం జేరుఁగా!
  పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసెఁ బో మూఁడంచు నా బుద్ధికిన్!!

  రిప్లయితొలగించండి
 19. డా.పిట్టా సత్యనారాయణ
  చిరతన కీర్తి కర్థమును స్వీయ సుఖంబుల గామ మోహమున్
  వర పర సౌఖ్య జీవనము వర్ధిల మోక్షములబ్బ ,వీనిలో
  సరమున నుండు దారమన ‌సత్త్వ సుధర్మము గానకుండు నీ
  పురుషార్థంబులు లెక్కిడన్ దెలిసె పో మూడంచు నా బుద్ధికిన్!

  రిప్లయితొలగించండి
 20. ధర్మార్థకామమోక్షములలో కామము కామన్ దాన్ని కామన్(గణితంలో తీసినట్టు) తీస్తే..


  సిరినే కోరుట కామమే హరహరా!సిద్ధించగా నర్ధమే
  ధర ధర్మంబును కోర కామమగుగా!ధ్యానించి మోక్షమ్మునే
  పరమున్ గోరుట కామమద్ది, తొలగన్ ప్రాప్తించు మూడే గదా!
  *పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసె పో మూఁడంచు నా బుద్ధికిన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 21. నరుడిల తప్పక ధర్మా
  చరణము తోనర్థములను సాధించినచో
  ధరణిని మోక్షమె ఫలమౌ
  పురుషార్థములన్ గణింప మూడని తెలిసెన్

  రిప్లయితొలగించండి
 22. నిరతము నిశ్చల భక్తిని
  మురహరి సేవించి పొందు ముక్తికి మునుపే
  నరులిల సాధింప దగిన
  "పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్"

  రిప్లయితొలగించండి
 23. అరయగ నర్థము, కామము,
  మరి మోక్షము కలుగు ధర్మమార్గము వలనన్
  పరిపరి విధముల జూచితి!
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్

  రిప్లయితొలగించండి
 24. పురుషార్ధములననీయవి
  బరగనుధర్మార్ధకామధామములెసుమా
  యిరవగుమోక్షముమినహా
  పురుషార్ధములన్గణింపమూడనితెలిసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 25. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సురల కమరపుర మందున
  స్థిరముగ ననువగు బ్రతుకున చెలరేగుటకై
  వరుసగ వలసిన పేరగు
  పురుషార్థములన్ గణింప మూడని తెలిసెన్

  రిప్లయితొలగించండి
 26. కరము ముదంబున ధరణినిఁ
  బరఁగుం డనుచుఁ బరమేష్ఠి పంపఁగ మనలన్
  నరుఁడు జనుఁడు మనుజుం డనఁ
  బురుషార్థములన్ గణింప మూడని తెలిసెన్


  పర దారాశల వేఁగి సంతతము దుష్పారంపు విత్తార్థియై
  నిరతంబుండఁగ దోష కార్యములఁ దా నేర్వండు సత్యమ్మునున్
  ధర మోక్షమ్మును గాంచ నేరఁ డను సంధానమ్మ పో వానికిం
  బురుషార్థంబుల లెక్కిడన్ దెలిసెఁ బో మూడంచు నా బుద్ధికిన్

  [ఆ బుద్ధికిన్]

  రిప్లయితొలగించండి
 27. అరయగ ధర్మమునను తదు
  పరి యర్థము లోన నింకపై కామము నన్
  సరి మోక్షమునను వర్ణాల్
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్.

  రిప్లయితొలగించండి
 28. నాలుగు సంఖ్యతో మూలలు ,వేదముల్, గుణములు,దుర్గముల్గణితములును
  రధకులును పురుషార్థములన్ గణింప,మూఁడని తెలిసెన్గా భువనములు కర
  ణములు త్రిమూర్తులు, నామముల్బురములు ,పంచ సంఖ్యగలవి పాతకములు
  పాండవుల్,వాయువుల్, పల్లవమ్ములు గద, షడ్విధ కాండలు, షడ్రుచులును
  తెలుపు చుండుము సతతము సులువు గాను ,
  సప్త ఋషులు,కిరణములు సరస గతిని
  చెప్పుము నుదహరణముగ శిష్యులార
  సప్త సంఖ్యకు నని బల్కె చట్టు లెదుట

  రిప్లయితొలగించండి
 29. గురుకులములో గణిత శాస్త్ర విద్యా బోధనము చేయుచు ఒక గురువు తన శిష్యులతో ఉదాహరణ పూర్వక సంఖ్యా మానమును తెలుపుట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ సుదీర్ఘ పూరణ ఛందోవైవిధ్యంతో చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 30. తరగతిగదిలో మత్తుగ
  మరుగున గూర్చున్నవాని మరి గురువడిగెన్
  హరి!పురుషార్థములెన్నన?
  పురుషార్థములన్ గణింప మూడనిదెలిసెన్

  రిప్లయితొలగించండి
 31. అరయం ధర్మము నందు మూడు భువిలో నర్థమ్ము నన్మూ డగున్
  పరికింపంగను మూడు కామమున నౌ వర్ణంబు లీ మూట వా
  క్కరణంబుల్ హృది మూడు నున్న నదియే కల్గుం గదా తుర్య మీ
  పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసెఁ బో మూఁడంచు నా బుద్ధికిన్.

  రిప్లయితొలగించండి


 32. అరయన్ స్టాక్మార్కెట్టున
  వరుసగ హెచ్చగు జిలేబి వరుసల తగ్గున్
  సరసర, నిల్చున్, కైపులు
  పురుషా ! (అ)ర్థము గణింప మూడనిదెలిసెన్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పురుష' శబ్దాన్ని సంబోధనగా చేసినపుడు సంధి జరుగదు.

   తొలగించండి
 33. ఆటవిడుపు సరదా పూరణ:
  ("రోటి కప్డా మకాన్")

  సరియౌ సెంట్రలు పింఛనున్ బలియు...నా శారీర రక్షార్థమై
  మరియున్ సూటులు బూటులున్ డజను...నా మానమ్ము కాపాడగన్
  మురియన్ హైదరబాదునన్ మహలు...నా మూర్ధమ్ము దాచంగ హా!
  పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసె పో మూఁడంచు...నా బుద్ధికిన్

  శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  రక్ష = రక్షణము
  మూర్ధము = తల
  పురుషార్థము =
  పురుషప్రయోజనము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆ బ కం :)


   సరి సెంట్రలు పింఛను రో
   టి, రీతిగ తినన్ జిలేబి, టీ కాఫిలకున్ !
   అరె సూట్లు,గృహము బొజ్జొన!
   పురుషార్థములన్ గణింప మూడని దెలిసెన్ :)

   జిలేబి

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   *****
   జిలేబీ గారూ,
   __/\__

   తొలగించండి
 34. గురుదేవులకు భక్తిపూర్వక ప్రణామములు ������

  మాపూరణ.
  కం:-
  దరుమమునెరిగి భువిని స
  త్కరుమమ్మునెరుకజేయు కారణజన్ముల్
  పురులరయగ జన్మ తఱియు
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్!!

  @ మీ పాండురంగడు*
  ౦౨/౦౮/౨౦౧౮

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సత్కరుమము' అన్న ప్రయోగం సాధువు కాదు. "భువిలో కరుమము..." అనండి.

   తొలగించండి
  2. ధన్యోస్మి గురుదేవా ధన్యోస్మి

   కం:-
   దరుమమునెరింగి పుడమిని
   కరుమమునెరిగింపజేయు కారణజన్ముల్
   పురులరయగ జన్మ తఱియు
   పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్!!

   @ మీ పాండురంగడు*
   ౦౨/౦౮/౨౦౧౮

   తొలగించండి
 35. సరియగు వివరణ దెలియక
  పరుసముగా పలుకు చుంద్రు ప్రతినలు జేయన్
  తరచిపరి కించ తుదకట
  పురుషార్ధములన్ గణింప మూఁడని తెలిపెన్

  రిప్లయితొలగించండి
 36. కందం
  సిరికూడఁగ గతజన్మన్
  ధరజేసిన పుణ్యమునను, త్రాగుచుఁ దినుచున్
  దిరిగెడు సోమరిపోతుల
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్

  మత్తేభవిక్రీడితము
  సిరికూడన్ గతజన్మ పుణ్యఫలమై సిగ్గెగ్గులన్ వీడుచున్
  గొరగాడన్మనుజుండుగా సతముఁ దాగ్రోలన్ దినన్ దిర్గగన్
  ధరపై సోమరి పోతుగా బ్రతుక నధ్వానమ్ముగన్ వారివౌ
  పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసె పోమూఁడంచు నా బుద్ధికిన్

  రిప్లయితొలగించండి
 37. ధరను చతుర్విధ నర్ధము,
  మరచి, తొలుత తుది, నధర్మ మనసులు బెరుగన్
  నరుని ధన, కామ, కాంక్షను
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్

  రిప్లయితొలగించండి
 38. అరుదెంచగ కలి కాలము
  ధరలో పురుషార్థములవి తగ్గగ నకటా!
  కరువైరి మోక్ష గాములు
  "పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్"

  రిప్లయితొలగించండి
 39. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్

  సందర్భము: ధర్మార్థ కామమోక్షా లనే నాలుగు పురుషార్థాలలో మనం (ఎంత కష్టపడ్డా) సాధించేవి మూడే (చివరిది తప్ప)..
  ==============================
  అరయగ ధర్మము నర్థము
  సరి కామము మోక్షము లనజాల్ నాల్గింటన్
  ధరణి మనము సాధించెడు
  పురుషార్థములన్ గణింప మూఁడని తెలిసెన్

  మరొక పూరణము:

  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసె పో
  మూఁడంచు నా బుద్ధికిన్

  సందర్భము: పురుషార్థా లెన్ని అని అడిగాను. మా గురువుగారు బొటనవ్రేలు మడచి పైకెత్తి చూపించాడు. చూస్తే మూడే (వ్రేళ్ళు) వున్నవి. ఔను. మూడే!
  ఎందుకో!... తెలుసుకోవా లంటే పద్యం చదువండి..
  అయ్యో పాపం! గురువుగారు!!
  బొట్టె=బొటనవ్రేలు (గద్వాల మాండలికం... నిఘంటువులో దొరకదు.)
  ==============================
  పురుషార్థంబు ల వెన్ని యంచు నడుగ న్బోధింపగా బూని నా
  గురు వర్యుం డల బొట్టెనే మడచి కన్గొ మ్మంచు జూపంగ నా
  పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసె పో మూఁ డంచు నా బుద్ధికిన్...
  "బొరపా" టంచు గురుండు వల్కె.. "చిటి వ్రేల్ పోయెన్ బ్రమాదంబునన్"

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  2-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 40. అరయగ ధరలో నాలుగు
  పురుషార్థములును ,గణింప మూడని తెలిసెన్
  నరులకు సతతమ్మును నా
  చరణీయములైనవండ్రు జగతిన విబుధుల్.

  రిప్లయితొలగించండి
 41. పరుషంబౌనని ధర్మమున్ వదలి సావాసమ్ము జేయంగ దా
  దరుణీ సౌఖ్యము, విత్తమున్ దనదు సంతానమ్ము లంమున్గుచున్
  బెరుగన్ మోహము లాలసన్నెరుగకే
  వేదార్ధమున్ భూమిపై
  పురుషార్ధంబులు లెక్కిడన్ దెలిసె పో మూడంచు నాబుద్ధికిన్

  వనిత, విత్తం, సంతానం!!🙏🙏🙏

  రిప్లయితొలగించండి
 42. 2.8.18 శంకరాభరణం వారి సమస్య

  *పురుషార్ధంబుల లెక్కిడన్ దెలిసె పో మూడంచు నా బుద్ధి కిన్* !!

  మత్తేభం


  పురుషార్థంబులు నెన్ని యంచు తెలపన్ బోధింప ధర్మాత్ముడున్
  ధరపై గాంచగ నొక్కటిన్ విడవగన్ ధర్మార్థ కామంబు లే
  పరమున్ పొందగ కోరు చుండె నెపుడున్ పాపాలు లెక్కించకన్
  *పురుషార్ధంబుల లెక్కిడన్ దెలిసె పో మూడంచు నా బుద్ధి కిన్* !!


  హంసగీతి
  2.8.118

  రిప్లయితొలగించండి
 43. పరుషంబయ్యెడి పల్కువీడుచును పాపాత్ముండ్ల లాలించుటన్
  తరుణిన్ గాంచిన వెంబడించకయె భల్ తప్పించి పార్పోవుటన్
  వరముల్ కోరక చంద్రశేఖరుకు తెల్వారంగనే మ్రొక్కుటన్
  పురుషార్థంబుల లెక్కిడన్ దెలిసెఁ బో మూఁడంచు నా బుద్ధికిన్

  రిప్లయితొలగించండి